Mayank Agarwal
-
అరివీర భయంకర ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. ఐదింట నాలుగు శతకాలు
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఇందులో హ్యాట్రిక్ సెంచరీలు సహా ఓ హాఫ్ సెంచరీ ఉంది.పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత అరుణాచల్ ప్రదేశ్‌పై 100 నాటౌట్‌గా నిలిచాడు. దీని తర్వాత హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన మయాంక్ హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (69) చేసిన మయాంక్.. తాజాగా నాగాలాండ్‌పై 116 నాటౌట్‌గా నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత ఎడిషన్‌లో మయాంక్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 613 పరుగులు చేశాడు. వీహెచ్‌టీ 2024-25లో మయాంక్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో మయాంక్ 153.25 సగటున 111.66 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో 66 బౌండరీలు, 18 సిక్సర్లు ఉన్నాయి.నాగాలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక నాగాలాండ్‌ను 48.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ చేసింది. శ్రేయస్ గోపాల్ 4, అభిలాశ్ షెట్టి 2, కౌశిక్, హార్దిక్ రాజ్, విద్యాధర్ పాటిల్, నికిన్ జోస్ తలో వికెట్ తీసి నాగాలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (77 నాటౌట్), కెప్టెన్ జోనాథన్ (51) అర్ద సెంచరీలు సాధించారు. వీరిద్దరు మినహా నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు.207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 37.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మయాంక్ సూపర్ సెంచరీతో అలరించగా.. అనీశ్ కేవీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్ జోస్ 13 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నికిన్ జోస్ వికెట్ లెమ్టూర్కు దక్కింది. ఈ గెలుపుతో కర్ణాటక గ్రూప్-సిలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది. -
హ్యాట్రిక్ సెంచరీల వీరుడికి షాక్.. వరుణ్ వీరోచిత శతకంతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో హైదరాబాద్ జట్టును గెలిపించాడు.మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.తిలక్ వర్మ @99ఇక హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది. కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్ గౌడ్ వీరవిహారం చేశాడు.వరుణ్ వీరోచిత శతకంతిలక్, వరుణ్ ఐదో వికెట్‌కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ ఏడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.చివరి ఓవర్ తొలి బంతికి తనయ్ అవుటైనా... చామా మిలింద్ (4 నాటౌట్)తో కలిసి వరుణ్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109 నాటౌట్‌గా నిలిచి హైదరాబాద్‌ను గెలిపించిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌తో హైదరాబాద్ ఆడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
వరుసగా మూడో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్
విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2024-25లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ 112 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మయాంక్ సూపర్ సెంచరీతో విరుచుకుపడటంతో కర్ణాటక భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ నికిన్ జోస్ 37, వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్ 11, ఆతర్వాత వచ్చి న స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ రాయుడు డకౌటయ్యాడు. అభిలాశ్ షెట్టి రోహిత్ రాయుడును క్లీన్ బౌల్డ్ చేశాడు. తన్మయ్ అగర్వాల్ (30), కెప్టెన్ తిలక్ వర్మ (25) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవాలంటే 37 ఓవర్లలో మరో 263 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.గ్రూప్ టాపర్‌గా కర్ణాటకవిజయ్ హజారే ట్రోఫీ పాయింట్ల పట్టికలో కర్ణాటక గ్రూప్ టాపర్‌గా నిలిచింది. గ్రూప్-సిలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. గ్రూప్-సిలో పంజాబ్, సౌరాష్ట్ర, ముంబై వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. గ్రూప్-ఏలో గుజరాత్.. గ్రూప్-బి నుంచి మహారాష్ట్ర, గ్రూప్-డి నుంచి విదర్భ, గ్రూప్-ఈ నుంచి మధ్యప్రదేశ్ టాపర్లుగా ఉన్నాయి. -
శతక్కొట్టిన మయాంక్ అగర్వాల్.. రాణించిన మనీశ్ పాండే
టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ మెరుపు సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 12 బౌండరీల సాయంతో 105 పరుగులు చేశాడు. మయాంక్‌కు జతగా మనీశ్ పాండే (56) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్, మనీశ్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బీహార్ బౌలర్లలో హిమాన్షు సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సకీబ్ హుసేన్ రెండు, వైభవ్ సూర్యవంశీ ఓ వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. షర్మన్ నిగ్రోద్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. గనీ (13), బిపిన్ సౌరభ్ (31), ప్రతాప్ సింగ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మొహిసిన్ ఖాన్ 3, విద్యాధర్ పాటిల్, విజయ్‌కుమార్ వైశాఖ్, వి కౌశిక్ తలో వికెట్ దక్కించుకున్నారు.144 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బీహార్ నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (6), షర్మన్ నిగ్రోద్ (0) ఔట్ కాగా.. బాబుల్ కుమార్ (11), గనీ (9) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బీహార్ ఇంకా 117 పరుగులు వెనుకపడి ఉంది. -
టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి
దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్‌లో జరుగుతున్నాయి.టీమిండియా ప్లేయర్లు విఫలంఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది. షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం -
అప్పుడు డకౌట్.. ఇప్పుడు వికెట్! శ్రేయస్ సెలబ్రేషన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో ఇండియా-‘డి’ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్‌లో ఈ మేర తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్ ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగాడు.తొలి టెస్టులో స్థానం దక్కలేదుఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది ఇండియా-‘డి’.దేవ్‌దత్ పడిక్కల్ 92కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా.. మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవ్‌దత్ పడిక్కల్ 92 రన్స్‌తో అదరగొట్టగా.. రికీ భుయ్ 23, హర్షిత్ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగలింది.స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్వయంగా రంగంలోకి దిగాడు.రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల అయ్యర్.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(56)ను అవుట్ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్ క్యాచ్ అందుకుని మయాంక్‌కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వికెట్ తీయడం ఇదే తొలిసారి. అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్‌లో అతడు వికెట్(చేతన్ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్Golden Arm! 💪Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్‌గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌గా ఎంపికయ్యాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్‌బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్‌లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్‌మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
‘జఫ్పా’తో మాయచేసిన సైనీ.. గిల్ బౌల్డ్!.. స్కోరెంతంటే?
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దులిప్ ట్రోఫీ-2024లో శుభారంభం అందుకోలేకపోయాడు. ఇండియా-‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇండియా- ‘బి’తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.నిరాశపరిచిన గిల్క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు సాధిస్తాడనుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ పేసర్ నవదీప్ సైనీ సంధించిన ‘జఫ్ఫా(పర్ఫెక్ట్ బాల్)’ ధాటికి బౌల్డ్ అయ్యాడు. దులిప్ ట్రోఫీ తొలి రౌండ్లో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ముషీర్ ఖాన్ శతకం కారణంగా ఇండియా-బి మెరుగైన స్కోరుఈ క్రమంలో ఇండియా-బి తరఫున అరంగేట్ర బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత శతకం(181)తో ఆకట్టుకోగా.. పేసర్ నవదీప్ సైనీ సైతం సంచలన ఇన్నింగ్స్(56) ఆడాడు. వీరిద్దరు రాణించిన కారణంగా 321 పరుగుల వద్ద రెండోరోజు ఇండియా-బి తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించాడు.సైనీ జఫ్ఫా.. గిల్ బౌల్డ్ఈ కర్ణాటక బ్యాటర్ 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. నఅయితే, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 43 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నవదీస్ సైనీ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో గిల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.వీడియో వైరల్అనంతరం నవదీప్ సైనీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో మయాంక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో రెండో రోజు ఆటలో ఇండియా-ఏ రెండో వికెట్ కోల్పోయింది. ఆట పూర్తయ్యే సరికి రియాన్ పరాగ్ 27, కేఎల్ రాహుల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్ అవుటైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్.. తదుపరి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక నేపథ్యంలో గిల్ తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు..Terrific delivery 🔥Excellent catch 👌Navdeep Saini bowled a peach to dismiss Shubman Gill and Rishabh Pant pulled off a superb diving catch to remove Mayank Agarwal.#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/z1cCHONjCI— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? కేకేఆర్ స్టార్ రిప్లై వైరల్
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మెగా టోర్నీలో హర్షిత్ మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్ సెలబ్రేషన్స్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్ రాణా. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్ పేసర్.మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోతఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్‌ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్‌కు సెండాఫ్ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.భయ్యాతో మాట్లాడానుతాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హర్షిత్ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్ భయ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.ఆ సమయంలో వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్ కూడా నా వైపే ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మయాంక్ భయ్యాను కలిశాను.తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? ఈ క్రమంలో విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్‌లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.నన్ను చాలెంజ్ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్ దశలో దుమ్ములేపిన కేకేఆర్.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! -
Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)
-
రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్‌రైజర్స్
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీలక సమయంలో కాస్త గట్టిగానే సలహాలు, సూచనలు ఇచ్చే హిట్‌మ్యాన్.. అప్పుడప్పుడూ చిలిపి చేష్టలతో వారిని ఆటపట్టిస్తుంటాడు కూడా! తాజాగా రోహిత్ శర్మ ‘బాధితుల’ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేరాడు. కాగా ఐపీఎల్-2024లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న సందర్భంగా రోహిత్ శర్మ.. మయాంక్ అగర్వాల్‌ను టీజ్ చేశాడు. మయాంక్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ అల్లరి చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ హర్షిత్ రాణాను ఇమిటేట్ చేస్తూ అతడిని ఆటపట్టించాడు. దీంతో మయాంక్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘ఇక చాల్లే’’ అన్నట్లుగా రోహిత్‌కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘‘ఫ్లైయింగ్ కిస్సులు.. స్నేహపూర్వక శత్రుత్వాలు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. కాసేపటికే డిలీట్ చేసింది. మయాంక్ పట్ల హర్షిత్ రాణా ప్రవర్తించిన తీరును కూడా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Rohit Sharma things 😄#RohitSharma𓃵 #MayankAgarwal #MIvsSRH pic.twitter.com/o1C7l2OrGF — RSSB_BEROJGAR (@rssb_berojgar) March 27, 2024 కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. కేకేఆర్‌తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మయాంక్ తొలి ఓవర్ నుంచే హర్షిత్ రాణాను టార్గెట్ చేస్తూ వరుస బౌండరీలు బాదాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 అయితే, అనూహ్యంగా అతడి బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోపంగా.. మయాంక్‌ను చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వికెట్ సెలబ్రేట్ చేసుకున్నాడు హర్షిత్. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ దూకుడుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా అతి చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ నిర్వాహకులు.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కారణంగా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. అదీ సంగతి! -
IPL 2024 ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్‌లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్‌తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్‌ను ఔట్ చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
IPL 2024: ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా ఓవరాక్షన్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం రానా సెలబ్రేషన్స్ శృతిమించాయి. ఏమి జరిగిందంటే? 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ వేసిన హర్షిత్ రానాను అగర్వాల్ టార్గెట్ చేశాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ రానాను మయాంక్ ఒత్తడిలోకి నెట్టాడు. రానా తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కెప్టెన్ అయ్యర్ మాత్రం పవర్ ప్లేలో మరో ఓవర్ వేసే అవకాశమిచ్చాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో మయాంక్ భారీ షాట్‌కు ప్రయత్నించి రింకూ సింగ్ చేతికి చిక్కాడు. అయితే వికెట్ తీసిన సంతోషంలో రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మయాంక్ కూడా అతడి వైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవరాల్‌గా రానా తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. Full on Aggression from Harshit Rana Delhi Boy for a reason 🥵💥pic.twitter.com/aXDlqavRr6 — Aditya (@switch_hit18) March 23, 2024 A heated send-off to Mayank Agarwal 🔥#IPL2024 pic.twitter.com/tzbDLgyDNL — OneCricket (@OneCricketApp) March 23, 2024 -
మెరిసిన పృథ్వీ షా.. పోరాటం చేస్తున్న మయాంక్ అగర్వాల్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్ బెర్త్‌లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్‌ల భవితవ్యం రేపటి లోగా తేలిపోనుంది. సౌరాష్ట్రపై గెలిచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై గెలిచి మధ్యప్రదేశ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆథిక్యం సాధించి పటిష్ట స్థితిలో ఉండగా.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల లీడ్‌లో ఉండగా.. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు గెలుపు ఛాలెంజ్‌లా మారింది. మరో రోజు ఆట మిగిలుండగా.. కర్ణాటక లక్ష్యానికి ఇంకా 268 పరుగుల దూరంలో ఉంది. కర్ణాటకను గెలిపించేందుకు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పోరాటం చేస్తున్నాడు. మెరిసిన పృథ్వీ షా.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్) హార్దిక్ తామోర్ (114), పృథ్వీ షా (87) సత్తా చాటడంతో ముంబై పటిష్ట స్థితికి చేరింది. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (షశ్వత్ రావత్ (124, సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై సెకెండ్ ఇన్నింగ్స్ 379/9 (హార్దిక్ తామోర్ 114, పృథ్వీ షా 87, భార్గవ్ భట్ 7/142) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల ఆధిక్యంలో ఉంది పోరాడుతున్న మయాంక్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగార్వల్ పోరాటం చేస్తున్నాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యాశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 103/1 (మయాంక్ అగర్వాల్ 61 నాటౌట్, సర్వటే 1/10) ఈ మ్యాచ్‌లో కర్ణాటక విజయం సాధించాలంటే మరో 268 పరుగులు చేయాలి -
#Mayank Agarwal: ఆసుపత్రి నుంచి మయాంక్ డిశ్చార్జి..
అగర్తలా: కర్ణాటక రంజీ జట్టు కెప్టెన్, భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. శుక్రవారం నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం మంగళవారం సాయంత్రం అగర్తలా నుంచి సూరత్ బయలుదేరేందుకు మయాంక్ విమానం ఎక్కాడు. తాను కూర్చున్న సీటు ముందు ప్లాస్టిక్ కవర్లో ఉంచిన హానికారక ద్రవ్యాన్ని నీళ్లనుకొని మయాంక్ తాగాడు. ఆ వెంటనే అతని నోరు వాచిపోయి బొబ్బలు రావడంతో మాట్లాడలేకపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే విమానాన్ని ఆపి అతడిని ఆసుపత్రికి తరలించారు. రోజంతా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మయాంక్ బుధవారం సాయంత్రంకల్లా కోలుకోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు. -
ఆ బాటిల్ తీసి తాగగానే వాంతులు: అప్పుడు మయాంక్ పరిస్థితి ఇదీ!
Mayank Agarwal Shares Update on his health: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కర్ణాటక జట్టు మేనేజర్ స్పష్టం చేశాడు. మయాంక్‌కు ప్రమాదం తప్పిందని.. విమానంలో జరిగిన ఘటన గురించి అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారని తెలిపాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్.. జట్టుతో పాటు మంగళవారం త్రిపుర నుంచి న్యూఢిల్లీకి బయల్దేరాడు. అయితే, విమానంలో కూర్చున్న కాసేపటికే గొంతులో నొప్పి, మంటతో బాధపడుతున్నట్లు సహచర ఆటగాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత వాంతులు కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అగర్తల(త్రిపుర రాజధాని)లోనే నిలిచిపోగా.. మయాంక్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మయాంక్‌కు దాహం వేసింది... అప్పుడు ఈ విషయంపై స్పందించిన కర్ణాటక జట్టు మేనేజర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. ‘‘కాసేపట్లో విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా.. మయాంక్‌కు దాహం వేసింది. దాంతో.. తాను కూర్చున్న సీటు పాకెట్లో ఉన్న బాటిల్ తీసి తాగాడు. వాంతి చేసుకున్నాడు కొన్ని నిమిషాల తర్వాత తన గొంతులో నొప్పి తీవ్రమైందంటూ.. వాష్‌రూమ్‌కి పరిగెత్తుకువెళ్లాడు. కాక్‌పిట్‌కు సమీపంలోనే ఉన్న వాష్‌రూమ్‌లో వాంతి చేసుకున్నాడు. తనకు అస్వస్థతగా ఉందని ఎయిర్ హోస్టెస్‌కు చెప్పడంతో ఆమె వెంటనే ఎమర్జెన్సీ బెల్ కొట్టింది. ప్రథమ చికిత్స అక్కడ కుదరదన్నారు విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమోనని ఆరా తీశారు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. దీంతో పైలట్‌కు మెసేజ్ అందించగా.. ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో ఉన్న వైద్యులు మయాంక్‌ను పరీక్షించి.. ఇక్కడ ప్రథమ చికిత్స అందించడం కుదరదని.. ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌ను పిలిపించగా.. హుటాహుటిన మయాంక్‌కు హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం’’ అంటూ కొన్ని నిమిషాల పాటు తమకు ఏం అర్థం కాలేదని వాపోయాడు. విచారణ జరపండి ఏదేమైనా మయాంక్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. అందుకు సంతోషిస్తున్నామని తెలిపాడు. కాగా మయాంక్ ఇండిగో ఫ్లైట్ 6E 5177లో ఉండగా ఈ ప్రమాదం బారిన పడగా.. ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. తమ విమానంలో ఉన్న ప్యాసింజర్ అనారోగ్యం పాలైన కారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులు మయాంక్ అగర్వాల్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని కర్ణాటక జట్టు మేనేజర్ మయాంక్ తరఫున విజ్ఞప్తి చేసినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. నేను బాగున్నాను.. థాంక్యూ ‘‘ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుటపడింది. త్వరలోనే తిరిగి వస్తా. నా కోసం ప్రార్థించిన, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని మయాంక్ అగర్వాల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. టీమిండియా తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1488, 86 పరుగులు చేశాడీ ఓపెనర్. ప్రస్తుతం రంజీ టోర్నీతో బిజీగా ఉన్న ఈ కర్ణాటక సారథి ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ అర్ధ శతకం సాధించాడు. ఇక మయాంక్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ నికిన్ జోస్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
ఐసీయూలో టీమిండియా క్రికెటర్.. ఏం జరిగిందంటే?
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న మయాంక్.. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే విమానం టేకాఫ్ కాకముందే ఈ ఘటన జరగడంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరిలించారు. మా ప్రస్తుతం అగర్తలలోని ఐఎల్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. నిలకడగా మయాంక్ ఆరోగ్యం.. అయితే ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ స్పందించారు. షావీర్ మాట్లాడుతూ.. "మయాంక్ అగర్వాల్‌ను అగర్తలలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆకస్మిక అస్వస్థతకు కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్‌తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్‌దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్‌కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా -
శతక్కొట్టిన రోహన్.. మరోసారి మెరిసిన మాయాంక్ అగర్వాల్
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్‌లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు. That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i — CricTracker (@Cricketracker) August 3, 2023 సూపర్ ఫామ్‌లో మయాంక్.. దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్‌పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్‌పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు. -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్‌సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్‌కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్‌పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో
దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు. శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో ఇతర మ్యాచ్‌ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్‌పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్.. నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ఈస్ట్ జోన్‌ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు. -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్.. మరో మెరుపు సెంచరీ
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఏకైక సెంచరీ చేసిన యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రస్తుతం జరుగుతున్న దియోదర్ ట్రోఫీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (103) బాదిన ప్రభ్‌సిమ్రన్.. దియోదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌తో ఇవాళ (జులై 26) జరుగుతున్న మ్యాచ్‌లో 92 బంతుల్లో శతక్కొట్టాడు. Relive that special 💯 moment here 🔽#TATAIPL | #DCvPBKS https://t.co/eBGUL8gkVh pic.twitter.com/uWI2uW8vB8 — IndianPremierLeague (@IPL) May 13, 2023 ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ (నార్త్ జోన్).. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్ హీరోలు అభిషేక్ శర్మ (19), నిషాంత్ సింధు (18), హర్షిత్ రాణా (5), వివ్రాంత్ శర్మ (1) నిరశపర్చగా.. హిమాన్షు రాణా (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో యశ్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, కర్ణ్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. దియోదర్ ట్రోఫీ-2023లో ప్రభ్సిమ్రన్దే తొలి సెంచరీ కావడం విశేషం. తృటిలో సెంచరీని చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మయాంక్, అరుణ్ కార్తీక్ (23), విజయ్‌కుమార్ వైశాఖ్ (20 నాటౌట్), కావేరప్ప (19) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయకపోవడంతో వెస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్ జోన్ బౌలర్లలో పార్థ్ భట్ 3, షమ్స్ ములానీ, హంగార్గేకర్ చెరో 2 వికెట్లు, నగ్వస్వల్లా, అతీథ్ సేథ్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
రాణించిన మయాంక్ అగర్వాల్.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్ (డక్‌వర్త్ లూయిస్‌కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్ జోన్‌పై గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (17), వాషింగ్టన్ సుందర్ (5) విఫలం కాగా.. రికీ భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో రిషి ధవన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, మయాంక్ యాదవ్, మయాంక్ డాగర్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్ శర్మ (1), గత ఐపీఎల్లో సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (2), నితీశ్ రాణా (4), రిషి ధవన్ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో శుభమ్ ఖజూరియా (10), మన్దీప్ సింగ్ (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్ సాయికిషోర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. విజేడీ పద్ధతి అంటే.. వి జయదేవన్ పద్ధతి.. క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్‌లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్‌లలో లక్ష్య స్కోర్లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది. కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్‌ల్లో ఉపయోగించారు. -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు. -
అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్‌జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్‌జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్‌జోన్‌ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్‌కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్‌జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్‌కు తమీమ్ గుడ్‌బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్‌కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. తెరమీదకు మయాంక్ అగర్వాల్ పేరు! కారణం?
Mayank Agarwal- CBI director Praveen Sood: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టిన వేళ టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ పేరు తెరమీదకు తీసుకువచ్చారు అభిమానులు. ఇందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే.. టీమిండియా ఓపెనర్‌గా కర్ణాటకకు చెందిన మయాంక్.. 2018లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా ఓపెనర్‌గా మంచి గుర్తింపు సంపాదించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ ఇప్పటి వరకు కెరీర్లో మొత్తంగా 21 టెస్టులు ఆడాడు. 36 ఇన్నింగ్స్‌లలో కలిపి 1488 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం దక్కించుకున్న మయాంక్.. 86 పరుగులకే పరిమితమయ్యాడు. మయాంక్- ఆషితా ప్రేమకథ అలా మొదలైంది ఇక మయాంక్ అగర్వాల్ కెరీర్ సంగతులు ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మయాంక్ అగర్వాల్‌ది ప్రేమ వివాహం. అతడి భార్య పేరు ఆషితా సూద్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు తొలుత స్నేహితులుగా దగ్గరయ్యారు. కాలక్రమంలో స్నేహం ప్రేమగా మారింది. ఆషితాకు తన మనసులో మాట చెప్పేందుకు సిద్దమైన మయాంక్.. లండన్‌లో రొమాంటిక్ స్టైల్లో ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచాడు. ఇందుకు ఆషితా సానుకూలంగా స్పందించడంతో 2018 జనవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. మయాంక్‌కు స్వయానా మామగారు అదే ఏడాది జూన్ 4న మయాంక్- ఆషితాల పెళ్లి జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు మయాంక్ బెస్ట్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. మయాంక్ ప్రేమించి పెళ్లాడిన ఆషితా మరెవరో కాదు.. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్ కుమార్తె. కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్ కూతురైన ఆషితా.. వృత్తి రిత్యా లాయర్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాలో ఆమె మాస్టర్స్ చేశారు. అదీ విషయం.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. ప్రవీణ్ సూద్‌కు స్వయానా అల్లుడు. మామగారు ఉన్నత పదవి చేపట్టడంతో అభిమానులు ఇలా మయాంక్ పేరును వార్తల్లోకి తెచ్చారు. ఇక మయాంక్- ఆషితాలకు ఓ కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే.. 2011లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన మయాంక్ ప్రస్తుత సీజన్ ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మినీ వేలంలో 8.25 కోట్ల రూపాయల భారీ ధరకు రైజర్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఈ ఎడిషన్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ అంచనాలు అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 270 పరుగులే చేశాడు. చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్‌తో.. ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. -
MI VS SRH: ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..!
గత రెండు సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ, అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న మయాంక్ అగర్వాల్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో మనోడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవలి కాలంలో మయాంక్ ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇదే తొలిసారి. మయాంక్‌కు జతగా మరో ఓపెనర్ వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..! గతేడాది పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ సీజన్లో సన్‌రైజర్స్ పంచన చేరిన మయాంక్‌కు ముంబై ఇండియన్స్ అంటే పూనకం వస్తుంది. ఈ సీజన్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన అతను 9 మ్యాచ్‌ల్లో 187 పరుగులు చేస్తే.. ముంబైతో ఇవాళ్టి మ్యాచ్‌లో 83 పరుగులు చేశాడు. 17 పరుగుల తేడాతో ఐపీఎల్లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న మయాంక్.. 2022 సీజన్ నుంచి ముంబైపై విరుచుకుపడుతున్నాడు. ఈ మధ్యలో ముంబైతో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 153.78 స్ట్రయిక్ రేట్‌తో 61 సగటున 183 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే సమయంలో (గత రెండు ఐపీఎల్ సీజన్లు) ఇతర జట్లతో 19 మ్యాచ్‌లు ఆడిన మయాంక్.. 112.75 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 14.89 సగటున 283 పరుగులు చేశాడు. ఇందులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ గణాంకాలు చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. ముంబై అంటే మయాంక్ ఏ రేంజ్లో రెచ్చిపోతాడో. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్.. నామమాత్రపు మ్యాచ్‌లో ఇవాళ ముంబైతో తలపడుతుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్ అడుతున్న ముంబైకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉంటాయి. గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాలుగో ప్లేస్ కోసం ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది. చదవండి: SRH VS MI: రికార్డులు కొల్లగొట్టిన సన్‌రైజర్స్ యువ ఓపెనర్ -
ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
ఐపీఎల్-2023లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయినా ఇప్పటికీ కొందరు బ్యాటర్లు గాడిలో పడకపోవడంతో సంబంధిత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి సొంత చేసుకున్న కొందరు ఆటగాళ్లు పదేపదే అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారారు. తమ చెత్త బ్యాటింగ్‌తో ఫ్రాంచైజీలకు భారంగా మారిన ఆటగాళ్లెవరో ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుత సీజన్లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రియాన్ పరాగ్ ముందువరుసలో ఉంటాడు. వేలంలో 3.8 కోట్లు దక్కించుకున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 20 అత్యధిక స్కోర్‌తో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్ తర్వాత చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆటగాడు ఆర్సీబీ దినేశ్ కార్తీక్. ఫినిషర్‌గా ఇరగదీస్తాడని భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన డీకే (5.5 కోట్లు).. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28 అత్యధిక స్కోర్‌తో కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన డీకే.. వికెట్‌కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. క్యాచ్‌లు మిస్ చేయడం, స్టంపింగ్, రనౌట్లు చేయలేకపోవడం, చేతిలోకి వచ్చిన బాల్స్‌ను జారవిడచడం.. ఇలా వికెట్‌కీపింగ్‌లోనూ డీకే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంతటితో ఇతని ఆగడాలు ఆగలేదు. బ్యాటింగ్ సమయంలో ఇతను పరుగులు చేయలేకపోగా.. బాగా ఆడుతున్న వారిని పలు సందర్భాల్లో రనౌటయ్యేలా చేశాడు. కార్తీక్‌తో పాటు మరో ఆటగాడు కూడా ఆర్సీబీకి చాలా భారంగా మారాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ కూడా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమై జట్టు ఓటములకు కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్‌తో పాటు జట్టు మొత్తం బ్యాటింగ్ విభాగంలో దారుణంగా నిరాశపరుస్తుంది. బ్రూక్ ఒకే ఒక మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆతర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. మయాంక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. చించేస్తాడనుకున్న కెప్టెన్ మార్క్రమ్ కూడా తేలిపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు దీపక్ హుడా.. సీఎస్కేకు అంబటి రాయుడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షాలు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని సంబంధిత ఫ్రాంచైజీలు తదుపరి జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడిస్తారో లేక సాహసం చేసి పక్కకు కూర్చోబెడతారో వేచి చూడాలి. చదవండి: ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్‌ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్‌ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్‌సెంచరీ), వన్ డౌన్లో సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్‌ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్‌లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
SRH: ఏదో పొడిచేస్తాడనుకుంటే!.. అతడొక్కడేనా?! నాకు నమ్మకం ఉంది!
IPL 2023 DC Vs SRH: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ హేమంగ్ బదాని మద్దతుగా నిలిచాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగల సత్తా ఉన్న ఆటగాడంటూ కొనియాడాడు. ప్రస్తుతం తన ఆట తీరు బాగా లేకపోయినా.. త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు బాదిన ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్‌పై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు అందుకోలేక కానీ బ్రూక్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో మెరిసిన బ్రూక్.. మిగతా మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్ మొత్తంగా సాధించిన పరుగులు 163. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. ఇందులో ఓ శతకం. ఈ గణాంకాలను బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హ్యారీ బ్రూక్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో డకౌట్ అయిన బ్రూక్‌పై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. సెంచరీతో మురిపించి రోజురోజుకూ దిగజారి పోతున్నాడంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా.. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ విజయానంతరం కోచ్ హేమంగ్ బదాని మాట్లాడుతూ తమ బ్యాటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. లోపాలు సరిచేసుకోవాల్సి ఉంది. ఒక్క ఇన్నింగ్స్ చాలు తిరిగి పుంజుకోవడానికి. కచ్చితంగా మా ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్... తను ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని బదాని పేర్కొన్నాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడని.. టచ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరితరం కాదని చెప్పుకొచ్చాడు. కాగా ఢిల్లీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. అతడొక్కడేనా! వాళ్లు కూడా ఇక బ్రూక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి(8 మ్యాచ్‌లలో 170 పరుగులు), మయాంక్ అగర్వాల్ (8 మ్యాచ్‌లలో 169 పరుగులు) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో మెరిశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కీలక సమయంలో విలువైన అజేయ అర్ధ శతకం(53) సాధించాడు. చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా? సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఢిల్లీతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్!
IPL 2023- SRH Vs DC: ఐపీఎల్-2023లో సీఎస్కే చేతిలో ఘోర ఓటమి చవి చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. వాళ్లిద్దరు అవుట్ అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా 8.25 కోట్ల భారీ మొత్తాన్ని తీసుకున్న అగర్వాల్.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో మయాంక్ స్ధానంలో సమర్థ్ వ్యాస్, సుందర్ ప్లేస్‌లో మయాంక్ దాగర్‌కు అవకాశం ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లకు ఛాన్స్ సౌరాష్ట్రకు చెందిన వ్యాస్‌కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. లిస్ట్-ఏ క్రికెట్లో 41 మ్యాచ్‌లు ఆడిన వ్యాస్ 1365 పరుగులు సాధించాడు. అదే విధంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ దాగర్.. వికెట్లు తీయకపోయినప్పటికీ పర్వాలేదనపించాడు. 3 ఓవర్లు వేసిన దాగర్ 21 పరుగులిచ్చాడు. ఇక కేకేఆర్‌తో గెలిచి మంచి ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎస్ఆర్హెచ్ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్) వ్యాస్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, మయాంక్ దాగర్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Mohammed Siraj: మహిపాల్‌ను దూషించిన సిరాజ్! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్! ఇలాంటివి. -
Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ దారుణ ఆటతీరు కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సీఎస్కేతో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు. కానీ ఏ స్థానంలో వచ్చినా తన ఆటతీరు మారదని మరోసారి నిరూపించాడు మయాంక్. నాలుగు బంతులెదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అసలు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి జడేజా బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ రావడమే తప్పు.. అలాంటి ధోని కీపర్‌గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు. క్షణం కూడా ఆలస్యం చేయని ధోని వికెట్లను ఎగురగొట్టేశాడు. కనీసం అంచనా లేకుండా ఫ్రంట్‌ఫుట్ షాట్‌కు యత్నించడం మయాంక్ ఆట ఎంత పేలవంగా ఉందనేది చూపించింది. ఓపెనర్‌గా విఫలమయ్యాడని ఫినిషర్ రోల్లో పంపిస్తే దానికి న్యాయం చేయలేకపోయాడు. వాస్తవానికి 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్ అయిన తర్వాత మయాంక్ అగర్వాల్ ఆట పూర్తిగా మసకబారుతూ వచ్చింది. పంజాబ్ కింగ్స్‌లో ఉన్నప్పుడు పరుగులు చేసిన మయాంక్ ఎస్ఆర్హెచ్లోకి వచ్చాకా తన బ్యాటింగ్‌నే పూర్తిగా మరిచిపోయాడు. అలాంటి మయాంక్‌పై ఎస్ఆర్హెచ్ కూడా రూ. 8.5 కోట్లు చెల్లించి తీసుకున్నప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు మయాంక్ ఆరు మ్యాచ్‌లాడి 115 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 48 పరుగులు చేసినప్పటికి చాలా బంతులు వృథా చేశాడు. అసలు ముందు మయాంక్‌ను కాదు అనాల్సింది.. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ను. తలా తోక లేకుండా జట్టును తయారు చేసింది. గత్యంతరం లేకనే మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇస్తున్నారు. అయితే కనీసం రానున్న మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అబ్దుల్ సమద్‌కు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపితే బాగుంటుందేమో. ఇక మయాంక్ ఆటతీరుపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. మీరు ఒకసారి లుక్కేయండి. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Ayindhi edho ayindhi oka vandha unchukoni migatha auction dabbulu icheyi @mayankcricket pic.twitter.com/Ve1EsOLfoL — వేటగాడు (@rao_4005) April 21, 2023 Bus lo iddharu rajinikanth lu undaga crease ela daatav ra @mayankcricket — King of the jungle (@tigersathhii) April 21, 2023 Every one down contender of Indian team is in academy these days... Tripathi and Hooda❤️🔥 Whereas Mayank Agarwal today came as finisher, finished his innings with 2 runs off 4 balls, consistency at its peak😍🔥 #CSKvSRH — TukTuk Academy (@TukTuk_Academy) April 21, 2023 చదవండి: సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం! -
క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ తొలి బంతిని మయాంక్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. Photo: IPL Twitter అయితే జడ్డూ క్యాచ్ తీసుకునే అవకాశం వచ్చింది. కానీ ఇదే సమయానికి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్లాసెన్ జడ్డూ క్యాచ్ అందుకునే క్రమంలో అతనికి అడ్డుగా వచ్చాడు. దీంతో జడ్డూ ఫ్లోర్‌పై పడిపోయాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందా లేక క్లాసెన్ కావాలనే అడ్డుకున్నాడా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో జడేజా క్లాసెన్‌వైపు ''ఇదేంటి'' అన్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. Photo: IPL Twitter అయితే క్లాసెన్ తనకు వచ్చిన లైఫ్‌ను మయాంక్ కాపాడుకోలేకపోయాడు. అదే ఓవర్లో ఐదో బంతికి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని ఆడేందుకు మయాంక్ ఫ్రంట్‌ఫుట్ వచ్చాడు. అయితే బంతి మిస్ అయి ధోని చేతుల్లో పడింది. కీపింగ్‌లో సూపర్ టైమింగ్ కనబరిచే ధోని క్షణం ఆలస్యం చేయకుండా స్టంపింగ్ చేశాడు. దీంతో మయాంక్ పెవిలియన్ బాట పట్టాడు. మయాంక్ ఔటైన అనంతరం క్లాసెన్‌వైపు సీరియస్ లుక్ ఇచ్చిన జడేజా.. బాగుందా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Jaddu😈pic.twitter.com/SOxL82wFdi — Karthik™ (@im_karthik777) April 21, 2023 -
SRH Vs MI: టెస్టు ప్లేయర్‌తో ఇట్లనే ఉంటది మరి! ‘టాప్ స్కోరర్’ అయితే ఏంటి?
IPL 2023 SRH Vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. టెస్టు ప్లేయర్‌ని టీ20లలో ఆడిస్తే ఇలాగే ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు. మయాంక్ కారణంగా పవర్ ప్లేలో పవరే లేకుండా పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్.. 12 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 196 పరుగులు చేశాడు. సారథిగానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గతేడాది పద్నాలుగింట కేవలం ఏడు విజయాలు మాత్రమే సాధించిగా పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. తనదైన ముద్ర వేయలేక ఈ క్రమంలో ఐపీఎల్-2023 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్‌ను వదిలేయగా.. సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కోసం 8.25 కోట్ల రూపాయల మేర భారీ మొత్తం వెచ్చించింది. అయితే, ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌లలో మయాంక్ తనదైన మార్కు చూపించేలా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. 5 ఇన్నింగ్స్‌లలో కలిపి ఈ ఓపెనర్ చేసిన పరుగులు 113. అందుకే విమర్శలు ఇక ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మయాంక్ 48 పరుగులతో రైజర్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయినప్పటికీ అభిమానుల ఆగ్రహానికి కారణం అతడి స్ట్రైక్‌రేటు(117.07). అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయిన మయాంక్.. ఇందుకోసం ఏకంగా 41 బంతులు తీసుకున్నాడు. వరుస విజయాలకు బ్రేక్ ఈ నేపథ్యంలో కొంతమంది అతడిని విమర్శిస్తుండగా.. మరికొంత మందేమో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడని.. తను కూడా తొందరగా అవుటైతే పరిస్థితి ఇంకోలా ఉండేదని మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. మయాంక్ 48 పరుగులకు తోడు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్(17 బంతుల్లో 22 పరుగులు), వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(16 బంతుల్లో 36 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో రైజర్స్ విజయానికి 20 పరుగులు అవసరమైన వేళ అర్జున్ టెండుల్కర్ అద్భుత బౌలింగ్ కారణంగా ముంబై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో వరుసగా రెండు విజయాలు సాధించిన మార్కరమ్ బృందం జోరుకు బ్రేక్ పడినట్లయింది. చదవండి: సచిన్ కొడుకుతో అట్లుటంది మరి.. శెభాష్ అర్జున్! వీడియో వైరల్ అదే మా కొంపముంచింది.. లేదంటేనా! అందుకే అలా చేశా: మార్కరమ్ Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally. Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు!
ఐపీఎల్-2023లో మరో కీలక పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నాయి. మరో సారి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగుంచేందుకు ఈ రెండు జట్లు సిద్దమయ్యాయి.. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మయాంక్ ఔట్.. సుందర్ ఇన్ వరుసగా విఫలమవతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను పక్కన పెట్టాలని సన్‌రైజర్స్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 8.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన మయాంక్.. తన స్థాయికి తగ్గట్టు రాణించలేక పోతున్నాడు. ఇక అతడి స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకే వేళ మయాంక్ దూరమైతే బ్రూక్ జోడిగా అభిషేక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ పటిష్టంగా కన్పిస్తోంది. విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి మరింత బలం చేకూరుస్తోంది. అదే విధంగా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. పేసర్ మార్కో జానెసన్ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు స్పిన్నర్ మార్కండే కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. వీరికి తోడు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా తన స్థాయికి తగ్గట్టు రాణిస్తే.. ముంబై బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా): హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ,, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, మయాంక్ మార్కండే -
మయాంక్ అగర్వాల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. వరుసగా విఫలమవుతున్న ఎస్ఆర్హెచ్ ఆటగాడు హ్యారీ బ్రూక్.. ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 55 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అదే విధంగా కెప్టెన్ మార్క్రమ్ 26 బంతుల్లో 50 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్(71), రింకూ సింగ్ పోరాడనప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. తీరు మారని మయాంక్.. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పేలవ ఫామ్ మాత్రం అందరని కలవరపెడుతుంది. బ్యాటింగ్‌కు అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై 13 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రస్సెల్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి అతడు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్ కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గతేడాది సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించిన మయాంక్‌ను.. 2023 సీజన్‌కు ముందు ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ 8.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. అయితే తన తీసుకున్న మొత్తానికి న్యాయం చేయడంలో మయాంక్ విఫలమవుతున్నాడు. ఇక వరుసగా విఫలమవుతున్న అగర్వాల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆటకే పంజాబ్ విడిచిపెట్టింది.. ఇక్కడ కూడా అదే ఆట తీరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: Harry Brook: 'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు' On his first ball of the season, Dre Russ sends Agarwal... 𝑝𝑎𝑐𝑘𝑖𝑛𝑔 𝑎𝑛𝑑 𝑚𝑜𝑣𝑖𝑛𝑔 🚚 ..and picks Tripathi in the same over! 😯#KKRvSRH #IPL2023 #TATAIPL | @Russell12A @KKRiders pic.twitter.com/8405ZAWnMA — JioCinema (@JioCinema) April 14, 2023 -
కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్‌కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోలను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులతో పంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కాషాయానికి కాస్త నల్లరంగును అద్దింది. అదే విధంగా ఆరంజ్ కలర్ లో ఉన్న ట్రాక్ ప్యాంటు స్థానంలో పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. కాగా ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీ.. మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలి ఉంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్కరమ్‌ను ఎంపిక చేసింది. అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జట్టు తొట్ట తొలి సౌతాఫ్రికా20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. Idhi, Orange Fire 🔥 Buy your tickets now to watch your favourite #Risers in this brand new jersey soon 💥 🎟️ - https://t.co/ph5oL4pzDI#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/lRM75Yz6kO — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡 Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్! -
ఇరానీ కప్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
గ్వాలియర్: ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 30వ సారి ఇరానీ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో ఆదివారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 81/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ ఆట చివరిరోజు మరో 117 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు వికెట్లు తీయగా... ముకేశ్ కుమార్, అతీత్, పుల్కిత్ నారంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన భారత యువ కెరటం.. డెబ్యూలోనే డబుల్ సెంచరీ, సెంచరీ
Yashasvi Jaiswal: భారత యువ కెరటం, ఉత్తర్‌ప్రదేశ్ బార్న్ ముంబై క్రికెటర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ టోర్నీ ఇరానీ కప్‌లో ఇరగదీశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు), సెంచరీతో (132 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి, టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్నాడు. ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్లో ఫార్మాట్లకతీతంగా విజృంభిస్తున్న యశస్వి.. పలు సంచలన ప్రదర్శనల నమోదు చేసి, నేను కూడా టీమిండియా ఓపెనర్ రేసులో ఉన్నానని భారత సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. Yashasvi Jaiswal has 9 Hundred, including 3 double hundreds in just 15 first-class matches 😲#IraniCup | #CricketTwitter pic.twitter.com/9wvHwCCKIy — InsideSport (@InsideSportIND) March 4, 2023 మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇరానీ కప్‌లో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా.. శిఖర్ ధవన్ తర్వాత ఇరానీ కప్ మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా.. ఒకే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేసిన 11వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. Yashasvi Jaiswal is the first batter to record a double hundred and a hundred in the same Irani Cup match. He is also only the second player after Shikhar Dhawan to score more than 300 runs in one Irani Cup game. — Lalith Kalidas (@lal__kal) March 4, 2023 ప్రస్తుత దేశవాలీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి.. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును అందుకుని, ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల యశస్వికి అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (213) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అభిమన్యు ఈశ్వరన్ (154) సెంచరీతో కదం తొక్కాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్‌దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. నాలుగో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ఓవరాల్‌గా 391 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యశస్వి (121) అజేయమైన సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అంకిత్ ఖుష్వా తలో 2 వికెట్లు, కుమార్ కార్తీకేయ, సరాన్ష్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్లో.. ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరగనున్న ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య జరగనుంది. ఇక కరోనా కారణంగా మూడేళ్ల పాటు సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఆయా జట్లు ఈసారి మాత్రం హోంగ్రౌండ్లో ఆడబోతున్నాయి. దీంతో అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇక చాలా రోజుల తర్వాత మరోసారి ఐపీఎల్ హైదరాబాద్‌కు తిరిగి వస్తోంది. గత మూడు సీజన్లుగా కరోనా కారణంగా ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయింది. అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ అభిమానుల కేరింతలతో మురిసిపోనుంది. ఎస్ఆర్హెచ్ ఏడు మ్యాచ్‌లను హోంగ్రౌండ్లో.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో తటస్థ వేదికల్లో ఆడనుంది. ఈసారి ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. గతేడాది 8వ స్థానంలో నిలిచి నిరాశ పరిచిన సన్ రైజర్స్ సొంతగడ్డపై చెలరేగాలని చూస్తోంది. సన్ రైజర్స్ టీమ్ గ్రూప్ బిలో ఉంది. ఎస్ఆర్హెచ్ పూర్తి జట్టు: అబ్దుల్ సమద్, ఐడెన్ మర్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, సంవ్రక్రాంత్ మర్కండే, మయన్క్రాంత్ మర్కండే వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకేల్ హోసేన్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్. సన్ రైజర్స్ పూర్తి షెడ్యూల్: ఏప్రిల్ 2 - సన్ రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ ఏప్రిల్ 7 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన రైజర్స్, లక్నో ఏప్రిల్ 9 - సన్ రైజర్స్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ ఏప్రిల్ 14 - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్ రైజర్స్, కోల్‌కతా ఏప్రిల్ 18 - సన్ రైజర్స్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ ఏప్రిల్ 21 - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్, చెన్నై ఏప్రిల్ 24 - సన్ రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ ఏప్రిల్ 29 - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్, ఢిల్లీ మే 4 - సన్ రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైజర్స్, హైదరాబాద్ మే 7 - రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్, జైపూర్ మే 13 - సన్ రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్ మే 15 - గుజరాత్ టైటన్స్ vs సన్ రైజర్స్, అహ్మదాబాద్ మే 18 - సన్ రైజర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మే 21 - ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్, ముంబై 4️⃣4️⃣ days before we're #BackInUppal 😍#OrangeArmy, block your dates and get ready to back your #Risers in the #TataIPL2023 🔥 pic.twitter.com/HFABNikrCi — SunRisers Hyderabad (@SunRisers) February 17, 2023 చదవండి: ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదల.. మార్చి 31న షురూ -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
సూపర్ ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసినా..!
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి కేవలం 3 పరుగుల ఆధిక్యంలో ఉంది. నికిన్ జోస్ (54) అజేయమైన హాఫ్‌సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మ్యాచ్ చివరి రోజు కర్ణాటక వేగంగా ఆడి కనీసం 250 పరుగుల టార్గెట్ సౌరాష్ట్రకు నిర్ధేశిస్తే కానీ గెలిచే అవకాశాలు లేవు. ఇలా జరగక మ్యాచ్ డ్రాగా ముగిస్తే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరుతుంది. మయాంక్ డబుల్ సెంచరీ, శ్రీనివాస్ శరత్ (66) హాఫ్ సెంచరీతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే ఆలౌట్ కాగా.. కెప్టెన్ వసవద (202) డబుల్ హండ్రెడ్, షెల్డన్ జాక్సన్ (160) భారీ శతకంతో చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులకు ఆలౌటైంది. తొలి సెమీస్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 547 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 279/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 438 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 170 పరుగులకే చేతులెత్తేసింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో సుదీప్ ఘర్మానీ (112), మజుందార్ (120) సెంచరీలతో చెలరేగగా.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సరాన్ష్ జైన్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుతుంది. -
జాక్సన్, అర్పిత్ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (249) డబుల్ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్ జాక్సన్ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అర్పిత్ వసవద (112 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్ వసవదకు జతగా చిరగ్ జానీ (19) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (33), విశ్వరాజ్ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్ పటేల్ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్ శరత్ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే పటేల్ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక, బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 327 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్.. ఈ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్
టీమిండియాకు దూరమైన మయాంక్ అగర్వాల్ రంజీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ కర్ణాటక కెప్టెన్ గురువారం డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 626 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మయాంక్ 429 బంతులెదుర్కొని 249 పరుగులు చేశాడు. మయాంక్ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ కాగా అందులో మయాంక్వే 249 పరుగులు ఉండడం విశేషం. ఒక రకంగా అతనిది వన్‌మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇక శ్రీనివాస్ శరత్ 66 పరుగులతో సహకరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కె పటేల్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. బెంగాల్ వర్సెస్ మధ్యప్రదేశ్, రంజీ రెండో సెమీఫైనల్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనుస్తుప్ మజుందార్ (120 పరుగులు), సుదీప్ గరామీ(112 పరుగులు) శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 51 పరుగులు చేశాడు. అనంతరం మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది. Mayank Agarwal's celebration when he completed his double hundred in Ranji trophy semi-final. pic.twitter.com/ckG0ez5ebh — CricketMAN2 (@ImTanujSingh) February 9, 2023 చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా -
అజేయ సెంచరీతో కదం తొక్కిన మయాంక్ అగర్వాల్
Mayank Agarwal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (ఫిబ్రవరి 8) మొదలైన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మయాంక్‌తో పాటు వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ (58) అజేయ అర్ధసెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. చేతన్ సకారియా, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిప శ్రేయస్ గోపాల్ (15) రనౌటయ్యాడు. సెంచరీతో ఆదుకున్న మయాంక్.. ఈ మ్యాచ్‌లో మయాంక్ చేసిన సెంచరీ చాలా కీలకమైంది. 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా మయాంక్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీనివాస్ శరత్‌తో కలిసి మయాంక్ ఆరో వికెట్‌కు అజేయమైన 117 పరుగులు సమకూర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 246 బంతులు ఆడిన మయాంక్ 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 110 పరుగులు చేశాడు. సెంచరీ చేసేందుకు మయాంక్ ఇన్ని బంతులు ఆడటం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. మరోవైపు ఇవాలే మొదలైన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్, బెంగాల్ జట్లు తలపడ్డాయి. తొలి రోజు ఆటలో బెంగాల్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. -
బౌలర్ల విజృంభణ.. శ్రేయస్ అజేయ శతకం.. సెమీస్‌లో మయాంక్ జట్టు
Karnataka won by an innings and 281 runs: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో కర్ణాటక సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఉత్తరాఖండ్‌ను ఇన్నింగ్స్ మీద 281 పరుగులతో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెంచరీ హీరో శ్రేయస్ గోపాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మయాంక్ నమ్మకాన్ని నిలబెట్టి బెంగళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో జనవరి 31న మొదలైన క్వార్టర్ ఫైనల్-3లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నమ్మకాన్ని నిలబెడుతూ.. కర్ణాటక బౌలర్లు సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. రైట్ ఆర్మ్ పేసర్, 22 ఏళ్లమురళీధర వెంకటేశ్ ఐదు వికెట్లతో ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. విద్వత్ కవెరప్ప, క్రిష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీశారు. విజయ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 116 పరుగులకే ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రెచ్చిపోయిన కర్ణాటక బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక బ్యాటర్లు ఉత్తరాఖండ్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించారు. ఓపెనర్లు సమర్థ్(82), మయాంక్ అగర్వాల్(83) అర్థ శతకాలతో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 69 పరుగులతో రాణించాడు. శ్రేయస్ గోపాల్ అద్భుత సెంచరీ నాలుగో స్థానంలో వచ్చిన నికిన్ జోస్ 62 రన్స్ సాధించగా.. మనీశ్ పాండే 39 పరుగులతో ఫర్వాలేదనపించాడు. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝలిపించడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా 288 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 161 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శరత్ 33, గౌతం 39, వెంకటేశ్ 15 పరుగులు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక 606 పరుగులకు ఆలౌట్ అయింది. సెమీస్‌లో అడుగు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ కథ 209 పరుగులకే ముగిసింది. దీంతో శుక్రవారం నాటి(ఫిబ్రవరి 3) ఆఖరి రోజు ఆటలో కర్ణాటక జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచిన కన్నడ జట్టు తాజా సీజన్లో సెమీస్‌కు చేరుకుంది. చదవండి: Ranji Trophy 2022-23: విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్స్‌లో ఓటమిపాలైన ఆంధ్ర BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. రాణించిన మయాంక్ అగర్వాల్
Ranji Trophy 2022-23 1st Quarter Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
రెచ్చిపోయిన కర్ణాటక బౌలర్లు, 116 పరుగులకే కుప్పకూలిన ఉత్తరాఖండ్
Ranji Trophy 2022-23 3rd Quarter Final: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (జనవరి 31) ప్రారంభమయ్యాయి. మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్-కర్ణాటక జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే ఆలౌటైంది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (4), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్-జార్ఖండ్ జట్లు.. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
సునాయాసంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న టీమిండియా ఓపెనర్లు.. గిల్ తర్వాత మరొకరు
Ranji Trophy 2022-23 KAR VS KER: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కేరళతో జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (208; 17 ఫోర్లు, 5 సిక్సర్) డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. మయాంక్‌కు జతగా నికిన్ జోస్ (54), శరత్ (53), శుభంగ్ హేగ్డే (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కర్ణాటక 485/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ సచిన్ బేబీ (141) సెంచరీతో అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. కేరళ స్కోర్ రెండో ఇన్నింగ్స్‌లో 96/4 వద్ద ఉండగా.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. సునాయాసంగా డబుల్ సెంచరీలు.. ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఫార్మాట్లకతీతంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న విషయం విధితమే. రెండు రోజుల కిందట హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో (208) విధ్వంసం సృష్టించగా.. తాజాగా మరో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (208) రంజీల్లో ఈ ఫీట్ సాధించాడు. మయాంక్ టెస్ట్‌ల్లోనూ భారత్ తరఫున డబుల్ సెంచరీ (243) చేశాడు. కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో మయాంక్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు పృథ్వీ షా, కేదార్ జాదవ్, మనన్ వోహ్రా, పునిత్ బిస్త్, మహ్మద్ సైఫ్, తరువార్ కోహ్లి డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిలో పృథ్వీ షా ఏకంగా ట్రిపుల్ సెంచరీ (379) చేశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. తాజాగా గిల్ చేసిన ద్విశతకంతో అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీల సంఖ్య 10కి చేరింది. ఈ 10లో 7 భారత ఆటగాళ్లు చేసినవే కాగా, ఈ ఫీట్ సాధించిన వారంతా ఓపెనర్లే కావడం విశేషం. వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు.. సచిన్ టెండూల్కర్ (2010లో సౌతాఫ్రికాపై 200 నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్‌పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్‌పై 210), శుభ్‌మన్ గిల్ (2023లో న్యూజిలాండ్‌పై 208) -
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు. విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు. బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు. చత్తీస్ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు. -
IPL 2023 Auction: ఎన్ని కోట్లు పెట్టడానికైనా ఎస్ఆర్హెచ్ రెడీ! కెప్టెన్‌గా అతడే!
IPL 2023 Mini Auction- Sunrisers Hyderabad: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ మినీ వేలం-2023లో కెప్టెన్ ఆప్షన్ కోసం టార్గెట్ చేయనుంది. జట్టులో ఉన్న 13 ఖాళీలను భర్తీ చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడనుంది. కాగా మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ ఖాళీలు కలిగి ఉన్న సన్‌రైజర్స్.. పర్సులో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. కెప్టెన్‌గా స్టోక్స్? ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్‌పై సన్‌రైజర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ క్రికెట్లోనూ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి బజ్‌బాల్ విధానం అవలంబిస్తూ దూకుడైన ఆటతో.. జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు ఈ ఆల్‌రౌండర్. ఆటగాడిగానూ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మినీ వేలంలో స్టోక్స్ కోసం ఫ్రాంఛైజీల మధ్య తీవ్రమైన పోటీ జరగడం ఖాయం. అయితే, గత సీజన్లలో వరుసగా కెప్టెన్లను మార్చినప్పటికీ సన్‌రైజర్స్ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. తొలుత డేవిడ్ వార్నర్.. ఇప్పుడు కేన్ విలియమ్సన్‌ను వదిలేసిన హైదరాబాద్ జట్టు స్టోక్స్ కోసం ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, సౌతాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే, సన్‌రైజర్స్ మాత్రం స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకొని కెప్టెన్ చేయాలనుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ టార్గెట్ చేసే ప్రధాన ఆటగాళ్లు(అంచనా) బెన్ స్టోక్స్ మయాంక్ అగర్వాల్ సామ్ కరన్ కామెరూన్ గ్రీన్ సన్‌రైజర్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2.6 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.5 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 6.5 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ. 4.2 కోట్లు ), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), ఫజల్హక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 4 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ. 4.2 కోట్లు), టి నటరాజన్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు) వదిలేసిన ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్‌స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్ IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
SRH: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేది, సన్‌రైజర్స్ కెప్టెన్ కూడా అతడే!
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది. మయాంక్ అగర్వాల్ కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్ఆర్హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది. కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్‌గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్‌గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్‌రైజర్స్ మయాంక్‌ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది. చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు -
రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా
ఐపీఎల్-2023కు సంబంధించిన మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారత క్రికెటర్లు, 277 మది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 21 మంది క్రికెటర్లు తమ కనీస ధర రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ జాబితాలో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. అదే విధంగా మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే వంటి భారత క్రికెటర్లు తమ బేస్ ప్రైస్ కోటి రూపాయలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. రూ. 2 కోట్లు, 1.5 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ గా నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం. కాగా ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. 2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు వీరే నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ సీన్ అబోట్, రిలే మెరెడిత్, జో రిచర్డ్సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్ చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. -
వేలంలో 991 మంది ఆటగాళ్లు! అతడికి అప్పుడు 14 కోట్లు.. ఇప్పుడు కనీసం కోటి ధరతో..
ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేయడానికి గడువు నవంబర్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అందులో 714 భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అదే విధంగా ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. 991 మంది ఆటగాళ్ల లిస్టులో 21 మంది తమ బేస్‌ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. కాగా 21 మంది జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ధర తగ్గించిన రహానే, ఇషాంత్ శర్మ కాగా ఈ సారి మినీవేలంలో 19 మంది టీమిండియా ఆటగాళ్లు భాగం కానున్నారు. వారిలో అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే రహానే, ఇషాంత్ ఈ సారి తమ బేస్ ప్రైస్‌ను భారీగా తగ్గించారు. ఈ ఏడాది మెగా వేలంలో కోటి రూపాయలును కనీస ధరగా ఉంచిన రహానే.. ఇప్పుడు దాన్ని రూ. 50 లక్షలకు తగ్గించాడు. మయాంక్ పరిస్థితి మరీ దారుణం అదే విధంగా ఇషాంత్ కూడా తన బేస్ ప్రైస్‌ను రూ. 75లక్షలుగా నిర్ణయించుకున్నాడు. ఇక గతేడాది లక్నో సూపర్‌జెయింట్స్ రాకతో కేఎల్ రాహుల్ తమ జట్టును వీడటంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అతడి కోసం 14 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో ఇటీవలే మయాంక్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు మినీ వేలంలో మయాంక్ తన కనీస ధరను కోటి రూపాయలుగా ప్రకటించడం గమనార్హం. 2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు వీరే నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ సీన్ అబోట్, రిలే మెరెడిత్, ఝే రిచర్డ్సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్ చదవండి: Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి.. -
అలాంటి వాళ్లకు స్థానం ఉండదు.. మయాంక్ కోసం పోటీ ఖాయం: భారత మాజీ క్రికెటర్
IPL 2023 Mini Auction- Mayank Agarwal: ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ. గత సీజన్లో తమ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు గుడ్ బై చెప్పింది. అతడి స్థానంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో పంజాబ్ రిటెన్షన్ జాబితాలోలేని మయాంక్ వేలంలోకి రానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మయాంక్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయమని అభిప్రాయపడ్డాడు. సంజయ్ మంజ్రేకర్(PC: Sanjay Manjrekar Twitter) మయాంక్ కోసం పోటీ ఎందుకంటే అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘ఓ సీజన్లో చెత్తగా ఆడామంటే.. కచ్చితంగా వారి కోసం వెచ్చించిన డబ్బు గురించి యాజమాన్యం ఆలోచించడం సహజమే! మిగత వాళ్లతో పోలిస్తే మయాంక్ అగర్వాల్ విషయం కాస్త భిన్నం. అతడిని వదులుకోవడం ద్వారా వచ్చిన డబ్బులో కొంతమొత్తం చెల్లించి అతడిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ల వైపు చూడొచ్చు. నిజానికి మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు ఎంత మంచి వాడంటే.. కెప్టెన్‌గా ఉన్నపుడు తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నిజానికి గత సీజన్లలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ అయిన తర్వాత టాపార్డర్‌లో ఉన్నా కొన్నిసార్లు తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి తనకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాల్సింది. అయితే ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు. తన విషయంలో చాలా బాధగా ఉంది. ఏదేమైనా.. సరైన ఓపెనర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలు మయాంక్ కోసం పోటీ పడటం ఖాయం. 150, 160 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయగల.. స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ బ్యాటర్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తాయి’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ సారథిగా వ్యవహరించిన మయాంక్.. 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్‌గా పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్ మామ భావోద్వేగం IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్‌తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం. ఫ్రాంచైజీలు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు) పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు) ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా.. గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది. కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్‌ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు. ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్‌ఫోర్డ్‌కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్మెంట్.. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్‌పై వేటు పడింది. -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. మయాంక్‌పై వేటు
ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ నియమించింది. బుధవారం(నవంబర్ 2) జరిగిన బోర్డు మీటింగ్‌లో కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో మయాంక్‌ను తప్పించి జట్టు పగ్గాలను ధావన్‌కు అప్పజెప్పాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించింది. అదే విధంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనిల్ కుంబ్లేను తప్పించి ట్రెవర్ బేలిస్‌ను జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా పంజాబ్ నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌తో కూడా పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వచ్చే ఏడాది సీజన్లో కొత్త కోచింగ్ స్టాప్, కొత్త కెప్టెన్లతో పంజాబ్ బరిలోకి దిగనుంది. చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయింటే విజయం మాదే: షకీబ్ -
మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్ 2022 తొలి సీజన్ విజేతగా మనీష్ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్ పాండే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మైస్టిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బుల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్ఆర్ చేతన్ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL — Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022 చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
IPL: కెప్టెన్‌పై వేటు.. స్పందించిన పంజాబ్ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు?
తమ జట్టు కెప్టెన్సీ అంశంపై వ్యాప్తి చెందుతున్న వదంతులపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ స్పందించింది. ఈ విషయం గురించి కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్లలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కెప్టెన్సీ విషయానికి సంబంధించి తమ ఫ్రాంఛైజీకి చెందిన ఏ ఒక్క అధికారి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా విఫలం కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌ను వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను నియమించింది యాజమాన్యం. మయాంక్ సారథ్యంలో పంజాబ్ పద్నాలుగింట 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. జట్టు పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాటర్‌గానూ మయాంక్ అగర్వాల్ విఫలమయ్యాడు. ఆడిన 12 ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు మొత్తం 196. అత్యధిక స్కోరు 52. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా వంటి యువ ఆటగాళ్లు సంప్రదాయ క్రికెట్లోనూ రాణిస్తున్న తరుణంలో టీమిండియాలోనూ మయాంక్‌కు చోటు కష్టంగానే మారింది. మా వాళ్లు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు! ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి మయాంక్ అగర్వాల్‌ను తొలగించబోతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కోచింగ్ విషయంలో ట్రెవర్ బెయిలిస్తోనూ ఫ్రాంఛైజీ సంప్రదింపులు జరుపుతోందంటూ రూమర్లు వ్యాపించాయి. ఈ విషయంపై బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన పంజాబ్ యాజమాన్యం.. సదరు వార్తలు రాసిన సైట్ల తీరును విమర్శించింది. ‘‘గత కొన్ని రోజులుగా స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్లలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్సీ విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి మా అధికారి ఎవరూ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం’’ అని పేర్కొంది. అయితే, ఆ వార్తల్ని మాత్రం ఖండిస్తున్నట్లు పేర్కొనకపోవడంతో మయాంక్ అగర్వాల్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కెప్టెన్సీ ఉంటుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా పంజాబ్ ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్‌ను వీడిన రాహుల్.. కొత్త లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆరంభ సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చి సత్తా చాటాడు. చదవండి: Mayank Agarwal: శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే! KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! News reports published by a certain sports News website pertaining to captaincy of the Punjab Kings franchise has been making the rounds in the last few days. We would like to state that no official of the team has issued any statement on the same. — Punjab Kings (@PunjabKingsIPL) August 24, 2022 -
శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే!
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ చాన్నాళ్ల తర్వాత సూపర్ శతకంతో చెలరేగాడు. 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అతని ధాటికి ప్రత్యర్థి జట్టు 9 వికెట్ల తేడాతో భారీ పరజయాన్ని మూటగట్టుకుంది. విషయంలోకి వెళితే.. మహారాజ ట్రోపీ కెస్సీఏ టి20 చాలెంజ్‌లో భాగంగా శుక్రవారం శివమొగ్గ స్ట్రైకర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్ 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహన్ కదమ్ 52 బంతుల్లో 84, బీఆర్ శరత్ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగగా.. ఎల్ ఆర్ చేతన్ 34, అనీస్ కెవి(35 నాటౌట్) సహకారమందించారు. ఇక మయాంక్ అగర్వాల్ టీమిండియా జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలం అయిపోయింది. మళ్లీ జట్టులోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ వెళ్లిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అటు బ్యాటింగ్‌లో.. ఇటు కెప్టెన్సీలో ఘోరంగా విఫలమయ్యాడు. మరోసారి లీగ్ దశలోనే పంజాబ్ ఇంటిబాట పట్టింది. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేదు. రోజుకో కొత్త క్రికెటర్ తెర మీదకు వస్తుండడం.. ఒక్కోసారి జట్టును ఎంపిక చేయడంలో బీసీసీఐకి కూడా తలనొప్పిగా మారిపోయింది. ఎఫ్టీపీలో భాగంగా టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఒక సీనియర్.. మరొకటి జూనియర్ జట్టుగా విడదీసి ఆయా టోర్నీలు ఆడేందుకు పంపిస్తున్నారు. ఇంత పోటీతత్వంలో మయాంక్ టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాడా అంటే చెప్పడం కష్టమే అవుతుంది. A great day in the field. 💯 Hungry for more. We march on🔥 #KBBlasters pic.twitter.com/4pN6sL97cI — Mayank Agarwal (@mayankcricket) August 13, 2022 చదవండి: Adam Lyth: సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్ -
మహారాజా టీ20 లీగ్‌లో ఆడనున్న కర్ణాటక స్టార్ ఆటగాళ్లు..!
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. ఆరు జట్లతో కూడిన మహారాజా టీ20 లీగ్‌ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఆగస్ట్ 7 ప్రారంభమై ఆగస్ట్ 26న ముగియనుంది. ఈ టోర్నీలో దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శ్రేయాస్ గోపాల్, కె గౌతమ్, జగదీశ సుచిత్, కరుణ్ నాయర్ అభిమన్యు మిథున్ వంటి ఆ రాష్ట్ర స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. ఇక బెంగళూరు, మైసూర్, హుబ్లీ, శివమొగ్గ, రాయచూర్, మంగళూరు జట్లుగా ఉన్నాయి. కాగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మైసూర్ మహారాజు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మహారాజా టీ20 ట్రోఫీలోని 18 మ్యాచ్‌లు మైసూర్‌లోని శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ గ్రౌండ్లో జరగనుండగా.. ఫైనల్‌తో సహా మరో 16 మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. చదవండి: Robert Lewandowski: తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్.. ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు -
నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె
India Vs England: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 1 నుంచి రీషెడ్యూల్డ్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో మ్యాచ్ ఆరంభం నాటికి అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి అతడి చిన్నారి కుమార్తె సమైరా శర్మ ‘తనకు తెలిసిన అప్డేట్’ ఇచ్చింది. తల్లి రితికాతో కలిసి సమైరా బయటకు వచ్చింది. ఆమెను చూసిన ఓ వ్యక్తి నాన్న ఎలా ఉన్నాడు అని అడుగగా... ‘‘డాడీ తన రూమ్‌లోనే ఉన్నాడు. పాజిటివ్. ఇంకా నెల రోజులు’’ అంటూ తన ముద్దు ముద్దు మాటలతో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రోహిత్ శర్మకు కరోనా సోకడంతో అతడి స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు స్టాండ్ బైగా మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపింది. మరోవైపు..కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు దూరం కావడంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక గతేడాది ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కలకలం కారణంగా వాయిదా పడ్డ ఈ టెస్టును జూలైలో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టు రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? #RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ — Krishna sai ✊🇮🇳 (@Krishna19348905) June 27, 2022 -
Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టెస్టు.. భారత జట్టులోకి మయాంక్ అగర్వాల్!
India Tour Of England 2022: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ బయల్దేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది కోవిడ్ కలకలం కారణంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 1 నుంచి ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ఇరు జట్లు నిర్ణయించాయి. అయితే, రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు దూరం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు ఐసోలోషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్టాండ్ బై ఓపెనర్‌గా మయాంక్‌ను ఇంగ్లండ్‌కు పంపించననున్నట్లు సమాచారం. ఒకవేళ టెస్టు ఆరంభం నాటికి రోహిత్ శర్మ అందుబాటులో లేనట్లయితే టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఈ మేరకు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం క్వారంటైన్ నిబంధనలు లేనందున అతడు త్వరగానే జట్టుతో చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. చదవండి: IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్ India Tour Of England 2022 Schedule: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు! Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్ అగర్వాల్.. వైస్ కెప్టెన్‌గా పంత్..!
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. భారత్- ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది 5 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. "ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్‌ని సిద్ధంగా ఉంచాము. రాహుల్‌కు ప్రత్యామ్నాయం కోసం జట్టు మేనేజ్మెంట్ను అడిగాము. ఈ నెల 19వ తేదీలోగా మాకు తెలియజేస్తామని చెప్పారు. ఒక వేళ అవసరమైతే మయాంక్ రెండవ బ్యాచ్‌తో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చదవండి: Wasim Jaffer Trolls Eoin Morgan: 'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్ -
నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్
రంజీ ట్రోపీ 2022లో భాగంగా కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ వికెట కీపర్ నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కర్నాటక ఓపెనర్ల రూపంలో వికెట్లను త్వరగానే కోల్పోయింది. 33 పరుగుల వద్ద రవికుమార్ సమ్రాట్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన కర్నాటక.. 12వ ఓవర్లో మయాంక్ అగర్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. సౌరబ్ కుమార్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకింది. బంతి గాల్లోకి లేచి కీపర్ ద్రువ్ జురేల్ దిశగా వెళ్లింది. అయితే బంతి ఎత్తులో ఉండడంతో క్యాచ్ దొరకదని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ను పైకి లేపడంతో బంతి చేతిలోకి వచ్చింది. తాను క్యాచ్ పట్టానా అని మొదట జురేల్ కూడా సందేహం వ్యక్తం చేశాడు. అలా మయాంక్ 5 ఫోర్లతో 22 పరుగులు చేసి మరోసారి నిరాశపరుస్తూ పెవిలియన్ చేరాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి కర్నాటక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి వంద పరుగులు చేసింది. శ్రీనివాస్ శరత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం కర్నాటక 198 పరుగుల లీడ్‌లో ఉంది. చదవండి: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్ ద్రువ్ జురేల్ స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది సీజన్లో నిరాశ పరిచిన ఆటగాళ్లను ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఓడియన్ స్మిత్ వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ను మెగా వేలంలో రూ.6 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే స్మిత్ పంజాబ్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే పంజాబ్ అంచనాలను అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అతడు తన పేలవ ప్రదర్శనతో తుది జట్టులో తన చోటును కోల్పోయాడు. ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లతో పాటు,51 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో 11.87 ఏకానమీ రేటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు అతడి స్థానంలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని పంజాబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ శర్మ ఐపీఎల్లో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను మెగా వేలంలో రూ.50లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అయితే ఈ సీజన్లో సందీప్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. సందీప్ శర్మకు పంజాబ్ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే అతడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే పంజాబ్ జట్టులో కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఫ్రంట్ లైన్ పేసర్లుగా ఉన్నారు. మరో వైపు ఆల్‌రౌండర్ రిషి ధావన్‌ను మూడవ పేసర్‌గా పంజాబ్ ఉపయోగించుకుంటుంది. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సందీప్ శర్మను పంజాబ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఐపీఎల్- 2022 మెగా వేలంలో మరోసారి యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. జానీ బెయిర్ స్టో, జితేష్ శర్మ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు దూరం కావడంతో ప్రభ్‌సిమ్రాన్‌కు ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్సిమ్రాన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ప్రభ్సిమ్రాన్ను పంజాబ్ విడిచి పెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం. చదవండి: IPL 2022: 'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది' -
'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'
ఐపీఎల్ 2022 సీజన్ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న వేళ ఐపీఎల్ వారికి కలిసొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ సహా మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం ఘోర ప్రదర్శన చేశారు. బ్యాటింగ్ స్టార్స్ కోహ్లి, రోహిత్‌ల సంగతి పక్కనబెడితే. వీరి కంటే ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం మయాంక్ అగర్వాల్ అని చెప్పొచ్చు. PC: IPL Twitter కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో పంజాబ్ కింగ్స్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా మయాంక్ ఎంపికయ్యాడు. దీంతో కెప్టెన్సీ భారం మీద పడడంతో మయాంక్ తనలోని బ్యాట్స్‌మన్‌ను పూర్తిగా మరిచిపోయాడు. 13 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ ఒకే ఒక హాఫ్ సెంచరీతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 441 పరుగులతో దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్లో కెప్టెన్‌గా జట్టును కూడా అంతంత మాత్రంగానే నడిపించాడు. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఏడు ఓటములతో ఈ సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మయాంక్ అగర్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. PC: IPL Twitter ''అసలు మయాంక్ అగర్వాల్‌కు ఏమైంది.. అతన్ని చూడగానే నా మదిలోకి వచ్చిన మొదటి ప్రశ్న. నిజానికి అతను మంచి స్ట్రైకింగ్ ప్లేయర్. అయితే ఐపీఎల్లో కెప్టెన్సీ అతని కొంపముంచింది. కెప్టెన్సీ భారం అతనిలోని మంచి బ్యాటర్‌ను చంపేసింది. ఈ సీజన్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా పనిచేసిన మయాంక్ ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్ చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. నాయకత్వం తలకు మించిన భారం కావడంతో ప్రతీసారి మయాంక్ మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించేది. అతన్ని కెప్టెన్ చేయకుండా ఒక బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడనిచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.'' అని చెప్పుకొచ్చాడు. PC: IPL Twitter ఇక ఆర్సీబీ బౌలర్ వనిందు హసరంగాను భజ్జీ ప్రశంసల్లో ముంచెత్తాడు.'' హసరంగా ఒక దశలో ఆర్సీబీకి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. నిజానికి అతను సర్ప్రైజ్ బౌలర్. తన బౌలింగ్‌తో బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టాడు. సక్సెస్ వెనుకు అతను పడ్డ కష్టం కనిపించింది. అతని బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేశాను.'' అంటూ తెలిపాడు. ఇక హసరంగా పర్పుల్ క్యాప్‌కు ఒక్క వికెట్ దూరంలో ఆగిపోయాడు. ఈ సీజన్లో హసరంగా 16 మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Krunal- Hardik Pandya: 'నిన్ను మరిచిపోయే స్టేజ్‌కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా' -
IPL 2022: సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్-2022 అఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి సునాయసంగా చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(49), ధావన్(39) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఫజల్హాక్ ఫరూకీ రెండు,ఉమ్రాన్ మాలిక్, సుచిత్,వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(43), రొమారియో షెపర్డ్(26),వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్,హర్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్ సాధించాడు. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 112 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన ధావన్.. ఫజల్హాక్ ఫరూకీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 109/3 12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో లివింగ్‌స్టోన్(24),ధావన్(38) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 92/3 71 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఔటయ్యాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 92/3 రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 66 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 68/2 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 62/1 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(24), షారుఖ్ ఖాన్(15) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 28 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ఫజల్హాక్ ఫరూకీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 22/0 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో(21), ధావన్(1) పరుగులతో ఉన్నారు. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్ఆర్హెచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(43), రొమారియో షెపర్డ్(26),వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్,హర్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్ సాధించాడు. 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 135/5 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్లు కోల్పోయి 135పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(19) రొమారియో షెపర్డ్(13) పరుగలతో క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 99/5 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(3) రొమారియో షెపర్డ్(1) పరుగలతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 76 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 61 పరుగులు వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన త్రిపాఠి.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 62/2 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 43/1 6 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(25), రాహుల్ త్రిపాఠి(13) పరుగులతో ఉన్నారు, తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 14 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన గార్గ్..రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 9/0 2 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో ప్రియమ్ గార్గ్(4), అభిషేక్ శర్మ(5) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2022 అఖరి లీగ్ మ్యాచ్‌లో వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు కేన్ విలియమ్సన్ దూరం కావడంతో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. తుది జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, ప్రియాం గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్ పంజాబ్ కింగ్స్ జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, ప్రేరక్ మన్కడ్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్‌లా గతంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్‌లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్‌గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్‌లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్‌లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్‌లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్‌లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! -
'మయాంక్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు'
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం (మే 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 17 పరుగుల తేడాతో పరజాయం పాలైంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ దాదాపు నిష్క్రమించింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ పేసర్ కగిసో రబాడతో తన నాలుగు ఓవర్ల కోటాను కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పూర్తి చేయించలేదు. అయితే మయాంక్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసంతృప్తి వక్య్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన రబాడ 24 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. "రబాడ ఆరంభంలో పరుగులు సమర్పించుకున్నాడు. కానీ అతడొక డెత్ స్పెషలిస్ట్. అటువంటి బౌలర్‌తో తన పూర్తి కోటాను పూర్తి చేయించలేదు. మయాంక్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. పిచ్ కొద్దిగా టర్న్ అవుతోంది. ఆ సమయంలో లియామ్ లివింగ్ స్టోన్‌ను తీసుకురావడం సరైన నిర్ణయమే. కానీ రబాడ వంటి స్టార్ బౌలర్‌తో తన అఖరి ఓవర్ వేయించి ఉంటే బాగుండేది. ఇక లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ చెరో మూడు వికెట్లు సాధించారు. తొలి బంతికే లివింగ్‌స్టోన్.. వార్నర్‌ను ఔట్ చేసి అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ఇక అర్ష్‌దీప్ కూడా దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్‌ను ఔట్ చేశాడు" అని యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'దటీజ్ లార్డ్ ఠాకూర్.. ఈ సారి కూడా ధావన్‌ను ఔట్ చేశాడు' -
'మయాంక్ అగర్వాల్ నిజమైన కెప్టెన్.. తన స్థానాన్ని త్యాగం చేశాడు'
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జట్టు ప్రయోజనాల కోసం మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడని మయాంక్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో శిఖర్ ధావన్‌తో కలిసి అగర్వాల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని ఆ జట్టు హార్డ్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో కోసం త్యాగం చేశాడు. అయితే ఓపెనర్‌గా వచ్చిన బెయిర్‌స్టో అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై బెయిర్‌స్టో అర్ధసెంచరీలు సాధించాడు."మయాంక్ అగర్వాల్ నిజమైన కెప్టెన్. బెయిర్‌స్టోకు అవకాశాన్ని ఇవ్వడం కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే బెయిర్ స్టో కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఊపయోగించుకున్నాడు. కాబట్టి మయాంక్ తీసుకున్న నిర్ణయం సరైనది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్' -
IPL 2022: పంజాబ్, రాజస్తాన్.. వాంఖడేలో ఇరు జట్లకు పాపం అన్నీ!
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య శనివారం మ్యాచ్ జరుగనుంది. ఇక ఆడిన పది మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో పట్టికలో సంజూ శాంసన్ బృందం మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. పదింట 5 గెలిచి 10 పాయింట్లతో ఏడో స్థానంలో మయాంక్ సేన ఉంది. దీంతో ఇరు వర్గాలకు తాము ఈ సీజన్లో ఆడబోయే పదకొండో మ్యాచ్ కీలకంగా మారింది. కాగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా పంజాబ్, రాజస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. మరి ఇరు జట్ల ముఖాముఖి రికార్డులు, పిచ్, తుది జట్ల అంచనా తదితర వివరాలు చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్: 52- పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై, వాంఖడే స్టేడియం సమయం: మే 7, మధ్యాహ్నం 3:30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం పంజాబ్, రాజస్తాన్ హెడ్ టూ హెడ్ రికార్డులు క్యాష్ రిచ్‌లీగ్‌లో 2018 నుంచి ముఖాముఖి తలపడిన సందర్భాల్లో పంజాబ్, రాజస్తాన్ చెరో 4 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే, ఓవరాల్‌గా మాత్రం 13 విజయాలతో రాజస్తాన్‌దే పంజాబ్‌పై పైచేయిగా ఉంది. పంజాబ్ 10 విజయాలకే పరిమితమైంది. పిచ్ వాతావరణం డే గేమ్ కాబట్టి మంచు పెద్దగా ప్రభావం చూపదు. కాబట్టి టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేసినా, ఛేజింగ్‌కు వెళ్లినా పెద్దగా తేడా ఉండకపోవచ్చు. అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. వాంఖడే మైదానంలో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌కు గొప్ప రికార్డేమీ లేదు. ఈ స్టేడియంలో తాము ఆడిన మ్యాచ్‌లలో గెలిచిన వాటికంటే ఓడినవే ఎక్కువ. మరో విశేషం ఏమిటంటే.. ఇరు జట్లు ఇక్కడ ఇప్పటి వరకు 9 పరాజయాలు నమోదు చేశాయి. ఇక బలాబలాల విషయానికొస్తే.. జోస్ బట్లర్ ఫామ్ రాజస్తాన్‌కు సానుకూల అంశం. బౌలింగ్ విభాగంలో యజువేంద్ర చహల్, అశ్విన్, యువ బౌలర్ కుల్దీప్ సేన్ రాణించడం వారికి బలం. ఇక పంజాబ్ మీద చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో 16 ఆడిన మ్యాచ్‌లలో చహల్ 25 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్‌ను తొందరగా అవుట్ చేయగలిగితే పంజాబ్‌కు మంచి ఫలితం ఉంటుంది. ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ మీద ధావన్, రాజపక్స, లివింగ్‌స్టోన్ చెలరేగిన విధానం సానుకూల అంశం. ఇక బౌలర్లలో రబడ ఫామ్‌లో ఉండటం కలిసి వచ్చే అంశం. అదే విధంగా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రాజస్తాన్‌తో ఆడిన 4 మ్యాచ్‌లలో ఏకంగా పది వికెట్లు పడగొట్టడం విశేషం. తుది జట్ల అంచనా రాజస్తాన్ రాయల్స్: జోస్ బట్లర్., దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్(కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, కుల్దీప్ సేన్. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భనుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జతేశ్ శర్మ(వికెట్ కీపర్), రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ. చదవండి👉🏾IPL 2022: 'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Dhawan ka A-1 shot 😍#SaddaPunjab #IPL2022 #PunjabKings #RishiDhawan #ਸਾਡਾਪੰਜਾਬ @rishid100 pic.twitter.com/yMlrSW0oJM — Punjab Kings (@PunjabKingsIPL) May 7, 2022 Let the countdown for #PBKSvRR begin ⏳#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/4f1BujiviW — Punjab Kings (@PunjabKingsIPL) May 7, 2022 Ready. Refreshed. Riyan. 🔥#RoyalsFamily | #HallaBol | @ParagRiyan | @DettolIndia pic.twitter.com/hutajUNJTP — Rajasthan Royals (@rajasthanroyals) May 6, 2022 -
లివింగ్‌స్టోన్, ధావన్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం
-
IPL 2022: చెత్త బ్యాటింగ్.. చెత్త షాట్లు.. టీమ్‌ను అమ్మిపారేయండి!
IPL 2022- LSG Beat PBKS By 20 Runs: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా బ్యాటర్ల ఆట తీరుపై మండిపడుతున్నారు. చెత్త ప్రదర్శన అంటూ విమర్శిస్తున్నారు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పరాజయంతో ఐపీఎల్-2022లో పంజాబ్ ఐదో ఓటమి చవిచూసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్ శిఖర్ ధావన్(5) వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(25), జానీ బెయిర్‌స్టో(32), లియామ్ లివింగ్‌స్టోన్(18), రిషి ధావన్(21) మినహా మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం గమనార్హం. దీంతో పంజాబ్ బ్యాటర్లకు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నారు ఫ్యాన్స్. ‘‘ఇక వీళ్లు మారరు. మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, కోచ్‌ను మార్చండి. టీమ్ మొత్తాన్ని అమ్మిపారేయండి. చెత్త షాట్లు. చెత్త బ్యాటింగ్. అనిల్ కుంబ్లే ముఖం చూస్తేనే వీళ్ల ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఏదేమైనా కేఎల్ రాహుల్ జట్టు మారాక అద్భుత ఫలితాలు సాధిస్తుంటే.. పంజాబ్ మాత్రం ఇలా వెనుకబడిపోతోంది’’ అంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. కాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని కొత్త జట్టు లక్నో.. పంజాబ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలర్ల విజృంభణతో ఆరో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఐపీఎల్ మ్యాచ్-42: పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ స్కోర్లు లక్నో- 153/8 (20) పంజాబ్- 133/8 (20) చదవండి👉🏾Krunal Pandya: ఆయన వల్లే ఇదంతా.. బ్యాట్‌తో కూడా రాణిస్తా: కృనాల్ That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally. Scorecard - https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG — IndianPremierLeague (@IPL) April 29, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); How to fix PBKS in 3 easy steps 1. Fire every coach 2. Fire everyone in management 3. Sell the team — Rahul🪐 (@RahulPBKS) April 29, 2022 PBKS batting is abysmal. Too many stupid shots. — Varun Desai - Champions of Europe 💙 (@LWOSVarun) April 29, 2022 Again PBKS auction strategy has to be questioned. Spent over 15 crores on Odean Smith & SRK. Could have spent that on Boult & one or two quality Indian batsman. — Varun Desai - Champions of Europe 💙 (@LWOSVarun) April 29, 2022 -
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. చిరకాల మిత్రుడిపై పైచేయి
ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్బుతంగా బ్యాలెన్స్ చేసుకొని క్యాచ్ తీసుకున్నాడు. చమీర వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అప్పటికే మయాంక్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులతో జోరు కనబరుస్తున్నాడు. తన చిరకాల మిత్రుడిని ఔట్ చేయడానికి రాహుల్ బంతిని చమీర చేతిలో పెట్టాడు. ఆ ఓవర్ తొలి బంతిని సూపర్ సిక్స్ కొట్టాడు. అయితే నాలుగో బంతిని షాట్ ఆడే క్రమంలో మిడాఫ్ దిశగా గాల్లోకి ఆడాడు. అయితే కేఎల్ రాహుల్ వెనక్కి పరిగెట్టి తన తలపై నుంచి పడిన బంతిని ఏ మాత్రం మిస్టేక్ చేయకుండా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో మయాంక్ కథ ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ మంచి మిత్రులున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు గన్నారు. తమ కలను నెరవేర్చుకున్నారు. చదవండి: IPL 2022: డికాక్ నిజాయితీని మెచ్చుకొని తీరాల్సిందే! #LSGvsPBKS pic.twitter.com/t4MB77FyjN — Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022 -
పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం
-
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ
ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడన్న సందేహం చాలా మంది అభిమానుల్లో మెదిలింది. అయితే టాస్ సమయంలో గ్రౌండ్‌కు వచ్చిన ధావన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ''మయాంక్ అగర్వాల్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో నేను జట్టును నడిపిస్తున్నా. అతని పరిస్థితి బాగానే ఉంది. బహుశా తర్వాతి మ్యాచ్‌కు మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న మయాంక్ బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: 'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్ సలహా -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అరుదైన ఫీట్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఫీట్ సాధించాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్ టి20 క్రికెట్లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మయాంక్ టి20ల్లో ఈ మార్క్‌ను చేరుకోవడానికి 164 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఇక తొలి వెయ్యి పరుగులు అందుకోవడానికి మయాంక్ 45 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. రెండో వెయ్యి పరుగులకు 42 ఇన్నింగ్స్‌లు.. మూడో వెయ్యి పరుగుల మార్క్‌కు 45 ఇన్నింగ్స్‌లు.. నాలుగో వెయ్యి పరుగులకు 32 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో మయాంక్ 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐపీఎల్లో మయాంక్‌కు ఇది 12వ అర్థశతకం. FIFTY for @mayankcricket 👏👏 This is his first of #TATAIPL 2022 and 12th overall. Live - https://t.co/emgSkWA94g #MIvPBKS #TATAIPL pic.twitter.com/4HsCmAvXNa — IndianPremierLeague (@IPL) April 13, 2022 -
IPL 2022: పంజాబ్ కింగ్స్ విజయం.. ముంబైకి తప్పని ఓటమి
-
'బాబుపై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా ఉంది.. తొలగిస్తే ఆడతాడేమో!'
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన మయాంక్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. హార్ధిక్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన మయాంక్ మిడ్‌వికెట్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రషీద్ ఖాన్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో మయాంక్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు తాజా దానితో కలిపి పంజాబ్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా మయాంక్ వరుసగా 32, 1, 4, 5 పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్సీ ప్రభావం అతన్ని దెబ్బతీస్తుందా అని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ''మయాంక్‌పై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా పడింది. ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. నాలుగు మ్యాచ్‌లు కలిపి 42 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా వస్తున్న మయాంక్‌కు ఇది సరిపోదు. గత సీజన్లో కనిపించిన మయాంక్ ఇప్పుడు కనబడడం లేదు. ఇలాగే ఉంటే అతను ఆటను మరిచిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించండి.. అప్పుడైనా ఆడతాడేమో'' అంటూ పేర్కొన్నాడు. కాగా గత సీజన్లో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉండడంతో మయాంక్ యథేచ్చగా బ్యాట్ ఝులిపించాడు. ఈసారి ధావన్‌కు కెప్టెన్సీ ఇస్తారనుకుంటే పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ మాత్రం మయాంక్‌పై నమ్మకంతో అతనికే పగ్గాలు అప్పజెప్పింది. చదవండి: IPL 2022: 'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!' మయాంక్ అగర్వాల్ ఔట్ వీడియో కోసం క్లిక్ చేయండి -
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
-
'ఏంటి మయాంక్ ఇలా ఆడుతున్నావు.. ఇక కష్టమే'
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశపరిచాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో తొలి బంతికే ఫోర్ కొట్టిన మయాంక్.. రెండో బంతికి రాబిన్ ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మయాంక్ పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు అగర్వాల్ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. "ఏంటి మయాంక్.. కెప్టెన్‌గా ఇలా ఆడితే ఇక కష్టమే" అంటూ కామెంట్ చేశాడు. కాగా ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Tilak Varma: మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు -
'ఏంటి మయాంక్ అలా అరుస్తున్నావు.. కెప్టెన్‌గా ఇది పనికిరాదు'
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కాస్త అసహానానికి గురయ్యాడు. మ్యాచ్ కేకేఆర్ చేతిలోకి వెళ్లిపోవడంతో మయాంక్ తన ప్రశాంతతను కోల్పోయాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో.. తొలి బంతిని మిడ్ ఆఫ్ దిశగా వెంకటేశ్ అయ్యర్ ఆడాడు. అయితే మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షారుఖ్ ఖాన్ బంతి సరిగ్గా అందుకువడంలో విఫలమయ్యాడు. వెంటనే అసహానానికి లోనైన మయాంక్ అగర్వాల్.. షారుఖ్ ఖాన్‌పై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి మయాంక్ అలా అరుస్తున్నావు.. కెప్టెన్‌గా ఇది పనికిరాదు" అంటూ కామెంట్ చేశాడు. చదవండి: MI VS RR: అరుదైన రికార్డుకు 64 పరుగుల దూరంలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ We have seen Angry Mayank there 😱 #IPL2022 #MayankAgarwal #PBKSvsKKR pic.twitter.com/iN9Q4o4DZT — Amanpreet Singh (@AmanPreet0207) April 1, 2022 -
IPL 2022: రసెల్ విధ్వంసం.. పంజాబ్‌పై కేకేఆర్ ఘన విజయం
-
IPL 2022: రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం.. క్రెడిట్ వాళ్లదే: మయాంక్
IPL 2022- నవీ ముంబై: ఆదివారం ఐపీఎల్ పసందైన విందు ఇచ్చింది. 27 సిక్సర్లతో (బెంగళూరు 13, పంజాబ్ 14)... 413 పరుగులతో ( 205 + 208) రెట్టింపు వినోదాన్ని పంచింది. ఒక సిక్సర్ ఎక్కువ కొట్టిన పంజాబ్ ఐదు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి బోణీ కొట్టింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (57 బంతుల్లో 88; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. కొండంత లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే 208 పరుగులు చేసి ముగించింది. ఓపెనర్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) , రాజపక్స (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటికి పంజాబ్ లక్ష్యంవైపు సాఫీగా సాగిపోయింది. షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఒడెన్ స్మిత్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు 4.1 ఓవర్లలో 52 పరుగులు జోడించి పంజాబ్‌ను గెలిపించారు. రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం: మయాంక్ అగర్వాల్ పంజాబ్ కెప్టెన్‌గా తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ గెలుపుతో సీజన్ ఆరంభించడం విశేషం. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ మాట్లాడుతూ.. ‘‘రెండు పాయింట్లు అనేవి మాకు చాలా చాలా ముఖ్యం. వికెట్ బాగుంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు సాధించడం చూస్తుంటూనే అర్థమవుతోంది. జట్టు ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నాం. నాకు తెలిసి మేము 15- 20 పరుగులు ఎక్కువగా ఇచ్చి ఉంటాం. విరాట్, ఫాఫ్ కలిసి మ్యాచ్‌ను తమ వైపు లాగేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! A spectacular run-chase by @PunjabKingsIPL in a high-scoring thriller sums up a Super Sunday 😍#TATAIPL #PBKSvRCB pic.twitter.com/7x90qu4YjI — IndianPremierLeague (@IPL) March 27, 2022 A skipper Mayank special 😎 Check out @mayankcricket's authoritative six👌👌 WATCH▶️https://t.co/t0on2mlWMo #TATAIPL #PBKSvRCB pic.twitter.com/Sp14KIi9d4 — IndianPremierLeague (@IPL) March 27, 2022 -
ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
-
ఐపీఎల్లో కొత్త నాయకులు.. 10 జట్ల కెప్టెన్లు వీళ్లే!
ఐపీఎల్-2022 శనివారం(మార్చి 26) నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో బరిలో ఉన్న 10 జట్లలో ఎనిమిది జట్లకు భారత క్రికెటర్లు నాయకత్వం వహిస్తున్నారు. ఏ జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారో ఓ సారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), హార్దిక్ పాండ్యా (గుజరాత్ జెయింట్స్), మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్), సంజూ సామ్సన్ (రాజస్తాన్ రాయల్స్), రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఈ జాబితాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు... న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు. చదవండి: CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..! -
కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!
మరొక రోజులో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది. ఇంతకముందు ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. దీంతో రెండు గ్రూఫులుగా విడదీసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటికి అదనంగా కొత్త రూల్స్, 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతితో ఈసారి ఐపీఎల్ కన్నుల పండువగా జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఐపీఎల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి నలుగురు కొత్త కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -సాక్షి, వెబ్‌డెస్క్ వారే రవీంద్ర జడేజా,మయాంక్ అగర్వాల్, డుప్లెసిస్, హార్దిక్ పాండ్యా. వీరందరికి కెప్టెన్సీ కొత్తే. కత్తిమీద సాములాంటి కెప్టెన్సీని ఎలా డీల్ చేస్తారో.. వీరిలో ఎవరు కెప్టెన్‌గా మెయిడెన్ టైటిల్ కొట్టనున్నారో వేచిచూద్దాం. దానికి ముందు ఈ నలుగురి గురించి ఒకసారి తెలుసుకుందాం. రవీంద్ర జడేజా(సీఎస్కే కెప్టెన్) ఎంఎస్ ధోని అనూహ్య నిర్ణయంతో రవీంద్ర జడేజా ఆఖరి నిమిషంలో కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ధోనియే స్వయంగా ఆ బాధ్యతను జడేజాకు అప్పగించాడని.. ఇకపై జడ్డూనే జట్టును ముందుండి నడిపిస్తాడని సీఎస్కే ట్వీట్ చేసింది. అయితే జడేజాకు కెప్టెన్‌గా అనుభవం లేదు. తన 13 ఏళ్ల కెరీర్లో జడేజా ఏనాడు ఒక్క మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించలేదు. మరి అనుభవం లేని జడేజా సీఎస్కే ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. పైగా లీగ్ ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా సీఎస్కేకు పేరు ఉంది. ఇక ఐపీఎల్లో ధోని కెప్టెన్సీ రికార్డు అమోఘం. లీగ్ చరిత్రలోనే ఒక జట్టను అత్యధిక సార్లు ఫైనల్ తీసుకెళ్లిన కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. మరి అతని వారసత్వాన్ని జడేజా కొనసాగిస్తాడా.. లేక ఒక సీజన్‌కే కెప్టెన్‌గా పరిమితమవుతాడా అనేది చూడాలి. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో పెద్దన్న పాత్ర పోషించడం గ్యారంటీ. జడేజాకు సహాయం చేయడంలో ముందుంటాడు. ఈ విషయాన్ని జడేజా కూడా చెప్పాడు. ధోని భయ్యా నాకు ఒక లిగసీని సెట్ చేశాడు.. దానిని నేను ముందుకు తీసుకెళ్లాలి. కెప్టెన్సీ అనేది నాకు పెద్ద బాధ్యత.. కానీ ధోని భయ్యా ఉన్నాడుగా పర్లేదు అని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో జడేజా ప్రస్థానం రాజస్తాన్ రాయల్స్‌తో మొదలైనప్పటికి ఎక్కువకాలం ఆడింది మాత్రం సీఎస్కేకే. 2012 నుంచి సీఎస్కేలో ఉన్న జడేజా ఇప్పటివరకు ఐపీఎల్లో 200 మ్యాచ్‌లాడి 2386 పరుగులు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్(ఆర్సీబీ కెప్టెన్) ఐపీఎల్లో అత్యంత దురదృష్టమైన జట్టుగా ఆర్సీబీకి పేరుంది. ప్రతీసారి మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్సీబీ అసలు ఆటలో బోల్తా కొడుతుంది. పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ మెట్టుపై జారిపడింది. అలాంటి ఆర్సీబీకి కోహ్లి వెన్నుముక అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని లాగే కోహ్లి కూడా ఆరంభం నుంచి ఆర్సీబీ తరపునే ఆడాడు. 2013లో ఆర్సీబీ కెప్టెన్ అయిన కోహ్లి 9 ఏళ్ల పాటు జట్టును నడిపించాడు. ఈ తొమ్మిదేళ్లలో కోహ్లి నాయకత్వంలో ఆర్సీబీ ఒకసారి ఫైనల్ చేరుకోగా.. మరో మూడుసార్లు ప్లేఆఫ్ వరకు వచ్చింది. మిగతా ఐదుసార్లు లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు.. వచ్చే సీజన్ నుంచి ఆటగాడిగా మాత్రమే ఉంటానని పేర్కొన్నాడు. దీంతో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. మెగావేలం ముగిసిన తర్వాత దినేష్ కార్తిక్, మ్యాక్స్‌వెల్ పేర్లు బాగా వినిపించినప్పటికి.. అనూహ్యంగా డుప్లెసిస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్ గెలవని ఆర్సీబీపై తీవ్ర ఒత్తిడి ఉంది. మరి ఆ ఒత్తిడిని డుప్లెసిస్ అధిగమించి ఆర్సీబీని విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్లో ధోని సారధ్యంలో సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ మంచి ప్రదర్శన కనబరిచాడు. పలుమార్లు తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంత పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే పేరు ఐపీఎల్‌లోనూ దక్కించుకున్నాడు. ఇకపోతే డుప్లెసిస్‌కు కెప్టెన్సీ ఐపీఎల్లో కొత్త కావొచ్చు.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతను సౌతాఫ్రికాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇది అతనికి కలిసొచ్చే అంశం. తన హయాంలో సౌతాఫ్రికా కొన్ని మేజర్ సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది. మరి అదే జోరును డుప్లెసిస్ ఐపీఎల్‌లోనూ కనబరుస్తాడని ఆశిద్దాం. ఆర్సీబీకి తొలి టైటిల్ అందించే కెప్టెన్‌గా డుప్లెసిస్ నిలుస్తాడేమో చూద్దాం. ఇక ఐపీఎల్లో డుప్లెసిస్ 100 మ్యాచ్‌ల్లో 2935 పరుగులు సాధించాడు. మయాంక్ అగర్వాల్(పంజాబ్ కింగ్స్ కెప్టెన్) ఐపీఎల్లో ఇంతవరకు టైటిల్ గెలవని మరో జట్టు పంజాబ్ కింగ్స్(గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్). ఎన్నోసార్లు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మాత్రం మారలేదు. లీగ్ చరిత్రలో 2008లో ప్లే ఆఫ్, 2014 ఫైనల్ మినహా పంజాబ్ ఎప్పుడు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. గతేడాది సీజన్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కేఎల్ రాహుల్ ఈసారి కొత్తగా వచ్చిన లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వెళ్లడంతో పంజాబ్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. కొన్నేళ్లుగా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న మయాంక్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదగాడు. గత సీజన్లో మంచి ప్రదర్శన కనబరిచిన మయాంక్‌ను రూ. 12 కోట్లతో రిటైన్ చేసుకుంది. అతనిపై నమ్మకంతో ధావన్‌ను కాదని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో ధావన్ కూడా మయాంక్‌కే ఓటు వేశాడు. తనకంటే మయాంక్ సమర్ధుడని తెలిపాడు. అయితే మయాంక్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం పెద్దగా లేదు. మరి కొత్త కెప్టెన్‌గా మయాంక్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మయాంక్ ఐపీఎల్ కెరీర్ పరిశీలిస్తే.. 100 మ్యాచ్‌ల్లో 2131 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా(గుజరాత్ టైటాన్స్) అదృష్టం కొద్ది కెప్టెన్ అయిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా మాత్రమే. మెగావేలానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌పై నమ్మకముంచి రూ. 15 కోట్లకు రిటైన్ చేసుకుంది. అసలు ఫామ్‌లో లేని ఆటగాడు ఇలా ఒక జట్టుకు కెప్టెన్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. ముంబై ఇండియన్స్‌లో కొన్నేళ్ల పాటు కీలక ఆటగాడిగా ఉన్న పాండ్యా గతేడాది నుంచి సరైన ఫామ్‌లో లేడు. ఆల్‌రౌండర్ ట్యాగ్‌తో టి20 ప్రపంచకప్ ఆడినప్పటికి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి క్రికెట్ ఆడని హార్దిక్ కెప్టెన్‌గా నేరుగా ఐపీఎల్ ద్వారానే గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా ఉండే హార్దిక్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు ఒక్క ఫార్మాట్లో కెప్టెన్ పాండ్యాకు అనుభవం లేదు. ఇక ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా 92 మ్యాచ్‌లాడి 1476 పరుగులతో పాటు బౌలింగ్‌లో 42 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. అతను అడుగుపెడితే టైటిల్ నెగ్గాల్సిందే..! IPL 2022: చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..! -
IPL 2022: సిక్సర్లు ఎలా కొట్టాలంటే... చెబుతా.. నేను ఉన్నది అందుకేగా!
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి... ఎన్ని ఫోర్లు బాది ఎంత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తినా టి20 క్రికెట్లో సిక్సర్ల మజాయే వేరు. ఇక క్రికెట్ వినోదం ఐపీఎల్లో అయితే నేరుగా గ్యాలరీల్లోకి పడే సిక్సర్లను మీటర్ల లెక్కన కొలిచి వాటి విలువను నిర్వాహకులు అమాంతం పెంచేస్తుంటారు. మరి అలాంటప్పుడు సిక్స్ కొట్టడం కూడా ఒక ప్రత్యేక కళగా గుర్తించి అందులో శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది. దీనికి ఈ సారి ఐపీఎల్లో సమాధానం లభించనుంది. తొలి సారి ఒక జట్టు కేవలం సిక్సర్ల కోసమే కోచ్‌ను పెట్టుకోవడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్... ఇలా ఐపీఎల్ జట్ల ప్రధాన సహాయక సిబ్బంది జాబితా చూస్తే చాలా పెద్దదే. ఇప్పుడు ఇందులోకి మరో పాత్ర కూడా వచ్చి చేరింది. అదే పవర్ హిట్టింగ్ కోచ్. ఈ తరహా శిక్షణలో పేరుపొందిన ఇంగ్లండ్ మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జూలియన్ రాస్వుడ్ను పంజాబ్ కింగ్స్ 2022 లీగ్ సీజన్ కోసం ఎంచుకుంది. తమ టీమ్‌లో ఉన్న మయాంక్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, ఒడెన్ స్మిత్, షారుఖ్ ఖాన్ వంటి హిట్టర్ల ఆటకు మరింత మెరుగులు దిద్ది ఫలితం రాబట్టాలని జట్టు ఆశిస్తోంది. ఏమిటీ భిన్నం... గతంలో బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్ కౌంటీల్లో పని చేసిన జూలియన్ రాస్వుడ్ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. కార్లోస్ బ్రాత్‌వైట్, బెన్ స్టోక్స్, స్యామ్ బిల్లింగ్స్ తమ సిక్సర్లు బాదే నైపుణ్యం పెంచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. బౌలర్ గొప్పతనం, మంచి బంతా కాదా అనేది ఏమాత్రం పట్టించుకోరాదని, బలమంతా ఉపయోగించి బంతిని బాదడమే ఏకైక మంత్రమని అతను ఉపదేశిస్తాడు. ‘క్రీజ్‌లో బ్యాటర్ నిలబడిన తీరును బట్టి అతను ఎంత శక్తిని వాడగలడో తెలుస్తుంది. సంప్రదాయ శైలి షాట్లు ఆడే శరీరం, చేతుల సమన్వయం అనేది ఇక్కడ కుదరదు. నా దృష్టిలో ఈ రెండు వేర్వేరు. బేస్ బాల్ తరహాలో ఎడమ కాలు వెనక్కి వెళుతూ తుంటి భాగంపై భారం వేస్తే షాట్ కొట్టడం సులువవుతుంది. వెస్టిండీస్ ఆటగాళ్లు సహజంగానే ఇలాంటివి ఆడతారు. ఆ నైపుణ్యం లేనివారిని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దడమే నా పని’ అని జూలియన్ వివరించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన సమయంలోనే టెక్సాస్ రేంజర్ బేస్‌బాల్ లీగ్ చూసిన అతను అదే శైలిని టి20 క్రికెట్లోకి తీసుకొచ్చాడు. తనదైన శిక్షణ పద్ధతితో... పవర్ హిట్టింగ్ శిక్షణకు జూలియన్ భిన్నమైన పద్ధతిని అనుసరిస్తాడు. బరువైన బ్యాట్లు, బరువైన బంతులతో పాటు ఆటగాళ్లు చేతులు, మోచేతికి బరువైన వస్తువులు అమర్చి షాట్లు ఆడేలా ప్రోత్సహిస్తాడు. నడుము చుట్టూ తాళ్లు చుట్టు దానిని ఒక పోల్‌కు కట్టేసి ఇతర శరీర భాగాలను వాడకుండా కేవలం మోచేతి బలంతోనే షాట్లు సాధన చేయించడంలో జూలియన్ తన ప్రత్యేకత ప్రదర్శిస్తాడు. ‘బేస్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్లో టెక్నిక్ కాస్త భిన్నమే అయినా బంతిని బలంగా బాదడమే మనకు కావాల్సింది. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి శక్తిని ఉపయోగిస్తే టి20ల్లో అద్భుతాలు జరుగుతాయి’ అని జూలియన్ విశ్లేషించాడు. అతని మార్గనిర్దేశనంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఎలాంటి ప్రయోజనం పొందుతారో చూడాలి. 🎥 Our powerhouse Julian Woods has big plans for our big hitters 💥#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 pic.twitter.com/8XVdltLu2O — Punjab Kings (@PunjabKingsIPL) March 14, 2022 It is Liam's world & we are just 𝗟𝗶𝘃𝗶𝗻𝗴 in it 😉 #SherSquad, excited to see him display his all-round skills? 🔥#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @liaml4893 pic.twitter.com/mp9KSPeiex — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2022 -
'అతడి కెప్టెన్సీలో ఆడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా'
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి సారి పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.. ఐపీఎల్-2022 మెగా వేలంలో ధావన్‌ని రూ.8.25 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. కాగా పంజాబ్ కింగ్స్‌కు సారథిగా ధావన్ ఎంపిక అవుతాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో యంగ్ ఎండ్ డైనిమిక్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నేతృత్వంలో ఆడేందకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని ధావన్ తెలిపాడు. "మయాంక్ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. అతడి కెప్టెన్సీలో ఆడడం నాకు బాగా ఉపయోగపడుతుంది. మాకు బలమైన జట్టు ఉంది. జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన యువకులు ఉన్నారు. ఈ సారి మేము అద్భుతాలు సృష్టిస్తాం. అదే విధంగా మయాంక్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నాను. ఓపెనింగ్ ఆనేది పెద్ద బాధ్యతతో కూడుకున్న పని, దానిని స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను. నేను ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాను. త్వరలోనే జట్టులో చేరుతాను. ఇక్కడ నెట్స్‌లో నేను తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇకపై నా ఆటపై మాత్రమే దృష్టి సారిస్తాను. టీమిండియా నుంచి పిలుపు వస్తే వెంటనే జట్టులో చేరడానికి సిద్దంగా ఉన్నాను. దాని కోసమే ఎదరుచూస్తున్నాను" అని ధావన్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన ధావన్ 587 పరుగులు సాధించి అద్భుతంగా రాణించాడు. చదవండి: WI Vs Eng 2nd Test- Joe Root: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి.. Sound 🔛 👏 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐏𝐮𝐧𝐣𝐚𝐛 𝐤𝐞 𝐥𝐢𝐲𝐞 𝐭𝐚𝐚𝐥𝐢𝐲𝐚𝐧 𝐛𝐚𝐣𝐭𝐢 𝐫𝐞𝐡𝐧𝐢 𝐜𝐡𝐚𝐡𝐢𝐲𝐞 👏 #SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/GFWuCZZRHp — Punjab Kings (@PunjabKingsIPL) March 16, 2022 -
అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా అనూహ్యంగా తొలి వికెట్‌ను కోల్పోయింది. అవసరం లేని పరుగుకు ప్రయత్నించి మయాంక్ అగర్వాల్ రనౌట్ అయ్యాడు. అయితే మయాంక్ ఔటైన బంతి రీప్లేలో నోబాల్‌గా తేలడం గమనార్హం. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో మూడో బంతి అగర్వాల్ ఫ్రంట్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో శ్రీలంక ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ వారి అప్పీల్‌ను తిరష్కరించాడు. అయినప్పటికీ, మయాంక్ తొందరపడి అవసరం లేని పరుగుకు ప్రయత్నించాడు. అయితే నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ "నో" అని చెప్పినప్పటకీ మయాంక్ వినిపించుకోలేదు. ఈ క్రమంలో శ్రీలంక ఫీల్డర్ ప్రవీణ్ జయవిక్రమ బంతిని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు అందజేశాడు. దీంతో మయాంక్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ధీంతో హోం గ్రౌండ్లో మయాంక్ అగర్వాల్‌కు నిరాశే ఎదురైంది. ఇక 2012 తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తొలి వికెట్‌ను రనౌట్ రూపంలో కోల్పోవడం ఇదే తొలి సారి. 2012 లో కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Ind Vs Sl 2nd Test: సిరాజ్‌కు నో ఛాన్స్.. తుది జట్టులోకి అక్షర్ pic.twitter.com/IoI9M7FzUe — Rishobpuant (@rishobpuant) March 12, 2022 -
'అతడు బాస్ లా బ్యాటింగ్ చేస్తాడు.. భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదే'
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శుభమాన్ గిల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా భారత రెగ్యూలర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్ధానంలో గిల్‌కు స్ధానం దక్కుతుందని అంతా భావించారు. అయితే భారత జట్టు మేనేజేమెంట్ ఆనూహ్యంగా మయాంక్ ఆగర్వాల్ వైపు మొగ్గు చూపింది. దీంతో రోహిత్‌కు జోడిగా మయాంక్ ఆగర్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.ఈ మ్యాచ్‌లో ఆగర్వాల్ 33 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. అయితే భారత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు. అదే విధంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో పుజారా స్ధానంలో హనుమా విహారి బ్యాటింగ్‌కు రాగా.. రహానే స్ధానంలో శ్రేయర్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గిల్‌ను కాదు అని మయాంక్‌ను ఆడించాలనే భారత్ నిర్ణయాన్ని గవాస్కర్ సమర్థించాడు."గిల్ గత రెండు నెలలుగా ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. అతడు కనీసం రంజీ ట్రోఫీలో కూడా పాల్గొనలేదు. అతడు తుది జట్టులోకి రావాలంటే.. కొద్ది రోజులు ప్రాక్టీస్ అవసరం. కాగా గిల్ మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక గిల్‌ను కాదు అని మయాంక్‌ను ఆడించి భారత్ మేనేజేమెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. మయాంక్ అగర్వాల్ స్వదేశంలో అద్భుతంగా ఆడుతాడు. హోమ్ సిరీస్‌లలో అతడు భారీ స్కోర్లు సాధించాడు. అతను భారత్‌లో ఒక బాస్ లాగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు ఓపెనర్‌గా డబుల్ సెంచరీ కూడా సాధించాడు. కాబట్టి ఖచ్చితంగా అతడే ఇన్నింగ్స్‌ను ఆరంభించాలి. అదే విధంగా విహారి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్ధానాలను కొంత కాలం కొనసాగించాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు బెంగళూరు వేదికగా మార్చి 12 ప్రారంభం కానుంది. చదవండి: Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు -
'ధావన్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం'
ఐపీఎల్-2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్యాచ్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు అగర్వాల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ సీజన్లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని మయాంక్ తెలిపాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు అగర్వాల్‌ను పంజాబ్ రీటైన్ చేసుకోగా.. ధావన్‌ను వేలంలో రూ. 8.2 కోట్లకు కొనుగోలు చేసింది. "పంజాబ్ జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ లాంటి అద్భుతమైన ఆటగాడితో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా ఆదృష్టం. ఇక ఈ సీజన్లో అండర్-19 ప్రపంచకప్ హీరో రాజ్ బావాను సొంతం చేసుకున్నాము. అతడికి ఇది తొలి సీజన్ కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అదే విధంగా అతడితో ఆడటానికి నేను ఎదురు చూస్తున్నాను. ఈ ఇద్దరే కాదు.. అందరి ఆటగాళ్లతో ఆడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మయాంక్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ మెగా వేలానికి ముందు మయాంక్‌ను రూ.12 కోట్లకు పంజాబ్ రీటైన్ చేసుకుంది. ఐపీఎల్లో 100 మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్ 2135 పరుగులు సాధించాడు. ఇక గతేడాది సీజన్లో కూడా మయాంక్ అద్భుతంగా రాణించాడు. గత సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 441 పరుగులు చేశాడు. ఐపీఎల్-2022 మార్చి 26న ప్రారంభం కానుంది. చదవండి: Icc women's world cup 2022: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ యజమాన్యం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పంజాబ్ మయాంక్ అగర్వాల్‌తో పాటు అర్షదీప్ సింగ్‌ను రీటైన్ చేసుకుంది. అయితే మెగా వేలంలో శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్ స్టోన్, కగిసో రబడ వంటి స్టార్ ఆటగాళ్లను పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ధావన్‌ను కెప్టెన్‌గా నియమించనున్నారని వార్తలు వినిపించాయి. కానీ పంజాబ్ యజమాన్యం మాత్రం మయాంక్ వైపే మొగ్గు చూపింది. ఇక 2011లో ఐపీఎల్లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ తరుపున అరంగేట్రం చేశాడు. తర్వాత 2018 నుంచి పంజాబ్‌కు మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేలానికి ముందు అతడిని రూ. 12 కోట్లకు పంజాబ్ రిటైన్ చేసుకుంది. పంజాబ్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత మయాంక్ స్పందించాడు. 'నేను 2018 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టులో భాగమై ఉన్నాను. పంజాబ్ లాంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో నిర్వరిస్తాను "అని మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభం కానుంది. చదవండి: పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్.. ఆరేళ్ల తర్వాత! -
శ్రీలంకతో మూడో టీ20.. టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
India vs Sri Lanka: శ్రీలంకతో జరిగే మూడో టీ20కు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత టీ20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మూడో టీ20 దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి స్ధానంలో మయాంక్ ఆగర్వాల్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో కిషన్ గాయపడిన సంగతి తెలిసిందే. లాహిరు కుమారా బౌలింగ్‌లో కిషన్ తలకు గాయమైంది. అయితే మ్యాచ్ అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రికి తరలించారు. తలకు సిటీస్కాన్ నిర్వహించారు. దీనికి సబంధించిన రిపోర్టు ఆదివారం రానుంది. ఈ క్రమంలో అఖరి టీ20కు కిషన్ దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే గాయం కారణంగా కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లు ఈ సిరీస్ దూరమయ్యారు. కాగా భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 ధర్మశాల వేదికగా ఆదివారం జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచి వరుసగా మూడో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన ఉర్రూతలూగుతుండగా.. కనీసం అఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్. -
ధావన్ కాదంట.. మయాంక్‌కే అవకాశం
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ అని ఊహాగానాలు వస్తున్నప్పటికి.. మయాంక్ అగర్వాల్‌వైపే ఫ్రాంచైజీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వేలానికి ముందే మయాంక్ అగర్వాల్‌తో(రూ.12 కోట్లు) పాటు అర్ష్‌దీప్ సింగ్(రూ. 4 కోట్లు)ను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ మిగతా జట్టును మొత్తం రిలీజ్ చేసింది. గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈసారి వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ నడిచింది. ఇటీవలే ముగిసిన మెగావేలంలో శిఖర్ ధావన్‌ను రూ. 9.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ధావన్‌తో పాటు కగిసో రబాడ, జానీ బెయిర్ స్టో, రాహుల్ చహర్, లియామ్ లివింగ్ స్టోన్, షారుక్ ఖాన్ లాంటి పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పేరు తప్ప మరో ఆటగాడు కనిపించలేదు. అయితే రిటైన్ చేసుకున్న మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించి వైస్ కెప్టెన్ బాధ్యతలు ధావన్‌కు అప్పగిస్తే ఎలా ఉంటుందనే యోచన చేసింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో మయాంక్‌కు కెప్టెన్సీ కట్టబెట్టనున్నారు. ఈ విషయాన్ని ఈ వారాంతంలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 2014లో ఫైనల్ మినహా మళ్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది లేదు. గత మూడు సీజన్ల నుంచి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కాగా ఈసారి సీజన్‌ను మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? IND W- NZ W: హమ్మయ్య.. మొత్తానికి గెలిచింది -
Ind Vs Wi: కోహ్లికి ఆ విషయం తెలుసు.. ఓపెనర్‌గా దిగేది అతడే.. కన్ఫర్మ్ చేసిన రోహిత్ శర్మ
Ind Vs Wi ODI Series- 1st ODI Rohit Sharma Press Meet: వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్‌తో టీమిండియా పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రయాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సారథిగా న్యూజిలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన హిట్‌మ్యాన్.. వన్డేల్లోనూ ఇదే తరహాలో అదరగొట్టాలని భావిస్తున్నాడు. ఇక విండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న తొలి వన్డే టీమిండియాకు వెయ్యవది కావడంతో హిట్‌మ్యాన్‌కు ఇది మరింత ప్రత్యేకంగా మారింది. ఈ క్రమంలో వన్డే సారథి హోదాలో తొలిసారిగా శనివారం మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తమ ప్రణాళికలు, ఓపెనింగ్ జోడీ తదితర అంశాల గురించి వెల్లడించాడు. ఈ మేరకు రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘దక్షిణాఫ్రికా పర్యటన మంచి గుణపాఠం నేర్పింది. ఒక్కొక్కరితో మాట్లాడాలి జట్టును పటిష్టం చేసుకుంటాం. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే... విరాట్ కెప్టెన్‌గా ఉన్నపుడు నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. తను ఎక్కడైతే నిష్క్రమించాడో అక్కడి నుంచి నేను మొదలుపెడతాను. ఒక ఆటగాడిగా తన నుంచి జట్టు ఏం ఆశిస్తుందో కోహ్లికి తెలుసు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆటగాళ్లు తమను తాము మలచుకోవాలి. నేను పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా... ‘‘శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడు. అయితే, నిబంధనల ప్రకారం ఇంకా ఐసోలేషన్ పూర్తి కాలేదు. కాబట్టి మొదటి వన్డేలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. ఇక కుల్చా(కుల్దీప్ యాదవ్- యజువేంద్ర చహల్) జంట మాకు మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం’’అని రోహిత్ శర్మ తెలిపాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం U19 WC Final- Yash Dhull: జట్టులో స్టార్స్ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే.. -
టీమిండియాకు ఓపెనర్ల కొరత.. జట్టులోకి టి20 స్పెషలిస్ట్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఓపెనర్ శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. దీంతో తొలి వన్డేకు టీమిండియాకు ఓపెనర్ల కొరత ఎదురైంది. ధావన్, రుతురాజ్‌లు కరోనాతో.. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్ తొలి వన్డేకు దూరమయ్యారు. దీంతో మయాంక్ అగర్వాల్‌లు ఉన్న పళంగా మయాంక్ అగర్వాల్‌కు పిలుపిచ్చారు. టీమిండియా గురువారం నుంచి ప్రాక్టీస్ ఆరంభించింది. అయితే నిబంధనల ప్రకారం మయాంక్ మూడురోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో మ్యాచ్ జరగనున్న ఆదివారం రోజున అందుబాటులోకి రానున్నాడు. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ ఒకవేళ మయాంక్ ఆడని పరిస్థితి వస్తే ఎలా అని బీసీసీఐ యోచన చేసింది. దీంతో బ్యాకప్ ఓపెనర్‌గా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది. ఈ ఎంపికకు ముందు ఇషాన్ కిషన్ టి20 సిరీస్‌కు మాత్రమే జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి వన్డే వరకు రోహిత్, మయాంక్‌లకు బ్యాకప్ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఉంటాడని తెలిపింది. రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే.. ఇషాన్‌ను టి20 జట్టులోకి తిరిగి పంపించనున్నారు. ఒకవేళ తొలి వన్డే సమయానికి మయాంక్ ఆడకపోతే.. ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇప్పటికే బయోబబూల్‌లో ఉంటున్నాడు. ఇక ఇషాన్ కిషన్ శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇక 5 టి20 మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేశాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
KL Rahul: త్వరలోనే పెళ్లి బాజాలు.. అందుకే మొదటి వన్డేకు దూరం!
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్‌తో మొదటి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణం తాజాగా వెల్లడైంది. రాహుల్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయట. అతడి సోదరి భావన వివాహం త్వరలోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. చెల్లి పెళ్లి పనుల్లో నిమగ్నమైన రాహుల్ అందుకే మొదటి వన్డేకు దూరమైనట్లు సమాచారం. కాగా స్వదేశంలో విండీస్‌తో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డేతో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ పేర్కొంది. అయితే, తాజాగా టీమిండియా శిబిరంలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ తదితరులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6న సిరీస్ ఆరంభమవుతుందా లేదా అన్న సందిగ్దం నెలకొంది. ముఖ్యంగా ధావన్, రుతురాజ్ వైరస్ బారిన పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో రాహుల్‌ను పిలిపించాలని భావించినా... వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు దూరమైన నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మయాంక్‌ను వన్డే జట్టులో చేర్చినట్లు బీసీసీఐ గురువారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. చెల్లి పెళ్లి కోసమే? ఇక రాహుల్ విషయానికొస్తే... మంగళూరులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి పేరు డాక్టర్ కేఎన్ లోకేశ్. ఆయన ప్రొఫెసర్. ఇక రాహుల్ తల్లి రాజేశ్వరి. ఆమె కూడా ప్రొఫెసరే. కేఎల్ రాహుల్‌కు చెల్లెలు భావన ఉంది. ఆమెకు పెళ్లి సెటిలైందని, ఆ పనులతోనే రాహుల్ బిజీగా ఉన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! -
2020లో చివరగా ఆస్ట్రేలియాతో.. టీమిండియా ఆటగాడికి బంపర్ ఆఫర్!
వెస్టిండీస్‌తో తొలి వన్డే ముందు ముగ్గురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జట్టులోని స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్‌తో సహా మరో 5 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధాణైంది. ఈ నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్‌ను విండీస్‌తో తలపడే భారత వన్డే జట్టులో చేర్చింది. మయాంక్ చివరగా వన్డేల్లో 2020లో ఆస్ట్రేలియాతో ఆడాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న జరగనుంది. కాగా మూడో మ్యాచ్ ఫిబ్రవరి 11న జరగనుంది. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. కాగా ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్ చదవండి: IND Vs WI: టీమిండియాలో కరోనా కలకలం.. ముగ్గురు స్టార్ క్రికెటర్లకు పాజిటివ్ -
Ind Vs Sa 3rd Test: పుజారా అలా.. మయాంక్ ఇలా.. కోహ్లి తీవ్ర అసహనం
Ind Vs Sa 3rd Test- Pujara- mayank- Virat Kohli: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో రాణించగా... మహ్మద్ షమీ, సిరాజ్స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బౌలర్ల ప్రదర్శన బాగానే ఉన్నా.. ఫీల్డర్లు మాత్రం కొన్ని తప్పిదాలు చేశారు. దీంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. పుజారా వల్ల ఐదు పెనాల్టీ పరుగులు... దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా, బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లి అందుకునే ప్రయత్నం చేసిన కీపర్ పంత్ క్యాచ్ వదిలేశారు. పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. ఇదిలా ఉంటే.. మయాంక్ అగర్వాల్ సైతం బంతి బౌండరీ చేరకుండా సులువుగా ఆపే పరిస్థితి ఉన్నా విఫలమయ్యాడు. బాల్‌ను అందుకున్నప్పటికీ బ్యాలన్స్ చేసుకోలేక రోప్‌ను తాకడంతో బ్యాటర్‌కు నాలుగు పరుగులు లభించాయి. దీంతో కెప్టెన్ కోహ్లి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మయాంక్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. 34వ ఓవర్లో పీటర్సన్‌కు బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘తను ఈజీగా బంతిని వెనక్కి నెట్టి ఉండవచ్చు. కానీ అలా జరుగలేదు. కెప్టెన్ ఇలా అసహనానికి గురికావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు’’ అని వ్యాఖ్యానించారు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్
కేప్‌టౌన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ 13 ఓవర్ ప్రారంభమైనప్పుడు.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హెల్మెట్ ధరించి డ్రెస్సింగ్ రూమ్‌లో షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలెపెట్టాడు. ఈ క్రమంలో యాదృచ్ఛికంగా తరువాత బంతికే మయాంక్ అగర్వాల్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. కగిసో రబాడ బౌలింగ్‌లో స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, పుజరా జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజు లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే మరో సారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను బారత్ సాధించగలిగింది. pic.twitter.com/mpeykpNAuU — Sunaina Gosh (@Sunainagosh7) January 11, 2022 చదవండి: IND vs SA 3rd Test: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1 -
ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్.. పది వికెట్ల కివీస్ బౌలర్ కూడా..
2021 డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నామినేట్ అయ్యాడు. అతనితో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా అవార్డు రేసులో నిలిచారు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన మయాంక్.. గత నెలలో ఆడిన రెండు టెస్ట్‌ల్లో (న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒకటి, ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లో తొలి టెస్ట్) 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. An Aussie fast bowler, an in-form India opener and a record-equaling spinner from New Zealand. Who will be your ICC Men's Player of the month? 👀 Details 👉 https://t.co/XsumbkHtzj And VOTE 🗳️ https://t.co/FBb5PMInKI pic.twitter.com/hhZeqJIopf — ICC (@ICC) January 8, 2022 ఇక ఇదే సిరీస్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్ల సాధించి.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసాడు. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లను తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. మాయంక్తో పాటు అవార్డు రేసులో నిలిచాడు. మరోవైపు ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో సత్తా చాటుతున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ వీరికి పోటీగా నిలిచాడు. స్టార్క్ డిసెంబర్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 19.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
KL Rahul: నేను గంటల కొద్దీ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే రకం కాదు.. 6-7 గంటలు నిలబడి..
Ind Vs Sa 1st Test- KL Rahul Comments On Century: ‘‘అవును.. నిజంగా ఇది చాలా ప్రత్యేకం. ప్రతి సెంచరీ మనకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. శతకం సాధించినపుడు అనేకానేక భావోద్వేగాలు చుట్టుముడతాయి. అయితే, ఇలా 6-7 గంటల పాటు క్రీజులో నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ఎంతో ప్రత్యేకం’’ అని టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి అజేయంగా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల నిమిత్తం టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 26న తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించగా... తొలిరోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో పలు రికార్డులు నమోదు చేశాడు. 248 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో తన ఇన్నింగ్స్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన రాహుల్.. పూర్తిస్థాయిలో సన్నద్ధమై ప్రణాళికలను పక్కాగా అమలు చేశామన్నాడు. ‘ప్రాక్టీసు సమయంలో ఏమేం అనుకున్నామో అవన్నీ ఆచరణలో పెట్టాము. మొదటి రోజు అందరూ బాగా ఆడారు. నిజానికి నేను గంటల కొద్దీ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే రకం కాదు. అయితే, ఎలా ఆడాలి, ఇన్నింగ్స్ ఎలా ఆరంభించాలి.. ఎలా దానిని కొనసాగించాలి అన్న అంశాల గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సెంచరీ మిస్ చేసుకోవద్దని భావించానన్న రాహుల్... ‘‘99 పరుగుల వద్ద ఉన్నపుడు... స్పిన్నర్ బౌలింగ్. ఆచితూచి ఆడాలనుకున్నా.. మంచి అవకాశం మిస్ చేసుకోకూడదు కదా. ఒక్క సింగిల్ తీస్తే సెంచరీ. షాట్ ఆడేందుకు టెంప్ట్ అయినా సరే ఆచితూచి వ్యవహరించాను. అసలు నేను అలా ఎలా.. అంత సైలెంట్‌గా ఉన్నానో అర్థం కాలేదు. ఏదేమైనా ఈ ఇన్నింగ్స్ పట్ల చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాను’’అని రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో! Car conversations with 'Centurion' @klrahul11 🚗 🗣️ From emotions on scoring ton 💯 to forming partnerships 🤜🤛 & batting mindset 👍. The #TeamIndia opener discusses it all after Day 1 of the 1st #SAvIND Test. 👏 - By @28anand Full interview 🎥 🔽https://t.co/d2DooNWtrG pic.twitter.com/Y0ONWu5vQ3 — BCCI (@BCCI) December 27, 2021 -
మయాంక్ అగర్వాల్ ఔట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అర్థసెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాడు. 37 పరుగుల వద్ద మయాంక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక 149 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 60 పరుగులు చేసిన మయాంక్.. ఎన్గిడి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! ఎన్గిడి బంతిని ఆఫ్‌స్టంప్ లైన్ మీదుగా విసరగా ఇన్సైడ్ ఎడ్జ్ అయి మయాంక్ ప్యాడ్లను తాకింది. దక్షిణాఫ్రికా అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో డీఆర్ఎస్కు వెళ్లి ప్రొటీస్ ఫలితం రాబట్టింది. అల్ట్రాఎడ్జ్‌లో బంతి టాప్ఎండ్ నుంచి లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు కనిపించడంతో మయాంక్ ఔటయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతి అంత హైట్‌లో వెళ్తున్నప్పుడు అంపైర్ కాల్ తీసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేశారు. ఇక మయాంక్ ఔటైన తర్వాతి బంతికే పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం.ఇక తొలిరోజు ఆటలో అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: KL Rahul: కేఎల్ రాహుల్ శతకం.. టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డులు బద్దలు Mayank Agarwal LBW Wicket, India vs South Africa 1st Test#Wicket#SAvIND #Mayank#Agarwal#Ngidi#Cricket pic.twitter.com/j6ayNJW1RT — Error in Thinking (@Errorinthinking) December 26, 2021 -
21 టెస్టుల్లో మూడోసారి మాత్రమే.. టీమిండియా ఓపెనర్ల కొత్త చరిత్ర
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర సృష్టించారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీలతో మెరిసిన ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఒక రికార్డు అందుకున్నారు. ప్రొటీస్ గడ్డపై ఇప్పటివరకు టీమిండియా 21 టెస్టులు ఆడగా.. రెండుసార్లు మాత్రమే ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు. చదవండి: SA Vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ రీ ఎంట్రీ! తాజాగా కేఎల్ రాహుల్- మయాంక్ జోడి ముచ్చటగా మూడోసారి సెంచరీ భాగస్వామ్య ఫీట్‌ను నమోదు చేశారు. 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో వసీం జాఫర్- దినేశ్ కార్తీక్ ఓపెనింగ్ జోడి(153 పరుగులు) తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత 2010-11లో సెహ్వాగ్- గంభీర్ ద్వయం(137 పరుగులు) రెండోసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్ -
'లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి'
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా నిలకడగా ఆరంభించింది. భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. తొలి సెషన్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండా లంచ్ విరామానికి వెళ్లిన టీమిండియా రెండో సెషన్లోనూ అదే జోరు కనబరుస్తుంది. ప్రస్తుతం 39 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ అర్థశతకం(56 పరుగులు బ్యాటింగ్), కేఎల్ రాహుల్ 43 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్ అయితే 36 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ నాలుగో బంతి మయాంక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ డికాక్ వైపు పడింది. అయితే డికాక్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నప్పటికి చేతిలో నుంచి జారిపోయింది. ఆ పక్కనే ఉన్న డీన్ ఎల్గర్‌కు అవకాశమున్నప్పటికి వదిలేయడంతో మయాంక్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్ అర్థ శతకం సాధించి ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''లడ్డూలాంటి క్యాచ్‌ను వదిలేశారు.. ఫలితం అనుభవించండి'' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. #SAvsIND Quinton de Kock drops a regulation catch… #SouthAfrica #India pic.twitter.com/WszyWmDfz1 — 𝐅𝐚𝐢𝐳𝐞𝐥 𝐏𝐚𝐭𝐞𝐥 (@FaizelPatel143) December 26, 2021 -
జీవితంలో మళ్లీ టెస్టులు ఆడతాననుకోలేదు: కేఎల్ రాహుల్
సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడేందుకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈసారి ఎలాగైనా ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా జట్టు తమ ప్రాక్టీస్‌లోనూ జోరు పెంచింది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలుకానుంది. ఇక గాయంతో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. అంతేకాదు రోహిత్ గైర్హాజరీలో కోహ్లి కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా విధులు నిర్వర్తించనున్నాడు. చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ ఈ సందర్భంగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు కలిసి బీసీసీఐ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా మయాంక్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి.. ''ఐపీఎల్‌తో పోలిస్తే టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా నిర్వర్తించడం అంటే బాధ్యతతో కూడుకున్నది.. మరి నీ గ్రే కలర్ హెయిర్‌తో ఎలా నిర్వర్తిస్తావు'' అంటూ ప్రశ్నించాడు. దీనిపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో మళ్లీ టెస్టు క్రికెట్ ఆడనేమోనని సరిగ్గా ఏడాది కిందట అనుకున్నా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాను. దీనికి తోడూ టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా అనిపిస్తున్నాయి. ఒక రకంగా సంతోషంగా ఉన్నప్పటికీ రోహిత్ భయ్యా గైర్హాజరీలో కోహ్లికి ఎలా ఉపయోగపడాలనేదానిపై కొంచెం ఆందోళన ఉంది. బ్యాట్స్‌మన్‌గా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.. అదే సమయంలో వైఎస్ కెప్టెన్‌గానూ నా బాధ్యతలను హుందాగా నిర్వహించేలా చూస్తా. ఐపీఎల్ కెప్టెన్సీ వేరు.. ఇక్కడి కెప్టెన్సీ వేరు. అది ప్రైవేట్ లీగ్.. దేశం తరపున ఆడేటప్పుడు జట్టుగా అందరం కలిసి ఆడుతాం. ఈ బాధ్యత ఎంతో గొప్పది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs SA: "ఈ సారి కూడా విజయం మాదే.. టీమిండియాకు ఓటమి తప్పదు" -
Ind Vs Sa: అక్కడ చలి ఎక్కువగా ఉందా భయ్యా.. నువ్వు సెంచరీలు కొట్టాలి!
Ind Vs Sa Test Series: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ టీమిండియా ఆటగాళ్లు సురక్షిత వాతావరణంలో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఐరిని కంట్రీ లాడ్జ్‌లో బయో బబుల్‌లో క్రికెటర్లను ఉంచింది. బయటి నుంచి అతిథులు ఎవరినీ ఇందులోకి అనుమతించడం లేదు. అంతేకాదు హోటల్ సిబ్బంది కూడా ఇప్పటికే క్వారంటైన్లో ఉంటున్నారు. ఆటగాళ్లు, సిబ్బందికి రెగ్యులర్‌గా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా కోవిడ్ విజృంభించిన తొలినాళ్లలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత పాకిస్తాన్ టీమ్ కూడా ఇక్కడే ఉంటూ విజయవంతంగా టూర్‌ను ముగించాయి. ఈ క్రమంలో టీమిండియాకు సైతం ప్రొటిస్ బోర్డు ఇక్కడే ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్‌కు సంబంధించిన విశేషాలు తెలిపేలా ఇప్పటికే రిషభ్ పంత్, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ పలు ఫొటోలను షేర్ చేశారు. తాజాగా మయాంక్ అగర్వాల్ సైతం.. బోనఫైర్(చలిమంట)తో ఉపశమనం పొందుతున్న చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో.. ‘‘అక్కడ చలి ఎక్కువగా ఉందా భయ్యా! ఏదేమైనా మీరంతా రిస్క్ చేసి దక్షిణాఫ్రికా వెళ్లారు. సేఫ్‌గా ఉండండి. అలాగే సిరీస్ కూడా గెలవాలి. నువ్వు సెంచరీలు సాధించాలి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో రెండో టెస్టులో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ప్రొటిస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. డిసెంబరు 26 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు.. వాళ్లకేం తెలుసు! View this post on Instagram A post shared by Mayank Agarwal (@mayankagarawal) -
ద్రవిడ్ సర్ సలహా.. 'నా కమ్‌బ్యాక్‌కు కారణం'
Mayank Agarwal Praise Dravid For Test Comeback.. ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 150.. రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన మయాంక్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మయాంక్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 11వ స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Ashes 2021: నాలుగు రోజుల్లోనే ముగించారు.. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం తాను ఫామ్‌లోకి రావడం వెనుక టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని.. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు కారణమయిందంటూ మయాంక్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ బెంగళూరులో తన కోచ్ ఆర్ఎక్స్ మురళీ వద్ద బ్యాటింగ్‌కు సంబంధించి మరిన్ని టెక్నిక్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికైన 18 మందిలో మయాంక్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. త్వరలోనే జట్టుతో పాటు సఫారీ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ కివీస్‌తో సిరీస్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. '' నీకు ఇప్పుడు పరుగులు చాలా అవసరం అని తెలుసు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న బాధ నేను అర్థం చేసుకుంటా. నీకున్న ఎమోషన్స్‌తో పాటు మానసిక శక్తిని.. ఆలోచనలను అదుపులో ఉంచుకో. ఓపికతో ఆడు.. కచ్చితంగా ఫలితం సాధిస్తావు. ఇక టెక్నిక్ విషయంలో చెప్పడానికి ఏం లేదు. గతంలో పరుగులు చేయడానికి ఏదైతే చేశావో దానికే మళ్లీ కట్టుబడి ఆడాలి.. పరుగులు వాటంతటవే వస్తాయి.'' అని ద్రవిడ్ చెప్పినట్లు మయాంక్ తెలిపాడు. చదవండి: Mayank Agarwal: ఆయన వీడియోలు చూసి నా బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నా.. -
R Ashwin: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్.. నెం2..
R Ashwin moves up to the No.2 spot among allrounders: ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకిగ్స్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 30స్ధానాలు ఎగబాకి 11వ స్ధానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో మయాంక్ వరుసగా 150, 62 పరుగులు సాధించాడు. అదేవిధంగా మరో ఓపెనర్ శుభమాన్ గిల్ 21 స్ధానాలు ఎగబాకి 45వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్(879), మార్నస్ లబుషేన్(878) మూడు, నాలుగో స్ధానంలో కొనసాగుతున్నారు. మార్నస్ లబుషేన్ రోహిత్ శర్మ(797 పాయింట్లు), విరాట్ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 908 పాయింట్లతో పాట్ కమ్మిన్స్ అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా, 883 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ స్సిన్నర్ అజాజ్ పటేల్ 23 స్ధానాలు ఎగబాకి 38 వ స్ధానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 382 పాయింట్లతో జాసన్ హోల్డర్ తొలి స్ధానంలో ఉండగా, అశ్విన్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు R Ashwin moves up to the No.2 spot in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for all-rounders. Full list: https://t.co/vrogyWdn0u pic.twitter.com/RwPzCXd57J — ICC (@ICC) December 8, 2021 -
IND vs NZ 2nd Test: అందుకే వాళ్లిద్దరూ ఫీల్డింగ్‌కి రాలేదు!
IND vs NZ 2nd Test: Why Mayank Agarwal Shubman Gill Did Not Take Field During Final Session: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడ్డారు. వీరి పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అప్డేట్ ఇచ్చింది. ‘‘రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు.. మయాంక్ అగర్వాల్ కుడి ముంజేతికి గాయమైంది. ముందు జాగ్రత్తగా అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. కాబట్టి అతడు ఫీల్డింగ్‌కు రావడం లేదు’’అని ట్వీట్ చేసింది. ఇక రెండో రోజు ఆటలో భాగంగా శనివారం శుభ్‌మన్ గిల్ మధ్య వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు కూడా ఆదివారం ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 276-7 వద్ద డిక్లేర్ చేసింది. ఇక మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా శుభ్‌మన్ గిల్... వరుసగా 44 పరుగులు, 47 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీకి చేరువైనప్పటికీ లాంఛనం పూర్తిచేయలేకపోయాడు. చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి.. Sara Tendulkar: నైట్ డేట్‌కు వెళ్లిన సారా టెండుల్కర్.. ఇంతకీ ఎవరా వ్యక్తి! గిల్ బ్యాటింగ్ చేస్తుంటే.. UPDATE - Mayank Agarwal got hit on his right forearm while batting in the second innings. He has been advised not to take the field as a precautionary measure. Shubman Gill got a cut on his right middle finger while fielding yesterday. He will not be taking the field today. — BCCI (@BCCI) December 5, 2021 -
ఆయన వీడియోలు చూసి నా బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నా..
Mayank Agarwal Explains How Sunil Gavaskars Advice Ahead Of Mumbai Test Helped: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర పుజారా, కెప్టెన్ కోహ్లి డకౌట్లుగా పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో జట్టు భారాన్ని తన భుజాన వేసుకుని మయాంక్ నడిపించాడు. తొలి రోజు ఆటలో 125 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాలని సూచించారని మయాంక్ తెలిపాడు. తొలి రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అగర్వాల్.. "గవాస్కర్ సార్ నాతో చెప్పారు. ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాట్ కాస్త కిందకి పెట్టి ఆడమని సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా నా బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకున్నాను. సునీల్ గవాస్కర్ వీడియోలు చూస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా .ఈ మ్యాచ్‌కు ముందు రాహుల్ ద్రావిడ్ సర్ వచ్చి నాతో మాట్లాడారు. నీకు దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీవు మైదానంలో ఉత్తమమైన ప్రదర్శన చేయాలి. క్రీజులో నీవు సెట్ అయినప్పుడు.. భారీ స్కోరు చేయడంపై దృష్టి సారించు అని ఆయన నాతో చెప్పారు. ఆయన చెప్పినట్లే నేను క్రీజులో కుదురు పడ్డాకే భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నించాను" అని తెలిపాడు. చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే -
Ind Vs Nz 2nd Test: 62 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ స్కోరు: 69
India Vs Nz 1st Test Day 2 2021 Highlights Updates.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 38 పరుగులు, ఛతేశ్వర్ పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భారత్‌కు 332 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకు ముందు 325 పరుగులకు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగించగా.. కివీస్ 62 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 5:00 PM: రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. మయాంక్ అగర్వాల్ 25, ఛతేశ్వర్ పుజారా 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325 పరుగులు ఆలౌట్ న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులు ఆలౌట్ 3 : 40 PM: టీమిండియాతో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. కేవలం 62 పరుగులుకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజు ఆటలో భాగంగా తొలుత భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ కేవలం 62 పరుగులకే కుప్పకూలడం విశేషం. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 3:15 PM: ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్ ►భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 3:07 PM: న్యూజిలాండ్ ప్రస్తుత స్కోరు: 51/6 (18.4). టీమిండియా కంటే ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది. 2:48 PM: భారత బౌలర్లు న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అద్భుతమైన బంతులు సంధిస్తూ వరసుగా ఒక్కొక్కరిని పెవిలియన్ చేరుస్తున్నారు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా... అక్షర్ పటేల్, అశ్విన్, జయంత్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో 38 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. టీమిండియా కంటే 287 పరుగుల వెనుకబడి ఉంది. ►ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్ 2: 30PM: భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు విలవిల ఆడుతున్నారు. 31 పరుగుల వద్ద కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన నికోలస్.. ఆశ్విన్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. 2: 00PM: న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: న్యూజిలాండ్ స్కోరు: 27/4 1: 30 PM: రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను దెబ్బకొడుతున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌లతో పాటు రాస్ టేలర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులుకు ఆలౌటైంది. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచరికార్డు సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు సాధించాడు. దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతక ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఇక భారత్ ఇన్నింగ్స్‌లో చేసిన మయాంక్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 12:20 Pm: టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. 150 పరుగులు చేసిన మయాంక్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే ఏడు వికెట్లు పడగొట్టాడు. 11:40 Am రెండో రోజు ఆట మెదలు పెట్టిన టీమిండియా లంచ్ విరామానికి 98 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 146, అక్షర్ పటేల్32 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10:35.. టీమిండియా ప్రస్తుత స్కోర్: 85 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 135, అక్షర్ పటేల్22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9:58AM: రెండో రోజు ఆట మెదలు పెట్టిన టీమిండియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 72 ఓవర్ వేసిన అజాజ్ పటేల్.. వరుస బంతుల్లో వృద్ధిమాన్ సాహా, ఆశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం భారత్ 79 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, అక్షర్ పటేల్12 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే ఆరు వికెట్లు సాధించాడు. 9:30 AM న్యూజిలాండ్ జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ రెండో రోజు ఆటమెదలు పెట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మెదటి రోజు ఆటముగిసే సమయానికి 70 ఓవర్లలో 4వికెట్లు నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్విల్లే, అజాజ్ పటేల్ చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! Incredible achievement as Ajaz Patel picks up all 10 wickets in the 1st innings of the 2nd Test. He becomes the third bowler in the history of Test cricket to achieve this feat.#INDvNZ @Paytm pic.twitter.com/5iOsMVEuWq — BCCI (@BCCI) December 4, 2021 -
సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్..
కెప్టెన్ కోహ్లి డకౌట్, పట్టుదలకు మారుపేరైన పుజారా డకౌట్, గత మ్యాచ్ హీరో శ్రేయస్ విఫలం... అయినా సరే న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తొలి రోజును భారత్ మెరుగైన స్థితిలో ముగించగలిగింది. అందుకు కారణం మయాంక్ అగర్వాల్! ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన అతను ఆకట్టుకునే షాట్లతో అజేయ శతకం సాధించాడు. మొత్తం స్కోరులో సగంకంటే ఎక్కువ పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లనూ తనే పడగొట్టి కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ తొలి రోజు ఆటపై తనదైన ముద్ర వేశాడు. ముంబై: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (246 బంతుల్లో 120 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేయగా, శుబ్‌మన్ గిల్ (71 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మయాంక్‌తో పాటు సాహా (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఎజాజ్ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. మోచేతి గాయం కారణంగా న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పుజారా, కోహ్లి డకౌట్... ఓపెనర్లు మయాంక్, గిల్ జట్టుకు శుభారంభం అందించారు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. అయితే తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత గిల్‌ను అవుట్ చేసి ఎజాజ్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. ఆపై అదే స్కోరు వద్ద భారత్ అనూహ్యంగా మరో రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఎజాజ్ ఒకే ఓవర్లో పుజారా (0), కోహ్లి (0)లను పెవిలియన్ పంపించి ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇలాంటి స్థితిలో మయాంక్‌కు శ్రేయస్ అయ్యర్ (18) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం అయ్యర్ వికెట్ కూడా ఎజాజ్ ఖాతా లోనే చేరింది. ఈ దశలో జాగ్రత్తగా ఆడిన మయాంక్, సాహా అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మయాంక్ జోరు... గత 13 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధసెంచరీ సాధించి జట్టులో స్థానం ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో మయాంక్ ఓపెనర్‌గా తన విలువేంటో చూపించాడు. సహచరులంతా విఫలమైన చోట అద్భుత బ్యాటింగ్‌తో అతను సత్తా చాటాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను చివరి వరకు అదే జోరును కొనసాగించాడు. ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడ్డ ఎజాజ్ బౌలింగ్‌లో మయాంక్ రెండు సిక్సర్లు సహా అలవోకగా పరుగులు రాబట్టడం విశేషం. మిచెల్ బౌలింగ్‌లో కొట్టిన కవర్‌డ్రైవ్ బౌండరీతో టెస్టుల్లో అతని నాలుగో సెంచరీ పూర్తయింది. తొలి సెషన్ వృథా... ఊహించినట్లుగానే తొలి రోజు ఆటను వర్షం ఇబ్బంది పెట్టింది. ఉదయం అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో నిర్ణీత సమయానికి ఆట ప్రారంభం కాలేదు. దాదాపు తొలి సెషన్ సమయం అంతా వృథా అయింది. మొత్తంగా మొదటి రోజు 20 ఓవర్లు తక్కువగా పడ్డాయి. అవుటా...నాటౌటా! కెప్టెన్ కోహ్లి నిష్క్రమణపై శుక్రవారం తీవ్ర చర్చ జరిగింది. ఎజాజ్ బౌలింగ్‌లో బంతి ప్యాడ్లకు తాకగా, బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అనిల్ చౌదరి అవుట్‌గా ప్రకటించాడు. దాంతో కోహ్లి ‘రివ్యూ’ కోరాడు. ఎన్నిసార్లు రీప్లేలు చూసినా థర్డ్ అంపైర్ వీరేంద్ర శర్మకు కూడా స్పష్టత రాలేదు. బంతి ముందుగా ప్యాడ్‌కు తగిలిందా లేక బ్యాట్‌కు తగిలి ఆపై ప్యాడ్ వైపు మళ్లిందా అనేది అర్థం కాలేదు. ఒక కోణంనుంచి చూస్తే బంతి బ్యాట్, ప్యాడ్‌కు ఒకేసారి తగిలినట్లుగా కనిపించింది. చివరకు ‘కన్‌క్లూజివ్ ఎవిడెన్స్’ లేదంటూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే అతను మద్దతు పలికాడు. దాంతో మరో అంపైర్ నితిన్ మీనన్ ముందు తన అసంతృప్తిని ప్రదర్శించి మైదానం వీడిన కోహ్లి వెళుతూ వెళుతూ అసహనంతో బౌండరీ కుషన్స్‌ను బ్యాట్‌తో కొట్టాడు. థర్డ్ అంపైర్ కూడా ఆ సమయంలో కొంత ఆందోళనకు లోనయ్యాడేమో... ‘బాల్ ట్రాకింగ్’ కూడా చూడకుండానే తన నిర్ణయాన్ని వెలువరించాడు. చివరకు అనిల్ చౌదరినే దానిని గుర్తు చేయాల్సి వచ్చింది. పాపం రహానే! కాన్పూర్ టెస్టు నవంబర్ 29న ముగిసింది. కానీ ఆ టెస్టు ఆఖరి రోజు రహానేకు కూడా స్వల్ప గాయమైందని, రెండో టెస్టు ప్రారంభానికి కొద్ది సేపు ముందు గానీ బీసీసీఐ ప్రకటించలేదు! ఆ మ్యాచ్‌లో చివరి రోజు 90 ఓవర్లూ ఫీల్డింగ్ చేసి, గురువారం నెట్‌ప్రాక్టీస్ చేసి, శుక్రవారం ఉదయం బ్రహ్మాండంగా ఫీల్డింగ్ సాధన చేసిన రహానేకు ‘కాస్త’ ఎడమ తొడ కండరాలు పట్టేశాయంటూ మ్యాచ్ నుంచి తప్పించింది. సరిగ్గా చెప్పాలంటే ఫామ్‌లో లేని రహానేను కోహ్లి కోసం పక్కన పెట్టేందుకు ‘వేటు’ అనకుండా మర్యాదపూర్వకంగా ‘గాయం’ సాకును వాడుకున్నట్లు అనిపించింది. 79 టెస్టుల కెరీర్లో సొంత మైదానం ముంబైలో ఒక్క టెస్టూ ఆడని రహానేకు ఇప్పుడూ అవకాశం చేజారింది. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరం కావడంతో వీరిద్దరి స్థానాల్లో సిరాజ్, జయంత్ యాదవ్‌లకు అవకాశం దక్కింది. నాలుగేళ్ల తర్వాత జయంత్‌కు మళ్లీ టెస్టు ఆడే చాన్స్ లభించింది. ముంబైలో ముంబైకర్ జోరు! 33 ఏళ్ల ఎజాజ్ పటేల్ ముంబైలో పుట్టాడు. ఎనిమిదేళ్ల వయసులో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. ఇప్పుడు అదే ముంబైలో భారత్‌పై టెస్టు మ్యాచ్ ఆడిన అతను ‘సొంత’ గడ్డపై సత్తా చాటాడు. ముంబైతో పలు జ్ఞాపకాలు ఉన్నాయంటూ పదే పదే చెబుతూ వచ్చిన పటేల్, ఇప్పుడు తన ఆటతోనూ దానిని చిరస్మరణీయం చేసుకున్నాడు. ‘అంతా కలలా ఉంది. ఇక్కడ ఆడటమే కాదు తొలి రోజు నాలుగు వికెట్లు తీయడం ఎంతో ప్రత్యేకం. నా సొంత ఊరు, వాంఖెడే మైదానంలో ఈ ప్రదర్శన రావడం నా అదృష్టం’ అంటూ ఎజాజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 120; గిల్ (సి) టేలర్ (బి) ఎజాజ్ 44; పుజారా (బి) ఎజాజ్ 0; కోహ్లి (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; శ్రేయస్ (సి) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 18; సాహా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (70 ఓవర్లలో 4 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–80, 2–80, 3–80, 4–160. బౌలింగ్: సౌతీ 15–5–29–0, జేమీసన్ 9–2–30–0, ఎజాజ్ పటేల్ 29–10–73–4, సోమర్‌విలే 8–0–46–0, రచిన్ రవీంద్ర 4–0–20–0, మిచెల్ 5–3–9–0. -
11 ఏళ్లలో ఒకే ఒక్కడు.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్
Mayank Agarwal First Indian Test Century Against New Zealand in Over a Decade: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. తద్వారా మయాంక్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్‌పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్ వేదికగా కివీస్‌పై శిఖర్ ధావన్ శతకం నమోదు చేశాడు. కాగా మయాంక్ ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీ. ముఖ్యంగా నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం గమానర్హం. చదవండి: T20 World Cup 2021: రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో బాబర్‌కి నేనే చెప్పా... -
మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఏమి తప్పుకాదు..
Mayank Agarwal fielding on his knees against NZ is certainly not unfair: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. దీనిపై మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ సలహాదారు జానీ సింగర్ స్పందించారు. క్రికెట్లోని ఏ చట్టం కూడా మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని తెలపలేదు అని సింగర్ చెప్పారు. ఆధునిక క్రికెట్లో మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం సర్వసాధారణమైందని అతను తెలిపారు. "ఫీల్డర్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని క్రీడా చట్టాలలో ఏమీ లేదు. నిజానికి, ఇది ప్రస్తుత క్రికెట్లో చాలా సాధారణం. మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఖచ్చితంగా తప్పు కాదు. కానీ బౌలర్ బంతి వేసిన తర్వాత ఫీల్డర్ తన పొజిషన్‌ను మార్చుకుని మోకాళ్లపై ఫీల్డింగ్ చేస్తే అది కచ్చితంగా చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అప్పడు నిర్ణయం ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో ముడి పడి ఉంటుంది అని సింగర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: ఒక్క వికెట్.. అప్పుడు గెలుపు.. ఇప్పుడేమో ఇలా -
IPL 2022 Auction: మరీ 16 కోట్లా.. పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ఈసారి
IPL 2022 Auction: Punjab Kings Unlikely To Retain Any Player Brand New Squad Why Here: పంజాబ్ కింగ్స్.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయింది. పేరు మార్చినా.. కెప్టెన్లను మార్చినా తమ రాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఆఖరిదాకా పోరాడటం.. అసలు సమయం వచ్చేసరికి ప్రత్యర్థి జట్టు ముందు తలవంచడం పంజాబ్ జట్టుకు అలవాటేనని పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ఇక ఐపీఎల్-2021లోనూ పంజాబ్ కింగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్‌లలో ఆరింటిలో గెలిచినప్పటికీ నాకౌట్ దశకు చేరకుండానే లీగ్ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు సాధించి బ్యాటర్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ.. జట్టును విజేతగా నిలపాలన్న అతడి కోరిక మాత్రం నెరవేరలేదు. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో రాహుల్ పంజాబ్‌ను వీడటం ఖాయమని.. కొత్త ఫ్రాంఛైజీ లక్నోకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాహుల్ పంజాబ్‌ను వీడితే ఆ జట్టుకు నిజంగా పెద్ద షాకే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఆటగాడిని కూడా రీటైన్ చేసుకోకూడదని ఫ్రాంఛైజీ నిర్ణయించుకుందట. పూర్తిగా కొత్త జట్టుతో ఐపీఎల్ 2022 బరిలో దిగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. తొలుత.. కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్‌ను రీటైన్ చేసుకోవాలని భావించినా.. రాహుల్ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఏ ఒక్క ఆటగాడిని కూడా రీటైన్ చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. PC: IPL అసలు సమస్య ఏమిటి? కేఎల్ రాహుల్ జట్టును వీడనుండటంతో పంజాబ్ ఒకవేళ మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను రీటైన్ చేసుకోవాలని భావించినా.. బీసీసీఐ నిబంధనల కోసం మొదటి రిటెన్షన్ కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. నిజానికి మయాంక్‌ను కేవలం కోటి రూపాయలకు మాత్రమే ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అలాంటపుడు అతడి కోసం ఏకంగా భారీ మొత్తం ఖర్చు చేయడం వృథా ప్రయాసే అవుతుందనే భావనలో యాజమాన్యం ఉండటం సహజం. ఇక ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ వ్యక్తిగత ప్రదర్శన బాగానే (12 ఇన్నింగ్స్‌లో 441 పరుగులు) బాగానే ఉన్నప్పటికీ మరీ ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేగాక రవి, అర్ష్‌దీప్‌లను రీటైన్ చేసుకోవాలంటే పర్సు నుంచి పెద్ద మొత్తమే తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తాన్నే మార్చేసేందుకు పంజాబ్ ఫ్రాంఛైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేఎల్ రాహుల్ కోసం లక్నో ఎంతమొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: T20 WC: పసికూన నమీబియా.. టీమిండియాతో సమానంగా.. కనీసం ఈసారైనా.. -
సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్
Replacement Of Surya Kumar And Ishan Kishan.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా డిపెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగిస్తుంది. సెకండ్ ఫేజ్ మొదలయ్యాకా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌లు శుభారంభం అందించినప్పటికి తర్వాతి బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్ల దాటికి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. వీరికి తోడు హార్దిక్ పాండ్యా కూడా సరిగా మ్యాచ్‌లు ఆడడం లేదు. చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్.. జడేజాపై ప్రశంసల వర్షం అయితే ఈ ముగ్గురు టి20 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా జట్టులో చోటు సంపాదించారు. వీరి ఫామ్ ఇలాగే ఉంటే మాత్రం టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడిదే సెలక్షన్ ప్యానల్‌కు తలనొప్పిగా మారింది. చేతన్ శర్మ సారధ్యంలోని టీమిండియా సెలక్షన్ కమిటీకి సెప్టెంబర్ 10 వరకు జట్టును మార్చే అవకాశం ఉంది. దీనికి తోడు టీమిండియాకు ఎంపికైన జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్లో ఆడుతున్నారు కాబట్టి వారు చేసే ప్రదర్శనను కీలకంగా భావిస్తున్నారు. ఒకవేళ జట్టును మార్చే అవకాశం ఉంటే మాత్రం శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, మాయంక్ అగర్వాల్ పేర్లను పరిశీలిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురిలో అయ్యర్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండగా.. మిగతా ఇద్దరు జట్టుకు ఎంపిక కాలేదు. శ్రేయాస్ అయ్యర్: గతేడాది ఐపీఎల్ 2020 సీజన్లో శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా జట్టులో చోటు సంపాదించిన అయ్యర్ గాయం కారణంగా అర్థంతరంగా ఐపీఎల్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. అతని స్థానంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపికచేయడం.. అతను తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం.. అతని సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపడం జరిగిపోయాయి. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడి.. మళ్లీ ప్రారంభమైంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన అయ్యర్ కెప్టెన్‌గా గాక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రెండో అంచె పోటీల్లో తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన అయ్యర్ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. అతను తుది జట్టులో ఉంటే మిడిలార్డర్ సమతూకంగా ఉండడంతో పాటు స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొగలడనే పేరుంది. కాగా శ్రేయాస్ అయ్యర్ టీమిండియా తరపున 29 టి20ల్లో 550 పరుగులు సాధించాడు. చదవండి: Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా మయాంక్ అగర్వాల్: Courtesy: IPL Twitter లేటు వయసులో మంచి ఫామ్‌తో అదరగొడుతున్నాడు. జట్టుగా పంజాబ్ కింగ్స్ విఫలమైనప్పటికీ.. ఆటగాడిగా తాను సూపర్ సక్సెస్ అయ్యాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నిర్మించిన మయాంక్ మిడిల్ ఆర్డర్లో కూడా రాణించే సత్తా ఉంది. 2020 ఐపీఎల్లో 11 మ్యాచ్‌ల్లో 424 పరుగులు చేసిన మయాంక్ ఈ ఏడాది ఐపీఎల్(2021) సీజన్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఫామ్ దృశ్యా మయాంక్‌కు అవకాశమిస్తే రాణించే అవకాశం ఉంది. ఇక మయాంక్ టీమిండియా తరపున 14 టెస్టులు.. 5 వన్డేలు ఆడాడు. సంజూ శాంసన్: Courtesy: IPL Twitter సహజంగా మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్. క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్నవాడు. ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో అదరగొడుతున్న అతను అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం చతికిలపడ్డాడు. అయితే ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం టీమిండియా జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్లో న్యాయం చేయగలడనే నమ్మకం ఉంది. ఇషాన్ కిషన్ స్థానంలో సంజూకు అవకాశమిస్తే వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఇక సంజూ శాంసన్ టీమిండియా తరపున 1 వన్డే, 10 టి20లు ఆడాడు. చదవండి: T20 World Cup: కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.. నేనైతే -
PBKS vs RR: పరాజయానికి పంజాబ్ పిలుపు
దుబాయ్: పంజాబ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాలి. రెండు మంచి షాట్లు చాలు! కానీ ఇలాంటి స్థితి నుంచి గతంలోనూ ఓడిన ఆ జట్టు దానిని పునరావృతం చేసింది. 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్ జట్టు... కార్తీక్ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది. చివరకు 2 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అనూహ్య విజయాన్నందుకుంది. ముందుగా రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. మయాంక్ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు. లోమ్రోర్ మెరుపులు... రాజస్తాన్‌కు లభించిన ఆరంభం, ఇన్నింగ్స్ మధ్యలో లోమ్రోర్ మెరుపులు చూస్తే స్కోరు కనీసం 210–220 వరకు చేరుతుందని అనిపించింది. కానీ పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థిని అంతకంటే చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి, లూయిస్ దూకుడుతో రాయల్స్ స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులకు చేరింది. అయితే అర్ష్‌దీప్ తన తొలి ఓవర్లోనే లూయిస్‌ను అవుట్ చేసి జోడీని విడదీశాడు. ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో యశస్వి 2 సిక్సర్లు, ఫోర్‌తో ధాటిని ప్రదర్శించగా... అర్ష్‌దీప్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టిన లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. యశస్వి అవుటైనా... మరో ఎండ్‌లో లోమ్రోర్ చెలరేగిపోయాడు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, హుడా ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. మరో ఫోర్ సహా ఈ ఓవర్లో హుడా మొత్తం 24 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ ఓవర్ తర్వాత రాజస్తాన్ వేగంగా పతనమైంది. ఆఖరి 4 ఓవర్లలో 21 పరుగులు చేసిన ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు జోరుగా... ఛేదనలో రాహుల్, మయాంక్ వేగంగా పరుగులు రాబట్టారు. రాహుల్‌కు ఏకంగా మూడుసార్లు ‘లైఫ్’ లభించింది. సకారియా ఓవర్లో రాహుల్ వరుసగా 4, 6, 6 బాది జోరు ను ప్రదర్శించగా, త్యాగి ఓవర్లో మయాంక్ ఇలాగే వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. పవర్ ప్లేలో 49 పరుగులు చేసిన కింగ్స్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 106కు చేరింది. ముఖ్యంగా మోరిస్ వేసిన పదో ఓవర్లో పంజాబ్ 25 పరుగులు సాధించింది. ఎట్టకేలకు ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి రాయల్స్ ఊపిరి పీల్చు కుంది. అయితే తర్వాత వచ్చిన మార్క్రమ్ (20 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), పూరన్ (22 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి పంజాబ్‌ను విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 37 బంతుల్లోనే 57 పరుగులు జత చేసినా... చివరకు పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) మయాంక్ (బి) అర్ష్‌దీప్ 36; యశస్వి (సి) మయాంక్ (బి) హర్‌ప్రీత్ 49; సామ్సన్ (సి) రాహుల్ (బి) పొరేల్ 4; లివింగ్‌స్టోన్ (సి) అలెన్ (బి) అర్ష్‌దీప్ 25; లోమ్రోర్ (సి) మార్క్రమ్ (బి) అర్ష్‌దీప్ 43; పరాగ్ (సి) మార్క్రమ్ (బి) షమీ 4; తెవాటియా (బి) షమీ 2; మోరిస్ (సి) మార్క్రమ్ (బి) షమీ 5; సకారియా (సి అండ్ బి) అర్ష్‌దీప్ 7; త్యాగి (బి) అర్ష్‌దీప్ 1; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 185. వికెట్ల పతనం: 1–54, 2–68, 3–116, 4–136, 5–166, 6–169, 7–175, 8–178, 9–185, 10–185. బౌలింగ్: షమీ 4–0– 21–3, పొరేల్ 4–0–39–1, హుడా 2–0– 37–0, అర్ష్‌దీప్ 4–0–32–5, రషీద్ 3–0– 35–0, హర్‌ప్రీత్ 3–0–17–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) త్యాగి (బి) సకారియా 49; మయాంక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) తెవాటియా 67; మార్క్రమ్ (నాటౌట్) 26; పూరన్ (సి) సామ్సన్ (బి) త్యాగి 32; హుడా (సి) సామ్సన్ (బి) త్యాగి 0; అలెన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–120, 2–126, 3–183, 4–183. బౌలింగ్: ముస్తఫిజుర్ 4–0–30–0, సకారియా 3–0– 31–1, త్యాగి 4–0–29–2, మోరిస్ 4–0– 47–0, తెవాటియా 3–0–23–1, లోమ్రోర్ 1–0–7–0, పరాగ్ 1–0–16–0. -
KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. గేల్ తర్వాతి స్థానంలో
KL Rahul Reach 3000 Runs IPL.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగులు అందుకున్న రెండో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్లో 3వేల పరుగులు సాధించడానికి 80 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా ఇన్నింగ్స్ 4వ ఓవర్ మూడో బంతికి సకారియా బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ద్వారా రాహుల్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఇక మయాంక్ అగర్వాల్ కూడా 3వేల పరుగుల జాబితాలో చేరిపోయాడు. ఇదే మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతిని సిక్స్ బాదిన మయాంక్ ఐపీఎల్లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. కాగా క్రిస్ గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లోనే 3వేల పరుగుల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ 94 ఇన్నింగ్స్‌ల్లో .. సురేశ్ రైనా 103 ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. చదవండి: IPL 2021: ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో పిన్న వయస్కుడిగా -
భారత్‌కు మరో ఎదురుదెబ్బ: తొలి టెస్టు నుంచి అతడు అవుట్!
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు గాయమైంది. దాంతో ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పేసర్ సిరాజ్ వేసిన షార్ట్ బాల్... బ్యాటింగ్ చేస్తోన్న మయాంక్ హెల్మెట్‌ను బలంగా తాకింది. తొలి టెస్టుకు మయాంక్ దూరమవ్వడంతో ఆగస్టు 4 నుంచి ఆరంభమయ్య మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓపెనర్ గిల్, సుందర్, పేసర్ అవేశ్ ఖాన్ గాయాలతో సిరీస్‌కు దూరమయ్యారు. NEWS 🚨- Mayank Agarwal ruled out of first Test due to concussion. The 30-year-old is stable and will remain under close medical observation. More details here - https://t.co/6B5ESUusRO #ENGvIND pic.twitter.com/UgOeHt2VQQ — BCCI (@BCCI) August 2, 2021 -
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్‌తో దుమ్మురేపాడు. కౌంటీ ఎలెవెన్ జట్టుతో జరగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(75) చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ(51 రిటైర్డ్ ఔట్) ఫిఫ్టి కొట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న హనుమ విహారి(43 నాటౌట్) సైతం రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా 284 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందుంచింది. అనంతరం ఛేదన ప్రారంభించిన కౌంటీ ఎలెవెన్ జట్టు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పుజారాలు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం మయాంక్(47) ఔటవ్వగా.. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా పెవిలియన్‌కు చేరాడు. 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో విహారి(12), జడేజా(11) ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతానికి టీమిండియా 205 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. That will be Lunch on Day 3 of the three-day warm-up game against County XI.#TeamIndia 311 & 113/2, lead by 204 runs. pic.twitter.com/GItTWrcN7X — BCCI (@BCCI) July 22, 2021 అంతకు ముందు రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 220 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగా, ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, శార్ధూల్, జడేజా, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(101), జడేజా(75) రాణించారు. -
సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్
సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ టపార్డర్ బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమైన వేళ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(101 రిటైర్డ్) అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. అతనికి మరో ఎండ్‌లో జడేజా(57) హాఫ్ సెంచరీతో సపోర్ట్ ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. క్రీజ్‌లో జడేజాకు తోడుగా శార్దూల్ ఠాకూర్(9) ఉన్నాడు. 77 ఓవర్ల తర్వాత టీమిండియా 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల సాధించింది. CENTURY @klrahul11 💯A brilliant innings 👏🇮🇳Live Stream ➡️ https://t.co/ZsCqJdCEX1#CountyXIvIndia @BCCI pic.twitter.com/4Ffzd5wnEP— Durham Cricket (@DurhamCricket) July 20, 2021 టీమిండియా నాలుగో వికెట్ డౌన్.. విహారి(24) ఔట్ టీమిండియా ప్లేయర్లు ఒకొక్కరుగా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుతున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(24) కూడా కనీసం హాఫ్‌సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు. స్పిన్నర్ ప్యాటర్సన్ వైట్ బౌలింగ్‌లో.. క్రెయిగ్ మైల్స్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(47), రవీంద్ర జడేజా(9) ఉన్నారు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్ల నష్టానికి141 పరుగులు చేసింది. Patterson-White gets Vihari! India are 107/4 Live stream ➡️ https://t.co/FfTRHD7fDr#CountyXIvIndia @TrentBridge pic.twitter.com/dNC7ERr83J — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 Carson x Rew, Pujara gone. 🏴🇮🇳@SussexCCC 🤝 @SomersetCCC Live Stream ➡️ https://t.co/JeTNRWzv2g pic.twitter.com/aB1jPQLNTT — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పుజారా(21) ఔట్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(9), మయాంక్ అగర్వాల్(28) సహా వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(21) కూడా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ అని సరదాగా తీసుకున్నారో ఏమో కానీ, నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. లంచ్ విరామ సమాయనికి 30 ఓవర్లు ఆడిన టీమిండియా బ్యాట్స్మెన్లు 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేశారు. క్రీజ్‌లో విహారి(16), కేఎల్ రాహుల్(5) ఉన్నారు. కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ బౌలర్లలో లిండన్ జేమ్స్ 2 వికెట్లు పడగొట్టగా, పుజారా వికెట్ జాక్ కార్సన్‌కు దక్కింది. కార్సన్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి ముందుకు రావడంతో వికెట్‌కీపర్ జేమ్స్ రివ్ స్టంపింగ్ చేశాడు. చెస్టర్ లీ స్ట్రీట్: కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ జట్టుతో మంగళవారం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(33 బంతుల్లో 9; 2 ఫోర్లు) దారుణంగా విఫలం కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(35 బంతుల్లో 28; 6 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించాడు. Brilliant from @TrentBridge's Lyndon James who picks up his second. Agarwal bowled for 28 👏 Live Stream ➡️ https://t.co/ZoY9QkxDQk#CountyXIvIndia @CountyChamp pic.twitter.com/PWOlck8Y5o — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 ప్రత్యర్ధి బౌలర్ లిండన్ జేమ్స్‌కు ఈ రెండు వికెట్లు దక్కాయి. 14 ఓవర్ల తర్వాత భారత జట్టు స్కోర్ 46/1గా ఉంది. క్రీజ్‌లో పుజారా(8), విహారి(1) ఉన్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం టీమిండియా ఈ మ్యాచ్‌ను పట్టుపట్టి మరీ షెడ్యూల్ చేసుకుంది. భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
IPL 2021, PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ ‘సిక్సర్’
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (47 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో అర్ధ శతకాన్ని సాధించాడు. పృథ్వీ షా (22 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఛేదనలో ఢిల్లీ ఎక్కడా తడబడలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా జట్టుకు మరోసారి శుభారంభం చేశారు. వీరిద్దరి దూకుడుతో పవర్‌ప్లేలో ఢిల్లీ 63/0గా నిలిచింది. హర్‌ప్రీత్ బౌలింగ్‌లో పృథ్వీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం స్మిత్ (24)తో ధావన్ జట్టును లక్ష్యం వైపునకు నడిపించాడు. చివర్లో స్మిత్ అవుటైనా... 18వ ఓవర్లో 6, 6, 4 కొట్టిన హెట్‌మైర్ (4 బంతుల్లో 16 నాటౌట్) ఢిల్లీకి విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) స్మిత్ (బి) రబడ 12; మయాంక్ (నాటౌట్) 99; గేల్ (బి) రబడ 13; మలాన్ (బి) అక్షర్ 26; హుడా (రనౌట్) 1; షారుఖ్ (సి) హెట్ మైర్ (బి) అవేశ్ ఖాన్ 4; జోర్డాన్ (సి) లలిత్ (బి) రబడ 2; హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–17, 2–35, 3–87, 4–88, 5–129, 6–143. బౌలింగ్: ఇషాంత్ శర్మ 4–1–37–0, స్టొయినిస్ 1–0–6–0, రబడ 4–0–36–3, అవేశ్ ఖాన్ 4–0–39–1, లలిత్ 3–0–25–0, అక్షర్ పటేల్ 4–0–21–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) హర్‌ప్రీత్ 39; ధావన్ (నాటౌట్) 69; స్మిత్ (సి) మలాన్ (బి) మెరిడిత్ 25; పంత్ (సి) మయాంక్ (బి) జోర్డాన్ 14; హెట్‌మైర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–63, 2–111, 3–147. బౌలింగ్: మెరిడిత్ 3.4–0–36–1, షమీ 3–0–37–0, బిష్ణోయ్ 4–0–42–0, జోర్డాన్ 2–0–21–1, హర్‌ప్రీత్ 3–0–19–1, దీపక్ హుడా 2–0–11–0. -
అందుకే మయాంక్‌ను పక్కనపెట్టాం: కేఎల్ రాహుల్
అహ్మదాబాద్: ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాన్ని కేఎల్ రాహుల్ రివీల్ చేశాడు. కాగా టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టాస్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ జట్టులో మార్పుల గురించి ప్రస్తావించాడు. 'ఈ మ్యాచ్‌కు మయాంక్‌ను పక్కనబెట్టడానికి ఒక కారణం ఉంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనే మయాంక్ స్వల్ప గాయంతో బరిలోకి దిగాడు. అయితే అతని గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండడంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు తీసుకోలేదు. మయాంక్‌తో పాటు జట్టులో మరో రెండు మార్పులు చేశాం. హెన్రిక్స్, అర్షదీప్ స్థానంలో మెరిడిత్, ప్రబ్సిమ్రాన్లకు అవకాశం కల్పించాం. మయాంక్ స్థానంలో ప్రబ్సిమ్రాన్ ఓపెనర్‌గా రానున్నాడు. ఇక గేల్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఈ మ్యాచ్‌కు మాత్రం గేల్ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడు. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడు కనబరుస్తుంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. గేల్ 45, రాహుల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 196
ముంబై: ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఐపీఎల్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు దంచేసేందుకు పోటీపడటంతో 5వ ఓవర్లోనే పంజాబ్ స్కోరు 50 పరుగులకు చేరింది. 10.1 ఓవర్లోనే వందను దాటేసింది. మయాంక్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిగతా వారిలో క్రిస్ గేల్ (11) విఫలమైనా... దీపక్ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్ 2 సిక్సర్లు), షారుఖ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్, మెరివాలా, రబడా, అవేశ్ ఖాన్– తలా ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కడపటి వార్తలందేసరికి 13 ఓవర్లలో రెండు వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 78 పరుగులతో, పంత్ 4 పరుగులతో ఉన్నారు. -
అదరగొట్టిన చహర్: 4–1–13–4
టి20 మ్యాచ్‌ల్లో బౌలర్లు అదరగొట్టే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో మాత్రం బౌలర్ల హవా నడుస్తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ప్రధాన పేసర్ దీపక్ చహర్ తన వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్‌ను షార్ట్‌పిచ్ బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్‌స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దాంతో సీజన్లో తొలి హ్యాట్రిక్‌ను తీసే చాన్స్‌ను చహర్ మిస్ చేసుకున్నాడు. హాక్ఐలో బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్‌స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్‌లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది. ఇక్కడ చదవండి: సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్ ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు -
IPL 2021 CSK vs PBKS: చెన్నై చమక్..
బౌలింగ్‌లో దీపక్ చహర్ మ్యాజిక్ స్పెల్... ఫీల్డింగ్‌లో జడేజా విన్యాసాలు... వెరసి రెండు కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పైచేయి సాధించింది. ఎలాంటి ఉత్కంఠభరిత క్షణాలు లేకుండా ఏకపక్షంగా ముగిసిన ఈ పోరులో నెగ్గి ఐపీఎల్ తాజా సీజన్లో ధోని జట్టు బోణీ కొట్టింది. ముంబై: వారం రోజులుగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో... ఊహించని ట్విస్ట్‌లతో అలరించిన ఐపీఎల్ తాజా సీజన్‌కు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య మ్యాచ్ రూపంలో స్పీడ్ బ్రేకర్ తారసపడింది. మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని సీఎస్కే 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై విజేతగా నిలిచి గెలుపు ఖాతాను తెరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (4/13) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్యామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మొయిన్ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్)... డు ప్లెసిస్ (33 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. నింపాదిగా... స్వల్ప ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను సీఎస్కే త్వరగానే కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ... డు ప్లెసిస్‌తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. గతి తప్పిన బంతులను బౌండరీలకు బాది పవర్‌ప్లేలో 32 పరుగులు సాధించారు. డు ప్లెసిస్ సింగిల్స్ తీస్తూ అలీకే స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. దాంతో కాస్త దూకుడు కనబర్చిన అలీ... అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్, మెరిడిత్ బౌలింగ్‌లలో మూడు ఫోర్లు బాదాడు. దాంతో సీఎస్కే ఛేజింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అలీ... అదే ఓవర్లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి షారుఖ్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో 66 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రైనా (8), రాయుడు (0) వరుస బం తుల్లో అవుటైనా... క్రీజులోకి వచ్చిన స్యామ్ కరన్ (5 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. షారుఖ్ ఖాన్ మినహా... తన ఐపీఎల్ కెరీర్లో రెండో మ్యాచ్ ఆడిన షారుఖ్ ఖాన్ మినహా పంజాబ్ కింగ్స్‌లో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), క్రిస్ గేల్ (10), దీపక్ హుడా (10)లతో పాటు ఓపెనర్ మయాంక్ (0), నికోలస్ పూరన్ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 48/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న కొత్త కుర్రాడు షారుఖ్ ఖాన్... జే రిచర్డ్సన్ (15; 2 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్ అశ్విన్ (6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అడపాదడపా బౌండరీలు కొట్టిన షారుఖ్ ఖాన్ పంజాబ్ స్కోరు 100 దాటేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన అతడు చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (రనౌట్) 5; మయాంక్ అగర్వాల్ (బి) దీపక్ చహర్ 0; గేల్ (సి) జడేజా (బి) దీపక్ చహర్ 10; దీపక్ హుడా (సి) డు ప్లెసిస్ (బి) చహర్ 10; పూరన్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) చహర్ 0; షారుఖ్ ఖాన్ (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 47; జే రిచర్డ్సన్ (బి) మొయిన్ అలీ 15; మురుగన్ అశ్విన్ (సి) డు ప్లెసిస్ (బి) బ్రావో 6; షమీ (నాటౌట్) 9; మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–19, 4–19, 5–26, 6–57, 7–87, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–13–4, స్యామ్ కరన్ 3–0–12–1, శార్దుల్ ఠాకూర్ 4–0–35–0, జడేజా 4–0–19–0, మొయిన్ అలీ 3–0–17–1, బ్రావో 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) దీపక్ హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 5; డు ప్లెసిస్ (నాటౌట్) 36; మొయిన్ అలీ (సి) షారుఖ్ ఖాన్ (బి) మురుగన్ అశ్విన్ 46; సురేశ్ రైనా (సి) రాహుల్ (బి) షమీ 8; అంబటి రాయుడు (సి) పూరన్ (బి) షమీ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–24; 2–90, 3–99, 4–99. బౌలింగ్: షమీ 4–0–21–2, జే రిచర్డ్సన్ 3–0–21–0, అర్‡్షదీప్ సింగ్ 2–0–7–1, మెరిడిత్ 3.4–0–21–0, మురుగన్ అశ్విన్ 3–0–32–1. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
అతడి బౌలింగ్ చూస్తే ముచ్చటేసింది: సెహ్వాగ్
ముంబై: రాజస్తాన్ రాయల్స్ బౌలర్ చేతన్ సకారియాపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఇంత అద్భుతంగా రాణిస్తాడని ఊహించలేదన్నాడు. ఏమత్రం బెరుకు లేకుండా ఆడాడని, ఒక మంచి బౌలర్‌కు కావాల్సిన లక్షణాలు తనలో మెండుగా ఉన్నాయని కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ సంజూ సామ్సన్ అద్భుత సెంచరీతో, యువ పేసర్ చేతన్ సకారియా మూడు వికెట్లతో రాణించి అభిమానుల మనసు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరూ భాయ్ చేతన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తన పేరు చాలాసార్లు విన్నాను. దేశవాళీ క్రికెట్లో తన ఆటను కూడా చూశాను. కానీ ఇంతబాగా బౌల్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. దేశవాళీ క్రికెట్లో వివిధ రకాల బ్యాట్స్‌మెన్‌ను తను ఎదుర్కొని ఉండవచ్చు. అయితే, ఐపీఎల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. స్టార్ ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా పంచుకున్న అభిప్రాయాల ప్రకారం, తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ ఎక్కడ బౌండరీ బాదుతాడేమోనని అస్సలు భయపడకూడదు. అవకాశం దొరికేంతవరకు ఓపికగా వేచి చూసి, గట్టిగా దెబ్బకొట్టాలి. అప్పుడే వికెట్లు ఎలా తీయాలన్న విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. సకారియాలో ఇలాంటి లక్షణాలను నేను చూశాను. ఎంతో పట్టుదలగా ఆడాడు’’ అని ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘తన బౌలింగ్‌లో వైవిధ్యం కనబడుతోంది. కొన్నిసార్లు నోబాల్స్ వేసి ఉండవచ్చు. అయితే, మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేసిన తీరు, క్రిస్‌గేల్‌ను తన డెలివరీలతో భయపెట్టిన విధానం ముచ్చటగొలిపింది’’ అని వీరేంద్ర సెహ్వాగ్ ఈ 23 ఏళ్ల సౌరాష్ట్ర బౌలర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక ఆటపట్ల చేతన్ సకారియాకు ఉన్న అంకితభావం గురించి ట్విటర్ వేదికగా ప్రస్తావిస్తూ.. ‘‘కొన్ని నెలల క్రితం చేతన్ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఈ విషయం తనకు చెప్పలేదు. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ ఆడుతున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది. దీనిని బట్టి సకారియా కుటుంబానికి, అతడికి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం సుస్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా, ఆర్ఆర్ చేతన్ సకారియాను 1.20 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక సీజన్ తొలి మ్యాచ్‌లో అతడు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, జై రిచర్డ్సన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసి, 7.80 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఒక నోబ్ ఉంది. చదవండి: ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్ భావోద్వేగం బట్లర్ సేవలను సరిగా వాడుకోలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’ -
అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి
అహ్మదాబాద్: టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు ఒక ఇంటివాడైన సంగతి తెలిసిందే. టీవీ ప్రెజెంటర్ సంజనా గణేషన్‌ను గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. తాజాగా టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బుమ్రాకు కంగ్రాట్స్ చెబుతూ షేర్ చేసిన కామెంట్ నవ్వులు పూయించింది. బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపిన మయాంక్ పొరపాటున అతని భార్య సంజనాకు బదులుగా.. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ పేరును ట్యాగ్ చేశాడు. ''కంగ్రాట్స్ జస్ప్రీత్ బుమ్రా.. సంజయ్ బంగర్.. మీ వైవాహిక జీవితం బాగుండాలని.. కలకాలం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అంటూ కామెంట్ చేశాడు. మయాంక్ చేసిన పని నెటిజన్లకు నవ్వు తెప్పించింది. అయ్యో మయాంక్.. బుమ్రా భార్య పేరు సంజయ్ బంగర్ కాదు.. ఏదో పొరపాటున పెట్టి ఉంటాడు.. ఈ విషయాన్ని పెద్దది చేయకండి'' అంటూ కామెంట్లు పెట్టారు. అయితే మయాంక్ తన ట్వీట్‌ను చూసుకొని వెంటనే దానిని డిలీట్ చేశాడు. కాగా బుమ్రాకు విరాట్ కోహ్లి, యువరాజ్, హర్భజన్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా సహా పలువురు క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. Mayank Agarwal doing R1 things😂#Residency#Typos pic.twitter.com/P14h3qnNEz — Sai Aditya Nayudu (@ImTheSkylord) March 15, 2021 చదవండి: బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?! -
టీమిండియా బ్యాక్ బెంచర్స్ వీరే
కాన్బెర్రా: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు అతడు పెట్టిన క్యాప్షన్‌ను చూసి క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తోలి ఇంటర్నేషనల్ టీ20 సిరీస్‌లో రాహుల్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థసంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ టీమిండియా బ్యాక్ బెంచర్స్‌ను శనివారం అభిమానులకు పరిచయం చేశాడు. తన సహా ఆటగాళ్లైన హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌తో ట్రైన్ రైడ్‌కు వెళ్లిన రాహుల్ ఈ సందర్భంగా రెండు ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులోని మొదటి ఫొటోలో రాహుల్ కుర్చోని ఉండగా ఎదురుగా పాండ్యా, మయాంక్‌లు నిలుచుని నవ్వులు పూయిస్తున్నారు. ఇక మరో ఫొటోలో హార్దిక్ పాండ్యా తన ఫొన్ చూసుకోవడంలో బిజీగా ఉండగా.. రాహుల్ మాత్రం ఎదో పేపర్ పట్టుకుని సిరీయస్‌గా చదువుకుంటున్నాడు. (చదవండి: రవీంద్ర-చహల్ విజయం) ఈ ఫొటోలకు రాహుల్ ‘బ్యాక్ బెంచర్స్’ అనే క్యాప్షన్‌ను జోడించి కళ్లజోడు పెట్టుకుని నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. కాగా శుక్రవారం కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన తోలి ఇంటర్నేషనల్ టీ20 సిరీస్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసిస్ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్ ప్రారంభించగా.. మూడో ఒవర్లోని ఐదో బంతికే ధావన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం 9 పరుగులు మాత్రమే చేసిన నిరాశపరిచాడు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరి చేసి మెరిశాడు. కాగా రెండవ సిరీస్ ఆదివారం సిడ్నిలో జరగనుంది. (చదవండి: జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: ఆసీస్ క్రికెటర్) back benchers 🤓 pic.twitter.com/vj67Vdt1dA — K L Rahul (@klrahul11) December 5, 2020 -
ఓపెనర్‌గా తనే సరైన ఆప్షన్: సచిన్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఆసీస్ టూర్ నేపథ్యంలో టెస్టుల్లో ఓపెనర్ స్థానానికి అతడే సరైన ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2020లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన మయాంక్ అగర్వాల్ టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. తొలిసారిగా మూడు ఫార్మాట్లలోనూ(వన్డే, టీ20, టెస్టు) జట్టు సభ్యుడిగా చోటు సంపాదించుకున్న మయాంక్ తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టాలంటే కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ల రూపంలో అతడికి గట్టి పోటీ ఎదురుకానుంది. కానీ టెస్టుల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండదని సచిన్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఆసీస్ టూర్, మయాంక్ ఆటతీరు గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘‘ మయాంక్ స్కోరు(రన్స్) ఎంతో మెరుగ్గా ఉంది. కాబట్టి కచ్చితంగా ఒక మంచి ఓపెనర్ అవుతాడు. ఒకవేళ రోహిత్ ఫిట్నెస్ సాధించి, జట్టుతో చేరితే మయాంక్ తనకు మంచి జోడీ అవుతాడు. పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌ల విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. నాకు తెలిసి ఫాంలో ఉన్నవాళ్లను పక్కనపెట్టే అవకాశం ఉండదు’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ అగర్వాల్ 424(స్ట్రైక్ రేటు 156.45) పరుగులు చేశాడు. (చదవండి: రోహిత్ స్థానంలో అయ్యర్!) ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందన్న లిటిల్ మాస్టర్.. కంగారూ బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు టీమిండియా ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ‘‘స్మిత్, వార్నర్ వంటి సీనియర్లకు లబుషేన్ తోడైతే ఆసీస్ బ్యాటింగ్ యూనిట్ మరింత మెరుగవుతుంది. ఈసారి ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇందుకు భారత జట్టు సిద్ధంగా ఉంది. నిజానికి కెప్టెన్ కోహ్లి జట్టుతో లేకపోవడం తీర్చలేని లోటే. అయితే ఆ అవకాశాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది’’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు. కాగా గాయం కారణంగా రోహిత్ శర్మ ఆసీస్ టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులోకి వస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అలా జరగని పక్షంలో హిట్‌మాన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను రిజర్వ్ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది.(చదవండి: ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!) -
ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్
దుబాయ్: ముంబై ఇండియన్స్-కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ఆ సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్ పంజాబ్ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇలా ఐపీఎల్ చరిత్రలో డబుల్ సూపర్ ఓవర్లు పడటం ఇదే తొలిసారి. (ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది) కాగా, సెకండ్ సూపర్ ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకొచ్చినందుకు ఆగ్రహంతోపాటు కలత చెందానని యూనివర్శల్ బాస్ గేల్ తెలిపాడు. ఆ సమయంలో తానేమీ ఆందోళనకు చెందలేదని, క్రికెట్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నాడు. కాకపోతే రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు ‘తొలి బంతిని మనిద్దరిలో ఎవరం ఎదుర్కొందాం?’ అని మయాంక్ అడిగిన ప్రశ్నకు గేల్ బాగా కలత చెందాడట. కోపం కూడా వచ్చిందని గేల్ తెలిపాడు. మయాంక్ నువ్వు నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నావా..? , ఫస్ట్ బాల్‌ను బాస్ ఎదుర్కొంటాడు అని సమాధానం ఇచ్చాడట. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లతో ఇంటరాక్షన్‌లో సూపర్ ఓవర్ల గురించి గేల్ మాట్లాడాడు. ఈ క్రమంలోనే మయాంక్‌తో కలిసి బ్యాటింగ్ చేయడానికి వెళ్లేటప్పుడు సంభాషణను వెల్లడించాడు. మరొకవైపు షమీపై ప్రశంసలు కురిపించాడు గేల్. ‘నా వరకు షమీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రోహిత్, డికాక్‌లకు బౌలింగ్ చేసిన షమీ.. ఆరు పరుగులు కూడా చేయకుండా సమర్థవంతంగా వ్యవహరించాడు. షమీ వేసి యార్కర్లను నేను నెట్స్‌లో ఎదుర్కొన్నాను. ప్రత్యర్థులకు కూడా షమీ యార్కర్లను రుచి చూపిస్తాడని తెలుసు. నేను అనుకున్నట్టే షమీ బౌలింగ్ చేశాడు’ అని గేల్ కొనియాడాడు. -
పరుగుల హోరులో రాజస్తాన్ దరహాసం
షార్జా: కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కింగ్స్ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సాధించి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ జోస్ బట్లర్(4) విఫలమైనా, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. 9 ఓవర్ల ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల మార్కును దాటడంతో రాజస్తాన్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్ చివరి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ఒకవైపు శాంసన్ పరుగుల మోత మోగిస్తుంటే, తెవాతియా తొలుత ఆపసోపాలు పడ్డాడు. కానీ ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టిన తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. శాంసన్ ఔటైన తర్వాత తెవాతియా బ్యాట్‌కు పని చెప్పడంతో రాజస్తాన్ చివరకు విజయాన్ని నమోదు చేసింది. ఆఖర్లో ఆర్చర్ (13 నాటౌట్) 3 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టడంతో రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ టార్గెట్‌లో ఇంకా మూడు బంతులు ఉండగానే రాజస్తాన్ గెలుపును అందుకుంది. గేమ్ ఛేంజర్ తెవాతియా ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాతియానే. తొలుత స్మిత్, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాతియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్ డౌన్లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాతియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్టుగానే తెవాతియా తొలుత తడబడ్డాడు. కానీ శాంసన్ ఔటైన తర్వాత మొత్తం గేమ్ స్వరూపాన్నే మార్చేశాడు తెవాతియా. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను ఛేంజ్ చేసేశాడు. ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాతియానే. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడిన ఆ ఓవర్ కింగ్స్‌కు విజయాన్ని దూరం చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. మయాంక్ ధాటిగా ఆడటంతో రాహుల్ ఎక్కువ స్టైక్ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్ కరాన్ బౌలింగ్‌లో మయాంక్ పెవిలియన్ చేరగా, రాజ్‌పుత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్లోనే రాహుల్ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు), పూరన్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. -
కింగ్స్ పంజాబ్ ఇరగదీసింది..
షార్జా: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐపీఎల్ అంటే ఇది కదా అనేంతగా రెచ్చిపోయి ఆడాడు. రాజస్తాన్‌కు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల మోత మోగించి తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన మయాంక్.. మరో 19 బంతుల్లో దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 45 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో శతకం సాధించి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మయాంక్ నిలిచాడు. అంతకుముందు యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించగా, ఆ తర్వాత స్థానంలో మయాంక్ నిలిచాడు. ఈ క్రమంలోనే 46 బంతుల్లో సెంచరీ సాధించి ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న మురళీ విజయ్ను మయాంక్ అధిగమించాడు. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. మయాంక్ ధాటిగా ఆడటంతో రాహుల్ ఎక్కువ స్టైక్ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్ కరాన్ బౌలింగ్‌లో మయాంక్ పెవిలియన్ చేరగా, రాజ్‌పుత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. మయాంక్ ఔటైన మరుసటి ఓవర్లోనే రాహుల్ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు), పూరన్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. -
మయాంక్ మోత.. కింగ్స్ పంజాబ్ రికార్డు
షార్జా: ఈ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ పరుగుల మోత మోగిస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి బ్యాటింగ్ పవర్ మరోసారి చూపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన గత మ్యాచ్‌లో 89 పరుగులు సాధించిన మయాంక్.. మళ్లీ విరుచుకుపడ్డాడు. మయాంక్ బ్యాటింగ్‌తో కింగ్స్ పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది. ఇందులో మయాంక్వి 69 పరుగులు ఉన్నాయి. ఈ పరుగుల్లో 6 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉండటం విశేషం. మరొకవైపు కింగ్స్ పంజాబ్ పవర్‌ప్లేలో రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్లో అత్యధిక పవర్‌ప్లే పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పవర్‌ప్లేలో కింగ్స్ పంజాబ్ 60 పరుగులు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ నమోదు చేసిన 59 పరుగుల పవర్ ప్లే రికార్డును కింగ్స్ పంజాబ్ అధిగమించింది. రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఇక రాహుల్ 35 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 13 ఓవర్లలో కింగ్స్ పంజాబ్ 148 పరుగులు చేసింది. -
స్టోయినిస్.. నీ ఆట అమోఘం: మయాంక్
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడ్డ సమయంలో ఆల్‌రౌండర్ స్టోయినిస్ మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించి హాఫ్ సెంచరీ సాధించాడు. కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనే దిశ నుంచి స్కోరు బోర్డును 150 పరుగులకు పైగా తీసుకెళ్లాడు. దాంతో మ్యాచ్ హోరాహోరీ అయ్యింది. స్టోయినిస్ బ్యాటింగ్ వృథా కాకుండా ఢిల్లీ ‘సూపర్’ విజయాన్ని అందుకుంది. చివరకు మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ సునాయాసంగా గెలిచి శుభారంభం చేసింది. (చదవండి: స్టోయినిస్ చెలరేగిపోయాడు..) ఢిల్లీ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో కింగ్స్ చివరి వరకూ పోరాడింది. ఆదిలో వికెట్లు కోల్పోయినా మయాంక్ అగర్వాల్ సొగసైన ఇన్నింగ్స్‌తో విజయం అంచుల వరకూ వెళ్లింది. కానీ ఒక పరుగు తీయాల్సిన సమయంలో మయాంక్ భారీ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. చివరి బంతికి జోర్డాన్ కూడా ఔట్ కావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఈ రెండు వికెట్లను కూడా స్టోయినిస్ సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్ అనే పదానికి అర్థం చెబుతూ మ్యాచ్‌ను మలుపుతిప్పేశాడు. మ్యాచ్ తర్వాత మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. స్టోయినిస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. స్టోయినిస్ బ్యాటింగ్ అమోఘం అంటూ కొనియాడాడు. అటు బంతితోనూ మెరిసిన స్టోయినిస్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం క్రెడిట్ అంతా కూడా స్టోయినిస్కే దక్కుతుందన్నాడు. అతను కడవరకూ పోరాడిన విధానం నిజంగానే అద్భుతమన్నాడు. ఈ మ్యాచ్‌లో మేము చేసిన ఒకే ఒక్క చిన్నపొరపాటుతో ఫలితం తారుమారైందన్నాడు. తాము కష్టాల్లో పడి తేరుకుని కడవరకూ రావడం సానుకూల థృక్పధానికి నిదర్శనమన్నాడు. తమ బౌలింగ్ కూడా బాగుందన్నాడు. కొత్త బాల్‌తో తమ పేసర్లు అద్భుతంగా రాణించారన్నాడు. కాకపోతే ముగింపు సరిగా లేకపోవడం తమను తీవ్రంగా బాధిస్తుందన్నాడు. ఇది తొలి గేమ్ కావడంతో తదుపరి మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామన్నాడు. -
ఆమె వల్లనే నాలో ఈ మార్పు: కోహ్లి
ముంబై: ‘నేను అనుష్కను కలవకపోతే.. ఈ రోజు ఇంత ఒపెన్‌గా, ధృడంగా ఉండేవాడిని కాదు. ఆమె నన్ను మంచి వ్యక్తిగా మార్చింది’ అంటూ జీవిత భాగస్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ మార్పు తన క్రికెట్ కెరీర్‌తో పాటు జీవితానికి ఎంతో సాయం చేసిందన్నారు. భారత టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ గురించి విరాట్ కోహ్లి మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. విరాట్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 2017 డిసెంబర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సందర్భం వచ్చిన ప్రతిసారి అనుష్కను ప్రశంసిస్తుంటారు కోహ్లి. తాజాగా మరోసారి అనుష్కను అభినందించారు. (అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి) ‘ప్రస్తుతం ప్రతి అంశాన్ని నేను విభిన్న కోణాల్లోంచి చూడగల్గుతున్నానంటే అందుకు కారణం అనుష్కనే. ఇందుకు సంబంధించిన పూర్తి క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. అనుష్క నా జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. మేం ఇద్దరం ఒకరి నుంచి ఒకరం చాలా నేర్చుకుంటాం. అనుష్క రాక ముందు నేను ఇంత ఒపెన్‌గా ఉండేవాడిని కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడిని కాదు. కొన్ని విషయాల్లో ఆమె నా ఆలోచన విధానాన్ని మార్చింది. నా మైండ్‌సెట్ కూడా మారింది. అంతకు ముందు కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే వాడిని కాదు. అయితే చాలా విషయాలను విశాల దృక్పథంతో చూడాలని ఆమె నాకు అర్థమయ్యేలా చేసింది. సరైన రీతిలో ప్రజలకు ఉదాహరణగా ఉండడం, అన్ని విషయాలను అర్థం చేసుకోవడం.. వంటి అలవాట్లు నాకు అనుష్కతో ఉండడం వల్లే వచ్చాయి. ఇందుకు సంబంధించి ఫుల్ క్రెడిట్ ఆమెకే ఇస్తాను. చుట్టూ ఉండే మనుషులను, పరిస్థితులను అనుష్క బాగా అర్థం చేసుకుంటుంది’ అన్నారు కోహ్లి. ('రషీద్ వస్తే అంతు చూస్తా అన్నాడు') -
భార్య పుట్టినరోజున కోహ్లి ఏంచేశాడంటే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆఫ్ ఫీల్డ్ నైపుణ్యాలను బాగా పెంచుకుంటున్నారు. అంతటితో ఆగక ఆ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మయాంక్ అగర్వాల్‌తో సరదాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పుట్టిన రోజున భార్య కోసం తానే కేక్ తయారు చేసినట్లు కోహ్లి వెల్లడించారు. అయితే కేక్ తయారుచేయడం తన జీవితంలో మొదటి ప్రయత్నం అని.. అయితే ఆ ప్రయత్నం ఫలించి కేక్ మంచిగానే వచ్చినట్లు తెలిపారు. అనుష్క శర్మ నుంచి కూడా కేక్ బాగుంది. ఈ కేక్ నాకు చాలా ప్రత్యేకమైనది' అనే కాంప్లిమెంట్స్ వచ్చినట్లు విరాట్ కోహ్లి మయాంక్ అగర్వాల్‌తో అన్నారు. (అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి) From baking for his special someone in the lockdown to revealing the best smoothie makers in the team, @imVkohli answers it all on #OpenNetsWithMayank. Part 2 of the show coming up soon on https://t.co/Z3MPyesSeZ. Stay tuned 😊😊@mayankcricket pic.twitter.com/IuvdfOST0Y — BCCI (@BCCI) July 26, 2020 కాగా.. టీమిండియా క్రికెటర్లలో ఉత్తమ ప్రొటీన్ షేక్‌లను తయారుచేసే వారి గురించి మయాంక్ అడిగినపుడు.. విరాట్ సమాధానంగా మయాంక్ అగర్వాల్, నవదీప్ షైనీ, తన పేరు చెప్పాడు. ఆ వెంటనే మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. మొదటి మిమ్మల్ని, తర్వాత నవదీప్ షైనీని, ఆ తర్వాత నాకు నేను రేటింగ్ ఇచ్చుకుంటాను' అంటూ కోహ్లి సమాధానమిచ్చారు. అయితే లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్ ఫిట్నెస్ను కాపాడుకోవడంతోపాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు. ఇక 2020లో ఐపీఎల్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుండటంతో.. ఈ సీజన్లో అయినా రాయల్ ఛాలెంజర్స్ జట్టును విజేతగా నిలపాలనుకుంటున్నాడు. గత 12 సీజన్లలోనూ బెంగళూరు జట్టుకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. (ముగింపు బాగుండాల్సింది: అనిల్ కుంబ్లే) -
అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాలు, సూచలనతోనే ఆస్ట్రేలియా టూర్లో మెరుగ్గా రాణించగలిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. హిప్ అలైన్ మార్చుకున్న తర్వాత తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లి సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో వీడియో చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్ టూర్లో బ్యాటింగ్ పరంగా తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేస్తున్నాడు. ‘‘ఇంగ్లండ్ టూర్లో హిప్ పొజిషన్ నాకెంతో సమస్యాత్మకంగా మారింది. అయినప్పటికీ నేనేం ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ కఠినంగా ముందుకు సాగాను. అయితే తొందరగానే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నిజం చెప్పాలంటే అదో బాధాకరమైన విషయం. ఓ బ్యాట్స్‌మెన్‌గా కుడి వైపు తుంటి భాగాన్ని బాగా చాచినపుడు లేదా దగ్గరకు తీసుకువచ్చినపుడు మనం ప్రమాదంలో పడతామనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అందుకే హిప్ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కాస్త బ్యాలెన్స్ చేస్తూ బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇంగ్లండ్ టూర్లో నేను ఈ టెక్నిక్ మిస్సయ్యానని అనిపిస్తూ ఉంటుంది. (1000వ పోస్టును షేర్ చేసిన కోహ్లి) ఆ తర్వాత ముంబైలో సచిన్ పాజీని కలిశాను. ఫార్వర్డ్ ప్రెస్(బలంగా నిల్చుని కాలు ముందు చాచడం) ద్వారా ఫాస్ట్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే టెక్నిక్స్ నేర్చుకున్నా. అదే వ్యూహాన్ని ఆసీస్ టూర్లో అమలు చేశాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2014 ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కలిపి 13.40 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి కెరీర్లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్ టూర్‌లోని అనుభవాల దృష్ట్యా టెక్నిక్స్ మార్చుకుని ఆసీస్ టూర్(2014-15)లో 692 పరుగులతో రాణించి సత్తా చాటాడు. -
'అదే నన్ను ధోని అభిమానిగా మార్చింది'
ముంబై : ఎంఎస్ ధోని.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా భారత్‌కు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన ఘనత అందుకున్నాడు. వన్డే, టెస్టు, టీ20 ల్లో ఇండియాను నంబర్‌వన్ స్థానంలో నిలిపాడు. అయితే ధోనిని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన ధోని ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అలా వరుసగా 4 మ్యాచ్‌లో విఫలమైన ధోని విశాఖపట్నం వేదికగా పాక్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) ఆ వన్డేలో 123 బంతుల్లోనే 15 బౌండరీలు 4 సిక్స్‌ల సాయంతో 148 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. అప్పటినుంచి తన 16 సంవత్సరాల కెరీర్లో మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం ధోనికి లేకుండా పోయింది. ఇక వికెట్ కీపర్‌గా ధోని ప్రదర్శన గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. తాజాగా మంగళవారం 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి అభిమానులతో పాటు పలువురు ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంఎస్ ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "I'm happy that Indian cricket got a Mahendra Singh Dhoni, because he is unbelievable," @SGanguly99 to @mayankcricket on #DadaOpensWithMayank #HappyBirthdayMSDhoni @msdhoni pic.twitter.com/KCua8qq4hu — BCCI (@BCCI) July 7, 2020 '2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో ధోనిని ఎంపిక చేయాలని సెలెక్టర్లను కోరాను. కానీ ఒక కెప్టెన్‌గా నేను జట్టును మాత్రమే ఏంచుకోగలను.. నేను ఆరోజు చేసిన ప్రతిపాధనపై జట్టులోకి తీసుకున్న ధోని ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కానీ అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. ఒక వికెట్‌కీపర్‌గా జట్టులోకి వచ్చిన ధోనిని పాక్‌తో జరిగిన రెండో వన్డేకు రాహుల్ ద్రవిడ్‌ను కాదని నెంబర్ 3 స్థానంలో ధోనిని పంపాలని నిర్ణయించుకున్నా. సరిగ్గా ఇదే మ్యాచ్‌లో ధోని తన ఆటతీరు ఎలా ఉంటుందో మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్లో అతనొక అత్యుత్తమ ఆటగాడే కాదు.. మంచి ఫినిషర్ కూడా. ఎన్నో మ్యాచ్‌ల్లో ఫినిషర్‌గా వచ్చి లోవర్ ఆర్డర్ సాయంతో జట్టును గెలిపించిన తీరుపై ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆటగాళ్లు క్రికెట్లో పరిచయం అవుతుంటారు.(ధోని మౌనం వీడేనా ?) కానీ ఒక దశాబ్ధంలో కొందరే క్రికెటర్లు తమదైన ముద్ర వేస్తారు. అందులో ధోనికి కూడా సమున్నతమైన స్థానం ఉందనంలో సందేహం లేదు. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు తమ జట్టును గెలిపించాలనే ఉత్సాహంతో చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతుంటారు, కానీ ధోని మాత్రం ఒత్తిడిని జయించి ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అదే ఎంఎస్ ధోని ప్రత్యేకత. అందుకే నేను ధోనికి ప్రియమైన అభిమానిగా మారిపోయాను.నిజంగా టీమిండియాకు ధోని లాంటి ఆటగాడు దొరకడం అదృష్టంగా చెప్పొచ్చు.'అంటూ చెప్పుకొచ్చాడు. సుధీర్ఘ పార్మాట్లో 90 టెస్టులాడిన ధోని 4,786 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 350 వన్డేలాడిన ధోని 10773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు ఉన్నాయి. -
‘సచిన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్.. రెండు సమాధానాలు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడీల్లో సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్ల జంట ఒకటి. వీరిద్దరూ ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పి ఓపెనింగ్ భాగస్వామ్యానికి వన్నె తెచ్చారు. అయితే టెండూల్కర్ ఓపెనర్‌గా సక్సెస్ అయినా తొలి బంతిని ఫేస్ చేయడానికి వెనుకాడేవాడట. అసలు స్టైకింగ్ తీసుకోవడానికి టెండూల్కర్ ఇష్టపడేవాడు కాదని తాజాగా గంగూలీ తెలిపాడు. బీసీసీఐ టీవీలో మయాంక్ అగర్వాల్‌తో చాట్ చేస్తూ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిచ్చాడు. తాను పలుమార్లు టెండూల్కర్‌ను స్ట్రైక్ తీసుకోమని అడిగినా అతని నుంచి రెండు సమాధానాలు వచ్చేవన్నాడు. సచిన్ ఫామ్‌లో ఉంటే ఒక సమాధానం.. లేకపోతే మరొక సమాధానం వచ్చేదని గంగూలీ ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేకున్నాడు.(టి20 కోసం నా బ్యాటింగ్ మార్చుకునేవాడిని) ‘సచిన్‌ను స్ట్రైకింగ్ తీసుకుంటావా అనే అడిగిన సందర్భాలు ఉన్నాయి. దానికి సచిన్ దగ్గర రెండు సమాధానాలు ఉండేవి. ఫామ్‌లో ఉంటే నేను ఫామ్‌లో ఉన్నాను కదా.. నాన్ స్టైకింగ్ ఎండ్‌లోనే ఉంటా అనేవాడు. ఒకవేళ ఫామ్ లేకపోతే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండి ఒత్తిడిని అధిగమిస్తా అనేవాడు. ఒకవేళ అవతలి బ్యాట్స్‌మెన్ సచిన్ కన్నా వేగంగా మైదానంలోకి వెళ్లి నాన్ స్ట్రైకింగ్‌లో నిలుచుంటే తప్పా.. మనం సచిన్‌ను తొలి బంతి ఆడేలా చేయలేము. తన కెరీర్లో కేవలం ఒకటి-రెండు సందర్భాలలో అలా చేశా. సచిన్ కంటే ముందు వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో నిల్చునేవాడిని. అది టీవీల్లో కనబనడటంతో స్ట్రైకింగ్ తీసుకోమని సచిన్‌కు చెప్పేవాడిని’ అని గంగూలీ తెలిపాడు.సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున వన్డే ఓపెనింగ్ జోడీగా 136 ఇన్నింగ్స్‌ల్లో 6, 609 పరుగులు చేశారు. వరల్డ్‌లో వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ రికార్డు ఇదే. మరొకవైపు వారి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 258 పరుగులు. 2001లో కెన్యాపై దీన్ని నమోదు చేశారు. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) -
'రషీద్ వస్తే అంతు చూస్తా అన్నాడు'
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఆటకు విరామం దొరకడంతో టీమిండియా టెస్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' పేరుతో చాట్‌షో నిర్వహిస్తున్నాడు. వరుస చాట్ షోలతో క్రికెటర్లను ఇంటర్య్వూ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజగా మయాంక్ ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ సహచర ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌తో చాట్ షో నిర్వహించాడు. చాట్ సందర్భంగా రాహుల్, గేల్లు ఐపీఎల్ బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నారు. ('అల్లా దయ.. నాకు కరోనా సోకలేదు') రాహుల్ స్పందిస్తూ.. '2018 ఐపీఎల్లో నేను కింగ్స్ లెవెన్‌కు ఆడుతున్న సమయంలో క్రిస్ గేల్ కూడా జట్టులో ఉన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. నాకు బాగా గుర్తు.. ఆరోజు గేల్ మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ సీజన్లోనే అత్యధిక పరుగులు చేయాలనే ఉత్సాహంతో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న గేల్ ఈ సమయంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌కు వస్తే అతని అంతు చూస్తా అని పేర్కొన్నాడు. ఎందుకంటే నాకు స్పిన్నర్ బౌలింగ్ రావడం ఇష్టం లేదని.. నా ముందు ఆధిపత్యం చలాయిస్తే చూస్తూ ఊరుకోనని తెలిపాడు. 14 ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టి గేల్ తన మాటను నిలబెట్టుకున్నాడు. నేను చూసిన మూమెంట్స్‌లో దీనినే ది బెస్ట్ అంటా' అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా కరోనాతో ఆటకు బ్రేక్ రావడంతో ఫిట్నెస్ను ఎలా కాపాతున్నావని క్రిస్ గేల్‌ని మయాంక్ ప్రశ్నించాడు. ' నేను జార్జ్ ఫ్లాయిడ్ , జాన్సెనా కంటే ఫిట్‌నెస్‌గానే ఉన్నా' అంటూ గేల్ నవ్వుతూ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్ 11 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 104 పరుగులు సాధించాడు. ఆ సీజన్లో రాహుల్ అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయితే జట్టుగా విఫలమైన కింగ్స్ లెవెన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవెన్‌కు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 కరోనా దృష్యా వాయిదా పడింది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ వాయిదా పడితే దాని స్థానంలో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.('ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది') -
‘ధోని ప్లాన్ వేశాడు.. నేను అమలు చేశా’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన భారత క్రికెటర్లు.. తమ అనుభవాలను షేర్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా బీసీసీఐ టీవీ నిర్వహించిన ఒక షోలో యజ్వేంద్ర చహల్, మయాంక్ అగర్వల్, కుల్దీప్ యాదవ్‌లు తమ కెరీర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌పై కుల్దీప్ సాధించిన హ్యాట్రిక్‌ను మయాంక్ గుర్తు చేయగా, 2017లో ఆస్ట్రేలియా జట్టు.. భారత పర్యటనలో భాగంగా మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేయడానికి రచించిన వ్యూహాన్ని చహల్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయంలో మ్యాక్స్‌వెల్‌కు బంతిని బాగా ఎడంగా వేయడానికి కారణాలు ఏమిటని మయాంక్ ప్రశ్నించాడు. (పాకిస్తాన్ చేసింది ముమ్మాటికీ తప్పే: వకార్) దానికి చహల్ సమాధానం చెబుతూ,.. ‘ అది ఎంఎస్ ధోని ప్లాన్‌లో భాగం. మ్యాక్స్‌వెల్ కోసం ధోనితో కలిసి వ్యూహాన్ని రచించాం. మ్యాక్సీ ఎటాకింగ్ బ్యాట్స్‌మన్. స్పిన్ బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడానికి ఎక్కువగా యత్నించాడు. నా బౌలింగ్‌నే టార్గెట్ చేశాడు. దాంతో ఆఫ్ స్టంప్ బయటకు బంతిని సంధించమని ధోని చెప్పాడు. గ్రౌండ్ కింది భాగం నుంచి మ్యాక్సీ ఎక్కువగా బంతిని హిట్ చేస్తాడు. దాంతో అతని కోసం ఆ వ్యూహాన్ని అమలు చేశాం. బంతిని ఆఫ్ స్టంప్ బయటకు బాగా సంధించి సక్సెస్ అయ్యా,. అందుచేత మ్యాక్సీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఆఫ్ స్టంప్ బయట వేసేవాడ్ని. (‘రాహుల్ వద్దు.. రహానే బెటర్’) ప్రత్యేకంగా ఆ సిరీస్ మూడో వన్డేలో మ్యాక్సీ వికెట్‌ను అలానే సాధించా. మ్యాక్సీని పదే పదే అసహనానికి గురి చేయడమే ప్రణాళికలో భాగం. నేను బౌలింగ్ వచ్చిన ప్రతీసారి హిట్టింగ్‌కు దిగేవాడు. దాంతో ధోనితో కలిసి వ్యూహం రచించాం. వేసే బంతి ఆఫ్ స్టంప్‌కు దూరంగా పడాలి.. కానీ వైడ్ కాకూడదు అని ధోని చెప్పాడు. అది వికెట్ టేకింగ్ డెలివరీ కావాలని ధోని చెప్పడంతో అవే బంతులు వేసేవాడ్ని’ అని ఈ లెగ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ఆ ఐదు వన్డేల సిరీస్‌లో మ్యాక్స్‌వెల్‌ను మూడు సార్లు చహల్ ఔట్ చేయగా, రెండు టీ20ల సిరీస్‌లో ఒకసారి బోల్తా కొట్టించాడు. ఆ వన్డే సిరీస్‌ను భారత్ 4-1తో గెలవగా, టీ20 సిరీస్ 1-1తో సమం అయ్యింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఆ సిరీస్‌ను ఇరు జట్లు సమంగా పంచుకోవాల్సి వచ్చింది. -
'ఆరోజు రితికా అందుకే ఏడ్చింది'
ముంబై : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో క్రికెటర్లంతా తమ ఇళ్లలోనే ఉంటూ తోటి ఆటగాళ్లు నిర్వహిస్తున్న లైవ్ చాట్‌లో పాల్గొంటున్నారు. తాజాగా భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బీసీసీఐ టీవీలో నిర్వహించిన 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' షోలో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు. మాటల మధ్యలో రోహిత్ శర్మ తన మూడో డబుల్ సెంచరీని గుర్తు చేసుకుంటూ, తన భార్య రితికా మొహాలి స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం వెల్లడించాడు. 'ఆ మ్యాచ్‌లో నేను 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయాల్సి వచ్చింది. పరుగు కోసం పరిగెత్తిన నేను డైవ్ చేశాను. ఇంకా నేను డబుల్ సెంచరీ సాధించకముందే అంటే 196 పరుగుల వద్ద ఉన్నప్పుడు రితికా భావోద్వేగానికి లోనైంది. ఎందుకు ఏడ్చావు అని నేను ఆమెను (రితికా) అడిగాను? అప్పుడు పరుగు తీస్తున్న క్రమంలో డైవ్ చేయడంతో చేతికి దెబ్బ తగిలిందేమోనని భావోద్వేగానికి లోనయ్యానంటూ రితికా తర్వాత చెప్పింది. అంతేగాక ఆరోజు చేసిన డబుల్ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను డబుల్ సెంచరీ చేసిన రోజే మా పెళ్లిరోజు కాబట్టి' అంటూ మయాంక్‌తో చెప్పుకొచ్చాడు. (లారా ఆ రికార్డు సాధించి 26 ఏళ్లు..) వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో రెండు శ్రీలంకపై(2014,2017) సాధించగా, ఒకటి మాత్రం ఆస్ట్రేలియాపై(2013) సాధించాడు. టీమిండియా తరపున రోహిత్ శర్మ 224 వన్డేల్లో 9115 పరుగులు, 32 టెస్టుల్లో 2141 పరుగులు, 108 టీ20ల్లో 2773 పరుగులు సాధించాడు.(కోహ్లి కంటే స్మిత్ బెటర్: జాఫర్) -
అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్
న్యూఢిల్లీ: ఫీల్డ్‌లో దిగిన క్రికెటర్లు మాటల ద్వారానే స్లెడ్జింగ్‌కు దిగడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చేతలతో స్లెడ్జింగ్ చేసే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ చేతల ద్వారా స్లెడ్జింగ్ చేస్తే అది ఒక క్రికెటర్‌ను గేలి చేసినట్లే అవుతుంది. ఇలా ఇషాంత్ శర్మ ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను గేలి చేసిన సంగతి అందరికీ సుపరిచితమే. 2017లో బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన టెస్టులో స్మిత్‌ను తన ముఖ కవలికల ద్వారా గేలి చేశాడు ఇషాంత్. ఇది క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. స్మిత్‌ను పదే పదే ఇలా స్లెడ్జ్ చేస్తూ ఇషాంత్ శర్మ పైచేయి సాధించే యత్నం చేశాడు. ఇషాంత్ అలా గేలి చేయడం, కోహ్లి పగలబడి నవ్వడం అప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. (వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్.. ధోనికి నో చాన్స్!) కాగా, ఆనాటి సంఘటనను తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నాడు ఇషాంత్. అసలు అలా ఎందుకు చేశాడో చెప్పుకొచ్చాడు. స్మిత్‌ను అసౌకర్యానికి గురి చేయడంలో భాగంగానే అలా చేశానని ఇషాంత్ తెలిపాడు. ‘ అది మా ప్రణాళికలో భాగమే. స్మిత్‌ను క్రీజ్‌లో కుదురకోనీయకుండా చేయాలంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనేది ప్లాన్. అది ఒక క్లోజ్ గేమ్. నువ్వు బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏమి చేయాలని చూస్తావో.. నేను కూడా దాదాపు అదే చేశా. స్మిత్ చాలాసార్లు బౌలర్లను విసిగిస్తాడు. క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేసుకుంటూ పోతాడు. మేము స్మిత్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేస్తే అప్పుడు మేము గెలవడానికి అవకాశం ఉంటుంది. నేను కేవలం అతని ఏకాగ్రతను దెబ్బతీసి అసౌకర్యానికి గురి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక విరాట్ కోహ్లికి దూకుడు ఎక్కువ. దూకుడును కోహ్లి ఎక్కువ ఇష్టపడతాడు. ఇలా చేయొద్దని ఎప్పుడు చెప్పడు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యమని చెబుతాడు. అది కూడా నిషేధం పడకుండా ఉండేలా చూసుకోమని మాత్రమే చెబుతాడు’ అని టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో షేర్ చేసుకున్నాడు ఇషాంత్. బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ కార్యక్రమంలో ఇషాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.(స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?)