కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపుపై ఎంత పెద్ద వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు వచ్చి వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పుడు తననెవరు సంప్రదించలేదని.. గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాడు. కోహ్లి ఘాటూ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. అయితే ఇదే విషయాన్ని గంగూలీ వద్ద ప్రస్తావించగా.. అంతా బీసీసీఐ చూసుకుంటుందని చెప్పి సమాధానం దాటవేశాడు. ఈలోగా టీమిండియా సౌతాఫ్రికా టూర్ ఆరంభం కావడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది.
చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్
తాజాగా కోహ్లి కెప్టెన్సీ విషయంపై టీమిండియా చీఫ్ సెలక్టెర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో తనను ఎవరు సంప్రదించలేదన్న కోహ్లి మాటల్లో నిజం లేదు. వాస్తవానికి బీసీసీఐలోని ప్రతి సెలెక్టర్ సహా ఆఫీస్ బెరర్స్, సెలక్షన్ కమిటీ కన్వీనర్, ఇతర స్టాఫ్ మొత్తం కోహ్లిని కలిసి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరాం. టి20 ప్రపంచకప్ ముగిసేంత వరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకునే విషయాన్ని ప్రకటించొద్దని తెలిపాం. కానీ టి20 ప్రపంచకప్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అయితే ఈ విషయంలో బోర్డు సభ్యులంతా మరోసారి కోహ్లిని పునరాలోచించమన్నాం. అయితే టి20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ వదిలేస్తే వన్డే ఫార్మాట్‌లో కూడా వదిలేయాలని కోహ్లికి ఆ సమయంలో చెప్పాలనుకోలేదు. దానిని కోహ్లి అపార్థం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత అన్నీ ఆలోచించి కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించాం. ఉద్దేశపూర్వకంగా మాత్రం చేయాలనుకోలేదు. అంతిమంగా టీమిండియాకు ఎవరు కెప్టెన్‌గా ఉన్నా సరే.. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. ఇక వన్డే కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లికి, బీసీసీఐకి మధ్య ఎలాంటి వివాదం లేదు.. దయచేసి ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు.'' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment