ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్‌లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i
— CricTracker (@Cricketracker) August 3, 2023
సూపర్ ఫామ్‌లో మయాంక్..
దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్‌పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్‌పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment