దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7 | India A-South Africa A headed for a tame draw | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7

Published Mon, Aug 13 2018 4:51 AM | Last Updated on Mon, Aug 13 2018 4:51 AM

India A-South Africa A headed for a tame draw - Sakshi

అంకిత్‌ రాజ్‌పుత్‌

బెంగళూరు: భారత్‌ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. కీలకమైన మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. 219/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 92.3 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌  డసెన్‌ (22; 2 ఫోర్లు), రూడీ సెకండ్‌ (47; 7 ఫోర్లు)లను భారత బౌలర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ ఔట్‌ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకంజలోనే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement