బ్లూమ్‌ఫోంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు.
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. సారెల్ ఎర్వీ (41), పీటర్ మలాన్ (31), రేనార్డ్ (33) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ పోరెల్ 2, సౌరభ్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌కు నేడు ఆఖరి రోజు.
Comments
Please login to add a commentAdd a comment