
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది.
సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్.
చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన
Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా