Virat Kohli About Rohit Sharma Captaincy: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై టెస్టు సారథి విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. భారత క్రికెట్ స్థాయిని మరో మెట్టు ఎక్కించే క్రమంలో వారిద్దరికీ తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియాలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
మెగా ఈవెంట్ తర్వాత హెడ్‌కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోగా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా కోహ్లి స్థానంలో తొలుత టీ20 ఫార్మాట్ పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్.. వన్డే సారథిగా కూడా నియమితుడయ్యాడు. అంతేగాక టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. ఈ క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు కోహ్లి అందుబాటులో ఉండటం లేదంటూ వార్తలు వెలువడగా.. కోహ్లి వాటిని ఖండించాడు.
ఈ మేరకు బుధవారం వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో ఆడటంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అతడొక మంచి కెప్టెన్ అని కితాబిచ్చాడు. ‘‘జట్టు సరైన దిశలో నడిచే విధంగా నా వంతు సాయం నా బాధ్యత. కెప్టెన్ కాకముందు కూడా నేను అలాగే ఉన్నా. ఇప్పుడు కూడా అంతే. నా మైండ్‌సెట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. రోహిత్ సామర్థ్యమున్న, గొప్ప సారథి. అతడి నేతృత్వంలో టీమిండియా, ఐపీఎల్ జట్టు సాధించిన విజయాలు మనం చూశాం’’ అని హిట్‌మ్యాన్‌ను కోహ్లి ప్రశంసించాడు.
అదే విధంగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి చెబుతూ.. ‘‘రాహుల్ భాయ్.. చాలా చాలా గొప్ప కోచ్.. గొప్ప మేనేజర్. భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్, హెడ్‌కోచ్‌గా రాహుల్ భాయ్‌కు వందకు వంద శాతం నా సపోర్టు ఉంటుంది. జట్టు ప్రయోజనాల కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 26 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇక గాయం కారణంగా రోహిత్ ఈ సిరీస్‌కు దూరంగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
చదవండి: Trolls On Sourav Ganguly: సిగ్గు పడండి.. చెత్త రాజకీయాలు వద్దు.. కోహ్లి, రోహిత్ మంచోళ్లే!
💬 💬 @ImRo45 and Rahul Dravid have my absolute support: @imVkohli #TeamIndia #SAvIND pic.twitter.com/jXUwZ5W1Dz
— BCCI (@BCCI) December 15, 2021
Comments
Please login to add a commentAdd a comment