ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నార్త్‌జోన్ జట్టు సత్తా చాటింది. రెండు ఈవెంట్‌లలోనూ విజేతగా నిలిచి టైటిల్స్‌ను దక్కించుకుంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగం ఫైనల్లో నార్త్ జోన్... సౌత్‌జోన్‌పై గెలుపొందగా, టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలోనూ నార్త్‌జోన్... వెస్ట్‌జోన్‌పై గెలిచి రెండు టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో వెస్ట్ జోన్... నార్త్‌జోన్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ విభాగంలో సౌత్‌జోన్... వెస్ట్‌జోన్‌పై విజయం సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో స్పోర్‌ట్స ప్రమోషన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఎస్‌పీబీ) ఆర్‌కే చతుర్వేది విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
ఇతర విభాగాల విజేతల వివరాలు...
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్: 1. సిద్ధార్థ మనోజ్ ఠాకూర్, 2. కౌస్తుభ్ రావత్. మహిళల సింగిల్స్: 1. ఆర్తి సారా సునీల్, 2. సంచాలీ దాస్ గుప్తా. పురుషుల డబుల్స్: 1. మయాంక్-దేవేందర్ జోడీ, 2. సిద్ధార్థ- సృజన్ జోడీ. మహిళల డబుల్స్: 1. ఇషాంతి సావంత్- వల్లనీ బెకాని జోడీ, 2. గీత- గౌరీ జోడీ
టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్: 1. అనిరుధ్, 2. శుభమ్ ఓజా. మహిళల సింగిల్స్: 1.సుతీర్థ, 2 చార్వి.
నార్త్‌జోన్ డబుల్ ధమాక
Published Sat, Nov 26 2016 11:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
Advertisement
Advertisement