భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి సెలక్షన్ బాధ్యతలను చేపట్టాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు?
బిసీసీఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
చేతన్ స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఎవరికి కనిపించని చేతన్ శర్మ కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు.అయితే తాజాగా మరోసారి సెలక్షన్ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. కానీ జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు.
దులీప్ ట్రోఫీలో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్.. తమ జట్టుకు మన్‌దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు.
చదవండి: భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు
Comments
Please login to add a commentAdd a comment