కోహ్లితో పోలిస్తే అతను బెటర్‌.. వన్డే కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ ఎంపిక సరైందే..! | Salman Butt Explains Why KL Rahul, Not Virat Kohli As Team India ODI Captain Against South Africa | Sakshi
Sakshi News home page

టీమిండియా వన్డే కెప్టెన్‌ ఎంపికపై పాక్‌ మాజీ కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sat, Jan 1 2022 10:15 PM | Last Updated on Sat, Jan 1 2022 10:15 PM

Salman Butt Explains Why KL Rahul, Not Virat Kohli As Team India ODI Captain Against South Africa - Sakshi

Salman Butt: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ ఎంపికపై పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ను ఎంపిక చేస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కాకుండా కేఎల్‌ రాహుల్‎వైపు మొగ్గుచూపడం సమర్ధనీయమని పేర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ విషయంలో కోహ్లితో పోలిస్తే బీసీసీఐకి రాహులే బెటర్‌ అప్షన్‌ అని తెలిపాడు. ఈ విషయమై బీసీసీఐ విధానాన్ని అతను ప్రశంసించారు. 

రెగ్యులర్‌ వైస్ కెప్టెన్‌ను స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం అనవాయితినేనని, మరోవైపు రాహుల్‌ సామర్ధ్యంపై బీసీసీఐకి కూడా పూర్తి నమ్మకం ఉందని, ఐపీఎల్‌లో రాహుల్ ఈ విషయాన్ని బుజువు చేశాడని తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ సందర్భంగా యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసలతో ముంచెత్తిన బట్‌.. ధోని హయాంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశాడు. టీమిండియా చిన్న దేశాలతో తలపడినప్పుడు.. బీసీసీఐ యువకులకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేదని వివరించాడు. రాహుల్‌కి కెప్టెన్సీ అప్పజెప్పడంతో పాటు బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం కూడా సరైందేనని బట్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: కోహ్లి పేరు పక్కన 'అది' లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement