North Zone
-
శివాలెత్తిన శివమ్ దూబే.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్ జోన్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్ హార్విక్ దేశాయి (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే, కథన్ పటేల్ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. హర్షిత్ రాణా (54), నితీశ్ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్దీప్ (13), నిషాంత్ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ 3, సర్ఫరాజ్ ఖాన్, హంగార్గేకర్, త్రిపాఠి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్ జోన్ హార్విక్ దేశాయి, శివమ్ దూబే, కథన్ పటేల్ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (14), రాహుల్ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్ వ్యాస్ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్లలో నితీశ్ రాణా, రిషి ధవన్, మయాంక్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్ పరాగ్ విధ్వంసం.. నిజమేనా?
Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్ ట్రోఫీ-2023లో ఈస్ట్ జోన్ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్‌లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(10), ఉత్కర్ష్ సింగ్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ సింగ్ కేవలం 2 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సిక్సర్ల వర్షం ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్ సౌరభ్ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అద్భుత సెంచరీ 102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్ జోన్ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను రియాన్ పరాగ్ కకావికలం చేశాడు. నాలుగు వికెట్లు తీసి 10 ఓవర్ల బౌలింగ్‌లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుసేన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్ జోన్ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్‌జోన్ జయభేరి మోగించింది. అస్సలు ఊహించలేదు.. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్ పరాగ్ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్లో 7 ఇన్నింగ్స్ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్ దియోదర్ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. -
రాణించిన మయాంక్ అగర్వాల్.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్ (డక్‌వర్త్ లూయిస్‌కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్ జోన్‌పై గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (17), వాషింగ్టన్ సుందర్ (5) విఫలం కాగా.. రికీ భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో రిషి ధవన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, మయాంక్ యాదవ్, మయాంక్ డాగర్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్ శర్మ (1), గత ఐపీఎల్లో సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (2), నితీశ్ రాణా (4), రిషి ధవన్ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో శుభమ్ ఖజూరియా (10), మన్దీప్ సింగ్ (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్ సాయికిషోర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. విజేడీ పద్ధతి అంటే.. వి జయదేవన్ పద్ధతి.. క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్‌లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్‌లలో లక్ష్య స్కోర్లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది. కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్‌ల్లో ఉపయోగించారు. -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్‌గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
నితీష్ రాణాకు బంఫరాఫర్.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక!
జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా పర్వాలేదనపించాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన అద్బుత ప్రదర్శరనతో కేకేఆర్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా అతడికి గతంలో దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుగా కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ అప్పగించింది. ఇక రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. దేవధర్ ట్రోఫీకు ఎంపిక చేసిన నార్త్ జోన్ జట్టులో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఉన్నారు. దేవధర్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు: నితీష్ రాణా (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఎస్జి రోహిల్లా, ఎస్ ఖజురియా, మన్దీప్ సింగ్, హిమాన్షు రాణా, వివ్రాంత్ శర్మ, నిశాంత్ సింధు, రిషి ధావన్, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్క్ అరోరా మార్కండే చదవండి: MS Dhoni Reply To Yogi Babu: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్‌జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్‌జోన్ సీమర్ వైశాక్ విజయ్‌కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నార్త్‌జోన్‌ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్‌జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్‌జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్‌జోన్‌ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్‌కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్‌జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్‌కు తమీమ్ గుడ్‌బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్‌కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్‌లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో సౌత్ జోన్‌తో నార్త్ జోన్; వెస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో సెంట్రల్ జోన్, నార్త్‌జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్‌తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్‌సింగ్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్‌జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్‌రౌండ్ దెబ్బకు... నార్త్‌జోన్ ఆల్‌రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్‌జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్ ఈస్ట్‌జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్‌కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను నార్త్‌జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్‌సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్‌జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. -
నిశాంత్, హర్షిత్ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్‌తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్‌కు ఆధిక్యం ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్‌గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది. -
బీసీసీఐలోకి చేతన్ శర్మ.. మరోసారి సెలెక్టర్‌గా బాధ్యతలు
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి సెలక్షన్ బాధ్యతలను చేపట్టాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు? బిసీసీఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఎవరికి కనిపించని చేతన్ శర్మ కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు.అయితే తాజాగా మరోసారి సెలక్షన్ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. కానీ జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్.. తమ జట్టుకు మన్దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. చదవండి: భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు -
645 పరుగుల తేడాతో భారీ విజయం: కొత్త రికార్డు నమోదు
కోయంబత్తూర్: దేశవాళీ జోనల్ ఫస్ట్‌క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదైంది. ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్‌జోన్ ఏకంగా 645 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. దులీప్ ట్రోఫీ చరిత్రలో పరుగుల తేడాపరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 157/1తో ఆదివారం ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 316 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం. అనంతరం 740 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్‌జోన్ 30.4 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్, సాయికిశోర్, కృష్ణప్ప గౌతమ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన సాయికిశోర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మరో సెమీస్‌లో సెంట్రల్జోన్ను 279 పరుగులతో ఓడించి వెస్ట్‌జోన్ ఫైనల్ చేరింది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు. -
‘రీజినల్’ రెండో గెజిట్ విడుదల.. అభ్యంతరాలకు 21 రోజుల గడువు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి రెండో గెజిట్ విడుదలైంది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపీటెంట్ అథారిటీలోని 8 మంది అధికారులకుగాను ముగ్గురు అధికారుల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను పేర్కొంటూ 3 (క్యాపిటల్ ఏ)గా పిలిచే ఈ గెజిట్‌ను గురువారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్, అదే జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ఆర్డీవో, సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట ఆర్డీఓల పరిధిలోని 31 గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, దాని పరిధిలో సేకరించాల్సిన భూముల విస్తీర్ణాన్ని ఇందులో పేర్కొన్నారు. సేకరించే భూమిలో 617 హెక్టార్లకు సంబంధించిన సర్వే నంబర్ల వివరాలను ఈ గెజిట్‌లో పొందుపరిచారు. కంపీటెంట్ అథారిటీలో భాగంగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె గ్రామాలకు సంబంధించి 208.6090 హెక్టార్ల భూమిని సమీకరించనున్నట్లు గెజిట్‌లో వివరించారు. చదవండి👉🏼 మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు.. అలాగే సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివ్వంపేట, వెండికోల్, వెంకటకిష్టాపూర్ (అంగడి), లింగంపల్లి, కోర్పోల్ గ్రామాలకు సంబంధించి 108.9491 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. ఇక చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని చిన్నకొండూరు, వెర్కట్‌పల్లె, గోకారం, పొద్దటూరు, వలిగొండ, సంగం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్పూర్, కంచెన్‌పల్లె, టేకులసోమారం, రెడ్లరాపాక, నేలపట్ల, తల్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లె గ్రామాలకు సంబంధించి 300.3820 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు.. విడుదలైన ముగ్గురు కంపీటెంట్ అధికారుల అధీనంలోని ప్రాంతాల ప్రజలు పత్రికాముఖంగా గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలపై సమాధానాలు వెలువడ్డ తర్వాత రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల నిడివి ఎక్కడ ఉండనుందో రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి రాళ్లు పాతనున్నారు. దీన్ని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరికరాల శాటిలైట్ శాస్త్రీయ సర్వేతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నెల తర్వాత 3డీ గెజిట్.. గ్రామాలవారీగా భూసమీకరణ జరిగే సర్వే నంబర్లను రెండో గెజిట్‌లో పొందుపరచగా ఈ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించనున్నారో, దాని యజమాని ఎవరో స్పష్టం చేసే 3డీ గెజిట్ మరో నెల రోజుల తర్వాత విడుదల కానుంది. చదవండి👉🏼 సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు -
సౌత్‌జోన్‌కు మరో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ మహిళల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో సౌత్‌జోన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వడోదరలో శనివారం నార్త్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో సౌత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు సాధించింది. ఎల్. నేత్ర (42; 6 ఫోర్లు), ఎన్. అనూష (36; 5 ఫోర్లు), సంజుల నాయక్ (35 నాటౌట్, 2 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో గులియా, టీపీ కన్వర్, ఎన్ఎం చౌహాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం నార్త్‌జోన్ జట్టు 46.4 ఓవర్లలో 5 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హెచ్‌బీ డియోల్ (64; 11 ఫోర్లు), తానియా భాటియా (71 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. సౌత్‌జోన్ బౌలర్లలో సజన 2 వికెట్లు తీసింది. -
నార్త్‌జోన్ డబుల్ ధమాక
ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో నార్త్‌జోన్ జట్టు సత్తా చాటింది. రెండు ఈవెంట్లలోనూ విజేతగా నిలిచి టైటిల్స్‌ను దక్కించుకుంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగం ఫైనల్లో నార్త్ జోన్... సౌత్‌జోన్‌పై గెలుపొందగా, టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలోనూ నార్త్‌జోన్... వెస్ట్‌జోన్‌పై గెలిచి రెండు టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో వెస్ట్ జోన్... నార్త్‌జోన్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ విభాగంలో సౌత్‌జోన్... వెస్ట్‌జోన్‌పై విజయం సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో స్పోర్ట్స ప్రమోషన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఎస్పీబీ) ఆర్కే చతుర్వేది విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర విభాగాల విజేతల వివరాలు... బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్: 1. సిద్ధార్థ మనోజ్ ఠాకూర్, 2. కౌస్తుభ్ రావత్. మహిళల సింగిల్స్: 1. ఆర్తి సారా సునీల్, 2. సంచాలీ దాస్ గుప్తా. పురుషుల డబుల్స్: 1. మయాంక్-దేవేందర్ జోడీ, 2. సిద్ధార్థ- సృజన్ జోడీ. మహిళల డబుల్స్: 1. ఇషాంతి సావంత్- వల్లనీ బెకాని జోడీ, 2. గీత- గౌరీ జోడీ టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్: 1. అనిరుధ్, 2. శుభమ్ ఓజా. మహిళల సింగిల్స్: 1.సుతీర్థ, 2 చార్వి. -
ఆ జోన్‌పై నేరగాళ్లు గురి పెట్టారా?
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్క నయీం ముఠా (ఎన్–గ్యాంగ్) ప్రంకపనలు కొనసాగుతుండగా.. మరోపక్క నగరంలోని నార్త్‌జోన్‌లో (ఎన్–జోన్) శనివారం చోటు చేసుకున్న కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత దండు యాదగిరిపై కొందరు హత్యాయత్నం చేశారు. గడిచిన 25 రోజులుగా ఉత్తర మండలాన్ని నేరగాళ్లు తమ టార్గెట్‌గా చేసుకున్నారు. స్నాచింగ్, సూడో పోలీసు అటెన్షన్ డైవర్షన్... తుపాకులతో బెదిరించి దోపిడీలు, కాల్పులు జరిపి హత్యాయత్నం చేయడం వరకు జరిగాయి. వేళాపాళా లేకుండా వరుసపెట్టి... నార్త్‌జోన్ పరిధిలో జరిగిన వరుస సంచలనాత్మక నేరాలన్నీ కేవలం రాత్రి వేళల్లో జరిగినవి కాదు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య జరిగాయి. దీన్ని బట్టి నేరగాళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది. నార్త్‌జోన్ మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఉండటం, పారిపోవడానికి అనువైన ప్రాంతాలు/మార్గాలు సైతం ఎక్కువ కావడం దుండగులకు అనుకూలంగా మారుతోంది. దీన్ని ‘సద్వినియోగం’ చేసుకుంటున్న నేరగాళ్లు పోలీసు నిఘాను అపహాస్యం చేస్తూ వరుసపెట్టి పంజా విసరుతున్నారు. నార్త్‌జోన్‌లో గడిచిన 25 రోజుల్లో జరిగిన నేరాల్లో ఏ ఒక్క కేసూ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఉత్తర మండలంలో మొత్తం ఎనిమిది పోలీసుస్టేషన్లు ఉండగా... ఈ నేరాలన్నీ బోయినపల్లి, మహంకాళి, కార్ఖానా ఠాణాల పరిధుల్లోనే జరగడం గమనార్హం. వరుసగా రెండు రోజులూ... హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఉత్తర మండలం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్ అనుకొని ఉంటాయి. అల్వాల్, బోయిన్పల్లి ఠాణాలు సైతం సరిహద్దుల్లోనివే. ఈ రెండింటి పరిధిలో శుక్ర, శనివారాల్లో వరుసగా కాల్పుల కలకలం రేపాయి. అల్వాల్ ఠాణా పరిధిలోని మచ్చబొల్లారంలోని రెడ్డి వైన్స్ ఎదురుగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖాళీ తూటా స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం బోయిన్పల్లి ఠాణా పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జునకాలనీలో కాంగ్రెస్ నేత యాదరిగిపై కాల్పులు జరిగాయి. ఈ రెండు ఘటనల మధ్యా ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నార్త్‌జోన్ పరిధిలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ : నార్త్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో కార్డన్ సెర్చ్ ప్రారంభమైంది. తవాయిపురా, బోయిన్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గురువారం రాత్రి ఏడుగంటలకు ప్రారంభించిన తనిఖీల్లో120 మంది సాయుధ, సివిల్ పోలీసులు పాల్గొంటున్నారు. ఇల్లిల్లూ గాలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరో రెండు గంటలపాటు సోదాలు కొనసాగనున్నాయి.