Deodhar Trophy
-
శతక్కొట్టిన రోహన్.. మరోసారి మెరిసిన మాయాంక్ అగర్వాల్
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్‌లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు. That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i — CricTracker (@Cricketracker) August 3, 2023 సూపర్ ఫామ్‌లో మయాంక్.. దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్‌పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్‌పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు. -
పరాగ్ విధ్వంసకర సెంచరీ.. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో! నీలో ఇంత టాలెంట్ ఉందా?
దియోదర్ ట్రోఫీ-2023లో ఈస్ట్‌జోన్ స్టార్ ఆటగాడు రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరాగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 68 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 6 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమానర్హం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. నార్త్‌జోన్ బ్యాటర్లలో పరాగ్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్(38), ఉత్కర్ష్ సింగ్(50) విరాట్ సింగ్(42) పరుగులతో రాణించారు. ఇక 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్‌జోన్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ఇక రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. "నీలో ఇంత టాలెంట్ ఉందా, అస్సలు ఊహించలేదంటూ" సెటైర్లు వేస్తున్నారు. నార్త్‌జోన్ ఘన విజయం ఇక మరో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్జోన్పై నార్త్‌జోన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్‌జోన్ కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. మయాంక్ మార్కండే 4 వికెట్లు, మయాంక్ యాదవ్ 3 వికెట్లతో నార్త్ఈస్ట్ పతనాన్ని శాసించారు. అనంతరం 102 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన నార్త్‌జోన్ 12 ఓవర్లలోనే ఛేదించింది. నార్త్‌జోన్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(40 నాటౌట్), హిమాన్షు రాణా(52 నాటౌట్) పరుగులతో రాణించారు. చదవండి: Ravindra Jadeja On Kapil Dev Remarks: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ Hundred for the ages, Riyan Parag is a ✨, the celebration too is deserved. #Deodhar pic.twitter.com/NRZdZmGZhP — Aakash Sivasubramaniam (@aakashs26) August 1, 2023 -
శివాలెత్తిన శివమ్ దూబే.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్ జోన్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్ హార్విక్ దేశాయి (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే, కథన్ పటేల్ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. హర్షిత్ రాణా (54), నితీశ్ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్దీప్ (13), నిషాంత్ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ 3, సర్ఫరాజ్ ఖాన్, హంగార్గేకర్, త్రిపాఠి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్ జోన్ హార్విక్ దేశాయి, శివమ్ దూబే, కథన్ పటేల్ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (14), రాహుల్ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్ వ్యాస్ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్లలో నితీశ్ రాణా, రిషి ధవన్, మయాంక్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్‌సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్‌కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్‌పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్ పరాగ్ విధ్వంసం.. నిజమేనా?
Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్ ట్రోఫీ-2023లో ఈస్ట్ జోన్ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్‌లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(10), ఉత్కర్ష్ సింగ్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ సింగ్ కేవలం 2 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సిక్సర్ల వర్షం ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్ సౌరభ్ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అద్భుత సెంచరీ 102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్ జోన్ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను రియాన్ పరాగ్ కకావికలం చేశాడు. నాలుగు వికెట్లు తీసి 10 ఓవర్ల బౌలింగ్‌లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుసేన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్ జోన్ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్‌జోన్ జయభేరి మోగించింది. అస్సలు ఊహించలేదు.. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్ పరాగ్ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్లో 7 ఇన్నింగ్స్ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్ దియోదర్ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో
దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు. శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో ఇతర మ్యాచ్‌ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్‌పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్.. నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ఈస్ట్ జోన్‌ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు. -
ప్రియాంక్ పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్ల మోత, 99 నాటౌట్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇవాళ (జులై 24) జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఓపెనర్, ఆ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (69 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి మరో ఓపెనర్, వికెట్‌కీపర్ హార్విక్ దేశాయి (71 బంతుల్లో 85; 14 ఫోర్లు) సహకరించడంతో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. నార్త్ ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ జోన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 149 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంచల్, రాహుల్ త్రిపాఠి (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సగ్వస్వల్లా (3/31), షమ్స్ ములానీ (2/37), శివమ్ దూబే (2/36), చింతన్ గజా (1/25), సేథ్ (1/38), పార్థ్ భట్ (1/34) ధాటికి 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నార్త్ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్ ఆటగాడు టాప్ స్కోరర్‌గా (38) నిలవడం విశేషం. పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్ తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడిన ప్రియాంక్ పాంచల్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పాంచల్‌కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది 20వ అర్ధశతకం. లిస్ట్-ఏ క్రికెట్లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన పంచల్.. 40కి పైగా సగటుతో 3378 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫిఫ్టీలు, 7 శతకాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌పై 95 పరుగులు చేసిన పాంచల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. -
తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్-సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడి 207 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (8) సహా టాపార్డర్ అంతా విఫలం కాగా.. శివమ్ చౌదరీ (22), కర్ణ శర్మ (32) సహకారంతో రింకూ సింగ్ (63 బంతుల్లో 54; ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. కష్ట సమయంలో బరిలోకి దిగిన రింకూ సింగ్.. శివమ్ చౌదరీ, కర్ణ శర్మలతో చెరో 50 ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోర్ 200 దాటేలా చేశాడు. అనంతరం ఆరో వికెట్‌గా రింకూ వెనుదిరగడంతో సెంట్రల్ జోన్ పతనం ఆరంభమైంది. ఆ జట్టు మరో 31 పరుగులు జోడించి ఆఖరి 4 వికెట్లు కోల్పోయింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో మురసింగ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు పడగొట్టగా... ఉత్కర్ష్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాణించిన ఉత్కర్ష్ సింగ్.. ఈస్ట్ జోన్ సునాయాస విజయం అనంతరం 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. అభిమన్యు ఈశ్వరన్ (38), ఉత్కర్ష్ సింగ్ (89), సుభ్రాన్షు్ సేనాపతి (33 నాటౌట్) రాణించడంతో 46.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా గెలుపొందింది. సెంట్రల్ జోన్ బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. అదిత్య సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో సత్తా చాటిన (కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటున 149.52 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు) రింకూ సింగ్.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. అదే ఫామ్‌ను రింకూ ప్రస్తుతం దేశవాలీ టోర్నీల్లోనూ కొనసాగిస్తున్నాడు. -
నితీష్ రాణాకు బంఫరాఫర్.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక!
జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా పర్వాలేదనపించాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన అద్బుత ప్రదర్శరనతో కేకేఆర్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా అతడికి గతంలో దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుగా కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ అప్పగించింది. ఇక రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. దేవధర్ ట్రోఫీకు ఎంపిక చేసిన నార్త్ జోన్ జట్టులో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఉన్నారు. దేవధర్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు: నితీష్ రాణా (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఎస్జి రోహిల్లా, ఎస్ ఖజురియా, మన్దీప్ సింగ్, హిమాన్షు రాణా, వివ్రాంత్ శర్మ, నిశాంత్ సింధు, రిషి ధావన్, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్క్ అరోరా మార్కండే చదవండి: MS Dhoni Reply To Yogi Babu: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని -
కోహ్లి రికార్డును శుభ్‌మన్ బ్రేక్ చేశాడు..
రాంచీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటే తాజాగా అతని రికార్డు ఒకటి కనమరుగైంది. అది కూడా కోహ్లికి చెందిన 10 ఏళ్ల నాటి రికార్డును యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బద్ధలు కొట్టాడు. దేవధార్ ట్రోఫీలో భాగంగా భారత్-బితో జరిగిన ఫైనల్లో భారత్-సి మ్యాచ్‌కు శుభ్‌మన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దాంతో దేవధార్ ట్రోఫీ ఫైనల్లో పిన్నవయసులో ఒక జట్టుకు సారథిగా చేసిన రికార్డును శుభ్‌మన్ తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్ 20 ఏళ్ల 50 రోజుల వయసులో దేవధార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా చేయగా, కోహ్లి 21 ఏళ్ల 142 రోజుల వయసులో సారథిగా చేశాడు. 2009-10 సీజన్లో దేవధార్ ట్రోఫీ ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదే ఇప్పటివరకూ దేవధార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు పిన్నవయసులో కెప్టెన్‌గా చేసిన రికార్డు కాగా, దాన్ని శుభ్‌మన్ బ్రేక్ చేశాడు.(ఇక్కడ చదవండి: దినేశ్ కార్తీక్ క్యాచ్.. ఇప్పుడేమంటారు బాస్!) ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ కెప్టెన్‌గా వ్యవహరించిన భారత్-సి ఓటమి పాలైంది. ఈరోజు(సోమవారం) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-బి 283 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(54), కేదార్ జాదవ్(86)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో విజయ్ శంకర్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అనంతరం భారత్-సి 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులకే పరిమితమైంది. భారత్-సి జట్టులో ప్రియామ్ గార్గ్(74) అర్థ శతకం సాధించగా, అక్షర్ పటేల్(38), జయజ్‌సక్సేనా(37), మయాంక్ మార్కండే(27)లు మోస్తరుగా ఆడారు. గిల్(1) నిరాశపరిచాడు. దాంతో 51 పరుగుల తేడాతో భారత్-సి ఓటమి పాలుకాగా, పార్థీవ్ పటేల్ నేతృత్వంలోని భారత్-బి టైటిల్ గెలిచింది. -
దినేశ్ కార్తీక్ క్యాచ్.. ఇప్పుడేమంటారు బాస్!
రాంచీ: భారత జట్టులో అడప దడపా అవకాశాలు దక్కించుకుంటున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన ఫీల్డింగ్‌తో మరొకసారి మెరిశాడు. దేవధార్ ట్రోఫీలో భాగంగా భారత్-సి తరఫున ఆడుతున్న దినేశ్ కార్తీక్.. భారత్-బితో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్‌తో అలరించాడు. భారత్-బి ఆటగాడు పార్థీవ్ పటేల్ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి ఆఫ్ సైడ్ నుంచి బయటకు వెళుతున్న బంతిని దినేశ్ కార్తీక్ గాల్లో డైవ్ కొట్టి ఒడిసి పట్టుకున్నాడు. ఇషాన్ పరోల్ వేసిన తొమ్మిదో ఓవర్ ఆఖరి బంతిని పార్థీవ్ ఆడబోగా అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతి దాదాపు ఫస్ట్ స్లిప్‌కు కాస్త ముందు పడే అవకాశం ఉన్న తరుణంలో రెప్పపాటులో ఎగిరి ఒక్క చేత్తో అమాంతం అందుకున్నాడు. దీనిపై సోషల్ మీడియలో దినేశ్ కార్తీప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘ ఇప్పుడు చెప్పండి బాస్.. ఏమంటారు. కార్తీక్‌కు వయసు అయిపోయిదని చాలా మంది అంటున్నారు. ఇప్పటికీ పక్షిలా ఎగురుతూ క్యాచ్‌లు అందుకుంటున్నాడు. 2007లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్‌ను దినేశ్ ఎలా అందుకున్నాడో, ఇప్పుడు కూడా అదే తరహాలో పట్టుకున్నాడు. మరి దినేశ్ కార్తీక్‌కు వయసు అయిపోయిందని అందామా’ అంటూ ఒక అభిమాని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-బి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(54), కేదార్ జాదవ్(86)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో విజయ్ శంకర్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్-సి ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. శుభ్‌మన్ గిల్(1) నిరాశపరిచాడు. JUST @DineshKarthik things🤞.. Whatt a grabbb🙌... Well done thala❤️❤️❤️ pic.twitter.com/Kf0nsg5T5o — Sahil (@imsahil_27) November 4, 2019 -
రహానే ఇంకా సెంచరీ కాలేదబ్బా!
న్యూఢిల్లీ : దేశవాళీ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్కోర్ బోర్డు తప్పిదంతో పప్పులో కాలేసిన రహానే 97 పరుగులకే సెంచరీ అయిందని సంబరాలు చేసుకున్నాడు. సహచర ఆటగాడు సురేశ్ రైనా ఇది గుర్తించడంతో అక్కడ నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ‘సీ’ను విజయం వరించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఏంజరిగిందంటే.. భారత బీ బౌలర్ నదీమ్ వేసిన 37ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ రాబట్టిన రహానే సెంచరీ పూర్తయిందని డ్రెస్సింగ్ రూమ్‌వైపు బ్యాట్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో పాటు, గ్యాలరీలోని ప్రేక్షకులు కూడా రహానేను చప్పట్లతో అభినందించసాగారు. మరోవైపు స్కోరుబోర్డుపై కూడా అతను శతకం పూర్తి చేసుకున్నట్లు కనిపించింది. కానీ అప్పటికీ రహానే స్కోరు 97 పరుగులే అని.. ఇంకా శతకానికి మరో మూడు పరుగులు చేయాల్సి ఉందని సహచర ఆటగాడు సురేశ్ రైనా చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి. What happened there? 😁 😆 @ajinkyarahane88 felt he got to a 100, @ImRaina was quick to rectify there were 3 more runs to go 😄 pic.twitter.com/qi5RaMF8t8 — BCCI Domestic (@BCCIdomestic) October 27, 2018 కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యఛేదనకు దిగిన భారత్-బి సైతం గట్టిగానే పోరాడింది. భారత్-బి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేంత పనిచేశారు. కానీ భారత్-సీ బౌలర్లు చెలరేగడంతో భారత్-బి 46.1ఓవర్లలో 323పరుగులకు ఆలౌట్ అయింది. -
రహానే, ఇషాన్ కిషన్ సెంచరీలు
న్యూఢిల్లీ: ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ను విజయం వరించింది. కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగారు. ఫలితంగా దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ‘సి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. అనంతరం ఇషాన్ ఔటైనా... శుబ్‌మన్ గిల్ (26), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు)ల సాయంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రహానే జట్టుకు భారీ స్కోరు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్ 3, దీపక్ చహర్, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ‘బి’ జట్టు 46.1 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ‘బి’ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (14) త్వరగానే ఔటైనా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం రుతురాజ్, హనుమ విహారి (8), మనోజ్ తివారి (4) వెంట వెంటనే ఔటయ్యారు. ఆ సమయంలో అంకుశ్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి శ్రేయస్ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. 60 బంతుల్లో 70 పరుగులు చేయాల్సిన దశలో అయ్యర్ క్రీజులో ఉండటంతో గెలుపు సునాయాసమే అనిపించినా... 43వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ ‘బి’ ఓటమి ఖాయమైంది. ‘సి’ జట్టు బౌలర్లలో పప్పు రాయ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
అజింక్యా రహానే భారీ సెంచరీ
ఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానం జరుగుతున్న తుది పోరులో ఇండియా ‘సి’ కెప్టెన్ అజింక్యా రహానే భారీ సెంచరీ సాధించాడు. ఇండియా ‘బి’తో తుది పోరులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే అజేయంగా 144 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 156 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రహానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి జతగా ఇషాన్ కిషన్(114;87 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకం సాధించడంతో ఇండియా ‘సి’ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ‘సి’ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దాంతో ఇండియా ‘సి’ బ్యాటింగ్‌ను అజింక్యా రహానే, ఇషాన్ కిషన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్టుకు 210 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శుబ్మాన్ గిల్(26), సూర్యకుమార్ యాదవ్(39)లు నుంచి మాత్రమే రహానేకు సహకారం లభించగా, సురేశ్ రైనా(1), విజయ్ శంకర్(4)లు నిరాశపరిచారు. రహానే కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో ఇండియా ‘సి’ 350కు పైగా పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచుంది. ఇండియా ‘బి’ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, మయాంక్ మార్కండేలకు తలో రెండు వికెట్లు లభించాయి. -
నేను కూడా సిద్ధం: శుబ్మాన్ గిల్
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టులో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు యువ క్రికెటర్ శుబ్మాన్ గిల్. విండీస్ సిరీస్‌కు ఎంపిక కానప్పటికీ తర్వాతి సిరీస్‌కు సెలక్టర్లు తనకు అవకాశం ఇస్తారన్న నమ్మకం ఉందన్నాడు. దేవధర్ ట్రోఫీలో భాగంగా భారత సి జట్టు తరపున ఆడుతున్న శుబ్మాన్ గిల్ సెంచరీతో మెరిశాడు. అనంతరం గిల్ మాట్లాడుతూ.. భారత జట్టులో అరంగేట్రం చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో శుభమన్‌గిల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అద్భుతమైన శతకాలతో ఆకట్టుకున్నాడు. ట్రోఫీ గెలవడంలో పృథ్వీ షాతో కలిసి కీలక పాత్ర పోషించాడు. అయితే తన సహచర ఆటగాడు పృథ్వీ షా ఇప్పటికే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో శుబ్మాన్ గిల్ కూడా స్థానం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ‘జాతీయ జట్టు తరపున ఆడేందుకు నేను సిద్ధం. వెస్టిండీస్‌పై నాకు అవకాశం రాలేదు. తర్వాతి సిరీస్‌లో రావొచ్చు. పరుగులు చేయడం నాకిష్టం. మైదానంలోకి వెళ్లే ముందు వరకే అంచనాలు మదిలో ఉంటాయి. ఆ తర్వాత పరుగులు చేయడం పైనే ధ్యాసంతా. ఔటైతే ఏమవుతుందని ఆలోచించను. అండర్-19 ప్రదర్శనలను సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటారని తెలుసు. ఆ తర్వాతా వరుస ప్రదర్శనలు చేస్తేనే జాతీయ జట్టుకు అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో మ్యాచ్‌లను ప్రతిరోజూ టీవీల్లో చూసే అవకాశం ఉంది. దాంతో ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో తెలుస్తోంది. మా నాన్నే నా కోచ్’ అని శుబ్మాన్ గిల్ గిల్ పేర్కొన్నాడు. -
శుబ్‌మన్ అజేయ సెంచరీ
న్యూఢిల్లీ: అండర్–19 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (111 బంతుల్లో 106 నాటౌట్; ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ ‘సి’ జట్టు దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’పై 6 వికెట్ల తేడాతో ‘సి’ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (69; 5 ఫోర్లు), నితీశ్ రాణా (68; 6 ఫోర్లు, 1 సిక్స్), అన్మోల్ప్రీత్ సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు), కేదార్ జాదవ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టడంతో చివరి 10 ఓవర్లలో 92 పరుగులు వచ్చాయి. ప్రత్యర్థి బౌలర్లలో విజయ్ శంకర్ 3, చహర్ 2, గుర్బాని ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ ‘సి’ 47 ఓవర్లలో 4 వికెట్లకు 296 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లక్ష్యఛేదనలో 85 పరుగులకే కెప్టెన్ రహానే (14), అభినవ్ ముకుంద్ (37; 6 ఫోర్లు), సురేశ్ రైనా (2) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ‘సి’ జట్టును శుబ్‌మన్ గిల్ ఆదుకున్నాడు. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 69; 11 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 121, సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి అభేద్యమైన ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. విజయానికి 5 ఓవర్లలో 27 పరుగులు అవసరమైన దశలో శుబ్‌మన్, సూర్యకుమార్ యాదవ్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే ‘సి’ జట్టు గెలుపొందింది. అశ్విన్, ధవల్ కులకర్ణి, ములాని తలా ఓ వికెట్ పడగొట్టారు. సిరాజ్ నిరాశ పరిచాడు. మూడు ఓవర్లు వేసి 32 పరుగులిచ్చాడు. శనివారం జరిగే ఫైనల్లో భారత్ ‘బి’తో ‘సి’ జట్టు తలపడనుంది. -
దేవధర్ ఫైనల్లో భారత్ ‘బి’
న్యూఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టు ఫైనల్‌కు చేరింది. భారత్ ‘సి’తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ 30 పరుగులతో నెగ్గింది. తొలుత విహారి (76; 6 ఫోర్లు) రాణించడంతో భారత్ ‘బి’ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. తర్వాత భారత్ ‘సి’ 48.1 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. -
రాణించిన విహారి
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో హనుమ విహారి (95 బంతుల్లో 87 నాటౌట్; 9 ఫోర్లు), బౌలింగ్‌లో షాబాజ్ నదీమ్ (3/32), మయాంక్ మార్కండే (4/48) రాణించడంతో భారత్ ‘బి’ జట్టు దేవధర్ ట్రోఫీలో శుభారంభం చేసింది. భారత్ ‘ఎ’తో మంగళవారం జరిగిన పోరులో ‘బి’ జట్టు 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా భారత్ ‘బి’ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. విహారి అజేయ అర్ధశతకం సాధించగా, మనోజ్ తివారి (52; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ఎ’ బౌలర్లలో అశ్విన్ 2, సిరాజ్, కులకర్ణి, సిద్ధార్థ్ కౌల్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ‘ఎ’... పృథ్వీ షా (7) విఫలమవగా, 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (114 బంతుల్లో 99; 11 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (54; 5 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. దీంతో లక్ష్యం దిశగా పయనించింది. 210/5 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే మయాంక్ మార్కండే, నదీమ్‌ల స్పిన్ మ్యాజిక్‌తో అనూహ్యంగా 8 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కోల్పోయి 218 స్కోరు వద్ద ఆలౌటైంది. -
నేటి నుంచే దేవధర్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఉనికి చాటేందుకు అటు సీనియర్లకు, సత్తా నిరూపించుకునేందుకు ఇటు కుర్రాళ్లకు మరో అవకాశం. ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచే దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ. టీమిండియా వన్డే జట్టులోకి పునరాగమనం ఆశిస్తున్న అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్‌లకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. దీంతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ‘ఎ’కు ఎంపికయ్యేందుకు కుర్రాళ్లకూ ఓ వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో భారత్ ‘బి’ తలపడుతుంది. ఈ టోర్నీలో భాగంగా ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్ 27న జరుగుతుంది. అశ్విన్, పృథ్వీ షా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్‌లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టుకు దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని ‘బి’ జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రోహిత్ రాయుడు, దీపక్ చహర్‌లకు స్థానం దక్కింది. రహానే కెప్టెన్‌గా ఉన్న ‘సి’ జట్టులో సురేశ్ రైనా, అభినవ్ ముకుంద్, శుబ్‌మన్ గిల్, ఆర్. సమర్థ్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు. -
ఆఖరి ఓవర్లో కర్ణాటక గెలుపు
ధర్మశాల: విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరం. భారత్ ‘బి’ బ్యాట్స్‌మన్ సిద్దేశ్ లాడ్ (70; 6 ఫోర్లు) జోరు మీదున్నాడు. చివరి ఓవర్ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ బంతినందుకున్నాడు. ఈ స్థితిలో ‘బి’ జట్టే గెలిచేలా కనిపిచింది. కానీ గౌతమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. లాడ్‌ను అవుట్ చేయడంతో పాటు నాలుగే పరుగులిచ్చాడు. దీంతో సోమవారం జరిగిన దేవధర్ ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో కర్ణాటక 6 పరుగులతో నెగ్గింది. మొదట కర్ణాటక 50 ఓవ ర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. రవి సమర్థ్ (117; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదాడు. సిద్ధార్థ్ కౌల్ (3/49) రాణించాడు. ఛేదనలో ‘బి’ జట్టు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (4) విఫలమయ్యాడు. ఈ స్థితిలో మనోజ్ తివారీ (120; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) నిలిచాడు. చక్కగా ఆడిన అతడికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33), లాడ్ సహకరించారు. 42వ ఓవర్‌కు 241/4తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినా వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి వెనుకబడింది. శ్రేయస్ గోపాల్ 3 వికెట్లు తీశాడు. -
అశ్విన్‌కు గాయం... ‘దేవధర్’కు దూరం
న్యూఢిల్లీ: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయంతో దేవధర్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ నెల 4 నుంచి 8 వరకు జరగనున్న ఈ వన్డే టోర్నీలో అతను భారత్ ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. అయితే అతను దూరం కావడంతో షాబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంకిత్ బావ్నేకు ‘ఎ’ జట్టు పగ్గాలు అప్పగించారు. -
భారత ‘ఎ’ జట్టులో రోహిత్ రాయుడు
ముంబై: దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో పాల్గొనే భారత్ ‘ఎ’, ‘బి’ జట్లను సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ రోహిత్ రాయుడుకు చోటు దక్కింది. ఇన్నాళ్లు రంజీ జట్లకే పరిమితమైన రోహిత్ రాయుడు తొలిసారి భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 357 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆంధ్ర ఆటగాళ్లలో రికీ భుయ్ కూడా ‘ఎ’ జట్టులో ఉండగా... హనుమ విహారి, కోనా శ్రీకర్ భరత్ ‘బి’ జట్టుకు ఎంపికయ్యారు. భారత ‘ఎ’ జట్టుకు అశ్విన్, ‘బి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తారు. ఈ రెండు జట్లతో పాటు విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు దేవధర్ టోర్నీలో తలపడుతుంది. మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టునూ ప్రకటించారు. దీనికి కరుణ్ నాయర్ సారథ్యం వహిస్తాడు. ఈ మ్యాచ్ వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇందులో రెస్టాఫ్ ఇండియా... రంజీ చాంపియన్ విదర్భతో తలపడుతుంది. -
సెంచరీతో దుమ్మురేపిన దినేశ్ కార్తీక్
91 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 126 పరుగులు విశాఖపట్నం: దేశీయ క్రికెట్లో తమిళనాడు జట్టు మరోసారి దుమ్మురేపింది. 42 పరుగుల తేడాతో ఇండియా బీ జట్టును ఓడించి.. దేవధర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో 2016-17 దేశీయ క్రికెట్ సీజన్లో వరుసగా వన్డే ట్రోఫీలను ఆ జట్టు కైవసం చేసుకున్నట్టు అయింది. ఇటీవలే ఆ జట్టు ఫైనల్లో బెంగాల్ జట్టును ఓడించి విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం విశాఖపట్నంలో జరిగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో ఇండియా బీ జట్టును తమిళ జట్టు మట్టికరిపించింది. దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడి 91 బంతుల్లో (నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో) 126 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 303 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇండియా బీ జట్టు 261 పరుగులకే పరిమితమైంది. తమిళ బౌలర్లు సమిష్టిగా రాణించి.. ప్రత్యర్థిని నిలువరించారు. -
భారత్ ‘బి’ గెలుపు
సాక్షి, విశాఖపట్నం: తొలుత శిఖర్ ధావన్ (122 బంతుల్లో 128; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ... ఆ తర్వాత ధవల్ కులకర్ణి ‘హ్యాట్రిక్’ సాధించడంతో... దేవధర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో పార్థివ్ పటేల్ నాయకత్వంలోని భారత్ ‘బి’ జట్టు 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్ ‘బి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం భారత్ ‘ఎ’ జట్టు 48.2 ఓవర్లలో 304 పరుగులు చేసి పోరాడి ఓడింది. అంబటి రాయుడు (92 బంతుల్లో 92; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత్ ‘బి’ బౌలర్ ధవల్ కులకర్ణి 47వ ఓవర్ ఆఖరి బంతికి శార్దూల్ ఠాకూర్‌ను... 49వ ఓవర్ తొలి బంతికి దీపక్ హుడాను, రెండో బంతికి సిద్ధార్థ్ కౌల్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ ‘బి’తో తమిళనాడు తలపడుతుంది. -
కెప్టన్లుగా రోహిత్ ,పార్థివ్
►ఇండియా ‘బ్లూ’ కెప్టెన్‌గా రోహిత్ ►‘రెడ్’ జట్టు సారథిగా పార్థివ్.. ►దేవ్‌ధర్ ట్రోఫీ కోసం జట్ల ప్రకటన ముంబై: ఈనెల 25 నుంచి జరిగే దేవ్‌ధర్ ట్రోఫీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘రెడ్’ జట్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ‘బ్లూ’కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ‘రెడ్’ జట్టుకు పార్థివ్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ విజేత హోదాలో తమిళనాడు మూడో జట్టుగా బరిలోకి దిగనుంది. ‘బ్లూ’ జట్టులో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అంబటి రాయుడు, శార్దుల్ ఠాకూర్ చోటు దక్కించుకోగా.. ‘రెడ్’ జట్టులో శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణి స్థానం పొందారు. ఇండియా బ్లూ జట్టు: రోహిత్ (కెప్టెన్), హర్భజన్, మన్దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, రాయుడు, మనోజ్ తివారీ, రిషబ్ పంత్, దీపక్ హూడా, క్రునాల్ పాండ్య, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, శార్దుల్, ప్రసిధ్ కృష్ణ, పంకజ్ రావు. ఇండియా రెడ్ జట్టు: పార్థివ్ (కెప్టెన్), ధావన్, మనీశ్, మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, ఇషాంక్ జగ్గీ, గుర్కీరత్ మాన్, అక్షర్, అక్షయ్ కర్నేవార్, అశోక్ దిండా, కుల్వంత్ ఖెజ్రోలియా, ధావల్, గోవిందా పొద్దార్.