PC: BCCI
Working With Rahul Bhai Was Fantastic: Rohit Sharma: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ముందంజలో నిలుపుతానని పేర్కొన్నాడు. సారథిగా తన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానని తెలిపాడు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపాడు. అదే విధంగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం అత్యద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.
టీ20 వరల్‌కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మను.. వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సారథి హోదాలో హిట్‌మ్యాన్ తొలిసారిగా బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ మేరకు... ‘‘అతిపెద్ద బాధ్యత.. ఈ అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాను మరింత గొప్పగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తా.. నిజంగా ఇదొక భావోద్వేభరితమైన ప్రయాణం. ఏ అవకాశాన్నైనా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు నేను కృషి చేస్తా.. ఆటగాళ్లతో మనసు విప్పి మాట్లాడి.. వాళ్లతో చర్చించి.. ఎవరి పాత్ర ఏమిటో అర్థమయ్యేలా చెబుతా’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఆయన ఉంటే డ్రెస్సింగ్ రూంలో ఉల్లాసంగా..
‘‘రాహుల్ భాయ్‌తో పనిచేయడం... అంటే... మూడు మ్యాచ్‌లే అయి ఉండవచ్చు.. అయినా ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఆయన ఆట ఎలా ఉంటుందో మనం చూశాం. హార్డ్‌వర్కర్. అదే సమయంలో ఆయన డ్రెస్సింగ్ రూంలో ఉన్నారంటే ఉల్లాసభరిత వాతావరణం ఉంటుంది. మెరుగ్గా రాణించాలంటే కచ్చితంగా ఇలాంటి వాతావరణం ఉండాలి కదా మరి! భాయ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
కాగా రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో.. రోహిత్ కెప్టెన్సీలో తొలిసారిగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సిరీస్ ఇద్దరీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.
చదవండి: Rohit Sharma- Virat Kohli: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్ ప్రశంసల జల్లు
Goals & excitement 👍
— BCCI (@BCCI) December 13, 2021
Working with Rahul Dravid 👌@imVkohli's legacy as India's white-ball captain 👏#TeamIndia's new white-ball captain @ImRo45 discusses it all in this special feature for https://t.co/Z3MPyesSeZ 👍 👍
Watch the full interview 🎥 🔽https://t.co/JVS0Qff905 pic.twitter.com/kFlqZxWh5t
Comments
Please login to add a commentAdd a comment