దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్ జోన్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్ హార్విక్ దేశాయి (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే, కథన్ పటేల్ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. హర్షిత్ రాణా (54), నితీశ్ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్‌దీప్ (13), నిషాంత్ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ 3, సర్ఫరాజ్ ఖాన్, హంగార్గేకర్, త్రిపాఠి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన వెస్ట్ జోన్ హార్విక్ దేశాయి, శివమ్ దూబే, కథన్ పటేల్ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (14), రాహుల్ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్ వ్యాస్ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్లలో నితీశ్ రాణా, రిషి ధవన్, మయాంక్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment