India A
-
IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..
టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం లభించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 నేపథ్యంలో రెండు నెలలకు పైగా భారత జట్టు ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22న మొదలై మే 25న ఫైనల్‌తో ముగియనుంది.ఈ పొట్టి ఫార్మాట్ టోర్నమెంట్ పూర్తైన తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(India Tour Of England)కు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. గంభీర్ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా సిరీస్ కంటే ముందే ఇంగ్లండ్‌కు వెళ్లనున్న ఇండియా-‘ఎ’ జట్టుతో అతడు ప్రయాణించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిననాటి నుంచి గంభీర్‌తో బీసీసీఐతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నాడు. ఇండియా-‘ఎ’ జట్టుతో పాటు ప్రయాణం చేయాలని అతడు భావిస్తున్నాడు.అందుకే ఇలారిజర్వ్ ఆటగాళ్ల నైపుణ్యాలను దగ్గరగా పరిశీలించాలని అతడు భావిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత.. గంభీర్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో వైల్డ్ కార్డ్ ద్వారా అతడు తీసుకువచ్చిన ఆటగాళ్ల నుంచి మెరుగైన ఫలితాలు వచ్చాయి. టెస్టుల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని పాటించాలని భావిస్తున్నాడు.ముఖ్యంగా ఇండియా-‘ఎ’ జట్టులోని ప్రతిభావంతులకు అవకాశం ఇస్తే బాగుంటుందని అతడు భావిస్తున్నాడు. ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీని వీడిన తర్వాత ఇండియా-‘ఎ’ టూర్లు నామమాత్రంగా మారిపోయాయి. టెస్టుల్లో ఘోర పరాభవాలుఅందుకే గంభీర్ ఈ అంశంపై దృష్టి సారించాడు. టూర్ల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత విజయాలు అందుకున్న గంభీర్.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు చవిచూశాడు. టీ20, వన్డే ద్వైపాక్షిక టోర్నీల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్ క్లీన్‌స్వీప్ విజయాలు సాధించి సత్తా చాటింది. అయితే, సొంతగడ్డపై టెస్టుల్లో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో 3-1తో కంగారూల చేతిలో ఓడి దశాబ్దకాలం తర్వాత ఓటమిని చవిచూసింది. దీంతో గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లూ వినిపించాయి.ఇలాంటి తరుణంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడం ద్వారా గంభీర్ తిరిగి గాడిలో పడ్డాడు. కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తాను మెంటార్‌గా పనిచేసిన సమయంలో గుర్తించిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను ఈ మెగా వన్డే టోర్నీలో ఆడించడం ద్వారా మరోసారి విమర్శల పాలయ్యాడు గంభీర్. ఇండియా-‘ఎ’ టీమ్‌పై కూడా దృష్టి.. వారి గుండెల్లో గుబులుఅయితే, వారిద్దరు జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించడంతో గంభీర్‌ను విమర్శించిన వాళ్లే అతడి నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లోనూ తన ముద్ర వేసేందుకు గంభీర్ ఇండియా-‘ఎ’ టీమ్‌పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఫామ్‌లేమితో సతమతమయ్యే సీనియర్లపై వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా ఇంతకు ముందు కోచ్‌లుగా పనిచేసిన ద్రవిడ్, రవిశాస్త్రి వంటి వారు ఎప్పుడూ ఇలా ఇండియా-‘ఎ’ జట్టుతో ప్రయాణించిన దాఖలాలు లేవని.. ఈ ప్రయోగం ద్వారా గంభీర్ ఎలాంటి ఫలితం పొందుతాడో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
సౌతాఫ్రికాతో సిరీస్.. భారత్-‘ఎ’ జట్టు వైస్ కెప్టెన్‌గా గొంగడి త్రిష
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే అండర్–19 మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’ జట్లను ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష భారత ‘ఎ’ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.అదే విధంగా... హైదరాబాద్‌కే చెందిన గుగులోత్ కావ్యశ్రీకి భారత ‘ఎ’ జట్టులో... కేసరి ధృతికి భారత ‘బి’ జట్టులో చోటు లభించింది. ఆంధ్ర బౌలర్ షబ్నమ్ భారత ‘ఎ’ జట్టులో ఎంపికైంది. పుణె వేదికగాదక్షిణాఫ్రికాతోపాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోమ్యాచ్లు జరుగనున్నాయి.ఇక ఈ టోర్నీ డిసెంబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది. కాగా 18 ఏళ్ల త్రిష గత ఏడాది జరిగిన అండర్–19 ప్రపంచ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. భారత ‘ఎ’ జట్టు: సనిక చాల్కె (కెప్టెన్), గొంగడి త్రిష (వైస్ కెప్టెన్), గుగులోత్ కావ్యశ్రీ, భవిక అహిరె, జోషిత, హర్లీ గాలా, సస్తీ మండల్, సిద్ధి శర్మ, సోనమ్ యాదవ్, గాయత్రి సుర్వసె, చాందిని శర్మ, హ్యాపీ కుమారి, షబ్నమ్, బిదిషా డే, ప్రాప్తి రావల్. భారత ‘బి’ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), కమలిని (వైస్ కెప్టెన్), మహంతి శ్రీ, ఇషావరి అవసారె, మిథిలా వినోద్, ఆయుశి శుక్లా, కేసరి ధృతి, పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ, పార్శవి చోప్రా, నందన, అనాది తాగ్డె, అనందిత, సుప్రియా అరెల, భారతి ఉపాధ్యాయ్. లీగ్ దశలోనే తెలంగాణ అవుట్ సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు కథ లీగ్ దశలోనే ముగిసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 0–7 గోల్స్ తేడాతో ఛత్తీస్‌గఢ్ జట్టు చేతిలో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో తెలంగాణ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 0–11 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తెలంగాణతో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ తరఫున దామిని ఖుస్రో, మధు సిదార్, శ్యామ్లీ రే 2 గోల్స్ చొప్పున చేయగా... అంజలి ఎక్కా 1 గోల్ సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ 15–0తో బెంగాల్ జట్టుపై, ఉత్తర ప్రదేశ్ 5–0తో ఉత్తరాఖండ్‌పై, గుజరాత్ 1–0తో అస్సాంపై గెలుపొందాయి. -
రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?.. సెలక్టర్లపై హర్భజన్ సింగ్ ఫైర్!
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టును ఎంపిక చేస్తే ఆటగాళ్లు ఇకపై రంజీలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డుకాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు రంజీ ట్రోఫీలో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 400 వికెట్ల మార్కు దాటాడు. తద్వారా రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.అయితే, 37 ఏళ్ల సక్సేనా ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియాకు ఆడలేకపోయాడు. 2005లో సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫు ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఆరంభించిన జలజ్.. పదకొండేళ్ల పాటు అదే జట్టుతో కొనసాగాడు. 2016-17 సీజన్ నుంచి కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న జలజ్ సక్సేనా ఇటీవల ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా జలజ్ సక్సేనా ఘనతను ప్రస్తావిస్తూ.. ‘‘రంజీ ట్రోఫీలో 400 వికెట్లు, 6000 పరుగులు. భారత్‌లోని జాతీయ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి. అయినప్పటికీ ఇతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదు.అతడొక చాంపియన్. నిలకడగా ఆడుతున్న ప్లేయర్. ఇంతకంటే.. ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు పోస్టుకు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?‘‘మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కనీసం ఇండియా-‘ఎ’ జట్టుకైనా అతడిని ఎంపిక చేయాల్సింది. ప్రస్తుత కాలంలో రంజీ ఆడటం పనికిరాని విషయంగా మారిపోయిందా?.. ఐపీఎల్ నుంచే ఆటగాళ్లను సెలక్ట్ చేస్తున్నారు’’ అంటూ భజ్జీ టీమిండియా సెలక్టర్ల తీరును ఘాటుగా విమర్శించాడు.కాగా టీమిండియా ఇటీవల స్వదేశంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టుల్లో క్లీన్‌స్వీప్ అయిన తొలి భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-‘ఎ’ జట్టు సైతం రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ దిశగా పయనిస్తోంది. చదవండి: Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు -
‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’.. మండిపడ్డ రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సహనం కోల్పోయాడు. అంపైర్ల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు మరీ ఇంత దిగజారాలా అంటూ సర్వీసెస్ జట్టు తీరును విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రుతురాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనభారత్-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అక్కడ రుతు స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలబడ్డాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు. ఆసీస్-‘ఎ’ జట్టుతో నాలుగు ఇన్నింగ్స్‌లో రుతురాజ్ చేసిన పరుగులు వరుసగా 0, 5, 4 ,11.దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్గాఇక రుతురాజ్ సారథ్యంలో భారత్-‘ఎ’ జట్టు ఇప్పటికే తొలి టెస్టులో ఓడి.. రెండో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర జట్టు తమ నాలుగో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడుతోంది. పుణె వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్వీసెస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ అయింది. 185 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 185 పరుగులకే కుప్పకూలింది. నిజానికి మహారాష్ట్ర ఈ మేర కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేయడానికి కారణం ఆ జట్టు కెప్టెన్ అంకిత్ బావ్నే. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో మహారాష్ట్ర టీమ్‌ను ముందుకు నడిపిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకంతో మెరిశాడు.సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 బంతులు ఎదుర్కొన్న అంకిత్.. 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, అతడు అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద రీతిలో అంకిత్ అవుట్క్రీజులో పాతుకుపోయిన అంకిత్ వికెట్ తీయాలన్న పట్టుదలతో ఉన్న సర్వీసెస్.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న తమ పేసర్ అమిత్ శుక్లాను రంగంలోకి దించింది.అతడి బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అంకిత్ విఫలమయ్యాడు. అంకిత్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభం రోహిలా చేతిలో పడ్డట్లు కనిపించింది. దీంతో సర్వీసెస్ అప్పీలు చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, రీప్లేలో మాత్రం.. ఫీల్డర్ చేతిలో పడే కంటే ముందే బాల్ నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.అయినప్పటికీ అంకిత్ బావ్నేను అవుట్‌గా ప్రకటించడంతో మహారాష్ట్ర కీలక వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో అంకిత్ అవుటైన తీరుపై రుతురాజ్ ఘాటుగా స్పందించాడు. ‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘లైవ్ మ్యాచ్‌లో.. దీనిని ఎలా అవుట్‌గా ప్రకటిస్తారు? అసలు అది క్యాచ్ అవుట్ అని అప్పీలు చేయడం కూడా నిజంగా సిగ్గుచేటు’’ అని మహారాష్ట్ర రెగుల్యర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మండిపడ్డాడు.ఇక రంజీ తాజా సీజన్లో ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లలో భాగంగా తొలుత కశ్మీర్‌తో మ్యాచ్ డ్రా చేసుకున్న మహారాష్ట్ర.. ఆ తర్వాత ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. మేఘాలయపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి గెలుపుబాట పట్టింది.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య Ruturaj Gaikwad was fuming with Ankit Bawne's controversial dismissal against Services #RanjiTrophy2024 Source: Gaikwad's Instagram story pic.twitter.com/HParORg3YQ— Vijeet Rathi (@vijeet_rathi) November 7, 2024 -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్‌ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు శుభారంభం లభించలేదు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు.ఏమైంది రాహుల్?రాహుల్ తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో నిరాశపరచడంతో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ కూడా చోటు దక్కింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అలవాటు పడేందుకు రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్ ప్రధాన జట్టుకంటే ముందే ఆస్ట్రేలియాకు భారత జట్టు మేనెజ్మెంట్ పంపింది. కానీ అక్కడ కూడా రాహుల్ తనకు దక్కిన అవకాశాన్ని అంది పుచ్చుకోలేకపోయాడు. నవంబర్ 22 నుంచి ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా దిగాడు. కానీ రాహుల్ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "మరి నీవు మారావా రాహుల్, ఎక్కడికి వెళ్లినా అంతేనా? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.కష్టాల్లో భారత్..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు కేవలం 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ మైఖల్ నీసర్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు. అతడితో పాటు వెబ్‌స్టార్ రెండు, స్కాట్ బోలాండ్ ఒక్క పడగొట్టాడు. భారత బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(52 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.చదవండి: BAN vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్ -
విజయం దిశగా ఆస్ట్రేలియా ‘ఎ’
మెక్కే (ఆ్రస్టేలియా): బౌలర్ల పట్టుదలకు బ్యాటర్ల క్రమశిక్షణ తోడవడంతో భారత్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఆ్రస్టేలియా ‘ఎ’ విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 208/2తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు 100 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.సాయి సుదర్శన్ (200 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా... దేవదత్ పడిక్కల్ (199 బంతుల్లో 88;6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ సాధికారికంగా ఆడటంతో ఒక దశలో భారత్ ‘ఎ’ 226/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. మిడిలార్డర్ కూడా రాణిస్తే... మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే అని భావిస్తే... కింది వరస బ్యాటర్లు కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేశారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు మెరిపించగా... బాబా ఇంద్రజిత్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (17), మానవ్ సుతార్ (6) నిలువలేకపోయారు. ఆ్రస్టేలియా ‘ఎ’ బౌలర్లలో ఫెర్గూస్ ఓ నీల్ 4, టాడ్ మర్ఫీ మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో కంగారూల ముందు 225 పరుగుల లక్ష్యం నిలవగా... శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (47 బ్యాటింగ్; 5 ఫోర్లు), మార్కస్ హారీస్ (36; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు విజయానికి మరో 86 పరుగులు చేయాల్సి ఉంది. మెక్‌స్వీనీతో పాటు వెబ్‌స్టర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ కాగా... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 195 పరుగులు చేసింది. -
Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆసీస్ టార్గెట్?
Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన రుతురాజ్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.సాయి సుదర్శన్ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా.. దేవ్‌దత్ పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.💯 for Sai Sudharsan Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSvIND pic.twitter.com/xIWxfavDFh— cricket.com.au (@cricketcomau) November 2, 2024ఆసీస్ టార్గెట్?ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన భారత్-ఎ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్ తీరుతో జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్ హ్యారిస్ 29, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.First runs for Australia A from Sam Konstas 👀Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSAvINDA pic.twitter.com/an2oO9LPH9— cricket.com.au (@cricketcomau) November 2, 2024తొలి ఇన్నింగ్స్‌లో మూకుమ్మడిగా విఫలంకాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ఆసీస్ ‘ఎ’ బౌలర్ బ్రెండన్ డగెట్ 6 వికెట్లు తీశాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్ కుమార్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59) ఆసీస్‌ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్ (13) ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), అభిమన్యు ఈశ్వరన్ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. తుదిజట్లుభారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.ఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IND A vs AUS A: సెంచరీకి చేరువగా సాయి సుదర్శన్
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 208/2గా ఉంది. సాయి సుదర్శన్ (96), దేవ్‌దత్ పడిక్కల్ (80) క్రీజ్‌లో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ (12), రుతురాజ్ గైక్వాడ్ (5) ఔటయ్యారు. రుతురాజ్ వికెట్ ఫెర్గస్ ఓ నీల్‌కు దక్కగా.. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 120 ఆధిక్యంలో కొనసాగుతుంది.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్‌స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్స్టాస్ 0, బాన్‌క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (36), నవ్‌దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
ఆరేసిన ముకేశ్ కుమార్.. 195 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా
భారత్-ఏ, ఆస్ట్రేలియా -ఏ మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మెక్కే వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (36), నవ్‌దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఏ.. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో 195 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్‌స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్స్టాస్ 0, బాన్‌క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.88 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 12, రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (33), దేవ్‌దత్ పడిక్కల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 13 పరుగులు వెనుకపడి ఉంది. -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్‌లో ఇలాతాజా ఎడిషన్‌లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్‌లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్‌కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్‌కు పోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్‌కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
DT: జట్లలో మార్పులు.. బంగ్లాతో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!
Duleep Trophy second round 2024: దులీప్ ట్రోఫీలో రెండో దశ మ్యాచ్‌ల కోసం భారత్ ‘ఎ’, ‘బి’, ‘డి’ జట్లలో పలు మార్పులు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం ఎంపికైన ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ఈ మేరకు కొత్త ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. టీమిండియాకు ఎంపికైన వారిలో ఒక్క సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే దులీప్ ట్రోఫీ మ్యాచ్ కోసం అందుబాటులో ఉండగా... శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్ మాత్రం తమ జట్లను వీడారు.‘బి’ టీమ్‌లో రింకూ సింగ్ఇక కొత్తగా ప్రకటించిన ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్‌కు చోటు దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల రషీద్ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. అదే విధంగా.. 2022లో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టులోనూ రషీద్ కీలక సభ్యుడు. ఇదిలా ఉంటే... రషీద్‌తో పాటు ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, షమ్స్ ములాలీ, ఆకిబ్ ఖాన్ ‘ఎ’ టీమ్‌లోకి ఎంపికయ్యారు.ఇక ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ‘బి’ టీమ్‌లో రింకూ సింగ్, సుయశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి ఎంపికవ్వగా...సర్ఫరాజ్ ఖాన్ టీమ్‌తో కొనసాగుతాడు. ఇండియా ‘సి’ టీమ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు కానీ ‘డి’ జట్టులో నిశాంత్ సంధు ఎంపికయ్యాడు.అనంతపురంలోనేగత మ్యాచ్‌లో ‘డి’ టీమ్‌లో ఉండి గాయపడిన తుషార్ దేశ్‌పాండే స్థానంలో విద్వత్ కావేరప్పను తీసుకున్నారు. కావేరప్ప గత మ్యాచ్ ‘ఎ’ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా ‘ఎ’, ‘డి’ మధ్య...‘బి’, ‘సి’ మధ్య రెండు మ్యాచ్‌లు అనంతపురంలోనే జరుగుతాయి. ఈ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా...భారత జట్టు సభ్యులకు ఈ నెల 12 నుంచి బెంగళూరులో సన్నాహక శిబిరం మొదలవుతుంది. ఇండియా-‘ఎ’ (అప్డేటెడ్)మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుమార్ కుశాగ్రా, అక్షయ్ వాడ్కర్, శస్వత్ రావత్, ప్రథమ్ సింగ్, తనూష్ కొటియాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, ఎస్కే రషీద్, షంస్ ములానీ, ఆఖిబ్ ఖాన్ఇండియా-బి(అప్డేటెడ్)అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థిఇండియా-సి(మార్పులు లేవు)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డి(అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, శరణ్ష్ జైన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విద్వత్ కావేరప్ప, హర్షిత్ రాణా, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్‌గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌గా ఎంపికయ్యాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్‌బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్‌లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్‌మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వైరల్ వీడియో
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. నవ్‌దీప్ బౌలింగ్‌లో పంత్ లెగ్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లో ఎగిరి సూపర్ క్యాచ్‌గా మలిచాడు. పంత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పంత్ పట్టుకున్న క్యాచ్ ఇండియా-ఏ బ్యాటర్ ఆవేశ్ ఖాన్‌ది. Flying Rishabh Pant with a terrific catch. 🙇♂️pic.twitter.com/kmwmextgKx— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024ఈ మ్యాచ్‌లో పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా-బి.. ఇండియా-ఏపై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి ఇండియా-బి విజయానికి పునాది వేసిన ముషీర్ ఖాన్‌కు (181) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్ ఖాన్, నవ్‌దీప్ సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు.275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆకాశ్‌దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. -
ముషీర్ ఖాన్ భారీ శతకం.. ఇండియా-ఏపై ఇండియా-బి విజయం
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-ఏపై ఇండియా-బి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి.. ముషీర్ ఖాన్ భారీ శతకంతో (181) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్.. నవ్‌దీప్ సైనీ (56) సహకారంతో ఆదుకున్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.కలిసికట్టుగా రాణించిన ఇండియా-బి బౌలర్లుఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఐదేసిన ఆకాశ్దీప్ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు.టార్గెట్ 275275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆ జట్టు 198 పరుగులకు ఆలౌటై, 76 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. The winning moment for India B. - A solid win to start Duleep Trophy for them, great booster for players. 👏pic.twitter.com/G1nJsxdTGB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024ఆఖర్లో ఆకాశ్‌దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనపీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. -
పోరాడుతున్న కేఎల్ రాహుల్
దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ టీమ్ ఎదురీదుతుంది. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (57).. కుల్దీప్ యాదవ్‌తో (8) కలిసి ఇండియా-ఏను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి ఇండియా-ఏ టీమ్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రాహుల్, కుల్దీప్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ గెలవాలంటే మరో 134 పరుగులు చేయాల్సి ఉంది. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో రాహుల్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మయాంక్ అగర్వాల్ 3, శుభ్‌మన్ గిల్ 21, రియాన్ పరాగ్ 31, ధృవ్ జురెల్ 0, తనుశ్ కోటియన్ 0, శివమ్ దూబే 14 పరుగులు చేశారు. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, నితీశ్ రెడ్డి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లు తీసి ఇండియా-బిని దెబ్బకొట్టాడు. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు.ఇండియా-బి తొలి ఇన్నింగ్స్: 321 ఆలౌట్, ముషీర్ ఖాన్ 181, నవ్‌దీప్ సైనీ 56, ఆకాశ్‌దీప్ 4/60ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్, రాహుల్ 37, మయాంక్ అగర్వాల్ 36, నవ్‌దీప్ సైనీ 3/60 -
తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్
దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో తడబడి మళ్లీ నిలదొక్కుకుంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్ ఖాన్ (181), నవ్‌దీప్ సైనీ (56) ఇండియా-బి ఆదుకున్నారు. ముషీర్ భారీ శతకంతో కదంతొక్కడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ.. ఇండియా-బి బౌలర్లు రెచ్చిపోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముకేశ్ కుమార్ (3/62), నవ్‌దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) ధాటికి ఇండియా-ఏ 231 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్‌మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ఇండియా-బి బ్యాటర్ ముషీర్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముషీర్ 6 బంతులు ఎదుర్కొని ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో దృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముషీర్‌తో పాటు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4) కూడా విఫలమయ్యారు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఇండియా-బి స్కోర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులుగా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (28), రిషబ్ పంత్ (24) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా-బి 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
భారత్ ‘ఎ’ 184 ఆలౌట్
గోల్డ్‌కోస్ట్: మరోసారి బౌలర్లు రాణించడంతో... ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టుపై భారత ‘ఎ’ మహిళల జట్టు పట్టు కోల్పోలేదు. 28 పరుగుల స్వల్ప ఆధిక్యం పొందిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ్రస్టేలియా ‘ఎ’ ఓవరాల్ ఆధిక్యం 192 పరుగులకు చేరుకుంది. మ్యాడీ డార్క్ (54 బ్యాటింగ్; 2 ఫోర్లు), లిల్లీ మిల్స్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత ‘ఎ’ జట్టు కెప్టెన్, ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకుంది. మిన్ను 20 ఓవర్లలో 6 మెయిడెన్లు వేసి 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ప్రియా మిశ్రా, సయాలీలకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత ‘ఎ’ జట్టు మరో 84 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లను కోల్పోయింది. శ్వేత సెహ్రావత్ (40; 3 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (32; 2 ఫోర్లు), సయాలీ (21; 2 ఫోర్లు) రాణించారు. -
ఆస్ట్రేలియా 212 ఆలౌట్.. ఇండియా 184
ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా మాయాజాలానికి ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బ్యాటర్లు నిలబడలేకపోయారు. భారత ‘ఎ’ మహిళల జట్టుతో గురువారం మొదలైన ఏకైక అనధికారిక టెస్టులో ఆ్రస్టేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 65.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిన్ను మణి 54 పరుగులిచ్చి 5 వికెట్లు... ప్రియా మిశ్రా 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ మన్నత్ కశ్యప్ దక్కించుకుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో ఓపెనర్ జార్జియా వోల్ (71; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మైట్లాన్ బ్రౌన్ (30; 2 ఫోర్లు), గ్రేస్ పార్సన్స్ (35; 3 ఫోర్లు) రాణించారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ కంటే ఘోరంగా 184 పరుగులకే చాపచుట్టేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్వేత సెహ్రావత్ (40; 3 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (32; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేట్ పీటర్సన్ ఐదు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఆసీస్-ఏ 28 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
భారత-ఏ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు జరుగనుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్‌లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..తొలి నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు క్వీన్స్‌ల్యాండ్ వేదికగా జరుగనుంది.రెండో నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు మెల్బోర్న్ వేదికగా జరుగనుంది.టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్- నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్‌లో జరుగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇలా..తొలి టెస్ట్- నవంబర్ 22-28 వరకు (పెర్త్‌లో)రెండో టెస్ట్- డిసెంబర్ 6-10 వరకు (అడిలైడ్‌లో)మూడో టెస్ట్- డిసెంబర్ 14-18 వరకు (బ్రిస్బేన్‌లో)నాలుగో టెస్ట్- డిసెంబర్ 26-30 వరకు (మెల్బోర్న్లో)ఐదో టెస్ట్- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్‌ను సమర్థించిన రవిశాస్త్రి -
INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ముషీర్ ఖాన్‌కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్‌తో తలపడుతోంది. ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు. అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్‌తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘దేశం మారితేనైనా ఫలితం ఉంటుందేమో!’
ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన 14వ సెంచరీ నమోదు చేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో కేవలం 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. డబుల్ సెంచరీ దిశగా బ్యాట్ ఝులిపిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్‌పై ప్రశంసలు కురిపిస్తున్న టీమిండియా అభిమానులు.. అదే సమయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారించి టీమిండియా టెస్టు జట్టు రేసులో ఎల్లప్పుడూ ముందే ఉన్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని కనికరించడం లేదు. ప్రధాన జట్టుకు ఈ ముంబై ఆటగాడిని ఎంపిక చేయడం లేదు. అయితే, ఇంగ్లండ్ లయన్స్‌తో స్వదేశంలో మూడు అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడే భారత-ఏ జట్టులో మాత్రం చోటిచ్చారు. ఇందులో భాగంగా వామప్ మ్యాచ్‌లో 96 పరుగులతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తొలి అనధికారిక టెస్టులో 55 పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకు ముందు సౌతాఫ్రికా గడ్డపై ఈ 26 ఏళ్ల ముంబై బ్యాటర్ మొత్తంగా 102 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరం కాగా సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు పిలుపునిస్తారని అతడి అభిమానులు భావించారు. కానీ మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్‌తో కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడంతో సర్ఫరాజ్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు సెంచరీ బాదిన తర్వాత నెట్టింట బీసీసీఐపై ట్రోలింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. ‘‘తన బ్యాటింగ్‌లో తార స్థాయికి వెళ్లిన తర్వాత .. రెండు- మూడు ఛాన్సులు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ జట్టు నుంచి తప్పిస్తారు. ఇదంతా భరించే బదులు.. అతడు ఉన్ముక్త్ చాంద్‌ను సంప్రదించి.. దేశం నుంచి వలస వెళ్లి.. అక్కడే క్రికెట్ ఆడుకుంటే మంచిది!! ఇక్కడుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌కు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాకపోవచ్చు. మన సెలక్టర్ల ఆలోచనలు ఏమిటో ఎవరికీ అర్థం కావు కదా. ఏదేమైనా అతడికి అన్యాయం జరుగుతుందనేది మాత్రం వాస్తవం’’ అంటూ ఫైర్ అవుతున్నారు. If you are him and not getting selected for test cricket,what are you thinking??? pic.twitter.com/uVzUfvNPTx — Irfan Pathan (@IrfanPathan) January 24, 2024 కాగా గత రంజీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున బరిలోకి దిగి సగటు 92.66తో 556 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 2021/22 సీజన్లో 982 పరుగులతో అతడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. HUNDRED FOR SARFARAZ KHAN...!!!! Hundred from just 89 balls against England Lions 🔥 India A lost 4 quick wickets in the space of 22 runs and then Sarfaraz show started - A special knock. pic.twitter.com/PDz5WGCfaj — Johns. (@CricCrazyJohns) January 25, 2024 ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఓవరాల్‌గా 65 ఇన్నింగ్స్‌లో 3751 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా మెరుగైన గణాంకాలు నమోదు చేస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం టీమిండియాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లి సెటిలయ్యాడు. యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా ఇదే గతి పట్టిస్తారేమోనంటూ అతడి అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్‌తో ఆఖరి రెండు మ్యాచ్‌లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్‌తో పోటీ పడనున్న ఈ టీమ్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్‌లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్‌లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో మ్యాచ్‌కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్‌తో మూడో మ్యాచ్‌కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
ఇంగ్లండ్‌పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన ఆర్సీబీ ప్లేయర్
ఓ ప్రాక్టీస్ మ్యాచ్, మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో లయన్స్.. భారత్-ఏ జట్టుతో తలపడుతుంది. పర్యటనలో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ పూర్తి కాగా (డ్రా).. ప్రస్తుతం తొలి అనధికారిక టెస్ట్ జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 338 పరుగులు వెనుకపడి ఉంది. వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటిదార్.. ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్‌లో భారత ఏ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ వరుస శతకాలతో విరుచుకుపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో లయన్స్‌పై 141 బంతుల్లో 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 111 పరుగులు చేసిన పాటిదార్.. ప్రస్తుతం జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో 132 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన విధ్వంసకర శతకం (140) బాదాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన పాటిదార్.. సహచరులు అభిమన్యు ఈశ్వరన్ (4), సాయి సుదర్శన్(0), సర్ఫరాజ్ ఖాన్ (4), ప్రదోష్ పాల్ (0), శ్రీకర్ భరత్ (15), మానవ్ సుతార్ (0), పుల్కిత్ నారంగ్ (18) విఫలమైనా ఒక్కడే భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. తుషార్ దేశ్‌పాండే (23) సహకారంతో కష్టాల్లో (95/7) ఉన్న జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పాటిదార్‌కు జతగా నవదీప్ సైనీ (3) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌ను 553 పరుగుల వద్ద డిక్లేర్ (8 వికెట్ల నష్టానికి) చేసింది. జెన్నింగ్స్ (154), జోష్ బోహన్నన్ (125) శతకాలతో సత్తా చాటగా.. అలెక్స్ లీస్ (73), మౌస్లీ (68), జాక్ కార్సన్ (53) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, సైనీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి మొదలవుతుంది. తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్‌కు చోటు దక్కలేదు. తర్వాతి మూడు టెస్ట్‌ల కోసం ప్రకటించే జట్టులో పాటిదార్ చోటు ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్
ముంబై: భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’పై గెలిచింది. ముందుగా భారత జట్టు 19.2 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష ఏడు పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఇసీ వాంగ్, క్రిస్టీ, మ్యాడీ, లారెన్ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి నెగ్గింది. ఇసీ వాంగ్ (28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ జట్టును విజయతీరానికి చేర్చింది. ఆంధ్ర అమ్మాయి బి.అనూష ఒక వికెట్ తీసింది. -
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత-ఏ జట్టు కెప్టెన్‌గా కేఎస్ భరత్
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సీనియర్లు రోహిత్, విరాట్ దూరంగా ఉండనుండగా.. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకానుంది. కాగా, భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగానే భారత-ఏ జట్టు కూడా పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే సీనియర్ జట్టుతో ఓ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుతుంది. భారత ఏ జట్టుకు ఆంధ్ర వికెట్‌కీపర్ కేఎస్ భరత్ నాయకత్వం వహించనున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత-ఏ జట్టు తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఆడబోయే రెండో టెస్ట్‌కు ముందు రెండో మ్యాచ్ జరుగనుంది. తొలి మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో దేశవాలీ స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, దేవ్‌దత్ పడిక్కల్,సాయి సుదర్శన్లకు చోటు లభించింది. రెండో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో జాతీయ జట్టు ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలకు అవకాశం లభించింది. తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ప్రదోష్ రంజన్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, పుల్కిత్ నారంగ్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, తుషార్ దేశ్‌పాండే రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, నవదీప్ సైనీ మూడు రోజుల ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ , ధ్రువ్ జురెల్ , ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పుల్కిత్ నారంగ్, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ. వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) జరిగిన తుది సమరంలో పాక్ 128 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు సైతం శుభారంభమే లభించినప్పటికీ, భారత ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (29), కెప్టెన్ యశ్ ధుల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టగా.. అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం జూనియర్ తలో 2 వికెట్లు, ముబాసిర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అయూబ్, ఫర్హాన్, తాహిర్‌లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్.. నాడు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్..!
కొలొంబో వేదికగా రేపు (జులై 23) జరుగబోయే 2023 ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. జులై 21న జరిగిన సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌ను, పాకిస్తాన్.. శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, ఇదే ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్‌లు గతంలో కూడా ఓసారి ఫైనల్లో తలపడ్డాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, 2013లో సింగపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత అండర్-23 జట్టును.. పాక్ అండర్-23 టీమ్ ఢీకొట్టింది. నాటి సమరంలో భారత్.. పాక్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. India will face Pakistan in the Emerging Asia Cup final tomorrow! The last time they met was in 2013 when India won the Trophy under Suryakumar Yadav. KL Rahul won the Player of the match award in the final for scoring 93* runs. pic.twitter.com/Kj8FhqpuNZ — Johns. (@CricCrazyJohns) July 22, 2023 నాడు పాక్‌ను మట్టికరిపించిన భారత జట్టుకు ప్రస్తుత టీమిండియా సభ్యుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించగా.. ప్రస్తుత భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ నాటి ఫైనల్లో అజేయమైన 93 పరుగులు చేసి, పాక్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సూర్య, కేఎల్ రాహుల్‌తో పాటు నాటి యంగ్ ఇండియాలో ప్రస్తుత భారత జట్టు సభ్యుడు అక్షర్ పటేల్, ప్రస్తుత యూఎస్ఏ ఆటగాడు స్మిత్ పటేల్ ఉన్నారు. అలాగే నాటి పాక్ జట్టులో ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (7) విఫలం కాగా.. మహ్మద్ రిజ్వాన్ (21), ఉమర్ వహీద్ (41), 10, 11వ నంబర్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాదిర్ (33), ఎహసాన్ ఆదిల్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బాబా అపరాజిత్ 3, సందీప్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెరో 2 వికెట్లు, సందీప్ వారియర్, అంకిత్ బావ్నే తలో వికెట్ పడగొట్టారు. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), మన్‌ప్రీత్ జునేజా (51 నాటౌట్) రాణించడంతో 33.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. -
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్‌సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్‌దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
సెమీస్‌లో యశ్ ధుల్ హాఫ్ సెంచరీ.. భారత్ 211 ఆలౌట్! పాక్ మాత్రం ఏకంగా..
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్‌లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో పాకిస్తాన్ ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్‌లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది. అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! Leading from the front 💪 50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z — FanCode (@FanCode) July 21, 2023 -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్‌లు ఇదివరకే సెమీస్‌కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్‌కు చేరిన భారత్, పాక్‌లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్, పాక్‌లకే ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్‌లో భారత్-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్‌లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
సాయి సుదర్శన్ అజేయ సెంచరీ
కొలంబో: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 క్రికెట్ టోర్నీ లీగ్ దశలో భారత్ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్ హంగార్గేకర్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్ సుథర్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) పాక్ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు అభిõÙక్ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్‌కు నికిన్ జోస్ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్‌కు కెపె్టన్ యశ్ ధుల్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం పొందింది. నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్ ‘ఎ’; బంగ్లాదేశ్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్ 23న జరుగుతుంది. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్‌కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్‌బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్‌కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్‌లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్‌లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
పాక్‌తో మ్యాచ్.. సంచలన స్పెల్‌తో మెరిసిన సీఎస్కే బౌలర్
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్‌లో సీఎస్కే పేసర్.. యువ బౌలర్ రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్లో రెండో బంతికి సయీమ్ అయూబ్‌ను డకౌట్గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్‌బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఎవరీ రాజ్‌వర్దన్ హంగర్గేకర్? నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్‌లో ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సీఎస్కే తరపున ఐపీఎల్లో ఆడాడు. అయితే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. Pace is Pace Yaar, right? 😉 Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS — FanCode (@FanCode) July 19, 2023 చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే సూపర్‌మార్కెట్ ఓనర్‌గా Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' -
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్‌లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్‌గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్‌లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలతో గ్రూప్ టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్‌లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
శతక్కొట్టిన యశ్ ధుల్.. ఆసియా కప్‌లో టీమిండియా బోణీ
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్‌ను మట్టికరిపించిన పాక్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్‌లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు. -
తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు
విశాఖ స్పోర్ట్స్: ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్ బ్యాట్‌తో సరదాగా బంతితో ఆడటం మొదలుపెట్టిన కె.నితీశ్‌కుమార్ రెడ్డి.. నేడు ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. చిరుప్రాయం నుంచే విశాఖ డివిజన్ క్లబ్ లీగ్స్‌లో సీనియర్ల ఆటను చూస్తూ వారి లాగే ఆడాలంటూ కలగనే వాడు నితీశ్. తండ్రి ముత్యాలరెడ్డి ఉద్యోగం సైతం విడిచి పెట్టి.. కుమారుడి క్రికెట్ కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు. కోచ్‌ల శిక్షణలో నితీశ్ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయికి ఎదిగాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్రా జట్టుకు ఆల్‌రౌండర్‌గా మారాడు. ఏసీఏ అకాడమీ వైపు అడుగులు.. నితీశ్‌కుమార్ వీడీసీఏ శిబిరాల నుంచి అండర్–12, 14 గ్రూపుల్లో జిల్లాకు ఆడటం మొదలుపెట్టాడు. నార్త్‌జోన్‌కు ఆడే సమయంలో అప్పటి జాతీయ జట్టు సెలక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ నితీశ్ ప్రతిభను గుర్తించారు. ఆయన ప్రోత్సాహంతో కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రికార్డు ఆంధ్రా తరఫున ఆడుతున్న నితీశ్ నాగాలాండ్‌తో జరిగిన పోటీలో ఏకంగా 345 బంతుల్లోనే 441 పరుగులు సాధించడం విశేషం. విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఏకంగా 26 వికెట్లు తీయడమే కాకుండా 176.41 సగటుతో 1,237 పరుగులు చేసి టోరీ్నలో రికార్డును నమోదు చేశాడు. ఇదే నితీశ్‌కు 2017–18 సీజన్లో బీసీసీఐ అండర్–16 ఉత్తమ క్రికెటర్‌గా జగన్మోహన్ దాలి్మయా అవార్డును సాధించిపెట్టింది. ఏసీఏ నుంచి బీసీసీఐ అవార్డు పొందిన తొలి క్రికెటర్ నితీశ్ కావడం.. విశాఖ క్రీడాకారులకు నూతనోత్తేజం ఇచ్చింది. అరంగేట్రం ఇలా.. నితీశ్ రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున తొలిసారిగా 2020లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మొదలెట్టాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరఫున 2021లో ఆడాడు. అదే ఏడాది సీజన్లోనే సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీలో పొట్టి ఫార్మాట్లో ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ టోరీ్నలో ఐదు దేశాల ఏ జట్లతో పాటు నేపాల్, ఒమన్, యూఏఈ సీనియర్ జట్లు ఆడనున్నాయి. ఐపీఎల్ అరంగేట్రం.. నితీశ్ కుమార్ 2023 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీశ్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నితీశ్ 2 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని నితీశ్.. 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. చాలా ఆనందంగా ఉంది అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అండర్–12లో టోర్నీలు ఆడే స్థాయికి చేరుకున్నాను. ఆ సమయంలోనే నాన్నకు విశాఖ నుంచి బదిలీ అయింది. నాన్న ఉదయపూర్ వెళ్లినా నా క్రికెట్ కెరీర్ గురించే ఆలోచించేవారు. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేశారు. అప్పుడు మా వాళ్లు కొందరు నాన్న ఏంటి ఇలా చేశారు అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ తరఫున తొలి క్రికెటర్‌గా బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మ విశ్వాసం పెంచింది. అన్ని ఫార్మాట్లలో మేటి టోర్నీలో ఆడటంతో పాటు ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్న చాలా సంతోíÙంచారు. భారత్–ఏ తరఫున ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో స్థానం సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా మరింత సాధన చేస్తా. – నితీశ్‌కుమార్ రెడ్డి -
రాణించిన బ్యాటర్లు.. కెప్టెన్ సెంచరీ.. సైనీ కూడా దంచికొట్టాడు!
సిల్హెట్: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. జయంత్ యాదవ్ (83; 10 ఫోర్లు)తో పాటు సౌరభ్ కుమార్ (55; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నవ్‌దీప్ సైనీ (50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జయంత్, సౌరభ్ ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించగా, సైనీ, ముకేశ్ కుమార్ (23 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఆఖరి వికెట్‌కు 68 పరుగులు జత చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన బంగ్లా ‘ఎ’ ఆటనిలిచే సమయానికి 49/2 స్కోరు చేసింది. షాద్మన్ ఇస్లామ్ (22 బ్యాటింగ్), మోమినుల్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్లు.. రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్
IND A VS BAN A 1st Unofficial Test: బంగ్లాదేశ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు (నవంబర్ 29) ప్రత్యర్ధిని 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చింది. సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) బంగ్లా పతనాన్ని శాశించారు. అనంతరం నిన్ననే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. తొలి రోజే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జోరు మీదుండిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) రెండో రోజు మరింత రెచ్చిపోయారు. ఇద్దరు భారీ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. జైస్వాల్ (145; 20 ఫోర్లు, సిక్స్), ఈశ్వరన్ (142; 11 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 283 పరుగులు జోడించారు. ఫలితంగా రెండో రోజు టీ విరామం సమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశ్ ధుల్ (20) ఔట్ కాగా.. తిలక్ వర్మ (6), సర్ఫరాజ్ ఖాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగతుంది. కాగా, భారత-ఏ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. వీటి అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆ దేశంలో పర్యటిస్తుంది. -
ఐదేసిన సౌరభ్ కుమార్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరిగిన మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో (5/103) చెలరేగడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ అద్భుతమైన పోరాటం కనబర్చి 302 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ జో కార్టర్ (230 బంతుల్లో 111; 12 ఫోర్లు, సిక్స్) అద్భుతమై శతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. డీన్ క్లీవర్ (60 బంతుల్లో 44; 9 ఫోర్లు), మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) తమ వంతు ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ (2/48), ఉమ్రాన్ మాలిక్ (1/62), శార్ధూల్ ఠాకూర్ (1/44), ముకేశ్ కుమార్ (1/39) రాణించారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. స్కోర్ వివరాలు.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్: 293 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 108, ఉపేంద్ర యాదవ్ 76; మ్యాథ్యూ ఫిషర్ 4/52) న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్ (మార్క్ చాప్మన్ 92, సోలియా 54; సౌరభ్ కుమార్ 4/48, రాహుల్ చాహర్ 3/53) భారత్-ఏ రెండో ఇన్నింగ్స్: 359/7 డిక్లేర్ (రజత్ పాటిదార్ 109, రుతురాజ్ 94, ప్రియాంక్ పంచల్ 62; రచిన్ రవీంద్ర 3/65) న్యూజిలాండ్-ఏ రెండో ఇన్నింగ్స్: 302 ఆలౌట్ (జో కార్టర్ 111, మార్క్ చాప్మన్ 45; సౌరభ్ కుమార్ 5/103) -
రజత్ పాటిదార్ అజేయ శతకం.. కివీస్ ముందు భారీ టార్గెట్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న మూడో అనధికర టెస్ట్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. రజత్ పాటిదార్ (135 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో, రుతురాజ్ (164 బంతుల్లో 94; 11 ఫోర్లు), కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (114 బంతుల్లో 62; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా కివీస్‌కు 406 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన కివీస్ (రచిన్ రవీంద్ర (12)).. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే మ్యాచ్ ఆఖరి రోజు (నాలుగో రోజు) మరో 396 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆటలో పాటిదార్, రుతురాజ్, పంచల్ చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 357 పరుగుల (7 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు, జో వాకర్ 2, సోలియా, కెప్టెన్ టామ్ బ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ఆటగాళ్లు చాప్మన్ (92), సోలియా (54) అర్ధ సెంచరీలతో రాణించడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ 2, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌటైంది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా, వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (76) అర్ధసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ 4, జో వాకర్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు, సోలియా, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కివీస్-ఏ భారత్-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. -
Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన
New Zealand A tour of India, 2022- Unofficial ODI Series- Sanju Samson: న్యూజిలాండ్- ఏ జట్టుతో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. కేఎస్ భరత్, తిలక్ వర్మ ఈ జట్టులో కూడా! ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన 16 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టులో తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్‌కు స్థానం దక్కింది. అదే విధంగా హైదరాబాదీ తిలక్ వర్మను కూడా ఈ జట్టుకు ఎంపిక చేశారు. కాగా వీరిద్దరు టెస్టు జట్టుకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సైతం ఈ వన్డే జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ఏ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా.. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో టెస్టు రెండో రోజు(శుక్రవారం) ఆట కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్ తర్వాత సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్‌లో భారత ఏ జట్టు.. కివీస్ ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ తమిళనాడులోని చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022కు ప్రకటించిన జట్టులో కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గా కూడా సంజూకు అవకాశం దక్కలేదన్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐపై సంజూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఏ’ జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించడం పట్ల స్పందిస్తూ.. ‘బాగానే కవర్ చేశారులే’ అంటూ మరోసారి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇండియా- ఏ జట్టు: సంజూ శాంసన్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ, రాజ్ అంగద్ బవా. చదవండి: కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. వెంకటేశ్ అయ్యర్‌కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ! -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. శతక్కొట్టిన రుతురాజ్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రారంభమైన మూడో అనధికర టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 75 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) మెరిశాడు. ఓపెనర్ ప్రియాంక్ పంచల్ (5), స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (0) విఫలం కాగా.. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (38), రజత్ పాటిదార్ (30) పర్వాలేదనిపించారు. వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (69) అజేయమైన అర్ధసెంచరీతో రాణించాడు. ఉపేంద్ర యాదవ్‌కు జతగా శార్ధూల్ ఠాకూర్ క్రీజ్‌లో ఉన్నాడు. కివీస్-ఏ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ 3 వికెట్లు పడగొట్టగా.. సీన్ సోలియా, జో వాకర్ తలో వికెట్ సాధించాడు. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్ అనంతరం కివీస్-ఏ భారత్-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. -
Ishan Kishan: సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔట్
Ishan Kishan Misses Century With 9 Runs.. టీమిండియా-ఏతో జరుగుతున్న నాలుగురోజుల అనధికారిక టెస్టులో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా-ఏ వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సారెల్ ఎర్వీ 85*, జుబేర్ హంజా 78* పరుగులతో క్రీజులో ఉన్నారు. 27 పరుగులు చేసిన పీటర్ మలన్ సైనీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు టీమిండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు.153 బంతులెదుర్కొన్న ఇషాన్ కిషన్ 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 91 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లో క్యూషిల్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హనుమ విహారి 63 పరుగులతో రాణించాడు. చదవండి: David Warner Ashes Series: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి -
Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు
Navdeep Saini Sends Off Stump Wicket Cartwheeling.. ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్ నవదీప్ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్ దాటికి స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. దక్షిణా ఇన్నింగ్స్ 92 వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ హెండ్రిక్స్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన 21వ ఓవర్ వేయడానికి వచ్చిన నవదీప్ సైనీ ఓవర్ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. పొరపాటున దాన్ని అంచనా వేయని హెండ్రిక్స్ వదిలేయడంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇంకేముంది స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది. అయితే పక్కనే ఉన్న మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌లు మాత్రం ఇంచుకూడా కదలకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Tour Of SA Delayed: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. టీమిండియా పర్యటన వాయిదా! ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి... Truly one of the most beautiful sights in cricket as Navdeep Saini uproots Beuran Hendricks' off stump. Marco Jansen however has been the 1st SA A batsmen to score 50 and is desperately hoping for the number 11 to just stay with him. SA A: 249/9#SAAvINDA pic.twitter.com/xPj1OlFJUq — Shaun (@Shaun_Analytics) December 1, 2021 -
హనుమ విహారి అర్థ సెంచరీ.. భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
బ్లూమ్‌ఫోంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. సారెల్ ఎర్వీ (41), పీటర్ మలాన్ (31), రేనార్డ్ (33) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ పోరెల్ 2, సౌరభ్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌కు నేడు ఆఖరి రోజు. -
మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా...
సిడ్నీ: గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. గతంలో తమ దేశంలో ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉండేదని... దానిని స్ఫూర్తిగా తీసుకొని ద్రవిడ్ భారత్‌లో ఫలితాలు సాధిస్తే తమ టీమ్ మాత్రం వెనుకబడిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు. ‘చరిత్రను చూస్తే యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది సీనియర్ టీమ్‌లోకి వచ్చేసరికి రాటుదేల్చే గొప్ప వ్యవస్థ ఆస్ట్రేలియా క్రికెట్లో ఉంది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లను నేను చూశాను. కానీ వారు దారితెన్నూ లేనట్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇంగ్లండ్ ఇందులో బాగా పని చేస్తుండగా భారత్ కూడా ఆసీస్‌ను వెనక్కి నెట్టేసింది. భారత్‌లో దీనిని రాహుల్ ద్రవిడ్ సమర్థంగా అమలు చేస్తున్నాడు. నిజానికి అతను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యవస్థను చూసి నేర్చుకొని భారత్‌లో దానిని తీర్చిదిద్దాడు’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు. -
బుమ్రా షాట్.. ఆసీస్ బౌలర్‌కు గాయం
సిడ్నీ : ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట జస్ప్రీత్ బుమ్రా అర్థసెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో బుమ్రా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ షాట్ పొరపాటున గ్రీన్ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గ్రీన్ పిచ్‌లోనే కూలబడ్డాడు. దీంతో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్ తన బ్యాట్‌ను పడేసి పరుగు పూర్తి చేయకుండా అతని వద్దకు పరిగెత్తాడు. అంపైర్ వెంటనే ఫిజియోను రప్పించడంతో మైదానంలో కాసేపు హైటెన్షన్ నెలకొంది. అయితే గ్రీన్ గాయం పరిస్థితి ఎలా ఉందనేది సమాచారం అందలేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే గ్రీన్ తొలి టెస్టు ఆడడం అనుమానమే. ఇప్పటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి టెస్టుకు దూరం కావడం.. మరో ఆటగాడు విన్ పుకోవిస్కి త్యాగి బౌన్సర్‌కు గాయపడడం.. తాజాగా గ్రీన్‌కు దెబ్బ తగలడంతో ఆసీస్ మేనేజ్మెంట్ ఆందోళనలో ఉంది. (చదవండి : సిక్స్‌తో బుమ్రా హాఫ్ సెంచరీ.. వీడియో వైరల్) కాగా తొలి రోజు ఆటలో భాగంగా భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్‌ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఆరంభించారు. కాగా, మయాంక్ ఆదిలోనే వికెట్ కోల్పోగా, పృథ్వీ షౠ(40) రాణించాడు. అనంతరం శుబ్‌మన్ గిల్(43) కూడా మెరిశాడు. ఆపై వరుసగా ఆరుగురు ఆటగాళ్లు విఫలం కాగా, బుమ్రా మాత్రం ఆత్మ విశ్వాసంతో ఆడాడు. సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.ఈ జోడి 71 పరుగులు జత చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సదర్లాండ్ బౌలింగ్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం. బుమ్రా హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్(22) పదో వికెట్‌గా ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) pic.twitter.com/vcKWypY4vv — Advitiya Srivastava (@Advitya08) December 11, 2020 -
త్యాగి బౌన్సర్.. ఆసీస్‌కే ఎందుకిలా?
సిడ్నీ : ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూజ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2014లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ వేసిన బౌన్సర్ హ్యూజ్ మెడకు బలంగా తగిలింది. దీంతో అతను మైదానంలోనే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయాడు. అలా మూడు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. హ్యూజ్ మరణవార్త ఆసీస్ క్రికెట్ చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోయింది. అప్పటినుంచి ఎక్కడో ఒక చోట ఇలా బౌన్సర్లు బ్యాట్స్మన్ల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎవరైనా ఒక బ్యాట్స్‌మెన్ బంతి వల్ల గాయపడితే అదే భయం వెంటాడుతుంది. (చదవండి : టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు) తాజాగా సిడ్నీ వేదికగా ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. కాగా బుధవారం ఆటలో చివరి రోజులో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. ఓపెనర్ విన్ పుకోవిస్కి 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను ఇండియా- ఏ బౌలర్ కార్తిక్ త్యాగి వేశాడు. త్యాగి వేసిన తొలి బంతి బౌన్స్ అయి పుకోవిస్కి హెల్మెట్ బాగాన్ని బలంగా తాకింది. బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఒత్తిడికి లోనైన పుకోవిస్కి క్రీజులోనే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తోటి ఆటగాళ్లు అతన్ని దగ్గరికి వచ్చి లేపడానికి ప్రయత్నించారు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు') వెంటనే ఫిజియో వచ్చి పుకోవిస్కిని పరిశీలించి పరీక్ష చేస్తే గాయం పరిస్థితి ఎంటనేది తెలుస్తుందని పేర్కొన్నాడు.దీంతో పుకోవిస్కి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.అయితే పుకోవిస్కి గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు అతను ఆడేది అనుమానంగానే ఉంది. దేశవాలి క్రికెట్లో యంగ్ టాలెంటెడ్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విన్ పుకోవిస్కి టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. (చదవండి : ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా) Fingers crossed for Will Pucovksi, who's retired hurt after this nasty blow to the helmet. Live scores from #AUSAvIND: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/pzEBTfipF2 — cricket.com.au (@cricketcomau) December 8, 2020 -
రాణించిన సాహా.. మ్యాచ్ డ్రా
సిడ్నీ : భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. భారత బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా (100 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ప్రాక్టీస్ చేసుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 286/8తో మంగళవారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 306/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆసీస్ ‘ఎ’ జట్టుకు 59 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ‘ఎ’ 61 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు పృథీ్వషా (19), శుబ్‌మన్ గిల్ (29) కాసేపే క్రీజులో నిలిచారు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (0) డకౌటయ్యాడు. హనుమ విహారి (28), కెప్టెన్ రహానే (28) ప్రాక్టీస్‌లో అదరగొట్టలేకపోయారు. పేసర్ మార్క్ స్టెకెటీ (5/37) భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోకుండా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. హారిస్ (25 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ నెల 11 నుంచి 13 వరకు పింక్‌బాల్‌తో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. సిడ్నీలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. -
ఆసీస్‌కు భారత్ జంబో బృందం!
ముంబై: వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు. యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్‌కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది. ‘జంబో సేన’ ఎందుకంటే... ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో పునరుద్ధరించనే లేదు. పైగా వెళ్లిన ప్రతీ ఒక్కరు క్వారంటైన్ కావాల్సిందే. దీంతో టూర్ మధ్యలో ఆటగాడు ఎవరైనా గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక విమానం (చార్టెడ్ ఫ్లయిట్) కావాలి. తీరా భర్తీ అయిన ఆటగాడు అక్కడికి వెళ్లాక జట్టుతో కలిసే అవకాశం కూడా ఉండదు. 14 రోజులు క్వారంటైన్లో గడపాల్సిందే. ఈ సమయంలో రెండు, మూడుసార్లు కోవిడ్ పరీక్ష చేస్తారు. ప్రయాణ బడలికలో కానీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కరోనాను పొరపాటున అంటించుకుంటే ఇంత వ్యయప్రయాసలోర్చి పంపిన ఆటగాడు ఆడే అవకాశం క్లిష్టమవుతుంది. ఇవన్నీ కూలంకశంగా పరిశీలించిన సీనియర్ సెలక్షన్ కమిటీ ఏకంగా జంబో సేనను పంపడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత బృందమే రెండు మూడు జట్లుగా ఏర్పడి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే సుదీర్ఘంగా సాగే ఈ టూర్ పూర్తిగా ఆటగాళ్ల వరకే పరిమితమవుతుంది. క్రికెటర్ల వెంట సతీమణులు, ప్రియసఖిలకు అనుమతి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో మాత్రం భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌పై నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసిన సంగతి తెలిసిందే. ముందుగా పొట్టి మ్యాచ్‌లు... కంగారూ గడ్డపై ముందుగా భారత్ మూడు పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టి20లు ముగిశాక... వన్డేలు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన తేదీలను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోగా తుది షెడ్యూల్‌ను భారత బోర్డుకు తెలియజేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా టెస్టు స్పెషలిస్టులైన చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు మ్యాచ్ ప్రాక్టీస్ ఏర్పాట్లపై బోర్డు దృష్టి పెట్టింది. ఐపీఎల్లో అవకాశంరాని వీరిద్దరికి దేశవాళీ టోర్నీలు కూడా లేక ఎలాంటి ప్రాక్టీసే లేకుండా పోయింది. కరోనా తర్వాత అసలు బరిలోకే దిగలేని వీరి కోసం బోర్డు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసే పనిలో పడింది. సిడ్నీలో క్వారంటైన్? భారత జట్టు బ్రిస్బేన్‌లో అడుగు పెట్టినా... క్వారంటై న్ మాత్రం అక్కడ కుదరదు. క్వీన్స్లాండ్ ప్రభు త్వం కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల్ని అక్కడ బస చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో సిడ్నీ లేదంటే కాన్బెర్రాలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీఏ ఉన్నతాధికారులు న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
చివర్లో చేతులెత్తేశారు
క్రైస్ట్‌చర్చ్: విజయం కోసం 11 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన సమయంలో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 9 బంతుల్లో చివరి 4 వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. న్యూజిలాండ్ ‘ఎ’తో ఆదివారం ఇక్కడ జరిగిన అనధికారిక మూడో వన్డేలో భారత్ ‘ఎ’ 5 పరుగుల తేడాతో ఓడింది. ఛేదనలో ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు) పోరాటం వృథా అయింది. ఫలితంగా కివీస్ 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మ్యాన్ (110 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్), టాడ్ ఆస్టల్ (56; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఇషాన్ పోరెల్ మూడు వికెట్లు తీయగా... రాహుల్ చహర్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (55; 8 ఫోర్లు, సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (44; 6 ఫోర్లు) రాణించారు. జామీసన్ 4, ఎజాజ్ పటేల్ 3 వికెట్లతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. -
భారత్ ‘ఎ’ ఓటమి
క్రైస్ట్‌చర్చ్: భారత ‘ఎ’ జట్టుకు న్యూజిలాండ్ పర్యటనలో తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన రెండో అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 29 పరుగుల తేడాతో ఓడింది. తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 295 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ వర్కర్ (135; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ 3 వికెట్లు ... సిరాజ్ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసి ఓడిపోయింది. మయాంక్ అగర్వాల్ (37; 2 ఫోర్లు, సిక్స్), ఇషాన్ కిషన్ (44; 2 ఫోర్లు, సిక్స్), విజయ్ శంకర్ (41; 2 ఫోర్లు, సిక్స్), కృనాల్ పాండ్యా (51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా కీలకదశలో అవుటవ్వడంతో భారత్ ‘ఎ’ లక్ష్యానికి దూరంలో నిలిచింది. -
వన్డేనే కానీ... ధనాధన్
లింకన్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ ‘ఎ’తో వన్డే మ్యాచ్ ఆడినప్పటికీ భారత్ ‘ఎ’ బ్యాట్స్‌మెన్ ధనాధన్ మెరుపులు మెరిపించారు. దీంతో తొలి అనధికారిక వన్డేలో భారత్ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 30వ ఓవర్ ముగియక ముందే లక్ష్యాన్ని చకచకా ఛేదించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా కివీస్ ‘ఎ’ 48.3 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (49; 4 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ బ్రూస్ (47; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ (3/33) ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘ఎ’ 29.3 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) దడదడలాడించారు. విజయ్ శంకర్ (20 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) కూడా రాణించారు. నీషమ్‌కు 2 వికెట్లు దక్కాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో అనధికారిక వన్డే రేపు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
శుబ్‌మన్ మళ్లీ శతకం మిస్
మైసూర్: యువ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ (137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో అతడు శతకానికి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ 90 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో అతడికి తోడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) రాణించడంతో భారత్ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (6) త్వరగానే వెనుదిరిగినా... శుబ్‌మన్, నాయర్ మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులైన పేసర్లు ఫిలాండర్, ఇన్‌గిడి, స్పిన్నర్ ముతుస్వామిలను దీటుగా ఎదుర్కొన్నారు. సిపామ్లా బౌలింగ్‌లో గిల్ పెవిలియన్ చేరాక... కరుణ్‌కు కెపె్టన్ వృద్ధిమాన్ సాహా (86 బంతుల్లో 36; 5 ఫోర్లు) సహకారం అందించాడు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు వీరు 67 పరుగులు జోడించారు. వెలుతురు సరిగా లేని కారణంగా మంగళవారం 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. -
మెరిసిన సామ్సన్, శార్దుల్
తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన చివరి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ మెరుపులు... బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్ (3/9) విజృంభణ భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (36 బంతుల్లో 51; 5ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హెండ్రిక్స్ ( 59; 10 ఫోర్లు) రాణించాడు. -
మెరిసిన శ్రేయస్ అయ్యర్, ఖలీల్
అంటిగ్వా: బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ (3/16) మెరిపించడంతో... వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ 48.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ ‘ఎ’ 22 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అయ్యర్, ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (63 బంతుల్లో 34; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. విండీస్ ‘ఎ’ బౌలర్లలో అకీమ్ జోర్డాన్ (4/43), రోస్టన్ ఛేజ్ (4/19) రాణించారు. అనంతరం విండీస్ ‘ఎ’ భారత బౌలర్ల ధాటికి 35.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో జొనాథన్ కార్టర్ (41 నాటౌట్), రావ్మన్ పావెల్ (40 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పియరీ (12) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, రాహుల్ చహర్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు. -
ప్రియాంక్, అభిమన్యు భారీ సెంచరీలు
బెల్గామ్: ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్ (261 బంతుల్లో 160; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిమన్యు ఈశ్వరన్ (250 బంతుల్లో 189 బ్యాటింగ్; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో శనివారం మొదలైన తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో వికెట్ నష్టానికి 376 పరుగులు సాధించింది. ప్రియాంక్, అభిమన్యు తొలి వికెట్‌కు ఏకంగా 352 పరుగులు జోడించడం విశేషం. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో ప్రియాంక్ వికెట్ కీపర్ డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం అభిమన్యుతో కలిసి జయంత్ యాదవ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
యువ క్రికెటర్లకు సామాజిక శిక్షణ
న్యూఢిల్లీ: సచిన్‌ను చూసి బ్యాట్ పట్టడం, ధోనిని చూసి వికెట్ కీపర్ కావడం... క్రికెటే లోకమనుకుంటున్న టీనేజ్ క్రికెటర్ల సామాజిక వికాసానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టనుంది. భారత్ ‘ఎ’, అండర్–19 జట్లను విశేషంగా తీర్చిదిద్దుతున్న కోచ్ ద్రవిడ్ ఇటీవల కుర్రాళ్లలో క్రికెట్‌తో పాటు సామాజిక ప్రవర్తనను మెరుగు పరచాలని సూచించారు. వారి దైనందిన జీవన వికాసానికి, భవిష్యత్తుకు ఉపయోగపడేలా కుర్ర క్రికెటర్లకు ఒకేషనల్ ట్రెయినింగ్ ఇస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... ద్రవిడ్ సూచనలకు మద్దతు తెలిపారు. అండర్–16 ఆటగాళ్లకు క్రికెట్ తప్ప మరే ధ్యాస ఉండటం లేదని అర్థమైందని, దీంతో బోర్డు వారి క్రికెట్, క్రికెటేతర భవిష్యత్తుకు బంగారుబాట పరిచేందుకు సిద్ధంగా ఉందన్నారు. -
భారత్ ‘బి’ జట్టుకు టైటిల్
తిరువనంతపురం: అండర్–19 నాలుగు జట్ల క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘బి’ జట్టు విజేతగా నిలిచింది. భారత్ ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 72 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ ‘బి’ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 232 పరుగులు సాధించింది. హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (38; 3 ఫోర్లు)తోపాటు రాహుల్ చంద్రోల్ (70; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమీర్ రిజ్వీ (67; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం భారత్ ‘ఎ’ జట్టు 38.3 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత్ ‘బి’ బౌలర్లలో సుశాంత్ మిశ్రా (4/41), కరణ్ లాల్ (3/25) ఆకట్టుకున్నారు. -
భారత అండర్–19 జట్ల శుభారంభం
తిరువనంతపురం: నాలుగు జట్ల అండర్–19 వన్డే సిరీస్‌లో ఆతిథ్య భారత్ ‘ఎ’... ‘బి’ జట్లు శుభారంభం చేశాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్–19 ‘ఎ’ జట్టు 157 పరుగుల తేడాతో... అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ‘బి’ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ బృందం సరిగ్గా 50 ఓవర్లలో 251 పరుగులు సాధించింది. కమ్రాన్ ఇక్బాల్ (60; 3 ఫోర్లు), శాశ్వత్ రావత్ (64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 35.4 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. భారత ‘ఎ’ బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్ష దూబే మూడేసి వికెట్లు తీశారు. అఫ్గానిస్తాన్‌తో పోరులో భారత ‘బి’ జట్టు 107 పరుగుల లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. హైదరాబాద్ ఆటగాడు, ఓపెనర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ (70 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ చంద్రోల్ (51 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో... తిలక్ వర్మ, రాహుల్ క్రీజులో నిలదొక్కుకొని అభేద్యంగా 102 పరుగులు జోడించి భారత్ విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు అఫ్గానిస్తాన్ జట్టు 47.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. భారత ‘బి’ బౌలర్లలో పూర్ణాంక్ త్యాగి (4/36), ప్రయాస్ రే బర్మన్ (3/10), అథర్వ (2/18) ఆకట్టుకున్నారు. -
మార్కండే స్పిన్‌కు లయన్స్ విలవిల
మైసూర్: లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (5/31) మణికట్టు మాయాజాలానికి ఇంగ్లండ్ లయన్స్ తోక ముడిచింది. రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మరో రోజు మిగిలుండగానే భారత్ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 24/0తో ఫాలోఆన్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 53.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో లయన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఓపెనర్ బెన్ డకెట్ (50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా, లోయర్ మిడిలార్డర్లో లూయిస్ గ్రెగరీ (44; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ బిల్లింగ్స్ 20 పరుగులు చేయగా, భారత బౌలర్ల ధాటికి ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 40 పరుగుల వద్ద జలజ్ సక్సేనా బౌలింగ్‌లో హోల్డన్ (7) వికెట్‌తో మొదలైన పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. 140/5 స్కోరుతో ఉన్న లయన్స్ జట్టు... మార్కండే మాయాజాలం మొదలుకాగానే 40 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. జలజ్ సక్సేనా 2, నవదీప్ సైని, షాబాజ్ నదీమ్, వరుణ్ అరోన్ తలా ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లోని భారత్ ‘ఎ’... లయన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌట్ చేసింది. -
కుప్పకూలిన లయన్స్
మైసూర్: ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. ఇరు జట్ల బౌలర్లు శాసించిన రెండో రోజు ఆటలో భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం లభించింది. గురువారం ఆటలో 17 వికెట్లు కూలాయి. మొదట 282/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (46; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జాక్ చాపెల్ 4, బ్రిగ్స్ 3 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ లయన్స్ 48.4 ఓవర్లలోనే 140 పరుగులకే కుప్పకూలింది. ఒలీ పోప్ (25; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగతావారంతా విఫలమయ్యారు. సైనీ, నదీమ్ చెరో 3 వికెట్లు, జలజ్ సక్సేనా, ఆరోన్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో భారత్‌కు 252 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లో పడిన లయన్స్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా... ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. హోల్డన్ (5 బ్యాటింగ్), డకెట్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు మరో 228 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశాలున్నాయి. -
భారీ స్కోరు దిశగా భారత్ ‘ఎ’
మైసూర్: టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో... ఇంగ్లండ్ లయన్స్‌తో బుధవారం మొదలైన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84.5 ఓవర్లలో మూడు వికెట్లకు 282 పరుగులు చేసింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ (222 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) సెంచరీ సాధించగా... లోకేశ్ రాహుల్ (166 బంతుల్లో 81; 11 ఫోర్లు) ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 179 పరుగులు జోడించడం విశేషం. రాహుల్ ఔటయ్యాక ప్రియాంక్ పాంచల్ (88 బంతుల్లో 50; 7 ఫోర్లు)తో కలిసి ఈశ్వరన్ రెండో వికెట్‌కు 73 పరుగులు జత చేశాడు. ఇన్నింగ్స్ 85వ ఓవర్లో ప్రియాంక్ ఔటయ్యాక తొలి రోజు ఆటను ముగించారు. కరుణ్ నాయర్ (33 బంతుల్లో 14 బ్యాటింగ్; ఫోర్, సిక్స్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో టామ్ బెయిలీ, జాన్ చాపెల్, డొమినిక్ బెస్ ఒక్కో వికెట్ తీశారు. -
భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ ‘డ్రా’
వాయనాడ్: ఒలివర్ పోప్ (122 బంతుల్లో 63; 10 ఫోర్లు), సామ్యూల్ హైన్ (178 బంతుల్లో 57; 7 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో... భారత్ ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ లయన్స్ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 20/0తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ 82 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఇద్దరు కెప్టెన్ల అంగీకారంతో ఆటను నిలిపి వేశారు. పోప్, హైన్ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 13న మైసూర్లో ప్రారంభమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన భారత ‘ఎ’ బ్యాట్స్‌మన్ ప్రియాంక్ పాంచల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్: 340; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 540/6 డిక్లేర్డ్; ఇంగ్లండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్: 214/5 (83 ఓవర్లలో) (ఒలివర్ పోప్ 63, సామ్యూల్ హైన్ 57, డకెట్ 30, హోల్డెన్ 29; జలజ్ సక్సేనా 2/41). -
భారత్ ‘ఎ’ 219/1
వాయనాడ్ (కేరళ): ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 219 పరుగులు సాధించింది. లోకేశ్ రాహుల్ (88 బ్యాటింగ్; 11 ఫోర్లు), ప్రియాంక్ పాంచల్ (89 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 171 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 303/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ 340 పరుగుల వద్ద ఆలౌటైంది. నవదీప్ సైనికి ఐదు వికెట్లు లభించాయి. -
భారత్ ‘ఎ’ క్లీన్‌స్వీప్
మౌంట్‌మాంగనీ: పేసర్ సిద్ధార్థ్ కౌల్ (4/37) విజృంభణతో భారత్ ‘ఎ’ వరుసగా మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ ‘ఎ’ జట్టును సునాయాసంగా ఓడించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన అనధికారిక వన్డేలో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అన్మోల్ప్రీత్ సింగ్ (80 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా, అంకిత్ బావ్నె (49 బంతుల్లో 48; 7 ఫోర్లు), ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (43 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఇషాన్ కిషన్ (54 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో కౌల్, కృష్ణప్ప గౌతమ్ (2/40) దెబ్బకు కివీస్ ‘ఎ’ 44.2 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. సీఫ్రెట్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే నిలవగలిగాడు. దీంతో ¿ -
భారత్ ‘ఎ’ 323
వాన్గరి: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతోన్న మూడో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 248/4తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 75 పరుగులు జతచేసి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 62; 7 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకం పూర్తి చేసుకోగా... విజయ్ శంకర్ (98 బంతుల్లో 71; 8 ఫోర్లు, సిక్స్) క్రితం రోజు స్కోరుకు 11 పరుగులు జోడించి ఔటయ్యాడు. చివర్లో కేఎస్ భరత్ (47 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును దాటింది. అనంతరం తొలి ఇన్నిం గ్స్ ప్రారంభించిన కివీస్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా... గౌతమ్‌కు ఓ వికెట్ దక్కింది. -
మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్
ముంబై: ఓపెనర్ స్మృతి మంధాన (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన ఆటకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలవడంతో... తొలి అనధికారిక టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుపై భారత మహిళల ‘ఎ’ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సాధికార విజయం సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్... నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. హీథర్ గ్రాహం (43), స్టాలెన్‌బర్గ్ (39), మే మెక్‌గ్రాత్ (31) రాణించారు. ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్ (4), వికెట్ కీపర్ తానియా భాటియా (0) విఫలమైనా, మంధాన, కౌర్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి లక్ష్యాన్ని తేలిక చేశారు. వీరు వెనుదిరిగాక వస్త్రాకర్ (21 నాటౌట్), దీప్తి శర్మ (11 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. -
భరత్ సెంచరీ
బెంగళూరు: ఆంధ్ర బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ సెంచరీతో (106; 12 ఫోర్లు, సిక్స్) అదరగొట్టాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (52; 5 ఫోర్లు) బ్యాటింగ్‌లో రాణించాడు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టుకు 159 పరుగుల ఆధిక్యం లభించింది. సోమవారం 223/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ కాసేపటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన భరత్, శుభ్‌మన్ గిల్ (50; 7 ఫోర్లు)కు జతయ్యాడు. ఇద్దరు కలిసి స్కోరును 300 పరుగులకు చేర్చారు. అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే గిల్ నిష్క్రమించగా... గౌతమ్ (20), కుల్దీప్ యాదవ్‌ల అండతో శ్రీకర్ శతకాన్ని సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. -
భారత్ ‘ఎ’ 223/3
బెంగళూరు: ఓపెనర్లు రవికుమార్ సమర్థ్ (83; 8 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (86; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో భారత్ ‘ఎ’ దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 123 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (30 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 290/6తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసీస్ 109 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్‡్ష (113; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. -
ఆస్ట్రేలియా ‘ఎ’ 290/6
బెంగళూరు: భారత్ ‘ఎ’తో మొదలైన రెండో అనధికారిక 4 రోజుల టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది. మిచెల్ మార్‡్ష (86 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... హెడ్ (68; 10 ఫోర్లు), కుర్తీస్ ప్యాటర్సన్ (48; 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మార్‡్ష, నాసెర్ (44 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
భారత్ ‘ఎ’ లక్ష్యం 262
బెంగళూరు: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. చేతిలో మరో 8 వికెట్లు ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే చివరి రోజు ఇంకా 199 పరుగులు చేయాలి. మయాంక్ అగర్వాల్ (25 బ్యాటింగ్), అంకిత్ బావ్నే (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 42/1తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ 83.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (40; 5 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (87; 13 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ 3, గౌతమ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 243; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 274; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 292 (హెడ్ 87, ఉస్మాన్ ఖాజా 40; మొహమ్మద్ సిరాజ్ 3/77); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 63/2 (20 ఓవర్లలో). -
భారత్ ‘ఎ’ 274 ఆలౌట్
బెంగళూరు: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ బ్యాట్స్‌మన్ అంకిత్ బావ్నే (159 బంతుల్లో 91 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటై 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. ఖాజా (16 బ్యాటింగ్), హెడ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో మరో 9 వికెట్లున్న ఆసీస్ ప్రస్తుతం 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
భారత్ ‘ఎ’ను గెలిపించిన రాయుడు
బెంగళూరు: ఫిట్నెస్ పరీక్ష యో–యోలో అర్హత ప్రమాణాలు అందుకుని బరిలో దిగిన తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (107 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. అజేయ అర్ధశతకంతో భారత్ ‘ఎ’ను గెలిపించాడు. రాయుడితో పాటు బౌలింగ్‌లో సిరాజ్ (4/68) రాణించడంతో నాలుగు జట్ల టోర్నీ లో భాగంగా గురువారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా ‘ఎ’ను ఓడించింది. తొలుత ఆసీస్ జట్టు... సిరాజ్, కృష్ణప్ప గౌతమ్ (3/31) ధాటికి 31.4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. అగర్ (34) టాప్ స్కోరర్. కెప్టెన్ హెడ్ (28) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో ఎవాన్ రిచర్డ్సన్ (3/27) దెబ్బకు భారత్ ‘ఎ’ 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కృనాల్ పాండ్యా (49)తో కలిసి రాయుడు 109 పరుగులు జోడించాడు. దీంతో 38.3 ఓవర్లలోనే జట్టు విజయాన్ని అందుకుంది. మనీశ్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో... ఆలూరులో జరిగిన మరో మ్యాచ్‌లో భారత్ ‘బి’ డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా ‘ఎ’ 47.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ప్రసిద్ధ్ కృష్ణ (4/49), శ్రేయస్ గోపాల్ (3/42) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఛేదనలో మయాంక్ అగర్వాల్ (7), దీపక్ హుడా (4) విఫలమైనా... శుబ్‌మన్ గిల్ (42)తో కలిసి కెప్టెన్ మనీశ్ పాండే (95 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. శుబ్‌మన్ ఔటయ్యాక కేదార్ జాదవ్ (23), ఇషాన్ కిషన్ (24) అండగా ముందుకు నడిపించాడు. జట్టు స్కోరు 40.3 ఓవర్లలో 214/5 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ పద్ధతిలో భారత్ ‘బి’ గెలుపొందినట్లు ప్రకటించారు. కోహ్లి మళ్లీ నం.1 టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఈసారి కెరీర్ అత్యుత్తమ (937) పాయింట్లతో అతడు ఆ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో రాణించి... 934 పాయింట్లతో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (929)ను వెనక్కునెట్టి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. కానీ, రెండో టెస్టులో విఫలమవడంతో ఆ స్థానం చేజారింది. తాజాగా ముగిసిన మూడో టెస్టులో అద్వితీయంగా ఆడటంతో విరాట్ మళ్లీ టాప్‌లోకి వచ్చాడు. మరోవైపు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 51వ స్థానంలో, పేసర్ జస్ప్రీత్ బుమ్రా 37వ ర్యాంకులో ఉన్నాడు. -
భారత్ ‘ఎ’దే టెస్టు సిరీస్
బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత్ ‘డ్రా’గా ముగించింది. తొలి టెస్టులో గెలిచిన భారత్ ‘ఎ’ 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 294/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 25 పరుగులు జోడించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ (4/72) మరోసారి రాణించాడు. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 181 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడం... మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం కూడా లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. సంక్షిప్త స్కోర్లు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 345; దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 319 (హమ్జా 93, ఇర్వీ 58; సిరాజ్ 4/72, అంకిత్ రాజ్‌పుత్ 3/52, చహల్ 2/84); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 181/4 (51 ఓవర్లలో) (శ్రేయస్ అయ్యర్ 65, అంకిత్ బావ్నే 65 నాటౌట్; ఒలివియర్ 2/24, ముత్తుస్వామి 2/45). -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7
బెంగళూరు: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. కీలకమైన మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. 219/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 92.3 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డసెన్ (22; 2 ఫోర్లు), రూడీ సెకండ్ (47; 7 ఫోర్లు)లను భారత బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ ఔట్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకంజలోనే ఉంది. -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 219/3
బెంగళూరు: భారత్ ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమిండియాను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 59.5 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసింది. జుబైర్ హమ్జా (93; 15 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా... ఇర్వీ (58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం డసెన్ (18 బ్యాటింగ్), రూడీ సెకండ్ (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో చహల్ 2, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 322/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 23 పరుగులు మాత్రమే జతచేసి మిగతా 6 వికెట్లు కోల్పోయి 345 పరుగులకు పరిమితమైంది. ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (148; 14 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆంధ్రకే చెందిన వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ 34 పరుగులు చేశాడు. -
విహారి అజేయ సెంచరీ
బెంగళూరు: ఆంధ్ర రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి (138 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. విహారితో పాటు అంకిత్ బావ్నే (80; 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విహారితో పాటు మరో అంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ (30 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ విజయం
బెంగళూరు: రోజంతా ఆడి ‘డ్రా’తో గట్టెక్కాలని భావించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భారత ‘ఎ’ బౌలర్ల ధాటికి సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/56, 5/73) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టడంతో... ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 30 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు చాలా శ్రమించారు. మిగిలిన 6 వికెట్లు తీసేందుకు 88.5 ఓవర్ల పాటు కష్టపడ్డారు. మంగళవారం 99/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 128.5 ఓవర్లలో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. రూడి సెకండ్ (94; 15 ఫోర్లు), షాన్ వోన్ బెర్గ్ (50; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్ రజనీశ్ గుర్బాని (2/45) ఎట్టకేలకు ఈ జోడిని విడగొట్టడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 584/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈనెల 10 నుంచి రెండో అనధికారిక టెస్టు కూడా ఇక్కడే జరగనుంది. -
హడలెత్తించిన సిరాజ్
బెంగళూరు: అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటిన భారత్ ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకుంది. 338 పరుగులు వెనుకబడి సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ను హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/18) హడలెత్తించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆటకు మంగళవారం చివరి రోజు. ఓవర్‌నైట్ స్కోరు 411/2తో సోమవారం బరిలో దిగిన భారత్ ‘ఎ’... 584/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (220) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు.ఆంధ్ర బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (54; 3 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ సిరాజ్ ప్రతాపంతో ఆరు పరుగులకే ఎర్వీ (3), మలాన్ (0), జొండొ (0)ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హమ్జా (46 బ్యాటింగ్), ముత్తుస్వామి (41) నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆట ముగిసే సమయంలో సిరాజ్... ముత్తుస్వామిని ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు. -
‘శత’క్కొట్టిన విహారి, పృథ్వీ షా
నార్తంప్టన్: ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (131 బంతుల్లో 147; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు యువ సంచలనం పృథ్వీ షా (90 బంతుల్లో 102; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు 203 పరుగలతో వెస్టిండీస్ ‘ఎ’పై గెలిచింది. ఈ ఇద్దరు శతకాలతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వెస్టిండీస్ 37.4 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 4, చహర్ 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రిషభ్ పంత్ (5), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పర్చడంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో జతకట్టిన విహారి విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అలవోకగా బౌండరీలు బాదుతూ భాగస్వామ్యాన్ని పెంచుతూ పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఆ తర్వాత పృథ్వీ ఔటైనా మిడిలార్డర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన విహారి జట్టుకు భారీ స్కోరు అందించి ఇన్నింగ్స్ చివరి బంతికి వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో చెమర్ హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లక్ష్యంలో సగం పరుగులైనా చేయకుండానే ఆలౌటైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన భారత్ ‘ఎ’ సోమవారం జరిగే టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ ‘ఎ’తో తలపడనుంది. -
భారత్ ‘ఎ’ భారీ విజయం
హెడింగ్లీ:ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ‘ఎ’ క్రికెట్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 125 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ యువ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో పృథ్వీ షా(70;61 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(54; 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), ఇషాన్ కిషన్(50; 46 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించగా,విహారి(38), కృనాల్ పాండ్యా(34), అక్షర్ పటేల్(28 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. ఆపై 329 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎలెవన్ 36.5 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ క్రిచెల్లీ(40), బెన్ స్లాటర్(37), హాన్‌కిన్స్(27), విల్ జాక్స్(28)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. భారత ‘ఎ’ బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లతో రాణించగా,అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్యాలు తలో వికెట్ తీశారు. -
భారత్ ‘ఎ’ విజయాల హ్యాట్రిక్
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ‘ఎ’ 3–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డే ‘టై’గా ముగిసింది. అనంతరం భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుచుకుంది. ఐదో వన్డేలో ముందుగా న్యూజిలాండ్ ‘ఎ’ 44.2 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హెన్రీ నికోల్స్ (42; 2 ఫోర్లు), వర్కర్ (39; 2 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడారు. భారత బౌలర్లలో బాసిల్ థంపి 3 వికెట్లు తీశాడు. భారత్ 32.1 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (49; 6 ఫోర్లు, 1 సిక్స్), శార్దూల్ ఠాకూర్ (40; 3 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. -
అదే దూకుడు
విశాఖ స్పోర్ట్స్ : నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ఏ పై భారత్ ఏ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్‌గెలిచిన భారత్ ఏ ఆరువికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఏ 225 పరుగులకే చేతులెత్తెసింది. మిడిలార్డర్లో కొంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. నదీమ్ నలుగుర్ని పెవిలియన్‌కు పంపగా సిద్దార్థ్ మూడు, శార్దుల్ రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించారు. వొర్కెర్ సెంచరీ వృథా కాగా భారత్ ఏ తరఫున ఓపెనర్ అభిమన్యు 83 పరుగులు చేసి అనూహ్యంగా రనౌటై వెనుతిరిగాడు. శార్దుల్ హాట్రిక్‌ను మిస్ అయ్యాడు. సిరీస్ చిక్కింది భారత్ ఏ మరో మ్యాచ్ మిగిలివుండగానే న్యూజీలాండ్ ఏపై అనధికార వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దుకాగా రెండో వన్డే టైగా ముగిసింది. ఇక మూడు,నాలుగు వన్డేలను భారత్ ఏ జట్టే గెలవడంతో 2–0తోనే సిరీస్ చేజిక్కింది. ఆదివారం జరిగే చివరి వన్డే నామమాత్రమే కానుంది. గడిచిన రెండు మ్యాచ్‌లు డేనైట్‌గా సాగగా నాలుగో వన్డే మాత్రం షెడ్యూలు ప్రకారం ఉదయం తొమ్మిదిగంటలకే ప్రారంభం అయింది. కెప్టెన్ మారాడు... రెండు, మూడు వన్డేల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఏ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈసారి విశ్రాంతి తీసుకున్నాడు. జరిగిన రెండు వన్డేల్లో టాస్ ఓడిన కెప్టెన్ శ్రేయాస్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ టాస్ గెలిచాడు. ఈసిరీస్ తొలిసారి ఛేజింగ్ కంటే లక్ష్యాన్ని నిర్ధేశించడానికే మొగ్గు చూపాడు. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్‌ను రిషబ్ ఆడలేకపోయాడు. ఏడు బంతులాడినా కేవలం రెండే పరుగులు చేసిన ఈ వికెట్‌కీపర్ న్యూజిలాండ్ ఏ వికెట్‌కీపర్ బ్లండెల్‌కే కాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వొర్కెర్ సెంచరీ వృథా : న్యూజిలాండ్ ఏ 50 పరుగులకే కీలక ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. అయినా వొర్కెర్ మాత్రం నిలకడగానే ఆడుతూ పదకొండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. మరో రెండు సిక్సర్లుగా మలిచాడు. 108 పరుగులు చేసిన వొర్కెర్ చివరికి నదీమ్‌కు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. అంతా క్యాచ్‌లే.. భారత్ ఏ జట్టు ఆరువికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిమన్యు అనూహ్యంగా రనౌట్ కాగా మిగిలిన వారంతా క్యాచ్‌ల ద్వారానే వెనక్కి మళ్లారు. జట్టే మారింది... నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఏతో పాటు భారత్ ఏ జట్టు రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్‌ఏ జట్టులో ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు న్యూజిలాండ్ ప్రధానజట్టుకు అర్హత సాధించారు. ఇదిలా వుండగా భారత్ ఏ శిబిరంలోని 12వ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఈ సారి ఏకంగా ఓపెనర్‌గానే వచ్చి మెరుపులు మెరిపించాడు. సెంచరీ చేజార్చుకున్నా ఏడు బంతుల్ని బౌండరీకి తరలించాడు. ఇక రిజర్వ్ బెంచ్ ఆటగాడు ప్రశాంత్ చొప్రా సయితం భారత్ ఏ జట్టుకు ఓపెనర్‌గానే వచ్చాడు. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఈసారి ఏకంగా కెప్టెన్‌గానే మారిపోయాడు. హాట్రిక్ చేజారింది... మరో ఆరు ఓవర్లు మిగిలివున్నాయి. శార్దుల్ ఠాకుర్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి రెండు బంతులు విసిరిన అనంతరం అప్పటికే క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆస్టే›న్లను వెనక్కిపంపాడు. తర్వాతి బంతికే వికెట్‌ను తీయడంతో భారత్ శిబిరంలో ఒక్కటే ఉత్కంఠ. హాట్రిక్ చేసేందుకు సిద్ధమైన శార్దుల్ ఠాకుర్ ప్రయత్నం ఫలించలేదు. అయితే తర్వాత ఓవర్లో నదీమ్ వేసిన తొలిబంతికే వికెట్ తీయడంతో న్యూజిలాండ్ ఏ జట్టు పరాజయం పాలైంది. -
86 పరుగులు వ్యవధిలో 9 వికెట్లు!
విజయవాడ:న్యూజిలాండ్'ఎ'తో జరిగిన తొలి అనధికార టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని సాధించిన భారత్ 'ఎ'.. తాజాగా ముగిసిన రెండో అనధికార టెస్టులో సైతం ఇన్నింగ్స్ 26 పరుగుల విజయాన్ని అందుకుంది. చివరి రోజు ఆటలో భాగంగా మంగళవారం 104/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ మరో 106 పరుగులు చేసి మిగతా వికెట్లను చేజార్చుకుంది. భారత 'ఎ' స్పిన్నర్లు కరణ్ శర్మ, షెహబాజ్ నదీమ్ లకు దాటికి తలవంచిన న్యూజిలాండ్ 'ఎ' 86 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ 'ఎ' రెండో వికెట్ ను 124 పరుగుల వద్ద కోల్పోగా, 210 పరుగులకు ఆలౌట్ కావడం ఇక్కడ గమనార్హం. దాంతో డ్రా చేసుకునే అవకాశాన్ని న్యూజిలాండ్ 'ఎ' కోల్పోయి ఘోర ఓటమిని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్ లో కరణ్ శర్మ, నదీమ్ లు ఏ దశలోనూ న్యూజిలాండ్'ఎ' ను తేరుకోనీయకుండా చేసి భారత్ 'ఎ'కు మరో అద్భుతవిజయాన్ని అందించారు. కరణ్ శర్మ ఐదు వికెట్లతో కివీస్ రెక్కలను విరగగొట్టగా, నదీమ్ నాలుగు వికెట్లతో రాణించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్లను సాధించిన కరణ్ శర్మ భారత్ 'ఎ' విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్ లో కూడా కరణ్ శర్మ ఎనిమిది వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. తొలి అనధికార టెస్టును ఇన్నింగ్స్ తేడాతో భారత్ 'ఎ' విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 'ఎ' 2-0 తో ముగించింది. న్యూజిలాండ్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 210 ఆలౌట్ భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 447 ఆలౌట్ -
భారత్ 'ఎ' భారీ విజయం
విజయవాడ:న్యూజిలాండ్ 'ఎ'తో మూలపాడులోని ఏసీఏ మైదానంలో జరిగిన తొలి అనధికార టెస్టులో భారత్ 'ఎ' ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మూడో రోజు ఆటలో భాగంగా 64/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 'ఎ' 142 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 'ఎ'కు ఇన్నింగ్స్ విజయం లభించింది. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్, కరణ్ శర్మ తలో నాలుగు వికెట్లతో చెలరేగగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు భారత ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులు చేసింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యార్(108;97 బంతుల్లో14 ఫోర్లు 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (41 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించగా, సమర్థ్ (54) కూడా అర్ధ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 147 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
భారత్ ‘ఎ’ ఘనవిజయం
దక్షిణాఫ్రికా ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్ పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి రోజు మంగళవారం ఆటలో అంకిత్ రాజ్‌పుత్ (3/15), షాబాజ్ నదీమ్ (3/47) తమ బౌలింగ్‌తో బెంబేలెత్తించగా ఆతిథ్య జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 65.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. వీరి ధాటికి 138/4 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ప్రొటీస్ కేవలం 39 పరుగులకే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టుకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. స్టీఫెన్ కుక్ (196 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. గౌతమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ కరుణ్ నాయర్ (144 బంతుల్లో 90; 13 ఫోర్లు), ఓపెనర్ సమర్థ్ (90 బంతుల్లో 55; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో రాణించారు. -
భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
పోష్‌స్ట్రూమ్: భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. మూడో రోజు 181/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (82 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 9 పరుగులే జోడించి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో షాబాజ్ నదీమ్ (36) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. డేన్ పీడ్ 4, ప్యాటర్సన్ 3 వికెట్లు తీశారు. సఫారీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 52 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (55 బ్యాటింగ్; 7 ఫోర్లు), ఫెలుక్వాయో (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీ జట్టు 184 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
రాణించిన సమర్థ్: భారత్ ‘ఎ’ 181/3
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రవి సమర్థ్ (77), శ్రేయస్ అయ్యర్ (56 బ్యాటింగ్) అర్ధ సెంచరీలు సాధించగా, సుదీప్ ఛటర్జీ (46) రాణించాడు. కెప్టెన్ కరుణ్ నాయర్ (1) విఫలమయ్యాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్ నాలుగు, నవదీప్ సైని 3 వికెట్లు పడగొట్టారు. భారత్ ప్రస్తుతం మరో 141 పరుగులు వెనుకబడి ఉంది. -
అఫ్ఘానిస్తాన్‌పై భారత్ ‘ఎ’ విజయం
ప్రిటోరియా (దక్షిణాఫ్రికా): ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’ ఖాతాలో తొలి విజయం చేరింది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఓడిన భారత్ ‘ఎ’... శుక్రవారం అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన భారత ‘ఎ’ కెప్టెన్ మనీశ్ పాండే అప్ఘానిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అక్షర్ పటేల్ (3/33), విజయ్ శంకర్ (3/24), యజువేంద్ర చహల్ (2/42) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అప్ఘానిస్తాన్ ‘ఎ’ 40.5 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. అష్రఫ్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రహమత్ షా (35; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘ఎ’ 30.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరుణ్ నాయర్ (83 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మనీశ్ పాండే (52 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (10 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలిచారు. -
ఆ దిగ్గజం మాటలు నన్నెంతో మార్చాయి!
న్యూఢిల్లీ: గత ఐపీఎల్ సీజన్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలుసుకోవడం తనకెంతో కలిసొచ్చిందంటున్నాడు యువ సంచలనం బాసిల్ థంపి. ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌ను కలుసుకున్నప్పుడు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశారని గుజరాత్ లయన్స్ ఆటగాడు బాసిల్ థంపి తెలిపాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 'గత ఐపీఎల్ సీజన్ ముగుస్తుందనగా స్వయంగా సచిన్ పాజీ నాకు కాల్ చేసి రమ్మన్నారు. సచిన్‌ను కలిసిన సందర్భంగా.. నా ఆటతీరును మెచ్చుకున్నారు. నేను ఆడిన మ్యాచ్‌లను జాగ్రత్తగా గమనించినట్లు చెప్పారు. ఒత్తిడి సమయాల్లో నేను బౌలింగ్ చేసిన విధానం ఆకట్టుకుందని, మంచి భవిష్యత్తు ఉందని ప్రోత్సహించారని' థంపి వివరించాడు. కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి ఐపీఎల్ ప్రదర్శనతో ఆకట్టుకుని భారత్-ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో రెచ్చిపోయే థంపి, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా భారత్ ఏ జట్టులో అరంగేట్రం చేయనున్నాడు థంపి. తన కల నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సెలక్షన్ అనంతరం ఫిట్నెస్ పరీక్షల నిమిత్తం జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. అయితే భారత్ ఏ జట్టుకు ఎంపిక అనంతరం బంధువులు, సన్నిహితుల అభినందనలతో తన ఫోన్ మోత మోగిపోయిందని తెలిపాడు. అయితే ఐపీఎల్ వల్లే తనకు గొప్ప అవకాశం లభించిందని, జాతీయ జట్టులోనూ నిరూపించుకునేందుకు సిధ్దంగా ఉన్నట్లు థంపి చెప్పాడు. -
తడబడుతున్నారు
► రాణించిన శ్రేయస్ అయ్యర్ ► భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ 176/4 ► ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469/7 డిక్లేర్డ్ ముంబై: ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీనిస్తారనుకున్న భారత యువ క్రికెటర్లు బౌలింగ్‌లో ఇప్పటికే తేలిపోగా... బ్యాటింగ్‌లోనూ తడబడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ (93 బంతుల్లో 85 బ్యాటింగ్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే పటిష్టవైున ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. దీంతో రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్‌తో పాటు రిషభ్ పంత్ (3 బ్యాటింగ్) ఉన్నాడు. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (62 బంతుల్లో 36; 5 ఫోర్లు), అంకిత్ బానే (48 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా భారత్ ‘ఎ’ ఇంకా 293 పరుగులు వెనకబడి ఉంది. పేసర్ జాక్సన్ బర్డ్, స్పిన్నర్ లియోన్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. మరోవైపు కోహ్లి సేనతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్ కు ఫుల్ ప్రాక్టీస్ లభించినట్టయి్యంది. మిషెల్ మార్ష్ (159 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్), మ్యాథ్యూ వేడ్ (89 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ జట్టు 127 ఓవర్లలో 7 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సైనికి రెండు వికెట్లు దక్కాయి. మార్ష్, వేడ్ దూకుడు ఓవర్‌నైట్ స్కోరు 327/5తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌కు మిచెల్ మార్ష్,, వికెట్ కీపర్ వేడ్ కలిసి ఆరో వికెట్‌కు 129 పరుగుల అదు్భత భాగస్వామా్యన్ని అందించారు. తొలి రోజు కెపె్టన్ స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, శతకాలతో హోరెత్తించగా శనివారం మిషెల్ మార్ష్, వేడ్‌ల దూకుడు కొనసాగింది. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్ కొనసాగించారు. ఈ జోడిని విడదీసేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే 24.3 ఓవర్లపాటు నిలకడగా బ్యాటింగ్ చేసిన ఈ ద్వయాన్ని లంచ్ విరామానికి ముందు పార్ట్ టైమ్ బౌలర్ అఖిల్ హెర్వాడ్కర్ విడదీశాడు. రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చిన వేడ్ వెనుదిరగడంతో ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో మిచెల్ మార్‡్ష అవుటయా్యడు. మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 16 నాటౌట్), ఓ కీఫ్ (20 బంతుల్లో 8 నాటౌట్; 1 ఫోర్) క్రీజులో ఉండగా మరో 5.3 ఓవర్ల అనంతరం ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అయ్యర్ హవా ఆసీస్ నాణ్యవైున బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో భారత కుర్రాళ్లు ప్రారంభం నుంచే ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్పిన్నర్ నాథన్ లియోన్ రిటర్న్ క్యాచ్‌తో 19 పరుగుల వద్ద ఓపెనర్ అఖిల్ హెర్వాడ్కర్ (4) పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో మరో ఓపెనర్ ప్రియాంక్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. చాలా రోజులుగా జాతీయ జట్టులో స్థానం కోసం చూస్తున్న తను అందివచ్చిన అవకాశాన్ని అదు్భతంగా వినియోగించుకున్నాడు. తానెదుర్కొన్న తొలి బంతినే అయ్యర్ లాంగ్ ఆన్ లో భారీ సిక్స్‌గా మలిచాడు. అటాకింగ్ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ అతను ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్ల సహాయంతో బంతికో పరుగు చొప్పున సాధిస్తూ ఆసీస్‌ను వణికించాడు. 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అతను లియోన్ , ఓ కీఫ్, బర్డ్ బౌలింగ్‌ను ఆడుకున్నాడు. ప్రియాంక్‌తో కలిసి రెండో వికెట్‌కు 44, అంకిత్ బానేతో కలిసి మూడో వికెట్‌కు 57, పాండ్యా (57 బంతుల్లో 19; 2 ఫోరు్ల)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన అయ్యర్ జట్టు స్కోరును పెంచే ప్రయత్నంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇషాన్ (బి) సైనీ 25; రెన్ షా (సి) ఇషాన్ (బి) సైనీ 11; స్మిత్ (రిటైర్డ్ అవుట్) 107; షాన్ మార్ష్ (రిటైర్డ్ అవుట్) 104; హ్యాండ్స్కోంబ్ (సి) పాంచల్ (బి) పాండ్యా 45; మిషెల్ మార్ష్ (సి) సబ్ ఇంద్రజిత్ (బి) నదీమ్ 75; వేడ్ (సి) పంత్ (బి) హెర్వాడ్కర్ 64; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 16; ఓ కీఫ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (127 ఓవర్లలో 7 వికెట్లకు) 469. వికెట్ల పతనం: 1–33, 2–55, 3–211, 4–288, 5–305, 6–434, 7–454. బౌలింగ్: దిండా 21.2–1–78–0; పాండ్యా 22–3–84–1; సైనీ 19.4–7–42–2; నదీమ్ 33–1–126–1; అఖిల్ హేర్వాడ్కర్ 15–0–64–1; శ్రేయస్ అయ్యర్ 12–0–57–0; ప్రియాంక్ 4–0–11–0. భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: హెర్వాడ్కర్ (సి అండ్ బి) లియోన్ 4; ప్రియాంక్ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) లియోన్ 36; శ్రేయస్ బ్యాటింగ్ 85; బానే ఎల్బీడబ్లు్య (బి) బర్డ్ 25; పాండ్యా (సి) వేడ్ (బి) బర్డ్ 19; రిషభ్ పంత్ బ్యాటింగ్ 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (51 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–19, 2–63, 3–120, 4–172. బౌలింగ్: జాక్సన్ బర్డ్ 11–7–15–2; మిషెల్మార్ష్ 9–2–26–0; లియోన్ 17–3–72–2; ఓ కీఫ్ 14–1–59–0. -
సమర భేరికి సన్నాహకం
నేటి నుంచి భారత్ ‘ఎ’తో ఆసీస్ వార్మప్ మ్యాచ్ తమ బలాన్ని పరీక్షించుకోనున్న స్మిత్ సేన ముంబై: భారత గడ్డపై ఈసారి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలనే కసితో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహకాలను ప్రారంభించనుంది. నేటి (శుక్రవారం) నుంచి భారత్ ‘ఎ’ జట్టుతో స్మిత్ సేన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తమ బల నిరూపణకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఆడిన గత మూడు టెస్టు సిరీస్‌ల్లో ఆసీస్ జట్టును పరాజయాలే వెక్కిరించాయి. దీంతో ఈనెల 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆ జట్టు భావి స్తోంది. జట్టు కూర్పుతో పాటు భారత ఉపఖండంలోని బలమైన స్పిన్ బౌలింగ్‌లో తమ స్థాయిని పరీక్షించుకునేందుకు ఇదే సరైన అవకాశం. మరోవైపు భారత జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తా తెలుసుకునేందుకు ఎదురుచూస్తోంది. ముఖ్యంగా వన్డే, టి20ల్లో అదు్భతంగా రాణిస్తున్న యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశంగా భావించవచ్చు. కెపె్టన్ గానూ బరిలోకి దిగుతున్న అతను ఇందులో రాణిస్తే తొలి రెండు టెస్టుల తుది జట్టులో ఉంచేందుకు కోచ్ అనిల్ కుంబ్లే, కెపె్టన్ విరాట్ కోహ్లి మొగ్గు చూపించవచ్చు. ఆస్ట్రేలియా లాంటి నాణ్యవైున బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు యువ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రంజీల్లో దుమ్ము దులిపిన అతను బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ సెంచరీతో అదరగొటా్టడు. జాతీయ జట్టులో రిజర్వ్ ఓపెనర్‌గా చోటు దక్కించుకోవాలంటే ఇది అతనికి మంచి అవకాశం. కుర్రాళ్లకు భలే చాన్స్ దేశవాళీ టోర్నీల్లో సత్తా ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లకు పేసర్లు జోష్ హాజెల్‌వుడ్, మిషెల్ స్టార్క్‌లతో పాటు లియోన్ , ఓ కీఫ్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం ఈ మ్యాచ్ ద్వారా కలుగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ భారత్ ‘ఎ’ విశేషంగా రాణించింది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లపై సెలక్టర్లు కొంతకాలంగా దృష్టిసారించారు. తమ నిలకడైన ప్రదర్శనను మరోసారి కనబరచాలని ఈ యువ స్టార్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయ్యర్ గత సీజన్ లో 1300లకు పైగా పరుగులు సాధించి ముంబైకి 41వ రంజీ టైటిల్ అందించినా ఈసారి మాత్రం ఆ జోరును ప్రదర్శించలేకపోయాడు. అటు గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ అదే స్థాయిలో రాణించి ఈసారి తమ జట్టును తొలిసారి చాంపియన్ గా మార్చాడు. మిడిలార్డర్లో అంకిత్ బానే ఆడనున్నాడు. బౌలింగ్ విభాగంలో ఎడమ చేతి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, షాబాజ్ నదీంలతో పాటు మరో స్పిన్నర్ క్రిష్ణప్ప గౌతమ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ను ఏమేరకు నియంత్రించగలరనేది ఆసక్తికరం. బెంగాలీ సీనియర్ అశోక్ దిండా, నవదీప్ సైనీ, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌లతో పేస్ విభాగం కూడా బలంగా ఉంది. స్పిన్నర్లపైనే దృష్టి తొలి టెస్టుకు ముందు జరిగే సన్నాహక మ్యాచ్ కాబట్టి తుది జట్టు ఆటగాళ్లనే బరిలోకి దించా లా.. లేక కీలక పేసర్లకు విశ్రాంతి కల్పించాలా అనేది కోచ్ లీమన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్టీవెన్ , డేవిడ్ వార్నర్, ఖాజా, హాండ్స్కోంబ్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా అతి ముఖ్యవైున స్పిన్ విభాగంపై ఆసీస్ మరింత దృష్టి పెట్టింది. నలుగురు ప్రధాన స్పిన్నర్లు నాథన్ లియోన్ , ఓ కీఫ్, ఆస్టన్ అగర్, స్వెప్సన్ కాంబినేషన్ కీలకం కానుంది. ఎందుకంటే వీరి రాణింపుపైనే మును్మందు జరిగే టెస్టు సిరీస్‌లో ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అలాగే తొలిసారి భారత పర్యటనకు వచ్చిన రెన్ షా, స్వెప్సన్ , హ్యాండ్స్కోంబ్, అగర్, బర్డ్లకు ఇక్కడ పిచ్‌లు ఎలాంటి సవాల్ విసురుతాయో తెలుసుకునేందుకు ఈ మ్యాచ్‌ను చక్కటి అవకాశంగా వినియోగించుకోవచ్చు. ఏదేవైునా స్థానిక బ్రబౌర్న్ మైదానంలో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇది మాకో మంచి అవకాశం... ► సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ► ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్య ముంబై: భారత వన్డే, టి20 జట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారినా... ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. ఇంగ్లండ్ సిరీస్ కోసం జట్టులోకి ఎంపికైనా, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటి సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని అతను అన్నాడు. తనతో పాటు జట్టులో ఉన్న కుర్రాళ్లందరికీ ఇది మంచి అవకాశమని అతను వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ‘మా యువ ఆటగాళ్లందరికీ ఇదో మంచి అవకాశం. నేను కూడా ఇక్కడ బాగా ఆడితే టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కుతుందని నమ్ముతున్నా. దీనిని మేము ప్రాక్టీస్ మ్యాచ్‌లా చూడటం లేదు. సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇది సరైన వేదికగా భావిస్తున్నాం. దూకుడుకు మారుపేరైన ఆసీస్‌తో పోరు ఆసక్తికరంగా సాగవచ్చు’ అని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను టెస్టు ఆటగాడిగా ఎదిగే క్రమంలో పలు విషయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని, తనకు కోహ్లి, కుంబ్లే కూడా అండగా నిలుస్తున్నారని పాండ్యా వెల్లడించాడు. భారత ‘ఎ’ జట్టు సభ్యుడిగా కోచ్ రాహుల్ ద్రవిడ్నుంచి అనేక అంశాలు నేర్చుకోగలిగానని పాండ్యా అన్నాడు. జట్లు... భారత్ ‘ఎ’: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), అఖిల్ హెర్వాడ్కర్, ప్రియాంక్ పాంచల్, అయ్యర్, అంకిత్ బానే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ , షాబాజ్ నదీమ్, క్రిష్ణప్ప గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, అశోక్ దిండా, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, బాబా ఇంద్రజిత్. ఆసీస్: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), వార్నర్, అగర్, జాక్సన్ బర్డ్, పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ హాజెల్‌వుడ్, ఉస్మాన్ ఖాజా, నాథన్ లియోన్ , మిషెల్ మార్ష్, షాన్ మార్ష్ మ్యాక్స్‌వెల్, ఓ కీఫ్, రెన్ షా, స్టార్క్, స్వెప్సన్ , వేడ్. -
బంగ్లాను బాదేశారు
పాపం బంగ్లాదేశ్... మహా సమరానికి ముందు బేలగా మారిపోయింది. వార్మప్ మ్యాచ్‌లో తాము ప్రాక్టీస్ చేయాల్సింది పోయి ప్రత్యర్థికి భారీ బ్యాటింగ్ ప్రాక్టీస్ అందించింది. తొలి రోజు బ్యాటింగ్ వైఫల్యంతో అంతంత మాత్రం ప్రదర్శన ఇచ్చిన ఆ జట్టు రెండో రోజు బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. భారత ‘ఎ’ ఆటగాళ్లలో ముగ్గురు సెంచరీలతో కదం తొక్కగా, ఏకంగా 5.12 రన్‌రేట్‌తో జట్టు స్కోరు చేసింది. మొత్తంగా వరల్డ్ నంబర్‌వన్ టీమ్‌తో తలపడాల్సిన సమయంలో ఈ రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ బంగ్లాకు ఏమాత్రం కలిసిరాలేదు. ప్రియాంక్, శ్రేయస్, విజయ్ శంకర్ సెంచరీలు భారత్ ‘ఎ’ 461/8 డిక్లేర్డ్ చేతులెత్తేసిన బంగ్లా బౌలర్లు ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు ఆటగాళ్లు అదరగొట్టారు. రెండు రోజుల ఈ మ్యాచ్ సోమవారం ‘డ్రా’గా ముగియగా, ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్న మన బ్యాట్స్‌మెన్ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల ఆధిక్యం సాధించడం విశేషం. భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 461 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ప్రియాంక్ పాంచల్ (148 బంతుల్లో 103 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (81 బంతుల్లో 103 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (92 బంతుల్లో 100 రిటైర్డ్ అవుట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. నితిన్ సైని (85 బంతుల్లో 66; 8 ఫోర్లు) రాణించాడు. బంగ్లా బౌలర్లలో శుభాశిష్ రాయ్, తైజుల్ ఇస్లామ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 73 పరుగులు చేసింది. తమీమ్ (42 నాటౌట్) రాణించాడు. షకీబ్‌తో పాటు భారత్‌తో ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న ఇద్దరు ప్రధాన పేసర్లు తస్కీన్ అహ్మద్, కమ్రుల్ ఇస్లాం కూడా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌కు దిగలేదు. అయితే ప్రధాన స్పిన్నర్ అయిన మెహదీ హసన్ వేసిన 16 ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్ 92 పరుగులు బాదారు. భారీ భాగస్వామ్యం... ఓవర్‌నైట్ స్కోరు 91/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను పాంచల్, అయ్యర్ వేగంగా నడిపించారు. పాంచల్ నెమ్మదిగా ఆడగా, అయ్యర్ చెలరేగిపోయాడు. ఈ జోడీని విడదీయడానికి బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు సెంచరీ పూర్తి కాగానే అయ్యర్ రిటైర్డ్ అయి వెళ్లాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. మరి కొద్దిసేపటి తర్వాత పాంచల్ కూడా అయ్యర్‌ను అనుసరిస్తూ శతకం పూర్తి కాగానే ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో రిషభ్ పంత్ (19), జగ్గీ (23), ఇషాన్ (11), హార్దిక్ పాండ్యా (7) విఫలమయ్యారు. దాంతో జట్టు స్కోరు 7 వికెట్లకు 287 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో విజయ్ శంకర్, సైని చెలరేగిపోయారు. దూకుడుగా ఆడిన వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 115 పరుగులు జత చేశారు. సైని అవుటైన తర్వాత... భారత్ మొత్తం 90 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కుల్దీప్కు రెండు వికెట్లు... తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బంగ్లా ఓపెనర్లు మెరుగ్గా రాణించారు. తమీమ్‌కు జతగా సర్కార్ (25) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో సర్కార్, మోమినుల్ (0)లను అవుట్ చేసి బంగ్లాను దెబ్బ తీశాడు. మరో 2 ఓవర్ల తర్వాత ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్కే దక్కాలి!
ముంబై: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా-ఏపై ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేసిన స్యామ్ బిల్లింగ్స్ (85 బంతుల్లో 93; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ కీలక ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బిల్లింగ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. తన ఆటతీరుకు తమ మెంటర్ రాహుల్ ద్రవిడ్ కారణమని చెప్పాడు. గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ గా ఉన్న ద్రవిడ్ తన బ్యాటింగ్ టెక్నిక్స్ ను మెరుగు పరిచారని తెలిపాడు. 'బ్యాటింగ్ లో ముఖ్యంగా ఫుట్ వర్క్ సమస్యను అధిగమించాను. గతంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సమస్యలుండేవి. అయితే ద్రావిడ్ కోచింగ్ తో ఈ సమస్యలను అధిగమించాను. అశ్విన్, జడేజాలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు' అని బిల్లింగ్స్ కితాబిచ్చాడు. మొత్తానికి ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్ దేనని చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్.. ధోనీకి ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా అభిమానులు ఉన్నారని వివరించాడు. -
కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్‌లో.. ప్చ్..!
ముంబై: మహేంద్రసింగ్ ధోనీ సారథిగా వ్యవహరించిన చివరి మ్యాచ్‌లో సీనియర్ జట్టు పోరాడి ఓడింది. ఇంగ్లండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 304 పరుగులు చేసింది. కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడిన ధోనీ మునుపటి ఆటతీరును గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ఏ జట్టు 304 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎలెవన్‌కు విసిరింది. కెప్టెన్ జేజే రాయ్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ కూడా ధాటిగా ఆడింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్లలో బిల్లింగ్ అద్భుతంగా రాణించి 93 పరుగులు చేయగా, జేజే రాయ్ 62 పరుగులు సాధించాడు. ఓపెనర్ హేల్స్ 40 పరుగులు, బట్లర్ 46 పరుగులు, డాసన్ 41 పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అంతకుముందు రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. -
ఓపెనర్లను అవుట్ చేసిన కుల్దీప్
ముంబై: భారత్ ఏతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెవెన్ ఓపెనర్లు జేసన్ రాయ్ (62), అలెక్స్ హేల్స్ (40) జట్టుకు శుభారంభం అందించారు. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో హేల్స్, రాయ్ ఇద్దరూ క్యాచవుటయ్యారు. కాసేపటికే చహల్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు. 305 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ టీమ్ 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. -
మునుపటిలా రెచ్చిపోయిన ధోనీ
సెంచరీ చేసిన అంబటి రాయుడు యువీ, ధవన్ హాఫ్ సెంచరీలు ఇంగ్లండ్ లెవెన్‌తో భారత్ ఏ ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: ఇటీవల స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇరగదీశాడు. ఇంగ్లండ్ లెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ ఏ జట్టు భారీ స్కోరు సాధించింది. ముంబైలో మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. -
ధోని మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ!
ముంబై:ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పాడు. అయితే ధోని గౌరవార్థం ఒక మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కల్పించింది. ఈ మేరకు ఈరోజు (మంగళవారం)నుంచి నగరంలోని బ్రాబోర్న్ స్టేడియంలో మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి ఇంగ్లండ్‌తో జరిగే భారత్ -ఎ జట్టుకు ధోని చివరగా సారథ్యం వహించనున్నాడు. దీనిలో భాగంగా ఆ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్‌లను ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తరువాత కూడా అభిమానుల్ని ఫ్రీగా స్టేడియంలోకి పంపిచనున్నట్లు తెలిపింది. ఒకవేళ తొలిరోజు ఆటలో భాగంగా మధ్యాహ్నం గం.3.00 ని.లకు వారికి కేటాయించిన నార్త్, ఈస్ట్ స్టాండ్స్ నిండిపోయినట్లయితే గేట్లను మూసివేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
భారత్ ‘ఎ’ తరఫున ధోని బరిలోకి!
గత అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ ప్రాక్టీస్ కోసం భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు భారత్ ‘ఎ’తో జనవరి 10, 12న రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. 15 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. -
చివరి రోజు వర్షార్పణం
రెండో అనధికారిక టెస్టు డ్రా సిరీస్ కోల్పోయిన భారత్ ‘ఎ’ బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ చివరి రోజుకు వర్షం అడ్డుపడింది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో నాలుగో రోజు ఆదివారం ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా భారత్ ‘ఎ’ 0-1తో సిరీస్‌ను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ ‘ఎ’ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మూడో రోజు ఆటలో భారత్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్సలో 60 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. ఇన్నింగ్స పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 108 పరుగులు చేయాల్సి ఉండేది. అయితే వర్షం రూపంలో భారత్‌ను ఆదుకుంది. ఆసీస్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్సలో 124.1 ఓవర్లలో 435 పరుగులకు ఆలౌట్ అవగా భారత్ ‘ఎ’ జట్టు తమ తొలి ఇన్నింగ్సలో 169 పరుగులే చేయగలిగింది. -
ఆసీస్ 'ఎ'దే సిరీస్
బ్రిస్బేన్: భారత 'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 'ఎ' జట్టు గెలుచుకుంది. రెండో టెస్టులో భాగంగా చివరి రోజు ఆట వర్షం వల్ల సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ డ్రా ముగిసింది. దీంతో తొలి టెస్టులో గెలిచిన ఆసీస్ 'ఎ' 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 158/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు బ్యాటింగ్‌ను భారత్ కొనసాగించాల్సి వుంది. అయితే భారీ వర్షం పడటంతో చివరి రోజు ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్ డ్రా ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 169 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 435 భారీ పరుగులు చేసింది. -
భారత్ ‘ఎ’ ఎదురీత
ఆసీస్ ‘ఎ’తో అనధికారిక టెస్టు బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు ఎదురీదుతోంది. ఓపెనర్ అఖిల్ (188 బంతుల్లో 82 బ్యాటింగ్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్సలో 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోరుు 158 పరుగులు చేసింది. అఖిల్‌తో పాటు సంజూ శామ్సన్ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స పరాజయం నుంచి తప్పించుకోవాలంటే భారత్ 108 పరుగులు చేయాల్సివుం డగా... చేతిలో ఆరు వికెట్లున్నారుు. అంతకుముందు 319/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్సలో 124.1 ఓవర్లలో 435 పరుగుల వద్ద ఆలౌటైంది. కార్ట్‌రైట్ (117; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా, వైట్మన్ (51) అర్ధసెంచరీ చేశాడు. -
ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం
భారత్ ‘ఎ’తో అనధికారిక టెస్టు బ్రిస్బేన్: భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ’ఎ’కు పట్టు చిక్కింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్సలో 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 150 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కార్ట్‌రైట్ (153 బంతుల్లో 99 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్), నిక్ మ్యాడిసన్ (114 బంతుల్లో 81; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (79) చెలరేగారు. శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ఆ తర్వాత కోలుకుంది. కార్ట్‌రైట్, వెబ్‌స్టర్ ఐదో వికెట్‌కు 152 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు మ్యాడిసన్, ప్యాటర్సన్ మూడో వికెట్‌కు 92 పరుగులు జత చేసి పరిస్థితిని చక్కదిద్దారు. -
ఆదుకున్న హార్దిక్ పాండ్యా
భారత్ ‘ఎ’ 169/9 బ్రిస్బేన్: ఆసీస్ ‘ఎ’ పేస్ బౌలింగ్ ధాటికి తడబడిన భారత ‘ఎ’ జట్టును హార్దిక్ పాండ్యా (112 బంతుల్లో 79 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నాడు. దీంతో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్సలో 66 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోరుు 169 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభంలో ఆస్ట్రేలియా ‘ఎ’ పేసర్లు రిచర్డ్సన్ (3/37), బర్డ్ (3/53) చెలరేగడంతో భారత్ 46 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోరుు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లోయర్ ఆర్డర్లో పాండ్యాతో కలిసి జయంత్ యాదవ్ (28) కాసేపు పోరాడాడు. ఆట ముగిసే సమయానికి అరోన్ (0 బ్యాటింగ్), పాండ్యా క్రీజులో ఉన్నారు. -
భారత్ ‘ఎ’ పరాజయం
మూడు వికెట్లతో నెగ్గిన ఆసీస్ ‘ఎ’ బ్రిస్బేన్: 159 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టును 50 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ఇబ్బంది పెట్టిన భారత్ ‘ఎ’ బౌలర్లు చివరి రోజు మాత్రం చేతులెత్తేశారు. ఫలితంగా ఈ నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ లో ఆసీస్ ‘ఎ’ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆదివారం ఆటలో ఆసీస్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేయగలిగింది. శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిం చినా చివరి రోజు మిగిలిన ఆరు వికెట్లను తీయలేకపోయింది. భారీ వర్షం కారణం గా మైదానం చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ (151 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) తుదికంటా నిలిచి విజ యంలో కీలక పాత్ర పోషించగా, అతడికి వెబ్‌స్టర్ (87 బంతుల్లో 30; 3 ఫోర్లు) అద్భుత సహకారాన్ని అందించాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 57 పరుగులు జత చేరాయి. శార్దూల్ ఠాకూర్‌కు 3, వరుణ్ ఆరోన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
ఒకే రోజు 12 వికెట్లు..
బ్రిస్బేన్:ఆస్ట్రేలియా 'ఎ'- భారత 'ఎ' జట్ల మధ్య జరుగుతున్న అనధికార టెస్ట మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే ఆరు వికెట్లు అవసరం కాగా, అదే సమయంలో ఆస్ట్రేలియా గెలుపుకు 100 పరుగులు చేయాల్సి వుంది. ఓవర్ నైట్ స్కోరు 44/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత యువ జట్టు 156 పరుగులకు పరిమితమైంది. కేవలం శనివారం నాటి ఆటలో 112 పరుగులు మాత్రమే చేసిన భారత జట్టు మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భారత ఆటగాళ్లలో జయంత్ యాదవ్(46) రాణించగా, హెర్వాద్కర్(23), ఐయ్యర్(26), నాయర్ (21) ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లు వారల్ ఆరు వికెట్లు, సాయర్స్ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.ఆ తరువాత 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా' ఎ' జట్టు .. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.ఒక్క రోజులోనే 12 వికెట్లు నేలరాలడం గమనార్హం. -
రాణించిన భారత ‘ఎ’ బౌలర్లు
ఆస్ట్రేలియా ‘ఎ’ 228 ఆలౌట్ బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో బ్యాటింగ్‌లో తడబడిన భారత ‘ఎ’ జట్టును బౌలర్లు ఆదుకున్నారు. వరుణ్ ఆరోన్ (3/41), జయంత్ యాదవ్ (3/44) రాణించడంతో రెండో రోజు శుక్రవారం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్సలో 228 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 2 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం దక్కింది. కెప్టెన్ హ్యాండ్‌సకోంబ్ (93 బంతుల్లో 87; 15 ఫోర్లు, 1 సిక్స్), బర్న్స్ (125 బంతుల్లో 78; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. హ్యాండ్‌సకోంబ్, బర్నస్ మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స ఆరంభించిన భారత జట్టు హేర్వాడ్కర్ (23), ఫజల్ (6) వికెట్లను కోల్పోరుు 44 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి పాండే (7), శ్రేయస్ (6) క్రీజులో ఉన్నారు. -
భారత్ ‘ఎ’ 230
ఆస్ట్రేలియా ‘ఎ’తో టెస్టు బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత ఆటగాళ్లు తడబడ్డారు. మనీష్ పాండే (76 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా... మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్సలో 81.3 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటయింది. ఫయాజ్ ఫజల్ (48) రాణించాడు. లెగ్ స్పిన్నర్ మిషెల్ స్పెప్సన్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స ఆరంభించిన ఆసీస్ ‘ఎ’ ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. -
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్
నాలుగు జట్ల టోర్నీ టైటిల్ సొంతం ఆసీస్‌పై వరుసగా మూడో ఫైనల్లో గెలుపు రాణించిన మన్దీప్, చహల్ మ్యాకే (ఆస్ట్రేలియా): నాలుగు జట్లు పాల్గొన్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ తొలి మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్ అరుు ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో ఘోర పరాజయం... ఆ తర్వాత కూడా అదే జట్టు చేతిలో మరో లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమి... కానీ అసలు పోరులో మాత్రం భారత్ ‘ఎ’ సత్తా చాటింది. ఫైనల్లో ఆసీస్ ‘ఎ’ను చిత్తు చేసి క్వాడ్రాంగులర్ వన్డే టోర్నమెంట్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నేషనల్ పెర్ఫార్మెన్స టీమ్‌లు కూడా పాల్గొన్నారుు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 57 పరుగుల తేడాతో ఆసీస్ ‘ఎ’పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేయగా, అనంతరం ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ‘ఎ’ జట్లు తలపడిన వన్డే టోర్నీలో ఆసీస్‌పై భారత్ వరుసగా మూడో ఫైనల్లో విజయం సాధించడం విశేషం. గతంలో 2014, 2015లలో కూడా ఆసీస్‌పైనే టీమిండియా నెగ్గింది. టైటిల్ నెగ్గిన జట్టుకు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే అభినందనలు తెలిపారు. పాండే అదే జోరు... భారత్ రెండో ఓవర్లోనే కరుణ్ నాయర్ (1) వికెట్ కోల్పోరుుంది. అరుుతే రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మన్దీప్ సింగ్ (108 బంతుల్లో 95; 11 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్‌కు శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 41; 3 ఫోర్లు)తో 81 పరుగులు జోడించిన మన్దీప్, మూడో వికెట్‌కు కెప్టెన్ మనీశ్ పాండే (71 బంతుల్లో 61; 2 ఫోర్లు)తో 87 పరుగులు జత చేశాడు. అరుుతే దురదృష్టవశాత్తూ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో మన్దీప్ అవుట్ కాగా... ఆ తర్వాత పాండే కూడా తన జోరు కొనసాగించాడు. పాండే, కేదార్ జాదవ్ (25 నాటౌట్) నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఈ టోర్నీలో 7 ఇన్నింగ్సలలో కలిపి రెండు సెంచరీలు సహా 359 పరుగులు చేసిన మనీశ్ పాండే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. నెమ్మదైన అవుట్ ఫీల్డ్ కారణంగా బౌండరీలు ఎక్కువగా రాకపోరుునా, ఆఖరి 15 ఓవర్లలో భారత్ 100 పరుగులు చేయగలగడం విశేషం. చహల్‌కు 4 వికెట్లు... ఆసీస్ ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు), ప్యాటర్సన్ (19) ఇన్నింగ్‌సను జాగ్రత్తగా ఆరంభించగా ఏడో ఓవర్లో ధావల్ చక్కటి బంతితో ప్యాటర్సన్ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం బాన్‌క్రాఫ్ట్, మాడిసన్ (54 బంతుల్లో 31; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో పార్ట్‌టైం స్పిన్నర్ కరుణ్ నాయర్ తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ చేర్చాడు. అరుుతే కెప్టెన్ హ్యాండ్‌సకోంబ్ (59 బంతుల్లో 43; 1 ఫోర్, 1 సిక్స్), అలెక్స్ రాస్ (31 బంతుల్లో 34; 4 ఫోర్లు) పోరాడారు. వేగంగా ఆడిన ఈ జోడి నాలుగో వికెట్‌కు 69 బంతుల్లోనే 77 పరుగులు జత చేసింది. అరుుతే 15 పరుగుల తేడాతో ఇద్దరినీ వెనక్కి పంపి భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. అనంతరం తన లెగ్‌స్పిన్‌తో చెలరేగిన యజువేంద్ర చహల్ ఆసీస్ ఆఖరి ఐదుగురు బ్యాట్స్మెన్లలో నలుగురిని పెవిలియన్‌కు పంపించాడు. కంగారూలు 26 పరుగుల వ్యవధిలోనే తమ చివరి 6 వికెట్లు కోల్పోరుు ఓటమిపాలయ్యారు. -
సఫారీలకు షాక్
ఓటమితో సిరీస్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా {పాక్టీస్ టి20లో 8 వికెట్లతో భారత్ ‘ఎ’ ఘన విజయం మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్ న్యూఢిల్లీ: భారత పర్యటనలో తొలి రోజే దక్షిణాఫ్రికాకు షాక్ తగిలింది. భారత్ ‘ఎ’ జట్టుతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. పాలెం మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు చేసింది. డివిలియర్స్ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా... డికాక్ (2) విఫలమయ్యాడు. సహచరుల ప్రాక్టీస్ కోసం కెప్టెన్ డు ప్లెసిస్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. డుమిని (32 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించడంతో సఫారీలు భారీ స్కోరు సాధించారు. మిల్లర్ (10), బెహర్దీన్ (17 నాటౌట్) కొద్దిసేపు క్రీజులో గడిపారు. భారత బౌలర్లలో కుల్దీప్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారత్ ‘ఎ’ జట్టు 19.4 ఓవర్లలో రెండు వికెట్లకు 193 పరుగులు చేసి... మరో రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఓపెనర్లు మనన్ వోహ్రా (42 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్సర్), మయాంక్ అగర్వాల్ (49 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. ముఖ్యంగా మయాంక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు అవుటైనా... సంజూ శామ్సన్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మన్దీప్ (7 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు) తడబాటు లేకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు. దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లు అబాట్, రబడ, మోరిస్, తాహిర్ నలుగురూ భారత ‘ఎ’ బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. డుమిని, డిలాంజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. -
దక్షిణాఫ్రికాపై భారత్ 'ఎ' విజయం
-
భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ 36/2 బెంగళూరు: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్‌పై భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించగా... మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. మంగళవారం మ్యాచ్‌కు చివరి రోజు. రాణించిన శంకర్, నాయర్: ఓవర్‌నైట్ స్కోరు 161/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శిఖర్ ధావన్ (146 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) తన జోరు కొనసాగించగా, ఆ తర్వాత విజయ్ శంకర్ (110 బంతుల్లో 86; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (97 బంతుల్లో 71; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. బంగ్లా బౌలర్లలో జుబేర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తక్కువ వ్యవధిలో అనాముల్ (0), సర్కార్ (19) వికెట్లు కోల్పోయింది. ఈశ్వర్ పాండే, జయంత్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. -
సిరీస్ గెలుస్తారా?
బెంగళూరు: బంగ్లాదేశ్ 'ఎ' జట్టుతో జరుగుతున్నఅనధికార మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను సాధించాలని భారత్' ఎ' జట్టు పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. ఆ తరువాత శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు నాసిర్ హుస్సేన్(102) సెంచరీ చేయడంతో రెండో వన్డేలో భారత్ కు ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ 1-1 తో సమం అయ్యింది. ఇరు జట్లు మధ్య కీలకమైన మూడో వన్డే ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ 'ఎ' జట్టు భావిస్తుండగా.. బంగ్లాదేశ్ కూడా రెండో వన్డేలో ఫలితాన్నే పునరావృతం చేయాలని యోచిస్తోంది. ఉన్ముక్ చంద్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్ లో గుర్ కీరత్ సింగ్ ఆల్ రౌండ్ షో అదరగొట్టాడు. గుర్ కీరత్ సింగ్ 65 పరుగులు చేయడమే కాకుండా..తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లను సాధించాడు. దీంతో భారత'ఎ' జట్టు 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, రెండో వన్డేలో టాస్ ఓడిన బంగ్లా 'ఎ' జట్టు 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ స్కోరు ఛేదించే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. ఉన్ముక్త్ చంద్(56) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మనీష్ పాండే(34), గురుకీరత్ సింగ్(34), మయాంక్ అగర్వాల్(24) లు ఓ మాదిరిగా రాణించినా విజయాన్ని సాధించి పెట్టలేకపోయారు. ఈ తరుణంలో రేపు జరిగే మ్యాచ్ లో బంగ్లా' ఎ'ను కంగుతినిపించాలంటే భారత్ 'ఎ' జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంది. -
భారత్-ఎ టీమ్ కెప్టెన్ శిఖర్...!
బంగ్లాదేశ్-ఎ తో జరిగే సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 16 నుంచి బెంగళూరు వేదికగా ప్రాంరభం కానున్న సిరీస్ లో బంగ్లా ‘ఎ’ జట్లు మూడు వన్డేలతో పాటు.. ఒక మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఇటీవల శ్రీలకం గాలే మ్యాచ్ లో చేతి గాయంతో సిరీస్ కు దూరమైన శిఖర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. వన్డే టీమ్ కు కెప్టెన్ గా ఉన్ముఖ్ చంద్ వ్యవహరించ నున్నాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా కూడా వన్డే ఏ జట్టులోకి తీసుకున్నారు. జూన్ బంగ్లా దేశ్ సిరీస్ తర్వాత వన్డే క్రికెట్ ఆడని రైనాకు.. సౌతాఫ్రికా సిరీస్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగ పడుతుందని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. సెప్టెంబర్ 16,18, 20 తేదీల్లో వన్డే మ్యాచ్ లు, 27 నుంచి 29 వరకూ మూడు రోజుల మ్యాచ్ జరగ నున్నాయి. మరో వైపు.. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ ను దృష్టి లో ఉంచుకుని ప్రాక్టీస్ కోసం ధోనీ ని కూడా వన్డే జట్టుకు ఎంపిక చేయనున్నారని మొదట వార్తలు వినిపించినా.. ఇండియా ఏ జట్టులో ధోనీని ఎంపిక చేయలేదు.. కాగా ఈనెల 17న ఇంగ్లండ్‌లో ధోనీ ఓ చారిటీ మ్యాచ్ లో ఆడనున్నాడు. భారత్‌తో సిరీస్ తర్వాత ఈనెల 22-24 వరకు మైసూర్లో రంజీ చాంప్ కర్ణాటకతో బంగ్లాదేశ్-ఎ మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. -
‘డ్రా’తో గట్టెక్కిన భారత్ ‘ఎ’
దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టు కరుణ్ నాయర్ సెంచరీ వాయనాడ్ (కేరళ): ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు అనూహ్య ప్రతిఘటన కనబర్చింది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టును డ్రాగా ముగించగలిగింది. 73/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు శుక్రవారం ఆటను కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 309 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (192 బంతుల్లో 114; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. విజయ్ శంకర్ (142 బంతుల్లో 74 నాటౌట్; 12 ఫోర్లు), ముకుంద్ (200 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అతనికి అండగా నిలిచారు. చివరి రోజు విజయానికి భారత్ 371 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఇది కష్ట సాధ్యం కావడంతో భారత్ మ్యాచ్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. నాయర్, శంకర్ ఐదో వికెట్‌కు అభేద్యంగా 148 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించగా...రెండో రోజు ఆటలో భారత కెప్టెన్ రాయుడు (15) మాత్రమే విఫలమయ్యాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది. -
భారత్ ‘ఎ’ లక్ష్యం 444
ప్రస్తుతం 73/2 దక్షిణాఫ్రికా ‘ఎ’తో మ్యాచ్ వాయనాడ్ (కేరళ): నాలుగు రోజుల అనధికార తొలి టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు ముందు దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గురువారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 2 వికెట్లకు 73 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (32 బ్యాటింగ్), రాయుడు (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జీవన్‌జ్యోత్ సింగ్ (1), అంకూష్ బైన్స్ (27) విఫలమయ్యారు. గెలవాలంటే భారత్ మరో 371 పరుగులు చేయాలి. అంతకుముందు 122/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 66.3 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీ జట్టుకు 338 పరుగుల ఆధిక్యం దక్కింది. రాయుడు (46) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. దీంతో 57 పరుగులకు భారత్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. పిడిట్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హెండ్రిక్స్ (61), వాన్‌జెల్ (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు. -
భారత్‌దే టైటిల్
- ‘ఎ’ జట్ల ముక్కోణపు టోర్నీ - ఫైనల్లో ఆసీస్‌పై విజయం చెన్నై: లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు బదులు చెబుతూ... స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత కుర్రాళ్లు ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్ టైటిల్ గెలిచారు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ఖవాజా (88 బంతుల్లో 76; 7 ఫోర్లు), బర్న్స్ (46 బంతుల్లో 41; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించి చక్కటి ఆరంభాన్నిచ్చినా... భారత స్పిన్నర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆసీస్‌ను నియంత్రించారు. కరణ్ శర్మ మూడు వికెట్లు తీయగా... అక్షర్ పటేల్, గురుకీరత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. భారత జట్టు 43.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ (32), ఉన్ముక్త్ (24) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. అయితే మనీష్ పాండే (9), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు. కేదార్ జాదవ్ (29) కూడా నిరాశపరిచాడు. దీంతో భారత్ 108 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గురుకీరత్ మాన్ (85 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ (16), సంజు శామ్సన్ (24 నాటౌట్)ల సాయంతో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ‘ఎ’ మూడో జట్టుగా బరిలోకి దిగింది. గురుకీరత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య ఆగస్టు 18 నుంచి రెండు ‘నాలుగు రోజుల మ్యాచ్‌లు’ జరుగుతాయి. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
మయాంక్, మనీష్ సెంచరీల మోత దక్షిణాఫ్రికా ‘ఎ’పై విజయం నేడు ఆసీస్‌తో అమీతుమీ చెన్నై: మయాంక్ అగర్వాల్ (133 బంతుల్లో 176; 20 ఫోర్లు; 5 సిక్సర్లు), మనీష్ పాండే (85 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో ముక్కోణపు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు ఫైనల్‌కు చేరింది. చిదంబరం స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ సేన 34 పరుగుల తేడాతో గెలిచింది. శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో తుది పోరు జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మయాంక్, ఉన్ముక్త్ (77 బంతుల్లో 64; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు సెంచరీ (106) భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత పాండే, మయాంక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టి20 తరహా హిట్టింగ్తో సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. ఈ జోడి రెండో వికెట్‌కు 203 పరుగులు జోడించడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (86 బంతుల్లో 113; 10 ఫోర్లు; 6 సిక్సర్లు), ఖాయా జోండో (60 బంతుల్లో 86; 7 ఫోర్లు; 5 సిక్సర్లు) వేగంగా ఆడి విజయం కోసం ప్రయత్నించినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. హెండ్రిక్స్ (109 బంతుల్లో 76; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అక్షర్ పటేల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫైనల్ భారత్ ‘ఎ’ ఆసీస్ ‘ఎ’ ఉదయం 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
ఆహా... ‘ఏ’మి ఆడారు
- చెలరేగిన భారత ‘ఎ’ జట్టు - దక్షిణాఫ్రికాపై బోనస్‌తో గెలుపు - మయాంక్ సెంచరీ, రాణించిన ఉన్ముక్త్ చంద్ చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ ‘ఎ’ జట్టు... ముక్కోణపు వన్డే సిరీస్‌లో బోణి చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (122 బంతుల్లో130; 16 ఫోర్లు, 1 సిక్స్), ఉన్ముక్త్ చంద్ (94 బంతుల్లో 90; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. డి కాక్ (124 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో ప్రొటీస్ 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే డి కాక్, విలాస్‌లు ఐదో వికెట్‌కు 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో సందీప్, ధవల్ సమయోచితంగా బౌలింగ్ చేసి లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచడంతో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లను చేజార్చుకుంది. రిషి ధావన్ 4, సందీప్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 37.4 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి నెగ్గింది. సఫారీ బౌలర్లందర్నీ దీటుగా ఎదుర్కొన్న మయాంక్, ఉన్ముక్త్ తొలి వికెట్‌కు 219 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మనీష్ పాండే (9 నాటౌట్), కరుణ్ (4 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. -
భారత్ ‘ఎ’ ఓటమి
- ఖవాజ, బర్న్స్ సెంచరీలు - ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్ ‘ఎ’కు రెండో విజయం చెన్నై: భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన భారత్ ‘ఎ’ జట్టు... ముక్కోణపు సిరీస్‌లో పరాజయం పాలైంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలంకావడంతో శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 334 పరుగులు చేసింది. జోయ్ బర్న్స్ (131 బంతుల్లో 154; 5 ఫోర్లు, 14 సిక్సర్లు), కెప్టెన్ ఉస్మాన్ ఖవాజ (104 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 33.5 ఓవర్లలో 239 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వేడ్ (34 నాటౌట్) మోస్తరుగా ఆడాడు. పసలేని భారత బౌలింగ్‌ను బర్న్స్ సిక్సర్లతో ఉతికిపారేశాడు. తర్వాత భారత్ 42.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటయింది. ఉన్ముక్త్ చంద్ (47 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కేదార్ జాదవ్ (56 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సంధూ, జంపా చెరో 4 వికెట్లు తీశారు. ఆసీస్ ‘ఎ’కు ఇది వరుసగా రెండో విజయం. బర్న్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభిం చింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. -
మరోసారి తడబాటు
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 267/6 చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డారు. కంగారూల బౌలింగ్‌ను ఎదుర్కొలేక తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అసాధ్యం. అభినవ్ ముకుంద్ (163 బంతుల్లో 59; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (66 బంతుల్లో 49; 8 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసింది. అపరాజిత్ (28 బ్యాటింగ్), గోపాల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 53 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లలో పుజారా (11) మళ్లీ నిరాశపర్చాడు. వన్‌డౌన్‌లో కోహ్లి (94 బం తుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ నాయర్ (34 బంతుల్లో 31; 7 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోయారు. కీఫీ 3 వికెట్లు తీశా డు. అంతకుముందు 329/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 107.5 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 214 పరుగుల ఆధిక్యం లభించింది. -
డ్రానందమే..
ఆసీస్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ అనధికారిక టెస్టు చెన్నై: భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే సుదీర్ఘకాలం అనంతరం జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగా మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (6/132) కూడా ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 28 నుంచి ఇదే వేదికపై జరుగుతుంది. 240 పరుగుల లక్ష్యంతో చివరి రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ 46 ఓవర్లలో నాలుగు వికెట్లకు 161 పరుగులు చేసింది. ఇక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. బాంక్రాఫ్ట్ (109 బంతుల్లో 51; 8 ఫోర్లు), ట్రేవిస్ హెడ్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించగా అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 121/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘ఎ’ 78.3 ఓవర్లలో 206/8 వద్ద డి క్లేర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ (66 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. -
భారీ ఆధిక్యంలో భారత్ ‘ఎ’
- ఆసీస్ ‘ఎ’ 268 ఆలౌట్ - ఓజాకు ఐదు వికెట్లు చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. అభినవ్ ముకుంద్ (40), కెప్టెన్ పుజారా (42) నిలకడగా ఆడటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (4 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లోకేశ్ రాహుల్ (29) విఫలమయ్యాడు. ముకుంద్, పుజారా రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్‌గా 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 185/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. హ్యాండ్స్కాంబ్ (91) సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోనిస్ (77) మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. అయితే లోయర్ ఆర్డర్ పూర్తిగా నిరాశపర్చడంతో ఆసీస్ 35 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 5, మిశ్రా 3 వికెట్లు తీశారు. -
రాహుల్ చేజారిన శతకం
భారత్ ‘ఎ’ 221/6 చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ బ్యాటింగ్ తడబడింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 77.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (185 బంతుల్లో 96; 14 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ పుజారా (122 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ అయ్యర్ (58 బంతుల్లో 39; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో ఫెకెట్, కీఫ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లోనే ముకుంద్ (9) వెనుదిరిగాడు. ఈ దశలో రాహుల్, పుజారా కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. పుజారాతో పాటు నాయర్ (0) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా, అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించి రాహుల్ మరోసారి ఆదుకున్నాడు. నమన్ ఓజా (56 బంతుల్లో 10) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా...94 పరుగుల వ్యవధిలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. -
భారత్ ‘ఎ’కే టైటిల్
ఫైనల్లో ఆస్ట్రేలియా ‘ఎ’పై గెలుపు నాలుగు దేశాల వన్డే టోర్నీ డార్విన్: టోర్నీ అంతటా నిలకడగా ఆడిన భారత ‘ఎ’ జట్టు నాలుగు దేశాల వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం ఆతిథ్య ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఫైనల్లో భారత యువజట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరూన్ వైట్ (150 బంతుల్లో 137; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ, ఫిలిప్ హ్యూజెస్ (70 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆసీస్‌కు గట్టి పునాది వేయగా, చివర్లో కటింగ్ (21 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారీస్కోరునందించాడు. అనంతరం భారత కుర్రాళ్లు 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి గెలిచారు. ఒక దశలో 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మనోజ్ తివారి (75 బంతుల్లో 50; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (73 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతోపాటు 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మరోసారి భారత్ ఇక్కట్లలో పడింది. ఈ దశలో రిషి ధావన్ (55 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు), అక్షర్ పటేల్ (38 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)లు ఏడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’: 50 ఓవర్లలో 274/5 (వైట్ 137, హ్యూజెస్ 51; ధావళ్ కులకర్ణి 3/51); భారత్ ‘ఎ’: 48.4 ఓవర్లలో 275/6 (జాదవ్ 78, రిషి ధావన్ 56 నాటౌట్; కటింగ్స్ 3/46). -
ఫైనల్లో భారత్ ‘ఎ’
ఆస్ట్రేలియా ‘ఎ’పై ఘనవిజయం నాలుగు దేశాల వన్డే టోర్నీ డార్విన్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ ఫైనల్‌కు చేరింది. గురువారం ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనోజ్ తివారి బౌలర్‌గా రాణించి లిస్ట్ ‘ఎ’ క్రికెట్ కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లు (5/34) పడగొట్టాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టాయినిస్ (61 బంతుల్లో 58; 9 ఫోర్లు), ఫిలిప్ హ్యూజెస్ (87 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ ‘ఎ’ 47.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (112 బంతుల్లో 77; 8 ఫోర్లు), కేదార్ జాదవ్ (50 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శామ్సన్ (51 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. ఇక శనివారం భారత్ ‘ఎ’, ఆసీస్ ‘ఎ’ల మధ్యే తుదిపోరు జరగనుంది. -
భారత్ ‘ఎ’ మరో విజయం
డార్విన్: కేదార్ జాదవ్ (53 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శామ్సన్ (80 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) చెలరేగడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గార్డెన్స్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఎన్పీఎస్ (నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్)పై గెలిచింది. టాస్ గెలిచి భారత్-ఎ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఎన్పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 234 పరుగులు చేసింది. టర్నర్ (89 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్సర్), సిల్క్ (87 బంతుల్లో 67; 5 ఫోర్లు) అబాట్ (39 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. శుక్లా, రిషీ ధావన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ 39.5 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జాదవ్, శామ్సన్ ఆరో వికెట్‌కు 112 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. మురిహెడ్ 4, అబాట్ 2 వికెట్లు పడగొట్టారు. -
భారత్ ‘ఎ’ ఉత్కంఠ విజయం
డార్విన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఉత్కంఠభరితంగా సాగిన వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ రెండు వికెట్లతో గెలిచింది. శనివారం గార్డెన్స్ ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. రిలీ రోసో (150 బంతుల్లో 137; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. భారత్ ‘ఎ’ 49.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 276 పరుగులు చేసి నెగ్గింది. కరణ్ శర్మ (16 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఈ క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి 15 పాయింట్లతో టాప్‌లో ఉంది. -
కోలుకున్న భారత్ ‘ఎ’
తొలి ఇన్నింగ్స్‌లో 165/3 బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తడబడింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (102 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), మనోజ్ తివారి (74 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చాడ్ సాయెర్స్ (3/22) ధాటికి ఒక దశలో భారత్ 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే తివారి, అపరాజిత్ (20 బ్యాటింగ్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 69 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం భారత్ మరో 258 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు 288/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్ చివరి 3 వికెట్లకు 135 పరుగులు జత చేయడం విశేషం. బెన్ కటింగ్ (117 బంతుల్లో 96; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కామెరాన్ బోయ్స్ (102 బంతుల్లో 57; 9 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 423 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్ 83 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
గంభీర్, పుజారా సెంచరీలు
హుబ్లీ: పేలవ ఫామ్‌తో పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్న ఓపెనర్ గౌతం గంభీర్ (236 బంతుల్లో 123; 11 ఫోర్లు) దాదాపు రెండేళ్ల అనంతరం చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ చతేశ్వర్ పుజారా (228 బంతుల్లో 139 బ్యాటింగ్; 15 ఫోర్లు)సైతం అజేయ శతకంతో రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. వెస్టిండీస్ ‘ఎ’తో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. ప్రస్తుతం 66 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెహ్వాగ్ (49 బంతుల్లో 38; 2 ఫోర్లు; 1 సిక్స్) ఓ మోస్తరుగా ఆడాడు. క్రీజులో పుజారాతో పాటు నాయర్ (18 బంతుల్లో 10 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 10 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్‌లో గంభీర్, పుజారా విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు 207 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. -
రాణించిన నాయర్, కులకర్ణి
హుబ్లి: అభిషేక్ నాయర్ (4/61), ధావల్ కులకర్ణి (3/60) చక్కటి బౌలింగ్‌తో రాణించడంతో మూడో అనధికారిక టెస్టులో తొలి రోజు భారత్ ‘ఎ’ ఆధిక్యం ప్రదర్శించింది. ఇక్కడి కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ‘ఎ’ 77.4 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. లియోన్ జాన్సన్ (148 బంతుల్లో 81; 15 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఫుదాదిన్ (95 బంతుల్లో 47; 3 ఫోర్లు), దేవ్ నారాయణ్ (55 బంతుల్లో 35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. జగదీశ్ (8), గంభీర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. రాణించిన జాన్సన్... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బ్రాత్‌వైట్ (1)ను అవుట్ చేసి జహీర్‌ఖాన్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పావెల్ (21) కూడా వెనుదిరిగాడు. అయితే మూడో వికెట్‌కు దేవ్నారాయణ్తో 70 పరుగులు, నాలుగో వికెట్‌కు ఫుదాదిన్తో 52 పరుగులు జోడించి జాన్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫలితంగా టీ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే చివరి సెషన్లో నాయర్, కులకర్ణి విజృంభించడంతో విండీస్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 93 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. -
భారత్-ఎ రెండో అనధికార టెస్టు డ్రా
వెస్టిండీస్-ఎతో భారత్-ఎ రెండో అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి, నాలుగో రోజు శనివారం 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు.. బ్రాత్ వైట్ (104) మరోసారి విజృంభించి అజేయ సెంచరీ చేయడంతో మూడు వికెట్లకు 223 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. డియోనరైన్ (93) సెంచరీకి ఏడు దూరంలో అవుటయ్యాడు. భారత బౌలర్ భార్గవ్ భట్ రెండు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 406 పరుగులు చేయగా, భారత్-ఎ 359 స్కోరు నమోదు చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0తో ముందంజలో ఉంది. తొలి మ్యాచ్‌లో కరీబియన్లే గెలుపొందారు. -
తొలిరోజు జహీర్ విఫలం
షిమోగా: తొమ్మిది నెలలుగా గాయంతో బాధపడుతూ... ఫిట్నెస్ కోసం పాకులాడుతున్న భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగిన జహీర్ (1/44) ఆకట్టుకోలేకపోయాడు. మిగిలిన బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే రాణించడంతో.... వెస్టిండీస్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బ్రాత్‌వైట్ (82), ఫుదాదిన్ (63) అర్ధసెంచరీలు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 90 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. జాన్సన్ (36 నాటౌట్), మిల్లర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో పావెల్ (33) విఫలమైనా... బ్రాత్‌వైట్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఎడ్వర్డ్స (18), డియోనరైన్ (12) వెంటవెంటనే అవుట్‌కావడంతో కరీబియన్ జట్టు 98 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్‌తో జత కలిసిన ఫుదాదిన్ మెరుగ్గా ఆడాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న ఈ జోడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. తర్వాత జాన్సన్ నిలకడను కనబర్చినా... వాల్టన్ (30) ఆట చివర్లో అవుటయ్యాడు. మిల్లర్ పరుగులు చేయకున్నా వికెట్‌ను కాపాడుకుంటూ రోజును ముగించాడు. జహీర్ ఖాన్, షమీ, రసూల్ తలా ఓ వికెట్ తీయగా.. భార్గవ్ భట్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
యువీ బృందానికి సవాల్
బెంగళూరు: వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో మూడు వన్డేల అనధికార సిరీస్‌లో అనూహ్య పరాజయం అనంతరం భారత్ ‘ఎ’ జట్టు నేడు జరిగే ఏకైక టి20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తొలి వన్డేలో భారీ విజయం సాధించినప్పటికీ అనంతరం రెండు వన్డేల్లోనూ యువరాజ్ బృందం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టి20 మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ యువరాజ్ మరోసారి జట్టుకు కీలకం కానున్నాడు. వన్డే సిరీస్‌లో ఓ సెంచరీతో పాటు 40, 61 పరుగులు సాధించిన యువీ మంచి ఊపుమీదున్నాడు. ఇదే జోరును పొట్టి ఫార్మాట్లోనూ చూపించి జాతీయ జట్టులో చోటును సుస్థిరం చేసుకోవాలనే ఆశతో ఉన్నాడు. భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉన్నా బౌలర్లు తమ శక్తిమేరా రాణించలేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అటు విండీస్ వన్డే సిరీస్ విజయంతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన కరీబియన్ ఆటగాళ్లు ఈ ఫార్మాట్లోనూ జయకేతనం ఎగురవేయాలనే ఆలోచనలో ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లూ పూర్తి స్థాయి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. -
విండీస్ ‘ఎ’దే సిరీస్
బెంగళూరు: వెస్టిండీస్ ‘ఎ’తో తొలి వన్డేలో కనబర్చిన జోరును భారత ‘ఎ’ కొనసాగించలేకపోయింది. ఫలితంగా ఆరంభంలో ఆధిక్యం కనబరిచి కూడా సిరీస్ కోల్పోయింది. గురువారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 45 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. రెండో వన్డేలోనూ నెగ్గిన వెస్టిండీస్ ఈ అనధికారిక వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్, కిర్క్ ఎడ్వర్డ్స్ (104 బంతుల్లో 104; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సహాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జాన్సన్ (42 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఎడ్వర్డ్స్ నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ (5/55) రాణించాడు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబా అపరాజిత్ (96 బంతుల్లో 78; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, యువరాజ్ సింగ్ (59 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించినా...ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో పెర్మాల్కు 3 వికెట్లు దక్కాయి. భారత్ సిరీస్ ఓడినా...మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 224 పరుగులు చేసిన యువరాజ్ సీనియర్ వన్డే జట్టులో స్థానం కోసం తన అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ ఇదే మైదానంలో శనివారం జరుగుతుంది. -
విండీస్-ఎదే సిరీస్: మూడో వన్డేలో భారత్ బోల్తా
వెస్టిండీస్-ఎతో అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భారత్-ఎ శుభారంభం చేసినా ఈ తర్వాత వరుస పరాజయాలతో సిరీస్‌ను చేజార్చుకుంది. గురువారమిక్కడ జరిగిన మూడో మ్యాచ్‌లో కరీబియన్లు 45 పరుగులతో విజయం సాధించి 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఎ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ యువరాజ్ సింగ్ (61) మరోసారి రాణించగా, అపరాజిత్ (78) హాఫ్ సెంచరీతో అకట్టుకున్నాడు. వీరిద్దరితో పాటు వినయ్ కుమార్ (37 నాటౌట్) రాణించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. యువీ, అపరాజిత్ మూడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా వీరిద్దరూ వెంటవెంటనే అవుటవడం, ఇతర బ్యాట్స్‌మెన్ అదే బాటపట్టడంతో భారత్ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. పెరుమాళ్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్.. ఎడ్వర్డ్స్ (104) సెంచరీతో చెలరేగడంతో పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 312 పరుగుల భారీ స్కోరు చేసింది. జాన్సన్ (54) అర్ధశతకానికి తోడు పావెల్ 40, కార్టెర్ 35 పరుగులు చేశారు. ఎడ్వర్డ్స్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు భారీ స్కోరును అందించాడు. భారత యువ బౌలర్ ఉనాద్కట్ ఐదు వికెట్లు పడగొట్టాడు. నదీమ్ రెండు, వినయ్ కుమార్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు. -
యువరాజ్ సెంచరీ: భారత్-ఎ బోణీ
బెంగళూరు: టీమిండియా బెర్తు కోసం నిరీక్షిస్తున్నడాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాట్‌తో చెలరేగి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. వెస్టిండీస్-ఎతో ఆదివారం ఆరంభమైన అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో యువరాజ్ (89 బంతుల్లో 123) మెరుపు సెంచరీ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్-ఎ 77 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యువరాజ్ సారథ్యంలోని భారత్ నిర్ణీత 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 312 పరుగులు చేసింది. యువీ మెరుపు ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా, యూసుఫ్ పఠాన్ (70 నాటౌట్), మన్దీప్ (67) అర్ధశతకాలతో రాణించారు. యువీ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లను భారత బౌలర్లు 39.1 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూల్చారు. యూసుఫ్, వినయ్, రాహుల్, నర్వాల్ తలా రెండు వికెట్లు తీశారు. విండీస్ జట్టులో ఆష్లే నర్స్ (57), డియెనరైన్ (57) హాఫ్ సెంచరీలు చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఇదే వేదికపై ఈ నెల 17న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. -
భారత్ ‘ఎ’తడబాటు
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు తడబడింది. టాప్ ఆర్డర్లో పుజారా (54), రహానే (36) మినహా మిగతా వారు నిరాశపర్చారు. దీంతో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మన్ రాయుడు (14 బ్యాటింగ్), పర్వేజ్ రసూల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఇంకా 196 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో పుజారా నిలకడను కనబర్చినా... విజయ్ (4) విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే హెండ్రిక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత రహానే , పుజారాలు మంచి సమన్వయంతో ఆడి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పుజారాను హెండ్రిక్స్ మరోసారి బోల్తా కొట్టించాడు. తర్వాత వచ్చిన కార్తీక్ (0) నిరాశపర్చినా... రాయుడు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చాడు. ఈ దశలో నిలకడగా ఆడుతున్న రహానే... హెండ్రిక్స్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో సాహా (14), బిన్ని (0) ఒక్క పరుగు వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ కోలుకోలేకపోయింది. హెండ్రిక్స్ 3, హార్మర్ 2, అబాట్ ఒక్క వికెట్ తీశారు. -
‘శత’క్కొట్టారు
రుస్తెన్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కుర్రాళ్లు దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతున్నారు. ముక్కోణపు వన్డే టోర్నీలో చూపిన ప్రదర్శననే దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులోనూ కనబరుస్తున్నారు. తొలి రోజు కెప్టెన్ చతేశ్వర్ పుజారా సెంచరీతో భారీ స్కోరుకు పునాది వేయగా... రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ (257 బంతుల్లో 119; 14 ఫోర్లు; 2 సిక్స్), సురేశ్ రైనా (177 బంతుల్లో 135; 14 ఫోర్లు; 3 సిక్స్) అద్భుత శతకాలతో చెలరేగి జట్టును పటిష్టస్థితిలో నిలిపారు. వీరి ఆటతీరుతో ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ‘ఎ’ జట్టు తొమ్మిది వికెట్లకు 582 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చివర్లో ఉనాద్కట్ (37 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు), నదీమ్ (50 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడి తమ వంతు సహకారం అందించారు. పార్నెల్, డుమినిలకు మూడేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్ (9), హార్మర్ (1) ఉన్నారు. అంతకుముందు 281/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ వరుసగా ఆరు ఓవర్ల దాకా పరుగుల ఖాతా తెరువలేదు. తొమ్మిదో ఓవర్లో రోహిత్ ఓ సిక్స్, రైనా వరుసగా రెండు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అక్కడి నుంచి ఈ జోడి తమ దూకుడును తగ్గించలేదు. 231 బంతుల్లో రోహిత్ సెంచరీ చేయగా లంచ్ అనంతరం తొలి ఓవర్లోనే డుమినికి దొరికిపోయాడు. దీంతో నాలుగో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరి కొద్ది సేపట్లోనే రహానే (10), సాహా (1) అవుటైనా రైనా తన జోరు తగ్గించలేదు. 157 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత డుమిని బౌలింగ్‌లో 6,4,6తో బ్యాట్ ఝుళిపించాడు. టీ బ్రేక్ అనంతరం రైనా దూకుడును పార్నెల్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడడంతో భారత్ ఆలౌట్ ఖాయమనుకున్నా చివరి వికెట్‌కు నదీమ్, ఉనాద్కట్ వీరోచిత ఆటతీరుతో ఏకంగా 82 పరుగులు జత చేరాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 18 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయినా మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది. సంక్షిప్త స్కోర్లు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 582/9 డిక్లేర్డ్ (163 ఓవర్లలో) (పుజారా 137, రోహిత్ శర్మ 119, సురేశ్ రైనా 135, పార్నెల్ 3/89, డుమిని 3/80) దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 20/1 (9 ఓవర్లలో). -
చెలరేగిన పుజారా, రోహిత్ శర్మ
రుస్తెన్‌బర్గ్: చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 140; 17 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్ ‘ఎ’ నిలకడగా ఆడుతోంది. టాప్ ఆర్డర్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో శనివారం తొలి రోజు ఆట ముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 90 ఓవర్లలో మూడు వికెట్లకు 281 పరుగులు చేసింది. సీనియర్ టెస్టు జట్టులో చోటు కోసం పరితపిస్తున్న రోహిత్ శర్మ (159 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు; 1 సిక్స్) భారీ స్కోరు దిశగా వెళుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌తో పాటు రహానే (11) ఉన్నాడు. పార్నెల్, బిర్చ్, హార్మర్లకు తలా ఓ వికెట్ లభించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తొలి వికెట్‌ను త్వరగానే కొల్పోయింది. శిఖర్ ధావన్ (46 బంతుల్లో 11; 1 సిక్స్) విఫలమై తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మురళీ విజయ్ (115 బంతుల్లో 44; 6 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. రెండో వికెట్‌కు వీరి మధ్య 66 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్ జత కలవడంతో స్కోరు బోర్డు వేగంగా పెరిగింది. 73వ ఓవర్లో పుజారా శతకాన్ని చేరగా, అదే ఓవర్లో రోహిత్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కొద్ది సేపటికి పార్నెల్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేయడంతో పుజారా బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. -
ఆసీస్‌పై భారత్ గెలుపు
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లోభాగంగా ఆస్ట్రేలియా -ఏతో ఇక్కడ బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 244 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఫించ్(20), మార్ష్(11) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మెడిన్సన్(7), మ్యాక్స్‌వెల్(12) విఫలం కావడంతో ఆసీస్‌కు కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ జట్టులో పోరాట స్ఫూర్తి లోపించడంతో వరుస వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైంది. చివర్లో పెయిన్(47) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 193 పరుగులకే పరిమితమైన ఆసీస్‌కు చుక్కెదురైంది. భారత బౌలర్లలో నందీమ్కు మూడు వికెట్లు, మహ్మద్ షమీకు రెండు వికెట్లు లభించగా, సురేష్ రైనా, పాండే, రసూల్ కు తలో వికెట్టు దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత్ 49.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ శిఖర్ థావన్(62) పరుగులతో ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్ ఆటగాడు దినేష్ కార్తీక్(73) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడానికి దోహదపడ్డాడు. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్ (150 బంతుల్లో 248; 30 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ చతేశ్వర్ పుజారా (97 బంతుల్లో 109 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడి సెంచరీ చేశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 33.2 ఓవర్లలోనే 285 పరుగులు జోడించారు. మురళీ విజయ్ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు కూడా పోటాపోటీగా పరుగులు సాధించింది. భారీ లక్ష్యానికి బెదరకుండా చివరి వరకూ గెలుపు కోసం శ్రమించింది. ఆ జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించినా లాభం లేకపోయింది. దక్షిణాఫ్రికా 48.4 ఓవర్లలో 394 పరుగులకు ఆలౌటైంది. జార్స్‌వెల్డ్ (91 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), హెండ్రిక్స్ (78 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు సాధించారు. భారత బౌలర్లలో ఈశ్వర్ పాండే 4 వికెట్లు పడగొట్టగా... ఉనాద్కట్‌కు 2 వికెట్లు దక్కాయి. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ‘ఎ’తో తలపడుతుంది. ధావన్ ఇన్నింగ్స్ సాగిందిలా... 31 బంతుల్లో 50 (8 ఫోర్లు) 86 బంతుల్లో 100 (13 ఫోర్లు) 108 బంతుల్లో 150 (17 ఫోర్లు, 3 సిక్స్‌లు) 132 బంతుల్లో 200 (24 ఫోర్లు, 4 సిక్స్‌లు) 150 బంతుల్లో 248 (30 ఫోర్లు, 7 సిక్స్‌లు) 50 ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ఇదే (433) అత్యధిక స్కోరు. అంతర్జాతీయ వన్డేల్లో భారత్ అత్యధిక స్కోరు 418/ 5 (వెస్టిండీస్‌పై). ఓవరాల్‌గా లిస్ట్ ఎ క్రికెట్లో అత్యధిక స్కోర్ల జాబితాలో భారత్ ‘ఎ’ సాధించిన స్కోరు ఆరో స్థానంలో ఉంది. 2007లో కౌంటీలో సర్రే టీమ్ అత్యధికంగా 4 వికెట్లకు 496 పరుగులు చేసింది.