DT 2024: గిల్‌ స్థానంలో కెప్టెన్‌గా కర్ణాటక బ్యాటర్‌ | Mayank Agarwal To Lead India A After Gill Call Up For Test series Vs Ban | Sakshi
Sakshi News home page

DT 2024: గిల్‌ స్థానంలో కెప్టెన్‌గా కర్ణాటక బ్యాటర్‌

Published Mon, Sep 9 2024 4:21 PM | Last Updated on Mon, Sep 9 2024 5:07 PM

Mayank Agarwal To Lead India A After Gill Call Up For Test series Vs Ban

దులిప్‌ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌గా ఎంపికయ్యాడు. శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్‌బాల్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్‌ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.

కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లంతా దులిప్‌ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.

టీమిండియాలోకి గిల్‌
బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 46 పరుగులు చేసిన గిల్‌.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్‌ స్థానంలో మయాంక్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.

కాగా గిల్‌తో పాటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.

ఇక అనంతపురంలో
ఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్‌ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్‌ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్‌లో మయాంక్‌ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.

శుబ్‌మన్‌ గిల్‌ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్‌డేటెడ్‌):
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్‌కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్‌ ఖాన్. 

చదవండి: మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement