దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్ | Deodhar Trophy won west zone team | Sakshi
Sakshi News home page

దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్

Published Fri, Mar 28 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్

దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్

సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ జోనల్ వన్డే టోర్నీ ‘దేవధర్ ట్రోఫీ’ని వెస్ట్‌జోన్ కైవసం చేసుకుంది. విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్ 133 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను చిత్తు చేసింది.
 
 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 281 పరుగులు చేసింది. కేదార్ దేవధర్ (101 బంతుల్లో 94; 9ఫోర్లు, 1 సిక్సర్), చతేశ్వర్ పుజారా (114 బంతుల్లో 75; 4 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన నార్త్‌జోన్ 37.1 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. మన్‌దీప్ సింగ్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్ట్‌జోన్ బౌలర్లు అర్పిత్ (3/20), అక్షర్ పటేల్ (2/23) ఆకట్టుకున్నారు. కేదార్ దేవధర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement