
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఏకైక సెంచరీ చేసిన యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రస్తుతం జరుగుతున్న దియోదర్ ట్రోఫీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (103) బాదిన ప్రభ్‌సిమ్రన్.. దియోదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌తో ఇవాళ (జులై 26) జరుగుతున్న మ్యాచ్‌లో 92 బంతుల్లో శతక్కొట్టాడు.
Relive that special 💯 moment here 🔽#TATAIPL | #DCvPBKS https://t.co/eBGUL8gkVh pic.twitter.com/uWI2uW8vB8
— IndianPremierLeague (@IPL) May 13, 2023
ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ (నార్త్ జోన్).. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్‌దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్ హీరోలు అభిషేక్ శర్మ (19), నిషాంత్ సింధు (18), హర్షిత్ రాణా (5), వివ్రాంత్ శర్మ (1) నిరశపర్చగా.. హిమాన్షు రాణా (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో యశ్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, కర్ణ్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. దియోదర్ ట్రోఫీ-2023లో ప్రభ్‌సిమ్రన్‌దే తొలి సెంచరీ కావడం విశేషం.
తృటిలో సెంచరీని చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్..
ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మయాంక్, అరుణ్ కార్తీక్ (23), విజయ్‌కుమార్ వైశాఖ్ (20 నాటౌట్), కావేరప్ప (19) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయకపోవడంతో వెస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్ జోన్ బౌలర్లలో పార్థ్ భట్ 3, షమ్స్ ములానీ, హంగార్గేకర్ చెరో 2 వికెట్లు, నగ్వస్వల్లా, అతీథ్ సేథ్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.