team india captain
-
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్‌ల్లో ఓడింది. మూడు మ్యాచ్‌లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్‌గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్‌ల్లో వచ్చాయి. కెప్టెన్‌గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్‌తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్‌కు 324 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్‌కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్‌లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా.. రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు పట్టింది. -
చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
టీ20 ఫార్మాట్లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సారథిగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఈ ముంబై బ్యాటర్.. దేశీ టీ20 టోర్నీలోనూ ట్రోఫీ గెలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు ఆదివారం మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతోటోర్నీ ఆసాంతం రాణించిన శ్రేయస్ సేన టైటిల్ పోరులో మధ్యప్రదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చిన ముంబై.. ఆఖరి మెట్టుపై కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మధ్యప్రదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) కారణంగా మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే, పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు.ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. 174 పరుగులతో స్కోరు సమమయ్యాక ముంబై బ్యాటర్ అథర్వ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (37; 4 ఫోర్లు) రాణించాడు.చివర్లో సూర్యాంశ్ షెగ్డే (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అథర్వ అంకొలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యాంశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబై సొంతమైంది.ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన తొలి సారథిగాఈ నేపథ్యంలో భారత్‌లో ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందుకోవడం విశేషం. కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అయ్యర్‌ను ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు గాయం తగ్గినప్పటికీ.. దానిని సాకుగా చూపాడని తేలడంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. కానీ.. టీ20 జట్టులో మాత్రం అతడికి స్థానం ఇవ్వడం లేదు.టీమిండియా తరఫున గతేడాది డిసెంబరులో చివరగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, తాజాగా దేశీ టీ20 టోర్నీలోనూ సత్తా చాటి.. టీమిండియా సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్ పంపించాడు.వచ్చే ఏడాది పంజాబ్ జట్టుకుఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయగా.. పంజాబ్ కింగ్స్ వేలంపాటలో అతడిని కొనుక్కుంది. ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రూ. 27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్) అయ్యర్ కంటే ముందున్నాడు.చదవండి: ‘రోహిత్, గంభీర్ మధ్య విభేదాలు?.. ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు.. కానీ’ -
చెత్త రికార్డు సమం చేసిన రోహిత్.. ధోని, విరాట్‌తో పాటు..!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది.చెత్త రికార్డు సమం చేసిన రోహిత్తాజా ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు (4) చవిచూసిన మూడో భారత సారథిగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన నిలిచాడు. రోహిత్ సారథ్యంలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ధోని, విరాట్ నేతృత్వాల్లో కూడా భారత్ వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6 ఓటములు, 1967-68), సచిన్ టెండూల్కర్ (5 ఓటములు, 1990-2000) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ధోని (4 ఓటములు, 2011, 2014), విరాట్ (4 ఓటములు, 2020-21), రోహిత్ (4 ఓటములు, 2024) ఉన్నారు. కాగా, ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్వదేశంలో రోహిత్ నేతృత్వంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం: సూర్య భార్య భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్‌గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు సూర్యను విష్ చేశారు.నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచంఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్‌తో హ్యాపీ బర్త్‌డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భార్య షేర్ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.నాలుగు టీ20 సెంచరీలుఇక సూర్య కెరీర్ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా పూర్తిస్థాయి సారథిగాఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' View this post on Instagram A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_) -
టెస్టు కెప్టెన్‌గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్‌గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్‌గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్‌ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్‌కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్‌గా భావిస్తున్న పంత్‌ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్‌ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్‌గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్‌గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే! -
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్ తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందింది. సూర్యకుమార్‌కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్‌కప్ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4), శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు, 4-0-25-2) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ఈ సిరీస్‌లో నాలుగు టీ20లు గెలవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శుభ్‌మన్.. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో ఈ భారీ రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. రోహిత్ శర్మ (50), ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు: గంగూలీ
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 17 ఏళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ 11 ఏళ్ల సుదీర్ఘణ అనంతరం ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. భారత జట్టు చివరిగా 2013లో ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా రోహిత్ నేతృత్వంలో ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది.టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. భారత్ ట్రోఫీ గెలిచి రెండు వారాలు గడిచినా విజయోత్సవ సంబురాలు ఇంకా జరుగతూనే ఉన్నాయి. తాజాగా భారత విజయానికి సంబంధించి కోల్‌కతాలో వేడుక జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజయర్యాడు.ఈ సందర్భంగా గంగూలీ.. టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. దాదా రోహిత్ గురించి మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంతో నన్నెవరూ నిందించడం లేదు. అయితే రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని మాత్రం అందరూ మరిచిపోయారని సరదాగా అన్నాడు. -
శ్రీలంక సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..?
ఈ నెలాఖరులో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం. రోహిత్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ ఆడిన పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉండవచ్చు. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు భారత్ అదే జట్టుతో టీ20 సిరీస్ కూడా ఆడనుంది. టీ20లకు సెలెక్టర్లు వేరే కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ సమయానికి హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా పగ్గాలు చేపట్టవచ్చు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత్ క్రికెట్ జట్టు ఈ నెల 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్... ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్నాయి. ఈ రెండు సిరీస్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లతో పాటు జట్లు కూడా వేరు వేరుగా ఉండే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కాని కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టుకు మాత్రమే పరిమితం కావచ్చు. ఈ రెండు సిరీస్‌లకు సీనియర్లు రోహిత్, కోహ్లి, బుమ్రా దూరంగా ఉండే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటన నుంచే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్తానం మొదలవుతుంది. గంభీర్ తనదైన మార్కును చూపించడం కోసం లంక సిరీస్‌లో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా లాంటి అప్ కమింగ్ టాలెంట్లకు ఎంపిక చేయవచ్చు. లంక పర్యటనలో టీ20లు జులై 27, 28, 30 తేదీల్లో.. వన్డేలు ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి. -
టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..?
టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. 20 మంది ప్రాబబుల్స్ జాబితాను ఇదివరకే ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తుంది.అయితే ఈ పర్యటనకు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా సందిగ్దత నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేక సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారధిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్‌మన్ గిల్ జింబాబ్వే పర్యటలో టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్‌లతో పాటు ఐపీఎల్-2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా ఉంటారని సమాచారం.వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్ రెగ్యులర్ జట్టులో సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ప్రత్యేక హెలికాప్టర్‌తో ధర్మశాలలో ల్యాండ్ అయిన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో టెస్ట్ అనంతరం లభించిన విరామంలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన రోహిత్.. తిరిగి టీమిండియాతో జత కట్టాడు. Jamnagar ✈️Dharamsala Captain Rohit Sharma's normal duties resume.pic.twitter.com/4CKlGqjW5H — CricTracker (@Cricketracker) March 5, 2024 ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు వేదిక అయిన ధర్మశాలలో హిట్‌మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యాడు. మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐయే స్వయంగా రోహిత్‌కు హెలికాప్టర్‌ను అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ముందస్తు వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు రోహిత్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరందరిలో భారత క్రికెటర్లు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. -
IND VS ENG 4th Test: ఓటమి ఎరుగని హిట్‌మ్యాన్
ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. సుదీర్ఘ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు ఓటమనేది ఎరుగడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రస్తానం 2021-22 శ్రీలంక సిరీస్‌తో (స్వదేశంలో 2-0 తేడాతో టీమిండియా గెలిచింది) మొదలైంది. అప్పటి నుంచి హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా కోల్పోలేదు. శ్రీలంక సిరీస్ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఆస్ట్రేలియాపై (స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో), వెస్టిండీస్‌పై (వెస్టిండీస్‌పై వారి దేశంలో 1-0 తేడాతో), తాజాగా ఇంగ్లండ్‌పై (స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3-1 తేడాతో, మరో టెస్ట్ మిగిలి ఉంది) వరుస సిరీస్ విజయాలు సాధించింది. మధ్యలో సౌతాఫ్రికా సిరీస్ (వారి దేశంలోనే) ఒక్కటి డ్రాగా (1-1) ముగిసింది. ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ గెలుపుతో స్వదేశంలో టీమిండియా విజయపరంపర మరింత మెరుగుపడింది. సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకు అప్రతిహతంగా సాగుతుంది. ప్రపంచంలో ఏ జట్టు స్వదేశంలో వరుసగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. భారత్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (1976-1986), న్యూజిలాండ్ (2017-2021) జట్లు స్వదేశంలో 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి. నాలుగో టెస్ట్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 (రూట్ 122 నాటౌట్, జడేజా 4/67) భారత్ తొలి ఇన్నింగ్స్ 307 (దృవ్ జురెల్ 90, షోయబ్ బషీర్ 5/119) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145 (జాక్ క్రాలే 60, అశ్విన్ 5/51) భారత్ రెండో ఇన్నింగ్స్ 192/5 (రోహిత్ శర్మ 55, షోయబ్ బషీర్ 3/79) 5 వికెట్ల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: దృవ్ జురెల్ -
ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాలేదు.. కేఎల్ రాహుల్ సాధించాడు..!
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించడం ద్వారా సౌతాఫ్రికాలో పింక్ వన్డే (సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలతో ఆడే మ్యాచ్‌లు) గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఏ భారత కెప్టెన్ సౌతాఫ్రికాలో పింక్ వన్డే గెలవలేదు. అసలేంటీ పింక్ వన్డే.. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన, ఫండ్ రైజింగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) ప్రతి ఏటా వన్డే క్రికెట్ మ్యాచ్‌లను పింక్ కలర్ జెర్సీల్లో ప్లాన్ చేస్తుంది. ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పింక్ కలర్ జెర్సీలు ధరిస్తారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలు ధరించి ఆడే మ్యాచ్‌ను పింక్డే వన్డే అని పిలుస్తుంటారు. ఈ మ్యాచ్ ద్వారా లభించే మొత్తంలో కొంత భాగాన్ని సీఏ రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం ఖర్చు చేస్తుంది. పింక్ వన్డే తొలిసారి 2013లో జరిగింది. నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 34 పరుగుల తేడాతో మట్టికరిపించింది. నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 12 పింక్ వన్డేలు జరగగా.. సౌతాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన పింక్ వన్డేలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో) నమోదు చేశాడు. పింక్ వన్డేల్లో పాకిస్తాన్ (2019), ఇంగ్లండ్ (2020), భారత్ (2023) మాత్రమే సౌతాఫ్రికాను ఓడించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది. -
'ఆ ఓటమిని' జీర్ణించుకోలేకపోతున్నాను.. రోహిత్ శర్మ భావోద్వేగం
2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో స్టేట్మెంట్ను రిలీజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో తెలియట్లేదని హిట్‌మ్యాన్ వాపోయాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నాడు. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు. ఆ మనోవేదనను అధిగమించి మైదానంలోకి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి, పైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకకోలేకపోతున్నానని తెలిపాడు. View this post on Instagram A post shared by Team Ro (@team45ro) చిన్నతనం నుంచి వన్డే వరల్డ్‌కప్‌లు చూస్తూ పెరిగానని, వరల్డ్‌కప్ గెలవడం అనేది గొప్ప బహుమతిగా భావించేవాడినని గుర్తు చేసుకున్నాడు. వరల్డ్‌కప్ గెలవడం కోసం జట్టు మొత్తం కొన్ని సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమించిందని, అంతిమంగా ఫలితం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్ గెలవడం కోసం జట్టుగా చేయవలసిందంతా చేశామని, ఫలితం ఊహించిన విధంగా రాకపోవడం జట్టు మొత్తాన్ని తీవ్ర బాధించిందని వాపోయాడు. ఫైనల్లో ఓటమి అనంతరం తన జర్నీ అనుకున్నంత ఈజీగా సాగలేదని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. అంతిమంగా ఆటలో గెలుపోటములు సహజమని, వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని తన సందేశాన్ని ముగించాడు. కాగా, హిట్‌మ్యాన్ వరల్డ్‌కప్ ఓటమి అనంతరం ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో రోహిత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. -
రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ అతడే!
Who can be India's Test captain: టెస్టుల్లో టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర సమాధానమిచ్చాడు. రోహిత్ శర్మ తర్వాత సంప్రదాయ క్రికెట్లో భారత జట్టును ముందుండి నడిపించగల సత్తా శుబ్‌మన్ గిల్‌కు ఉందని పేర్కొన్నాడు. అయితే, గిల్ కంటే కూడా టెస్టు కెప్టెన్సీ చేపట్టగల అర్హత మరొకరికి ఉందంటూ ట్విస్ట్ ఇచ్చాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్.. ముఖ్యంగా టీ20 సారథ్య బాధ్యతల నుంచి 36 ఏళ్ల రోహిత్ శర్మ తప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై? వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కూడా టీ20లలో పునరాగమనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే, టీ20 సిరీస్‌లకు రోహిత్ శర్మ దూరం కాగా.. ఆయా ఫార్మాట్లలో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుకు నడపించనున్నారు. అయితే, టెస్టు సిరీస్ సందర్భంగా బాక్సింగ్ డే మ్యాచ్‌లో రోహిత్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్ ముగిసే నాటికి రోహిత్ శర్మ ఈ బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గిల్‌కు కూడా ఛాన్స్! అయితే.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు.. టీమిండియా టెస్టు భవిష్య కెప్టెన్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను దీర్ఘకాలంలో జరిగే మార్పుల గురించి మాట్లాడుతున్నా. 24 క్యారెట్ల బంగారం లాంటి టెస్టు క్రికెటర్ ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న కాలంలో టెస్టులకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. రిషభ్ పంత్ రూపంలో 24 క్యారెట్ల బంగారం లాంటి టెస్టు క్రికెటర్ అందుబాటులో ఉన్నాడన్న విషయాన్ని విస్మరించలేం. అతడు గేమ్ ఛేంజర్. కాబట్టి పంత్‌కు కెప్టెన్‌గానూ అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి రోహిత్ శర్మ టెస్టు పగ్గాలు వదిలేస్తే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు అతడి స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైన పంత్ ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి సఫారీ గడ్డపై రోహిత్ సేన టెస్టు సిరీస్ గెలిచే అవకాశం ఉందన్న ఈ మాజీ క్రికెటర్.. ప్రొటిస్ జట్టు మాత్రం టీమిండియా ముందు అంత తేలికగ్గా తలవంచదని అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి టీమిండియా సౌతాఫ్రికా టూర్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. గిల్ టీమిండియా ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలో తన స్థానం సుస్థిరం చేసుకోగా.. కారు ప్రమాదానికి గురైన పంత్ దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్-2024తో అతడు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక గిల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించలేదు. అయితే, పంత్ మాత్రం గతంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సారథిగా ఉన్నాడు. చదవండి: పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్ -
కోహ్లి కెప్టెన్సీ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ
విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గంగూ భాయ్ ఈ వివరణ ఇచ్చాడు. కాగా, 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్ మెషీన్ ఆతర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కాదు. ఐపీఎల్ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలోనే టీమిండియా ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై మూడోసారి ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. -
IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా
ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. రేపు (ఆగస్ట్ 18) ఐర్లాండ్‌తో జరుగబోయే తొలి టీ20తో బుమ్రా ఈ ఘనత సాధించనున్నాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ భారత టీ20 జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించగా.. రేపటి మ్యాచ్‌తో బుమ్రా టీమిండియా 11వ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, బుమ్రా గతంలో భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా భారత కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బుమ్రా నేతృత్వంలోని భారత టీ20 జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా టీమిండియా రేపు తొలి టీ20 ఆడనుంది. దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన శివమ్ దూబే జట్టులో చేరాడు. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. రెగ్యులర్ టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఈ పర్యటనలో భారత్ ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది, మూడు మ్యాచ్‌లకు డబ్లిన్‌లోని ది విలేజ్ మైదానం వేదిక కానుంది. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
-
శ్రేయాస్ అయ్యర్ VS శుభమన్ గిల్
-
రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
Team India Captain: టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. జట్టులోకి వచ్చిన దాదాపు మూడేళ్ల కాలంలోనే సారథిగా పగ్గాలు చేపట్టి అనేకానేక విజయాలు అందించాడు. ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులు నమోదు చేశాడు. ఇక ధోని తర్వాత అతడి వారసుడిగా విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతలు స్వీకరించి తనదైన ముద్ర వేయగలిగాడు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాను చాంపియన్‌గా నిలపలేకపోయినప్పటికీ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని వారసుడిగా కోహ్లి ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. అనూహ్య రీతిలో వన్డే సారథిగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పగా... రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో సారథిగా నియమితుడయ్యాడు. రోహిత్ ఇలా ఇక హిట్‌మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో కెప్టెన్ అద్భుతంగా రాణించినప్పటికీ ఆసియా కప్-2022, టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీల్లో ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లోనూ రోహిత్ సేన ఓటమిపాలైంది. రోహిత్ వద్దే వద్దంటూ ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఖాయమని వార్తలు వినిపిస్తుండగా.. టెస్టుల్లో రోహిత్‌కు సరైన వారసుడు ఎవరన్న అంశంపై చర్చలు నడుస్తున్నాయి. నాడు బీసీసీఐ ధోనిని కెప్టెన్ ఎందుకు చేసిందంటే ఈ క్రమంలో ఓ ఆటగాడిని సారథిగా నియమించే ముందు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం, ధోని తక్కువ కాలంలోనే ఎలా కెప్టెన్ అయ్యాడన్న విషయంపై మాజీ సెలక్టర్ భూపీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టులోని సీనియర్లలో ఎవరో ఒకరిని ఆటోమేటిక్ ఆప్షన్‌గా తీసుకునే బదులు.. ఆట పట్ల సదరు క్రికెటర్‌కు ఉన్న అవగాహన, శక్తిసామర్థ్యాలు, చాతుర్యత, బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుకు నడిపించగల సత్తా, మేనేజ్మెంట్ స్కిల్స్.. ఇవన్నీ గమనిస్తాం. నాడు ధోనిలో ఇవన్నీ చూసిన తర్వాతే అతడి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. ఆట పట్ల అతడి ఆలోచనా ధోరణి, ఇతరులతో మమేకమయ్యే విధానం.. వీటితో పాటు ధోని విషయంలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్.. అతడిని సారథిగా నియమించేందుకు దోహదం చేశాయి’’ అని భూపీందర్.. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెల రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్ పర్యటన మొదలుపెట్టనుంది. చదవండి: లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు #MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్' -
డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్‌మ్యాన్‌ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్లోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. దారుణ ఓటమి ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్లోనూ చాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. నాకు నమ్మకం ఉంది ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్‌కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి. ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడనడం సరికాదు. నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. టెస్టు క్రికెట్లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! ‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్‌ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్ -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్‌లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్‌గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్‌మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్‌లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్‌గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
WTC Final: "ద బాస్".. ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే, వదిలే ప్రసక్తే లేదు..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఏ బ్యాటర్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలో.. ఏ బౌలర్‌ను ఎలా నిలువరించాలో అన్న వాటిపై ఇరు జట్లు పథకాలు రచిస్తున్నాయి. తుది జట్లపై అనధికారికంగా ఇరు జట్లు ఇప్పటికే ప్రకటన చేశాయి. ఇక మిగిలింది మ్యాచ్ ఆరంభమే. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23లో భారత్, ఆస్ట్రేలియా జట్లు గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ.. గత రికార్డుల ప్రకారం చూస్తే టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. అదెలాగంటే.. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఏ ఫార్మాట్లో అయిన కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు ఉంది. హిట్‌మ్యాన్.. కెప్టెన్‌గా తన జట్టును ఫైనల్ చేర్చాడంటే, ఆ జట్టు గెలిచి తీరాల్సిందే. Rohit Sharma 8/8 so far in finals. He will be looking forward to make it 9/9 in the WTC 2023 final.#CricTracker #RohitSharma #WTCFinal pic.twitter.com/KmJfnxeMgb — CricTracker (@Cricketracker) June 6, 2023 రోహిత్ ఇప్పటివరకు కెప్టెన్‌గా తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను మొత్తం 8 సార్లు ఫైనల్‌కు చేర్చాడు. ఈ 8 సందర్భాల్లో విజయం రోహిత్ సేననే వరించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే భారత అభిమానులు ఈ సారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ మనదేనని ధీమాగా ఉన్నారు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిస్తే రోహిత్‌కు ఇదే మొదటి ఐసీసీ టైటిల్ అవుతుంది. గతంలో ఇతను 2018 ఆసియా కప్‌లో, 2018 నిదాహస్ టోర్నీలో టీమిండియాను విజేతగా నిలిపాడు. అలాగే ఐపీఎల్లో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ 2013 ఛాంపియన్స్ లీగ్ కూడా గెలిచింది. ఈ లెక్కన రోహిత్ ఖాతాలో మొత్తం 8 టైటిల్లు చేరాయి. నేటి నుంచి ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచి హిట్‌మ్యాన్ తన విజయయాత్రను కొనసాగిస్తూ 9వ టైటిల్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఉన్న రికార్డు చూసి నెటిజన్లు.. "ద బాస్".. ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే, గెలిపిస్తాడంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WTC Final 2023:‘టెస్టు’ కిరీటం కోసం... -
హార్దిక్ పాండ్యా విషయంలో రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి కెప్టెన్‌గా పేరు సంపాదించిన హార్దిక్ అదే టెంపోను ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్లోనూ వరుస విజయాలతో గుజరాత్‌ను పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌లో ఉంచాడు. మరి పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ జట్టుకు దూరమైనప్పుడల్లా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది. గతేడాది టి20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం చెందినప్పటి నుంచి హార్దిక్ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టి20లకు హార్దిక్‌ను రెగ్యులర్ కెప్టెన్ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. "హార్దిక్ పాండ్యా ఇప్పటికే టి20ల్లో భారత స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఫిట్‌గా ఉన్నంత కాలం అతడే కెప్టెన్‌గా కొనసాగాలి. సెలక్టర్లు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారనుకుంటా. ప్రస్తుతం యువకుల్లో చాల మంది ప్రతిభావంతులున్నారు. కాబట్టి కొత్త జట్టును తీసుకురావచ్చు. ఐపీఎల్లో సత్తా చాటుతున్న యువ ప్రతిభావంతులను చూస్తున్నారు. కాబట్టి బీసీసీఐ 2007లో అనుసరించిన మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా. అప్పుడు కూడా యువకులకు అవకాశం కల్పించారు. పాండ్యా ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడి ఐడియాలు విభిన్నంగా ఉంటాయి. ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఇతర ఆటగాళ్లను కూడా గమనిస్తున్నాడు. "అక్టోబరు-నవంబరులో జరగనున్న ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో అతడు టెస్టు జట్టులో లేనందుకు అతడిపై ఎలాంటి వర్క్ లోడ్ ఉండదు. ఈ రోజుల్లో ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడట్లేదు. టెస్టు సిరీస్ సమయంలో అతడికి ఓ నెల విశ్రాంతి దొరుకుతుంది" అని పేర్కొన్నాడు. చదవండి: సిక్సర్ల విషయంలో రోహిత్ అరుదైన రికార్డు -
త్వరలో పట్టాలెక్కనున్న సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో అతనే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్ అతి త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ ఉందని తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి రివీల్ చేశాడని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ.. గంగూలీ, రణ్‌బీర్‌లకు సంబంధించిన వారెవ్వరూ నోరు మెదపలేదు. తాజాగా గంగూలీకి అతి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించాడు. దాదా బయోపిక్కు సంబంధించి గతంలో ఇరు వర్గాలు చాలాసార్లు సిట్టింగ్ చేసినప్పటికీ.. రణ్‌బీర్ డేట్స్ కుదరక ఎలాంటి ఒప్పందం జరగలేదని, ప్రస్తుతం రణ్‌బీర్ డేట్స్ కుదరడంతో డీల్ ఓకే అయ్యిందని, గంగూలీ గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు మరో ముఖ్యమైన వ్యక్తితో (దర్శకుడు) కలిసి రణ్‌బీర్ త్వరలోనే కోల్‌కతాకు వెళ్లనున్నాడని సదరు వ్యక్తి మీడియాకు ఉప్పందించాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పర్యటనలో రణ్‌బీర్.. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని, క్యాబ్ అఫీస్ను అలాగే గంగూలీ ఇంటిని సందర్శించనున్నట్లు సమాచారం. కాగా, దాదా ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ఏ అధికారిక పదవిలో లేకపోగా.. రణ్‌బీర్ మాత్రం 'తూ ఝూటీ మై మక్కర్' అనే చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. తన బయోపిక్‌లో నటించేందుకు హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను గంగూలీ గతంలో సంప్రదించినట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. -
Viral Video: విరాట్ కోహ్లి పెదాలపై ముద్దు పెట్టిన లేడీ ఫ్యాన్
Viral Video: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా కింగ్ అంటే పడిచచ్చే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సోషల్‌మీడియాలో రన్‌మెషీన్‌కు ఉన్న ఫాలోయింగే ఇందుకు నిదర్శనం. లివింగ్ సాకర్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్గో తర్వాత ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లికి ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారు. శత్రు దేశ అభిమానులు సైతం కోహ్లి ఆటకు, లుక్స్‌కు, యాటిట్యూడ్‌కు, బాడీ ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతారు. ఇటీవల కొందరు అభిమానులు కోహ్లిని GOATగా (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పరిగణించాలంటూ సోషల్‌మీడియాలో డిబేట్లు నిర్వహించారు. భారత అభిమానుల విషయానికొస్తే.. మగ, ఆడ.. ముసలి, ముతక.. చిన్న, పెద్ద.. అన్న తేడాతో లేకుండా కోహ్లి అంటే పడిచచ్చిపోతారు. కోహ్లిని టీవీల్లో చూస్తేనే పిచ్చెక్కిపోయే జనం.. అతన్ని చూసే అవకాశం లభించినా లేదా అతనితో ఫోటో దిగే ఛాన్స్ వచ్చినా ఉబ్బితబ్బిబైపోతారు. ఇది జరిగాక వీరిని పట్టుకోవడం చాలా కష్టం. అంతలా వీరు కోహ్లిపై తమ అభిమానాన్ని చాటుతూ రెచ్చిపోతారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్.. కోహ్లి మైనపు బొమ్మ పెదాలపై ముద్దు పెడుతూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను చూస్తే ఆ అమ్మాయికి కోహ్లి అంటే ఏ రేంజ్లో పిచ్చి ఉందో ఇట్టే అర్ధమవుతుంది. కోహ్లి బొమ్మకు ముద్దు పెడుతూ, ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు క్రికెట్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. నెటిజన్లు ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో.. ఈ సన్నివేశం ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa — Byomkesh (@byomkesbakshy) February 20, 2023 ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కోహ్లి.. తొలి టెస్ట్‌లో 12, రెండో టెస్ట్‌లో 44, 20 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్లో సెంచరీలు చేసిన కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోహ్లి చివరిసారి టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది 2019 నవంబర్ 22న. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లోనైనా కోహ్లి శతక్కొట్టాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. -
భారత క్రికెట్ చరిత్రలో ఎవ్వరి వల్ల కాలేదు.. రోహిత్‌కు ఆ ఛాన్స్ వచ్చింది..!
భారత క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో హిట్‌మ్యాన్ ఓ సెంచరీ చేస్తే, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ తన కెరీర్లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. BGT 2023లో భాగంగా జరిగే 4 టెస్ట్‌ల్లో హిట్‌మ్యాన్ ఒక్క సెంచరీ చేసినా, దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోని, కోహిలకు సాధ్యంకాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. టెస్ట్‌ల్లో రోహిత్ 8 సెంచరీలు చేసినప్పటికీ, అవన్నీ ఆటగాడిగా సాధించినవే. కాగా, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ముగ్గురి పేరిట ఉంది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆతర్వాత సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
మాజీ భార్య పరువు తీస్తుంది.. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆవేదన, కోర్టు అక్షింతలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. ధవన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై కానీ షేర్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ధవన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. Delhi court restrains estranged wife of Shikhar Dhawan from making defamatory allegations against the cricketer report by @NarsiBenwal #ShikharDhawan @SDhawan25 https://t.co/5MWVV4gEUe — Bar & Bench (@barandbench) February 4, 2023 భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్) జన్మించాడు. అయేషాకు ధవన్‌తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ధవన్-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్ మెయింటెనెన్స్ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్ ధవన్ ఇప్పటివరకు 34 టెస్ట్‌లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్ సెంచరీలు) ఉన్నాయి. ధవన్ పలు మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. -
మూడేళ్ల తర్వాత సెంచరీ ఏంటీ.. అలా ఎలా చూపిస్తారు..? రోహిత్ శర్మ ఉగ్రరూపం
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. అతనితో పాటు శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకం, ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకంతో చెలరేగినప్పటికీ.. న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా టీమిండియా 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా, ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ బ్రాడ్కాస్టర్లపై మండిపడిన ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ చేసిన వెంటనే బ్రాడ్కాస్టర్లు టీవీల్లో.. "రోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత చేసిన సెంచరీ" అంటూ ఊదరగొట్టాయి. ఇదే హిట్‌మ్యాన్‌కు కోపం తెప్పించింది. మూడేళ్ల తర్వాత సెంచరీ ఏంటీ..? ఇది నిజమే అయ్యుండొచ్చు. నేను వన్డేల్లో చివరిసారిగా సెంచరీ చేసింది 2020 జనవరిలో. ఆతర్వాత టెస్ట్‌ల్లో 2021 సెప్టెంబర్ 2న సెంచరీ చేశాను. ఈ విషయం పక్కన పెడితే.. 2020-23 మధ్యకాలంలో నేను ఎన్ని వన్డేలు ఆడానన్న విషయాన్ని బ్రాడ్కాస్టర్లు గ్రహించాలి (ఈ మధ్యకాలంలో రోహిత్ కేవలం 12 వన్డేలు, 2 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు).. ఇది చూపించకుండా రోహిత్ శర్మ 1100 రోజుల తర్వాత సెంచరీ చేశాడు, మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడు అంటూ గణాంకాలతో ఊదరగొట్టడం సరికాదని హిట్‌మ్యాన్ మీడియా సమక్షంలో బ్రాడ్కాస్టర్లపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. మూడేళ్లు అంటే వినడానికి చాలా లాంగ్ గ్యాప్‌గా అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో బ్రాడ్కాస్టర్లు విచక్షణతో ప్రవర్తించాలి, ప్రజలకు తామేమీ మెసేజ్ ఇస్తున్నామో అర్ధం చేసుకోవాలి, ఇలా చేయడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు, వాస్తవాలను వక్రీకరించినట్లవతుందంటూ చురకలంటించాడు. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్ మ్యాన్.. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్ సెంచరీని మ్యాజిక్కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Dedicating this 50 for his pet dog who passed away this week. Rohit is an emotion for cricketing fans!! Love this celebration from skipper.#RohitSharma #INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/c7EHEmsFjc — sportsbuzz (@cricket_katta11) January 10, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్ (70)లు హాఫ్ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) -
అపజయమెరుగని హార్ధిక్.. హిట్‌మ్యాన్ రికార్డు బద్దలు
IND VS SL 2nd T20: భారత టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత కెప్టెన్‌గా తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (న్యూజిలాండ్‌తో మ్యాచ్ టై గా ముగిసింది) సాధించి, అపజయమెరుగని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో హార్ధిక్.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్ కూడా కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. అతని సారధ్యంలో టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌లో (5వ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి) ఓడింది. After 1st 6 T20Is Indian Captain with Most Wins 5 - Hardik Pandya* 5 - Rohit Sharma 4 - Virat Kohli 4 - MS Dhoni#INDvSL — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 3, 2023 అయితే రోహిత్ టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయ్యాక వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్ టీమిండియాను వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 3 ఓటముల తర్వాత రోహిత్ మళ్లీ పుంజుకన్నాడు. ఈసారి వరుసగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20ల్లో వరుస అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఈ రికార్డు ఇప్పటికీ హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. పూణే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 5) జరుగనున్న రెండో టీ20, కెప్టెన్‌గా హార్ధిక్‌కు 7వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనూ హార్ధిక్ టీమిండియాను విజయపధంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్ వరుస విజయాల రికార్డుకు మరింత చేరువవుతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ కాకుండానే హార్ధిక్ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగనున్న రెండో టీ20లో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు లంక సైన్యం సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను సంజూ శాంసన్ దెబ్బేశాడు. గాయం కారణంగా అతను ఈ సిరీస్ మొత్తానికే దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో కొత్త కుర్రాడు జితేశ్ శర్మ జట్టులో చేరాడు. భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. -
టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్! సారథిగా రోహిత్ చివరి టీ20 అక్కడే!?
Hardik Pandya- Rohit Sharma- India ODI, T20I captain: టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో మార్పు చోటు చేసుకోనుందా? పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథిగా రోహిత్ శర్మకు ఉద్వాసన పలికేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందా? త్వరలోనే అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కావడం లాంఛనమే! అంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. 35 ఏళ్ల రోహిత్ శర్మ తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. టెస్టు కెప్టెన్‌గా తొలి టూర్లో భాగంగా సౌతాఫ్రికాతో సిరీస్‌కు గాయం వల్ల రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల వివిధ సిరీస్‌లలోనూ విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉన్నాడు. కీలక సమయాల్లో వైఫల్యం ఇదిలా ఉంటే.. టీ20 కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయవంతమైనా.. కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల్లో మాత్రం తేలిపోయాడు ‘హిట్‌మ్యాన్’. బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక బంగ్లాదేశ్‌తో టూర్లో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ రోహిత్.. ఇంకా కోలుకోలేదు. దీంతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అందుకేనా?! ఇక.. ఈ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్‌లు ఆడాల్సి ఉంది. రోహిత్ ఇలాగే ఫిట్నెస్ సమస్యలతో సతమతమైతే గతంలో మాదిరే తరచూ కెప్టెన్లను మార్చాల్సిన దుస్థితి వస్తుంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇప్పటికే పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఈవెంట్లో వైఫల్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ.. కెప్టెన్సీ విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోహిత్ గైర్హాజరీలో ఇప్పటికే టీమిండియా టీ20 జట్టు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాను పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్‌కు సమాచారం ఈ విషయం గురించి ఇప్పటికే హార్దిక్‌కు సమాచారం కూడా అందినట్లు కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఆలోచనపై స్పందించిన హార్దిక్.. తనకు కొంత సమయం కావాల్సిందిగా కోరినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఏమో చూడాలి అయితే, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కెప్టెన్సీ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదని, సెలక్షన్ కమిటీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. మరోవైపు... గాయం నుంచి రోహిత్ ఇంకా కోలుకోకపోవడంతో శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు మాత్రమే హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ఇన్సైడ్ స్పోర్ట్ కథనం పేర్కొంది. అక్కడే రోహిత్‌కు ‘వీడ్కోలు’! కానీ, బీసీసీఐ మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో తొలి మ్యాచ్. ఇది రోహిత్ హోం గ్రౌండ్. ఒకవేళ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే సెలక్టర్లు, జై షా కలిసి అతడికి అక్కడే.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఘనమైన వీడ్కోలు ఇవ్వొచ్చు కదా!’’ అని పేర్కొనడం గమనార్హం. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. 10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ -
రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా కొనసాగనున్న కేఎల్ రాహుల్
Rohit Sharma Ruled Out Of India Second Test Vs Bangladesh: ఎడమ చేతి బొటన వేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ టూర్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన (రెండో వన్డే తర్వాత) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఢాకాలోని మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. హిట్‌మ్యాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బీసీసీఐ అతన్ని బంగ్లాతో రెండో టెస్ట్‌కు దూరంగా ఉండాలని కోరినట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి సమాచారం అందించాడు. బంగ్లా టూర్ తదుపరి టీమిండియాకు కీలకమైన సిరీస్‌లు ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగడం దాదాపుగా ఖరారైంది. ఒకవేళ రోహిత్ ఫిట్నెస్ సాధించి ఉంటే రెండో టెస్ట్‌కు జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారేది. తొలి టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో రోహిత్‌కు జతగా ఓపెనర్‌గా గిల్‌నే బరిలోకి దించాల్సి వచ్చేది. ఇదే జరిగితే వైస్ కెప్టెన్ అయిన రాహుల్‌ను పక్కకు కూర్చోపెట్టాల్సి వచ్చేది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ టూర్లో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగతున్న విషయం తెలిసిందే. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. -
బంగ్లాపై విజయం.. రోహిత్‌కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంతోని టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, బంగ్లాపై విజయం సాధించడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్.. విదేశాల్లో మూడో ఫార్మాట్లలో టీమిండియాను గెలిపించిన ఐదో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అజింక్య రహానే మాత్రమే టీ20, వన్డే, టెస్ట్‌ల్లో విదేశీ గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని ఈ రికార్డును రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్ గెలిచిన రాహుల్, ఆసియా కప్ 2022లో ఆఫ్ఘాన్‌పై టీ20 విజయం సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో విజయం సాధించడంతో విదేశాల్లో మూడు ఫార్మాట్లలో టీమిండియాను గెలిపించిన దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు విదేశాల్లో ఒక్క టెస్ట్ మ్యాచ్‌కు కూడా సారధ్యం వహించలేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టూర్లో, ఆతర్వాత ఇంగ్లండ్ టూర్లో ఐదో టెస్టు మ్యాచ్‌కు రోహిత్ గాయాల కారణంగా దూరంగా ఉన్నాడు. -
చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్.. వన్డే వరల్డ్‌కప్ వరకైనా ఉంటాడా..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతుండటం భారత క్రికెట్ అభిమానులకు చెడ్డ చిరాకు తెప్పిస్తుంది. పేరుకు కెప్టెన్ కానీ.. ఈ బాధ్యతలు చేపట్టాక అతని వైఫల్యాల రేటు మరింత పెరిగింది. ఈ ఫార్మాట్, ఆ ఫార్మాట్ అని తేడా లేకుండా అన్నింటిలోనూ హిట్‌మ్యాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది అతని ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఈ ఏడాది 3 టెస్ట్ ఇన్నింగ్స్‌లు (శ్రీలంక) ఆడిన హిట్‌మ్యాన్.. 30 సగటున కేవలం 90 పరుగులు (29, 15, 46) మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఏడాది (ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డే కలుపుకుని) ఇప్పటివరకు 8 వన్డేలు ఆడిన రోహిత్.. 32 సగటున 235 పరుగులు (27, 17, 0, 76, 13, 5, 60, 37) చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది పొట్టి క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. ఈ ఫార్మాట్లో మరింత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో కలుపుకుని ఈ ఏడాది మొత్తం 29 మ్యాచ్‌లు ఆడిన అతను.. 134 స్ట్రయిక్ రేట్‌తో 656 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మినహాయించి అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ తన వైఫల్యాల పరంపరను కొనసాగించిన టీమిండియా కెప్టెన్.. ఈ మ్యాచ్‌లో 31 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో హిట్‌మ్యాన్ దారణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ కథ దేవుడెరుగు, వన్డే వరల్డ్‌కప్ వరకు కనీసం జట్టులోనైనా కొనసాగుతాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అన్న పేరుతో ఇప్పటికే టీ20ల్లో హిట్‌మ్యాన్ స్థానానికి ఎసరుపెట్టిన బీసీసీఐ.. ఇదే ఫామ్ కొనసాగిస్తే వన్డేలు, టెస్ట్‌ల నంచి కూడా తప్పించి ఇంట్లో కూర్చోబెడుతుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. అయితే, కెప్టెన్సీ విషయంలో, జట్టులో స్థానం విషయంలో రోహిత్ అభిమానులు మాత్రం అతనికి అండగా ఉన్నారు. అతను ఎంత చెత్త ఫామ్‌లో ఉన్నా అతనికి మద్దతు కొనసాగిస్తున్నారు. త్వరలో హిట్‌మ్యాన్ కూడా కోహ్లి లాగే పుంజుకుంటాడని, రోహిత్ ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
కోహ్లిని మించిన కెప్టెన్ లేడు.. కింగ్‌ను ఆకాశానికెత్తిన రైజింగ్ స్టార్
Shubman Gill On Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఆడిన కెప్టెన్లలో కోహ్లిని మించిన కెప్టెన్ లేడని కింగ్‌ను ఆకాశానికెత్తాడు. తాను వ్యక్తిగతంగా కోహ్లి కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశానని, అతను జట్టు సభ్యులను మోటివేట్ చేసే విధానం తనకు బాగా నచ్చుతుందని, కోహ్లి.. ఆటగాళ్లలో కసి రగుల్చుతాడని, అందుకే తనకు కోహ్లి కెప్టెన్సీ అంటే ఇష్టమని కింగ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. Shubman Gill said - "Virat Kohli is the Best Captain I have played under". — CricketMAN2 (@ImTanujSingh) November 19, 2022 కాగా, శుభ్‌మన్ గిల్ 2019లో కోహ్లి కెప్టెన్‌గా ఉండగానే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే అతను అరంగేట్రానికి ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. 2020 ఆస్ట్రేలియా పర్యటనలో గిల్.. అజింక్య రహానే కెప్టెన్సీలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా చారిత్రక గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గిల్.. తానాడిన 11 మ్యాచ్‌ల్లోనే కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, కేఎల్ రాహుల్ సారధ్యంలో టీమిండియాకు ఆడాడు. ఇదిలా ఉంటే, గిల్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్‌లు (11), వన్డేలు (12) మాత్రమే ఆడిన గిల్‌కు ఈ సిరీస్‌లో టీ20 అరంగేట్రం చేసే అవకాశం దొరకవచ్చు. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌తో వెలుగులోకి వచ్చిన గిల్.. ఆతర్వాత దేశవాలీ, ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. టెస్ట్‌లు, వన్డేలు కలిపి ఇప్పటివరకు గిల్ ఖాతాలో సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్.. ఐపీఎల్లో 74 మ్యాచ్‌ల్లో 125 స్ట్రయిక్ రేట్‌తో 1900 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్ కన్ఫర్మ్, వన్డే, టెస్ట్‌లకు..?
టీ20 వరల్డ్‌కప్-2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో SPLIT CAPTAINCY (వేర్వేరు కెప్టెన్లు) అమలు చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐలోని కీలక అధికారి జాతీయ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. ఇటీవలికాలంలో టీ20 ఫార్మాట్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేక, వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్, వన్డేలకు మాత్రమే పరిమితం చేసి, హార్ధిక్ పాండ్యాను టీ20 సారధిగా నియమించేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. కొత్త సెలెక్షన్ కమిటీ చార్జ్ తీసుకోగానే ఈ విషయంపై డిస్కస్ చేసి అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. వయసు పైబడిన రిత్యా రోహిత్‌పై భారం తగ్గించేందుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కూడా ఏదో దానిపై కోత పెట్టే అంశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉంటే టీమిండియా సత్ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న బీసీసీఐ, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో రోహిత్‌ను ఏదో ఒక దానిని నుంచి తప్పించాలని (కెప్టెన్సీ) బీసీసీఐ భావిస్తే మున్ముందు హిట్‌మ్యాన్ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రోహిత్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఉంటే, పుజారా, అశ్విన్‌లలో ఎవరో ఒకరికి టెస్ట్ కెప్టెన్సీ అప్పజెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, రోహిత్ పూర్తిస్థాయి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే, ఈ ప్రయోగాలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ మినహాయించి రోహిత్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా అంటూ హిట్‌మ్యాన్‌ను వెనకేసుకొస్తున్నారు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ను మరికొంత కాలం కొనసాగించాలని బీసీసీఐని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడే టీ20 కెప్టెన్సీ మార్పు అవసరం లేదని సూచిస్తున్నారు. ఇంకొందరైతే.. టీ20 ప్రపంచకప్-2024ను దృష్టిలో పెట్టుకుని హార్ధిక్‌ను ఇప్పటినుంచే టీ20 కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, హార్ధిక్ నేతృత్వంలోనే ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్‌తో టీ20 ఆడుతున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిన్న (నవంబర్ 18) జరగాల్సిన తొలి మ్యాచ్ పూర్తిగా రద్దైంది. చదవండి: బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు -
టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
భారత టీ20 జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఇందులో భాగంగానే టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలి అని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను భారత టీ20 కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దృవీకరించారు. "భారత టీ20 కెప్టెన్సీలో మార్పు చేసే సమయం అన్నమైంది. రోహిత్ కొన్నాళ్ల పాటు భారత కెప్టెన్‌గా కొనసాగాలని కొంత మంది భావిస్తున్నారు. కానీ అతడి వయస్సు దృష్ట్యా అతడి పని భారాన్ని తగ్గించాలి అనుకుంటున్నాము. అతడు మిగితా రెండు ఫార్మాట్ల్లో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్- 2024 కోసం ఇప్పటి నుంచే మేము సన్నద్దం కావాలి. ఇందుకోసం భారత జట్టు కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమయ్యాము. ఇక టీ20ల్లో కెప్టెన్సీ రోల్‌కు హార్దిక్ పాండ్యా సరైనోడు అని భావిస్తున్నాము. మా తదుపరి టీ20 సిరీస్‌కు ముందు సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుంది" అని బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అనంతరం వచ్చే ఏదాది జనవరిలో శ్రీలంకతో టీ20లు ఆడనుంది. ఈ మధ్య కాలంలో భారత జట్టు కేవలం వన్డేలు, టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. అంటే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. చదవండి: India-A vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్‌గా పుజారా -
కెప్టెన్ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..!
టీ20 వరల్డ్‌కప్-2022లో టీమిండియా వైఫల్యం చెందడంతో జట్టు ప్రక్షాళణకు సమయం ఆసన్నమైందని, కెప్టెన్ సహా సీనియర్లందరికీ ఉద్వాసన పలికాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీలు, అభిమానులు, విశ్లేషకులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. కెప్టెన్‌ను, సీనియర్లను తప్పించి ఉన్నపలంగా జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం వల్ల జట్టుకు చాలా నష్టం జరుగుతుందని హెచ్చరించాడు. కెప్టెన్‌ను మార్చాలనే చెత్త ప్రతిపాదనలను బీసీసీఐ అస్సలు పరిగణలోకి తీసుకోకూడదని, రోహిత్ టీమిండియా పగ్గాలు చేపట్టి ఓ సంవత్సరం కూడా కాలేదని, ఇంతలోనే కెప్టెన్ మార్పు తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐకి సూచించాడు. ఈ అంశాన్ని బీసీసీఐ పూర్తిగా పక్కకు పెట్టి, జట్టులో మార్పులపై ఫోకస్ పెట్టాలని కోరాడు. జట్టులో మార్పులపై అతనే ఫోర్ పాయింట్ ఎజెండాను రూపొందించాడు. Indian cricket going forward 1) Openers playing freely, At least one of them. 2) Wrist spinner (wicket taker ) is must. 3) Tear away fast bowler. 4) please don’t think changing captaincy will give us changed result. It’s the approach what needs to change. — Irfan Pathan (@IrfanPathan) November 15, 2022 మున్ముందు టీమిండియా సక్సెస్ సాధించాలంటే.. మొదటగా ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలి, ముఖ్యంగా ఓపెనర్లలో ఒకరు ధాటిగా బ్యాటింగ్ చేయాలి. తుది జట్టులో వికెట్ టేకింగ్ రిస్ట్ స్పిన్నర్ తప్పక ఉండేలా చూసుకోవాలి కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ తుది జట్టులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు కెప్టెన్‌ను మార్చాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని పై పేర్కొన్నవన్నీ అమలు చేయగలిగితే టీమిండియాకు తిరుగే ఉండదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతను ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలని ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో బీసీసీఐ.. హార్ధిక్‌ను కెప్టెన్‌గా పరిగణిస్తే, అతనితో పాటు మరో స్టాండ్ బై కెప్టెన్‌ను కూడా తయారు చేసుకోవాలని సూచించాడు. తరుచూ గాయాల బారిన పడే హార్ధిక్‌ను కెప్టెన్‌గా చేస్తే.. కీలక టోర్నీలకు ముందు అతను గాయపడితే, అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ఇప్పటి నుంచే ఇద్దరు కెప్టెన్లను లైన్లో పెట్టుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు. చదవండి: WC 2024: నేనే చీఫ్ సెలక్టర్ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు! -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..?
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ, విశ్లేషకులు ఇందుకనుగుణంగా తగు సూచనలు కూడా చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే.. 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు, ముగ్గురు వేర్వేరు కోచ్‌లు ఉండాలని సలహా ఇవ్వగా.. చాలామంది ఫ్యాన్స్ ఈ ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు కొత్త కెప్టెన్, కొత్త కోచ్ అనే అంశంపై గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. కెప్టెన్, కోచ్ పోజిషన్ల కోసం ఎవరికి తోచిన ప్రతిపాదనలు వారు చేస్తున్నారు. కొందరు రోహిత్‌నే కంటిన్యూ చేయాలంటుంటే, మరికొందరు హార్ధిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పగిస్తే బెటరని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై క్రికెట్‌కు సంబంధించిన ఓ వ్యక్తే సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఓ ఆటగాడికి ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ రేసులోకి కొత్తగా వచ్చిన ఆటగాడెవరు.. అతని పేరు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు..? వివరాల్లోకి వెళితే.. వినాయక్ మానే అనే ముంబై మాజీ క్రికెటర్ టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి ఎవరూ ఊహించని విధంగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పేరును తీసుకువచ్చాడు. గతంలో స్థానిక క్లబ్ క్రికెట్ ఆడే సమయంలో సూర్యకుమార్ ఆడిన జట్టుకు కెప్టెన్‌గా, ఆ సమయంలో స్కైకు పర్సనల్ కోచ్‌గా వ్యవహరించిన మానే.. సూర్యకుమార్ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టేందుకు అన్ని విధాల అర్హుడని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసలో మాట బయటపెట్టాడు. సూర్యకుమార్‌ను చిన్నతనం చూస్తున్నాను.. అతనికి బ్యాటింగ్ లైనప్‌ను లీడ్ చేయగలిగిన సామర్ధ్యంతో పాటు క్లిష్ట సమయాల్లో జట్టు సారధ్య బాధ్యతలు భుజాన ఎత్తుకునే మనోస్థైర్యం, చాణక్యం కూడా ఉన్నాయని ఆకాశానికెత్తాడు. అతనితో కలిసి ఆడిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నా.. టీమిండియా నాయకత్వ మార్పును కోరుకుంటే, సూర్యకుమార్ పేరును తప్పక పరిశీలనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా అని అన్నాడు. మానే ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి మరో కొత్త పేరు వచ్చి చేరిందని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. వాస్తవానికి సూర్యకుమార్‌కు గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. 2014-15 రంజీ సీజన్లో అతను ముంబై జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే బ్యాటింగ్‌పై దృష్టి సారించలేకపోతున్నాన్న కారణంతో అదే సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2019-20 సీజన్లో ముంబై రంజీ టీమ్ కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. చదవండి: Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..! -
టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్-12 పోటీల్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు చేరుకుంది. నవంబర్ 10(గురువారం) ఇంగ్లండ్‌తో సెమీఫైనల్-2లో టీమిండియా అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వేపై విజయం ఈ ఏడాది టి20ల్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకు 21వది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో అత్యధిక టి20 విజయాలు అందుకున్న సారథిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2021లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(20 విజయాలు) అందుకున్నాడు. తాజాగా బాబర్‌ను వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్ తొలిస్థానంలో నిలిచాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 18 టి20 విజయాలు అందుకోగా.. 2016లో ఎంఎస్ ధోనీ 15 విజయాలు అందుకున్నాడు. ► ఈ ఏడాది 50+ పరుగుల తేడాతో విజయం అందుకోవడం టీమిండియాకి ఇది 10వ సారి. ఇదే ఏడాది 6 సార్లు 50+ పరుగుల తేడాతో విజయం అందుకున్న న్యూజిలాండ్ రెండో పొజిషన్లో ఉంటే, 2018లో పాకిస్తాన్ 5 సార్లు ఈ ఫీట్ సాధించింది.. ► ఓవరాల్‌గా రోహిత్ శర్మకు ఆటగాడిగా ఇది 100వ టి20 విజయం. ఇంతకుముందు పాక్ సీనియర్ క్రికెటర్ 87 టి20 విజయాల్లో భాగం పంచుకోగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ► జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది సూర్యకుమార్‌కు ఇది ఆరో అవార్డు కావడం విశేషం. 2016లో విరాట్ కోహ్లీ 6 సార్లు టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలవగా ప్రస్తుతం సూర్య దానిని సమం చేశాడు. చదవండి: అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం -
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని.. తొలి సినిమా ఏ భాషలో తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎట్టకేలకు సినీ నిర్మాణ రంగంలోని అడుగుపెట్టాడు. దీపావళి పర్వదినాన భార్య సాక్షి సింగ్ ధోనితో కలిసి 'ధోని ఎంటర్టైన్మెంట్' పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు సాక్షి సింగ్ ధోని మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తొలుత తమిళ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ధోని ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు తెలిపారు. తమ సంస్థ నిర్మించబోయే తొలి చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతరత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సాక్షి సింగ్ ధోనినే కథ సమకూర్చినట్లు తెలుస్తోంది. Legendary cricketer @msdhoni & his wife @SaakshiSRawat's production house @DhoniLtd will produce its 1st feature film in Tamil! Conceptualised by Sakshi herself, the Tamil film will be a family entertainer directed by @ramesharchi@HasijaVikas @PriyanshuChopra @proyuvraa pic.twitter.com/uOUwYvPG2w — Sreedhar Pillai (@sri50) October 24, 2022 కాగా. ధోని.. తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి విజయ్‌తో కలిసి త్వరలోనే సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధుల స్పందించారు. ధోనికి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉండటంతో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వరుస తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. చదవండి: ధోని ప్రొడక్షన్లో హీరోగా విజయ్? స్టార్ హీరోలతో వరుస సినిమాలు -
జట్టులో కీలక సభ్యుడు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
India Vs Pakistan: ‘‘గత కొంత కాలంగా అతడి ఆటతీరును ఒక్కసారి గమనిస్తే.. ఐపీఎల్-2022 సందర్భంగా తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జట్టును విజయవంతంగా ముందుకు నడిపాడు. టైటిల్ గెలిచాడు. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఒత్తిడిని అధిగమించిన తీరు అమోఘం. ముఖ్యంగా ఫినిషర్‌గా బాధ్యతను నెరవేర్చిన తీరు అద్భుతం’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. మానసికంగా దృఢంగా ఉండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో పాండ్యా నిరూపించాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2021 తర్వాత పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సాధించే క్రమంలో చాలా కాలం భారత జట్టుకు దూరమైన అతడు.. ఐపీఎల్-2022తో తొలిసారిగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే జట్టును విజేతగా నిలిపాడు. పునరాగమనంలో అదరగొట్టి ఈ క్రమంలో టీమిండియాలో పునరాగమనం చేసి భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి పలు సిరీస్‌లు గెలిచాడు. ఇక ఆసియాకప్-2022లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో.. ప్రపంచకప్-2022లో దాయాదితో పోరులో విరాట్ కోహ్లితో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తదుపరి కెప్టెన్ అతడే ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన విధానాన్ని పాకిస్తాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు. ఇక వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ముందు తను ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ట్రోఫీ గెలిచాడు. ఇప్పుడు జట్టులో తను కీలక సభ్యుడు మాత్రమే కాదు.. కెప్టెన్‌కు సలహాలు ఇవ్వగల స్థాయిలో ఉన్నాడు. జట్టు జయాపజయాలపై తన ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తను టీమిండియా తదుపరి కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు. అసలైన పోరులో కీలక పాత్ర ఆసియాకప్-2022లో పాక్‌తో తొలి మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన హార్దిక్ పాండ్యా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత 17 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన హార్దిక్.. 37 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లికి సహకరిస్తూ అతడితో కలిసి జట్టును గెలిపించాడు. చదవండి: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా.. -
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్ఘాన్ యువ బ్యాటర్.. ఆసియా కప్‌లో ఇదే బెస్ట్
ఆసియా కప్ 2022 సూపర్-4 దశ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 3) ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. ఆఫ్ఘాన్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి గ్రూప్ దశలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌కు శుభారంభం లభించినా.. ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టలేక భారీ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడి 19.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఆఫ్ఘాన్ మ్యాచ్ ఓడినా గుర్భాజ్నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుర్భాజ్.. ఈ ఇన్నింగ్స్ ద్వారా పలు రికార్డులకు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డుతో (22 బంతుల్లో) పాటు ఆసియా కప్ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియాకప్ టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డు గతంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2016లో బంగ్లాదేశ్‌పై 55 బంతుల్లో 83 పరుగులు) పేరిట ఉండేది. నిన్నటి మ్యాచ్‌తో గుర్భాజ్ రోహిత్ రికార్డును బద్దలు కొట్టి ఆసియా కప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న గుర్భాజ్.. 3 మ్యాచ్‌ల్లో 167 స్ట్రయిక్ రేట్‌తో 45 సగటున 135 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంకపై తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 40 పరుగులతో విధ్వంసం సృష్టించిన గుర్భాజ్.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో (11) జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. చదవండి: 'ఆడింది చాలు పెవిలియన్ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
టీమిండియా ప్రస్తుత, తాజా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పోటాపోటీన ఒకరి రికార్డులు మరొకరు బద్దలు కొట్టడం లేదా సమం చేయడం లాంటివి ఇటీవలి కాలంలో మనం తరుచూ గమనిస్తూ ఉన్నాం. ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. తొలుత భారత ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి.. రోహిత్ పేరిట ఉండిన అత్యధిక టీ20 అర్ధసెంచరీల రికార్డును (31) సమం చేయగా, హాంగ్‌కాంగ్‌పై గెలుపుతో రోహిత్.. కోహ్లి పేరటి ఉండిన సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్ రికార్డును చెరిపేశాడు. తాజా గెలుపుతో రోహిత్ సారధ్యంలో టీమిండియా 37 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించగా.. కోహ్లి కెప్టెన్‌గా టీమిండియా 50 టీ20ల్లో 30 సార్లు గెలుపొందింది. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికార్డు ఎంఎస్ ధోని (72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) పేరిట ఉండగా.. హాంగ్‌కాంగ్‌పై విజయంతో రోహిత్ కోహ్లిని వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, హాంగ్‌కాంగ్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), సూర్య భాయ్ నాటు కొట్టుడు (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దెబ్బకు టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. భారత్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 4) సూపర్-4లో పాక్‌తో తలపడే అవకాశం ఉంది. చదవండి: Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా.. -
కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ 'తోపు'.. టీమిండియా కెప్టెన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
వ్యక్తిగత ప్రదర్శన విషయం అటుంచితే.. కెప్టెన్‌గా మాత్రం రోహిత్ శర్మ రెచ్చిపోతున్నాడు. ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలు సాధిస్తూ.. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. తాజాగా పాక్‌పై (ఆసియా కప్ 2022) విజయంతో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 30 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన కెప్టెన్లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ (83.33) కలిగిన సారధిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. Win% of T20I Captains with 30 or more Wins83.3% Rohit Sharma80.8% Asghar Afghan62.5% Virat Kohli59.2% Eoin Morgan58.6% MS Dhoni55.6% Aaron Finch51.7% Kane Williamson#RohitSharma | #AsiaCup | #Hitman— Cricbaba (@thecricbaba) August 29, 2022 రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచ్‌ల్లో 83.33 విజయాల సగటుతో 30 మ్యాచ్‌లు గెలుపొందింది. రోహిత్ సారధ్యంలో భారత్ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ ఉన్నాడు. కెప్టెన్‌గా అఫ్ఘాన్ విజయాల శాతం 80.8గా ఉంది. ఆ తరువాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (62.5%), ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (59.2%), టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (58.6%), ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (55.6%), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51.7%) వరుసగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో భారత్..దాయాదిపై పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: 'పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయం' -
ధవన్‌ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..!
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధవన్ పేరును ప్రకటించిన భారత సెలెక్టర్లు.. కొద్ది రోజుల తర్వాత కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే ధవన్‌ను రాహుల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కొనసాగవలసిందిగా కోరారు. ధవన్‌ను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈ ఉదంతంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ధవన్ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టులో సీనియర్ అయిన ధవన్‌ను అంతలా అవమానించడం సరికాదని దుయ్యబట్టాడు. రాహుల్ ఫిట్‌గా ఉన్నాడన్న నివేదికలు ఆలస్యంగా వచ్చి ఉంటే, ధవన్ నాయకత్వంలో రాహుల్ ఆడితే కొంపమునిగేదేం కాదని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు విండీస్ సిరీస్‌లో టీమిండియాను 3-0 తేడాతో గెలిపించిన ధవన్‌ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం సమంజసం కాదని అన్నాడు. సరైన కమ్యూనికేషన్‌తో ఈ పరిస్థితి తలెత్తకుండా నివారించి ఉండవచ్చని తెలిపాడు. ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి, అతన్ని జట్టులో సభ్యుడిగా ఎంపిక చేయడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ తొలగించడం ధవన్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ విషయంలో సరికాదని చెప్పుకొచ్చాడు. ధవన్ కూల్ కాండిడేట్ కాబట్టి, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయలేదని, వేరే వాళ్ల విషయంలో ఇలాగే జరిగి ఉంటే పెద్ద రచ్చే అయ్యేదని అభిప్రాయపడ్డాడు. చదవండి: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో -
కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ మాత్రం అలా కాదు!
Aakash Chopra On Virat Kohli And Rohit Sharma Captaincy: విరాట్ కోహ్లి కెప్టెన్సీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లి దూకుడుగా ఉంటాడని.. అయితే అతడి సారథ్యంలోని జట్టులో మాత్రం అలాంటి లక్షణాలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో తనదైన కెప్టెన్సీతో నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అదే స్థాయిలో జట్టును ముందుకు నడిపించలేకపోయాడని వ్యాఖ్యానించాడు. అయితే, రోహిత్ శర్మ మాత్రం కోహ్లిలా కాదని.. అతడి నేతృత్వంలో జట్టు దూకుడుగా ఆడుతోందని పేర్కొన్నాడు. కోహ్లి అలా.. రోహిత్ ఇలా! కాగా పలువురు టీమిండియా కెప్టెన్ల శైలి గురించి ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా కోహ్లి, రోహిత్ శర్మ మధ్య భేదాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది నేను చేయాలని అని విరాట్ కోహ్లి అనుకుంటే కచ్చితంగా చేసి తీరాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. మైదానంలో అత్యంత దూకుడుగా కనిపిస్తాడు. ప్రత్యర్థి ఎవరైనా.. పరిస్థితులు ఎలాంటివైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా ముందుకు సాగుతాడు. కానీ.. ఎందుకో అతడి సారథ్యంలోని జట్టు మాత్రం ఇలా ఉండేది కాదు. కోహ్లి కెప్టెన్సీలోని జట్టులో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కోహ్లి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో జట్టు సభ్యులు విఫలమైనందు వల్లే కొన్నిసార్లు అనవసర తప్పిదాలు చేసేవారంటూ ఛతేశ్వర్ పుజారా ఓ మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. టెస్టు కెప్టెన్సీ వేరే లెవల్.. కానీ ఇక టెస్టుల్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేవాడు. నా అభిప్రాయం ప్రకారం అతడు నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ ముందుకు సాగేవాడు. కెప్టెన్‌గా తన దూకుడు అలాంటిది. కానీ ముందు చెప్పినట్లుగా జట్టులో మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించేవి కావు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక టెస్టు క్రికెట్లో ప్రతిభావంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం దూకుడైన సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని పేర్కొన్నాడు. బ్యాటర్‌గా ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే కోహ్లి సారథ్యంలోని జట్టు మాత్రం దూకుడుగా ఉండేది కాదన్న ఆకాశ్ చోప్రా.. కేవలం టీమిండియా మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇలాంటి పరిస్థితిని చూశామని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఉంటే ఆటగాళ్లు చెలరేగిపోతారు! అయితే, రోహిత్ శర్మ మాత్రం కోహ్లిలా మైదానంలో దూకుడు ప్రదర్శించడని.. అదే సమయంలో జట్టులో మాత్రం ఆత్మవిశ్వాసం నింపి వారికి ధైర్యాన్నిస్తాడన్నాడు. కెప్టెన్ అండతో ఆటగాళ్లు దూకుడుగా ఆడతారని చెప్పుకొచ్చాడు. కాగా భారత సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్న కోహ్లి.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ సారథ్యంలోని పరిమిత ఓవర్ల జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: Asia Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర -
'భవిష్యత్తులో అతడు టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం'
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కివీస్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలని కలిగి ఉన్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా హార్దిక్ భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని స్టైరిస్ తెలిపాడు. కాగా ఇప్పటి వరకు మూడు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన హార్దిక్ అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు తొలి సారిగా భారత కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టాడు. కాగా ఈ సిరీస్‌ను పాండ్యా సారథ్యంలోని భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం విండీస్‌తో ఐదో టీ20కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా విజయం సాధించింది. అంతకుముందు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్.. తమ జట్టుకు అరంగేట్ర సీజన్లోనే టైటిల్‌ను అందించాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ అదరగొడుతున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పాటు ,హార్ధిక్ పాండ్యా,రిషభ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్టైరిస్ న్యూస్ 18తో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం. కనీసం భారత టీ20 జట్టుకైనా హార్దిక్ సారథ్యం వహించడం మనం చూస్తాం. ఆరు నెలల కిందట అతడికి జట్టులో చోటు దక్కుతుందా లేదా చర్చలు నడిచాయి. కానీ అతడు తనపై వచ్చిన విమర్శలకు తన అద్భుతమైన ఆటతోనే చెక్ పెట్టాడు. ఫుట్ బాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏ ఆటగాడైతే వ్యక్తిత్వం, నైపుణ్యం కలిగి ఉంటాడో అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. కాబట్టి హార్దిక్ లాంటి ఆటగాడు భవిష్యత్తులో భారత కెప్టెన్సీ బాధ్యతలు చేటపట్టిన మనం ఆశచ్చర్యపోనక్కరలేదు" అని స్టైరిస్ పేర్కొన్నాడు. చదవండి: Ind Vs Zim 2022: మరీ ఇంత బ్యాడ్ లక్ ఏంటి భయ్యా! రాకరాక వచ్చిన అవకాశం..! మరోసారి గాయం.. -
కెప్టెన్సీ మార్పు మంచిదే
-
హిట్‌మ్యాన్ ఖాతాలో పలు రికార్డులు.. దిగ్గజాల సరసన చేరిక
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్న (ఆగస్ట్ 6) విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 33 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 16000 పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌కు ముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (34,357), రాహుల్ ద్రవిడ్ (24,064), విరాట్ కోహ్లి (23,726), సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోని (17,092), వీరేంద్ర సెహ్వాగ్ (16,892) 16000 పరుగుల మైలురాయిని అధిగమించారు. వన్డేల్లో 9376 పరుగులు, టీ20ల్లో 3487, టెస్ట్‌ల్లో 3137 పరుగులు చేసిన రోహిత్ ఖాతాలో ప్రస్తుతం సరిగ్గా 16000 పరుగులు ఉన్నాయి. హిట్‌మ్యాన్ ఈ మార్కును చేరుకునే క్రమంలో మరో రికార్డును కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓపెనర్‌గా 3000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 3119 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (477) బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. ఇదిలా ఉంటే, నిన్న విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ విండీస్‌పై 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. చదవండి: Ind Vs WI: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. నువ్వు తోపు కెప్టెన్! -
స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన టీమిండియా కెప్టెన్
టీమిండియా పార్ట్ టైమ్ వన్డే కెప్టెన్ శిఖర్ ధవన్ నిన్న (ఆగస్ట్ 5) ఢిల్లీలో స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. క్షేత్ర స్థాయి క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొని, వారిని ఆయా విభాగాల్లో మరింత రాటుదేల్చాలనే ధ్యేయంతో ఈ అకాడమీని నెలకొల్పుతున్నట్లు ధవన్ తెలిపాడు. ఈ అకాడమీకి 'డా వన్' అనే పేరును ఖరారు చేశాడు. క్రికెట్‌తో పాటు మరో 8 క్రీడాంశాల్లో క్రీడాకారులకు ఈ అకాడమీ శిక్షణ ఇవ్వనుందని తెలిపాడు. ఈ అకాడమీలో క్రీడాకారులతో పాటు కోచ్‌లకు కూడా శిక్షణ ఉంటుందని పేర్కొన్నాడు. కోచ్‌లు క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇచ్చేలా సానబెడతామని అన్నాడు. దేశవ్యాప్తంగా ఉత్తమ కోచ్‌లను ఎంపిక చేసి డా వన్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తామని వివరించాడు. క్రికెట్ నాకెంతో ఇచ్చింది.. అందుకు తనవంతుగా క్రీడలకు వీలైనంత సాయం చేయాలని భావిస్తున్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో వన్డేల్లో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న శిఖర్ ధవన్.. త్వరలో జింబాబ్వేలో వన్డే సిరీస్ కూడా కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో శ్రీలంక, వెస్టిండీస్ పర్యటనల్లో భారత్‌కు అద్భుతమైన విజయాలు అందించిన ధవన్.. జింబాబ్వేతో సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి రెగ్యులర్ వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావిస్తున్నాడు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో ధవన్ కెప్టెన్సీ అంశం ఆసక్తికరంగా మారింది. ధవన్ సైతం తనను టీ20లకు పరిగణలోకి తీసుకోకపోవడంపై పెద్దగా స్పందించకపోవడం చూస్తుంటే అతను మున్ముందు వన్డే ఫార్మాట్‌కు (కెప్టెన్‌గా) మాత్రమే పరిమితమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే పర్యటన వివరాలు.. తొలి వన్డే ఆగస్టు 18 రెండో వన్డే ఆగస్ట్ 20 మూడో వన్డే ఆగస్ట్ 22 జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ చదవండి: ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్! -
టీ20ల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు.. రెండో భారత కెప్టెన్‌గా!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌటైన రెండో భారత్ ఆటగాడిగా నిలిచాడు. సెయింట్స్ కిట్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన రోహిత్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు భారత యువ ఆటగాడు పృథ్వీ షా శ్రీలంకపై తొలి బంతికే డకౌట్ అయ్యి ఈ చెత్త రికార్డు సాధించాడు. ఇక రోహిత్ శర్మ టీ20ల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగడం ఇది 8వసారి. అదే విధంగా టీ20ల్లో గోల్డన్ డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా కూడా రోహిత్ నిలిచాడు. అంతకుమందు శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గోల్డన్ డకౌట్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. విండీస్ పేసర్ ఒబెడ్ మెక్కాయ్ 6 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. అతడితో పాటు హోల్డర్ రెండు వికెట్లు, జోసఫ్, హోసెన్ తలా వికెట్ సాధించారు. ఇక భారత బ్యాటర్లలో హార్ధిక్ పాండ్యా 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్(68), థామస్(31) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో జడేజా, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్,అశ్విన్ తలా వికెట్ సాధించారు. ఇరుజట్ల మధ్య మూడో టి20 మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. Early tumble of wickets for India, a product of their aggression against the new ball. Can they rebuild? Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/zPNAo0P91d — FanCode (@FanCode) August 1, 2022 చదవండి: IND vs WI 2nd T20 Highlights: బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి -
అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Ind Vs WI ODI Series- Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు వెస్టిండీస్ పర్యటనలో అతడికేం పని అని వ్యాఖ్యానించాడు. ఆరు నెలల క్రితం జట్టు నుంచి తప్పించిన వ్యక్తిని కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాటలకు.. తాత్కాలిక సారథిగా గబ్బర్ నియామకానికి అసలు పొంతనే కుదరడం లేదని పేర్కొన్నాడు. కాగా గతేడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ధావన్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గా ధావన్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో అజయ్ జడేజా ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ విషయంలో నేను అయోమయానికి గురవుతున్నాను. అసలు అతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆరు నెలల క్రితం అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు కెప్టెనా? నిజానికి కేఎల్ రాహుల్ సహా పలువురు ఇతర యువ ఆటగాళ్లకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి. కానీ అకస్మాత్తుగా ధావన్ పేరు తెరపైకి వస్తోంది. గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌ను చేశారు. ఆ తర్వాత జట్టులో చోటే లేదు. తర్వాత ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లారు. అసలు టీమిండియా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఏమనుకుంటోంది?’’ అని ప్రశ్నించాడు. ఇక ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో పరాజయం తర్వాత తాము దూకుడైన ఆటకు మారుపేరుగా ఉండాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పిన విషయాన్ని అజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. వన్డేలను సైతం టీ20 తరహాలో ఆడతామన్న.. హిట్‌మ్యాన్ మాటలను బట్టి చూస్తే ధావన్ అసలు జట్టులో ఉండేందుకు అర్హుడు కాదని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా అజయ్ వ్యాఖ్యలపై స్పందించిన గబ్బర్ అభిమానులు ఐపీఎల్-2022లో ధావన్ ప్రదర్శనను ఓసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ధావన్ 14 ఇన్నింగ్స్‌లో 460 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్! Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 -
కెప్టెన్లను మార్చడంలోనూ రికార్డే.. ప్రపంచ రికార్డును సమం చేసిన భారత్
విజయాలు, పరాజయాలు, వ్యక్తిగత రికార్డులు పక్కన పెడితే మరో విషయంలోనూ భారత క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డులను బద్దలుకొడుతుంది. నిన్న (జులై 22) విండీస్‌తో జరిగిన తొలి వన్డేతో ఓ ఏడాదిలో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా రికార్డుల్లోకెక్కింది. ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ మంది కెప్టెన్లను మార్చిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. 2017లో శ్రీలంక ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చగా.. తాజాగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది. విండీస్‌తో వన్డేకు శిఖర్ ధవన్ కెప్టెన్‌గా వ్యవహరించడంతో ఈ ఏడాది భారత జట్టు కెప్టెన్ల సంఖ్య ఏడుకు చేరింది. 1959లో కూడా భారత జట్టుకు ఇంచుమించు ఇలాగే కెప్టెన్లను మార్చింది. ఆ ఏడాది వినూ మన్కడ్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్ రాయ్ రాంచన్ లు టీమిండియా సారధులుగా వ్యవహరించారు. ఈ ఏడాది టీమిండియా కెప్టెన్లు వీరే.. విరాట్ కోహ్లి (సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్) కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు) రోహిత్ శర్మ (సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లు) రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్) హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్‌లో టీ20 సిరీస్) జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్) శిఖర్ ధవన్ (వెస్టిండీస్‌తో వన్డే సిరీస్) ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్లు.. భారత్ - 2022 - ఏడుగురు కెప్టెన్లు శ్రీలంక - 2017 - ఏడుగురు కెప్టెన్లు జింబాబ్వే - 2001 - ఆరుగురు కెప్టెన్లు ఇంగ్లండ్ - 2011 - ఆరుగురు కెప్టెన్లు ఆస్ట్రేలియా - 2021 - ఆరుగురు కెప్టెన్లు చదవండి: రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్ -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరేబియన్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో విండీస్‌తో భారత్ తలపడనుంది. ఇక వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్ ఓపెరన్ శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. అయితే విండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి, బుమ్రా మినహా మిగతా ఆటగాళ్లంతా తిరిగి జట్టులో చేరనున్నారు. జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్ ప్రారభం కానుంది. ఇక విండీస్‌తో వైట్‌బాల్ సిరీస్ అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా భారత్ మూడు వన్డేలు ఆడనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో జింబాబ్వే టూర్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది. జింబాబ్వే టూర్‌కు భారత కెప్టెన్‌గా రాహుల్ ఆసియా కప్ దృష్ట్యా ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న రాహుల్ విండీస్ టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. విండీస్ టీ20 సిరీస్‌కు ముందు రాహుల్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. చదవండి: Zimbabwe: టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. బిజీ బిజీ షెడ్యూల్‌తో జింబాబ్వే..! View this post on Instagram A post shared by SportsTiger (@sportstiger_official) -
రంగంలోకి దిగిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ..!
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎనిమిది రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రాగానే ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు తాను రెడీ అంటూ అభిమానులకు సంకేతాలు పంపాడు. ఆదివారం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు కాకుండా డిఫెన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన రోహిత్.. నెట్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఈ వీడియోను చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు.. ఇక ఇంగ్లీషోల్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Exclusive and Latest video 📸 Captain Rohit Sharma is looking in great touch in nets. pic.twitter.com/OsXPZP4r32 — Rohit Sharma Fanclub India (@Imro_fanclub) July 4, 2022 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ రిపోర్డు వచ్చినప్పటికీ మరో పరీక్షకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. హిట్‌మ్యాన్‌కు ఇవాళ (జులై 4) గండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టు ఆధారంగానే అతను తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా..? అన్న విషయంపై క్లారిటీ వస్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. రోహిత్‌కు ఈ టెస్ట్‌లో నార్మల్ రిపోర్ట్ వచ్చినా మళ్లీ ఫిట్నెస్ పరీక్షను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ప్రకారం హిట్‌మ్యాన్ ఈ ప్రొసీజర్ మొత్తాన్ని క్లియర్ చేస్తేనే తొలి టీ20కి అందుబాటులో ఉంటాడు. కాగా, జులై 7 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో మూడు టీ20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి. చదవండి: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 -
రోహిత్ శర్మకు ‘నెగెటివ్’
ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగెటివ్ ఫలితం వచ్చింది. ఫలితంగా అతను ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఇంగ్లండ్‌తో ఈనెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. లీస్టర్‌షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. రెండుసార్లు అతనికి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. -
టీమిండియా కెప్టెన్ ఎవరని ప్రశ్నించిన ఐసీసీ.. హర్భజన్ ఏమన్నాడంటే..?
రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కెప్టెన్సీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకావాల్సి ఉండగా.. రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దీంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. రోహిత్ అందుబాటులో ఉండకపోతే జులై 1 నుంచి ప్రారంభంకాబోయే టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ ఎవరని ప్రశ్నించింది. @Jaspritbumrah93 https://t.co/njMwnDtO9Z — Harbhajan Turbanator (@harbhajan_singh) June 28, 2022 ఐసీసీ సంధించిన ఈ ప్రశ్నకు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన స్టైల్లో ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరును ట్యాగ్ చేస్తూ ఐసీసీ ట్వీట్‌కు బదులిచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో బుమ్రాకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలని సూచించాడు. భజ్జీ ఐసీసీకి రిప్లై ఇచ్చిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే, రోహిత్‌కు బ్యాకప్‌గా మయాంక్ అగర్వాల్‌ను పిలిపించుకున్న బీసీసీఐ.. కెప్టెన్ ఎవరనే విషయం ఇంకా తేల్చలేదు. నెట్టింట మాత్రం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. కొందరు పంత్ పేరు చెబుతుంటే మరికొందరు బుమ్రా, అశ్విన్‌ల పేర్లను ప్రతిపాదిస్తున్నారు. చదవండి: రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్ -
పంత్‌కు అంత సీన్ లేదు, బుమ్రాను చెడగొట్టొద్దు.. పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
IND VS ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో ఇంగ్లండ్‌తో జరుగబోయే రీ షెడ్యూల్డ్ టెస్ట్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. కొందరు పంత్ అయితే బాగుంటుందని అంటే మరికొందరు బుమ్రా పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇదే అంశంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్‌గా పంత్, బుమ్రా ఇద్దరూ వద్దని అతను అభిప్రాయపడ్డాడు. పంత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే పరిణితిని సాధించాల్సి ఉందని, ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్‌లో కెప్టెన్‌గా అతని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని అన్నాడు. అసలు పంత్‌కు టీమిండియా పగ్గాలు చేపట్టే సామర్థ్యం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ ప్రభావం అతడి బ్యాటింగ్‌పై కూడా పడిందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు బుమ్రాకు సైతం కెప్టెన్సీ అప్పజెప్పకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. కెప్టెన్సీ భారం వల్ల బుమ్రా తన లయను కోల్పోతాడని, ఈ భారాన్ని అతని తలపై మోపి చెడగొట్టొదని సూచించాడు. బుమ్రాకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం కల్పించాలని కోరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ శర్మ కోవిడ్ నుంచి కోలుకోకపోతే బుమ్రా, పంత్, అశ్విన్‌లలో ఎవరో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: పాకిస్థాన్ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..! -
రోహిత్ దూరమైతే!.. టీమిండియాను నడిపించేది ఎవరు?
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో వారం పాటు రోహిత్ ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే జట్టును నడిపించేది ఎవరనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కోహ్లి లేదా పంత్.. కాదనుకుంటే రహానే? వాస్తవానికి కెప్టెన్ దూరమైతే జట్టును వైస్ కెప్టెన్ నడిపించడం ఆనవాయితీ. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే రాహుల్ గజ్జల్లో గాయంతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ కూడా ప్రత్యేకంగా వైస్ కెప్టెన్ ఎవరనేది వెల్లడించలేదు. అనుభవం దృష్యా కోహ్లి లేదా పంత్‌లలో ఎవరు ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంతకముందు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి నుంచే రోహిత్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో కరోనా వైరస్ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. తాజా పర్యటనలో ఆ ఐదో టెస్టును ఏకైక టెస్టుగా మార్చి మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లికి మరోసారి అవకాశం ఉంది. అయితే కోహ్లి దీనికి అంగీకరిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అలా కాకుండా పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే యోచనలోనూ బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతగా నడిపించాడు. అది టి20... అందునా యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సమస్య రాలేదు. కానీ ఇక్కడేమో టెస్టు జట్టు.. పైగా జట్టులో పంత్ కన్నా సీనియర్లు ఉండడంతో జట్టును సమర్థంగా నడిపించగలడా అనే సందేహాలు వస్తున్నాయి. వీరిద్దరు కాదనుకుంటే రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశము లేకపోలేదు. రోహిత్ శర్మకు నెగెటివ్ వస్తే.. తాజాగా రోహిత్ శర్మకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ర్యాపిడ్ టెస్టులో ఒక్కోసారి తప్పుడు రిపోర్ట్స్ వస్తుంటాయి. అందుకే రోహిత్ శర్మకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. దీని ఫలితం మరికొద్ది గంటల్లో రానుంది. ఒకవేళ నెగెటివ్ వస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇంగ్లండ్‌తో టెస్టుకు రోహిత్ సారధ్యం వహిస్తాడు. అలా కాకుండా పాజిటివ్ వస్తే మాత్రం వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9 టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్..! -
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. టీమిండియాకు ఏమైంది..?
గతేడాది కాలంగా టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 11 నెలల కాలంలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారడంతో ఏ సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 2021 జూన్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరగా, అదే సమయంలో శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అనంతరం అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల చేత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నుంచి విరాట్ కోహ్లి తప్పుకోగా ఆ మ్యాచ్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించారు. తదనంతరం కెప్టెన్సీ విషయంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో విరాట్ కోహ్లి టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి మొత్తంగా తప్పుకోగా.. సౌతాఫ్రికా టూర్లో రెండో టెస్టుకు ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేయగా, సిరీస్ ప్రారంభానికి ముందే అతను గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో బీసీసీఐ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టులో పంత్‌కు చోటు దక్కడంతో ఐర్లాండ్‌లో పర్యటించే మరో జట్టుకు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇలా వివిధ కారణాల చేత 11 నెలల కాలంలో టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లు మారారు. చదవండి: టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..! -
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా
జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 17 మంది సభ్యుల టీమిండియాను భారత సెలెక్షన్ కమిటీ ఇవాళ (జూన్ 15) ప్రకటించింది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నేతృత్వం వహించనుండగా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపికలో ఎలాంటి సంచలనాలకు తావివ్వవని సెలెక్షన్ కమిటీ పటిష్టమైన జట్టునే ఐర్లాండ్‌కు పంపనుంది. మరోవైపు ఇదే సమయంలో భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుండటం విశేషం. India Squad Hardik Pandya (C), Bhuvneshwar Kumar (vc), Ishan Kishan, Ruturaj Gaikwad, Sanju Samson, Suryakumar Yadav, Venkatesh Iyer, Deepak Hooda, Rahul Tripathi, Dinesh Karthik (wk), Yuzvendra Chahal, Axar Patel, R Bishnoi, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik — BCCI (@BCCI) June 15, 2022 ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్ టూర్‌కు కేఎల్ రాహుల్ దూరం..! -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడకుండా రోహిత్ శర్మ ఏం చేశాడో చూడండి..!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా గల్లీ క్రికెట్ ఆడుతూ బిజీబిజీగా కనిపించాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో హిట్‌మ్యాన్ గల్లీ ప్రాక్టీస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Rohit Sharma playing gully cricket at woreli, Mumbai. pic.twitter.com/vuHLIVno6D— Johns. (@CricCrazyJ0hns) June 14, 2022 వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బాండ్రాలో నివాసముండే రోహిత్ శర్మ వర్లీ ప్రాంతం వైపు వెళ్తుండగా కొందరు కుర్రాళ్లు రోడ్డుపై క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇది చూసిన రోహిత్ వెంటనే కారు దిగి వారితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ప్రాక్టీస్ దొరకదనుకున్నాడో ఏమో కాని అక్కడి కుర్రాళ్లకు కూడా ఆవకాశం ఇవ్వకుండా చాలా సేపు బ్యాట్ పట్టుకుని కనిపించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అక్కడున్నవారందరినీ అలరించాడు. అక్కడ ఉన్నంతసేపు రోహిత్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా రోహిత్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్లకు దబిడిదిబిడే అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్టు సిరీస్‌లోని చివరి టెస్ట్ ఆడేందుకు రోహిత్ సేన ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు. భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య బర్మింగ్హమ్ వేదికగా జులై 1 నుంచి 5 వరకు టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ చదవండి: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్.. -
కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ డాషింగ్ ఆల్‌రౌండర్‌గా అందరికి సుపరిచితమే. టీమిండియా సాధించిన రెండు మేజర్ వరల్డ్‌కప్స్(2007 టి20, 2011 వన్డే) జట్టులో యువీ సభ్యుడిగా ఉన్నాడు. దీంతోపాటు మరెన్నో ఘనతలు సాధించిన యువరాజ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. మధ్యలో కొన్నిరోజులు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా అవకాశం రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొందరు తనపై పగబట్టారని.. అందుకే టీమిండియాకు కెప్టెన్ కాలేకపోయానని యువీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''గ్రెగ్ చాపెల్ ఉదంతం నన్ను టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరం చేసింది. చాపెల్ 2005 నుంచి 2007 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ సమయంలో అతను తీసుకున్న కొన్న నిర్ణయాలపై జట్టులో అప్పటికే సీనియర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. ముఖ్యంగా 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్ర్ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన సచిన్‌ను మిడిలార్డర్లో ఆడించడం.. గంగూలీతో చాపెల్‌కు పొసగకపోవడం.. దాదా రిటైర్ అవ్వడానికి.. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం వెనుక చాపెల్ పాత్ర చాలా ఉందని సచిన్: బిలియన్ డ్రీమ్స పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదే చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసింది. 2007లో ఇంగ్లండ్ టూర్‌కు సెహ్వాగ్ అందుబాటులో లేడు. దీంతో ద్రవిడ్ కెప్టెన్‌గా.. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాం. ఆ తర్వాత జట్టులోని సీనియర్లకు, చాపెల్‌కు విబేధాలు రావడం.. నేను మా టీమ్‌ను సపోర్ట్ చేయడం కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. ఒక దశలో నేను తప్ప ఎవరు కెప్టెన్‌గా ఉన్నా మాకు అభ్యంతరం లేదని కొందరు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికి పరోక్షంగా కొందరు నాపై పగబట్టారు.. అందుకే కెప్టెన్ కాలేకపోయా. వాస్తవానికి 2007 టి20 ప్రపంచకప్‌కు నేను కెప్టెన్ అవ్వాల్సింది. అయితే మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల మహీ భాయ్ కెప్టెన్ కావడం.. తొలిసారే టైటిల్ గెలవడం జరిగిపోయాయి. ఇందులో ధోని భయ్యాను నేను తప్పుబట్టలేను. మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు.. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. టీమిండియాకు మూడు మేజర్ ట్రోపీలను అందించాడు. అతని కెప్టెన్సీలో ఆడడం నేను చేసుకున్న అదృష్టం'' అని చెప్పుకొచ్చాడు. ఇక యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. చదవండి: Chris Gayle: 'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..!
టీమిండియా భవిష్యత్తు టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ స్థానానికి రిషబ్ పంత్ సరైనోడని అభిప్రాయపడ్డాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్ శర్మ ఎక్కువ కాలం టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగలేడని, అందుకే ఇప్పటి నుంచే పంత్‌కు టెస్ట్ జట్టు ఉప సారధ్య బాధ్యతలు అప్పజెప్పి తీర్చిదిద్దాలని భారత సెలక్టర్లకు సూచించాడు. కొత్తగా ప్రారంభించిన ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ ఈమేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వికెట్‌కీపర్ కావడం, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించడం వంటి పలు అర్హతలను కొలమానంగా తీసుకుని పంత్‌ను భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యువీ కోరాడు. వికెట్కీపర్లు వికెట్ల వెనకాల ఉన్నా జట్టును అద్భుతంగా ముందుండి నడిపించగలరని, మైదానంలో ఉత్తమ వీక్షకులు వారేనని, ఇందుకు ధోని సరైన ఉదాహరణ అని, పంత్‌లో కూడా ధోని లక్షణాలు చాలానే ఉన్నాయని పంత్‌ను ఆకాశానకెత్తాడు. అయితే, పంత్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన వెంటనే అద్భుతాలు ఆశించకూడదని, అతనికి ఓ ఏడాది పాటు సమయం ఇవ్వాలని, ఈ విషయంలో బీసీసీఐ పంత్‌కు అండగా ఉండాలని సూచించాడు. టీమిండియా కెప్టెన్సీ చేపట్టేంత పరిపక్వత పంత్‌కు ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. క్రికెట్ చరిత్రలో సక్సెస్ఫుల్ కెప్టెన్లంతా ఆరంభంలో ఇబ్బంది పడ్డవారేనని, పంత్ కూడా కాలంతో పాటే పరిణితి చెందుతాడని వత్తాసు పలికాడు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ భారత జట్టు ఫుల్ టైమ్ సారధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న కిర్‌స్టన్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాహుల్ కాదు, పంత్ కాదు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే..!
Manoj Tiwary: టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనే అంశంపై బెంగాల్ క్రీడా మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు(పరిమిత ఓవర్లు) పగ్గాలు చేపట్టే అర్హత హార్ధిక్ పాండ్యాకు మాత్రమే ఉందని సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌కు కాని, భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా ఫోకస్ అవుతున్న రిషబ్ పంత్‌కు కాని సారధ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని, ప్రస్తుత ఐపీఎల్లో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడి గానూ అద్భుతంగా రాణిస్తున్న హార్ధిక్ పాండ్యాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ (87, వికెట్)తో చెలరేగడాన్ని ఇందుకు ఉదహరిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. మున్ముందు హార్ధిక్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని, గుజరాత్ కెప్టెన్‌గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ లక్షణాలే అతన్ని రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ను చేస్తాయని జోస్యం చెప్పాడు. మొత్తంగా ఐపీఎల్లో హార్ధిక్ ప్రదర్శనకు ఫిదా అయ్యానని ట్విటర్ వేదికగా గుజరాత్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. చదవండి: IPL 2022: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాళ్లంతా సేఫ్..! -
టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమిండియాకు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. అతని నాయకత్వంలో టీమిండియా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు గెలిచింది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మహా అయితే రెండు, మూడేళ్లు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతైనా టీమిండియాకు కొత్త కెప్టెన్ అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న ఐపీఎల్ 15వ సీజన్ ఎడిషన్‌లో చాలా మంది ఆటగాళ్లు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా పనిచేసేందుకు తమను తాము నిరూపించుకునేందుకు చక్కని అవకాశం. ఇప్పటికే కోహ్లి కెప్టెన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం రోహిత్ టీమిండియాకు ఉత్తమ కెప్టెన్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు భవిష్యత్తు టీమిండియా కెప్టెన్లుగా కనబడుతున్నారు. ఒక రకంగా ఈ ఐపీఎల్ సీజన్ అందుకు పునాది అవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. ప్రతీ ఐపీఎల్ సీజన్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. గత సీజన్ ద్వారా వెంకటేశ్ అయ్యర్ గురించి తెలిసింది. అప్పుడు అతని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నాడు. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా.. అదే ఐపీఎల్‌కు ఉన్న బ్యూటీ..'' అంటూ స్టార్స్‌స్పోర్ట్స్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలపై అభిమానులు స్పందించారు. ''ఇప్పటికైతే రోహిత్ ఉన్నాడుగా.. ఈ సమయంలో ఇది అవసరమా''.. అంటూ కామెంట్ చేశారు. టీమిండియాకు కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి ఐపీఎల్ 2022 సీజన్లో కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. రవిశాస్త్రితో పాటు రైనా కూడా కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక మార్చి 26న సీఎస్కే, కేకేఆర్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది. Here's your chance to interact with box-office gold!✨ Send in your questions for @ImRaina and @RaviShastriOfc using #AskStar!#YehAbNormalHai pic.twitter.com/rLNiRi1TJm — Star Sports (@StarSportsIndia) March 22, 2022 -
రోహిత్ శర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోహ్లి చిన్ననాటి కోచ్..!
విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందంటూనే.. సారధిగా అతనికి మున్ముందు ముసళ్ల పండగ ఉంటుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. హిట్‌మ్యాన్ ప్రశాంతమైన కెప్టెన్ అని, కెప్టెన్సీ చేపట్టిన కొద్దికాలంలోనే అద్భుత విజయాలు సాధించాడని పొగుడుతూనే.. అతను సాధించిన విజయాలు సులభంగా లభించాయని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. రోహిత్ సారధ్యంలో టీమిండియా ఇంకా సెట్ కాలేదని, ప్రతి సిరీస్‌కు జట్టును మారుస్తూ పోతుంటే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని హెచ్చరించాడు. ఇటీవల కాలంలో ఒక్కో ఆటగాడు ఒక్కో సిరీస్‌లో రాణించాడని, ఇలా రాణించిన ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెట్టడం సబబు కాదని అభిప్రాయపడ్డాడు. ఇదే పరిస్థితి కొనసాగడం కెప్టెన్‌గా రోహిత్‌కు శుభపరిణామం కాదని, ఇలా ప్రయోగాలు చేసుకుంటూ పోతే, ఏదో ఒక సిరీస్‌లో జట్టు బొక్కబోర్లా పడటం ఖాయమని, అప్పుడు రోహిత్‌కు అసలు పరీక్ష మొదలవుతుందని పేర్కొన్నాడు. జట్టు ఓపెనర్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదని, ఒక్కో సిరీస్‌కు ఆటగాళ్లను మార్చుకుంటూ పోతే టీ20 ప్రపంచకప్ నాటికి జట్టు కూర్పు విషయంలో చాలా సమస్యలు వస్తాయని హెచ్చరించాడు. రోహిత్ సారధ్యంలో జట్టు ఇంకా కుదురుకోలేదని చెప్పడానికి ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయని ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, రోహిత్ సారధ్యంలో టీమిండియా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్‌గా న్యూజిలాండ్ టీ20 సిరీస్‌తో మొదలైన టీమిండియా విజయపరంపర.. తాజాగా ముగిసిన శ్రీలంక సిరీస్ వరకు అప్రతిహతంగా కొనసాగింది. రోహిత్ నేతృత్వంలో టీమిండియా మార్చి 4 నుంచి లంకతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. చదవండి: భీకర ఫామ్‌లో కేకేఆర్ ప్లేయర్..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం -
రోహిత్ శర్మ.. పట్టిందల్లా బంగారమే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ బంగారం ఏంటో తెలుసా.. డీఆర్ఎస్లు. అవును రోహిత్ నిజంగానే రివ్యూలకు రారాజుగా మారిపోతున్నాడు. మన టీమిండియా కెప్టెన్లకు రివ్యూలు ఎక్కువగా కలిసి రాలేదు. డీఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ధోని, కోహ్లిలకు రివ్యూలు పెద్దగా కలిసిరాలేదు. అడపాదడపా కలిసొచ్చాయే తప్ప నష్టమే ఎక్కువసార్లు జరిగింది. కోహ్లి విషయంలో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే రోహిత్ విషయంలో పూర్తిగా రివర్స్ అయింది. తాను ఎప్పుడు రివ్యూకు వెళ్లినా అనుకూలంగానే వస్తుంది. కోహ్లి గైర్హాజరీలో రోహిత్ పలుమార్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్‌కు రివ్యూలు అనుకూలంగానే వచ్చేవి. ఇక తాజాగా పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత రోహిత్‌కు రివ్యూలు మరింతగా కలిసివస్తున్నాయి. చదవండి: ఫ్యాబ్-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం! విండీస్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో రివ్యూపై తన నిర్ణయాలతో రోహిత్ అందరిని ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో బ్రూక్స్ విషయంలో పంత్ వద్దన్నా కోహ్లి సలహాతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఫలితం అనుకూలంగా వచ్చింది. తాజాగా రెండో వన్డేలోనూ డారెన్ బ్రావో విషయంలో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. పంత్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లి సక్సెస్ కావడంతో అభిమానులు రోహిత్‌ను రివ్యూల రారాజుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌పై అభిమానులు చేస్తున్న మీమ్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మీరు ఒక లుక్కేయండి. చదవండి: Rohit Sharma-Pant: పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్యూకు వెళ్లిన రోహిత్.... ఫలితం Decision by Rohit Sharma 🔥#INDvsWI #RohitSharma #INDvWI pic.twitter.com/SoVBnNPsEw — Asif Ali (@DargaAsifAli) February 9, 2022 4 out of 4 for ROHIT REVIEW SYSTEM in this ODI series. #INDvWI #INDvsWI #RohitSharma — Dr. Cric Point (@drcricpoint) February 9, 2022 4th consecutive successful drs for captain Rohit sharma inside 2 odi's After took permanent Captainship. Rohit review system#INDvWI #INDvsWI — Somnath chakraborty ⚽🏏 (@somnath20094585) February 9, 2022 -
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు ఖరారు..!
టీమిండియా నూతన టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైంది. ఈ విషయాన్ని బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ ఫుల్‌టైమ్ సారధిగా వ్యవహరించనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో టెస్ట్ కెప్టెన్సీ రేసులో రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రాల పేర్లు వినిపించినప్పటికీ.. అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ హిట్ మ్యాన్ వైపే మొగ్గి చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ నేతృత్వంలో టీమిండియా స్వదేశంలో విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా నిన్న జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రోహిత్(60) అర్ధసెంచరీతో రాణించి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. చదవండి: IPL 2022: హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ జట్టుకు సంబంధించి కీలక అప్డేట్ -
'ఆరంభానికి ముందు ఈ నిరీక్షణ తట్టుకోలేకపోతున్నా'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 10 వారాల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు బ్యాట్స్‌మన్‌గా.. ఓపెనర్‌గా మాత్రమే సేవలందించిన హిట్‌మ్యాన్‌కు కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతలు తోడయ్యాయి. విండీస్‌తో జరగనున్న తొలి వన్డే టీమిండియాకు 1000వ మ్యాచ్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు వన్డేల్లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్న రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీలో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోను షేర్ చేస్తూ.. ''ప్రారంభానికి ముందు ఈ వెయింటింగ్‌ను తట్టుకోలేకపోతున్నా..'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. చదవండి: మొన్న కోహ్లిని అలా.. ఇప్పుడు ఇలా.. మరో వివాదంలో గంగూలీ ఇక సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0తో ఓడిపోయింది. రోహిత్ గైర్హాజరీలో తొలిసారి కెప్టెన్‌గా విధులు నిర్వర్తించిన కేఎల్ రాహుల్‌కు పీడకలగా మిగిలిపోయింది. అయితే విండీస్‌తో సిరీస్ టీమిండియా తన సొంతగడ్డపై ఆడుతుండడంతో మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక అందరికళ్లు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత మంచి ఇన్నింగ్స్‌లతో ఫామ్‌లోనే కనిపిస్తున్న కోహ్లి ఈ సిరీస్‌లోనైనా సెంచరీ చేస్తాడా లేదా అని ఎదురుచేస్తున్నారు. ఇక మొదట మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్న విండీస్.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన విండీస్ ఆత్మవిశ్వాసంతో టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు..!
Mohammed Shami Comments On Team India Test Captaincy: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. స్టార్లతో నిండిన భారత జట్టును ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారని స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ప్రతిపాదన తన వరకు వస్తే తప్పక స్వీకరిస్తానని.. భారత సారధ్య బాధ్యతలపై మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ప్రస్తుతానికి తన దృష్టంతా మరింత మెరుగ్గా రాణించడంపైనే ఉందంటూ మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. జట్టుకు ఉపయోగపడే ఏ పనికైనా తాను సిద్ధమేనంటూ.. కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలకు పరోక్ష సంకేతాలు పంపాడు. టీమిండియాకు ప్రాతనిధ్యం వహించే అవకాశం రావడమే గొప్ప వరమని, దాన్ని కాపాడుకునేందుకు వంద శాతం కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లి టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్-2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటను బయల్దేరేముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదంటూ కోహ్లి వన్డే కెప్టెన్సీని లాక్కుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. తదనంతర పరిణామాల్లో కోహ్లి.. టెస్ట్ కెప్టెన్సీకి సైతం గుడ్‌బై చెప్పడంతో ప్రస్తుతానికి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ముందుండగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, వికెట్‌కీపర్ రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాజాగా షమీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు అతను కూడా రెడీగానే ఉన్న విషయం స్పష్టమవుతుంది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న షమీ.. ఆటగాడిగా ఇదివరకే తనను తాను ప్రూవ్ చేసున్నాడు. టెస్ట్‌ల్లో 209 వికెట్లు, వన్డేల్లో 148, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టి భారత దేశపు విజయవంతమైన పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం సెలెక్టర్లు షమీకి విశ్రాంతినిచ్చారు. అందుకు కొనసాగింపుగా విండీస్‌తో సిరీస్ కోసం కూడా అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: IND Vs WI: 6వ స్థానానికి అతనిని మించిన మొనగాడు లేడు.. -
"కోహ్లిని బలవంతంగా తప్పుకునేలా చేశారు.." పాక్ మాజీ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Shoaib Akhtar On Virat Kohli: టీమిండియా కెప్టెన్సీ వివాదంపై పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏడేళ్లు టీమిండియాను విజయవంతంగా నడిపించిన కోహ్లిని బలవంత పెట్టి మరీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్న అక్తర్.. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. అసలు కోహ్లికి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనే లేదని, కొందరు బలవంత పెట్టి మరీ అతన్ని తప్పుకునేలా చేశారని సంచలన ఆరోపణలు చేశాడు. ఏది ఏమైనప్పటికీ.. కోహ్లి ప్రస్తుతం టీమిండియాలో సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సిందేనని, అతను బ్యాటింగ్ ఫామ్ తిరిగి అందుకోవాలని, లేకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కోహ్లి ప్రస్తుత తరంలో గొప్ప బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని, అయినప్పటికీ జట్టులో కొనసాగాలంటే కచ్చితంగా రాణించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై మాట్లాడుతూ.. బుమ్రాకు సారధ్య బాధ్యతలు అప్పచెబితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం అతను టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఫైరవుతున్న ఫ్యాన్స్ -
కోహ్లికి షోకాజ్ నోటీసులు.. స్పందించిన గంగూలీ
No Plan To Show Cause Virat Kohli Says Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలనుకున్నానని జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇవాళ స్పందించాడు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశాడు. అసలు కోహ్లికి నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనే తనకు లేదని వివరణ ఇచ్చాడు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు, అతన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అడ్డుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై గంగూలీ స్పందించడంతో ప్రచారానికి తెరపడింది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. దీనిపై అప్పట్లో పెద్ద రాద్దాంతమే జరిగింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లిని వారించామని బీసీసీఐ.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని కోహ్లి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాతావరణాన్ని హీటెక్కించారు. దీంతో కోహ్లి- బీసీసీఐ మధ్య పెద్ద అగాదం ఏర్పడిందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి.. టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో ఈ వార్తలు నిజమేనని బహిరంగ చర్చ కూడా సాగింది. ఇదే సమయంలో గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ! -
కోహ్లి దిగిపోయాడు.. రోహిత్ వచ్చేస్తున్నాడు..!
West Indies Tour of India 2022: విరాట్ కోహ్లి.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ వైరలవుతోంది. తొడ కండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్.. త్వరలో విండీస్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడన్న ఈ వార్త క్రికెట్ వరాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదని, అందులో భాగంగానే కోహ్లి టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం.. ఆ వెంటనే రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని క్రికెట్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కోహ్లి సారధ్యంలో ఆడడం ఇష్టం లేని రోహిత్.. ఉద్దేశపూర్వకంగానే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు డుమ్మా కొట్టాడని, కోహ్లి అన్ని ఫార్మాట్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడని రోహిత్‌కు ముందుగానే సమాచారం ఉందని, ఆ ప్రకారమే అతను గేమ్ ప్లాన్‌ను అమలు చేస్తున్నాడని కోహ్లి అభిమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బీసీసీఐ అధ్యక్షడు గంగూలీ, కార్యదర్శి జై షాల అండదండలుండడంతో రోహిత్ ఎప్పుడు కావాలంటే అప్పుడు జట్టులోకి వచ్చిపోతున్నాడని, తొడ కండరాల గాయం అన్నది కేవలం సాకు మాత్రమేనని, కోహ్లిని పూర్తిగా కెప్టెన్సీ నుంచి తొలగించాకే జట్టులోకి రావాలని రోహిత్ ప్లాన్ వేశాడని, అందుకు అనుగణంగానే అన్నీ జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు తొలుత చేతికి గాయమైందని చెప్పిన రోహిత్.. ఆ తర్వాత కండరాలు పట్టేశాయని ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని, ఏదో బయటికి చెప్పుకోలేని కారణంగానే రోహిత్.. కోహ్లిపై పరోక్షంగా పగ తీర్చుకుంటున్నాడని వాపోతున్నారు. ఇదిలా ఉంటే, భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్య వన్డే, టీ సిరీస్‌లు జరగనున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6న తొలి వన్డే, 9న రెండో వన్డే, 12న మూడో వన్డే జరగనుండగా.. ఫిబ్రవరి 15న తొలి టీ20, 18న రెండోది, 20న మూడో టీ20 జరగనున్నాయి. చదవండి: దేశం కోసం ఆడేటప్పుడు తగ్గేదేలే.. బుమ్రాతో వాగ్వాదంపై సఫారీ బౌలర్ స్పందన -
కోహ్లి వారసుడి ఎంపికపై బీసీసీఐ అప్డేట్..!
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్ అంటూ కొందరు.. కేఎల్ రాహుల్ లేదా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి వారసుడి ఎంపికపై అప్డేట్ ఇచ్చాడు. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై ఇప్పటికవరకు ఎలాంటి చర్చ జరగలేదని, అందుకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. కొత్త కెప్టెన్ విషయమై బీసీసీఐ పూర్తి క్లారిటీతో ఉందని, నిర్ణీత సమయంలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుందని, సెలెక్షన్ కమిటీ సిఫార్సు తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టం చేశాడు. కొత్త కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ అంశంపై మీడియా ప్రశ్నించగా.. సహజంగానే ఈ పదవికి పోటీ చాలానే ఉంటుందంటూ మాట దాట వేశాడు. ఇదిలా ఉంటే, టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లతో పాటు రిషబ్ పంత్ పేరును సైతం కొందరు మాజీలు సిఫార్సు చేస్తున్నారు. పంత్‌కు అతని వయసు అడ్వాంటేజ్‌గా మారగా.. రాహుల్, రోహిత్‌లకు ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం అనూకూలంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ నాటికి టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ ఎంపిక జరగనుంది. చదవండి: Viral Pic: పాపం కోహ్లి.. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు..! -
Kohli: అప్పుడు ‘కెప్టెన్’కు ఏడాదికి 180 కోట్లు.. ఒక్కో పోస్టుకు 5 కోట్లు.. మరి ఇప్పుడు
Virat Kohli Quit Test Captaincy: టీమిండియా ‘కెప్టెన్’గా.. స్టార్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్‌మెషీన్‌గా పేరొందిన కింగ్ కోహ్లి బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే. సంపన్న బోర్డుకు చెందిన సారథిగా అతడికి అభిమానుల్లో ఉన్న చరిష్మా దృష్ట్యా పలు వాణిజ్య సంస్థలు కోహ్లిని అంబాసిడర్ నియమించుకున్నాయి. ఇందుకు కోట్లలో పారితోషికం చెల్లిస్తున్నాయి. మరి.. ఇప్పుడు కింగ్ కోహ్లికి ‘కెప్టెన్’ అన్న ట్యాగ్ లేదు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తనకు తానుగా తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా చేతిలో భంగపాటు నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. బ్యాటర్‌గా కూడా కోహ్లి ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ ‘పరుగుల యంత్రం’ సెంచరీ చేసి ఎన్నాళ్లయ్యిందో!! మరి ఇప్పుడు కూడా కోహ్లి బ్రాండ్ వాల్యూ మునుపటిలాగే ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఏడాదికి 180 కోట్లు.. పారిశ్రామిక వర్గాల అంచనా ప్రకారం వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి 2021 ఏడాదికి గానూ 180- 200 కోట్ల రూపాయల మేర ఆర్జించాడు. సుమారు 30 బ్రాండ్లకు ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న అతడు ఈ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి వల్ల సదరు కంపెనీలకు చేకూరిన ప్రయోజనాల గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. కానీ... అతడి క్రేజ్‌ను క్యాష్ రూపంలోకి మలచుకోవడంలో సదరు కంపెనీలు సఫలమయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కెప్టెన్‌గా వైదొలిగినా... ఆటగాడిగా కొనసాగుతానన్న కోహ్లి ప్రకటన కారణంగా ఇప్పుడప్పుడే అవి అతడితో బంధాన్ని తెంచుకోవు. ముందు కుదిరిన ఒప్పందాల పరంగానైనా కోహ్లితో కలిసి ముందుకు సాగాల్సిందే. కాబట్టి టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు కోహ్లికి వచ్చే నష్టమేమీ లేదు. అతడి ఇమేజ్ వల్లే! ఈ విషయాల గురించి స్పోర్టీ సెల్యూషన్స్ సీఈఓ ఆశిష్ చద్దా ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దూకుడైన ఆటగాడిగా కోహ్లికి ఉన్న క్రేజ్ కంపెనీలకు వరంలాంటిదే. తను భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ధోని చాలా కాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరి అతడి బ్రాండ్ వాల్యూ తగ్గలేదు కదా. కోహ్లి విషయంలోనూ అంతే. యువతరానికి కోహ్లి ఐకాన్ లాంటివాడు. తను టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడు. కాబట్టి కంపెనీలు అతడిని వదులుకునే అవకాశం లేదు’’ అని చెప్పుకొచ్చారు. మరో అనలిస్టు సంతోష్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లికి ఉన్న అశేష అభిమానుల కారణంగా అతడు ఎండార్స్ చేసే కంపెనీలు కోట్లలో లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు కూడా కోహ్లి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి బ్రాండింగ్‌లో అతడి హవా కొనసాగుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదన (అంచనా) 2021లో ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదించిన మొత్తం: 179 కోట్ల రూపాయలు. ఒక్కరోజు ఎండార్స్ చేయడానికి కోహ్లి ఫీజు: 7- 8 కోట్లు. ఇప్పటి వరకు కోహ్లి దాదాపు 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా కోహ్లి ఆర్జించే మొత్తం: 5 కోట్లు. డఫ్స్ అండ్ ఫెల్్ప్స డేటా ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ: 237.7 మిలియన్ డాలర్లు చదవండి: India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అతడే!.. అప్పుడే బీసీసీఐ ప్రకటన -
Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..!
దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం సారధ్య బాధ్యతలకు గుడ్‌బై చెబుతూ సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లి.. తాను తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాన్ని ట్విటర్లో పోస్ట్ చేసిన లేఖలో పొందుపరిచాడు. జట్టును సరైన దిశలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందించానన్న కోహ్లి.. తన ఏడేళ్ల టెస్ట్ కెప్టెన్సీ కెరీర్లో వందకు 120 శాతం కష్టపడ్డానని, అలా చేయలేని పక్షంలో కెప్టెన్ హోదాలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నానని అన్నాడు. ఆశించిన ఫలితాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపాడు. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. జట్టు కోసం నిజాయితీగా కష్టపడ్డానని, జట్టుకు కరెక్ట్ కానిది తాను ఎట్టి పరిస్థితుల్లో చేయలేనని, తన నిర్ణయంపై పూర్తి క్లారిటీతో ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ధోనిల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా, 2014లో ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. 68 మ్యాచ్‌ల్లో టీమిండియా సారధిగా వ్యవహరించి 40 మ్యాచ్‌ల్లో జట్టును విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో ఎన్నో అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు సాధించి, మరే ఇతర భారత కెప్టెన్ సాధించనన్ని టెస్ట్ విజయాలు సాధించాడు. చదవండి: విరాట్ కోహ్లి సంచలన ప్రకటన.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై