దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది.
రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌
— BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023
Congratulations to the @mayankcricket-led unit 👏👏
East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌
Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr
చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment