Deodhar Trophy
-
Riyan Parag: ఓవరాక్షన్ ప్లేయర్ అన్న నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు..!
ఆన్ ఫీల్డ్ బిహేవియర్ కారణంగా ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్ర వేసుకున్న టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్.. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటున్నాడు. ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన రియాన్.. తాజాగా ముగిసిన దియోదర్ ట్రోఫీ-2023లో బ్యాట్‌తో బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. దియోదర్ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడిన రియాన్.. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన రియాన్.. బంతితోనూ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన రియాన్.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తన జట్టు (ఈస్ట్ జోన్) కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. సౌత్ జోన్‌తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 21 ఏళ్ల రియాన్.. తన జట్టును గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. తొలుత బంతితో (2/68) మ్యాజిక్ చేసిన రియాన్.. ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగాస్వామ్యం నెలకొల్పిన రియాన్.. ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ ఓటమి ఖరారైంది. కాగా, దియోదర్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్.. రోహన్ కున్నుమ్మల్ (107), మయాంక్ అగర్వాల్ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్ జోన్.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. దియోదర్ ట్రోఫీ-2023లో రియాన్ పరాగ్ స్కోర్లు, వికెట్లు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 13 పరుగులు, 4 వికెట్లు నార్త్ జోన్‌పై 131 పరుగులు, 4 వికెట్లు సౌత్ జోన్‌పై 13 పరుగులు, ఒక వికెట్ వెస్ట్ జోన్‌పై 102 నాటౌట్ ఫైనల్లో సౌత్ జోన్‌పై 95 పరుగులు, 2 వికెట్లు -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్.. మరో మెరుపు సెంచరీ
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఏకైక సెంచరీ చేసిన యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రస్తుతం జరుగుతున్న దియోదర్ ట్రోఫీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (103) బాదిన ప్రభ్‌సిమ్రన్.. దియోదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌తో ఇవాళ (జులై 26) జరుగుతున్న మ్యాచ్‌లో 92 బంతుల్లో శతక్కొట్టాడు. Relive that special 💯 moment here 🔽#TATAIPL | #DCvPBKS https://t.co/eBGUL8gkVh pic.twitter.com/uWI2uW8vB8 — IndianPremierLeague (@IPL) May 13, 2023 ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ (నార్త్ జోన్).. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్ హీరోలు అభిషేక్ శర్మ (19), నిషాంత్ సింధు (18), హర్షిత్ రాణా (5), వివ్రాంత్ శర్మ (1) నిరశపర్చగా.. హిమాన్షు రాణా (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో యశ్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, కర్ణ్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. దియోదర్ ట్రోఫీ-2023లో ప్రభ్సిమ్రన్దే తొలి సెంచరీ కావడం విశేషం. తృటిలో సెంచరీని చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మయాంక్, అరుణ్ కార్తీక్ (23), విజయ్‌కుమార్ వైశాఖ్ (20 నాటౌట్), కావేరప్ప (19) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయకపోవడంతో వెస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్ జోన్ బౌలర్లలో పార్థ్ భట్ 3, షమ్స్ ములానీ, హంగార్గేకర్ చెరో 2 వికెట్లు, నగ్వస్వల్లా, అతీథ్ సేథ్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
రాణించిన మయాంక్ అగర్వాల్.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్ (డక్‌వర్త్ లూయిస్‌కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్ జోన్‌పై గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (17), వాషింగ్టన్ సుందర్ (5) విఫలం కాగా.. రికీ భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో రిషి ధవన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, మయాంక్ యాదవ్, మయాంక్ డాగర్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్ శర్మ (1), గత ఐపీఎల్లో సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (2), నితీశ్ రాణా (4), రిషి ధవన్ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో శుభమ్ ఖజూరియా (10), మన్దీప్ సింగ్ (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్ సాయికిషోర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. విజేడీ పద్ధతి అంటే.. వి జయదేవన్ పద్ధతి.. క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్‌లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్‌లలో లక్ష్య స్కోర్లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది. కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్‌ల్లో ఉపయోగించారు. -
అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
జడేజా అవుట్.. అశ్విన్ ఇన్
న్యూఢిల్లీ : ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్‌కు కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్‌లో జరగనున్న మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్స్‌తో తలపడనుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్మోల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, నవ్‌దీప్ సైనీ, అతీత్ -
దేవధర్ ట్రోఫీ తమిళనాడుదే
⇒‘శత’క్కొట్టిన దినేశ్ కార్తీక్ ⇒ఫైనల్లో భారత్ ‘బి’పై గెలుపు విశాఖపట్నం: ఈ సీజన్లో తమిళనాడు ఆటగాళ్లు జోరుమీదున్నారు. ఇప్పటికే దేశవాళీ పరిమిత ఓవర్ల విజయ్ హజారే టైటిల్ గెలిచిన తమిళనాడు తాజాగా దేవధర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో 42 పరుగుల తేడాతో భారత్ ‘బి’ జట్టుపై విజయం సాధించింది. టాస్ నెగ్గిన తమిళనాడు మొదట బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీస్కోరు చేసింది. దినేశ్ కార్తీక్ (91 బంతుల్లో 126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు. జగదీశన్ (55; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. ధవల్ కులకర్ణి 39 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ ‘బి’ జట్టు 46.1 ఓవర్లలో 261 పరుగులు మాత్రమే చేసింది. గుర్కీరత్ సింగ్ (64; 7 ఫోర్లు), శిఖర్ ధావన్ (45; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మనీశ్ పాండే (32), హర్‌ప్రీత్ సింగ్ (36) మెరుగనిపించారు. తమిళనాడు బౌలర్లలో రాహిల్ షా 3, సాయికిషోర్, మొహమ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.