
విశాఖపట్నం వేదికగా ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఇక్కడే జరిగిన గత మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించిన ఢిల్లీకి ఇది రెండో ‘హోం మ్యాచ్’ కానుంది. మరో వైపు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి మరొకటి ఓడిన సన్‌రైజర్స్ లీగ్‌లో మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది.
లక్నోతో మ్యాచ్‌లో దాదాపుగా ఓటమికి చేరువై అశుతోష్ అసాధారణ బ్యాటింగ్‌తో గెలుపు అందుకున్న అక్షర్ పటేల్ బృందం సమష్టిగా రాణిస్తేనే మరో విజయానికి అవకాశం ఉంటుంది. మరో వైపు తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన రైజర్స్ బ్యాటర్లు తర్వాతి పోరులో తడబడ్డారు.
అయితే అంచనాలకు అనుగుణంగా హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ సత్తా చాటితే జట్టు భారీ స్కోరు సాధించడం ఖాయం. వైజాగ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగుతుండటంతో అభిమానులు కూడా మ్యాచ్ పట్ల ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.