విహారి అజేయ సెంచరీ | Hanuma Vihari carries India A to 322/4 against South Africa A | Sakshi
Sakshi News home page

విహారి అజేయ సెంచరీ

Published Sat, Aug 11 2018 1:25 AM | Last Updated on Sat, Aug 11 2018 1:25 AM

Hanuma Vihari carries India A to 322/4 against South Africa A  - Sakshi

బెంగళూరు: ఆంధ్ర రంజీ క్రికెటర్‌ గాదె హనుమ విహారి (138 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

విహారితో పాటు అంకిత్‌ బావ్నే (80; 10 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విహారితో పాటు మరో అంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ (30 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement