ODI captaincy
-
ఆసీస్ కెప్టెన్‌గా వార్నర్.. ఫించ్ మద్దతు కూడా ఇతనికే..!
ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న డిస్కషన్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కొందరేమో టెస్ట్ సారధి పాట్ కమిన్స్‌కే వన్డే కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని అంటుంటే.. మరికొందరేమో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరును సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉండేందుకు వార్నర్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్‌పై జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఉన్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏ విధంగా స్పందిస్తుందో వేచి చేడాల్సి ఉంది. సమస్యను పరిష్కరించుకునేందుకు (బ్యాన్ ఎత్తివేత) డేవిడ్ భాయ్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో అతనికి తాజాగా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అలాగే పలువురు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫించ్ స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే వార్నర్ కూడా ఎదురుచూస్తున్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మెగా టోర్నీ తర్వాత ఫించ్ పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటే.. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మొత్తం కోసం పావులు కదపాలన్నది వార్నర్ ప్లాన్‌గా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వార్నర్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
వెస్టిండీస్ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్
వెస్టిండీస్ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొలార్డ్ స్థానంలో పూరన్ విండీస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవలే కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై విండీస్ క్రికెట్ బోర్డు పలు దఫాలు చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కాగా నికోలస్ పూరన్ ఐసీసీ టి20 ప్రపంచకప్ 2022తో పాటు, 2023 వన్డే ప్రపంచకప్ వరకు విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడు. ఇక షెయ్ హోప్‌ను వన్డే వైస్‌కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక పూరన్ 2016లో విండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పూరన్ 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టి20ల్లో 1193 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు సాధించిన పూరన్.. టి20 క్రికెట్లో 8 అర్థసెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న పూరన్ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పూరన్‌ను ఎస్ఆర్హెచ్ మెగావేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన రేటుకు న్యాయం చేస్తున్న పూరన్ ఎస్ఆర్హెచ్ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. చదవండి: Kohli-Viv Richards: విండీస్ దిగ్గజానికి క్లిష్ట పరిస్థితి.. కోహ్లి త్యాగం! -
'కోహ్లి, గంగూలీ ఒకసారి ఫోన్లో మాట్లాడుకోండి'
కోహ్లి వన్డే కెప్టెన్సీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యల పట్ల బీసీసీఐ అధ్యక్షుని హోదాలో షోకాజ్ నోటీసులు ఇవ్వబోయాడంటూ వార్తలు వచ్చాయి. గంగూలీ ఆ వార్తల్లో నిజం లేదంటూ తానే స్వయంగా ఖండించాడు. దీంతో ఇప్పటికీ కోహ్లి-బీసీసీఐ వివాదం ఇంకా అలానే నడుస్తోందని పలువురు భావిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా దిగ్గజ ఆటగాడు.. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరోసారి స్పందించాడు. '' కోహ్లి, గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వాళ్లిద్దరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటే మంచిది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు తొందరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నాడు. చదవండి: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఒక్కరోజు మీడియా ముందుకు వచ్చిన కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై సంచలన ఆరోపణలు చేశాడు. టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు తనను ఎవరు వద్దనలేదని.. గంగూలీ తన వద్దకు వచ్చి అడిగాడన్న వార్తల్లో కూడా నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. తనకు చెప్పకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ పేర్కొన్నాడు. ఇక తాజాగా సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ సీనియర్ ఆటగాడిగా ఉన్న కోహ్లి.. ఇకపై బ్యాటింగ్‌లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడు. కోహ్లి సెంచరీ చేసి మూడేళ్లు కావొస్తుండడంతో అతని ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో కోహ్లి తన సెంచరీల కొరత తీర్చుకుంటాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కోహ్లి ఇది మంచి పద్దతి కాదేమో! -
కోహ్లితో పోలిస్తే అతను బెటర్.. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక సరైందే..!
Salman Butt: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ను ఎంపిక చేస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని కాకుండా కేఎల్ రాహుల్‌వైపు మొగ్గుచూపడం సమర్ధనీయమని పేర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ విషయంలో కోహ్లితో పోలిస్తే బీసీసీఐకి రాహులే బెటర్ అప్షన్ అని తెలిపాడు. ఈ విషయమై బీసీసీఐ విధానాన్ని అతను ప్రశంసించారు. రెగ్యులర్ వైస్ కెప్టెన్‌ను స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం అనవాయితినేనని, మరోవైపు రాహుల్ సామర్ధ్యంపై బీసీసీఐకి కూడా పూర్తి నమ్మకం ఉందని, ఐపీఎల్లో రాహుల్ ఈ విషయాన్ని బుజువు చేశాడని తన యూట్యూబ్ ఛానల్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ సందర్భంగా యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసలతో ముంచెత్తిన బట్.. ధోని హయాంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశాడు. టీమిండియా చిన్న దేశాలతో తలపడినప్పుడు.. బీసీసీఐ యువకులకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేదని వివరించాడు. రాహుల్‌కి కెప్టెన్సీ అప్పజెప్పడంతో పాటు బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం కూడా సరైందేనని బట్ అభిప్రాయపడ్డాడు. చదవండి: కోహ్లి పేరు పక్కన 'అది' లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది.. -
కోహ్లి పేరు పక్కన 'అది' లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది..
Aakash Chopra: జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత బృందాన్ని బీసీసీఐ శుక్రవారం(డిసెంబర్ 31, 2021) ప్రకటించింది. పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ భారత వన్డే జట్టుకు నాయకత్వం వహించనుండగా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో జట్టులో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానాన్ని ఉద్దేశించి టీమిండియా మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో కోహ్లి పేరు పక్కన "కెప్టెన్" అనే పదం లేకపోవడం ఇబ్బందికరంగా అనిపించిందని, ఇలా జరగడం చాలా కాలం తర్వాత చూసానని, ఈ పరిణామం నిజంగా తనను బాధించిందంటూ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా వ్యాఖ్యానించాడు. కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి టీమిండియా టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. బీసీసీఐ అతని స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన భారత క్రికెట్ బోర్డు.. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..! -
'కోహ్లి మాటల్లో నిజం లేదు..' చేతన్ శర్మ కౌంటర్
కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపుపై ఎంత పెద్ద వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు వచ్చి వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పుడు తననెవరు సంప్రదించలేదని.. గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాడు. కోహ్లి ఘాటూ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. అయితే ఇదే విషయాన్ని గంగూలీ వద్ద ప్రస్తావించగా.. అంతా బీసీసీఐ చూసుకుంటుందని చెప్పి సమాధానం దాటవేశాడు. ఈలోగా టీమిండియా సౌతాఫ్రికా టూర్ ఆరంభం కావడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్ తాజాగా కోహ్లి కెప్టెన్సీ విషయంపై టీమిండియా చీఫ్ సెలక్టెర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో తనను ఎవరు సంప్రదించలేదన్న కోహ్లి మాటల్లో నిజం లేదు. వాస్తవానికి బీసీసీఐలోని ప్రతి సెలెక్టర్ సహా ఆఫీస్ బెరర్స్, సెలక్షన్ కమిటీ కన్వీనర్, ఇతర స్టాఫ్ మొత్తం కోహ్లిని కలిసి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరాం. టి20 ప్రపంచకప్ ముగిసేంత వరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకునే విషయాన్ని ప్రకటించొద్దని తెలిపాం. కానీ టి20 ప్రపంచకప్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ విషయంలో బోర్డు సభ్యులంతా మరోసారి కోహ్లిని పునరాలోచించమన్నాం. అయితే టి20 ఫార్మాట్లో కెప్టెన్సీ వదిలేస్తే వన్డే ఫార్మాట్లో కూడా వదిలేయాలని కోహ్లికి ఆ సమయంలో చెప్పాలనుకోలేదు. దానిని కోహ్లి అపార్థం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత అన్నీ ఆలోచించి కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించాం. ఉద్దేశపూర్వకంగా మాత్రం చేయాలనుకోలేదు. అంతిమంగా టీమిండియాకు ఎవరు కెప్టెన్‌గా ఉన్నా సరే.. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. ఇక వన్డే కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లికి, బీసీసీఐకి మధ్య ఎలాంటి వివాదం లేదు.. దయచేసి ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ -
కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!?
విరాట్ కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా కోహ్లి కెప్టెన్సీ వివాదంపై పెద్ద చర్చ నడిచింది. టి20ల్లో తనంతట తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. వన్డేల్లో మాత్రం సెలక్టర్లు అతనికి అవకాశమివ్వకుండానే తొలగిస్తున్నట్లు చెప్పారు. దీంతో కోహ్లి అవమానభారంతో రగిలిపోతున్నాడని.. ఏకంగా పరిమిత, టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతోపాటు రోహిత్ కెప్టెన్సీలో కోహ్లి ఆడడానికి ఇష్టపడడం లేదంటూ రూమర్లు వచ్చాయి. చదవండి: Virat Kohli: కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు.. వాళ్లకేం తెలుసు! ఇవన్నీ చూసిన కోహ్లి సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చుకున్నాడు. మీడియా సమావేశంలో కోహ్లి గంగూలీ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం కోహ్లి కెప్టెన్సీ వివాదం పక్కనబెట్టి ఆటపై దృష్టి పెట్టాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు హితబోధ చేశారు. అయితే అందరు స్పందింస్తున్నప్పటికి ఒక మాజీ క్రికెటర్ మాత్రం ఇంతవరకు కోహ్లి కెప్టెన్సీ వివాదంపై స్పందించలేదు. అతనే మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. వాస్తవానికి సెహ్వాగ్ ఏవైనా వివాదాలు చోటుచేసుకుంటే వెంటనే స్పందించే అలవాటు ఉంది. అది ఫన్నీవేలో.. లేక.. విమర్శలు సందింస్తూగానీ.. తన ట్విటర్, యూట్యూబ్ చానెల్లో సందేశాలివ్వడం చేస్తుండేవాడు. మరి అలాంటి సెహ్వాగ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడంటూ క్రికెట్ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. '' సెహ్వగ్ కనిపించడం లేదు.. మీకు ఎక్కడున్నాడో తెలుసా''.. '' కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై రచ్చ జరుగుతుంటే సెహ్వాగ్ ఏం పట్టనట్లు ఉన్నాడు..''.. '' సెహ్వాగ్‌కు ఏమైంది.. '' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి కాగా సెహ్వాగ్ ఈ విషయంలో స్పందించకపోవడంపై ఒక ముఖ్యకారణముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ కోహ్లి గంగూలీ పేరు ప్రస్తావించాడని.. అందుకే సెహ్వాగ్ ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎందుకంటే గంగూలీకి, సెహ్వాగ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. సెహ్వాగ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో అత్యంత ఎక్కువగా ప్రోత్సహించింది గంగూలీనే. అతను విధ్వంసకర ఓపెనర్‌గా మారడంలో గంగూలీ కీలకపాత్ర పోషించాడు. ఈ అభిమానంతోనే కోహ్లి కెప్టెన్సీ వివాదంపై గంగూలీకి వ్యతిరేకంగా సెహ్వాగ్ వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడడం లేదని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎంతో చలాకీగా ఉండే సెహ్వాగ్‌లో ఆ జోష్ కనిపించడం లేదని అభిమానులు వాపోయారు. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' -
'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే'
Sunil Gavaskar Comments About Kohli Rifts With BCCI.. కోహ్లి వివాదాన్ని ముగించేందుకు సరైన వ్యక్తి గంగూలీ మాత్రమేనని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘నాకు తెలిసి కోహ్లి బీసీసీఐని ఉద్దేశించి కాకుండా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశాడు. తాను కోహ్లితో మాట్లాడాడా లేదా అనేది సౌరవ్ మాత్రమే చెప్పగలడు. ఒకే విషయంపై రెండు వేర్వేరు వ్యాఖ్యలు ఎలా వచ్చాయన్నది అతనికే తెలియాలి’ అని గావస్కర్ అన్నాడు. చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు అయినా తనను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు చీఫ్ సెలక్టర్ చెప్పడంతో కోహ్లి ఇబ్బంది పడాల్సిందేమీ లేదని, ఎవరి ద్వారానో తెలిసే బదులు సరైన రీతిలోనే అతనికి సమాచారం లభించిందని సన్నీ చెప్పాడు. బోర్డు అధ్యక్షుడు, కెప్టెన్ మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఇది సరైన సమయం కాదని...కీలక పర్యటనకు ముందు ఇలాంటిది మంచిది కాదని మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఎవరు సరైనవాడో, ఎవరిది తప్పో మున్ముందు తేలుతుందని, ప్రస్తుతానికి అన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టి పెట్టాలని అతను సూచించాడు. ‘మేం చూసుకుంటాం’ న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీనుంచి తనను తొలగించడం, టి20 కెప్టెన్సీనుంచి తాను తప్పుకున్న క్రమంలో జరిగిన ఘటనల గురించి విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించేందుకు నిరాకరించాడు. ఏకవాక్యంలో అతను తన స్పందన తెలియజేశాడు ‘ప్రస్తుతం దీ నిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ఎలాంటి మీడియా సమావేశం కూడా నిర్వహించం. ఈ అంశాన్ని బీసీసీఐకి వదిలేయండి. అన్నీ మేం చూసుకుంటాం’ అని గంగూలీ స్పష్టం చేశాడు. తాజా పరిణామాలపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు బోర్డు స్పందిస్తే అది ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మౌనం వహించడమే ఉత్తమమనే ఆలోచనతో బీసీసీఐ ఉంది. చదవండి: Virat Kohli-Sourav Ganguly: కోహ్లిపై మాట దాటేసిన దాదా.. కారణం అదేనా? -
విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Amit Mishra: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌లాగే తనకు కూడా అన్యాయం జరిగిందని అర్ధం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆయన ఫైరయ్యాడు. టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. బీసీసీఐ అకారణంగా వారిపై వేటు వేసిందని పరోక్షంగా తన గురించిన తెస్తూ బీసీసీఐపై మండిపడ్డాడు. బీసీసీఐకి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదని, గతంలో తనతో సహా చాలామంది క్రికెటర్ల విషయంలోనూ ఇలానే వ్యవహరించిదని సంచలన కామెంట్స్ చేశాడు. జట్టులో చోటు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడే ప్లేయర్లకు తమను జట్టులో నుంచి ఎందుకు తొలగిస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుందని అన్నాడు. ఆటగాళ్ల ఉద్వాసనకు గల కారణాలు తెలిస్తే.. ఆ విభాగంలో మెరుగయ్యేందుకు కృషి చేస్తారని పేర్కొన్నాడు. కాగా, అమిత్ మిశ్రా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సత్తా చాటినా అతన్ని జట్టులో నుంచి తొలగించారు. అనంతరం 2017లో తిరిగి జట్టులోకి వచ్చిన అతను.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించినప్పటికీ.. అకారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. 39 ఏళ్ల అమిత్ మిశ్రా భారత జట్టు తరఫున 22 టెస్ట్‌ల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 8 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాలో కుంబ్లే, హర్భజన్, అశ్విన్ హవా నడుస్తుండటంతో అతను జట్టులోకి వస్తూ, పోతూ ఉండేవాడు. ఐపీఎల్లో మలింగ(170) తర్వాత 166 వికెట్లతో లీగ్‌లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నప్పటికీ.. టీమిండియాలో అతనికి తగినన్ని అవకాశాలు దక్కలేదు. చదవండి: Ashes 2nd Test: పాపం వార్నర్.. వందేళ్లలో ఒకే ఒక్కడు -
ఆ జట్టుకు వన్డే, టెస్ట్ కెప్టెన్ ఒకరే.. మరి కోహ్లి విషయంలో ఎందుకు కుదరదు..?
Virat Kohli Vs Sourav Ganguly: గత కొంతకాలంగా భారత క్రికెట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీమిండియాలో విరాట్ కోహ్లి ఒంటరి అయ్యాడన్న విషయం స్పష్టమవుతోంది. తొలుత కోహ్లిని.. టీ20 సారథ్య బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకునేలా చేసి, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీకి ఎసరు పెట్టిన బీసీసీఐ పెద్దలు.. ఇప్పుడు తామేమీ ఎరగము.. తప్పంతా కోహ్లిదే అన్నట్లుగా కామెంట్లు చేస్తుండటంపై కోహ్లి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఇద్దరు కెప్టెన్లుంటే సమస్యలొస్తాయంటూ కుంటిసాకులు చూపుతున్న బీసీసీఐకి మహిళా క్రికెట్లో ఏం జరుగుతోందో తెలియదా అంటూ ధ్వజమెత్తుతున్నారు. భారత మహిళా జట్టులో టీ20 ఫార్మాట్‌కి హర్మాన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉంటే.. వన్డే, టెస్ట్‌లకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న విషయం గంగూలీ అండ్ కోకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళల క్రికెట్లో రాని సమస్యలు.. పురుషుల క్రికెట్లో వస్తాయా అంటూ నిలదీస్తున్నారు. గంగూలీ, జై షా ఉద్దేశపూర్వకంగానే కోహ్లిని టార్గెట్ చేశారని, అందుకు వైట్‌బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లుంటే సమస్యలొస్తాయని, కోహ్లి ఇంతవరకు ఐసీసీ ట్రోఫీని గెలవలేదని సాకులు చూపుతున్నారని ఫైరవుతున్నారు. కోహ్లిని గద్దె దించడంలో భాగంగానే ద్రవిడ్‌కు టీమిండియాహెడ్ కోచ్ బాధ్యతలు అప్పజెప్పారని, రవిశాస్త్రి ఉండగా వారి పప్పులు ఉడకలేదని అంటున్నారు. కోహ్లిపై సగటు అభిమానిలో నెగిటివిటీ పెంచి తనకు తానే ఆటకు వీడ్కోలు పలికేలా చేసే అవకాశాలు లేకపోలేదని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు తాను కోహ్లిని వారించానని బీసీసీఐ బాస్ స్టేట్మెంట్ ఇవ్వడం.. అలాంటిదేమీ లేదు, కెప్టెన్సీ విషయమై గంగూలీ అసలు తనను సంప్రదించనేలేదని, కేవలం గంటన్నర ముందే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్న విషయం చెప్పారని కోహ్లి ప్రెస్‌మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం.. అనంతరం బీసీసీఐ కోహ్లి వ్యాఖ్యలను తోసిపుచ్చడం అందరికీ తెలిసిందే. చదవండి: విరాట్ కోహ్లి సంచలన వాఖ్యలు ... గంగూలీ "నో కామెంట్స్"! -
నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి
కోహ్లి నలువైపులా అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. ఎక్కడా తడబాటు లేకుండా, ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా పూర్తి స్పష్టతతో తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో ఎక్కడా అతను నియంత్రణ కోల్పోలేదు. ఈ ఏడాది అతని నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే! అవును, ఇదంతా కోహ్లి మైదానం బయట ఆడిన తీరు! అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ కోల్పోయిన అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విరాట్ కొత్త విషయాలు బయటపెడుతూ స్వేచ్ఛగా మాట్లాడాడు. ‘పాయింట్ బ్లాంక్’ రేంజ్ సమాధానాలతో బీసీసీఐ పెద్దలకు సవాల్ విసిరాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం, నాయకత్వం కోల్పోవడంలో తన వైఫల్యం, కొత్త కెప్టెన్, కోచ్‌లతో తన సంబంధాలు, మైదానంలో వారికి తన సహకారం... ఇలా ప్రతీ అంశంలో కోహ్లి ఎక్కడా తప్పించుకునే ధోరణి చూపించకుండా సమాధానాలిచ్చాడు. ‘అదే కారణం కావచ్చు’ నా కెప్టెన్సీలో భారత జట్టు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నమెంట్ కూడా నెగ్గలేదనేది వాస్తవం. నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు. అది సరైందా కాదా అనే దానిపై చర్చ అనవసరం. ఆ నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను. దానికి సంబంధించి జరిగిన పరిణామాల గురించి నేను మాట్లాడుతున్నా. భారత కెప్టెన్సీ ఒక గౌరవం. ఇప్పటివరకు (వన్డేలకు సంబంధించి) పూర్తి నిజాయితీతో, అత్యుత్తమ సామర్థ్యంతో ఆ బాధ్యతను నిర్వర్తించా. ‘రోహిత్‌తో సమస్యే లేదు’ కెప్టెన్ అవక ముందు నుంచి కూడా జట్టు గెలుపు కోసం బాధ్యతగా పని చేశా. ఇకపై కూడా అది కొనసాగుతుంది. రోహిత్ శర్మ సమర్థుడైన నాయకుడు. మంచి వ్యూహచతురుడు. ఐపీఎల్‌తో పాటు భారత్‌కు సారథిగా వ్యవహరించిన కొన్ని మ్యాచ్‌లలో కూడా అది చూశాం. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. భారత జట్టును దెబ్బతీసే ఎలాంటి పనులూ చేయను. నాకు, రోహిత్ శర్మకు మధ్య ఎప్పుడూ, ఎలాంటి విభేదాలు లేవు. గత రెండేళ్లుగా ఇదే వివరణ ఇచ్చీ ఇచ్చీ నేను అలసిపోయా. దక్షిణాఫ్రికాతో టెస్టులకు రోహిత్ దూరం కావడం నిరాశ కలిగించేదే. ఇంగ్లండ్‌లో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న రోహిత్ సఫారీలోనూ మంచి ఆరంభాలు ఇచ్చి ఉండేవాడు. ‘నా ఏకాగ్రత చెదరదు’ భారత జట్టుకు ఆడేందుకు నాకు ప్రత్యేకంగా ప్రేరణ అవసరం లేదు. మైదానం బయట వచ్చే ఇలాంటి వార్తలు నన్ను దెబ్బ తీయలేవు. ఇలాంటి కీలక పర్యటన కోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత జట్టును గెలిపించాలని కోరుకుంటున్నా. అనుభవం, ఆత్మవిశ్వాసంతో నిండిన మా టెస్టు జట్టు బలంగా ఉంది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మేం సాధించిన విజయాలు అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. జడేజా లేకపోవడం లోటే కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు మా జట్టులో ఉన్నారు (జట్టు నేడు దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది). ‘నన్ను తప్పుకోవద్దని కోరలేదు’ టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది నా సొంత నిర్ణయం. ఇదే విషయాన్ని నేనే ముందుగా బీసీసీఐకి తెలియజేశాను. దానికి నేను చెప్పిన కారణాలతో వారు సంతృప్తి చెందారు. పైగా భవిష్యత్తు కోసం సరైన దిశలో చేసిన మంచి ఆలోచన అంటూ ప్రశంసించారు కూడా. టి20 కెప్టెన్‌గా రాజీనామా చేయవద్దని, కొనసాగాలని నన్ను ఎవరూ కోరలేదు (కెప్టెన్‌గా కొనసాగమని తాను కోరితే కోహ్లి నిరాకరించాడంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ). అదే సమయంలో నేను వన్డే, టెస్టు కొనసాగుతానని కూడా అన్నాను. మరో అంశంలో కూడా నా ఆలోచనల గురించి స్పష్టతనిచ్చాను. బోర్డు ఆఫీస్ బేరర్లు, సెలక్టర్లలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే నన్ను తప్పించవచ్చని కూడా చెప్పాను. ‘నాతో ఎవరూ మాట్లాడలేదు’ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం జట్టు ఎంపిక చేసేందుకు డిసెంబర్ 8న సమావేశం జరిగింది. అంతకుముందు ఎప్పుడూ నా వన్డే కెప్టెన్సీ గురించి అసలు చర్చ జరగనే లేదు. సరిగ్గా చెప్పాలంటే నేను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోజు నుంచి అప్పటి వరకు బీసీసీఐ నుంచి నాతో ఎవరూ మాట్లాడనే లేదు. ఈ సమావేశానికి సరిగ్గా గంటన్నర ముందు మాత్రమే సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ నాకు ఫోన్ చేశారు. టెస్టు టీమ్ గురించి చర్చ జరిగిన తర్వాత ఫోన్ కాల్ ముగించే సమయంలో... ఐదురుగు సెలక్టర్లు కూడా నన్ను వన్డే కెప్టెన్‌గా కొనసాగించరాదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘సరే, మంచిది’ అని నేను సమాధానమిచ్చా. ఇదీ అక్కడ జరిగిన అసలు విషయం. ‘వన్డే సిరీస్‌కు సిద్ధం’ నేను దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటానంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం. అలా రాసిన వారికి ఎలాంటి విశ్వసనీయత లేదు. నేను ఎల్లప్పుడూ జట్టుకు అందుబాటులో ఉన్నాను. నాకు విశ్రాంతి ఇవ్వాలంటూ బోర్డును అసలు కోరనే లేదు. సఫారీలతో వన్డే సిరీస్ ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నా. -
వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ.. ముదురుతున్న వివాదం
ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్సీ అంశంపై బీసీసీఐ బాస్ తనతో ముందస్తు సంప్రదింపులు జరపలేదని, కేవలం గంటన్నర ముందే తనను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే బీసీసీఐ స్పందించింది. గంగూలీని ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పుపై సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ కోహ్లితో ముందుగానే చర్చించాడని పేర్కొంది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే గంగూలీ సహా బీసీసీఐ అధికారులంతా కోహ్లిని వారించారని.. అయినప్పటికీ అతను పట్టువీడకుండా టీ20 పగ్గాలను వదులుకున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పామన్నది పూర్తిగా అవాస్తవమని, వైట్ బాల్ ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లుంటే సమస్యలొస్తాయని కోహ్లితో ముందే డిస్కస్ చేశామని, ఈ అంశంపై కోహ్లి వైపు నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సి వచ్చిందని సదరు అధికారి వివరించాడని సమాచారం. చదవండి: రిటైర్మెంట్పై స్పందించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. -
Virat Kohli: రోహిత్ గొప్ప సారథి.. రాహుల్ భాయ్ గొప్ప మేనేజర్: కోహ్లి
Virat Kohli About Rohit Sharma Captaincy: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై టెస్టు సారథి విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. భారత క్రికెట్ స్థాయిని మరో మెట్టు ఎక్కించే క్రమంలో వారిద్దరికీ తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియాలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మెగా ఈవెంట్ తర్వాత హెడ్‌కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోగా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా కోహ్లి స్థానంలో తొలుత టీ20 ఫార్మాట్ పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్.. వన్డే సారథిగా కూడా నియమితుడయ్యాడు. అంతేగాక టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. ఈ క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు కోహ్లి అందుబాటులో ఉండటం లేదంటూ వార్తలు వెలువడగా.. కోహ్లి వాటిని ఖండించాడు. ఈ మేరకు బుధవారం వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో ఆడటంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అతడొక మంచి కెప్టెన్ అని కితాబిచ్చాడు. ‘‘జట్టు సరైన దిశలో నడిచే విధంగా నా వంతు సాయం నా బాధ్యత. కెప్టెన్ కాకముందు కూడా నేను అలాగే ఉన్నా. ఇప్పుడు కూడా అంతే. నా మైండ్‌సెట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. రోహిత్ సామర్థ్యమున్న, గొప్ప సారథి. అతడి నేతృత్వంలో టీమిండియా, ఐపీఎల్ జట్టు సాధించిన విజయాలు మనం చూశాం’’ అని హిట్‌మ్యాన్‌ను కోహ్లి ప్రశంసించాడు. అదే విధంగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి చెబుతూ.. ‘‘రాహుల్ భాయ్.. చాలా చాలా గొప్ప కోచ్.. గొప్ప మేనేజర్. భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్, హెడ్‌కోచ్‌గా రాహుల్ భాయ్‌కు వందకు వంద శాతం నా సపోర్టు ఉంటుంది. జట్టు ప్రయోజనాల కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 26 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇక గాయం కారణంగా రోహిత్ ఈ సిరీస్‌కు దూరంగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: Trolls On Sourav Ganguly: సిగ్గు పడండి.. చెత్త రాజకీయాలు వద్దు.. కోహ్లి, రోహిత్ మంచోళ్లే! 💬 💬 @ImRo45 and Rahul Dravid have my absolute support: @imVkohli #TeamIndia #SAvIND pic.twitter.com/jXUwZ5W1Dz — BCCI (@BCCI) December 15, 2021 -
Rohit Sharma: కోహ్లి కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఐసీసీ టోర్నీ గెలుస్తా
Rohit Sharma Comments On Virat Kohli Captaincy: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి సారథ్యంలో ఆడటం తనకు గొప్ప అనుభూతులను మిగిల్చిందన్నాడు. కాగా టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని కాదని బీసీసీఐ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసంతృప్తికి లోనైన కోహ్లి.. వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లి, రోహిత్ మధ్య అభిప్రాయ భేదాలు ముదిరాయంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కోహ్లి కెప్టెన్సీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐకి ఇచ్చి ఇంటర్వ్యూలో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. కోహ్లి సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ మేరకు.. ‘‘కోహ్లి కెప్టెన్సీలో మేము చాలా గొప్ప మ్యాచ్‌లు ఆడాము. ఆటను పూర్తిగా ఆస్వాదించాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాము. ఇక ముందు కూడా అదే కొనసాగుతుంది. నిజానికి తను జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపాడు. ఐదేళ్ల కాలంలో అలుపెరుగని కృషి చేశాడు. ఇప్పుడు.. కూడా అదే స్ఫూర్తితో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలన్నదే నా అభిమతం’’ అని రోహిత్ పేర్కొన్నాడు. మరోవైపు 2013 తర్వాత భారత్ మరో ఐసీసీ టోర్నీ గెలవలేకపోయిన లోటును త్వరలోనే తీర్చేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ అన్నాడు. ఐసీసీ టోర్నీ నెగ్గే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నాయని, పలు అంశాలు చక్కబెట్టుకోవాల్సి ఉందని, వీటిని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో విజేతగా నిలుస్తామని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: Virat kohli: ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. కోహ్లికి నో ఛాన్స్! 🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job." SPECIAL - @ImRo45's first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. 📽️ Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv — BCCI (@BCCI) December 12, 2021 -
Rahul Dravid: నాకు దక్కిన గొప్ప గౌరవం.. ఎవరి పాత్ర ఏమిటో చెబుతా!
Working With Rahul Bhai Was Fantastic: Rohit Sharma: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ముందంజలో నిలుపుతానని పేర్కొన్నాడు. సారథిగా తన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానని తెలిపాడు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపాడు. అదే విధంగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం అత్యద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. టీ20 వరల్కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మను.. వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సారథి హోదాలో హిట్‌మ్యాన్ తొలిసారిగా బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ మేరకు... ‘‘అతిపెద్ద బాధ్యత.. ఈ అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాను మరింత గొప్పగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తా.. నిజంగా ఇదొక భావోద్వేభరితమైన ప్రయాణం. ఏ అవకాశాన్నైనా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు నేను కృషి చేస్తా.. ఆటగాళ్లతో మనసు విప్పి మాట్లాడి.. వాళ్లతో చర్చించి.. ఎవరి పాత్ర ఏమిటో అర్థమయ్యేలా చెబుతా’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఆయన ఉంటే డ్రెస్సింగ్ రూంలో ఉల్లాసంగా.. ‘‘రాహుల్ భాయ్‌తో పనిచేయడం... అంటే... మూడు మ్యాచ్‌లే అయి ఉండవచ్చు.. అయినా ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఆయన ఆట ఎలా ఉంటుందో మనం చూశాం. హార్డ్‌వర్కర్. అదే సమయంలో ఆయన డ్రెస్సింగ్ రూంలో ఉన్నారంటే ఉల్లాసభరిత వాతావరణం ఉంటుంది. మెరుగ్గా రాణించాలంటే కచ్చితంగా ఇలాంటి వాతావరణం ఉండాలి కదా మరి! భాయ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో.. రోహిత్ కెప్టెన్సీలో తొలిసారిగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సిరీస్ ఇద్దరీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. చదవండి: Rohit Sharma- Virat Kohli: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్ ప్రశంసల జల్లు Goals & excitement 👍 Working with Rahul Dravid 👌@imVkohli's legacy as India's white-ball captain 👏#TeamIndia's new white-ball captain @ImRo45 discusses it all in this special feature for https://t.co/Z3MPyesSeZ 👍 👍 Watch the full interview 🎥 🔽https://t.co/JVS0Qff905 pic.twitter.com/kFlqZxWh5t — BCCI (@BCCI) December 13, 2021 -
Rohit Sharma: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. నిజానికి!
ODI Captain Rohit Sharma About Virat Kohli: ‘‘బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్న విషయాల గురించి ఆలోచించడం వృథా అని నేను భావిస్తాను. మేమిద్దరం ఒకరి గురించి ఒకరం ఏమనుకుంటున్నాం అనేదే మాకు ముఖ్యం. ఎక్స్‌వైజెడ్ గురించి నేను ఏమనుకుంటున్నానో అదే ముఖ్యం.. ఆటగాళ్ల మధ్య బంధం బలపడే వాతావరణాన్ని సృష్టించి లక్ష్యాన్ని చేరుకోవడంపై దృష్టి సారించడమే అన్నింటే మరింత ముఖ్యమైనది’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వన్డే కెప్టెన్సీని హిట్‌మ్యాన్‌కు అప్పగించడంతో విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ మధ్య దూరం పెరిగిందని, విభేదాలు తారస్థాయికి చేరాయంటూ పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వన్డే కెప్టెన్‌గా తాను కొనసాగుతానని కోహ్లి ప్రకటించినా... బీసీసీఐ మాత్రం రోహిత్ వైపే మొగ్గుచూపడం అతడికి మింగుడుపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్‌గా అధికారికంగా నియమితుడైన తర్వాత తొలిసారిగా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ.. తనకు కోహ్లి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పాడు. అంతేగాక కోహ్లి సారథ్యం వల్లే జట్టు ఈ స్థాయిలో ఉందని ప్రశంసించాడు. చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి? జరిగేది అదే: గంభీర్ ఒత్తిడి ఉండటం సహజం... ఇక టీమిండియాకు ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురి చేస్తుందన్న రోహిత్ శర్మ... ఆటపై దృష్టి సారించి ముందుకు వెళ్లడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు. ‘‘భారత్ తరఫున ఆడుతున్నపుడు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చాలా మంది మా గురించి మాట్లాడుతూ ఉంటారు. కొందరు పాజిటివ్‌గా మాట్లాడితే.. మరికొందరు నెగటివ్‌గా... అయితే, ఓ క్రికెటర్‌గా... కెప్టెన్‌గా నా పనేంటో దానిపై మాత్రమే దృష్టి పెట్టడం ముఖ్యం.. బయట ఎవరు ఏమి మాట్లాడుతున్నారో పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని రోహిత్ స్పష్టం చేశాడు. చదవండి: Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం! 🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job." SPECIAL - @ImRo45's first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. 📽️ Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv — BCCI (@BCCI) December 12, 2021 -
కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి? జరిగేది అదే: గంభీర్
Gautam Gambhir: Virat Kohli More Dangerous Batsman: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించిన నేపథ్యంలో విరాట్ కోహ్లి కేవలం టెస్టులకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినపుడే... వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని కోహ్లి ప్రకటించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒక్కరే సారథిగా ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి కోహ్లికి ఉద్వాసన పలికారు. ఈ విషయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కోహ్లికి మద్దతుగా కొంతమంది... సెలక్టర్ల నిర్ణయమే సరైంది అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కోహ్లి, టీమిండియా భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే పాత కోహ్లిని.. అతడి పరుగుల ప్రవాహాన్ని చూడబోతున్నామంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్' షోలో గంభీర్ మాట్లాడుతూ... కెప్టెన్సీ భారం లేనందున బ్యాటర్‌గా కోహ్లి మరింత గొప్పగా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. ‘‘టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పాత్ర ఎలాగో.. వైట్ బాల్ క్రికెట్లో కోహ్లి పాత్ర కూడా అలాగే. కేవలం తను కెప్టెన్‌గా ఉండబోడు అంతే. నిజానికి ఇది తనకు, జట్టుకు ఎంతో ప్రయోజనకరం. సారథ్య బాధ్యతల భారం నుంచి విముక్తి పొందినందున అతడు మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడు. మరింత ప్రమాదకర బ్యాటర్‌గా మారతాడు’’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి! దేశాన్ని గర్వపడేలా చేస్తాడు... ‘‘అతడు దేశాన్ని గర్వపడేలా చేస్తాడు. టీ20, వన్డే, టెస్టుల్లో పరుగుల వరద పారిస్తాడు. విరాట్ కోహ్లిలోని అత్యుత్తమ బ్యాటర్‌ను ఇండియా చూడబోతోంది. కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా.. తనలోని బ్యాటర్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాడు’’ అని కోహ్లిపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా రెండేళ్లుగా కోహ్లి ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. దీంతో అతడు ఎప్పుడెప్పుడు శతకం బాదుతాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ కల త్వరలోనే నెరవేరుతుందంటున్నాడు గంభీర్. చదవండి: KS Bharat Century: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ భారీ ధర కన్ఫర్మ్ -
'కోహ్లికి కనీస గౌరవం ఇవ్వకుండానే తొలగించారు'
Ex- Cricketer Danish Kaneria Slams BCCI.. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తొలగించి మూడురోజులు కావొస్తుంది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కోహ్లిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై చర్చ జరుగుతూనే ఉంది. కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపికచేయడంపై కొందరు విమర్శిస్తే.. మరికొందరు నిర్ణయం సరైందేనంటూ మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా కోహ్లి విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ లో కనేరియా మాట్లాడాడు. చదవండి: "విరాట్ కోహ్లిని తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది" “కోహ్లీతో బీసీసీఐ సరిగా వ్యవహరించిందా అంటే? అలా జరగలేదని నా అభిప్రాయం. బీసీసీఐ కోహ్లికి కనీస గౌరవం ఇవ్వలేదు. అతను కెప్టెన్‌గా భారత్‌కు 65 విజయాలు సాధించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు కట్టబెట్టిన భారత నాలుగో సారథిగా నిలిచాడు. రికార్డుల పరంగా చూస్తే అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవచ్చు.. కానీ కెప్టెన్‌గా టీమిండియాను అతను నడిపించిన మార్గం అసాధారణమైనది. ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న ఇద్దరు సూపర్స్టార్లు మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ఒకరు విరాట్ కోహ్లీ అయితే ఇంకొకరు బాబర్ అజమ్. మీరు సూపర్స్టార్లను గౌరవించాలి. కోహ్లీకి తెలియజేయకుండా బీసీసీఐ అతనిని తొలగించడంలో కఠినంగా వ్యవహరించింది. సౌరవ్ గంగూలీ గొప్ప వ్యక్తి, మాజీ కెప్టెన్ కూడా… అతను మేము రోహిత్‌ని కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నామని విరాట్‌కు ముందే చెప్పాల్సింది. అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా -
రోహిత్ శర్మ అసంతృప్తి! కట్‌చేస్తే..
Rohit Sharma 10 Years Old Tweet Viral.. టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే టి20 కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను గెలిపించి మంచి మార్కులు సాధించాడు. తాజాగా వన్డే కెప్టెన్సీని అందుకున్న రోహిత్‌కు ఇక మిగిలింది టెస్టు కెప్టెన్సీ మాత్రమే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ''అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుంది(కోహ్లిని దృష్టిలో పెట్టుకొని)'' చేసిన వ్యాఖ్యలు చూస్తే రోహిత్ త్వరలోనే టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. చదవండి: Rohit Sharma: 'నా ఫిలాసఫీ అదే.. వచ్చే రెండేళ్లలో ఐసీసీ ట్రోఫీలే లక్ష్యంగా' అయితే ఇదే రోహిత్ శర్మ టీమిండియా సాధించిన 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా లేడు. ఆ సమయంలో రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై రోహిత్ అప్పట్లో ట్విటర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా రోహిత్ కెప్టెన్ కావడంతో.. 10 ఏళ్ల క్రితం ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ''2011 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా జట్టుకు ఎంపికకాకపోవడం చాలా బాధ కలిగించింది. ఆ క్షణంలో క్రికెట్ నుంచి వెళ్లిపోదామనుకున్నా. కానీ ఆటపై ఉన్న ప్రేమ నన్ను ఆపేసింది. నిజాయితీగా చెప్పాలంటే.. ఆ సమయంలో ఏ కోణంలో చూసిన అది పెద్ద డ్రాబ్యాక్లా కనిపించింది.'' అంటూ ట్వీట్ చేశాడు. సరిగ్గా పదేళ్ల తర్వాత చూసుకుంటే ప్రస్తుతం రోహిత్ శర్మ వైట్‌బాల్ క్రికెట్(వన్డే, టి20)కు కెప్టెన్‌గా ఉన్నాడు. తన సారధ్యంలోనే టీమిండియా రానున్న రెండేళ్లలో రెండు మేజర్ ఐసీసీ టోర్నీలు( టి20 ప్రపంచకప్ 2022, ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023) ఆడనుంది. మరి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా కప్ కొడుతుందేమో చూడాలి. ఇక ధోని సారధ్యంలో 2015.. కోహ్లి సారధ్యంలో 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో రోహిత్ సభ్యుడిగా ఉన్న టీమిండియా కప్ కొట్టడంలో విఫలమైంది. చదవండి: గంగూలీని ఎలా గద్దె దించారో.. కోహ్లిని కూడా అదే తరహాలో.. Really really disappointed of not being the part of the WC squad..I need to move on frm here..but honestly it was a big setback..any views! — Rohit Sharma (@ImRo45) January 31, 2011 -
కోహ్లిని కెప్టెన్‌గా తప్పించడానికి ఇదే అసలు కారణం!
Virat Kohli has been sacked as ODI captain due to his inability to win an ICC trophy: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం ముగిసింది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్లో భారత కెప్టెన్సీ నుంచి తప్పకున్న కోహ్లి, వన్డేల్లో సారధిగా కొనసాగాలని భావించాడని కరీం తెలిపాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోవడమే కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడానికి ప్రాధాన కారణమని కరీం అభిప్రాయపడ్డాడు. "నిజం చెప్పాలంటే కోహ్లి ఉద్వాసనకు గురయ్యాడు. టీ20 కెప్టెన్సీ భాధ్యతలనుంచి తప్పుకున్నప్పడు.. వన్డే కెప్టెన్సీ గురించి కోహ్లి ఎటువంటి ప్రకటన చేయలేదు. దాని అర్ధం ఏంటింటే.. అతను వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ కోహ్లి సారథ్యంలో ఇంతవరకు భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫి కూడా గెలవలేదు. ఇదే అతడి కెప్టెన్సీను కోల్పోవడానికి ప్రధాన కారణమైంది" అని సాబా కరీం పేర్కొన్నాడు. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లేదా బీసీసీఐకి చెందిన ఏదైనా అధికారి కోహ్లితో కెప్టెన్సీ గురించి మాట్లాడి ఉంటారని సాబా కరీం అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్.. కోహ్లితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కరీం తెలిపాడు. కాగా అంతకు ముందు భారత టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించారు. చదవండి: David Warner Wife Candice: నా భర్తకు దూరంగా... నాతో పాటు నా పిల్లలు కూడా... వెక్కి వెక్కి ఏడుస్తూ.. -
Virat Kohli: అందుకే కోహ్లిపై వేటు.. మరీ ఇంత అవమానకరంగా.. ఇక టెస్టు కెప్టెన్సీకి కూడా
Reason Behind Rohit Sharma As ODI Captain: ఊహాగానాలు నిజమయ్యాయి.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది.. విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న కోహ్లిపై ఇలా వేటు వేయడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు క్రికెటేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. కోహ్లి అద్భుత రికార్డు.. అయినా 95 వన్డేల్లో 75 విజయాలు, 27 పరాజయాలు... ఓవరాల్‌గా కనీసం 50కి పైగా వన్డేల్లో నాయకత్వం వహించిన కెప్టెన్ల జాబితా చూస్తే ఇద్దరికి మాత్రమే ఇంతకంటే మెరుగైన గెలుపు/ఓటముల నిష్పత్తి (లాయిడ్, పాంటింగ్) ఉంది. ఇక తన కెప్టెన్సీలో అత్యంత అసాధారణమైన 72.65 సగటుతో కోహ్లి 5,449 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఎలా చూసినా ఇది అద్భుత రికార్డు. అయినా సరే ఇవేవీ కోహ్లిని వన్డే కెప్టెన్సీ కోల్పోకుండా రక్షించలేకపోయాయి. క్రికెట్ పరమైన కారణంగా చూస్తే రెండు ఐసీసీ టోర్నీల్లో (2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్)లలో అతను విఫలమయ్యాడనేది ఒక వాదన. ఒకదాంట్లో ఫైనల్ చేరిన జట్టు, మరో టోర్నీలో సెమీస్ వరకు వెళ్లింది. అదే కారణమైతే 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాతే అతని నాయకత్వంపై చర్చ జరిగేది. అందుకే వేటు వేశారా? ఇంత కాలం కెప్టెన్సీ నుంచి కాపాడుకున్న అతను ఇప్పుడు కోల్పోవడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే బీసీసీఐ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం చూస్తే క్రికెటేతర కారణాలే అతనిపై వేటుకు కారణమయ్యాయి. కోహ్లిని తప్పించాలనే ఆలోచన బోర్డులో ఎప్పటి నుంచో సాగుతోంది. తగిన సమయం చూసి వారు దీనిని అమలు చేశారు. ముఖ్యంగా బయటకు కనిపించని ‘గంగూలీతో విభేదాలు’ వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. రవిశాస్త్రి అండగా అతను తానే అన్నీ శాసించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఒకదశలో వైస్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి భవిష్యత్తు కోసం రాహుల్ లేదా పంత్‌లలో ఒకరికి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలంటూ అతను సూచించడం బోర్డులో అందరికీ ఆగ్రహం కలిగించింది. టి20 నుంచి తప్పుకోవాలనేది కూడా కోహ్లి సొంత నిర్ణయం కాదని, బోర్డు అతనితో చెప్పించిందని కూడా సమాచారం. ఆ ఫార్మాట్లో కూడా నాయకత్వానికి గ్యారంటీ లేదు! ఈ రెండు ఫార్మాట్లలో రోహిత్ రూపంలో సరైన ప్రత్యామ్నాయం ఉండటంతో సెలక్టర్లకు సమస్య లేకపోయింది. టెస్టుల్లో కొన్నాళ్ల క్రితం వరకు కూడా రోహిత్ రెగ్యులర్ సభ్యుడు కాదు. తన స్థానం పదిలం చేసుకునే ప్రయత్నంలోనే అతను ఉన్నాడు. ఇప్పుడు ఆ దశను అధిగమించాడు కాబట్టి వైస్ కెప్టెన్సీ అప్పగించేశారు. అంటే టెస్టుల్లో కూడా ప్రత్యామ్నాయం ఉంది. కాబట్టి ఇకపై కోహ్లికి ఆ ఫార్మాట్లో కూడా నాయకత్వానికి గ్యారంటీ లేదు! అయితే మరో కోణంలో చూస్తే ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కోహ్లి ఈ నాయకత్వ ఒత్తిడి నుంచి తప్పుకొని తన ఆటపై మరింత దృష్టి పెడితే మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ అతడి నుంచి రావచ్చు. ఏదేమైనా ఇలా అవమానకర రీతిలో కోహ్లికి ఉద్వాసన పలకడం సరికాదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: India Tour Of South Africa: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. -
ODI Captain: కోహ్లికి షాక్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ODI Captain Rohit Sharma: భారత వన్డే క్రికెట్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లి శకం ముగిసింది. అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా, ఇకపై వన్డేల్లో అతని నాయకత్వం అవసరం లేదని బీసీసీఐ భావించింది. కొన్నాళ్ల క్రితం టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానంటూ స్వయంగా తానే ప్రకటించే అవకాశం కోహ్లికి ఇచ్చిన సెలక్టర్లు ఈసారి అదీ లేకుండా చేశారు. ఏ కవాక్యంతో కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఊహించిన విధంగానే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే అవకాశం లేకుండా రోహిత్ శర్మనే వన్డే కెప్టెన్‌గా చేసి అతడికి మరో ప్రమోషన్ ఇచ్చారు. ఇటీవలే అధికారికంగా టి20 కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన రోహిత్‌ను టెస్టుల్లోనూ మరో మెట్టు ఎక్కించారు. ఇప్పటి వరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను తప్పించి ఆ స్థానంలో రోహిత్‌కు వైస్ కెప్టెన్‌ను చేశారు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఈ మార్పులు చోటు చేసుకోనుండగా... సఫారీ టీమ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం కూడా టీమ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ముంబై: డాషింగ్ ఓపెనర్, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఘనత ఉన్న ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో భారత వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టి20లకు ఇప్పటికే కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను వన్డేలకు కూడా నియమిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 34 ఏళ్ల రోహిత్ కనీసం 2023లో భారత గడ్డపైనే జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది. రోహిత్ టి20 కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుంచే వన్డే కెప్టెన్సీపై కూడా చర్చ కొనసాగుతోంది. పరిమిత ఓవర్ల రెండు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ బాగుంటుందనే సూచన చాలాసార్లు వినిపించింది. అయితే బ్యాటర్‌గా విరాట్ కోహ్లి స్థాయి, కెప్టెన్‌గా అతని మెరుగైన రికార్డు చూస్తే ఇంత తొందరగా మార్పు జరగడం మాత్రం ఆశ్చర్యకరం. మరో కోణంలో చూస్తే 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు కెప్టెన్‌గా తగినంత సమయం ఇచ్చి తన జట్టును తీర్చి దిద్దుకునే అవకాశం ఇవ్వడం సరైందిగా బోర్డు భావించి ఉంటుంది. ఇకపై కోహ్లి టెస్టు కెప్టెన్‌గా మాత్రమే కొనసాగుతాడు. అతని సారథ్యంలోనే జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల్లో ఆడుతుంది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రహానే... జట్టులో స్థానం నిలబెట్టుకున్నా వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. అతని స్థానంలోనే రోహిత్‌ను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు ప్రకటన సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అవకాశం దక్కని హైదరాబాద్ బ్యాటర్ గాదె హనుమ విహారి దక్షిణాఫ్రికా సిరీస్‌కు మళ్లీ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉండి ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్న విహారి మూడు అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు చేసి తన ఫామ్‌ను చాటాడు. సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా కాన్పూర్ టెస్టుల్లో సత్తా చాటినా ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్‌కు స్థానం లభించలేదు. గాయాల కారణంగా జడేజా, శుబ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ చహర్ పేర్లను పరిశీలించలేదని సెలక్టర్లు వెల్లడించారు. టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, శ్రేయస్, విహారి, పంత్, సాహా, అశ్విన్, జయంత్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా, శార్దుల్, సిరాజ్. స్టాండ్‌బై: నవదీప్ సైనీ, దీపక్ చహర్, అర్జన్ నాగ్వాస్వాలా, సౌరభ్ కుమార్. The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa — BCCI (@BCCI) December 8, 2021 చదవండి: బంగ్లాపై గెలుపు.. రెండో స్థానంలో పాక్ -
వన్డే, టి20 కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి టెస్టులకే పరిమితం..?!
Rohit Sharma May ODI And T20I Captain.. టి20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. ఇక టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి టి20 ప్రపంచకప్ కావడంతో ఎలాగైన టైటిల్ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి. చదవండి: IND Vs NZ: రోహిత్ శర్మకే సందేహం వచ్చేలా.. ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. కోహ్లికి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి వన్డే, టి20ల్లో రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్ సమయానికి సెలక్షన్ కమిటీ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీతో పాటు టీమిండియా కోచ్ పదవిపై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే కోహ్లి నాయకత్వంలోని జట్టు టి20 ప్రపంచకప్ 2021లో దారుణ ప్రదర్శన చేయడంతో బీసీసీఐతో సెలక్టర్లను ఆందోళనలో పడేసింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్ 20222తో పాటు 2023 వన్డే వరల్డ్‌కప్‌లోగా కెప్టెన్సీ విషయంలో టీమిండియా ఇబ్బందులు పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా కొనసాగినా.. వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. ఇక మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అనే ప్రతిపాధనను బీసీసీఐ ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల జట్టు కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంది. చదవండి: Virat Kohli:: ఓటమికి చింతిస్తున్నాం.. ఇక ఇంటికే.. ‘కోహ్లి ట్వీట్’ వైరల్ అందుకే రోహిత్‌ను వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా.. కోహ్లి టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కరెక్ట్ అని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటికైతే స్పష్టత లేకపోయినప్పటికీ టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం గ్యారంటీ. ఇక టీమిండియా ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 17న కివీస్‌తో తొలి టి20 ఆడనుంది. ఈ తర్వాత ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: Jasprit Bumrah: ఆరు నెలలుగా బయోబబూల్.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది ఇక కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సారధ్యంలో టీమిండియా 95 వన్డేల్లో 65 గెలిచి.. 27 ఓడిపోగా.. ఒక మ్యాచ్ రద్దైంది. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో 10 వన్డేల్లో 8 గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టి20ల్లో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 45 మ్యాచ్‌ల్లో 27 గెలిచి.. 14 ఓడిపోగా.. 2 మ్యాచ్‌లు ఫలితం రాలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా 19 మ్యాచ్‌ల్లో 15 గెలిచి.. 4 ఓడిపోయింది. -
మోర్గాన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు
లండన్: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆ సిరీస్‌లో పాల్గొనని అలెక్స్ హేల్స్, జో రూట్ కూడా భారత్‌తో పోరుకు ఎంపికయ్యారు. పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 15న పుణేలో జరిగే తొలి వన్డేకు ముందు జనవరి 10,12 తేదీల్లో భారత్ ‘ఎ’తో ఇంగ్లండ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టెస్టుల కోసం స్పిన్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న సక్లాయిన్ ముస్తాక్ కాంట్రాక్ట్‌ను ఇంగ్లండ్ బోర్డు పొడిగించింది. అతను వన్డే సిరీస్ వరకు కూడా జట్టుతో కొనసాగుతాడు. ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేక్ బాల్, బిల్లింగ్స, బట్లర్, డాసన్, హేల్స్, ప్లంకెట్, రషీద్, రూట్, జేసన్ రాయ్, స్టోక్స్, విల్లీ (వన్డేలు, టి20లకు), బెయిర్‌స్టో, వోక్స్ (వన్డేలకు మాత్రమే), జోర్డాన్, టైమల్ మిల్స్ (టి20లకు మాత్రమే).