టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ శుభారంభం చేశాడు. శ్రీలంకపై సిరీస్ విజయంతో తన ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టాడు. గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకున్నా తొలి ప్రయత్నంలోనే విజయవంతమయ్యాడు. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ జట్టుతో అనుకున్న ఫలితం రాబట్టాడు.
‘సూపర్‌స్టార్ల’తో అంత వీజీ కాదు
అయితే.. ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నా వన్డే సిరీస్ రూపంలో గంభీర్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ప్రత్యర్థి శ్రీలంక బలాబలాలను పక్కనపెడితే.. ‘సూపర్‌స్టార్ల’ను అతడు ఏ మేరకు డీల్ చేయగలడన్నది ఆసక్తికరంగా మారింది. వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అందుబాటులోకి వచ్చాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ నేపథ్యంలో లంకతో సిరీస్‌కు ప్రాధాన్యం ఏర్పడగా.. సెలవులు ముగించుకుని జట్టుతో చేరారు. అసలే దూకుడు స్వభావం ఉన్న గంభీర్.. వీరిద్దరిని ఎలా కలుపుకొనిపోతాడన్నది క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సన్నిహిత వర్గాలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘ఇది అంత సులువేమీ కాదు. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో లాగా నేను బాస్‌ను... నువ్విది చేయాల్సిందే అంటే కుదరదు. ఇక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. ఇండియన్ డ్రెస్సింగ్‌రూం విషయానికొస్తే.. ప్రతి ఒక్క ప్లేయర్‌తో ఓపికగా మాట్లాడాల్సి ఉంటుంది. అవసరమైతే స్వయంగా ఫోన్ చేయాల్సి ఉంటుంది.
అందరూ లక్షాధికారులే
ద్రవిడ్ కూడా అలాగే చేసేవాడు. హెడ్‌కోచ్‌గా వచ్చిన కొత్తలో అతడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటికి.. ఇప్పటికి భారత క్రికెట్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ఉన్న ఆటగాళ్లలో అందరూ లక్షాధికారులే. అంతేకాదు ఐపీఎల్‌లో కెప్టెన్లుగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. వాళ్లందరినీ సాఫీగా డీల్ చేయడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాలు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఐపీఎల్‌లో సత్తా చాటి
కాగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన గంభీర్.. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా కొనసాగాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపిన ఈ ఢిల్లీ బ్యాటర్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది కోల్‌కతా ఫ్రాంఛైజీ మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించి.. జట్టు మూడోసారి ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఆగష్టు 2 నుంచి మొదలు
ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. కోచ్‌గా శ్రీలంక పర్యటనతో కెరీర్ మొదలుపెట్టిన గౌతం గంభీర్.. 2-0తో టీ20 సిరీస్ గెలిచాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నామమాత్రపు మూడో టీ20 జరుగనుండగా.. ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. కాగా రోహిత్, కోహ్లిలు వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు అంటూ ప్రశంసించిన గంభీర్.. వారితో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
చదవండి: గిల్ కంటే ఆ విషయంలో అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి?
Comments
Please login to add a commentAdd a comment