
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 30) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుండగా.. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ మ్యాచ్‌కు వైజాగ్ వేదిక కానుండగా.. సీఎస్‌కే, రాయల్స్ మ్యాచ్ గౌహతిలో జరుగనుంది.
ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్‌పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.
ఈ సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో రాయల్స్‌పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్‌లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
జట్లు (అంచనా)..
సన్‌రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపా
ఢిల్లీ: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
సీఎస్‌కే, రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కూడా హోరీహోరీగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించని ఈ పిచ్‌పై ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందో చూడాలి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా బౌలర్లే కీలకపాత్ర పోషించవచ్చు. రాజస్థాన్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సీఎస్‌కే రెండింట ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో తలపడగా.. రాయల్స్ 13, సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
తుది జట్లు (అంచనా)..
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ (కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ/సందీప్ శర్మ
సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ