వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ.. ముదురుతున్న వివాదం | BCCI Dismisses Kohli Stance Over Lack Of Communication In ODI Captaincy Issue | Sakshi
Sakshi News home page

Kohli-BCCI: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ..!

Published Wed, Dec 15 2021 8:05 PM | Last Updated on Wed, Dec 15 2021 8:28 PM

BCCI Dismisses Kohli Stance Over Lack Of Communication In ODI Captaincy Issue - Sakshi

ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్సీ అంశంపై బీసీసీఐ బాస్‌ తనతో ముందస్తు సంప్రదింపులు జరపలేదని, కేవలం గంటన్నర ముందే తనను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారని టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంచలన వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే బీసీసీఐ స్పందించింది. గంగూలీని ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్‌ బోర్డు తోసిపుచ్చింది. వన్డే ఫార్మాట్‌ నాయకత్వ మార్పుపై సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ కోహ్లితో ముందుగానే చర్చించాడని పేర్కొంది.  

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే గంగూలీ సహా బీసీసీఐ అధికారులంతా కోహ్లిని వారించారని.. అయినప్పటికీ అతను పట్టువీడకుండా టీ20 పగ్గాలను వదులుకున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పామన్నది పూర్తిగా అవాస్తవమని, వైట్‌ బాల్‌ ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లుంటే సమస్యలొస్తాయని కోహ్లితో ముందే డిస్కస్‌ చేశామని, ఈ అంశంపై కోహ్లి వైపు నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సి వచ్చిందని సదరు అధికారి వివరించాడని సమాచారం.  
చదవండి: రిటైర్మెంట్‌పై స్పందించిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement