Rohit Sharma Ruled Out Of India Second Test Vs Bangladesh: ఎడమ చేతి బొటన వేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ టూర్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన (రెండో వన్డే తర్వాత) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఢాకాలోని మీర్‌పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.
హిట్‌మ్యాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బీసీసీఐ అతన్ని బంగ్లాతో రెండో టెస్ట్‌కు దూరంగా ఉండాలని కోరినట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి సమాచారం అందించాడు. బంగ్లా టూర్ తదుపరి టీమిండియాకు కీలకమైన సిరీస్‌లు ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.
దీంతో రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగడం దాదాపుగా ఖరారైంది. ఒకవేళ రోహిత్ ఫిట్‌నెస్ సాధించి ఉంటే రెండో టెస్ట్‌కు జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారేది. తొలి టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో రోహిత్‌కు జతగా ఓపెనర్‌గా గిల్‌నే బరిలోకి దించాల్సి వచ్చేది. ఇదే జరిగితే వైస్ కెప్టెన్ అయిన రాహుల్‌ను పక్కకు కూర్చోపెట్టాల్సి వచ్చేది.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ టూర్‌లో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగతున్న విషయం తెలిసిందే. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించింది.
పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment