Hanuma Vihari
-
రికీ భుయ్, కేఎస్ భరత్ మెరుపులు.. గోవాపై ఆంధ్ర ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ రికీ భుయ్ (38 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (38 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ (51 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్ భరత్ ధనాధన్ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్ హెబర్ (13), షేక్ రషీద్ (8) విఫలం కాగా... భరత్, భుయ్ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది. -
Fact Check: వివాదాల ‘విహారి’!
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చేస్తున్న కృషితో పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్రీడలు దేశాన్నే ఆకర్షించాయి. ఈ రాష్ట్రం ఏ రంగంలో బాగుపడినా నచ్చని పచ్చమీడియా.. ముఖ్యంగా రామోజీరావు క్రీడలపైనా విషం చిమ్ముతున్నారు. ఇందుకు ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ హనుమ విహారి ఉదంతాన్ని కూడా విషపూరితం చేసి, చిలువలు పలువలు అల్లి ఈనాడులో కథనాలు వండి వారుస్తున్నారు. నిజానికి ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే. జట్టు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడుతుంటారన్న ఫిర్యాదులున్నాయి. విహారి వ్యవహార శైలిపై పలుమార్లు సాటి ఆటగాళ్లు, ఏసీఏ అధికారులు, కోచ్‌లు, కోచ్ హెడ్లు కూడా ఫిర్యాదులు చేశారు. అవన్నీ వాస్తవమేనని విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఏసీఏ కథనం ప్రకారం.. విహారిపై ఫిర్యాదుల్లో కొన్ని.. ♦ బెంగాల్ రంజీ మ్యాచ్‌లో విహారి అందరి ముందు ఒక ఆటగాడి (పృథ్వీరాజ్)ని అసభ్యంగా దుర్భాషలాడారు. దీనిపై ఆయన ఏసీఏకు ఫిర్యాదు చేశారు. ♦ సాటి జట్టు సభ్యులు, సపోర్టు స్టాఫ్‌తో పాటు ఏసీఏ అధికారులు సైతం తరచూ విహారి అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు. ♦ ముస్తాఖ్ ఆలీ టోర్నమెంట్ ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారి కారణమవుతున్నారని ఫిర్యాదు చేశారు. ♦ ఇతర రాష్ట్రాల తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాలని విహారి పదే పదే ఏసీఏని అడిగేవారు. కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు. తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు. మళ్లీ ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని చెబుతుండేవారు. ♦ విహారి అనుభవం, ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు. ♦ హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని విచారణలో తేలింది. ♦ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో విహారి తర్వాత స్థానంలో ఉన్న రిక్కీబుయ్ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని కూడా విహారి అంగీకరించి అభినందించారు కూడా. ♦ ఆ తర్వాత కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ విహారి తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు తెలిపారు. ♦ పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. అండర్ 14, 16, అండర్ 19 వినూ మన్కడ్, కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సీకేనాయుడు, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడి ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్నప్పటికీ, జనవరిలో బెంగాల్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో కెప్టెన్ విహారి అతన్ని ఆడించలేదు. గాయపడిన మరో వికెట్ కీపర్‌ను ఆడించారు. చాలా జట్లలో 17 మందికన్నా ఎక్కువ సభ్యులు ఈనాడు పేర్కొన్నట్టు.. క్రికెట్ జట్టులో 15 మందే ఉండాలన్న నిబంధనేమీ లేదు. 17 మందికి మించి సభ్యులున్న జట్లు చాలానే ఉన్నాయి. 2023–24 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టీమ్‌లో 18 మంది ఉన్నారు. హైదరాబాద్ జట్టులోనూ 17 మంది కంటే ఎక్కువే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏసీఏ కూడా ఆంధ్ర జట్టుకు 22 మందిని ఎంపిక చేసింది. ఏసీఏ కార్యదర్శి కోటా కూడా కొత్తదేమీ కాదు.. చంద్రబాబు హయాం నుంచే ఉంది. ఈ విషయాలు తెలియకుండానే రామోజీ కథనం అల్లారా? ఫౌండేషన్ మూతపడేలా 2021 నవంబర్‌లో తిరుపతిలో వరదల్లో ప్రజలకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను హనుమ విహారి ఫౌండేషన్ అందించింది. ఫౌండేషన్ సహాయ కార్యక్రమాల్లో ఇద్దరు వాలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని కనిపించారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడంలేదని, తామే చేస్తున్నామంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే, ఈ సహాయ కార్యక్రమానికి టీడీపీకి కానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు కానీ సంబంధం లేదని, తమ బృందంలోని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారని, అంతమాత్రాన ఇది ఎన్టీఆర్ ట్రస్టు చేసినట్టు కాదంటూ విహారి ఫౌండేషన్ గట్టిగా ఖండించింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు విహారిని వేధించి, వెంటబడి ఫౌండేషన్ మూతపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టీడీపీ నేతలు ఇప్పుడు విహారిపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రికెట్‌పై రాజకీయాలు దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ క్రీడపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘క్రికెట్ అభివృద్ధి, విస్తరణకు దేశంలోని పలు అసోసియేషన్ల మాదిరిగానే ప్రతిష్టాత్మక ఏసీఏ కూడా విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు తావులేదు. ఏసీఏనుద్దేశించి హనుమ విహారి ఆరోపణలు చేయడం విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా సమన్వయం కుదిర్చి సత్ఫలితాలు సాధించడం జట్టు బాధ్యత. అందులోభాగంగా ఏ ఆటగాడైనా తొందరపడినా, మరో రకంగా ప్రవర్తించినా వారి పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ జట్టును ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఏసీఏ కృషి చేస్తుంది. జట్టు ప్రయాజనాలు, క్రికెట్ స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని లోలోపలే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. పరిధి దాటితే నిబంధనల ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. హనుమ విహారి బహిరంగంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఏసీఏ, సాటి సభ్యులపై ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు గమనించాలి’ అని ఏసీఏ కోరింది. పైరవీలు చేస్తే నా కొడుకు కెప్టెన్ అయ్యేవాడుగా? ఆంధ్రా క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి తిరుపతి మంగళం: ‘భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి తన సహచర ఆటగాడు పృథ్వీరాజ్‌పై అసత్య ఆరోపణలతో ట్వీట్ చేయడం బాధాకరం. నిజంగా నేను పైరవీలు చేసి ఉంటే నా కుమారుడు పృథ్వీరాజ్ ఎందుకు ఆంధ్రా జట్టులో 17వ ఆటగాడిగా ఉంటాడు. ఏకంగా కెపె్టన్ అయ్యేవాడు కదా..’ అని పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి అన్నారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతికి చెందిన నా కుమారుడు పృథ్వీరాజ్ అండర్–12, 14, 17, 19 క్రికెట్లో విశేష ప్రతిభ చూపాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అనేక రికార్డులు పృథ్వీరాజ్‌పై ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క రంజీ మ్యాచ్ అడే అవకాశం రాలేదు. నేను రాజకీయంగా ప్రభావితం చేసి నా కుమారుడిని క్రికెట్ జట్టులోకి తీసుకువస్తున్నట్లు హనుమ విహారి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. నేను ఏసీఏను రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వాడినే అయితే నా కుమారుడు ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడకుండా ఉంటాడు. నా కుమారుడు పృథ్వీరాజ్ ప్రతిభ కలిగినవాడు. స్వశక్తితో పైకి రావాలని కోరుకుంటాడు. పైరవీలు, రాజకీయ ప్రభావంతో ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారి తోటి క్రీడాకారులను పైకి తీసుకువచ్చే విధంగా ఆలోచించాలి. కానీ ఆయన మరొక క్రికెటర్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం, అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. హనుమ విహారి చేసిన తప్పులను త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తా..’ అని నరసింహాచారి చెప్పారు. -
క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందుకు విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావులేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఇలాంటి ఆరోపణలు విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్మెంట్ మీద ఉన్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఏ ఆటగాడైనా తొందరపడ్డా, లేక మరో రకంగా ప్రవర్తించినా వారి విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించి జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావడానికి మేనేజ్మెంట్ నిరంతరం ప్రయత్నిస్తుంది. జట్టు ప్రయోజనాలను, క్రికెట్ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లోలోపలే వాటిని సర్దుబాటు చేయడానికి యత్నిస్తుంది. పరిధి దాటినప్పుడు నిర్దేశిత నియమావళి, పద్ధతులు ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. సీనియర్ ఆటగాడు హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌పైనా, తోటి ఆటగాళ్లపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్ని రాజకీయ పక్షాల నాయకులు వాటిని ఆసరాగా తీసుకుని అసోసియేషన్ నాయకత్వంపైనా, మేనేజ్‌మెంట్‌పైనా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వాస్తవ అంశాలను తెలియజేస్తున్నాం. హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్‌ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. హనుమ విహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో భారత జట్టుకు ఎంపిక కాకపోవడం పట్ల తాను ఫ్రస్టేషన్లో ఎమోషన్‌కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను కోరాడు. జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. -
Hanuma Vihari: బా‘బోరు’ అంతే!.. మావాళ్లు చేస్తే పడుండాలి అనే టైపు!
ప్రపంచంలో ఎక్కడ.. ఏ మూలన జరిగే విషయమైనా తనకు పనికి వస్తుందనుకుంటే వెంటనే రాగం అందుకుని సాగదీయడం చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్న మాట రాజకీయవర్గాల్లో తరచూ వినిపిస్తుంది. మంచి జరిగితే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ఆయన ఎంత ‘దూరమైనా’ వెళ్తారంటారు. టీమిండియా క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టుకు ఆడబోనంటూ ఆరోపణలు చేసిన హనుమ విహారి విషయంలోనూ బాబు అదే పంథాను అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. ‘‘హనుమ విహారిని వేధించారు.. మేము అతడికి అండగా ఉంటాం’’.. అంటూ... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు... తాము అధికారంలోకి వస్తే విహారికి రెడ్‌కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తామంటూ ఆయన కుమారుడు లోకేశ్ సానుభూతి ఒలకబోస్తున్నారు. టార్చర్ పెట్టారు.. అప్పుడే మర్చిపోయారా? అధికారంలోకి వస్తే.. అని మాట్లాడుతున్న లోకేశ్, చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో.. తమ పార్టీ హనుమ విహారిని వేధించిన తీరును మర్చిపోయినట్లున్నారు. కేవలం ఆటకే పరిమితం కాకుండా హనుమ విహారి ఫౌండేషన్ పేరిట కార్యక్రమాలు చేస్తుంటే.. దానిని తమకు ఆపాదించుకుని.. ఆపై విహారే స్వయంగా తమకు క్షమాపణలు చెప్పేలా టార్చర్ పెట్టిన తీరు వాళ్లకు గుర్తున్నట్లు లేదు. కులం పేరిట విహారిని వివక్షకు గురిచేసి, వ్యక్తిగతంగానూ అతడి ప్రతిష్టను దిగజార్చి ఫౌండేషన్ మూయించేసిన టీడీపీ పెద్దలు ఇప్పుడేమో అతడి పట్ల సానుభూతి ప్రదర్శించడం గమనార్హం. అది కూడా తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ..పైగా అతడికేదో మేలు చేస్తామంటూ మొసలి కన్నీళ్లు కార్చడం దౌర్భాగ్యం. గతంలో ఏం జరిగింది? 2021లో తిరుపతిలో వర్షాల నేపథ్యంలో వరదలో చిక్కుకున్న ప్రజలకు విహారి ఫౌండేషన్ పాలు, బ్రెడ్ సహా పలు ఆహార పదార్థాలు పంపిణీ చేసింది. తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్టు టీ షర్ట్స్ వేసుకుని కనిపించడంతో.. ఇక టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. ప్రభుత్వంపై బురద జల్లే క్రమంలో విహారి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని బాబోరి ఖాతాలో వేసేసింది. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందిస్తాయన్న విషయాన్ని.. అది కూడా పక్కోళ్లు చేసిన సాయానికి క్రెడిట్ తీసుకోవాలని స్కెచ్ వేసింది. సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సాయం కాదిది ఈ విషయాన్ని గమనించిన విహారి ఫౌండేషన్.. ‘‘19- నవంబరు-2021న తిరుపతిలో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలకి టీడీపీకి గానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మాతో పాటు వచ్చిన రవి, లోకేష్ అని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ-షర్ట్స్ వేసుకుని ఉన్నారు. అంతమాత్రాన ఇది మీరు చేసినట్లు కాదు కదా?’’ అని టీడీపీ క్యాంపునకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. కేవలం రూ. 3500 బ్రెడ్ ఇచ్చి దానకర్ణుడిలా బిల్డప్పా అంటూ దీంతో బాబోరి బ్యాచ్‌కు కోపమొచ్చి.. ‘‘రవి, లోకేశ్ వాలంటీర్లు కాదు. ఎన్టీఆర్ ట్రస్టు ఉద్యోగులు. అయినా హనుమ విహారి ఫౌండేషన్ కేవలం రూ. 3500 విలువ చేసే బ్రెడ్‌ను మాత్రమే ప్రజలకు అందించింది. కానీ మేము రూ. 3 లక్షలు అందించాం’’ అంటూ విహారి సేవలను తక్కువ చేసేలా పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో విహారి, అతడి ఫౌండేషన్‌ను ట్రోల్ చేస్తూ ఫౌండేషన్‌తో వ్యాపారం చేస్తున్నావా? కుల రాజకీయాలకు పాల్పడుతున్నావా అని తమ బుద్ధులను ఆపాదిస్తూ కించపరిచింది. ట్రోల్స్ స్థాయి శ్రుతి మించడంతో విహారి తట్టుకోలేకపోయాడు. కుల వివక్షకు గురిచేశారు ‘‘మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు కానీ రాజకీయ ఉద్దేశాలు కానీ లేవు. జరిగింది ఒక సమాచార లోపం. గత 24 గంటల్లో అతి తీవ్రమైన వ్యక్తి దూషణలకి, మరియు కుల వివక్షకు గురి అయ్యాము. గత 6 నెలల్లో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవ కార్యక్రమాలు చేసాము. ఇక ముందు మేము ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం లేదు. ధన్యవాదాలు’’ అంటూ తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా విహారి ఫౌండేషన్ ప్రకటించింది. బాబూ మీకో దండం అన్నట్లు విధిలేక క్షమాపణలు కూడా చెప్పింది. తానా అంటే తందాన అదండీ సంగతి.. పక్కోళ్ల క్రెడిట్ కొట్టేయడమే గాకుండా.. పైగా వాళ్లనే బోడి సాయం అన్న చందంగా కించపరిచి... అయినా అహం చల్లారక కుల వివక్ష చూపుతూ ట్రోల్ చేసి ఫౌండేషన్‌ను మూసివేయించింది పచ్చ బ్యాచ్. నలుగురికి అందే ఆ సాయమేదో అందకుండా చేసి పైశాచిక ఆనందం పొందింది. ఇప్పుడేమో హనుమ విహారి ఏవో రాజకీయాలంటూ స్పష్టమైన కారణం చూపకుండా ఆంధ్ర జట్టుకు ఆడనంటే.. అతడిపై సానుభూతి ప్రదర్శించే నాటకాన్ని రక్తికట్టించే పనిలో పడింది. ఇక టీడీపీ బాస్‌కు తానా అంటే తందానా అని భజన చేసే యెల్లో మీడియా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ గుండెలు బాదుకుంటోంది! అట్లుంటది మరి బా‘బోరు’.. ఆయన బ్యాచ్ పని(ప్రచార)తనం!! చదవండి: ఇంకేంటి విహారి?!.. అన్నీ నువ్వే చెప్తే ఎలా? ఆ కోతులకేమో కొబ్బరి చిప్ప! -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్‌పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్‌రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్‌రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
ఆ రోజు ద్రవిడ్ చెప్పాడు.. తర్వాత ఎవరూ టచ్‌లో లేరు!
Hanuma Vihari Comments: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ నుంచి తనకు ఇప్పటి వరకు పిలుపు రాలేదని.. ప్రస్తుతం తాను జాతీయ జట్టులో చోటు గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఏ జట్టు కోసమైనా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీ మీదనే ఉందని.. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే మంచిదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో అరంగేట్రం కాగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(111) కూడా ఉంది. అదే ఆఖరు ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే విహారి ఆఖరిసారిగా 2022లో ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలం(మొత్తం 31 రన్స్) కావడంతో మళ్లీ సెలక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టిన హనుమ విహారి తాజా రంజీ సీజన్లో తొలుత ఆంధ్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ వదులుకుని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆరోజు ద్రవిడ్ అదే చెప్పాడు ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి విహారి 365 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ గురించి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘మేనేజ్మెంట్తో నేను కాంటాక్ట్‌లో లేను. నా ఆఖరి టెస్టు తర్వాత రాహుల్ ద్రవిడ్ ఒక్కడే నాతో మాట్లాడాడు. నా ఆటలోని లోపాలను తెలియజేసి.. వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ఆ తర్వాత ఎవరూ టచ్‌లో లేరు. అయితే, ప్రస్తుతం దేని గురించి ఆలోచించకుండా.. బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడంపై మాత్రమే దృష్టి సారించాను. నా దృష్టి మొత్తం బ్యాటింగ్ మీదే ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా బెస్ట్ ఇచ్చి పరుగులు రాబట్టడమే పని. కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకునే దశలో లేను. ఏదేతే అది జరుగుతుంది. టెస్టు జట్టులో లేనందుకు నిరాశ, బాధ ఉన్న మాట వాస్తవమే. అయినా ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఇప్పుడైతే రంజీలో వీలైనన్ని పరుగులు రాబట్టడమే పని’’ అని 30 ఏళ్ల హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో ఎలైట్ బి గ్రూపులో ఉన్న ఆంధ్ర జట్టు ప్రస్తుతం మూడు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: #Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా -
హనుమ విహారి, రికీ భుయ్ శతకాలు.. ఆంధ్ర ఘన విజయం
Ranji Trophy 2023-24- Chhattisgarh vs Andhra: రంజీ ట్రోఫీ 2023-24లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఛత్తీస్‌గఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 431 పరుగుల భారీ స్కోరు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో హనుమ విహారి(183), కెప్టెన్ రికీ భుయ్(120) సెంచరీలు చేయడంతో ఈ మేరకు పరుగులు సాధించింది. అనంతరం ఛత్తీస్‌గఢ్ 262 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించగా.. ఆంధ్రకు 169 రన్స్ ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆంధ్ర జట్టు.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు 320 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, ఆంధ్ర బౌలర్ల విజృంభణ కారణంగా ఛత్తీస్‌గఢ్ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా సోమవారం ముగిసిన ఈ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లలో ప్రశాంత్ కుమార్, నితీశ్ రెడ్డి మూడేసి వికెట్లు తీయగా.. పృథ్వీరాజ్ యర్రా రెండు, గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
Ranji Trophy: హనుమ విహారి సెంచరీ
Ranji Trophy 2023-24 - Chhattisgarh vs Andhra రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హనుమ విహారి (119 బ్యాటింగ్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (120; 14 ఫోర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. విహారి, కరణ్ షిండే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఇరుజట్ల మధ్య శనివారం రెండో రోజు ఆట మొదలైంది. -
బ్యాట్‌తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్‌గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్‌కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
Ind vs Eng: గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే!
Ranji Trophy 2023-24-Mumbai vs Andhra- ముంబై: రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్‌లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కాగా ‘ఎలైట్’ గ్రూప్‌లో భాగంగా ముంబై- ఆంధ్ర జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్ భూపేన్ లాల్వాని (61) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (48), సువేద్ పార్కర్ (41) ఫర్వాలేదనిపించారు. ఇక గత మ్యాచ్‌కు దూరమై ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. రీఎంట్రీ ఇక కష్టమే ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం ఇక కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి రెండు జట్టులకు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఆట ముగిసేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఆంధ్ర బౌలర్ నితీశ్‌కు 3, షోయబ్ మొహమ్మద్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 281/6 ఓవర్‌నైట్ స్కోరుతో ముంబై శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. కెప్టెన్సీకి విహారి రాజీనామా... మరోవైపు.. ఆంధ్ర రంజీ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విహారి కెప్టెన్‌గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్ నుంచి రికీ భుయ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. -
ఐపీఎల్ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 284 పరుగులు) కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ) పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (కేకేఆర్) ఓ వికెట్) రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్) ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్) రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్) రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
మళ్లీ ఓడిన హైదరాబాద్, ఆంధ్ర.. విహారి, హెబ్బర్ రాణించినా..!
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సర్వీసెస్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (87 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సర్వీసెస్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పలివాల్ (101 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు), వినీత్ ధన్కర్ (76 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో సర్వీసెస్‌ను గెలిపించారు. విహారి, హెబ్బర్ రాణించినా.. చండీగఢ్: గ్రూప్ ‘డి’లో ఆంధ్ర జట్టు కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. రాజస్తాన్ 38 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ 50 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజిత్ తోమర్ (115 బంతుల్లో 124; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, రామ్ చౌహాన్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పిన్నింటి తపస్వికి 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆంధ్ర 47.4 ఓవర్లలో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. హనుమ విహారి (80 బంతుల్లో 60; 9 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (89 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా... మిడిలార్డర్ వైఫల్యంతో ఆంధ్ర ఓటమిపాలయ్యింది. అనికేత్ చౌదరి 4 వికెట్లతో దెబ్బ తీసాడు. -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్‌కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
క్రికెటర్ విహారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్
-
తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే. తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ ఐపీఎల్లో.. టీమిండియా టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. తల్లే మొదటి గురువు కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు. ప్రీతి అంటే మహాప్రీతి.. ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమ కోసం మినీ యుద్ధమే విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి. ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్‌లు చూస్తుందట. ఏపీ ప్రభుత్వం సూపర్ ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే. నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) -
హనుమ విహారి కీలక నిర్ణయం.. మళ్లీ ఆంధ్రతోనే
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ గాదె హనుమ విహారి వచ్చే దేశవాళీ సీజన్లో మధ్యప్రదేశ్ జట్టుకు ఆడాలనుకున్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. తన సొంత జట్టు ఆంధ్ర తరఫునే కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సభ్యుల విజ్ఞప్తి మేరకు విహారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత సీజన్లో విహారి నాయకత్వంలోనే ఆంధ్ర రంజీ ట్రోఫీ నాకౌట్ దశకు చేరగా...బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన అతను 14 ఇన్నింగ్స్‌లలో 2 హాఫ్ సెంచరీలతో 490 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కుడి చేతికి తీవ్ర గాయం కాగా, జట్టును ఓటమినుంచి రక్షించేందుకు అతను ఎడమచేత్తో బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది. భారత్ తరఫున చివరిసారిగా ఏడాది క్రితం బర్మింగ్‌హోం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో విహారి బరిలోకి దిగాడు. చదవండి: ODI World Cup 2023: ప్లీజ్ స్టోక్స్ వచ్చేయ్.. ప్రపంచకప్‌లో ఆడు! -
ఏపీఎల్ సీజన్ 2 వేలంలో విశాఖ క్రికెటర్‌కు రికార్డు ధర
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ వేలం మంగళవారం విశాఖలో జరిగింది. ఇందులో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన విశాఖ కుర్రాడు రికీ బుయ్ రికార్డు ధర పలికాడు. రూ.8,10,000కు బెజవాడ టైగర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. సౌత్‌జోన్ కెప్టెన్ హనుమ విహారీను రూ.6,60,000తో రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఏపీలోని 6 ఫ్రాంచైజీ జట్లతో ఈ నెల 16 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా తరఫున రంజీలతో సహా అంతర్జాతీయ క్రికెట్లో పలు స్థాయిల్లో సత్తా చాటిన 567 మంది ఆటగాళ్లను వారి గ్రేడ్‌ను బట్టి వేలం నిర్వహించారు. 6 ఫ్రాంచైజీలు మొత్తంగా 120 మంది ఆటగాళ్లను జట్లకు ఎంపిక చేసుకున్నాయి. ఏసీఏ పర్యవేక్షణలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించే వ్యాఖ్యాత చారుశర్మ ఈ వేలాన్ని నిర్వహించగా..కౌన్సిల్ చైర్మన్ మునీష్ సెహగల్ ప్రారంభించారు. లైనప్‌ను సరి చూసుకుంటూ ఫ్రాంచైజీలు మొత్తంగా రూ.1.8 కోట్లను వినియోగించుకున్నాయి. కాగా, గిరినాథ్‌రెడ్డిని రూ.6,10,000లకు రాయలసీమ కింగ్స్, కేఎస్ భరత్‌ను రూ.6,00,000లకు ఉత్తరాంధ్ర లయన్స్ నెలబెట్టుకున్నాయి. వైజాగ్ వారియర్స్ అశ్విన్ హెబ్బర్‌ను రూ.5,10,000కు, కోస్టల్ రైడర్స్ స్టీఫెన్, లేఖజ్‌లను రూ.4,50,000లకు నిలబెట్టుకున్నాయి. రూ.50,000 కనీస ధరతో బిడ్ ప్రారంభమైంది. -
తండ్రి అయిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి రాజ్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విహారి దంపతులు సోషల్ మీడియా వేదికగా నిన్న (జులై 17) రివీల్ చేశారు. మా కుటుంబంలో సరికొత్త ఆనందాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము అంటూ బిడ్డ పేరు (Ivaan Kiesh), డేట్ ఆఫ్ బర్త్ (07-07-2023) రివీల్ చేస్తూ విహారి దంపతులు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు, సహచర క్రికెటర్లు విహారి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) కాగా, హనుమ విహారి నేతృత్వంలో సౌత్ జోన్ జట్టు ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీ-2023ని గెలుచుకుంది. వెస్ట్ జోన్‌తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విహారి కెప్టెన్స్ ఇన్నింగ్స్ (63, 42) ఆడగా.. విధ్వత్ కావేరప్ప 8 వికెట్లు (7/53, 1/51) పడగొట్టి సౌత్ జోన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన 29 ఏళ్ల హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. దేశవాలీ టోర్నీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే విహారి.. రాబోయే సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతని నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్‌తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్‌ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్‌గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు. -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్‌లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్‌కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్‌లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Ind Vs WI Test Series 2023: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంతగా నిరాశ చెందానో.. అందుకు గల కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మొదట్లో చాలా బాధపడేవాడిని. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం’’ అని టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో లండన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు కరువయ్యాయి. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఛాన్స్ వస్తుందని ఎదురుచూసిన 29 ఏళ్ల విహారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సౌత్ జోన్ కెప్టెన్‌గా ఇదిలా ఉంటే.. దులిప్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్ జోన్‌తో ఆరంభమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన హనుమ విహారి 839 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 111. చదవండి: అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్ -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్‌గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
35 ఏళ్ల వయసులో రహానే చేసినప్పుడు, నేను చేయలేనా..?
టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర స్టార్ ఆటగాడు హనుమ విహారి ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే విషయమై విహారి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసులో అజింక్య రహానే టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు, తాను చేయలేనా అని అన్నాడు. రహానే లాంటి వెటరన్ ఆటగాడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభపరిమాణమని, టాలెంట్ ఉన్న ఆటగాడికి వయసుతో సంబంధం లేదని రహానే నిరూపించాడని, టీమిండియాలో తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది స్పూర్తినిస్తుందని పేర్కొన్నాడు. తన వయసు 29 మాత్రమేనని, టీమిండియాకు ఆడేందుకు తనకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. విహారి పార్ట్ టైమ్ బౌలర్‌గానూ పర్వాలేదనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 2021 సిడ్నీ టెస్ట్ మ్యాచ్ విహారికి మంచి గుర్తింపు తెచ్చింది. ఇక రహానే విషయానికొస్తే.. ఐపీఎల్ 2023లో ఇరగదీసిన ఈ ముంబైకర్.. ఆ ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి, ఇప్పుడు ఏకంగా టెస్ట్‌ల్లో టీమిండియా వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇదే స్పూర్తితో విహారి సైతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. -
హనుమ విహారి కీలక నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే దేశవాళీ సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. విహారితో పాటు ఢిల్లీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ కుల్వంత్ ఖేజ్రోలియా కూడా వచ్చే డోమాస్టిక్ సీజన్లో మధ్యప్రదేశ్ తరపున ఆడనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే వీరిద్దరూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తో వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదే విధంగా సోమవారం (జూన్ 26) జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ 2022 రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు ఇదే తొలి రంజీ ట్రోఫీ టైటిల్. ఇక 29 ఏళ్ల విహారి జూన్ 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విహారి చివరగా టీమిండియా తరపున గతేడాది జూలైలో ఇంగ్లండ్‌పై ఆడాడు. ఇప్పటివరకు 16 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విహారి 839 పరుగులు సాధించాడు. చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా! -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు
టీమిండియా వెటరన్ ఆటగాడు, ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ హనుమ విహారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ 2023-24 గాను ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో హనుమ విహారికి చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు కష్టమని అంతా భావించారు. కానీ విహారి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసే ఇంకా దారులు మూసుకుపోలేదు. ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత జట్టులో హనుమ విహారికి చోటు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెన్ను గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో విహారి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా విహారీ దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో విహారి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి మళ్లీ పిలుపునివ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా టీమిండియా తరుపున ఎన్నో విరోచిత ఇన్నింగ్స్‌లు ఈ ఆంధ్రా కెప్టెన్ ఆడాడు. లండన్ వంటి స్వింగ్ పిచ్‌లపై అద్భుతంగా ఆడే సత్తా హనుమ విహారికి ఉంది. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. "శ్రేయస్ అయ్యర్ మా జట్టులో చాలా కీలమైన ఆటగాడు. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం మాకు పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా వంటి పిచ్‌లపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం కూడా అయ్యర్‌కు ఉంది. అతడి స్థానాన్ని మరో అనుభవజ్ఞుడైన ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాము. మా సెలక్టర్లు హనుమ విహారి పేరును పరిశీలిస్తున్నారు. మే మొదటి వారంలో జరగనున్న సెలక్షన్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారని" పేర్కొన్నారు. కాగా విహారి చివరగా భారత్ తరపున గతేడాది ఇంగ్లండ్‌పై ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ -
విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైన ఆంధ్ర
Hanuma Vihari: ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ హనుమ విహారి ఒంటి చేతి పోరాటం వృధా అయ్యింది. మణకట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా విహారి ఆడిన ఇన్నింగ్స్‌లు, చేసిన పరుగులకు విలువ లేకుండా పోయింది. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. విహారి విరోచితంగా ఒంటి చేత్తో, అది కూడా తన సహజ శైలికి భిన్నంగా ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి అతి మూల్యమైన పరుగులు సమకూర్చినప్పటికీ ఆంధ్ర టీమ్ గెలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేని ఆంధ్ర జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలి విహారి పోరాటానికి అర్ధం లేకుండా చేసింది. ప్రస్తుత సీజన్లో విహారి నేతృత్వంలో ఆంధ్ర జట్టు వరుస విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్ వరకు జైత్రయాత్ర కొనసాగించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో విహారి గాయపడి మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో ఆంధ్ర టీమ్ ఒక్కసారిగా తేలిపోయింది. @Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM — Teja Tanush (@Tejatanush1) February 2, 2023 తొలి ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో కదం తొక్కినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. గాయపడ్డప్పటికీ బరిలోకి దిగి విహారి చేసిన పరుగులు (27, 15) కూడా సహచరుల్లో స్పూర్తి నింపలేకపోయాయి. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 151 పరుగుల లీడ్ కలుపుకుని ఆంధ్ర నిర్ధేశించిన 245 పరుగుల టార్గెట్‌ను మధ్యప్రదేశ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. యశ్ దూబే (58), రజత్ పాటిదార్ (55) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్, పృథ్వీ రాజ్ తలో 2 వికెట్లు, నితీశ్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 228 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ శర్మ (51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కోర్ వివరాలు.. ఆంధ్రప్రదేశ్: 379 & 93 మధ్యప్రదేశ్: 228 & 245/5 (5 వికెట్ల తేడాతో విజయం) ఈ విజయంతో మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరుకోగా.. మరోవైపు జార్ఖండ్‌పై బెంగాల్ (9 వికెట్ల తేడాతో), ఉత్తరాఖండ్‌పై కర్ణాటక (ఇన్నింగ్స్ 281 పరుగుల తేడాతో) విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. సౌరాష్ట్ర-పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఫలితం తేలాల్సి ఉంది. -
విహారి నువ్వు సూపరయ్యా.. మరోసారి ఒంటి చేత్తో, ఈసారి కత్తి పట్టిన యోధుడిలా..!
Ranji Trophy 2022-23: టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్‌లో ఒంటిచేత్తో పోరాటం చేస్తున్న యోధుడిలా మారిపోయాడు. తొలి రోజు (జనవరి 31) ఆటలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడి, మణికట్టు ఫ్రాక్చర్‌కు గురైన విహారి.. జట్టు కష్టాల్లో ఉండగా ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా, నొప్పిని భరిస్తూ, ఒంటిచేత్తో అది కూడా తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా లెఫ్ట్ హ్యాండ్‌తో (రెండో రోజు) బ్యాటింగ్ చేశాడు. @Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM — Teja Tanush (@Tejatanush1) February 2, 2023 తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద బ్యాటింగ్ చేసి 27 పరుగులు చేసిన విహారి తన జట్టుకు కొన్ని ఉపయోగకరమైన పరుగులు సమకూర్చి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆట మూడో రోజు కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్ర జట్టుకు మరోసారి విహారి అవసరం పడింది. ఆ జట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి బరిలోకి దిగిన విహారి.. ఈసారి కత్తి పట్టిన యోధుడిలా కనిపించాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో, అది కూడా సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు ఎంతో ముఖ్యమైన 15 పరుగులు జోడించిన విహారి.. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న ఆంధ్ర కెప్టెన్.. ఒంటి చేత్తో బ్యాట్‌ను కత్తిలా దూస్తూ 3 బౌండరీలు బాదడం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, విహారికి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా యోధుడిలా పోరాటం చేయడం కొత్తేమీ కాదు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (సిడ్నీ టెస్ట్) టీమిండియా కష్టాల్లో ఉండగా.. ఆసీస్ బౌలర్లు బాడీని టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తున్నప్పుడు దెబ్బలు భరిస్తూ ఇంచుమించూ ఇలాంటి పోరాటమే చేశాడు. తాజాగా తన జట్టును గెలిపించుకునేందుకు విహారి పడుతున్న తాపత్రయం చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. సాహో వీరుడా అంటూ కితాబునిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 379, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకే ఆలౌటైన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. -
శ్రేయస్ గోపాల్ సెంచరీ.. విహారి వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్‌లో జార్ఖండ్-బెంగాల్, రెండో మ్యాచ్‌లో సౌరాష్ట్ర-పంజాబ్, మూడో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్-కర్ణాటక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్ అయినా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్‌కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్ గోపాల్ సూపర్ సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలి క్వార్టర్ ఫైనల్ జార్ఖండ్ వర్సెస్ బెంగాల్.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్ జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 173 ఆలౌట్ (కుమార్ సూరజ్ 89 నాటౌట్, ఆకాశదీప్ 4/46) బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 238/5 (అభిమన్యు ఈశ్వరన్ 77, సుప్రయో చక్రవర్తి 2/68) రెండో క్వార్టర్ ఫైనల్ సౌరాష్ట్ర-పంజాబ్.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 303 ఆలౌట్ (పార్థ భట్ 111 నాటౌట్, మార్కండే 4/84) పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 327/5 (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 126, నమన్ ధీర్ 131, యువ్‌రాజ్ సింగ్ 2/63) మూడో క్వార్టర్ ఫైనల్ ఉత్తరాఖండ్-కర్ణాటక.. 358 పరుగుల లీడ్‌లో కర్ణాటక ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 116 ఆలౌట్ (కునాల్ చండీలా 31, ఎం వెంకటేశ్ 5/36) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 474/5 (శ్రేయస్ గోపాల్ 103 నాటౌట్, మయాంక్ మిశ్రా 3/98) నాలుగో క్వార్టర్ ఫైనల్ ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 379 ఆలౌట్ (రికీ భుయ్ 149, కరణ్ షిండే 110, అనుభవ్ అగర్వాల్ 4/72) మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 144/4 (శుభమ్ శర్మ 51, శశికాంత్ 2/37) -
శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, నిన్న (జనవరి 31) మధ్యప్రదేశ్‌తో మొదలైన క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) అద్భుత శతకాలతో రెచ్చిపోగా.. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆంధ్ర టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి, ఏపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 327 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్ దూబే (20), హిమాన్షు మంత్రి (22) ఔట్ కాగా.. శుభమ్ శర్మ (5), రజత్ పాటిదార్ క్రీజ్‌లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, పృథ్వీ రాజ్ యర్రాకు తలో వికెట్ పడింది. కాగా, రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) కనబర్చిన వీరోచిత పోరాటం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి రోజు ఆటలో 16 పరుగుల వద్ద ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడిన విహారి.. మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల తర్వాత వెనువెంటనే ఔట్ అయ్యాక.. ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఏపీ టీమ్.. 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో (353/9) మణికట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన విహారి.. గతంలో సిడ్నీ టెస్ట్‌లో చేసిన వీరోచిత పోరాటాన్ని మళ్లీ గుర్తు చేశాడు. Hanuma vihari batting with left hand due to the fracture of his wrist pic.twitter.com/qywEd31S5o — cric_mawa (@cric_mawa_twts) February 1, 2023 కుడి చేయికి ఫ్రాక్చర్ కావడంతో ఎడమ చేత్తో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన విహారి జట్టు స్కోర్‌కు అతిమూల్యమైన 26 పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి, జట్టు మనిషివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నొప్పిని భరిస్తూ.. ఎడమ చేతిని కాపాడుకుంటూ విహారి చేసిన బ్యాటింగ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. గాయపడ్డాక బరిలోకి దిగిన విహారి రెండు బౌండరీలు బాదడం, అందులో ఒకటి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కావడం మరో విశేషం. -
రికీ భుయ్ సూపర్ సెంచరీ.. కొనసాగుతున్న ఆంధ్రపద్రేశ్ జోరు
Ranji Trophy 2022-23 4th Quarter Final: ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్‌కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. -
రాణించిన విహారి, రాయుడు.. ఆంధ్ర ఖాతాలో మరో విజయం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో (ఎలైట్ గ్రూప్-బి) ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకుని, ప్రస్తుతానికి గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర టీమ్.. అస్సాంపై ఇన్నింగ్స్ 95 పరుగుల తేడాతో గెలుపొంది, క్వార్టర్స్ రేసులో ముందుంది. ఈ మ్యాచ్‌ను ఆంధ్ర టీమ్ కేవలం రెండున్నర రోజుల్లో ముగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. అభిషేక్ రెడ్డి (75), కెప్టెన్ హనుమ విహారీ (80), కరణ్ షిండే (90 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లలో పుర్ఖాయస్తా 4, రియాన్ పరాగ్, సిద్దార్థ్ సర్మా తలో 2, ముఖ్తార్ హుస్సేన్, హ్రిదీప్ దేకా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం టీమ్.. మాధవ్ రాయుడు (4/12), శశికాంత్ (3/34), నితీశ్ రెడ్డి (1/29), మోహన్ (1/24) ధాటికి 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అస్సాం ఆటతీరు ఏమాత్రం మారలేదు. లలిత్ మోహన్ (5/40), షోయబ్ ఖాన్ (2/30), మాధవ్ రాయుడు (2/34) దెబ్బకు అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలై, సీజన్‌ను ముగించింది. 6 వికెట్లతో సత్తా చాటిన మాధవ్ రాయుడుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, ప్రస్తుత సీజన్లో బెంగాల్, కర్ణాటక జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకోగా మిగిలిన 6 బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. -
ఢిల్లీ బ్యాటర్ల అద్భుత పోరాటం.. ఆంధ్ర జట్టుకు నిరాశ
న్యూఢిల్లీ: చివరి వికెట్ తీయడంలో విఫలమైన ఆంధ్ర జట్టు బౌలర్లు ఢిల్లీ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా 29 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఢిల్లీ జట్టుకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 300/4తో ఆట చివరిరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో ధ్రువ్ షోరే మరో 43 పరుగులు జోడించి వ్యక్తిగత స్కోరు 185 వద్ద అవుటవ్వగా... హిమ్మత్ సింగ్ (104; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిమ్మత్ సింగ్ అవుటైనపుడు ఢిల్లీ స్కోరు 423/9. చివరి వికెట్ తీసిఉంటే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోపాటు మూడు పాయింట్లు లభించేవి. కానీ ఢిల్లీ బ్యాటర్లు హర్షిత్ రాణా (46 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), దివిజ్ మెహ్రా (38 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి చివరి వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘బి’ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
రాణించిన హనుమ విహారి.. భారీ స్కోర్ దిశగా ఆంధ్రప్రదేశ్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (81)తో పాటు కెప్టెన్ హనుమ విహారి (76 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (22), రికీ భుయ్ (9) నిరుత్సాహపరచగా విహారికి జతగా శ్రీకర్ భరత్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో దివిజ్ మెహ్రా, యోగేశ్ శర్మ, హృతిక్ షోకీన్ తలో వికెట్ పడగొట్టారు. ఇంతకుముందు మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు హైదరాబాద్‌పై 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ సౌరాష్ట్ర చేతిలో ఇన్నింగ్స్ 214 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. -
సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్.. ఏం మాట్లాడుతున్నావు భాయ్? ఫ్యాన్స్ ఫైర్
Suryakumar Yadav- Gautam Gambhir Tweet: టీ20 ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మైదానం నలువైపులా తనదైన షాట్లతో విరుచుకుపడే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌ను.. పలువురు విశ్లేషకులు.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తూ కొనియాడుతున్నారు. కాగా గతేడాది పొట్టి ఫార్మాట్లో అదరగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన సూర్య.. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌లోనూ దుమ్ములేపాడు. దుమ్ములేపాడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో నిరాశపరిచినా(7).. పుణెలో అర్ధ శతకం(51), రాజ్‌కోట్‌లో అద్భుత సెంచరీ బాదాడు. ముఖ్యంగా సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20లో సూర్య ప్రదర్శన అత్యద్భుతం. 51 బంతుల్లోనే 112 పరుగులు పూర్తి చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు చేసి.. సిరీస్ గెలుపొందడంలో ఈ వైస్ కెప్టెన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. టెస్టు క్రికెట్ ఆడించే సమయం ‘‘అద్భుత ఇన్నింగ్స్ సూర్య! ఇతడిని టెస్టు క్రికెట్ ఆడించే సమయం ఆసన్నమైంది’’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు. ఈ ముంబై బ్యాటర్‌ను టెస్టుల్లో అరంగేట్రం చేయించాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్ అయితే, గౌతీ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో అది కూడా టీ20లో సూర్య ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను గొప్ప టీ20 ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ.. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్! తనను ఇప్పుడే టెస్టుల్లోకి ఎందుకు తీసుకోవాలి? రంజీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న వాళ్లు నీకు కనబడటం లేదా? ఉదాహరణకు.. సర్ఫరాజ్ ఖాన్ పేరునే తీసుకో భాయ్.. తను నిలకడగా ఆడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రానికి సూర్య కంటే తనే ఎక్కువ అర్హుడు. కేవలం రెడ్ బాల్ క్రికెట్లో ప్రతిభ ఆధారంగా టెస్టుల్లో ఛాన్స్ ఇవ్వాలనడం సరైంది కాదు. వన్డే, టెస్టుల్లో ప్రస్తుతం అతడు వద్దే వద్దు. హనుమ విహారి లాంటి వాళ్లు కూడా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని ఓ నెటిజన్ గంభీర్‌కు బదులిస్తూ ట్వీట్ చేశాడు. మరికొంత మంది కూడా అతడికి మద్దతుగా నిలవడం విశేషం. కాగా సర్ఫరాజ్ ఖాన్ గత కొంతకాలంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022- 23 టోర్నీలో ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. మరోవైపు.. సూర్య సైతం లంకతో సిరీస్ ఆరంభానికి ముందు సర్ఫరాజ్‌తో ముంబై తరఫున మైదానంలో దిగిన విషయం తెలిసిందే. చదవండి: Babar Azam: పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఘోర అవమానం Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ Expected better from you Gauti. Why does he make the team team? What about those who have been scoring runs in Ranji cricket. Sarfaraz for example? Not setting the right example if you pick someone based on white ball form for a completely different game — Arup Ghose (@arup_ghose) January 7, 2023 Why You Are Not Talking About Sarfaraz And other Ranji Players You Already Have Vihari Please Don't Want Him In Tests And Also Not In ODIs — Alfaz Dodiya (@alfaz_dodiya) January 7, 2023 -
చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం
Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఎలైట్ గ్రూప్ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కడు తప్ప.. అంతా సింగిల్ డిజిట్ స్కోర్లే! ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్ ఓపెనర్ జ్ఞానేశ్వర్ 72, కెప్టెన్ హనుమ విహారి 33, రికీ భుయ్ 116, శ్రీకర్ భరత్ 89 పరుగులు సాధించగా.. కరణ్ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. చెలరేగిన శశికాంత్ చందన్ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్ కేవీ శశికాంత్ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్ మూడు, నితీశ్ రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు ఆంధ్ర- 135 & 462 హైదరాబాద్- 197 & 246 చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
శతక్కొట్టిన రికీ భుయ్, కరణ్ షిండే.. విజయంపై ఆంధ్ర గురి
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కీలక విజయంపై గురి పెట్టింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆ జట్టు మూడో రోజు గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్ రెడ్డి (0) అవుట్ కాగా...రోహిత్ రాయుడు (46 నాటౌట్), అలంకృత్ అగర్వాల్ (7 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు హైదరాబాద్ మరో 326 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 230/3తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. రికీ భుయ్ (150 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (70 బంతుల్లో 89; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ఆపై కరణ్ షిండే (180 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. -
Irani Cup 2022: కెప్టెన్‌గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కెప్టెన్‌గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్‌జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను సైతం ఈ టీమ్‌కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు. -
ఎంత పని చేశావు విహారి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2లో సమమైంది. కాగా 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇంగ్లండ్ విజయంలో హీరోగా నిలిచిన జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను.. సెకెండ్ స్లిప్‌లో హనుమా విహారి జారవిడిచాడు. ఈ తప్పిదానికి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బతికిపోయిన బెయిర్ స్టో.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక సులభమైన క్యాచ్ విడిచి పెట్టిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "ఎంత పనిచేశావు విహారి.. క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs — Shribabu Gupta (@ShribabuG) July 5, 2022 -
Ind Vs Eng: వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు!
India vs England 5th Test: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్ హనుమ విహారికి కూడా ఈ మ్యాచ్‌లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ 17 పరుగులకు అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విహారి సైతం వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేశాడు. He is just so, so good 🥰 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/WlwQjxDxo6 — England Cricket (@englandcricket) July 3, 2022 ఇలా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో పోటీకి వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరు ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘గిల్, విహారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం పోటీలో ఉన్నాడు. ఇలాంటపుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్లే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. జానీ బెయిర్ స్టో ఒక్కడిపైనే ఆధారపడితే కష్టమని.. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా బ్యాట్ ఝులిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో భాగంగా టీమిండియా ఆదివారం(జూలై 3) మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కంటే 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 125/3 (45). చదవండి: ENG vs IND: కోహ్లి, బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్..! An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 -
'ఆ ఇద్దరిలో ఒకరిని టీమిండియా ఓపెనర్‌గా పంపండి'
జూలై1న ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా ఓపెనర్‌గా ఛతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీని పంపాలని భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే తాజాగా నిర్వహించిన టెస్ట్టులో కూడా రోహిత్‌కు పాజిటివ్ గానే తేలింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యచ్‌కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో శుభ్‌మాన్ గిల్ జోడిగా భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పుజరా, హునుమా విహారి, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ వంటి వారు ఓపెనింగ్ రేసులో ఉన్నారు. "వార్మప్ మ్యాచ్‌లో కేఎస్ భరత్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని మనకు తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువ. ఇక రోహిత్‌కు బ్యాకప్‌గా జట్టులో చేరిన మయాంక్‌కు తగినంత ప్రాక్టీస్ చేసే అవకాశం లభించలేదు. కాబట్టి రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు అందుబాటులో లేకపోతే.. పుజారా లేదా విహారి లాంటి అనుభం ఉన్న ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది. విహారి ఇప్పటికే రెండు సార్లు భారత్ తరపున ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ముఖ్యంగా ఇది కీలక మ్యాచ్ కాబట్టి అనుభవం ఉన్న ఆటగాళ్లకి అవకాశం ఇస్తే మంచింది"అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IND: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
India Vs Leicestershire: భారత జట్టులో విహారి, శ్రీకర్ భరత్.. మరి పంత్?
India Vs Leicestershire Warm Up Match: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు లీసెస్టర్‌షైర్ కౌంటీతో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలైంది. లీసెస్టర్‌లోని గ్రేస్‌రోడ్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ లీసెస్టర్‌ఫైర్ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు రోహిత్ శర్మలో సారథ్యంలోని భారత జట్టులో తెలుగు క్రికెటర్లు హనుమ విహారి, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ భాగమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. కాగా గతేడాది పర్యటన సందర్భంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా తాజా పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాగా గత టూర్లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ రీషెడ్యూల్డ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభమైన వార్మప్ మ్యాచ్.. లీసెస్టర్‌షైర్ కౌంటీ అఫీషియల్ యూట్యూబ్ చానల్ ‘ఫాక్సెస్ టీవీ’లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. లీసెస్టర్‌షైర్ వర్సెస్ భారత్ వార్మప్ మ్యాచ్ జట్ల వివరాలు ఇలా: లీసెస్టర్‌షైర్ జట్టు: సామ్యూల్ ఈవన్స్(కెప్టెన్), లూయీస్ కింబర్, ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, రేహాన్ అహ్మద్, సామ్యూల్ బేట్స్(వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలే, అబిడినే సకాండే, జోయ్ ఎవిసన్. భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్. 📺 | 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌 Watch @Jaspritbumrah93 bowling to @imro45 and @ShubmanGill live on Foxes TV. ⤵️https://t.co/adbXpwig48@BCCI 14/0 after four overs. 🦊 #IndiaTourMatch | #LEIvIND — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 That is some welcome for a practice game. Leicester is buzzing. #TeamIndia pic.twitter.com/uI5R6mafFV — BCCI (@BCCI) June 23, 2022 -
రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..!
Hanuma Vihari: 2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో రెచ్చిపోతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అబహాని లిమిటెడ్ తరఫున బరిలో ఉన్న విహారి.. ఈ వారం జరిగిన 3 మ్యాచ్‌ల్లో అజేయ సెంచరీ (43 బంతుల్లో 112 నాటౌట్), హాఫ్ సెంచరీ (23 బంతుల్లో 59) సహా 216 పరుగులు సాధించి, లీగ్ టాప్ స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. డీపీఎల్‌లో విహారి సంచలన ప్రదర్శన గురించి తెలిసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. ఇలాంటి ఆటగాడినా తాము నిర్లక్ష్యం చేసిందని తెగ బాధపడిపోతున్నాయి. మరోపక్క వరుస ఓటములతో నిరాశలో కూరుకుపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎలాగైనా విహారిని ఒప్పించి ఎస్ఆర్హెచ్ తరఫున ఆడేలా చేయాలని ఆ జట్టు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో 50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పేరు నమోదు చేసుకున్న విహారిని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయాడు. దీంతో అతను ఐపీఎల్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా చేయకుండా ఢాకా ప్రీమియర్ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా ఏడుగురు భారత ఆటగాళ్లు (అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్) డీపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్లో 24 మ్యాచ్‌లు ఆడిన విహారీ 14 సగటుతో 284 పరుగులు చేశాడు. చదవండి: ఐపీఎల్లో అవమానం.. విదేశీ లీగ్‌లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు -
ఐపీఎల్లో అవమానం.. విదేశీ లీగ్‌లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు
2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోక భంగపడ్డ భారత క్రికెటర్లు, క్యాష్ రిచ్ లీగ్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా కానీయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడేందుకు వెళ్లనుండగా.. మరో టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా మొత్తం ఏడుగురు భారత ప్లేయర్లు (అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్) డీపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వాస్తవానికి భారత ప్లేయర్లకు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే డీపీఎల్.. బంగ్లాదేశ్ లిస్ట్ ఏ క్రికెట్ టోర్నీ కావడంతో భారత క్రికెటర్లకు అనుమతి లభించింది. భారత క్రికెటర్లు డీపీఎల్‌లో పాల్గొనడం కొత్తేమీ కాదు. కోవిడ్‌కు ముందు కూడా విహారి, ఈశ్వరన్, అపరాజిత్, మెనరియా ఈ టోర్నీలో పాల్గొనగా అంతకుముందు దినేశ్ కార్తీక్, మనోజ్ తివారి, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా స్టార్లు వివిధ సీజన్లలో బంగ్లాదేశ్ లిస్ట్ ఏ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సీజన్లో భారత ప్లేయర్లే కాకుండా పాక్, జింబాబ్వేలకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. వీరిలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి, పాక్ వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు. ప్రస్తుత డీపీఎల్ సీజన్ మార్చి 15న ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ మెగా వేలం 2022లో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓ మోస్తరుగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విహారి.. 3 ఇన్నింగ్స్‌ల్లో ఓ అర్ధ సెంచరీ సాయంతో 41.33 సగటున 124 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విహారి ఐపీఎల్లో చివరిసారి 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. చదవండి: హైదరాబాద్‌లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్‌లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం (మార్చి 3) హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత క్రికెట్లో నడుస్తున్న పలు అంశాలపై స్పందించాడు. బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కి ఒక వైపే చూడకూడదని, సమస్యను అలాగే చూస్తూ పోతే అద్భుతాలు సాధించలేమని కోహ్లికి పరోక్షంగా మద్దతు పలికాడు. విరాట్ చాలా గొప్ప ఆటగాడని, అతనితో సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు. కోహ్లి వందో టెస్ట్ కోసం యావత్ భారతంతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 100 టెస్ట్‌లు ఆడటం ఆషామాషీ విషయం కాదని, కోహ్లికి మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని, ఈ క్రమంలో అతను మరిన్ని అద్భుతాలు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టంగా ఉందని, వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి హనుమ విహారి, మహ్మద్ సిరాజ్‌లకు మంచి భవిష్యత్తు ఉందని, వారిరువురు ఇదివరకే వారి మార్కు ప్రభావం జట్టుపై చూపారని కొనియాడాడు. ఎంతటి ఆటగాడైనా టీమిండియాలో కొనసాగలంటే మంచి పర్ఫార్మెన్స్ చూపాల్సిందేనని, యువ క్రికెటర్లు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించాడు. చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..! -
విహారి అద్భుత శతకం.. ఆకట్టుకున్న తిలక్ వర్మ
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ 2022 గ్రూప్ బి లో భాగంగా చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టెస్ట్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ స్టార్ ఆటగాడు హనుమ విహారి అద్భుత శతకంతో మెరిశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ (59)తో రాణించిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలంలో భారీ ధర (1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది).దక్కించుకున్న తిలక్ వర్మ (76 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విహారికి మరో ఎండ్‌లో ఉండి సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 400 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ కాగా, మనన్ వోహ్రా సూపర్ శతకంతో మెరవడంతో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేసి ఆలౌటైంది. చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7 -
Ranji Trophy 2022: హైదరాబాద్ 347 ఆలౌట్
Ranji Trophy 2022 Hyd Vs Chgrh: - భువనేశ్వర్: చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 270/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో 77 పరుగులు జోడిం చి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ (38; 6 ఫోర్లు), సీవీ మిలింద్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇక మొదటి రోజు భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చండీగఢ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. మనన్ వొహ్రా (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7
Ranji Trophy 2022- Hyderabad Vs Chandigarh:- భువనేశ్వర్: చండీగఢ్‌తో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ సారథ్యంలో ఆడుతున్న భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ (32; 5 ఫోర్లు), ప్రతీక్ రెడ్డి (36; 5 ఫోర్లు), రవితేజ (32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. విహారి మూడో వికెట్‌కు తిలక్‌తో 51 పరుగులు... నాలుగో వికెట్‌కు హిమాలయ్ అగర్వాల్‌తో 51 పరుగులు జత చేశాడు. చండీగఢ్ బౌలర్లలో జగ్జీత్ (3/50), రాజ్ అంగద్ బావా (2/43), గౌరవ్ గంభీర్ (2/66) రాణించారు. చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! Ranji Trophy 2022: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే -
ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు కనీస విలువ ఎంతంటే!
IPL 2022 Auction: Do You Know Ambati Rayudu And Hanuma Vihari Base Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ సందడి మొదలైంది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే మెగా వేలం జరుగనున్న విషయం విదితమే. ఈ క్రమంలో జనవరి 22న మొత్తం 1,214 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల సూచనల ప్రకారం దీనిని కుదించి మంగళవారం బీసీసీఐ తుది జాబితాను ప్రకటించింది. ఫలితంగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 590గా ఖరారైంది. ఇందులో భారత క్రికెటర్లు 370 మంది ఉండగా, విదేశీ ఆటగాళ్లు 220 మంది ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో గరిష్టంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది వేలం బరిలో నిలిచారు. 590 మందిలో 228 మంది ఆయా దేశాల తరఫున ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడగా... 355 మంది ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లు, మరో 7 మంది అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఐపీఎల్లో పాల్గొనే ఒక్కో జట్టులో గరిష్టంగా 25 మంది ఉంటారు. వేలానికి ముందు ఎనిమిది జట్లు 27 మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకోగా... రెండు కొత్త టీమ్‌లు మరో 6 మందిని ఎంచుకున్నాయి. మొత్తంగా ఈ 33 మంది ని తగ్గిస్తే... 217 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. భారీ డిమాండ్ ఖాయం... రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది ఐపీఎల్ వేలంలోకి అడుగు పెడుతుండగా, రూ. 1.5 కోట్ల జాబితాలో 20 మంది, రూ. 1 కోటి కనీస ధరతో 34 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న ‘మెగా వేలం’ కావడం, రెండు కొత్త జట్లు రావడంతో స్టార్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఖాయం. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, కమిన్స్ (ఆస్ట్రేలియా), డి కాక్, రబడ, డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), శ్రేయస్ అయ్యర్, అశ్విన్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, షమీ (భారత్), బెయిర్‌స్టో (ఇంగ్లండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) వంటి ప్లేయర్లను అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. వేలంలో వీరికి రికార్డు ధర పలకవచ్చు. ఫ్రాంచైజీలు వద్దనుకున్న భారత ఆటగాళ్లు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, రహానే, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, శార్దుల్ ఠాకూర్ లపై కూడా అందరి కన్నూ ఉంది. అంబటి రాయుడు రూ. 2 కోట్ల కనీస విలువతో ఆసక్తికరంగా తన పేరును వికెట్ కీపర్ జాబితాలో నమోదు చేసుకోవడం విశేషం! హనుమ విహారి రూ. 50 లక్షల కనీస విలువతో బరిలో ఉన్నాడు. చదవండి: IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
IPLAuction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్.. ఇంకా..
IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలం-2022 తుది జాబితా ఖరారైంది. 217 స్థానాలకు 590 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ వేలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నుంచి 8 మంది (అంబటి రాయుడు, అశ్విన్ హెబర్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి) పాల్గొనబోతున్నారు. అదే విధంగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నుంచి 15 మంది (హనుమ విహారి, తిలక్ వర్మ, బి.సందీప్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, యుధ్వీర్, కార్తికేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్, మొహమ్మద్ అఫ్రిది) ఈ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చదవండి: ICC U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో ఎవరంటే..
Ind Vs Sa 3rd Test: దక్షిణాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించాలంటే మూడో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే ఇన్నాళ్లుగా భారత జట్టుకు సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, గాయాల బెడద కోహ్లి సేనకు పెద్ద తలనొప్పిగా మారింది. వెన్ను నొప్పి కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నా ఆఖరి నిమిషం వరకు ఎటూ చెప్పలేని పరిస్థితి. ఇక కీలక ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వీటికి తోడు మిడిలార్డర్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాడు అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం.. ఈ వికెట్ కీపర్‌ను జట్టులో కొనసాగించాలని అంటున్నాడు. ఇన్సైడ్ స్పోర్ట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ లాంటి ఆటగాడిని మేనేజ్మెంట్ పక్కన పెడుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే టీమిండియాకు తనే ఎక్స్ ఫ్యాక్టర్. మ్యాచ్ విన్నర్. షాట్ సెలక్షన్ గురించి కెప్టెన్ విరాట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో మాట్లాడితే సరిపోతుంది. కేవలం కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే వృద్ధిమాన్ సాహా పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. కానీ... బ్యాటింగ్‌లో పంత్ ఎన్నో మెట్లు పైనే ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కాస్త కఠిన నిర్ణయమే అయినా... హనుమ విహారిని తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో అతడు బాగానే ఆడినా.. పుజారా, రహానే అర్ధ సెంచరీలతో రాణించడంతో వాళ్లు కచ్చితంగా మూడో టెస్టు తుది జట్టులో ఉంటారని పేర్కొన్నాడు. విరాట్ వస్తున్నాడు కాబట్టి... విహారిపై వేటు తప్పదన్నాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు వసీం జాఫర్ ఎంచుకున్న తుదిజట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు.. కచ్చితంగా గెలిచి తీరతాం! -
నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్‌కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్‌కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్‌ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
హైదరాబాద్ క్రికెటర్‌పై ద్రవిడ్ కీలక వాఖ్యలు..
హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కోహ్లి గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఎగసిన బంతికి అతను అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విషయాన్ని భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అయినా సరే విహారికి తుది జట్టులో చోటు ఖాయం కాదని అతను పరోక్షంగా చెప్పాడు. కోహ్లి కోలుకొని టీమ్‌లోకి వస్తే విహారిని పక్కన పెట్టడం ఖాయమని సంకేతమిచ్చాడు. విహారితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా రెగ్యులర్‌గా అవకాశాలు దక్కించుకునేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘విహారి రెండు ఇన్నింగ్స్‌లలో చక్కగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టకర రీతిలో అవుటైన అతను రెండో ఇన్నింగ్స్‌లో తన ఆటతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అయ్యర్ కూడా ఆడిన రెండు టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తాము ఎప్పుడు బరిలోకి దిగినా బాగా ఆడగలమని వారు నిరూ పించారు. అయితే ఇప్పటికిప్పు డే కాకుండా మున్ముందు వారికి తగిన అవకాశాలు లభిస్తాయి’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
దక్షిణాఫ్రికా ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఫీల్డర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన రబాడా బౌలింగ్‌లో.. హనుమా విహారి డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. కాగా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ డుస్సెన్ జంప్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విహారి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్(50) అశ్విన్ (46) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: SA vs IND: ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే What a superb close-in catch that was from Rassie van der Dussen to dismiss Hanuma Vihari! #SAvIND pic.twitter.com/SB0DURelNO — Cric Trend (@crictrend_) January 3, 2022 -
ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ను కాదని విహారి ఎందుకు..?
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జట్టు యాజమాన్యం కోహ్లి స్థానాన్ని ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో కాకుండా హనుమ విహారితో భర్తీ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ బీసీసీఐ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు రోజు అయ్యర్.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే రెండో టెస్ట్ సెలక్షన్‌కి అతను అందుబాటులో లేడని వివరించింది. దీంతో విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న విహారి.. కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడని పేర్కొంది. కాగా, విహారి.. సరిగ్గా ఏడాది తర్వాత అనూహ్యంగా తిరిగి జట్టులోకి రావడం విశేషం. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో(జనవరిలో జరిగిన సిడ్నీ టెస్ట్‌లో) విహారి చివరిసారి టీమిండియా తరఫున ఆడాడు. మరోవైపు అరంగేట్రం టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అయ్యర్.. మరో అవకాశం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. మయాంక్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్ 2, జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దే.. కెప్టెన్‌గా అతనికి తిరుగుండదు..! -
కోహ్లి అవుట్... కెప్టెన్‌గా రాహుల్.. తుది జట్టులో హనుమ విహారి
Ind Vs Sa 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి వైదొలిగాడు. ఇక కోహ్లి స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడు. ఇక కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగింది. క్వింటన్ డికాక్ స్థానంలో వెరెనె జట్టులోకి రాగా... డువానే ఒలివర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా సెంచూరియన్ టెస్టులో విజయం సాధించి టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Rahul Dravid - Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్! -
Ind Vs Sa 2nd Test: తొలి రోజు సఫారీలదే..
Updates: తొలి రోజు సఫారీలదే దక్షిణాఫ్రికా సీమర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి సఫారీలకు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చినప్పటికీ.. ఎల్గర్(11), పీటర్సన్(14) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి తొలి రోజు ఆటను ముగించారు. టీ విరామం తర్వాత బరిలోకి దిగి 18 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా.. వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. మార్క్రమ్(12 బంతుల్లో 7) షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా టీమిండియాను 202 పరుగులకే కట్టడి చేసి బరిలోకి దిగిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఓపెనర్ మార్క్రమ్(12 బంతుల్లో 7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షమీ సఫారీలను తొలి దెబ్బ తీశాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 14/1. క్రీజ్‌లో ఎల్గర్(5), పీటర్సన్ ఉన్నారు. 7:33 PM: భీకరమైన సఫారీ పేసర్లను ఎదుర్కొన్న భారత జట్టు అతికష్టం మీద 200 పరుగుల మైలరాయిని క్రాస్ చేసింది. రబాడ బౌలింగ్‌లో సిరాజ్(1) వెనుదిరగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 202 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, ఒలీవియర్, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు. 7:22 PM: ధాటిగా ఆడుతున్న అశ్విన్(50 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఎట్టకేలకు జన్సెన్ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 187 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా, సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. 7:13 PM: రబాడ బౌలింగ్‌లో స్ట్రయిట్ షాట్ ఆడబోయిన షమీ(12 బంతుల్లో 9; ఫోర్).. రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 185 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్(45 బంతుల్లో 44), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. 6:50 PM: సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఒలీవియర్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి శార్ధూల్ ఠాకూర్(0) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 55 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 157/7. క్రీజ్‌లో అశ్విన్(27), షమీ ఉన్నారు. 6:42 PM: టీ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్ తగిలింది. జన్సెన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(43 బంతుల్లో 17; ఫోర్) ఔటయ్యాడు. వెర్రిన్ అద్భుతమైన క్యాచ్ పట్టి పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు. 54 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 156/6. క్రీజ్‌లో అశ్విన్(22), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 6:13 PM: టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 146/5. రాహుల్ వెనుదిరిగిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన అశ్విన్(21 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. పంత్(32 బంతుల్లో 13; ఫోర్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నాడు. 5:47 PM: 116 పరుగుల వద్ద టీమిండియాకు మరో షాక్ తగిలింది. నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) మార్కో జన్సెన్ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 117/5. క్రీజ్‌లో పంత్(12), అశ్విన్(1) ఉన్నారు. 5: 28 PM:హనుమ విహారి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 4: 58 PM: టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, హనుమ విహారి ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ప్రొటిస్ బౌలర్లలో మార్కోకు ఒకటి, సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఒలివర్‌కు రెండు వికెట్లు దక్కాయి. 4: 45 PM: కేఎల్ రాహుల్ 24 పరుగులు, హనుమ విహారి 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/3. 3: 50 PM:లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 53/3 3:29 PM: ప్రొటిస్ బౌలర్ ఒలివర్ టీమిండియాను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు కూల్చి తడాఖా చూపించాడు. పుజారాను పెవిలియన్‌కు పంపిన ఒలివర్.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రహానేను సైతం వెంటనే అవుట్ చేశాడు. దీంతో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. 3: 19 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా మరో కీలక వికెట్ కోల్పోయింది. ఒలివర్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 49/2. 2: 37 PM తొలి వికెట్ కోల్పోయిన భారత్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెనెకు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్(26) పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. 2:30 PM: 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 36/0. కేఎల్ రాహుల్(9), మయాంక్ అగర్వాల్(26) క్రీజులో ఉన్నారు. 1:51 PM ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 15/0. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు. 1: 03 PM: సఫారీల కంచుకోట సెంచూరియన్‌ను బద్దలు కొట్టి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. సీమర్ల బలంతో తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ.. అనూహ్య రీతిలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా కోహ్లి స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Rahul Dravid- Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్! -
Ind Vs Sa 1st Test: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా!
Ind Vs Sa 1st Test: Trolls As Ajinkya Rahane Placed Ahead Vihari And Iyer: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా తెలుగు ప్లేయర్ హనుమ విహారి, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఫామ్లేకపోయినప్పటికీ మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకే విరాట్ కోహ్లి అవకాశం ఇచ్చాడు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన రహానే 411 పరుగులు చేశాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో అతడిపై వేటు పడటం ఖాయమని భావించారంతా. కానీ, అనూహ్యంగా సిరీస్‌కు ఎంపికకావడంతో పాటు డిసెంబరు 26న ఆరంభమైన తొలి టెస్టు తుదిజట్టులో రహానే చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అయ్యర్ లేడు.. విహారీ లేడు.. ఐదుగురు బ్యాటర్లతో టీమిండియా ఆడుతోంది. నిజంగా సాహసోపేతమైన నిర్ణయం’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇక.. ‘‘పాపం విహారి. మరీ ఇంతదారుణమా. ఎన్నిసార్లు నిరూపించుకున్నా అవకాశం రావట్లేదు. పాపం తనకే ఎందుకిలా?. అయ్యర్‌ను కూడా పక్కనపెట్టేశారు. అజింక్య రహానేకు మాత్రం ఛాన్స్ ఇచ్చారు. బహుశా ఇదే అతడికి ఇదే చివరి అవకాశం కావొచ్చు’’అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంతవరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకుని సత్తా చాటాలని కోహ్లి సేన భావిస్తోంది. చదవండి: Vijay Hazare Trophy Final HP Vs TN: వారెవ్వా.. డీకే సెంచరీ... షారుక్ 21 బంతుల్లో 42! హిమాచల్‌కు గట్టి సవాల్ No Iyer. No Vihari. India going in with 5 batters. Brave brave call. 🤞 #SAvIND — Aakash Chopra (@cricketaakash) December 26, 2021 Should really feel bad for vihari & for Rahane feel this will be his last chance. 4 pace bowlers & with Ashwin, looking good on paper & all depends on how well India bats. Go well boys 💙. #INDvSA pic.twitter.com/wbF3nOBbKb — Thana (@Pitstop387) December 26, 2021 Vihari. easily. Rahane more technically equipped tho. But Vihari also scored good in A games I think. So, yeah, Vihari. — table fan of boya (@fastgoogly) December 26, 2021 -
ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికి నో ఛాన్స్!
Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగతున్నాయి. డిసెంబరు 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇక బ్యాక్సింగ్డే టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను శుభారంభం చేయాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాల్‌గా మారింది. మిడిలార్డర్లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రేసులో ఉన్నారు. కాగా ప్రస్తుతం అజింక్య రహానె టెస్టుల్లో ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి విదేశాల్లో ఉన్న రికార్డుల దృష్ట్యా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్‌కు మిడిలార్డర్లో చోటు దక్కచ్చు. ఇక మరోసారి హనుమ విహారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తుది జట్టులో ఎవరకి చోటుదక్కుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో క్రికెట్ నిపుణలు, మాజీలు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా వేస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా చేరాడు. తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను జాఫర్ ఎంచుకున్నాడు. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్‌లో లేకపోయిన ఛెతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ కోహ్లికు చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో అతడు అజింక్యా రహానె వైపే మెగ్గుచూపాడు. ఆరో స్ధానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఇక జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు ఇచ్చాడు. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంచుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్‌కు వసీం చోటు ఇచ్చాడు. కాగా జాఫర్ ప్రకటించిన జట్టులో హనుమ విహారి చోటు దక్కలేదు. వసీం జాఫర్ ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్
సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. 2018లో చివరిసారి దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీమిండియా ఆ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. తాజాగా కోహ్లి సారధ్యంలోని టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడడానికి మరోసారి సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే రోజున తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా మాజీ కోచ్‌పై రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లి- కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. తుది జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీయాలనేదానిపై వారిద్దరికి సమస్యగా మారనుంది. ఫామ్‌లో లేకపోయినప్పటికి రహానేకు బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. అయితే ఇదే రహానే 2018లో సౌతాఫ్రికా పర్యటనలో విశేషంగా రాణించాడు. జోహెన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రహానే కీలకపాత్ర పోషించాడు. అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రహానే మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో వైస్‌కెప్టెన్సీ పదవి కూడా పోగొట్టుకున్న రహానే సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికవ్వడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఇక రహానే గత 12 టెస్టుల్లో 411 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సమయంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అయ్యర్ కివీస్‌తో సిరీస్‌లో సెంచరీ, అర్థసెంచరీతో రాణించి సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యాడు. ఇక ఇటీవలే ఇండియా- ఏ తరపున సౌతాఫ్రికా గడ్డపై ఆడిన హనుమ విహారి ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్థసెంచరీలు సాధించి తుది జట్టు ఎంపికలో తాను ఉన్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: Ashes 2021: 'ఆస్ట్రేలియన్ కామెంటేటర్లకు పిచ్చి పట్టింది' -
"శ్రేయాస్ అయ్యర్ స్ధానంలో అతడికి అవకాశం ఇవ్వండి"
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా అన్ని విధాల సన్నద్దం అవుతుంది. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక జట్టులో 5వ స్ధానంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్నేళ్లుగా అజింక్య రహానే ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే రహానే ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తుండంతో అతడి స్ధానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే అయ్యర్‌కు కాకుండా హనుమ విహారీని జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ సూచించాడు. “శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలో ఎవరని ఎంపిక చేయాలని నన్ను అడిగితే, నేను మాత్రం హనుమ విహారి వైపు మొగ్గు చూపుతాను. ఎందుకంటే చాలా కాలంగా అతడు భారత టెస్ట్ జట్టులో ఉన్నాడు. విదేశీ పిచ్‌లపై అతడికి చాలా అనుభవం ఉంది. అందుకే శ్రేయాస్ అయ్యర్ కంటే విహారి ఎంపిక చేస్తే బెటర్. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ను విహారి తన పోరాట ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఎలా గట్టుక్కించాడో మనందరికీ తెలుసు. అదే విధంగా అతడు వెస్టిండీస్‌లో కూడా సెంచరీ సాధించాడు అని బంగర్ పేర్కొన్నాడు. 2018లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన విహారి 12 మ్యాచ్‌ల్లో 11 మ్యాచ్‌లు విదేశాల్లో ఆడాడు. అంతే కాకుండా 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. చదవండి: Hardik Pandya: "హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడు" -
IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి
IND-A vs South Africa-A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో బ్లోమ్ఫోంటీన్లో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ప్లేయర్లు హనుమ విహారి (63; 6 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (86 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. చదవండి: Hardik Pandya: టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్న హార్దిక్ పాండ్యా! -
దక్షిణాఫ్రికాపై రాణించిన హనుమ విహారి..
Hanuma Vihari shines as India A South Africa A play out another draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య బ్లోమ్‌ఫోంటెన్‌లో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆట చివరిరోజు శుక్రవారం దక్షిణాఫ్రికా నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి (116 బంతుల్లో 72 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! -
హనుమ విహారి అర్థ సెంచరీ.. భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
బ్లూమ్‌ఫోంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. సారెల్ ఎర్వీ (41), పీటర్ మలాన్ (31), రేనార్డ్ (33) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ పోరెల్ 2, సౌరభ్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌కు నేడు ఆఖరి రోజు. -
Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ!
Ind Vs Nz Test Series- Why Hanuma Vihari Not Selected: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ చిత్రంగా సంప్రదాయ ఫార్మాట్లో ఇంటాబయటా రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసింది. మొత్తం టెస్టు సిరీస్ నుంచే అతన్ని తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే మరో తెలుగు ప్లేయర్, కొంతకాలంగా భారత్ ‘ఎ’ జట్లకు ఆడుతున్న ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు కట్టబెట్టారు. ఇతనితో పాటు బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, బౌలర్ ప్రసిధ్ కృష్ణలకూ తొలి సారి టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వీరిద్దరు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇది వరకే టీమిండియా జెర్సీ వేసుకున్నారు. దీంతో పూర్తిగా కొత్త ముఖమైతే శ్రీకర్ భరత్‌దే! నాలుగేళ్ల తర్వాత ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కానున్న మొదటి మ్యాచ్‌కు రహానే సారథ్యం వహించనున్నాడు. తిరిగి రెండో టెస్టుకు కోహ్లినే పగ్గాలు చేపడతాడు. రోహిత్, పంత్, బుమ్రా, షమీలకు విశ్రాంతి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్టార్ ఆటగాళ్లపై క్రికెట్ భారం తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగానే టి20 కొత్త సారథి రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్, పేసర్లు బుమ్రా, షమీలకు ఐదు రోజుల ఫార్మాట్లో సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ నెల 17 నుంచి జరిగే మూడు టి20ల సిరీస్ నుంచి కోహ్లికి కూడా ఇది వరకే రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్‌తో కోహ్లి కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడతాడు. టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేసే రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రెండో కీపర్‌గానే భరత్‌ను తీసుకున్నట్లు తెలిసింది. భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. దెబ్బకు దిగొచ్చారు.. ట్వీట్‌తో సరిపెట్టారు... టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్లపై రాణించిన ఘనత మన విహారిది. తొడ కండరాల గాయం బాధిస్తున్నా... జట్టు అవసరాల కోసం గాయాన్ని పంటిబిగువన భరించి మరీ ఓ టెయిలెండర్ (అశ్విన్)తో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించాడు. అందరి నుంచీ ప్రశంసలందుకున్నాడు. తర్వాత ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఫైనల్లో భారత ఓటమికి విహారిలాంటి నిలబడే బ్యాట్స్‌మన్ లేకపోవడం కూడా ఒక కారణం. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారిని పక్కన బెట్టారు. ఈసారి సెలెక్షన్ కమిటీ ఏకంగా జట్టు నుంచే తప్పించింది. దీనికి సరైన కారణం కూడా సెలక్షన్ కమిటీ, బోర్డు దగ్గర లేదు. దీనిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకు విహారిని భారత్ ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు పంపిస్తున్నామని శుక్రవారం సాయంత్రం బీసీసీఐ ఒక ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈనెల 9న భారత ‘ఎ’ జట్టును ప్రకటించినపుడు అందులో విహారి పేరు లేకపోవడం గమనార్హం. విహారి తన కెరీర్లో 12 టెస్టులు ఆడి 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Virat Kohli: మిగిలిన ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా గుడ్‌బై చెప్పే అవకాశం! 🚨 UPDATE: @Hanumavihari has been added to the India 'A' squad for the South Africa tour. https://t.co/ISYgtlw1S1 pic.twitter.com/uy3UD1pCN5 — BCCI (@BCCI) November 12, 2021 -
కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు
Fans Troll BCCI Not Selecting Hanuma Vihari NZ Test Series.. న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు 16 మందితో కూడిన టీమిండియాను శుక్రవారం బీసీసీఐ ఎంపికచేసిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్‌తో పాటు బుమ్రా, షమీ, రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. కాగా కోహ్లి రెండో టెస్టు ఆడే అవకాశం ఉన్నందున ఇప్పటికైతే తొలి టెస్టుకు రహానే సారధ్యం వహించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ పేరుతో విశ్రాంతి ఇవ్వడంతో కేఎస్ భరత్, జయంత్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్లు ఎంపికయ్యారు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడిన శుబ్‌మన్ గిల్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. ఇలా కొత్త ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వడంతో జట్టు కొత్తగా కనిపిస్తున్నప్పటికీ హనుమ విహారిని ఎంపిక చేయకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. చదవండి: Ind Vs Nz Test Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఇదే గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో హనుమ విహారి తన ఇన్నింగ్స్‌తో టీమిండియాను పరాజయం నుంచి తప్పించాడు. అలాంటి క్లాస్ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న విహారికి చాన్స్‌లు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారని.. వాస్తవానికి రహానే కెప్టెన్ కాకపోయుంటే అతన్ని పక్కన పెట్టేసి విహారి చాన్స్ ఇచ్చినా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా కరుణ్ నాయర్ విషయంలో జరిగిన వివక్ష హనుమ విహారికి జరుతుందని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే విహారి కనుమరుగవుతాడని పేర్కొన్నారు. దీంతోపాటు విహారికి అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐని విమర్శిస్తూ టీమిండియా ఫ్యాన్స్ వివిధ రకాలుగా ట్రోల్ చేశారు. చదవండి: Team India Coaching Staff: ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..! న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు: అజింక్య రహానే(కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, విరాట్ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి). ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్: ►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్. ►రెండో టీ20- నవంబరు 19, రాంచి. ►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా. ►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్. ►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై. If Hanuma Vihari is indeed not injured then perhaps the selectors’ memories of his selfless heroics in the last Test he played for the country are as blurred as these rather poorly taken live pictures at the SCG in January #IndvNZ pic.twitter.com/YxRio3MB4t — Bharat Sundaresan (@beastieboy07) November 12, 2021 -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టీమిండియా క్రికెటర్
Hanuma Vihari Takes Part In Green India Challenge: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పాల్గొన్నాడు. ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చాడు. కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, టీమిండియా దిగ్గజ క్రికెటర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్, కృష్ణ ప్రియలకు ఆయన ఛాలెంజ్ విసిరాడు. చదవండి: గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన -
అది నా కల.. కానీ సెలక్షన్ మన చేతిలో ఉండదు కదా: సిరాజ్
Mohammed Siraj About T20 World Cup Dream: టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. అయితే, జట్టులో స్థానం పొందలేకపోవడం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు. ఏదేమైనా టీమిండియా తరఫున ఆడటం గొప్ప విషయమని, జట్టును గెలిపించడంలో తన పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఈ హైదరాబాదీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అనుభవజ్ఞులైన పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌కే సెలక్షన్ కమిటీ ఓటు వేసింది. దీంతో సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన సిరాజ్.. జట్టులో స్థానం దక్కకపోవడం బాధించిందన్నాడు. ‘‘ టీ20 వరల్డ్ కప్ ఆడాలనేది నా కల. కానీ, సెలక్షన్ అనేది మన చేతిలో ఉండదు కదా. ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదు. చదవండి: T20 World Cup: అశ్విన్‌కు అది కన్సోలేషన్ ప్రైజ్ లాంటిది.. తుదిజట్టులో ఉంటాడా నా ముందు పెద్ద లక్ష్యం ఉంది. టీమిండియా విజయాల్లో నాదైన పాత్ర పోషించాలని భావిస్తున్నా. విధిరాతను నేను నమ్ముతాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేపథ్యంలో హైదరాబాద్ తరఫున ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిరాజ్ ఈ సందర్భంగా చెప్పాడు. ‘‘దేశవాళీ క్రికెట్లోనూ నా జట్టు తరఫున కీలక పాత్ర పోషించాలనేది నా కల. అయితే, ఎలైట్ గ్రూప్ ఆఫ్ రంజీ ట్రోఫీలో మా జట్టు లేకపోవడం నిరాశకు గురిచేసింది. టీ20 టోర్నీకి మాత్రం అందుబాటులో ఉంటాను’’ అని స్పష్టం చేశాడు. ఇక హనుమ విహారి హైదరాబాద్ జట్టుకు తిరిగి ఆడనుండటం శుభ పరిణామమని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా... ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 27 ఏళ్ల సిరాజ్.. ఇప్పటి వరకు తొమ్మిది టెస్టులాడి 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. చదవండి: Irfan Pathan: ఇది ఊహించలేదు.. కోహ్లి నిర్ణయం షాక్‌కు గురిచేసింది టీ20 ప్రపంచకప్ భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్. -
మళ్లీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడనున్న విహారి
హైదరాబాద్ : టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. అనంతరం ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమ్యాడు. కాగా కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో విహారి స్వదేశానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో విహారి సభ్యుడుగా ఉన్నాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. -
ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ గెలిచింది ఒలింపిక్స్‌లో కాదు లంబూజీ..
డర్హమ్: విశ్వక్రీడా సంబురం(టోక్యో ఒలింపిక్స్) జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ మెడల్ వార్త కనిపించినా అది ఒలింపిక్స్‌లోనే అనుకుని చాలా మంది ప్రముఖులు పొరబడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు కూడా ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌తో పాటు హంగేరీలోని బుడాపెస్ట్‌లో వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం భారత రెజ్లర్ ప్రియా మాలిక్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఆమె ఒలింపిక్స్‌లోనే ఆ మెడల్ గెలిచిందనుకొని టీమిండియా క్రికెటర్లు ఇషాంత్ శర్మ, హనుమ విహారిలు.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. వీరిలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ప్రియా మాలిక్ ఒలింపిక్స్‌లోనే మెడల్ గెలిచిందనుకొని శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. దీంతో ట్విటర్లో #NotOlympics ట్రెండింగ్ అయ్యింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు.. వెంటనే తమతమ ట్వీట్లు డిలీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇషాంత్.. చానుకు శుభాకాంక్షలు తెలిపాడు. -
Hanuma vihari: ఫౌండేషన్ లోగో చూశారా!
సాక్షి,న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి పలువురి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌లో హనుమ విహారి అనేక మంది బాధితులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. ఈ క్రమంలో హనుమ విహారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఫౌండేషన్ లోగోను ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ లోగోను పరిచయం చేస్తూ "మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు.కానీ ప్రతీవాళ్లు కొందరికి సాయం చేయొచ్చు’’ రోనాల్డ్ రీగన్ మాటలను కోట్ చేశారు. ‘అందరం ఐక్యమవుదాం. కలిసికట్టుగా సాయపడదాం’ అని విహారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా తన ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ, రక్తదానం లాంటి విశేష సేవలను అందిస్తున్నారు హనుమ విహారి. ఇంకా కేన్సర్ పీడితులు, అనేక మంది చిన్నారులకు సాయం అందిస్తూ భరోసానిస్తున్నారు. 24 గంటలూ బాధితులకు అండగా ఉంటూ ఆయన అందిస్తున్న సేవలు ఆయన ట్విటర్ టైం లైన్ పరిశీలిస్తే అర్థమవుతాయి. అంతేకాదు తనతోపాటు సాయం చేసేలా పదిమందిని ప్రోత్సహిస్తుండటం విశేషం. Hi All- "We can't help everyone, but everyone can help someone" by Ronald Reagan.🙂 On this note happy to introduce our logo. Let us unite together and reach our help and efforts to needy people. Team Hv 🤝🏻@Hanumavihari pic.twitter.com/cblAvHLFAy — Hanuma Vihari Foundation (@HanumaVihariFdn) June 11, 2021 చదవండి: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
శభాష్ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్ గురూ
లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో వైద్యానికి అవసరమైన డబ్బును అందించడంతో ప్రియాంక అనే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటుంది. As promised yesterday to Priyanka’s family. They’ll be receiving funds from me today n get her surgery started asap. She deserves to have a better life and it’s all of our responsibility to give it to her.thank you everyone who has come forward@Hidderkaran special mention to you — Hanuma vihari (@Hanumavihari) June 7, 2021 వివారాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓ రోజు ప్రియాంకకు ప్రపోస్ చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంకపై దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. ఘటనా స్థలంలో నిర్జీవంగా పడివున్న ప్రియాంకను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్ధించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే స్పందించి ఆ అమ్మయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సహాయానికి ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంట కనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును గట్టెక్కించి విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్ వికెట్ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు -
Hanuma Vihari: ఇలాంటి షాట్ భారత్‌లో ఆడితే అవుట్ కాకపోయేవాడిని!
ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన భారత క్రికెట్ జట్టు సభ్యులకు ఈ టూర్‌కు ముందు సరైన ప్రాక్టీస్ లభించలేదు కానీ జట్టులోని ఒక ఆటగాడు మాత్రం ఇదే సిరీస్ కోసం చాలా రోజులుగా సన్నద్ధమవుతున్నాడు. ఎక్కడో కాకుండా అదే ఇంగ్లండ్ గడ్డపై ఆడుతూ తన ఆటకు అతను పదును పెట్టుకున్నాడు. అతనే గాదె హనుమ విహారి. కౌంటీ క్రికెట్లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆంధ్ర బ్యాట్స్‌మన్ మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి టెస్టు సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇక్కడే అరంగేట్రం చేసిన విహారి ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. లండన్: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయంలో భాగంగా ఉన్న హనుమ విహారి సిడ్నీ టెస్టులో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకున్న అనంతరం మరోసారి టీమిండియా సభ్యుడిగా జట్టులో భాగమయ్యాడు. 2018 సిరీస్‌లో ఓవల్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన విహారి అదే మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నేళ్లలో తన ఆటతీరు మారిందని చెబుతున్న విహారి ‘క్రిక్ఇన్ఫో’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో పలు అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు అతని మాటల్లోనే... ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ పరిస్థితులపై... నిజంగా ఇక్కడ బ్యాటింగ్ పెద్ద సవాల్ వంటిదే. ఎండ కాసినప్పుడు బ్యాటింగ్ కొంత సులువవుతుంది కానీ ఆకాశం మబ్బు పట్టి ఉంటే చాలు ఒక్కసారిగా కష్టంగా మారిపోతుంది. దాదాపు రోజంతా బంతి స్వింగ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూక్ బంతులు బాగా ప్రభావం చూపిస్తాయి. బౌలర్లకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రీజ్‌లో నిలదొక్కుకున్నామని అనిపించిన సమయంలో కూడా అనూహ్య స్వింగ్ ఇబ్బంది పెడుతుంది. డ్యూక్ బంతులపై సీమ్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. కౌంటీల్లో అనుభవంపై... నేను ఇంగ్లండ్‌కు వచ్చిన సమయంలో బాగా చలిగా ఉంది. ఆ వాతావరణంలో బంతి మరింత ప్రభావం చూపించింది. అందుకే నా తొలి కౌంటీ మ్యాచ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను. బ్రాడ్ బౌలింగ్‌ను సరిగా ఎదుర్కోలేక డకౌట్ అయ్యాను. ఇక్కడ డ్రైవ్ చేయడం కూడా అంత సులువు కాదు. ఇదే తరహా షాట్ నేను భారత్ లో ఆడి ఉంటే అవుట్ కాకపోయేవాడిని. ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు షాట్ సెలక్షన్ చాలా ముఖ్యం. అయితే మెల్లగా అన్నీ చక్కదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేశాను. స్టాన్స్ కూడా మార్చుకున్నాను. ఇప్పుడు ఈ అనుభవమే నాకు పెద్ద బలం. టీమిండియా తరఫున బాగా ఆడేందుకు ఇదంతా అక్కరకొస్తుంది. 2018తో పోలిస్తే ఈ సిరీస్‌పై... అప్పుడు నా మొదటి టెస్టు ఆడాను. అనుభవం లేని కుర్రాడిని. బ్యాటింగ్ చేసేటప్పుడు కాళ్ల కదలికలు కూడా భిన్నంగా ఉండేవి. అందుకే అండర్సన్, బ్రాడ్ ఇన్‌స్వింగర్లను ఎలా ఆడాడో కోహ్లి సూచించాల్సి వచ్చింది. వాటిని నేను అమలు చేశాను కూడా. అయితే ఇప్పుడు నా ఆట చాలా మెరుగైంది. స్వింగర్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. నా బ్యాటింగ్‌పై నియంత్రణ పెరిగింది. క్రీజ్‌లో కదలికలు ఎలా ఉండాలో బాగా తెలుసు. అదనంగా కౌంటీ అనుభవం కూడా వచ్చింది కాబట్టి ఈ సిరీస్‌లో మంచి స్కోర్లు సాధిస్తాననే నమ్మకం ఉంది. చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది -
'సిగ్గుచేటు.. దేశం ఇలా ఉందంటే నీలాంటి వారి వల్లే'
లండన్: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిపై కలత చెందిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తనవంతు చేయూతను అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇతర క్రికెటర్ల లాగా విరాళంతో సరిపెట్టకుండా కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. విహారి చేస్తున్న పనిపై అందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఒక నెటిజన్ మాత్రం విహారిపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. విషయంలోకి వెళితే.. విహారి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక అమ్మాయి అవసరం గురించి రాసుకొచ్చాడు.''ఆ అమ్మాయి తండ్రి, సోదరుడు కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ చావుబతుకులు మధ్య ఉన్నారు. వారిని కాపాడుకోవడానికి అమ్మాయికి డబ్బు అవసరం చాలా ఉంది. అందరం కలిసి తలా ఒక చేయి వేసి వారి ప్రాణాలను కాపాడుదాం'' అంటూ చెప్పుకొచ్చాడు. విహారి కామెంట్స్‌పై అందరు పాజిటివ్‌గా స్పందించారు. అయితే ఒక వ్యక్తి మాత్రం..'' ఆ డబ్బు మీరే ఇవ్వొచ్చు కదా.. ఎంతైనా మీరు గొప్ప అథ్లెట్.. డబ్బులు కూడా చాలానే ఉంటాయి.. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు'' అంటూ కామెంట్ చేశాడు. దీనిపై విహారి ఆ వ్యక్తికి ధీటుగా బదులిచ్చాడు. ''ఇది నిజంగా సిగ్గుచేటు.. ఇండియా ఈరోజు ఇలా ఉందంటే నీలాంటి వాళ్లు దేశంలో నివసించడం వల్లే.. రియల్లీ షేమ్ ఆన్ యూ.. వీలైతే సాయం చేయాలి. అంతేకానీ ఇలాంటి మాటలొద్దు.. నా దగ్గర డబ్బు ఉండొచ్చు.. కానీ నేను ఏదో ఆశించి స్వార్థం కోసం చేయడం లేదు.. దేశం కోసం చేస్తున్నా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. చదవండి: Hanuma Vihari: విహారి వలంటీర్స్... -
Hanuma Vihari: దాతృత్వం.. కోవిడ్ బాధితులకు అండగా
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. జట్టుకోసం ఏదైతే అది... ఇంగ్లండ్ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్‌తో ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు. -
విహారికి ఎప్పటికీ గుర్తుండిపోయే కౌంటీ అరంగేట్రం!
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్‌ల్లో భాగంగా అక్కడ జరిగే కౌంటీ క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హనుమ విహారి చెత్త రికార్డు నమోదు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్న విహారికి తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. 40 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 23 బంతుల్ని ఎదుర్కొన్న విహారి డకౌట్ అయ్యాడు. బ్రాడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హసీబ్ హమీద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది విహారికి మరచిపోలేని కౌంటీ అరంగేట్రంగా ఎప్పటికీ గుర్తుండి పోవడం ఖాయం. కాగా, ఫీల్డింగ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు విహారి. నాటింగ్‌హామ్‌షైర్ ఇన్నింగ్స్ చేస్తున్నప్పుడు వన్ హ్యాండెడ్ డైవింగ్ క్యాచ్‌తో అలరించాడు. విల్ రోడ్స్ బౌలింగ్‌లో స్టీవన్ ములానే(31) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్లో నో చాన్స్.. అందుకే కౌంటీ క్రికెట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌ల్లో వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. వార్విక్షైర్ తరఫున అతను కనీసం మూడు మ్యాచ్‌లు ఆడతాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్‌కు వెళ్లిన విహారి 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. చదవండి: ధోని బాయ్ జట్టుతో తొలి మ్యాచ్.. అది కెప్టెన్‌గా -
'అతన్ని చూస్తే బాధేస్తోంది.. ఐపీఎల్ ఆడితే బాగుండేది'
ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎప్పుడెప్పుడు ఐపీఎల్లో ఆడాలా అని ఎదురుచూస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడనున్న పుజారాను ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రాక్టీస్ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో చూపించాడు. అయితే అతనికి సీఎస్కే అవకాశాలు ఇస్తుందా అన్న అనుమానం ఉన్నా.. పుజారాకు చాన్స్ ఇస్తే మాత్రం తన విలువేంటో చూపించేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పుజారా తన సహచర ఆటగాడు హనుమ విహారి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమ విహారిని ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ''మనం టీమిండియా తరపున ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం.. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో.. నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. గత కొన్నేళ్లలో టీమింయాలో ఉన్న సహచరుల్లో ఐపీఎల్ మిస్సయ్యింది నేను మాత్రమే అనుకుంటా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నా. తాజాగా హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు. 2018 తర్వాత అతన్ని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది..'' అని చెప్పుకొచ్చాడు. కాగా హనుమ విహారి గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఎస్ఆర్హెచ్ హనుమ విహారిని రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఎవరు అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇక ఐపీఎల్లో 30 మ్యాచ్‌లు ఆడిన పుజారా 390 పరుగులు సాధించాడు. గతంలో కేకేఆర్, ఆర్సీబీలకు ఆడిన పుజారా తాజాగా సీఎస్కే తరపున ఆడనున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ పట్టుకుంది. వరుసగా ఆటగాళ్లంతా కరోనా బారిన పడుతుండడంతో ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది. చదవండి: 'మేం సీఎస్కేకు ఆడలేం'.. కారణం అదేనట నేను కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు: సంజూ -
ఏం జరిగినా ఆడాలనుకున్నా: హనుమ విహారి
సాక్షి, హైదరాబాద్: 161 బంతుల్లో 23 పరుగులు... ఈ స్కోరు చూస్తే ఇంతేనా అనిపిస్తుంది! కానీ ఇదే ఇన్నింగ్స్ విలువ మాటల్లో చెప్పలేనంత అమూల్యం! గాయంతో బాధపడుతూనే ఒక్కో బంతిని ఎదుర్కొంటూ భారత్‌ను ఓటమి నుంచి రక్షించిన ఈ ప్రదర్శన హనుమ విహారిని ఒక్కసారిగా హీరోను చేసింది. అప్పటి వరకు ఆడిన 11 టెస్టుల ప్రదర్శనతో పోలిస్తే సిడ్నీలో పోరాటం విహారి స్థాయిని పెంచింది. అశ్విన్‌తో కలిసి విహారి ఆడిన ఆటతో మూడో టెస్టును కాపాడుకున్న భారత్ చివరి టెస్టులో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండో పర్యటనలోనూ గెలుపు బృం దంలో భాగంగా ఉన్న విహారి తాజా సిరీస్ విజయం పట్ల అమితానందంగా కనిపించాడు. ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్తో గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన కెరీర్లో సిడ్నీ ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుం దన్న విహారి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... బ్రిస్బేన్‌లో గెలుపు, సిరీస్ సొంతం కావడంపై... చాలా చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల క్రితం మేం ఉన్న స్థితి నుంచి సిరీస్ గెలుపు వరకు చూస్తే అంతా అద్భుతంలా కనిపించింది. చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నేనూ ఉండటం చాలా గర్వంగా అనిపిస్తోంది. ముఖ్యంగా చివరి టెస్టులో మా వాళ్లంతా చాలా బాగా ఆడారు. వారిని అక్కడ చూస్తుంటే నేనూ ఉంటే బాగుండేదనిపించింది. విజయపు వేడుకల్లో భాగం కాలేకపోవడం సహజంగానే నిరాశ కలిగించింది. అశ్విన్‌లాగా కాకుండా నేను తర్వాతి మ్యాచ్ ఆడలేనని సిడ్నీలోనే తేలిపోయింది. ఎన్సీఏకి వెళ్లి గాయం నుంచి కోలుకునేం దుకు సాధ్యమైనంత త్వరగా రీహాబిలిటేషన్ ప్రారంభించా లని చెప్పడంతో సిడ్నీ నుంచి రావాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు కానీ మూడో టెస్టులోగా కోలుకొని జట్టులోకి వస్తానని నమ్మకముంది. చదవండి: (ఆసీస్ అడ్డాలో టీమిండియా కొత్త చరిత్ర) రెండేళ్ల క్రితం గెలుపుతో పోలిస్తే... ఆసీస్ గడ్డపై అప్పటి వరకు భారత్ ఒక్కసారీ సిరీస్ నెగ్గలేదు. కాబట్టి నాడు అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తాజా విజయం మరింత మధురంగా అనిపిస్తోంది. నా వరకు చూస్తే రెండు సిరీస్ లలోనూ నేను జట్టులో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా ఆనందం రెట్టింపైంది. దీనిని మాటల్లో చెప్పలేను. ఇంత కంటే ఇంకేం ఆశించగలను! నిజానికి క్వారంటైన్, బయో బబుల్ చాలా కఠినంగా అనిపించాయి. అయితే ఇంత ప్రతిష్టాత్మక సిరీస్ ఆడుతున్న సమయంలో ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని మేమందరం గట్టిగా అనుకున్నాం కాబట్టి అది ఇబ్బంది కాలేదు. ఈ రెండు పర్యటనల మధ్య బ్యాట్స్‌మన్‌గా కూడా నేను ఎంతో మెరుగయ్యాను. వైఫల్యాల తర్వాత జట్టులో స్థానంపై... సహజంగానే కొంత అనిశ్చితి ఉంటుంది. అడిలైడ్, మెల్బోర్న్లలో నేను తక్కువ స్కోర్లు చేయడం వాస్తవమే అయినా ఎక్కడా తడబడలేదు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మంచి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాను. అయితే అవి భారీ స్కోర్లుగా మారలేదు. అయినా తుది జట్టు ఎంపిక గురించి ఊహించలేం. అవకాశం రాకపోతే ఏమీ చేయలేం. అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం వంద శాతం కష్టపడి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇక నేను ఒకటి మినహా (వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై) మిగిలిన 11 టెస్టులు విదేశాల్లోనే ఆడాను. టీమ్ మేనేజ్మెంట్ నన్ను బయటి టెస్టుల్లోనే పరిగణనలోకి తీసుకుంటోందా అనేది కూడా చెప్పలేను. అయితే అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. సిడ్నీ అద్భుతం గురించి... ఆ రోజు గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా భావోద్వేగానికి లోనవుతా! నేను బ్యాటింగ్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే (27 బంతులకు) కండరాలు పట్టేశాయి. ఇక పరుగు తీయడం కష్టమని అర్థమైపోయింది. తర్వాతి ఓవర్లోనే పుజారా వెనుదిరిగాడు. అంతే... ఇక మ్యాచ్‌ను కాపాడుకోవాలని నేను, అశ్విన్ నిర్ణయించుకున్నాం. వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా నిలబడ్డాం. ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం సులువు కాదు. ఆ సమయంలో అది మరీ కష్టంగా అనిపించింది. నొప్పి పెరిగిపోవడంతో నివారణ ఇంజక్షన్ తీసుకున్నాను. బలవంతంగా ఆటలో కొనసాగితే గాయం తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే విషయం గురించి ఆలోచించలేదు. రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత కూడా నన్ను నమ్మి మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇచ్చింది. దానిని నిలబెట్టుకునేందుకు ఏం జరిగినా ఆడాలనుకున్నా. ఇద్దరం ఒకే తరహా స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రోత్సహించుకుంటూ కదిలాం. అశ్విన్‌కు కొంత తెలుగు పరిజ్ఞానం ఉండగా... చెన్నైలో ఆడిన అనుభవంతో నాకు తమిళం వచ్చు. అవే భాషల్లో మా సంభాషణ సాగింది. ఆట ముగిశాక నాకు కలిగిన సంతృప్తిని మాటల్లో చెప్పలేను. సిరాజ్ ప్రదర్శనపై... సిరాజ్ తొలి రంజీ మ్యాచ్‌కు (2015లో సర్వీసెస్‌తో) నేనే హైదరాబాద్ కెప్టెన్‌గా ఉండి క్యాప్ అందించా. అప్పటి నుంచి అతనితో సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కలిసి టెస్టులు ఆడాం. అంతులేని ఆత్మవిశ్వాసమే అతని బలం. మైదానంలో ఉన్నప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు ఆ జోష్, పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ సిరాజ్ చాలా బాగా ఆడాడు. వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి అతను ఆడిన ఆటను ప్రశంసించకుండా ఉండలేం. -
మంత్రి కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఆటగాడు హనుమ విహారి సోమవారం తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అశ్విన్‌తో కలిసి హనుమ విహారి కడదాకా నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లు వరుస బౌన్సర్లతో బెంబెలెత్తించిన.. ఈ ఇద్దరు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బ్యాటింగ్ చేసి జట్టును ఓటమినుంచి గట్టెక్కించారు. హనుమ విహారి ప్రదర్శనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం విహారి కేటీఆర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ కేటీఆర్‌కు వివరించాడు. కేటీఆర్‌ను కలవడం, క్రికెట్ గురించి ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరగడం ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. అనంతరం కేటీఆర్‌తో దిగిన ఫొటోలను విహారి ట్విటర్లో షేర్ చేశాడు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మన్ @Hanumavihari మంత్రి @KTRTRS ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. pic.twitter.com/Lz96cnEWVw — KTR News (@KTR_News) January 18, 2021 -
ఇంత దారుణమా.. క్రికెట్‌ను చంపేశాడు!
సిడ్నీ టెస్టులో జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ అతను 161 బంతులు ఆడాడు. దీనిపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక వ్యాఖ్యతో తన అసంతృప్తిని ప్రదర్శించాడు. ‘7 పరుగులు చేసేందుకు 109 బంతులా... ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్‌ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని హనుమ బిహారి పోగొట్టాడు. ఇది పెద్ద నేరం’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపైనే ట్విట్టర్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సుప్రియో అజ్ఞానాన్ని అంత తిట్టిపోశారు. అయితే విహారి దీనికి ఒకే ఒక పదంతో సమాధానం ఇచ్చాడు. ఇది బుధవారం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. తన పేరును తప్పుగా రాయడాన్ని చూపిస్తూ ‘హనుమ విహారి’ అంటూ భారత క్రికెటర్ ట్వీట్ చేశాడు. దీనికి సుమారు 61 వేల లైక్‌లు రాగా... సహచరుడు అశ్విన్ కూడా ROFL MAXX!! అంటూ పడిపడి దొర్లి నవ్వుతున్నట్లు ట్వీట్ చేశాడు. దీనికి 80 వేల లైక్‌లు వచ్చాయి. సెహా్వగ్ కూడా ‘ఒక్క విహారి అందరి లెక్క సరి చేశాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. చదవండి: స్మిత్వి అన్ని చిన్నపిల్లల బుద్ధులే -
'మీ ఆటకు ఫిదా.. అవేవి మిమ్మల్ని ఆపలేదు'
సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ చూపించిన తెగువపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పేసర్ల బౌన్సర్లు వీరిని కలవరపెట్టినా ఏ మాత్రం బెదరకుండా ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాగా విహారీ, అశ్విన్‌ల ఆటతీరుపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్) 'నిజంగా నిన్న అద్భుతమైన టెస్టు మ్యాచ్ చూశా! విహారి, అశ్విన్లిద్దరు ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ కొనసాగించిన తీరుకు ఫిదా అయ్యా. ఆటలో భాగంగా ఆసీస్ బౌలర్ల నుంచి పదునైన బౌన్సర్లతో గాయాలవుతున్న అవేవి మిమ్మల్ని ఆపలేదు.. పైగా ఓటమిని దరిచేయకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడారు. మ్యాచ్‌ను డ్రా చేయాలనే మీ సంకల్ప దృడత్వాన్ని ఇక మీదట అలాగే కొనసాగించండి. మ్యాచ్ విజయం కన్నా డ్రాగా ముగించడం మరింత ఆనందాన్నిచ్చింది.'అంటూ తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. (చదవండి: బుమ్రా ఔట్.. డైలమాలో టీమిండియా) -
సంకట్ మోచన్ ‘హనుమ’
సిడ్నీ: 12 టెస్టుల్లో ఒకటి మినహా అన్నీ విదేశాల్లో ఆడినవే... ఇతర బ్యాట్స్‌మెన్ తరహాలో స్వదేశంలో టన్నులకొద్దీ పరుగులు సాధించి స్థానం సుస్థిరం చేసుకునే అవకాశం దక్కలేదు. కానీ విమర్శకుల కత్తి పదును మాత్రం హనుమ విహారి వైపే ఉంది. తాజా సిరీస్‌లో విహారి స్కోర్లు వరుసగా 16, 8, 21, 4 కావడంపై అతను టెస్టు జట్టులో ఉండటమే అనవసరం అన్నట్లుగా విశ్లేషకులు విరుచుకుపడ్డారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కూడా నీకు నేనున్నానంటూ అండగా నిలబడే వ్యక్తులు కూడా విహారికి ఎవరూ లేరు! ఈ టెస్టులో మయాంక్‌ను కాకుండా విహారినే తీసేయాల్సిందంటూ వ్యాఖ్యలు వినిపించాయి. చివరి క్షణంలో అదృష్టవశాత్తూ అతను స్థానం నిలబెట్టుకున్నాడు. ఇలాంటి స్థితిలో తొలి ఇన్నింగ్స్ వైఫల్యం తర్వాత మ్యాచ్‌ను కాపాడాల్సిన ఒత్తిడిలో విహారి మైదానంలోకి దిగాడు. సరిగ్గా చెప్పాలంటే తన కెరీర్‌ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏం జరిగినా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 18వ బంతికిగానీ తొలి పరుగు తీయలేదు. మరో 10 బంతులు కూడా ఆడలేదు... తొడ కండరాలు పట్టేశాయి! రన్నర్‌కు అవకాశం లేదు కాబట్టి కొనసాగేందుకు సిద్ధమైపోయాడు. నొప్పి పెరిగింది, సింగిల్ కూడా తీయలేని పరిస్థితి. పరుగు తీసే ప్రయత్నంలో కుంటుతూ వెళ్లాల్సి రావడంతో ఇక నా వల్ల కాదన్నట్లుగా మధ్యలోనే ఆగిపోయాడు. ఫీల్డర్ డైరెక్ట్ హిట్ కొడితే 3 పరుగుల వద్దే ఖేల్ ఖతమయ్యేది. ఇలాంటి సమయంలో విహారి అనుకుంటే ఆటను వదిలి పెవిలియన్‌కు వెళ్లిపోయేవాడు. కానీ అతను ఆ పని చేయలేదు. అన్ని అడ్డంకులను పక్కన పెట్టి పట్టుదలగా నిలబడ్డాడు. ఎలాగైనా ఆసీస్ విజయాన్ని అడ్డుకోవాలని భావించిన విహారి ప్రతీ బంతిని నిరోధించేందుకు సిద్ధమైపోయాడు. ఇక అతని మనసులో ఆంజనేయుడి తరహాలో భారత జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఆలోచన తప్ప గాయం గుర్తుకే రాలేదు. 50 బంతుల్లో 4 పరుగులు... 100 బంతుల్లో 6 పరుగులు... అవసరమైనప్పుడు జిడ్డుగా ఆడటం ఏమిటో ఈ ఆంధ్ర క్రికెటర్ ఇలా చూపించాడు! ఎట్టకేలకు దాదాపు మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత 125 బంతికి అతని తొలి ఫోర్ వచ్చింది. మధ్యలో కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నా సరే... లక్ష్యం చేరే వరకు ఆగకూడదని భావించిన విహారి చివరికంటా నిలిచి తన విలువేమిటో చూపించాడు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతను ఆడిన శైలి అద్భుతమంటూ ప్రముఖులు పొగుడుతున్నారు. దురదృష్టవశాత్తూ తర్వాతి టెస్టుకు దూరమవుతున్నా... విహారి సిడ్నీ ప్రదర్శనను ఎవరూ రాబోయే రోజుల్లో మరచిపోరు. భారత అభిమానుల దృష్టిలో అతను ప్రాణం పోతున్న సమయంలో సంజీవని తెచ్చి బతికించిన హనుమంతుడు! -
ఆసీస్‌తో సిరీస్.. భారత్‌కు ఎదురుదెబ్బ..
సిడ్నీ: తొడ కండరాల గాయంతో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి ఆస్ట్రేలియాతో ఈనెల 15 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే చివరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. సిడ్నీలో సోమవారం టెస్టు ముగిశాక విహారికి స్కానింగ్ చేశారు. దీని రిపోర్టును బట్టి విహారి కేవలం ఒక టెస్టుకా లేదంటే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కూ దూరమయ్యే అవకాశముందో తెలుస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా చేతి వేలు విరిగిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది. చివరి ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ ఓవర్లు ఆడి టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవడం భారత జట్టుకిది ఏడోసారి. 1979లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు అత్యధికంగా 150.5 ఓవర్లు ఆడి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున టెస్టుల్లో 6,000 పరుగులు పూర్తి చేసుకున్న 11వ క్రికెటర్‌గా చతేశ్వర్ పుజారా ఘనత వహించాడు. పుజారా 80 టెస్టుల్లో ఈ మైలురాయి చేరాడు. చదవండి: విహారి పోరాటం అదిరింది.. ఆసీస్ అలసింది -
సహచరునిపై అశ్విన్ ప్రశంసల వర్షం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారి, మ్యాచ్‌ను వారికి దక్కకుండా చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారిని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తాడు. మ్యాచ్‌ను డ్రాగా ముగించే క్రమంలో విహారి సాధించిన అజేయమైన 23 పరుగులు శతకంతో సమానమని, తాను చూసిన మేటి ఇన్నింగ్స్‌ల్లో ఇది కూడా ఒకటి అని అశ్విన్ పేర్కొన్నాడు. గాయంతో బాధపడుతూనే ఆటను కొనసాగించిన విహారి.. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్‌ను చేజారకుండా వీరోచితమైన ఇన్నింగ్స్‌ను ఆడాడని ప్రశంసించాడు. అతని ప్రదర్శన యావత్ భారతావనిని గర్వపడేలా చేసిందని కొనియాడాడు. విహరి ఇన్నింగ్స్ టీమిండియా మాజీ ఆటగాడు 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ప్రదర్శనను గుర్తుచేసిందని పేర్కొన్నాడు. అతను ప్రదర్శించిన పోరాట పటిమ సహచర సభ్యుల్లో ఎంతో స్పూర్తిని నింపిందని, ఆఖరి టెస్టులో విజయం సాధించడానికి ఇది తమకు తోడ్పడుతుందని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే రహానే (18 బంతుల్లో 4 పరుగులు) వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు సాధించి భారత్ శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు. ఇక పుజారా 205 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 77 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో తన వంతు సహకారాన్ని అందించాడు. విహారికి జతగా అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు సాధించి సమయోచితమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. వీరిద్దరూ కలిసి 257 బంతులను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. తొలి ఇన్సింగ్స్‌లో 338 పరుగులు చేసి భారత్‌ను 238 పరుగులకు కట్టడి చేసిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్సింగ్స్‌లో మరింత మెరుగ్గా ఆడిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్సింగ్స్‌ను 312 పరుగుల వద్ద ఆసీస్ డిక్లేర్ చేసింది. 407 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. -
వాటే సెన్సేషనల్ రనౌట్..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. నిన్నటి ఆటను రెండు వికెట్ల నష్టానికి 96 పరుగుల వద్ద ముగించిన టీమిండియా.. ఈ రోజు మూడొందల మార్కును ఈజీగా దాటుతుందని అనుకున్నప్పటికీ మనోళ్లు ముందుగానే ఇన్నింగ్స్‌ను ముగించారు. టీమిండియా మూడొందల పరుగుల మార్కును దాటకపోవడంలో ఆసీస్ ఫీల్డింగ్ కూడా ఒక కారణం. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లను రనౌట్ చేయగా, అందులోనూ ఒక టెస్టు మ్యాచ్‌లో రనౌట్లు రూపంలో మూడు వికెట్లను చేజార్చుకోవడం సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. కాగా, ఆ మూడు రనౌట్లలో హనుమ విహారి రనౌట్ అయిన తీరు బాధకరం అనే కంటే హజిల్‌వుడ్ రనౌట్ చేసేన తీరు కొనియాడకతప్పదు. (148 పరుగులు.. 8 వికెట్లు) భారత కెప్టెన్ రహానే ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హనుమ విహారి.. లయన్ వేసిన 68 ఓవర్లో మిడాఫ్ వైపుకు బంతిని ఆడి సింగిల్ తీయబోయాడు. పరుగు తీద్దామా.. వద్దా అనే ఆలోచనలో విహారి పరుగు పూర్తి చేయాలనుకుని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. కానీ అక్కడే కాచుకుని ఉన్న హజల్‌వుడ్ బంతిని అందుకున్న వెంటనే వికెట్లపైకి నేరుగా గిరటేశాడు. అతని శరీరం మొత్తం గాల్లో ఉండగానే బంతిని గురి చూసి కొట్టడంతో విహారి రనౌట్ అయ్యాడు. ఇది నేటి ఆటలో టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. విహారి కనుక క్రీజ్‌లో ఉండి ఉంటే భారత్ మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం విహారి రనౌట్ వీడియో వైరల్‌గా మారింది. 96/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ఆటలో రహానేనకు కమిన్స్ పెవిలియన్‌కు పంపగా, ఆపై హనుమ విహారి(4) రనౌట్ అయ్యాడు. ఆ తరుణంలో పుజారా- పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 53 పరుగులు జత చేసిన తర్వాత పంత్‌ను హజల్‌వుడ్ ఔట్ చేశాడు. దాంతో టీమిండియా 195 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోగా, అదే స్కోరు వద్ద పుజారాను కమిన్స్ ఔట్ చేశాడు. ఆ సమయంలో జడేజా-అశ్విన్‌లు ప్రతిఘటించే యత్నం చేశారు. కాగా, అశ్విన్(10) ఏడో వికెట్‌గా ఔటైన కాసేపటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా మాత్రం కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో భారత్ 240 పరుగుల మార్కును దాటింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే టీమిండియా 94 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. (అప్పుడూ ఇదే సీన్.. మరి టీమిండియా గెలిచేనా?) Don't take on the Hoff! ⚡@hcltech | #AUSvIND pic.twitter.com/eXFpRPuKiJ — cricket.com.au (@cricketcomau) January 9, 2021 -
జడేజా కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడా!
అడిలైడ్ : మెల్బోర్న్ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలని భారత్ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. తొలి టి20 మ్యాచ్‌లో కన్‌కషన్‌కు గురైన తర్వాత కోలుకున్న జడేజా తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది తేలలేదు. పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసే స్థాయిలో అతను ఫిట్‌గా ఉంటే మాత్రం ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి స్థానంలో జడేజాను తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ‘విహారిని పక్కన పెట్టాలనుకోవడానికి అతని వైఫల్యం కారణం కాదు. జట్టు కాంబినేషన్ కోసం ఆల్‌రౌండర్‌గా జడేజా సరిపోతాడు. ఇటీవల అతని బ్యాటింగ్ చాలా మెరుగుపడింది. పైగా లైనప్‌లో ఏకైన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా అతను ప్రత్యేకత చూపించగలడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సిడ్నీలో రోహిత్ శర్మ క్వారంటైన్ కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఆ్రస్టేలియా దేశంలో కొత్త నిబంధనలు వస్తుండటంతో రెండో టెస్టు జరిగే మెల్బోర్న్కు రోహిత్‌ను పంపరాదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు సిడ్నీలోనే జరిగితే రోహిత్‌కు ఇబ్బంది ఉండదు. వేదిక బ్రిస్బేన్‌కు మారితే మాత్రం బీసీసీఐ రోహిత్ కోసం మళ్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. -
రిషభ్ పంత్ వీర విహారం
‘పింక్ టెస్ట్’కు ముందు జరుగుతున్న డే అండ్ నైట్ సన్నాహక పోరులో భారత బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ముగ్గురు ఆటగాళ్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటారు. ఆరో బ్యాట్స్‌మన్‌గా అవకాశం కోరుకుంటున్న హనుమ విహారి శతకం సాధించగా... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పోటీ పడుతున్న రిషభ్ పంత్ తన బ్యాటింగ్ పదునేమిటో మెరుపు సెంచరీతో చూపించాడు. రెండో ఓపెనర్‌గా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న శుబ్‌మన్ గిల్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న మయాంక్‌కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే పృథ్వీ షా మాత్రం మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత్ ముందు తేలిపోయిన ఆస్ట్రేలియా ‘ఎ’ చివరి రోజు ఓటమిని తప్పించుకోగలదా చూడాలి. సిడ్నీ: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన భారత బ్యాట్స్‌మెన్ వెంటనే తమ ఆటను చక్కదిద్దుకున్నారు. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు), రిషభ్ పంత్ (73 బంతుల్లో 103 బ్యాటింగ్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. శుబ్‌మన్ గిల్ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లోని 86 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రెండో రోజు మధ్యలో కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించినా... ఇబ్బంది లేకుండా మొత్తం 90 ఓవర్ల ఆట సాగింది. నేడు మ్యాచ్‌కు ఆఖరి రోజు. పృథ్వీ షా విఫలం... చక్కటి బ్యాటింగ్ పిచ్‌పై కనీసం నిలబడే ప్రయత్నం చేయకుండా పృథ్వీ షా (3) పేలవ షాట్ ఆడి ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టు అవకాశాలు కూడా దూరం చేయవచ్చు! అయితే ఓపెనర్ స్థానం కోసం షాతో పోటీ పడుతున్న గిల్ మాత్రం మరోసారి సాధికారిక ఆటతీరు కనబర్చాడు. చూడచక్కటి కవర్‌డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పాటు బ్యాక్‌ఫుట్‌పై పూర్తి నియంత్రణతో అతను ఆడిన తీరు సరైన టెస్టు బ్యాట్స్‌మన్‌ను చూపించాయి. 49 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే కొద్ది సేపటికే దురదృష్టవశాత్తూ అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో గిల్ వెనుదిరిగాడు. స్వెప్సన్ బౌలింగ్‌లో ఎల్బీ కోసం అప్పీల్ చేయగా... బంతి బ్యాట్‌కు తగిలిందని భావించిన అంపైర్ స్లిప్‌లో అబాట్ క్యాచ్ పట్టడంతో అవుట్‌గా ప్రకటించాడు. మరోవైపు మయాంక్ పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డాడు. స్వెప్సన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 91 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ దూకుడు... తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విహారి రెండో ఇన్నింగ్స్‌ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతి కొంత ఇబ్బంది పెడుతున్న సమయంలో అతను చక్కటి ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. అందమైన ఆన్ డ్రైవ్‌లు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. 98 బంతుల్లో విహారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనితో పంత్ జత కలిసిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. విహారి, పంత్ 147 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యంలో (22.4 ఓవర్లలో) విహారి స్కోరు 42 పరుగులు మాత్రమే కాగా పంత్ సెంచరీతో చెలరేగడం విశేషం. ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడ్డ పంత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు విల్డర్‌ముత్ బౌలింగ్‌లో సింగిల్‌తో 188 బంతుల్లో విహారి శతకం పూర్తయింది. అయితే రెండో రోజు చివరి ఓవర్‌కు ముందు ఓవర్ ఆఖరి బంతికి సదర్లాండ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ 81 పరుగుల వద్ద నిలిచాడు. విల్డర్‌ముత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) స్వెప్సన్ (బి) స్టెకెటీ 3; మయాంక్ (సి) (సబ్) రోవ్ (బి) విల్డర్‌ముత్ 61; గిల్ (సి) అబాట్ (బి) స్వెప్సన్ 65; విహారి (బ్యాటింగ్) 104; రహానే (సి) క్యారీ (బి) స్టెకెటీ 38; పంత్ (బ్యాటింగ్) 103; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 386. వికెట్ల పతనం: 1–4; 2–108; 3–161; 4–239. బౌలింగ్: సీన్ అబాట్ 7–1–24–0; స్టెకెటీ 16–1–54–2; సదర్లాండ్ 16–5–33–0; విల్డర్‌ముత్ 15–2–79–1; స్వెప్సన్ 29–1–148–1; మ్యాడిసన్ 7–1–42–0 బౌలర్లకు ప్రాక్టీస్ కావాలి... విజయానికి సరిపడా స్కోరు సాధించినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. మన బ్యాట్స్‌మెన్‌కు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రెండో రోజు మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే బౌలర్లు మాత్రం డే అండ్ నైట్ మ్యాచ్ కోసం మరింత సాధన కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ‘ఎ’ 32.2 ఓవర్లకే కుప్పకూలింది. ఆ జట్టు పేలవ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే వారు రోజంతా నిలబడతారా అనేది సందేహమే. చీకటి పడే సమయానికి ముందే ఆసీస్ ‘ఎ’ ఇన్నింగ్స్ ముగిసిపోతే పింక్ బాల్‌తో మన బౌలర్లు ఆశించిన ప్రాక్టీస్ లభించదు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా చివరి రెండు సెషన్లు ప్రత్యర్థికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. అందుకే భారత్ తమ బ్యాటింగ్‌ను కొనసాగించవచ్చు. -
భారత టెస్టు స్పెషలిస్ట్‌లు దుబాయ్‌కి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టు స్పెషలిస్ట్‌లు, కోచింగ్ బృందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్లో ఆడని చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలతోపాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందిని నేరుగా ఆస్ట్రేలియా పంపించకుండా సహచరులతో కలిసి దుబాయ్ నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వీరందరినీ బోర్డు ఈ నెలాఖరులో దుబాయ్‌కు పంపించనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం వీరంతా అక్కడే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. వారంలో మొదటి, మూడో, ఆరో రోజున కోవిడ్–19 పరీక్షలకు హాజరవుతారు. అంతా ఓకే అనుకుంటే బయో బబుల్‌లో అక్కడే ఉన్న భారత జట్టు ఆటగాళ్లతో కలుస్తారు. వీరంతా ఒకే చార్టెర్డ్ ఫ్లయిట్లో ఆస్ట్రేలియా బయల్దేరతారు. ఆస్ట్రేలియా సిరీస్ పూర్తిగా బయో బబుల్ వాతావరణంలో జరగనున్న నేపథ్యంలో భారత బృందమంతా ఒకే తరహా వాతావరణం నుంచి వెళితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఒక బయో బబుల్ రక్షణ కవచం నుంచి మరో బయో బబుల్ (ఆస్ట్రేలియాలో)లోకి వెళ్లడం సులువవుతుందని, అందుకే అందరూ కలిసి వెళ్లడం మంచిదని తాము భావించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు నేరుగా ఏ నగరానికి వెళుతుందో, ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఉండే కరోనా పరిస్థితిని బట్టి మార్పులు జరగవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రెండు వారాలు క్వారంటీన్ కావాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటి వర కు ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. -
‘మ్యాట్’పై విహారి సాధన...
సాక్షి, హైదరాబాద్ : భారత ఆటగాళ్లు, పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో సన్నద్ధమవుతుండగా... తెలుగు కుర్రాడు, టెస్టు జట్టు సభ్యుడు హనుమ విహారి ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భిన్నమైన కసరత్తులు చేస్తున్నాడు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన విహారి క్లిష్టమైన కంగారు పర్యటన కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ‘ఐపీఎల్లో అవకాశం దక్కి ఉంటే బావుండేది. అయితే ఆడే చాన్స్ లేకపోవడంపై ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను ప్రాక్టీస్‌పైనే దృష్టి సారించాను. కోచ్ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో నా సాధన కొనసాగుతోంది’ అని విహారి అన్నాడు. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్లి ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో తన ఇంటి పరిసరాల్లోనే మ్యాటింగ్ వికెట్‌పై ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్ సెషన్ కోసం కోచ్ సలహా మేరకు ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. ఆసీస్‌లోని బౌన్సీ వికెట్లపై ఆడేందుకు ఈ విధమైన మ్యాటింగ్ వికెట్ ప్రాక్టీస్ దోహదం చేస్తుందని విహారి తెలిపాడు. భారత దిగ్గజాలుగా ఎదిగిన అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా ఇలాంటి మ్యాట్ పిచ్‌లపైనే ప్రాక్టీసే చేశారు. ఐపీఎల్లో ఆడని భారత క్రికెటర్ల సన్నాహాల్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షిస్తున్నారు. నిజానికి విహారి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయాడు. -
ఇక కౌంటీ క్రికెట్లో...
కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లంతా చాలా వరకు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే టెస్టు జట్టు సభ్యుడు, ఆంధ్ర కెప్టెన్ గాదె హనుమ విహారి మాత్రం తన ఆటకు మరింత పదును పెట్టుకునే పనిలో పడ్డాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) నిర్వహిస్తున్న రాజా ఆఫ్ పాలయంపట్టి (ఫస్ట్ డివిజన్) టోర్నీలో అతను పాల్గొన్నాడు. తాను ఉద్యోగిగా పని చేస్తున్న నెల్సన్ ఎస్సీ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. బుధవారం చెన్నైలో ఆళ్వార్‌పేట్ సీసీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విహారి 285 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విపత్కర స్థితిలోనూ క్రికెట్‌పై అతనికి ఉన్న నిబద్ధతను ఇది చూపిస్తోంది. ఇక ముందూ దీనినే కొనసాగించాలని విహారి భావిస్తున్నాడు. హైదరాబాద్: భారత క్రికెటర్లు కౌంటీల్లో ఆడటం దశాబ్దాలుగా సాగుతోంది. నాటి సునీల్ గావస్కర్‌నుంచి నేటి విరాట్ కోహ్లి వరకు చాలా మంది ఏదో ఒక సందర్భంలో కౌంటీ క్రికెట్ ఆడినవారే. ఇంగ్లండ్‌లోని ప్రతికూల పరిస్థితుల్లో ఆడి తమ ఆటను తీర్చి దిద్దుకోవాలనుకునే ప్రయత్నం కొందరిదైతే... భారత జట్టుకు మ్యాచ్‌లు లేని ఆఫ్ సీజన్ వేసవిలో (ఐపీఎల్‌కు ముందు రోజుల్లో) కౌంటీల్లో మరికొందరు బిజీగా కనిపించేవారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి చేరుతున్నాడు. కౌంటీల్లో ఆడేందుకు అతను ఇప్పటికే ఒక జట్టుతో దాదాపుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా అతను ఇంగ్లండ్ వెళ్లడం ఆలస్యమైంది. ‘ఈ సీజన్లో నేను నాలుగు కౌంటీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక జట్టుతో ఒప్పందం దాదాపుగా ఖరారైంది. ఏ జట్టుకు ఆడబోతున్నానో పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా. ప్రస్తుతం కరోనా కారణంగానే అన్ని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత నేను ఆడగలనని నమ్ముతున్నా. కౌంటీల్లో ఆడటం నాకు ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తుంది’ అని విహారి అన్నాడు. తమిళనాడు లీగ్‌లో ఆడటం ద్వారా తన మ్యాచ్ ప్రాక్టీస్ కొనసాగించినట్లు అతను చెప్పాడు. 9 టెస్టుల కెరీర్లో ఒక మ్యాచ్ మినహా (వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై) అతను 8 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. ‘నా బ్యాటింగ్‌పై నాకు విశ్వాసముంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా విదేశాల్లో రాణించే టెక్నిక్ నాకు ఉందని నమ్ముతోంది. అందుకే ఈ అవకాశాలు వచ్చాయి. ఇంగ్లండ్ అయినా, న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ అయినా పరిస్థితులకు అనుగుణంగా మన ఆటను మార్చుకోవడం ముఖ్యం. జట్టు నాకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నెరవేర్చగలనని ఆత్మవిశ్వాసం నాకుంది’ అని ఈ ఆంధ్ర క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టెస్టులో విహారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. హాగ్లీ ఓవల్ మైదానంలో బౌలింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై 70 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అయితే ఇది తన అత్యుత్తమ ప్రదర్శనగా భావించడం లేదని విహారి విశ్లేషించాడు. ‘దీనిని నేను గొప్పగా చూడటం లేదు. నేను బాగానే ఆడాననేది వాస్తవం. అయితే అది జట్టును గెలిపించలేకపోయింది. కఠిన పరిస్థితుల్లో పరుగులు సాధించడం మంచిదే కానీ జట్టుకు విజయం లభించినప్పుడే దాని విలువ పెరుగుతుంది’ అని విహారి అభిప్రాయ పడ్డాడు. ఈ సీజన్ చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో మొత్తం తొమ్మిది టెస్టులు ఆడబోతోంది. ‘సొంతగడ్డపై కూడా నాకు మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం ఖాయం. సాధన చేయడం, ఎలాంటి అవకాశాన్నైనా అందుకునేందుకు సిద్ధంగా ఉండటమే నా పని’ అని హనుమ స్పష్టం చేశాడు. కరోనా విరామంతో ఇకపై ఇంటికే పరిమితం అవుతుండటంతో భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ ఇచ్చిన వ్యక్తిగత ట్రైనింగ్ చార్ట్‌ను పాటించి ఫిట్నెస్ను కాపాడుకుంటానని అతను వెల్లడించాడు. -
పోరాటం లేదు.. దాసోహమే
క్రైస్ట్‌చర్చ్: భారత బ్యాట్స్‌మెన్ మరోసారి న్యూజిలాండ్ బౌలర్లకు దాసోహమయ్యారు. కనీసం పోరాటపటిమను కూడా ప్రదర్శించుకుండా నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నారు. దీంతో రెండో టెస్టు కూడా టీమిండియా చేతుల్లోంచి దాదాపు చేజారి వైట్‌వాష్‌కు దగ్గరైంది. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 97 పరుగుల లీడ్‌లో టీమిండియా ఉంది. ప్రస్తుతం హనుమ విహారీ (5 బ్యాటింగ్), పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బౌలింగ్‌లో కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (3/12) మరోసారి తన పేస్ రుచిచూపించగా.. గ్రాండ్‌హోమ్, వాగ్నర్,సౌతీలు తలో వికెట్ పడగొట్టారు. బ్యాట్స్‌మన్ తీరుమారలేదు.. కివీస్ టెయిలెండర్లు సైతం సులువుగా పరుగులు రాబట్టిన చోట భారత బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించిందన్న సంబరం కొన్ని నిమిషాలకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. స్కోర్ బోర్టులో పరుగుల కంటే వేగంగా వికెట్లు పడ్డాయి. పిచ్ ప్రభావం.. కివీస్ బౌలర్ల ప్రతిభ అనడంకంటే భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం, తొందరపాటు అని చెప్పాలి. తొలుత మయాంక్ అగర్వాల్(3)ను బౌల్ట్ బోల్తాకొట్టించగా.. సౌథీ బౌలింగ్‌లో పృథ్వీషా(14) తొందరపడ్డాడు. అనంతరం గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో ఔటైన విధంగానే రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఔటవ్వడం గమనార్హం. ఇక రహానే (9)ను పక్కా వ్యూహంతో వాగ్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి వ్యూహాలకు అనుభవజ్ఞుడైన రహానే తలవంచడం విడ్డూరంగా ఉంది. ఇక ఆదుకుంటాడని భావించిన పుజారా (24) కూడా బౌల్టౌ జిమ్మిక్కులను అర్థం చేసుకోలేక బౌల్డ్ అయ్యాడు. నైట్‌వాచ్‌మన్ ఉమేశ్ యాదవ్ (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. దీంతో 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా రెండో టెస్టులో ఓటమి అంచున నిల్చుంది. ఇక ప్రస్తుతం క్రీజులో ఉన్న విహారీ, పంత్‌ల పోరాటంపైనే టీమిండియా గెలుపోటమి ఆధారపడి ఉంది. అయితే ప్రస్తుత సమయంలో గెలుపుపై ఆశ లేదు కానీ కనీసం పోరాడే స్కోర్ సాధిస్తే కాస్త పరువైనా మిగులుతుంది. తోకను కత్తిరించలేకపోయారు.. కివీస్ టెయిలెండర్లు మరోసారి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆట ప్రాంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్(52) అర్థసెంచరీతో రాణించాడు. లాథమ్ మినహా మరే బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించకపోవడంతో ఓ క్రమంలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే కీలక సమయంలో జేమీసన్(49) దాటిగా ఆడి టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. జేమీసన్‌కు తోడు వాగ్నర్(21) భారత బౌలర్లను ప్రతిఘటించాడు. వీరిద్దరు 9 వికెట్‌కు 51 పరుగులు జోడించి కివీస్‌ను ఆధిక్యంవైపు నడిపించారు. అయితే షమీ బౌలింగ్‌లో జడేజా సూపర్బ్ క్యాచ్ అందుకోవడంతో వాగ్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ వెంటనే జేమీసన్‌ను కూడా షమీ పెవిలియన్‌కు పంపించడంతో కివీస్ 235 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమీ (4/81), బుమ్రా (3/62), జడేజా (2/22), ఉమేశ్ (1/46)లు రాణించారు. చదవండి: అదే బంతి.. బౌలర్ మారాడంతే! సలాం జడ్డూ భాయ్.. పర్ఫెక్ట్ ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ అంటే ఇదే! -
భారమంతా హనుమ, అజింక్యాలపైనే!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా గెలుచుకోవాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ఆ భారమంతా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారిలదే. తొలి ఇన్నింగ్స్ లోటు 183 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగుల వెనుకంజలో కోహ్లి సేన ఉంది. ప్రస్తుతం అజింక్యా రహానే (25 బ్యాటింగ్), విహారి (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(58) మినహా.. పృథ్వీ షా(14), పుజారా(11), కోహ్లి(19)లు ట్రెంట్ బౌల్ట్ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో నాలుగో రోజు రహానే, విహారిలతో పాటు రిషభ్ పంత్‌లు బ్యాటింగ్‌పైనే టీమిండియా తొలి టెస్టు భవిత్యం ఆధారపడి ఉంది. బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు.. పరువు కోసం తప్పక పోరాడాల్సిన స్థితిలో టీమిండియా టాపార్డర్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకుంది. ముందుగా ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడిన ప్రథ్వీ షా తన వికెట్ పారేసుకున్నాడు. ఓ వైపు మయాంక్ అగర్వాల్ పోరాడుతుండగా.. పుజారా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. టీ విరామానికి ముందు కోహ్లి సేనకు ఓ పెద్ద షాక్ తగిలింది. బౌల్ట్ బౌలింగ్‌లో పుజారా బౌల్డ్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. హాప్ సెంచరీతో ఊపుమీదున్న మయాంక్ అగర్వాల్ టిమ్ సౌతీ వేసిన లెగ్ సైడ్ బంతిని వెంటాడి మరి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మూడు ఫోర్లతో కాన్ఫిడెంట్‌గా కనిపించిన సారథి కోహ్లి.. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అనవసరంగా టచ్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. దీంతో 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రహానే, విహారిలు భారీ భాగస్వామ్యం నమోదు చేయడం, పంత్ మెరుపులు మెరిపిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు లేవు. మరి నాలుగో రోజు టీమిండియా ఏం చేస్తుందో చూడాలి. జేమిసన్, బౌల్ట్ బౌండరీల వర్షం.. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్(14)ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్ యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (5/68), అశ్విన్(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు! ఆధిక్యం 51 నుంచి 183కు.. -
సెంచరీతో చెలరేగిన హనుమ విహారి
0, 1, 0... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు ఇవి. నిజానికి కివీస్ ఎలెవన్‌తో ఈ మ్యాచ్‌ను ఓపెనర్ల సామర్థ్యానికి పరీక్షగా భావించగా... కాస్త పచ్చిక ఉన్న పిచ్‌పై ముగ్గురూ అందులో విఫలమయ్యారు. అసలు టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనే సందేహమున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి మాత్రం సెంచరీతో సత్తా చాటాడు. విహారికి తోడుగా సీనియర్ పుజారా కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ కోహ్లి మాత్రం బ్యాటింగ్‌కు దూరంగా ఉండిపోవడమే శుక్రవారం ఆటలో విశేషం. హామిల్టన్: పిచ్‌పై కాస్త బౌన్స్, మరికాస్త స్వింగ్ కలగలిస్తే భారత బ్యాట్స్‌మెన్ తడబడతారనేది గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు వాటికి అతీతమని, ఎక్కడైనా రాణించగలదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై మాత్రం పెను సవాల్ ఎదురు కానుందని ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే తేలిపోయింది. కివీస్ ద్వితీయ శ్రేణి బౌలర్లను కూడా సమర్థంగా మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78.5 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోగా... ఇతర బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా దాటలేకపోయారు. విహారి, పుజారా ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. టపటపా... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కుగ్లీన్ వేసిన తొలి ఓవర్లోనే అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక పృథ్వీ షా (0) షార్ట్‌లెగ్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత కుగ్లీన్ బౌలింగ్‌లోనే ఆఫ్‌స్టంప్‌పై దూసుకొచ్చిన బంతిని ఆడి మయాంక్ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటిని జాగ్రత్తగా ఆడాలంటూ వ్యాఖ్యానించిన శుబ్‌మన్ గిల్ (0) ఈ ఇన్నింగ్స్‌లో షార్ట్ పిచ్ బంతినే ఆడలేక గల్లీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనుభవజ్ఞుడైన రహానే (18) కూడా నీషమ్ వేసిన స్వింగ్ బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. భారీ భాగస్వామ్యం... భారత్ స్కోరు 38/4గా నిలిచిన దశలో పుజారా, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. తాను ఆడిన తొలి 80 బంతుల్లో పుజారా ఒకే ఫోర్ కొట్టాడు. పిచ్ సాధారణంగా మారిపోయిన తర్వాత ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో విహారి కొట్టిన మూడు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అర్ధసెంచరీ చేసేందుకు పుజారాకు 153 బంతులు, విహారికి 132 బంతులు పట్టాయి. అయితే ఆ తర్వాత సెంచరీ అందుకునేందుకు విహారి మరో 48 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. మరో వైపు పుజారా మాత్రం సెంచరీకి చేరువలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... శతకం పూర్తి కాగానే విహారి రిటైర్డ్ అవుట్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు మిగిలిన సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ప్రయత్నంలో భారత బ్యాట్స్‌మన్ వెంటవెంటనే అవుటయ్యారు. 18 పరుగుల వ్యవధిలో చివరి నలుగురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్లీన్ 0; మయాంక్ (సి) క్లీవర్ (బి) కుగ్లీన్ 1; పుజారా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 93; గిల్ (సి) సీఫెర్ట్ (బి) కుగ్లీన్ 0; రహానే (సి) బ్రూస్ (బి) నీషమ్ 18; విహారి (రిటైర్డ్ అవుట్) 101; పంత్ (సి) కుగ్లీన్ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 0; అశ్విన్ (ఎల్బీ) (బి) సోధి 0; ఉమేశ్ (నాటౌట్) 9; జడేజా (సి) అలెన్ (బి) సోధి 8; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (78.5 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–0; 2–5; 3–5; 4–38; 5–233; 6–245; 7–246; 8–246; 9–250; 10–263. బౌలింగ్: కుగ్లీన్ 14–2–40–3; టిక్నర్ 15–3–37–0; మిషెల్ 7–1–15–0; నీషమ్ 13–3–29–1; గిబ్సన్ 10–1–26–2; సోధి 14.5–0–72–3; రవీంద్ర 5–1–30–0. ఓపెనింగ్ చేసేందుకు సిద్ధం! హామిల్టన్: విహారి కెరీర్ 7 టెస్టు మ్యాచ్‌లే కావచ్చు. కానీ తనకు టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు అవకాశం ఇచ్చినా దానిని వృథా చేయలేదు. ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఆడగలనని ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ నిరూపించాడు. ఏడాది క్రితం మెల్బోర్న్ టెస్టులో అనూహ్యంగా అతడిని ఓపెనర్‌గా పంపారు. 8, 13 పరుగులే చేసినా... తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 80 నిమిషాల పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం జట్టుకు పనికొచ్చింది. అతని ఈ ప్రదర్శనను కెప్టెన్ కోహ్లి స్వయంగా ప్రశంసించాడు. ఇప్పుడు అలాంటిదే మరో అవకాశం అతని కోసం ఎదురు చూస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ముగ్గురు ఓపెనర్లూ విఫలం కాగా, ఓపెనర్లకు ఉండే సమర్థవంతమైన టెక్నిక్‌తో విహారి సెంచరీ చేయడం అతనికి కొత్త అవకాశాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన విహారి ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సన్నద్ధమయ్యాను. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు. ఎవరూ మాట్లాడలేదు. అయితే గతంలో చెప్పినట్లు జట్టు అవసరాల దృష్ట్యా ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. కొన్ని సార్లు జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల బాధ పడకూడదు. స్వదేశంలో ఆడినప్పుడు మన జట్టు ఐదుగురు బౌలర్లతో దిగుతుంది కాబట్టి ఒక బ్యాట్స్‌మన్‌ను తప్పించాల్సిందే. నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి అదే కారణమని భావిస్తున్నా’ అని శుక్రవారం మీడియా సమావేశంలో విహారి వ్యాఖ్యానించాడు. -
గెలిపించిన విహారి, భరత్
జైపూర్: బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో దేశవాళీ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రెండో విజయాన్ని సాధించింది. రాజస్తాన్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆంధ్ర 4 వికెట్లు కోల్పోయి 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఒకదశలో 50 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును కెప్టెన్ హనుమ విహారి (107 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (64 బంతుల్లో 50; 8 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుత ఆటతీరుతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 243/8తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రాజస్తాన్ 257 పరుగులకు ఆలౌటైంది. చీపురుపల్లి స్టీఫెన్ (3/78), శశికాంత్ (3/66) మరోసారి తమ పేస్ ప్రతాపం చూపించారు. మ్యాచ్‌లో కీలకమైన 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శశికాంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తాజా విజయంతో ఆంధ్రకు 6 పాయింట్లు దక్కాయి. దీంతో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ అండ్ ‘బి’లో ఇప్పటివరకు రెండు విజయాలు, రెండు ‘డ్రా’లతో 14 పాయింట్లు సాధించిన ఆంధ్ర పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఆంధ్ర తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 11 నుంచి ఒంగోలులో హైదరాబాద్‌తో ఆడుతుంది. హైదరాబాద్ బోణీ... హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ హైదరాబాద్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓవర్‌నైట్ స్కోరు 204/7తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ 86.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తన్మయ్ (32; 4 ఫోర్లు), అక్షత్ రెడ్డి (32; 4 ఫోర్లు, సిక్స్), మల్లికార్జున్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), హిమాలయ్ అగర్వాల్ (34 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదం తొక్కిన హైదరాబాద్ కీపర్ కొల్లా సుమంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి. -
భారత ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా విహారి
న్యూఢిల్లీ: వచ్చే నెలలో న్యూజిలాండ్ పర్యటించే భారత ‘ఎ’ జట్లను సెలక్టర్లు ప్రకటించారు. ఈ టూర్లో భాగంగా ‘ఎ’ టీమ్ 3 వన్డేలు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు (అనధికారిక టెస్టులు) ఆడుతుంది. జనవరి 19, 22, 24 తేదీల్లో వన్డేలు... జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన పలువురు ఆటగాళ్లను రెండు అనధికారిక టెస్టుల కోసం ఎంపిక చేశారు. ఈ రెండు టెస్టులకు ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి నాయకత్వం వహిస్తాడు. చతేశ్వర్ పుజారా, రహానే, మయాంక్ అగర్వాల్, సాహా, అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఆడతారు. డోపింగ్ నిషేధం ముగిసిన మళ్లీ దేశవాళీ బరిలోకి దిగిన పృథ్వీ షాకు కూడా ఇందులో చోటు దక్కింది. ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ రెండు టీమ్‌లలోనూ ఉన్నాడు. వన్డే జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టీమ్‌లో కూడా సిరాజ్‌కు అవకాశం దక్కింది. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయడం విశేషం. ‘ఎ’ సిరీస్ తర్వాత భారత సీనియర్ జట్టు కివీస్‌తో తలపడనున్న నేపథ్యంలో సన్నాహకంగా అనేక మంది రెగ్యులర్ ఆటగాళ్లను ముందే న్యూజిలాండ్‌కు బీసీసీఐ పంపిస్తోంది. 24 జనవరి నుంచి భారత సీనియర్ టీమ్ పర్యటన మొదలవుతుంది. -
ఆంధ్ర జట్టుకు ఆధిక్యం
సాక్షి, ఒంగోలు టౌన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (70 బ్యాటింగ్; 8 ఫోర్లు)తోపాటు కెప్టెన్ హనుమ విహారి (38; 6 ఫోర్లు), మనీశ్ (42; 7 ఫోర్లు), కరణ్ షిండే (48; 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో... ఢిల్లీతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 16/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 6 వికెట్లకు 249 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఖాతాలో 34 పరుగుల ఆధిక్యం ఉంది. రికీ భుయ్‌కు తోడుగా గిరినాథ్ రెడ్డి (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైని మూడు వికెట్లు, పవన్ రెండు వికెట్లు తీశారు. -
హనుమ విహారి దూరం.. పంత్‌కు నో ఛాన్స్
పుణే: విశాఖ టెస్టులో ఇరగదీసిన టీమిండియా మరో టెస్టు గెలుపుపై కన్నేసింది. బుధవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా- టీమిండియాల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ జరిగే కొద్ది పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సారథి విరాట్ కోహ్లి బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. అయితే ఈ మ్యాచ్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారి అనూహ్యంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా కూడా ఒక్క మార్పుతో బరలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఏమాత్రం ఆకట్టుకోలేని ఆఫ్‌స్పిన్నర్ పీట్‌ను పక్కకు పెట్టి పేసర్ అన్రిచ్ నార్ట్జేను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక రెండో టెస్టు ఎంపికలోనూ రిషభ్ పంత్‌కు నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోని సాహాకు టీమ్ మేనేజ్మెంట్ మరో అవకాశం కల్పించింది. అయితే సాహా విఫలమవ్వడంతో తనను ఎంపిక చేస్తారని భావించిన పంత్‌కు నిరాశే మిగిలింది. ఇక హనుమ విహారిని పక్కకు పెట్టడానికి గల కారణాలను టీమ్ మేనేజ్మెంట్ తెలపలేదు. తొలి టెస్టులో దుమ్ము దులిపిన ఓపెనర్ రోహిత్ శర్మపై అందరి దృష్టి ఉంది. ఇక ఈ టెస్టులోనే అతడు అదరగొడితే టెస్టుల్లో ఓపెనర్‌గా సెటిల్ అయినట్టేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి 50వ టెస్టు కావడంతో విశేషం. నేటి నుంచి జరిగే పోరులో పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని సఫారీ జట్టు ఆరాటపడుతోంది. తుది జట్లు: టీమిండియా: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెపె్టన్), ఎల్గర్, మార్క్రమ్, డి బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, రబడ, అన్రిచ్ నార్ట్జే , ముత్తుసామి, మహరాజ్ -
హనుమ విహారికి అభినందన
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారిని హైదరాబాద్‌లో అతను ఓనమాలు నేర్చిన సెయింట్ జాన్స్ అకాడమీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ వ్యక్తిగతంగా విహారికి ప్రత్యేక బహుమతిగా కారును అందజేశారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఏఐ హర్ష కూడా ఇందులో పాల్గొన్నారు. -
అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది: విహారి
కింగ్స్టన్(జమైకా): స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలుగు క్రికెటర్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హనుమ విహారి అన్నాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక 468 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టును మట్టి కరిపించిన టీమిండియా ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనత సాధించింది. ఇక ఈ టెస్టులో సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన యువ క్రికెటర్ హనుమ విహారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విహారి మాట్లాడుతూ...టీమిండియా కోచ్ రవిశాస్త్రి సలహాలు, సూచనల వల్లే తాను ఈ మ్యాచ్‌లో రాణించగలిగానని పేర్కొన్నాడు. అదే విధంగా అజింక్య రహానే తనకు అండగా నిలబడి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సహాయపడ్డాడని తెలిపాడు. ‘తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. గత మ్యాచ్‌లో శతకం చేజార్చుకోవడంతో ఈసారి భారీ స్కోరు కోసం మరింత పట్టుదలగా నిలబడ్డాను. ఈ పిచ్‌పై ఓపిక అవసరం. బౌలర్లకు పిచ్ అనుకూలిస్తున్న సమయంలో చెత్త బంతి కోసం ఎదురు చూడాలి. రెండో ఇన్నింగ్స్‌లోనూ మా ప్రణాళిక బాగా పని చేసింది. నా బ్యాటింగ్ స్టాన్స్ మార్చుకునే విషయంలో కోచ్ రవిశాస్త్రి కొన్ని సూచనలు చేశారు. అవి బాగా పని చేశాయి. ఒత్తిడిలో ఆడటాన్ని నేను ఇష్టపడతాను. అదే మనలోని అసలు సత్తాను బయటపెడుతుందని నా నమ్మకం. తొమ్మిదేళ్ల క్రితమే నా ఫస్ట్ క్లాస్ కెరీర్ ప్రారంభమైంది కాబట్టి అప్పుడే 6 వేల పరుగులు దాటేశాను. స్వదేశంలో ఇంకా టెస్టు ఆడలేదు. దాని కోసం ఎదురు చూస్తున్నాను. మనోళ్ల మధ్య బ్యాటింగ్ చేయడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు. అయితే 26 ఏళ్ల వయసులోనే జుట్టు ఇంతగా ఎందుకు ఊడిపోయిందో తనకు తెలీదని... బహుశా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువగా బ్యాటింగ్ చేయడం వల్లేనేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. చదవండి : రెండో టెస్టులోనూ విండీస్ చిత్తు..సిరీస్ కైవసం కాగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విహారిపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఈ టెస్టులో విహారి ఇన్నింగ్స్ అత్యుత్తమం. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విహారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో మేమెంతో ప్రశాంతంగా కూర్చున్నాం. తప్పులు సరిదిద్దుకునేందుకు, ఆటను మెరుగుపర్చుకునేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. తను ప్రాణం పెట్టి ఆడే రకం. జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఇంత స్వల్ప కెరీర్లోనే విహారికి జట్టు ఎందుకు మద్దతునిస్తోందో అతను చూపించాడు’ అని రోహిత్ శర్మను కాదని విహారిని జట్టులోకి తీసుకున్న తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నాడు. చదవండి : కెప్టెన్‌గా కోహ్లి సరికొత్త రికార్డు చదవండి : మా ముందున్న లక్ష్యం అదే : కోహ్లి -
విరాట్ విజయం @ 28
భారత్ తిరుగులేని ప్రదర్శనకు మరో భారీ విజయం దక్కింది. తొలి టెస్టులాగే రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో గెలుపుతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో 120 పాయింట్లతో శిఖరాన నిలబడింది. కోహ్లి సేన సమష్టి బౌలింగ్ ప్రదర్శన ముందు విండీస్ చేవలేని బ్యాటింగ్ మళ్లీ తలవంచింది. ఫలితంగా కరీబియన్ పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా మూడు సిరీస్‌లనూ కైవసం చేసుకొని వెనుదిరిగింది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే కింగ్స్టన్ గడ్డపై విరాట్ కోహ్లి కెరీర్ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే వేదికపై మరో అరుదైన ఘనతతో సగర్వంగా నిలబడ్డాడు. తాజా ఫలితంతో భారత టెస్టు కెప్టెన్‌గా అతని ఖాతాలో 28వ విజయం చేరింది. దీంతో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ధోని (27)ని వెనక్కి నెట్టి కోహ్లి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 48వ టెస్టులోనే ఈ ఘనత సాధించి రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లను చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కింగ్స్టన్ (జమైకా): టెస్టుల్లో తమ బలాన్ని చూపిస్తూ భారత జట్టు విండీస్ గడ్డపై మరో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. 468 పరుగుల అసాధ్యమైన విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. బ్రూక్స్ (119 బంతుల్లో 50; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా, షమీ చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇదే టూర్లో టి20, వన్డే సిరీస్ లు కూడా భారత్ ఖాతాలోనే చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సాధించిన విహారి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌కు సంబంధించి ఈ సిరీస్‌లో అందుబాటులో ఉన్న 120 పాయింట్లు భారత్ ఖాతాలో చేరాయి. బ్రూక్స్ మినహా... తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భరతం పడితే... రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్ల సమష్టి ప్రదర్శన భారత్‌కు విజయాన్ని అందించింది. మ్యాచ్ మూడో రోజే ఓపెనర్లను కోల్పోయి ఓటమికి బాటలు వేసుకున్న విండీస్ నాలుగో రోజు నిలవలేకపోయింది. ఆదివారం 46.5 ఓవర్లు ఆడి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయి టీ విరామానికి ముందే భారత్‌కు తలవంచింది. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్రూక్స్, బ్లాక్‌వుడ్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించడమే చెప్పుకోదగ్గ అంశం. ఇది మినహా ఆ జట్టు బ్యాటింగ్ ఎప్పటిలాగే పేలవంగా సాగింది. 14 ఓవర్ల పాటు భారత బౌలింగ్‌ను నిరోధించిన అనంతరం ఛేజ్ (12)ను జడేజా ఎల్బీగా అవుట్ చేయడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. ఈ దశలో కొంత అదృష్టం కూడా కలిసొచ్చి బ్రూక్స్, బ్లాక్‌వుడ్ నిలబడ్డారు. లంచ్ తర్వాత బ్లాక్‌వుడ్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కోహ్లి చక్కటి ఫీల్డింగ్‌తో బ్రూక్స్ రనౌట్ కాగా, మరో రెండు బంతులకు హామిల్టన్ (0) పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ హోల్డర్ (35 బంతుల్లో 39; 9 ఫోర్లు) ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా అది ఎక్కువ సేపు సాగలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్:117; భారత్ రెండో ఇన్నింగ్స్: 168/4 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) కోహ్లి (బి) షమీ 16, బ్రాత్‌వైట్ (సి) పంత్ (బి) ఇషాంత్ 3; బ్రేవో (రిటైర్డ్‌హర్ట్) 23; బ్రూక్స్ (రనౌట్) 50; ఛేజ్ (ఎల్బీ) (బి) జడేజా 12; హెట్‌మైర్ (సి) మయాంక్ (బి) ఇషాంత్ 1; బ్లాక్‌వుడ్ (సి) పంత్ (బి) బుమ్రా 38; హోల్డర్ (బి) జడేజా 39; హామిల్టన్ (సి) రాహుల్ (బి) జడేజా 0; కార్న్‌వాల్ (సి) పంత్ (బి) షమీ 1; రోచ్ (సి) పంత్ (బి) షమీ 5; గాబ్రియెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (59.5 ఓవర్లలో ఆలౌట్) 210 వికెట్ల పతనం: 1–9, 2–37, 2–55 (రిటైర్డ్‌హర్ట్), 3–97, 4–98, 5–159, 6–177, 7–177, 8–180, 9–206, 10–210. బౌలింగ్: ఇషాంత్ శర్మ 12–3–37–2, బుమ్రా 11–4–31–1, షమీ 16–2–65–3, జడేజా 19.5–4–58–3, విహారి 1–0–3–0. మరో సాధికారిక ప్రదర్శనతో మేం అనుకున్న భారీ విజయాన్ని అందుకున్నాం. ఈ రోజు అత్యుత్తమ భారత కెప్టెన్‌గా నిలవగలిగానంటే జట్టు సభ్యులందరు, వారి అత్యుత్తమ ఆటనే కారణం. పేరుకు ముందు ‘సి’ అని ఉండటం తప్ప నా దృష్టిలో కెప్టెన్ ప్రత్యేకం ఏమీ కాదు. మా బ్యాట్స్‌మెన్ బాగా ఆడితే బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ఈ సిరీస్ సమష్టి విజయం. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఈ టెస్టులో విహారి ఇన్నింగ్స్ అత్యుత్తమం. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విహారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో మేమెంతో ప్రశాంతంగా కూర్చున్నాం. తప్పులు సరిదిద్దుకునేందుకు, ఆటను మెరుగుపర్చుకునేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. ప్రాణం పెట్టి ఆడే రకం. జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఇంత స్వల్ప కెరీర్లోనే విహారికి జట్టు ఎందుకు మద్దతునిస్తోందో అతను చూపించాడు. –కోహ్లి -
ఆటతో సమాధానం చెప్పాడు: కోహ్లి
కింగ్స్టన్ : జట్టు సమిష్టి కృషి కారణంగానే కెప్టెన్‌గా తాను విజయవంతమయ్యానని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అన్నాడు. విజయాలను కొనసాగిస్తూ ముందుకు సాగడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 257 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అంతేగాకుండా విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో కోహ్లి అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ...‘ విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా ఉండటం ఆనందంగా ఉంది. అయితే ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా షమీ, ఇషాంత్, జడేజా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. నిజానికి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మన పేరుకు ముందు ‘సీ’ అనే కొత్త అక్షరం చేరుతుందే గానీ పెద్దగా మార్పు ఏమీ ఉండదు. జట్టు రాణించకపోతే కెప్టెన్ ఒక్కడే విజయాలు సాధించలేడు కదా. మరిన్ని విజయాలు సాధించడమే మా ముందున్న లక్ష్యం’ అని వ్యాఖ్యానించాడు. చదవండి : కెప్టెన్‌గా కోహ్లి సరికొత్త రికార్డు ఈ క్రమంలో రెండో టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తెలుగు యువ క్రికెటర్ హనుమ విహారిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ‘ ఈ మ్యాచ్‌లో హనుమ విహారీ స్టాండ్ అవుట్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. తను అంకితభావం గల ఆటగాడు. ఈరోజు టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. తను క్రీజులో ఉన్నపుడు డ్రెస్సింగ్‌లో అంతా నిశ్శబ్ధంగా ఉండి తన ఆటపై దృష్టి సారిస్తారు. తను సహజంగానే మనసు పెట్టి ఆడతాడు. జట్టు విజయం కోసం పరితపిస్తాడు. తనకు ఎంతో భవిష్యత్తు ఉంది. జట్టులోకి ఎంపిక చేసిన నిర్ణయానికి ఈరోజు తన ఆటతో సమాధానం చెప్పాడు’ అని విహారిని ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా విండీస్‌ను మట్టి కరిపించిన కోహ్లి సేన కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనత సాధించింది. అదే విధంగా ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత బౌలర్లు మహ్మద్ షమి, జడేజా మూడేసి వికెట్లు తీసి తీయగా.. ఇషాంత్ శర్మకు రెండు, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. కాగా రోహిత్ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న కోహ్లి నిర్ణయానికి సమర్థింపుగా.. సెంచరీ, అర్ధసెంచరీతో విహారీ సత్తా చాటాడు. తద్వారా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. చదవండి : టీమిండియా భారీ గెలుపు -
కోహ్లి ‘గోల్డెన్ డక్’.. ఎన్నోసారో తెలుసా?
కింగ్స్టన్ (జమైకా): వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ‘గోల్డెన్ డక్’ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కీమర్ రోచ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే కోహ్లి పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో ‘గోల్డెన్ డక్’ కావడం కోహ్లికి ఇది నాలుగోసారి. మొత్తం తొమ్మిదిసార్లు టెస్టుల్లో కోహ్లి డకౌట్ అయ్యాడు. కాగా, వెస్టిండీస్‌కు టీమిండియా 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు భారత్ 168/4 స్కోరు వద్ద సెకండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటిన తెలుగు కుర్రాడు హనమ విహారి రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. రహానేతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహనే(64), విహారి(53) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విండీస్ 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. (ఇది చదవండి: వహ్వా విహారి...) -
ఈ శతకం నాన్నకు అంకితం: విహారి
కింగ్స్టన్: టెస్టుల్లో సాధించిన తొలి శతకాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ప్రకటించాడు. ఇదే సందర్భంలో తాను సెంచరీ చేసేందుకు సహకరించిన పేసర్ ఇషాంత్ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. శనివారం ఆట ముగిశాక విహారి మాట్లాడుతూ... ‘ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు. అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నేను నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సంతోషించి ఉంటారు’ అని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన విహారి... ఇందులో ఇషాంత్ పాత్రను కొనియాడాడు. ఇషాంత్ అచ్చమైన బ్యాట్స్‌మన్‌లా ఆడాడని, బౌలర్లు ఏం చేస్తారో మాట్లాడుకుంటూ ఇన్నింగ్స్ కొనసాగించామని, అతడి అనుభవం ఉపయోగపడిందని విహారి అన్నాడు. -
ఆ ఘనత కోహ్లిదే: బుమ్రా
జమైకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తాను హ్యాట్రిక్ సాధించిన ఘనతకు కెప్టెన్ విరాట్ కోహ్లినే కారణమని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు. హ్యాట్రిక్ అందుకునే క్రమంలో విండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో దీనిపై థర్డ్ అంపైర్ అప్పీల్ కోసం వెళ్లామని, ఇది సక్సెస్ కావడంతోనే అరుదైన ఘనత లిఖించినట్లు చెప్పాడు. ‘ ఛేజ్కు సంధించిన బంతి ప్యాడ్లకు తగలడంతో అప్పీల్ చేసినా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అయితే నిజంగా ఏమి జరిగిందో నాకు తెలియదు.. నేను అప్పీల్ చేద్దామని అనుకోలేదు. నేను ఇంకా సందిగ్థంలోనే ఉన్నా. కోహ్లి సమీక్ష కోరడంతో మాకు అనుకూలంగా వచ్చింది. హ్యాట్రిక్ ఘనత కోహ్లిదే’ అని బుమ్రా పేర్కొన్నాడు. తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాప్-5 బ్యాట్స్‌మెన్ పనిపట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉండటం విశేషం. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (225 బంతుల్లో 111; 16 ఫోర్లు) శతకానికి తోడు ఇషాంత్ శర్మ (80 బంతుల్లో 57; 7 ఫోర్లు) కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో భారత్ నాలుగు వందల స్కోరును దాటింది. -
బెంబేలెత్తించిన బుమ్రా
రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకపోతోంది. తొలి టెస్టులో విజయఢంకా మోగించిన కోహ్లి సేన.. రెండో టెస్టుపై పట్టు బిగించింది. దీంతో ఆతిథ్య వెస్టిండీస్‌కు వైట్‌వాష్ తప్పేలాలేదు. ముందుగా బ్యాట్స్‌మెన్ తమ విధులను సక్రమంగా నిర్వర్తించగా.. అనంతరం భారత బౌలర్లు విండీస్ బ్యాట్స్‌మెన్ పని పట్టారు. దీంతో ఆతిథ్య జట్టు ఫాలోఆన్ గండం ఎదుర్కొనే అవకాశం ఉంది. అద్భుతాలు జరిగితే తప్పా.. మూడో రోజే మ్యాచ్ ముగిసిపోయే అవకాశం ఉంది. కెరీర్ (ఓవల్) తొలి టెస్టులో కీలక అర్ధ సెంచరీ, మెల్బోర్న్లో ఓపెనర్‌గా ఆకట్టుకునే ప్రదర్శన, సిడ్నీలో సొగసైన ఆట... టెస్టు బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను ఐదు టెస్టుల్లోనే చూపించిన తెలుగు తేజం, ఆంధ్ర క్రికెటర్ గాదె హనుమ విహారి ఇప్పుడు ఆరో టెస్టులో తొలి సెంచరీతో సత్తా చాటాడు. ఆంటిగ్వాలో చేజారిన శతకాన్ని జమైకాలో అందుకొని గర్వంగా నిలిచాడు. మరోవైపు కెరీర్ 92వ టెస్టులో పేసర్ ఇషాంత్ శర్మ తొలి అర్ధ సెంచరీ సాధించడంతో రెండో టెస్టులో భారత్‌కు పట్టు చిక్కింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌కు భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నిద్రలేకుండా చేస్తున్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన బుమ్రా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయాడు. సూపర్ బౌలింగ్ పర్ఫామెన్స్తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. హ్యాట్రిక్ సాధించి విండీస్ నడ్డివిడిచాడు. దీంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్‌గా.. విండీస్‌పై ఈ ఘనత అందుకున్న తొలి టీమిండియా బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. కింగ్స్టన్ (జమైకా) : తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాప్-5 బ్యాట్స్‌మెన్ పనిపట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉండటం విశేషం. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హామిల్టన్(2 బ్యాటింగ్), కార్న్‌వాల్(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. షమీ ఒక్క వికెట్ పడగొట్టాడు. విండీస్ ప్రధాన బ్యాట్స్‌మెన్ బ్రాత్‌వైట్(4), క్యాంప్‌బెల్2), డారెన్ బ్రేవో(4), బ్రూక్స్(0), రోస్టన్ ఛేజ్(0), హోల్డర్(18)లు బుమ్రా బౌలింగ్ ధాటికి బలయ్యారు. ఓ క్రమంలో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్‌ను హెట్మెయిర్(34) ఆదుకున్నాడు. అయితే ఈ ఆటగాడిని షమీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. ఓ సూపర్ బంతికి క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇప్పటికే టీమిండియా 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. అంతకుముందు హనుమ విహారి (225 బంతుల్లో 111; 16 ఫోర్లు) శతకానికి తోడు ఇషాంత్ శర్మ (80 బంతుల్లో 57; 7 ఫోర్లు) కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారి, ఇషాంత్ ఎనిమిదో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. మొదటి బంతికే... భారత్ రెండో రోజు ఆట పేలవంగా ప్రారంభమైంది. హోల్డర్ వేసిన తొలి బంతికే రిషభ్ పంత్ (27) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (69 బంతుల్లో 16) పట్టుదలగా క్రీజ్‌లో నిలబడేందుకు ప్రయత్నించాడు. అయితే కార్న్‌వాల్ బౌలింగ్‌లో అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ దశలో ఇషాంత్ విహారికి అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లంచ్ తర్వాత విహారిని వెనక్కి నెట్టి ఇషాంత్ దూసుకుపోయాడు. హోల్డర్, ఛేజ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అధిగమించాడు. అనంతరం 69 బంతుల్లో అర్ధసెంచరీ సాధించడంతో భారత డ్రెస్సింగ్‌రూమ్ హోరెత్తింది. వహ్వా విహారి... గత టెస్టులో త్రుటిలో శతకం చేజార్చుకున్న విహారి ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయిని దాటాడు. తొలి రోజు ‘సున్నా’ వద్ద రోచ్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ నుంచి తప్పించుకున్న అతను చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. గాబ్రియెల్, రోచ్ ఓవర్లలో విహారి కొట్టిన రెండేసి ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. 42 పరుగుల వద్ద అతని మొదటి రోజు ఆట ముగిసింది. శనివారం ఆటలో అతను కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించాడు. కొంత అదృష్టం కూడా ఆంధ్ర ఆటగాడికి కలిసొచ్చింది. హోల్డర్ వేసిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్ల మీదుగా వెళ్లడంతో బతికిపోయిన అతను ఈ నాలుగు పరుగులతో 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68 పరుగుల వద్ద కార్న్‌వాల్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాంప్‌బెల్ క్యాచ్ వదిలేశాడు. ఈ ఓవర్లో విహారి మూడు ఫోర్లు కొట్టడం విశేషం. కొద్ది సేపటికే 79 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లోనే అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో ఫలితం అనుకూలంగా వచ్చింది. లంచ్ సమయానికి 158 బంతుల్లో 84 పరుగుల వద్ద నిలిచిన విహారి శతకానికి ముందు మళ్లీ కొంత ఒత్తిడికి గురయ్యాడు. అయితే చివరకు రోచ్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీయడంతో 200 బంతుల్లో విహారి తొలి సెంచరీ పూర్తయింది. గాల్లోకి పంచ్ విసిరి అతను తన భావోద్వేగాలను ప్రదర్శించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 87/7 -
అది నేనే కావాలి: హనుమ విహారి
ఆంటిగ్వా: భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించడమే తన ముందున్న లక్ష్యమని తెలుగుతేజం హనుమ విహారి స్పష్టం చేశాడు. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విహారి 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. రహానేతో కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు విహారి. అయితే స్వతహాగా ఆఫ్ స్పిన్నర్ అయిన విహారి ఇక బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి సారించాలని అన్నాడు. ‘ నా ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. బౌలింగ్‌లో ఆడపదడపా బౌలింగ్ కాకుండా రెగ్యులర్ బౌలింగ్ ఆప్షన్ కావాలి. అదే నా లక్ష్యం. టీమిండియా క్రికెట్ జట్టులో ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా స్థిరపడాలనుకుంటున్నా. ఐదో బౌలింగ్ ఆప్షన్లో నేను ఫిట్ కావాలనుకుంటున్నా. అయితే నా బౌలింగ్‌కు బాగా పదును పెట్టాల్సి ఉంది. నేను సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు వేస్తే అది జట్టుకు ఉపయోగపడాలనేది కోరిక. అందుకోసం నా ఆఫ్ స్పిన్‌లో రాటుదేలాలి. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లు ఎందరో ఉన్నారు. వారి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా నా అదృష్టంగా భావిస్తా’ అని విహారి పేర్కొన్నాడు.( ఇక్కడ చదవండి: భారత్ ఘన విజయం) -
ధోని రికార్డును సమం చేసిన కోహ్లి
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): కరీబియన్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆదిక్యంలో నిలిచింది. విదేశీ గడ్డపై భారత్‌కు ఇది అతిపెద్ద విజయం. టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో భారీ విజయం. కోహ్లి కెప్టెన్సీలో జట్టుకిది 27వ విజయం. ఈ విజయంతో విరాట్ కోహ్లి మాజీ కెప్టెన్ ఎంస్ ధోని సరసన చేరాడు. ధోని సారథ్యంలో టీమిండియా 27 మ్యాచుల్లో విన్నర్‌గా నిలిచింది. ఇక విదేశాల్లో అధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాకు విదేశాల్లో ఇది 12వ విజయం. ఫలితంగా సౌరవ్ గంగూలీ సారథ్యంలో 11 విజయాల రికార్డు బ్రేక్ అయింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు ఈ టెస్టు విజయంతో ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌ను ఘనంగా ఆరంభించింది. (చదవండి : భారత్ ఘన విజయం) మ్యాచ్ అనతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘నా బాధ్యతలు నెరవేర్చాను. జట్టుకు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించి విజయాల్లో పాత్ర పోషించడం నా అదృష్టం. సమష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాళ్లు చక్కగా అమలు చేస్తారు’అన్నాడు. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ హీరో అజింక్యా రహానే (టెస్టుల్లో 10వ సెంచరీ), జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, హనుమ విహారిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. హనుమ విహారీపై ఉంచిన నమ్మకం వమ్ము కాలేదని అన్నాడు. జట్టు మేలును కోరే అతడిని తీసుకున్నామన్నారు. విహారికి చోటివ్వడంతో రోహిత్ శర్మకు జట్టులో స్థానం దక్కలేదనే విషయం తెలిసిందే. రోహిత్‌కు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రవిశాస్త్రి, కోహ్లి జట్టును నాశనం చేస్తున్నారు!’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విహారి తొలి ఇన్నింగ్స్‌లో 32, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశాడు. -
తొలి టెస్టులో భారత్ ఘన విజయం
-
కాకినాడ కుర్రాడు వెస్టిండీస్ టూర్‌కు
కాకినాడ రూరల్ : కాకినాడలో పుట్టిన కుర్రాడు గాదె హనుమ విహారి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి... అంచెలంచెలుగా ఎదుగుతూ వెస్టిండీస్ టూర్‌కు వెళ్లడం పట్ల క్రికెట్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాకినాడ భానుగుడి సెంటర్ సమీపంలో అమ్మమ్మగారి ఇంట్లో 1993 అక్టోబర్ 13వ తేదీన హనుమ విహారి జన్మించాడు. తండ్రి గాదె సత్యనారాయణ సింగరేణి కాలరీస్ సంస్థలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ 2005లో ఉద్యోగ విరమణ చేసి అదే ఏడాది చనిపోయారు. ప్రస్తుతం తల్లి విజయలక్ష్మి, అక్క వైష్టవి హైదరాబాద్‌లో ఉంటున్నారు. తల్లికి ఇష్టమైన క్రికెట్‌ను టీవీలో చూస్తుండటంతో ఆ ఇష్టాన్నే లక్ష్యంగా చేసుకొని కాకినాడలోనే ఏసీఏ క్రికెట్ ఆపరేషన్ హెడ్‌గా పనిచేసిన మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్లో ప్రపంచంలోనే మొదటి స్థానంగా నిలిచి అత్యధికంగా బ్యాటింగ్‌లో ఏవరేజ్‌గా 59.79గా నమోదు చేసుకుని క్రికెట్లో జోరుగా సాగుతున్న విహారికి ఎంఎస్కే ప్రోత్సాహాన్ని అందించి అంతర్జాతీయ క్రికెట్లో ఎంపికయ్యేలా చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టూర్లకు ఎంపికైన విహారీ సెలక్టర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినా విహారిపై ఉన్న నమ్మకంతో మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. హాఫ్ స్పిన్నర్ కావడంతో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో జట్లను ఆదుకుంటాడని భారత్ జట్టు వెస్టిండీస్ టూర్లో వన్డే, టెస్ట్ 20–20 మ్యాచ్‌లలో ఆడేందుకు ఆంధ్రా రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమ విహారి వైపే సెలక్టర్లు మొగ్గుచూపించారు. ఎంతో ప్రతిభ కలిగిన విహారి దేశవాళీ క్రికెట్లో రాణించినట్లుగా అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేక అభిమానులకు నిరాశనే మిగిల్చాడు. సెలక్టర్లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెస్టిండీస్ టూర్లో తన స్థాయికి తగ్గ ప్రతిభను అటు బ్యాటింగ్లోను, ఇటు బౌలింగ్లోను కనబరచి జిల్లా కీర్తిని పెంపొందించాలని క్రికెట్ సంఘ ప్రతినిధులు, అభిమానులు కోరుకుంటున్నారు. క్రికెట్ అంటే ప్రాణం.. విహారికి చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం. తండ్రి కోరికను నెరవేర్చడానికి చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి ఆడేవాడు. వెస్టిండీస్ టూర్‌కు ఎంపికైన సందర్భంగా రెండు టెస్ట్‌ల్లో కూడా మంచి పరుగులు చేసి తన స్థానాన్ని పదిల పరుచుకుంటాడని ఆశిస్తున్నాం. – డాక్టర్ స్పర్జన్‌రాజు, రంగరాయ మెడికల్ కళాశాల, ఫిజికల్ డైరెక్టర్, కాకినాడ -
వైభవంగా క్రికెటర్ హనుమవిహారి వివాహ వేడుక
-
ఘనంగా క్రికెటర్ విహారి వివాహం
వరంగల్ స్పోర్ట్స్: భారత టెస్టు క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సభ్యుడు, ప్రస్తుత ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ డిజైనర్ ప్రీతి రాజ్‌తో విహారి పెళ్లి ఆదివారం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్‌లోని కోడెం కన్వెన్షన్ హాల్లో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వధువు ప్రీతి రాజ్ వరంగల్ రూరల్ జిల్లా మొగిలిచర్ల సమీపంలోని రెడ్డిపాలెంనకు చెందిన పారిశ్రామికవేత్త రాజేందర్ రెడ్డి కూతురు. విహారి, ప్రీతి రాజ్ క్లాస్మేట్స్ కావడంతో పెద్దల అంగీకారంతో వివాహం జరిపించారు. ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
సచిన్ ఔటైన ప్రతీసారీ ఏడ్చేవాడు..
అందరిలాగే ఆ కుర్రాడికి క్రికెట్ పిచ్చి. సచిన్ అంటే అభిమానం రెండూ ఉన్నాయి. ఆటను అమితంగా ఇష్టపడే కుర్రాడు సచిన్ ఔటైతే మాత్రం జీర్ణించుకోలేడు. అందుకే ఔటైన ప్రతీసారీ ఏడ్చేవాడు. ఇప్పుడు ఆ కుర్రాడు ఓ జాతీయ క్రికెటర్ అయ్యాడు. భారత టెస్టు జట్టు సభ్యుడయ్యాడు. అతనే హనుమ విహరి. గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విహారి ప్రస్తుతం ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర రంజీ కెప్టెన్, భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారి తాను ‘అ. ఆ.’లు దిద్దిన స్కూలుకెళ్లాడు. అక్కడ గత స్మృతుల్ని నెమరువేసుకున్నాడు. తరచి చూసుకుంటే నేను అప్పుడూ విద్యార్థినే ఇప్పుడూ విద్యార్థినే (క్రికెట్లో) అని గర్వపడుతున్నాడు. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో విద్యనభ్యసించిన ఈ తెలుగు క్రికెటర్ మంగళవారం తన స్కూల్లో సందడి చేశాడు. అధ్యాపకుల్ని నమస్కరించి, విద్యార్థులతో ముచ్చటించాడు. అందరిలాగే తన క్రికెట్ దేవుడు సచినే అన్నాడు. అచ్చంగా... నిజంగా... ‘మాస్టర్ బ్యాట్స్‌మన్’ ఆటను చూసే క్రికెట్లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు. ‘నేను క్రికెట్ ఆడటానికి కారణం సచినే. ఊహ తెలిసినప్పటి నుంచి టీవీల్లో క్రికెట్ వస్తే సచిన్ బ్యాటింగ్‌ను తెగ చూసేవాడిని. ఔటైతే మాత్రం తట్టుకోను. ఏడ్చేవాణ్ని. ఎందుకంటే అతడే నా హీరో’ అని విహారి అన్నాడు. జట్టులోకి ఎంపికైనట్లు తెలియగానే ఆ ఆనందక్షణాల నుంచి తేరుకోలేకపోయానన్నాడు. తరగతి గదిలో... బెంగళూరులోని అకాడమీలో ప్రాక్టీస్ సెషన్‌ను అప్పుడే ముగించుకొని వెళ్తున్న తనకు టీమ్ మేనేజర్ ఫోన్ చేసి ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనట్లు చెప్పడంతో ఒక్కసారిగా 10–15 నిమిషాలు మారుమాట్లాడలేకపోయానని అప్పటి విషయాన్ని వివరించాడు. వెంటనే తన కెరీర్ కోసం అంకితమైన తన మాతృమూర్తికి ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నానని చెప్పాడు. రెండో ఫోన్ మెంటార్ జాన్ మనోజ్‌కు చేసినట్లు చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత డ్రెస్సింగ్ రూమ్‌కు తొలిసారి వెళ్తుంటే ఎంతో ఉద్విగ్నంగా అనిపించిందని తెలిపాడు. ‘కల నెరవేరింది. జట్టులో స్థానం దొరికింది. కోహ్లిలాంటి స్టార్ క్రికెటర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అనుభవం వచ్చినందుకు ఎంతో సంతోషపడ్డాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సభ్యులందరు నన్ను ఆదరంగా చూశారు. విరాట్‌తో మాటలు కలిశాయి. అతను అంతర్జాతీయ క్రికెట్లో ఉండే సవాళ్లను వివరిస్తూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. నా శక్తిమేరకు రాణించేందుకు ప్రయత్నించాను. ప్రపంచ క్రికెట్లో నంబర్‌వన్ భారత జట్టులో సభ్యుడినైనందుకు ఎంతో గర్వంగా ఫీలయ్యాను. ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయంలో భాగమైనందుకు సంబరపడ్డాను’ అని విహారి వివరించాడు. ఎంచుకున్న లక్ష్యాల కోసం ఇష్టంగా కష్టపడితేనే అవన్నీ సాకారమవుతాయని విద్యార్థులకు సలహా ఇచ్చాడు. ఆటలో సవాళ్లు ఎలా ఎదురవుతాయో... జీవితంలో కూడా ఎదురవుతాయని అన్నింటిని స్వీకరించాలని సూచించాడు. -
విహారి మరో సెంచరీ
ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి మళ్లీ విదర్భ బౌలర్లతో ఆటాడుకున్నాడు. రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మరో సెంచరీ సాధించాడు. మూడు సెషన్లు నింపాదిగా ఆడిన విహారి రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుకు బాట వేశాడు. కెప్టెన్ రహానే, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నిర్మించాడు. నాగ్‌పూర్: వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ రెస్టాఫ్ ఇండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (300 బంతుల్లో 180 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. రోజంతా ఆడి విదర్భ బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారాడు. దీంతో రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 107 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 374 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రంజీ చాంపియన్ విదర్భ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సంజయ్ (17 బ్యాటింగ్), అథర్వ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇరానీ కప్‌లో తలపడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. నాలుగో రోజు శుక్రవారం 102/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా తొలి సెషన్లో వికెట్ కోల్పోకుండా మరో 110 పరుగుల్ని జతచేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విహారి, కెప్టెన్ రహానే (87; 6 ఫోర్లు, 1 సిక్స్) విదర్భ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. ప్రత్యర్థి కెప్టెన్ ఫజల్ ఈ జోడీని విడగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. రెండో సెషన్లో విహారి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు కలిసి మరో 63 పరుగులు జతచేశాక ఎట్టకేలకు జట్టు స్కోరు 275 పరుగుల వద్ద ఆదిత్య సర్వతే బౌలింగ్‌లో రహానే స్టంపౌటయ్యాడు. గత రెండేళ్ల కాలంలో 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన రహానే కు ఇదే టాప్ స్కోర్. 2017 ఆగస్టు కొలంబోలో లంకతో జరిగిన టెస్టులో అతను (132) సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడే సెంచరీకి సమీపించే స్కోరు చేశాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (61 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పుంజుకుంది. విహారి, అయ్యర్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన శ్రేయస్ 4 భారీ సిక్సర్లతో అలరించాడు. ఇరానీలో సెంచరీల విహారి ఇరానీ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారి ఘనత వహించాడు. ఇంతకుముందు శిఖర్ ధావన్ 2011–12 సీజన్లో ఈ ఘనత సాధించాడు. అయితే వరుసగా మూడు సెంచరీలు చేసింది మాత్రం మన తెలుగు తేజమే! గత సీజన్ మ్యాచ్‌లోనూ ఇదే విదర్భపై విహారి శతక్కొట్టాడు. వరుసగా 183, 114, 180 (నాటౌట్) స్కోర్లతో మొత్తానికి విదర్భ పాలిట కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. శుక్రవారం మూడు సెషన్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు. సంక్షిప్త స్కోర్లు రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 330; విదర్భ తొలి ఇన్నింగ్స్: 425; రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: 374/3 డిక్లేర్డ్ (విహారి నాటౌట్ 180; రహానే 87; శ్రేయస్ నాటౌట్ 61; ఆదిత్య సర్వతే 2/141); విదర్భ రెండో ఇన్నింగ్స్: 37/1. -
హనుమ విహారి బ్యాటింగ్ రికార్డు
నాగ్‌పూర్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇరానీకప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి.. రంజీ చాంపియన్ విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన విహారి.. రెండో ఇన్నింగ్స్ళో కూడా శతకం నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో భాగంగా విహారి సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు సాధించాడు. ఫలితంగా ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. గతేడాది ఇదే విదర్భతో జరిగిన మ్యాచ్‌లో విహారి 183 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, 2011 తర్వాత ఒక ఇరానీకప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ కూడా విహారినే కావడం మరో విశేషం. ఆనాటి ఇరానీకప్‌లో రెస్టాఫ్ ఇండియాతో తరఫున ఆడిన శిఖర్ ధావన్.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా ఇరానీకప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో విదర్భకు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ 330 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 374/3 డిక్లేర్డ్ విదర్భ తొలి ఇన్నింగ్స్ 425 ఆలౌట్ -
హనుమ విహారికి ఘన సన్మానం
యైటింక్లయిన్‌కాలనీ: భారత క్రికెట్ హనుమ విహారిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. తన సోదరి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనడానికి యైటింక్లయిన్‌కాలనీకి వచ్చిన క్రికెటర్ హనుమ విహారిని సీఈఆర్‌క్లబ్, దృవపాండవ్ క్రికెట్ టీం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్లో మరింత రాణించి భారత్‌కు కీర్తిప్రతిష్టలు తేవాలని వక్తలు అన్నారు. చిన్ననాటి నుంచి కఠోర శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన విహారి ఈ తరం యువతకు ఆదర్శం అని కొనియాడారు. పట్టుదల ఉంటే సాధించనిది ఏమి లేదని, ప్రతీ ఒక్కరు తమ లక్ష్యం వైపు అలుపెరుగని శ్రమ చేస్తే విజయం వరిస్తుందన్నారు. విహారీ మాట్లాడుతూ తనను సాదరంగా సన్మానించిన క్లబ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ గౌరవ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కార్యదర్శి హమీద్, సింగరేణి డాక్టర్ రమేష్‌బాబు, ఓసీపీ–2 ఎస్ఈ చంద్రశేఖర్, దృవపాండవ క్రికెట్ టీం సభ్యులు నర్సింహారెడ్డి, ముఖేశ్, తిరుపతిరెడ్డి, హరీష్, రవిశంకర్, వేణుమాదవ్, పాశం ఓదెలు, ఆరీఫ్, శ్రీధర్, అంజి పాల్గొన్నారు. -
విదర్భ జోరు కొనసాగేనా?
నాగ్‌పూర్: ఈ సీజన్ రంజీ ట్రోఫీ విజేత, డిఫెండింగ్ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్ కోసం నేటి నుంచి రెస్టాఫ్ ఇండియా జట్టుతో తలపడనుంది. ఐదు రోజుల మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాకు టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్య రహానే సారథ్యం వహిస్తాడు. ప్రపంచ కప్‌నకు పరిశీలనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో రహానే ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌తో రెస్టాఫ్ ఇండియా జట్టు బలంగా ఉంది. బౌలింగ్‌లో మాత్రం అనుభవ లేమి కనిపిస్తోంది. పేసర్లు అంకిత్ రాజ్‌పుత్, తన్వీర్ ఉల్ హక్, సందీప్ వారియర్, స్పిన్నర్లు ధర్మేంద్ర జడేజా, కృష్ణప్ప గౌతమ్ ప్రత్యర్థిని ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి. ఇక సమష్టి కృషితో వరుసగా రెండోసారి రంజీ ట్రోఫీ గెలిచిన ఊపులో ఉన్న విదర్భ... గతేడాదిలాగే ఇరానీ కప్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గాయం కారణంగా పేసర్ ఉమేశ్ యాదవ్ దూరమైనా, అటు బ్యాటింగ్‌లో కెప్టెన్ ఫైజ్ ఫజల్, వెటరన్ వసీం జాఫర్, సంజయ్ రామస్వామి, ఇటు బౌలింగ్‌లో రజనీశ్ గుర్బానీ, స్పిన్నర్ ఆదిత్య సర్వతేలతో చాలా పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై ఆడుతుండటం కూడా విదర్భకు అనుకూలం కానుంది. ►ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి ప్రశంసలే పది వేలు!
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ విజయం... ఎన్నో ఏళ్లుగా సాధ్యం కాని ఈ కల ఇప్పుడే నెరవేరింది. కొత్త చరిత్రలో భాగమైన ప్రతీ ఒక్క ఆటగాడు తాము సాధించిన ఘనత పట్ల గర్వపడుతున్నారు. టీమిండియా జట్టు సభ్యుడిగా మన తెలుగువాడు గాదె హనుమ విహారి కూడా విజయానందంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన అతను జట్టు అవసరాలకు అనుగుణంగా కీలక ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శుభారంభం తర్వాత తాజా పర్యటన అతని కెరీర్‌కు కొత్త ఊపును తెచ్చింది. టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా అతని స్థానాన్ని దాదాపు ఖాయం చేసింది. మున్ముందు మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విహారి... ఆస్ట్రేలియా సిరీస్ గురించి తన అనుభవాలను ‘సాక్షి’తోపంచుకున్నాడు. సాక్షి, హైదరాబాద్ : ఓపెనర్‌గా అవకాశం రావడాన్ని సవాల్‌గానే స్వీకరించాను గానీ, ఆందోళన చెందలేదని భారత క్రికెటర్ హనుమ విహారి అన్నాడు. మెల్బోర్న్లో జరిగిన మూడో టెస్టులో ఓపెనింగ్ చేసిన విహారి, తొలి టెస్టు ఆడుతున్న మయాంక్‌తో కలిసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. బ్యాటింగ్‌లో తాను మరిన్ని పరుగులు సాధిస్తే బాగుండేదన్న ఈ ఆంధ్ర క్రికెటర్... సిరీస్ గెలుపు మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించాడు. ఈ పర్యటనకు సంబంధించి అతను చెప్పిన విశేషాలు విహారి మాటల్లోనే... ఆస్ట్రేలియాలో సిరీస్ విజయంపై... ఒక్క మాటలో చెప్పాలంటే గర్వంగా అనిపిస్తోంది. సిరీస్ గెలుచుకున్న క్షణాలు నిజంగా అద్భుతం. ఆఖరి మ్యాచ్ ఫలితం నాలుగో రోజే దాదాపుగా ఖాయమైపోయింది కాబట్టి ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కాలేదు. పైగా మెల్బోర్న్ టెస్టు గెలిచిన తర్వాత సిరీస్ సాధించగలమనే నమ్మకం మరింత పెరిగింది. ‘డ్రా’ కూడా సరిపోతుందని అందరికీ తెలుసు. కాబట్టి ఉత్సాహంగానే బరిలోకి దిగాం. మొత్తంగా ఇంతటి చారిత్రక ఘట్టంలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో అండర్–19 స్థాయిలో ఆస్ట్రేలియాలో ఆడాను తప్ప సీనియర్ క్రికెటర్‌గా కాదు. ఇప్పుడు నా తొలి ఆసీస్ టూర్లోనే టీమిండియా గొప్ప ఘనత సాధించడం నిజంగా చిరస్మరణీయం. సొంత బ్యాటింగ్ ప్రదర్శనపై... కొంత నిరుత్సాహపడిన మాట వాస్తవం. అయితే ప్రతీది భారీ స్కోరు కోణంలోనే చూడలేం. మనం జట్టుకు ఏ రకంగా ఉపయోగపడ్డాం, విజయంలో మన భాగస్వామ్యం ఏమిటనేది కూడా కీలకం. అలా చూస్తే నేను టీమ్ అవసరాలకు అనుగుణంగా ఆడి నా పాత్రను పోషించాను. నిజానికి మంచి ఆరంభాలు లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాను. అయితే సిడ్నీ టెస్టులో మంచి స్కోరు చేసే అవకాశం దురదృష్టవశాత్తూ పోయింది. నేను మంచి జోరు మీదున్నప్పుడు అనూహ్యంగా ఔట్ కావడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు నేను అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టను కానీ అలా జరగడం నా బ్యాడ్‌లక్ అంతే (రీప్లేలో విహారి నాటౌట్‌గా తేలింది). మున్ముందు మాత్రం కచ్చితంగా భారీ స్కోర్లు సాధిస్తాను. ఓపెనింగ్‌కు సాహసించడంపై... ఓపెనర్‌గా వెళ్లటానికి ఆందోళన చెందలేదు. ఆత్మవిశ్వాసంతోనే మైదానంలో అడుగు పెట్టాం. అటువైపు మయాంక్‌కు అదే తొలి టెస్టు కూడా. ‘ఎ’ జట్టు తరఫున కలిసి ఆడాం కాబట్టి మా మధ్య మంచి సమన్వయం ఉంది. టీమ్ మేనేజ్మెంట్కు నా డిఫెన్స్‌పై నమ్మకం కలిగింది. అందుకే నన్ను పంపించారు. ఆస్ట్రేలియాలాంటి కీలక సిరీస్‌లో టెస్టు మ్యాచ్ తుది జట్టులో అవకాశం లభించడమే గొప్ప. అలాంటి స్థితిలో నేను ఏ స్థానంలో ఆడాలనేదాని గురించి ఆలోచించడం అనవసరం. ఎక్కడ ఆడినా అదో మంచి అవకాశంగా భావించి సత్తా చాటడమే. తొలి రెండు టెస్టులలో మన జట్టుకు మంచి ఆరంభాలు లభించలేదు. ఈ నేపథ్యంలో దానిని సవాల్‌గా తీసుకొని సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండి ప్రధాన పేసర్లను నిరోధించేందుకు ప్రయత్నించా. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న 66 బంతులు సెంచరీతో సమానమని కోహ్లి చేసిన ప్రశంసను ఎలా మరచిపోగలను! బౌలింగ్ గురించి... సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 35 ఓవర్లు బౌలింగ్ చేశాను. బ్యాటింగ్‌తో పాటు నేను అదనంగా జట్టుకు ఉపయోగపడితే మంచిదే కదా. అందుకే బౌలింగ్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. ప్రతీ రోజు బౌలింగ్‌ను కూడా మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. పెర్త్ టెస్టులో కీలక సమయంలో రెండు ప్రధాన వికెట్లు దక్కడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మూడో టెస్టు తర్వాత ‘విహారి చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అతని ఆఫ్‌స్పిన్ వల్ల జట్టులో అశ్విన్ లేని లోటు కనిపించలేదు. అతనికి ఎప్పుడు బంతినిచ్చినా వికెట్ తీసేలా కనిపించాడు’ అని కెప్టెన్ నా గురించి వ్యాఖ్యానించడం కూడా నాకు మరింత ఆనందాన్నివ్వడంతో పాటు బాధ్యతనూ పెంచింది. వన్డే జట్టులో అవకాశాలపై... దాని గురించి అతిగా ఆశ పడటం లేదు. అండర్–19 వరల్డ్ కప్ గెలిచి వచ్చాక నేను పెట్టుకున్న కొన్ని ఆశలు తలకిందులయ్యాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇటీవల స్వదేశంలో విండీస్‌తో, ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో చాన్స్ రానప్పుడు కొంత బాధ పడినా... సెలక్షన్ విషయంలో మనం చేసేదేం ఉండదు. వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకోవడమే. అదే విధంగా ఐపీఎల్లో కూడా కొంత విరామం తర్వాత (2015లో ఆఖరిసారి) తిరిగొస్తున్నాను. అయితే 21 ఏళ్ల వయసులో ఉన్నప్పటితో పోలిస్తే నా ఆలోచనా ధోరణి మారింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. నేను ఇప్పుడు మూడు ఫార్మాట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నా ఆటను మార్చుకోగలను. ఇటీవల దానిని చేసి చూపించాను కూడా. పైగా ఇప్పుడు భారత జట్టు సభ్యుడనే గుర్తింపుతో మ్యాచ్‌లు ఆడబోతున్నాను కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు. -
సిడ్నీ : భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు చిత్రాలు
-
బాక్సింగ్‌డే టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు వ్యూహంలో భాగంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన హనుమ విహారి జట్టు స్కోర్40 పరుగుల వద్ద ప్యాట్‌కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 66 బంతులు ఆడిన విహారి 8 పరుగులు చేశాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్, పుజారా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పెర్త్ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. దాంతో వారి స్థానంలో మయాంక్, విహారిలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. పెర్త్ టెస్టులో దారుణంగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు బాక్సింగ్ డే సమరంలో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి. -
విహారి ఓపెనర్‌గా విఫలమైనా...
మెల్బోర్న్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ఓపెనర్‌గా విఫలమైతే మిడిలార్డర్లో మరిన్ని అవకాశాలిస్తామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లకు తగినన్ని టి20 అవకాశాలు ఇచ్చేందుకే ధోనికి విశ్రాంతి కల్పించామని ఆయన వివరించారు. దీంతో కుర్రాళ్లను పరిశీలిస్తున్నామని చెప్పకనే చెప్పిన ఈ చీఫ్ సెలక్టర్ ఆసీస్‌లో 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ధోని ఆడడనే సంకేతాలిచ్చాడు. రవీంద్ర జడేజాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేసే సమయంలో అతను ఫిట్నెస్తోనే ఉన్నట్లు చెప్పాడు. రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్, విజయ్ పదేపదే నిరాశపర్చడంతో టీమ్ మెనేజ్మెంట్ విహారి, మయాంక్ అగర్వాల్‌లతో ‘బాక్సింగ్ డే’ టెస్టును ఓపెన్ చేయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండే టెస్టులాడిన విహారి విఫలమైతే పరిస్థితి ఏంటని ప్రశ్నకు సమాధానమిస్తూ ‘విఫలమైనా అవకాశాలు సజీవంగా ఉంటాయి. దేశవాళీ క్రికెట్లో అతని ఆటను ప్రత్యక్షంగా గమనించా. కూకాబురా బంతుల్ని ఎదుర్కొనే సత్తా అతనిలో ఉంది’ అని అన్నాడు. 1999 పర్యటనలో మెల్బోర్న్లో ఎమ్మెస్కే కూడా ఓపెనర్‌గా దిగినా... స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ ధాటికి నిలువలేకపోయాడు. దీనిపై అతను మాట్లాడుతూ అవకాశాల్ని అంచనాల్ని తాను అందుకోలేకపోయానని కానీ ఈ యువ ద్వయం (విహారి, మయాంక్) రాణిస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. -
అందుకు నేను సిద్ధమే: హనుమ విహారి
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెప్టెన్ విరాట్ కోహ్లి అడిగితే తాను ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా ఆటగాడు హనుమ విహారి చెప్పాడు. గత ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన విహారి.. ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో అనధికార టెస్టులో, ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి కోరితే ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనింగ్ చేస్తానని హనుమ విహారి అన్నాడు. ‘ఆసీస్‌లో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు సీనియర్లు ఇంగ్లండ్‌లో నాకు సహకరించారు. ఆస్ట్రేలియాలో ఆడేందుకు అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటున్నాను. ఇంగ్లిష్ గడ్డపై నేను హాఫ్ సెంచరీ చేశా. అది గతం. కాకపోతే అక్కడ ఆడినట్టే ఆస్ట్రేలియాలో ఆడతాను. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. కెప్టెన్ అడిగితే ఓపెనింగ్ చేస్తా. మిడిల్, లోయర్ ఆర్డరైనా ఫర్వాలేదు. ఇది చాలా పెద్ద సిరీస్. చాలా శ్రమించాను. నాపై విశ్వాసం చూపినందుకు కోహ్లికి ధన్యవాదాలు. బ్యాటింగ్ నా ప్రధాన బలం. అవసరమైనప్పుడు బౌలింగ్ చేస్తా’అని విహారి తెలిపాడు. సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో తొలి టెస్టుకి దూరమయ్యాడు. దీంతో పృథ్వీ షా స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై జట్టు మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు జట్టులో పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో ఓపెనర్లను ఎంపిక చేశారు. -
రహానే, విజయ్ విఫలం
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా భావిస్తున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటగా... మరో ఇద్దరు విఫలమయ్యారు. తొలి రోజు భారత్ నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. న్యూజిలాండ్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 340 పరుగులు చేసింది. హనుమ విహారి (150 బంతుల్లో 86; 8 ఫోర్లు), వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (111 బంతుల్లో 79 బ్యాటింగ్; 10 ఫోర్లు), ఓపెనర్ పృథ్వీ షా (88 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు టెస్టు జట్టులో స్థానం లేని మయాంక్ అగర్వాల్ (108 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే (12), ఓపెనర్ మురళీ విజయ్ (64 బంతుల్లో 28; 4 ఫోర్లు) మాత్రం ఈ అవకాశాన్ని సమర్థంగా వాడుకోలేకపోయారు. తొలి వికెట్‌కు విజయ్‌తో 61 పరుగులు జోడించిన షా, రెండో వికెట్‌కు మయాంక్‌తో 50 పరుగులు జత చేశాడు. అనంతరం ఆంధ్ర ఆటగాడు విహారి చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. విహారి, మయాంక్ మధ్య మూడో వికెట్‌కు 73 పరుగులు జతకూడాయి. మయాంక్, రహానే 18 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. టెస్టు జట్టులో పునరాగమనాన్ని ఆశిస్తున్న న్యూజిలాండ్ పేసర్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రహానే బౌల్డయ్యాడు. అయితే ఆ తర్వాత విహారి, పార్థివ్ మధ్య మరో భారీ భాగస్వామ్యం నెలకొంది. ధాటిగా ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. అయితే సెంచరీ దిశగా దూసుకుపోతున్న విహారి చివరి ఓవర్ నాలుగో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసింది. -
రాణించిన విహారి
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో హనుమ విహారి (95 బంతుల్లో 87 నాటౌట్; 9 ఫోర్లు), బౌలింగ్‌లో షాబాజ్ నదీమ్ (3/32), మయాంక్ మార్కండే (4/48) రాణించడంతో భారత్ ‘బి’ జట్టు దేవధర్ ట్రోఫీలో శుభారంభం చేసింది. భారత్ ‘ఎ’తో మంగళవారం జరిగిన పోరులో ‘బి’ జట్టు 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా భారత్ ‘బి’ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. విహారి అజేయ అర్ధశతకం సాధించగా, మనోజ్ తివారి (52; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ఎ’ బౌలర్లలో అశ్విన్ 2, సిరాజ్, కులకర్ణి, సిద్ధార్థ్ కౌల్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ‘ఎ’... పృథ్వీ షా (7) విఫలమవగా, 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (114 బంతుల్లో 99; 11 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (54; 5 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. దీంతో లక్ష్యం దిశగా పయనించింది. 210/5 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే మయాంక్ మార్కండే, నదీమ్‌ల స్పిన్ మ్యాజిక్‌తో అనూహ్యంగా 8 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కోల్పోయి 218 స్కోరు వద్ద ఆలౌటైంది. -
నేడు విహారి నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిరకాల స్నేహితురాలు యెరువ ప్రీతిరాజ్‌తో విహారి వివాహ నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త యెరువ రాజానందరెడ్డి కుమార్తె అయిన ప్రీతిరాజ్ స్వీడన్లో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్టు జట్టు తరఫున అరంగేట్రం చేసిన 25 ఏళ్ల విహారి గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు భారత క్రికెటర్లతో పాటు హైదరాబాద్, ఆంధ్ర రంజీ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశముంది. -
సిరాజ్, విహారీలకు నిరాశే!
రాజ్‌కోట్ : వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, హనుమ విహారీలకు నిరాశే ఎదరురైనట్లు తెలుస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ఈ ఇద్దరి ఆటగాళ్లకు తుది జట్టులో చోటుదక్కలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు జాబితా ప్రస్తుతం వైరల్ అయింది. ఇంగ్లండ్ పర్యటనలోనే అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి కూడా బెంచ్‌కే పరిమితమైనట్లు తెలుస్తోంది. లోయరార్డర్‌తో సమన్వయం చేసుకుంటూ జట్టుకు అవసరమైన పరుగులు జోడించడం నంబర్ 6 బ్యాట్స్‌మన్ కర్తవ్యం. ఈ బాధ్యతను నిర్వర్తించేవారు లేకే ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఐదో టెస్టు ఆడిన హనుమ విహారి ఆరో నంబరుకు తగినవాడిగా ఆశలు రేపాడు. బ్యాటింగ్‌లో అర్ధ శతకంతో పాటు ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదే అతన్ని మళ్లీ జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అసాధారణ ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్లను దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సైతం రేపటి మ్యాచ్‌లో చోటు దక్కలేదని సమాచారం. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయాలనుకున్న సిరాజ్‌కు నిరాశే మిగిలింది. అయితే ఈ ఇద్దరి ఆటగాళ్లను అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేయాలనే యోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపటి మ్యాచ్‌తో అండర్-19 సూపర్ హీరో పృథ్వీషా అరంగేట్రం చేయనున్నాడని స్పష్టమైంది. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇప్పటికే పృథ్వీషా అరంగేట్రంపై హింట్ ఇచ్చాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాలో సైతం పృథ్వీ షా పేరుంది. debut for Prithvi Shaw - not for Mayank Agarwal yet, Vihari & Siraj also to sit out. #INDvWI https://t.co/Bd163SPbPr — Gaurav Kalra (@gauravkalra75) October 3, 2018 #INDvWI BCCI have released India's 12 for the 1st Test against West Indies. Confirmed then - Prithvi Shaw to debut! Only question seems to be three spinners - Ashwin, Jadeja, Kuldeep - or three pacers - Shami, Umesh, Shardul. pic.twitter.com/n2JqoI0v3z — Saurabh Somani (@saurabh_42) October 3, 2018 -
ఈ నలు‘గురి’...
ఓపెనింగ్‌లో ఏర్పడిన అనూహ్య ఖాళీలు... ఆరో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మన్‌ను ఆడించే ఆలోచన... పేస్ వనరులను మరింత పదునెక్కించే ఉద్దేశం...! సమీకరణాలు ఏమైతేనేమి? వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఒక్కసారిగా నలుగురు యువ ఆటగాళ్లకు మహదవకాశంగా మారింది. టెస్టు జట్టులో తొలిసారి ఎంపికైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్ మొహమ్మద్ సిరాజ్‌లతో పాటు ఇప్పటికే జట్టుతో ఉన్న హనుమ విహారి, పృథ్వీ షాలలో కనీసం ఇద్దరు, లేదంటే ముగ్గురు ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున మైదానంలోకి దిగడం ఖాయం. జట్టుకు అత్యవసరమైన ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటే వీరి భవిష్యత్‌కు భరోసా లభించడమే కాకుండా జట్టులో స్థానాలు సుస్థిరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి క్రీడా విభాగం : ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు సిరీస్‌ల వ్యవధిలో టీమిండియా టెస్టు జట్టులోకి ఐదుగురు కొత్త ఆటగాళ్లు వచ్చి చేరారు. ఇందుకు రెగ్యులర్ ఆటగాళ్ల ఫామ్ లేమి వంటి పరిస్థితులు కొంత కారణం కాగా... తప్పక పరీక్షించి చూడాలనేంతగా యువతరం సత్తా చాటడం మరో కారణం. వీరిలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఇప్పటికే తన ఎంపికకు కొంత న్యాయం చేశాడు. మిగిలింది మయాంక్, పృథ్వీ షా, హనుమ విహారి, సిరాజ్. తాజా పరిణామాల మధ్య వీరి ముందున్నది చక్కటి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకుంటే జట్టు అవసరాలు తీరి మరింత పటిష్టం అయ్యేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి ముందున్న సవాళ్లు ఎలాంటివి? వాటిని అందుకునే మార్గాలేమిటి? అనేది పరిశీలిస్తే... ఓపెనింగ్ సమస్య తీర్చేనా! సంప్రదాయ క్రికెట్లో గత పదేళ్లుగా భారత్ తరఫున ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే (విజయ్, ధావన్, అభినవ్ ముకుంద్, కేఎల్ రాహుల్) ఆటగాళ్లు. సెహ్వాగ్–గంభీర్ స్థాయిలో వీరిలో ఏ జోడీ కూడా స్థిరంగా రాణించలేదు. మిడిలార్డర్లో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలున్నా, ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసే ఆటగాడి కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇప్పుడు ధావన్, విజయ్‌లపై వేటుతో ఒక స్థానం ఖాళీ అయింది. వయసురీత్యా చూసినా, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్నా అద్భుతం అనదగ్గ స్థాయిలో రాణిస్తే తప్ప వీరు మళ్లీ టెస్టులకు ఎంపికవడం కష్టమే. ఒక ఓపెనర్‌గా రాహుల్ స్థిరపడ్డాడని అనుకున్నా, మరో స్థానం మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా కోసం ఎదురుచూస్తోంది. వీరిలో ఒకరు విండీస్ సిరీస్‌లో అరంగేట్రం చేయడం పక్కా. అనుభవరీత్యా చూస్తే టీం మేనేజ్మెంట్ మయాంక్ వైపే మొగ్గు చూపొచ్చని అంచనా. అయితే, పృథ్వీని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ ప్రత్యర్థి బలహీనమైనదే కాబట్టి చెరొక టెస్టు చాన్సిచ్చినా ఇవ్వొచ్చు. ఇప్పటికైతే అవకాశాలు సమంగా ఉన్నాయి. ఇక ప్రతిభ పరంగా ఇద్దరూ సమఉజ్జీలే. ఈ కాలపు టెస్టులకు తగిన స్ట్రయిక్ రేట్ (పృథ్వీ–76.69; మయాంక్ 60.93) ఉన్నవారే. సాధికారిక డిఫెన్స్‌తో పాటు దూకుడుగానూ ఆడగలరు. టెక్నిక్ పరంగానూ లోపాలు లేవు. బలహీనమైన విండీస్ బౌలింగ్‌లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటే... తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకూ వీరినే పరిగణించే అవకాశం ఉంటుంది. మరోవైపు దేశవాళీల్లో కనుచూపు మేరలో మరే ఓపెనింగ్ ఆటగాడూ వీరి స్థాయిలో రాణించడం లేదు. దీన్నిబట్టి... తొలుత విఫలమైనా కుదురుకునే వరకు ఈ ఇద్దరికి అవకాశాలిస్తారని చెప్పొచ్చు. వీరు చేయాల్సిందల్లా... తమ సామర్థ్యానికి తగినట్లుగా ఆడటమే. అదే జరిగితే టీమిండియాను వేధిస్తున్న ‘ఓపెనింగ్’ ఇబ్బంది తీరినట్లే. విహారి ‘ఆరో’హణం... కోహ్లి సేన విదేశీ పరాజయాలకు ప్రధాన కారణం... ఆరో స్థానంలో సమర్థుడైన బ్యాట్స్‌మన్ లేకపోవడం. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఈ స్థానాన్ని భర్తీ చేయదగ్గ ఆటగాడు దొరకలేదు. లోయరార్డర్‌తో సమన్వయం చేసుకుంటూ జట్టుకు అవసరమైన పరుగులు జోడించడం నంబర్ 6 బ్యాట్స్‌మన్ కర్తవ్యం. ఈ బాధ్యతను నిర్వర్తించేవారు లేకే ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఐదో టెస్టు ఆడిన హనుమ విహారి ఆరో నంబరుకు తగినవాడిగా ఆశలు రేపాడు. బ్యాటింగ్‌లో అర్ధ శతకంతో పాటు ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. జట్టుకు సరిగ్గా అవసరమైన ప్రదర్శన ఇది. ఓ విధంగా చెప్పాలంటే స్పిన్ వేయగలగడమే... కరుణ్ నాయర్‌ను కాదని విహారిని ఆడించేలా చేసింది. విండీస్ సిరీస్‌లోనూ సత్తా చాటితే మున్ముందు హార్దిక్ పాండ్యా బదులుగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా విహారినే టీం మేనేజ్మెంట్ నమ్ముకోవచ్చు. పేస్ ‘సిరాజసం’ చాటితే... పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రతిభ చాటుకున్నా సిరాజ్ టెస్టు స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ, ఏడాది వ్యవధిలోనే అతడు అద్భుతంగా రూపాంతరం చెందాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లపై గణాంకాలు చూస్తే అతడి పేస్ ఎంత పదునెక్కిందో తెలుస్తోంది. నిలకడైన వేగంతో పాటు స్వింగ్, బౌన్స్ సిరాజ్ బౌలింగ్ ప్రత్యేకతలు. ఇషాంత్, షమీ, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ తర్వాత ఇప్పుడు దేశంలో టాప్ పేసర్ సిరాజే అనడంలో సందేహం లేదు. పేస్ పిచ్‌లు తయారు చేయనున్నారన్న ఊహాగానాల మధ్య... భీకర ఫామ్‌లో ఉన్నందున విండీస్ సిరీస్‌లో ఓ టెస్టులో అతడిని బరిలో దింపినా దింపొచ్చు. ఇది ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికయ్యేందుకు సిరాజ్‌కు సరైన మార్గం. తన శైలి బౌలింగ్‌కు ఆసీస్ పిచ్‌లు నప్పుతాయి కూడా. ఇన్ని అంచనాల మధ్య ఈ హైదరాబాదీ ఏం చేస్తాడో మరి? -
బోర్డు ప్రెసిడెంట్స్ జట్టులో విహారి
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనే బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టును ప్రకటించారు. కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్, ఇటీవలే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన హనుమ విహారికి స్థానం లభించింది. ఈ వార్మప్ మ్యాచ్ తర్వాత భారత్‌తో విండీస్ రెండు టెస్టులు ఆడుతుంది. తొలి టెస్టు అక్టోబరు 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో... రెండో టెస్టు అక్టోబరు 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరుగుతాయి. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: కరుణ్ నాయర్ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్, విహారి, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, ఇషాన్ కిషన్, జలజ్ సక్సేనా, సౌరభ్, బాసిల్ థంపి, అవేశ్ ఖాన్, విఘ్నేశ్, ఇషాన్ పోరెల్. -
‘మ్యాచ్‌కు ముందు ద్రవిడ్‌తో చాలాసేపు మాట్లాడా’
లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారి తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా.. కుదురుకున్నాక స్వేచ్ఛగా ఆడాడు. చక్కటి డిఫెన్స్, టెక్నిక్‌తో ఇంగ్లండ్డ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే విహారి(56; 124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించి.. ఇంగ్లండ్ గడ్డ మీద ఈ ఘనత సాధించిన ద్రవిడ్, గంగూలీల సరసన నిలిచాడు. అరంగేట్రం చేయబోతున్న విషయం మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజే తనకు తెలిసిందని విహారి తెలిపాడు. వెంటనే ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఫోన్ కాల్ చేసి ఇదే విషయం చెప్పానన్నాడు. చాలాసేపు ద్రవిడ్‌తో మాట్లాడిన తనకు కొన్ని సలహాలు ఇచ్చాడని, అలా మాట్లాడటం వల్ల మ్యాచ్‌కు ముందు తనపై ఒత్తిడి తగ్గిందని విహారి తెలిపాడు. ‘నీకు నైపుణ్యం ఉంది, మంచి ఆలోచనా విధానం, టెంపర్మెంట్ ఉంది. బరిలో దిగి ఆటను ఆస్వాదించు’ అని ద్రవిడ్ చెప్పాడని విహారి తెలిపాడు. ఇండియా-ఏ తరఫున రాణించడంతోపాటు ద్రవిడ్ సూచనలు తనను మెరుగైన ఆటగాడిగా మార్చాయని హనుమ విహారి పేర్కొన్నాడు. -
జడేజాను ముందే తీసుకోవాల్సింది!
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఒంటరి పోరాటంతో భారత్‌ను గట్టెక్కించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామ్యానుడి నుంచి దిగ్గజాల వరకు అతని పోరాటాన్ని కొనియాడుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా యువ ఆటగాడు విహారితో కలిసి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను ఆదుకున్నాడు. విహారి వికెట్ అనంతరం అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు. ఈ క్రమంలో 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం. దీంతోనే భారత్ 292 పరుగులు చేయగలిగింది. జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్, నాటౌట్) ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండిపడింది. ఇక అంతకు ముందు బంతితో నాలుగు వికెట్లు సాధించిన జడేజాను ముందు మ్యాచ్‌లే ఆడిపిస్తే సిరీస్ ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జడేజా ఆటను టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొనియాడాడు. ‘వెల్డన్ జడేజా.. నీవు ముందే ఈ సిరీస్‌లో ఆడుంటే ఫలితం మరోలా ఉండేది. 4 వికెట్లతో పాటు అద్భత హాఫ్ సెంచరీ సాధించావు.. అలాగే రాణించు’ అని ట్విటర్లో ప్రశంసించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ సైతం జడేజా ప్రదర్శనను కొనియాడాడు. ‘ జడేజా ఆటతీరు ఆకట్టుకుంది. అన్ని సమయాల్లో అతన్ని ఆడించాలని భారత్ ఎలా గ్రహిస్తుందో.. గొప్ప నైపుణ్యం కలిగిన ఆటగాడు’ అని ట్వీట్ చేశారు. భారత ఆటగాళ్లు ఆర్పీసింగ్ సైతం బంతితో, బ్యాట్‌తో రాణించిన జడేజాను కొనియాడాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కుదురుగా ఆడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. Well done @imjadeja should have played earlier in the series things could have been different.. 4 wickets and a brilliant 50.. keep going pal — Harbhajan Turbanator (@harbhajan_singh) September 9, 2018 Love the way @imjadeja plays the game ... Somehow India have to find a way to play him all the time ... Great skills ... #ENGvIND — Michael Vaughan (@MichaelVaughan) September 9, 2018 చదవండి: ఎటువైపో ఈ ‘టెస్టు’ -
ద్రవిడ్, గంగూలీ తర్వాత విహారే!
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తెలుగు క్రికెటర్ హను విహారి అరుదైన రికార్డ్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఈ యువక్రికెటర్ క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ సాధించి భారత్‌ను గట్టెక్కించాడు. దీంతో అరంగేట్రపు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా విహారి గుర్తింపు పొందాడు. ఈ మధ్యకాలంలో ఈ ఘనతను టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శ్రీలంకపై అందుకున్నాడు. అతని స్థానంలోనే తుది జట్టులోకి వచ్చిన విహారి సైతం ఈ జాబితాలో చేరడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా విహారి నిలిచాడు. 1996లో లార్డ్స్ టెస్ట్‌లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు ఈ ఘనతను అందుకున్నారు. 104 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన విహారి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అంతేకాదు జడేజాతో కలిసి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల (73) మిడిలార్డర్ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు జడేజా(86) సైతం సూపర్ ఇన్నింగ్స్‌తొ పోరాడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేయగలిగింది. -
ఇంగ్లండ్‌తో టెస్ట్: తెలుగోడి అరంగేట్రం
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుతో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాలను తీసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి యువ ఆటగాడు విహారికి క్యాప్ అందజేశాడు. ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌ను పక్కనపెట్టి మరి విహారిని ఎంపిక చేయడం విశేషం. ఇక భారత్ తరపున టెస్ట్ ఆడుతున్న 292వ ఆటగాడిగా విహారి గుర్తింపు పొందాడు. నాలుగో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని అశ్విన్ అంత అనుకున్నట్లే తొలిగించి జడేజాకు అవకాశం కల్పించారు. మరో బ్యాట్స్‌మన్ అవసరమని భావించిన జట్టు యాజమాన్యం మంచి ఫామ్‌లో ఉన్న విహారికి అవకాశం కల్పించింది. పృథ్వీ షాకు అవకాశం ఇస్తారని భావించగా టీమ్ మరోసారి రాహుల్, ధావన్‌లపై నమ్మకం ఉంచింది. ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌లో గాయంతో కీపింగ్‌కు దూరంగా ఉన్న బెయిర్ స్టో ఈ మ్యాచ్‌లో కీపింగ్ చేయనున్నాడు. భారత్ : కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, కరన్, రషీద్, బ్రాడ్, అండర్సన్. కాకినాడలో జననం టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు. చదవండి: టీమిండియాలో ‘విహారం’ -
టీమిండియాలో కాకినాడ కుర్రాడు
కాకినాడ: విహారి... ఇప్పుడీపేరు తెలియని క్రికెట్ అభిమాని లేడు. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ టీం ఇండియాలో స్థానం దక్కించుకున్న హనుమ విహారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు ? ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. జాతీయ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న విహారి కాకినాడలో పుట్టి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయం గోదావరి ప్రాంతవాసులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది. కాకినాడలో జననం టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు. స్ఫూర్తి ప్రదాయిని తల్లే చిన్ననాటి నుంచి విహారి క్రీడలపై ఆసక్తి కనబరిచేవాడు. ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్‌పై మక్కువ చూపేవాడు. తల్లి క్రికెట్లో సచిన్, ద్రావిడ్ వంటి క్రీడాకారులు ఎంత కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారో తరచూ చెబుతుండడంతో క్రికెట్‌పై విహారికి మక్కువ పెరగసాగింది. క్రికెట్ పట్ల ఆసక్తి పెరగడంతో బాగా రాణించగలిగాడు. ఏడో ఏట హైదరాబాద్‌లో సెయింట్ జాన్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ కోచ్ జాన్‌మోజెస్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందాడు. అనతికాలంలోనే.. క్రికెట్లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్–19 ప్రపంచ కప్ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీపోటీల్లో మరింతగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడే పుట్టి... ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్ ఇండియాలో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల క్రికెట్ క్రీడాకారుల్లో ఎంఎస్కే ప్రసాద్ తరువాత విహారే. విహారి ప్రస్తుత తరం క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాడని, బాలుర, బాలికల జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కేవీఎస్ కామరాజు, కిరణ్‌రాజ్, సంయుక్త కార్యదర్శి కొండలరావు, పీడీ స్పర్జన్‌రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంకిత భావంతో తన కుమారుడు చేసిన కృషి ఈ స్థాయికి తెచ్చిందని అతని తల్లి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. విహారికి అభినందనల వెల్లువ భానుగుడి (కాకినాడ సిటీ): ఆంధ్ర రంజీట్రోఫీ లో నిలకడైన ప్రదర్శనకు చక్కటి గుర్తింపు తెచ్చుకుని ఇంగ్లండ్‌లో జరగనున్న చివరి రెండు టెస్ట్‌లకు భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న జిల్లాకు చెందిన ఆటగాడు గాదె హనుమ విహారి అభినందనీయుడని జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఎస్డీ కామరాజు అన్నారు. జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో గురువారం కామరాజు అధ్యక్షతన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అండర్ 16 నుంచి నిలకడగా ఆడుతూ జిల్లాకు మంచిపేరు తీసుకువచ్చిన క్రికెట్ క్రీడాకారుడు హనుమ విహారి అని అన్నారు. సంఘ కార్యదర్శి కేఎస్ కిరణ్‌రాజు మాట్లాడుతూ కాకినాడకు చెందిన విహారి ఇండియా ఏ టీమ్‌లో అద్భుతంగా ఆడాడని, అక్కడ ప్రతిభను గుర్తించి జాతీయ జట్టుకు ఎంపిక చేశారన్నారు. ఆంధ్రా నుంచి టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికైన వారిలో ఎంఎస్కే ప్రసాద్ తరువాత స్థానం విహారిదే అన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల పీడీ డాక్టర్ కె. స్పర్జన్‌రాజు మాట్లాడుతూ క్రికెట్ మీద ఉన్న అంకిత భావంతో ఆడటం వలనే విహారి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని, జిల్లా సంఘం కూడా విహారికి మంచి ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఐ. కొండలరావు, ట్రెజరర్ వైవీఎస్ నాయుడు, హెడ్ కోచ్‌లు డి. రవికుమార్, ఎమ్వీ నగేష్, ఎన్. రవికుమార్, జీడీ ప్రసాద్, జె.హరినాథరెడ్డి, ఎం. సత్యనారాయణ విహారికి అభినందనలు తెలిపారు. -
భారత టెస్టు జట్టులో విహారి
న్యూఢిల్లీ: ఆంధ్ర రంజీ ఆటగాడు గాదె హనుమ విహారి నిలకడైన ప్రదర్శనకు చక్కటి గుర్తింపు లభించింది. ఇంగ్లండ్‌తో జరుగనున్న చివరి రెండు టెస్టులకు బుధవారం ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కింది. విహారితో పాటు ముంబై యువ సంచలనం పృథ్వీ షాకూ జాతీయ జట్టులోకి పిలుపొచ్చింది. ఓపెనర్ మురళీ విజయ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లపై వేటు వేసి వీరిద్దరిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు మినహా... ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరినీ కొనసాగించారు. అతడి ప్రతిభకు గుర్తింపు... తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియా తలుపుతట్టే స్థాయి ఉన్న ఆటగాడిగా 24 ఏళ్ల విహారి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. 2012 అండర్–19 ప్రపంచకప్ జట్టు సభ్యుడైన అతడు మధ్యలో కొంతకాలం అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ, వెంటనే పుంజుకొని రంజీల్లో అదరగొట్టడం ప్రారంభించాడు. గతేడాది ‘ట్రిపుల్ సెంచరీ’ సైతం కొట్టాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో భారత ‘ఎ’ జట్టు తరఫున వెస్టిండీస్ ‘ఎ’ జట్టుపై, తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’పై శతకాలు (147, 148) సాధించాడు. అంతేకాక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కానంత అత్యధిక సగటు (59.45) అతడిది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మేటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారాల సగటు సైతం 53 నుంచి 55 శాతమే కావడం గమనార్హం. టెస్టులకు సరిగ్గా సరిపోయే సాంకేతికత విహారి సొంతం. డిఫెన్స్‌లోనూ మేటి. ఐపీఎల్లో 2015 తర్వాత ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని ఇంగ్లండ్‌లో ఫస్ట్ డివిజన్ లీగ్ ఆడేందుకు ఉపయోగించుకున్నాడు. అక్కడ ఆరు శతకాలు కొట్టాడు. విహారి... 2017–18 సీజన్లో 94 సగటుతో 752 పరుగులు చేశాడు. ఇందులో కెరీర్ ఉత్తమ స్కోరు 302 ఉండటం విశేషం. దీంతోపాటు రంజీ చాంపియన్ విదర్భతో జరిగిన ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో వీరోచిత 183 పరుగుల శతకం విహారిని మరింత వెలుగులోకి తెచ్చింది. తర్వాత నుంచి అతడి ఫామ్ అదే స్థాయిలో కొనసాగి... టీమిండియా గడప తొక్కేవరకు తెచ్చింది. 1999లో ఎమ్మె స్కే ప్రసాద్ తర్వాత ఓ ఆంధ్ర క్రికెటర్‌కు జాతీయ టెస్టు జట్టులో స్థానం లభించడం ఇదే ప్రథమం. -
విహారి అజేయ సెంచరీ
బెంగళూరు: ఆంధ్ర రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి (138 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. విహారితో పాటు అంకిత్ బావ్నే (80; 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విహారితో పాటు మరో అంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ (30 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
‘శత’క్కొట్టిన విహారి, పృథ్వీ షా
నార్తంప్టన్: ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (131 బంతుల్లో 147; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు యువ సంచలనం పృథ్వీ షా (90 బంతుల్లో 102; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు 203 పరుగలతో వెస్టిండీస్ ‘ఎ’పై గెలిచింది. ఈ ఇద్దరు శతకాలతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వెస్టిండీస్ 37.4 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 4, చహర్ 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రిషభ్ పంత్ (5), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పర్చడంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో జతకట్టిన విహారి విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అలవోకగా బౌండరీలు బాదుతూ భాగస్వామ్యాన్ని పెంచుతూ పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఆ తర్వాత పృథ్వీ ఔటైనా మిడిలార్డర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన విహారి జట్టుకు భారీ స్కోరు అందించి ఇన్నింగ్స్ చివరి బంతికి వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో చెమర్ హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లక్ష్యంలో సగం పరుగులైనా చేయకుండానే ఆలౌటైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన భారత్ ‘ఎ’ సోమవారం జరిగే టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ ‘ఎ’తో తలపడనుంది. -
రెండు ‘ఎ’ జట్లలో హనుమ విహారి
ఇంగ్లండ్‌లో పర్యటించే భారత ‘ఎ’ జట్లను కూడా సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. వన్డే టీమ్‌కు శ్రేయస్ అయ్యర్, అనధికారిక టెస్టులు ఆడే జట్టుకు కెప్టెన్‌గా కరుణ్ నాయర్ వ్యవహరిస్తారు. ఆంధ్ర బ్యాట్స్‌మన్ గాదె హనుమ విహారికి ఈ రెండు టీమ్‌లలోనూ స్థానం లభించగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు రోజుల మ్యాచ్‌ల (అనధికారిక టెస్టులు)లో తలపడే జట్టులో చోటు దక్కింది. ఈ టూర్లో భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్ ‘ఎ’, వెస్టిండీస్ ‘ఎ’లతో తలపడుతుంది. వన్డే ‘ఎ’ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, విహారి, సంజు శామ్సన్, దీపక్ హుడా, రిషభ్ పంత్, విజయ్ శంకర్, గౌతమ్, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్. టెస్టు ‘ఎ’ జట్టు: కరుణ్ నాయర్ (కెప్టెన్), ఆర్.సమర్థ్, మయాంక్ అగర్వాల్, ఈశ్వరన్, పృథ్వీ షా, అంకిత్ బావ్నే, విజయ్ శంకర్, కేఎస్ భరత్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్‌పుత్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, రజనీశ్ గుర్బాని. -
వీర విహారి
ధర్మశాల: దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో భారత్ ‘బి’ శుభారంభం చేసింది. ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి (76 బంతుల్లో 95 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ ‘బి’ జట్టు 8 వికెట్లతో భారత్ ‘ఎ’పై నెగ్గింది. మొదట భారత్ ‘ఎ’ 41.2 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. ‘ఎ’ జట్టు స్కోరు 51/4 వద్ద ఉన్నపుడు వర్షంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ‘ఎ’ జట్టులోనూ ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (107 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ధర్మేంద్ర సింగ్ జడేజా 4, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘బి’ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 175 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఆ జట్టు 26.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఈశ్వరన్ (43), కెప్టెన్ అయ్యర్ (28 నాటౌట్) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే పోరులో భారత్ ‘బి’తో విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు తలపడుతుంది. -
ఆదుకున్న విహారి, సుమంత్
సాక్షి, విజయనగరం: కెప్టెన్ హనుమ విహారి (77; 7 ఫోర్లు, ఒక సిక్స్), సుమంత్ (57; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో... మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (30; 5 ఫోర్లు) కూడా రాణించాడు. డీబీ రవితేజ 7 పరుగులతో, అశ్విన్ హెబ్బర్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. రెండో వికెట్‌కు ప్రశాంత్‌తో 73 పరుగులు జోడించిన విహారి... నాలుగో వికెట్‌కు సుమంత్‌తో 76 పరుగులు జతచేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 219/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ జట్టు 321 పరుగులకు ఆలౌటైంది. హర్‌ప్రీత్ సింగ్ (88; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో యెర్రా పృథ్వీరాజ్ నాలుగు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, శశికాంత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
విహారి 302 నాటౌట్
సాక్షి, విజయనగరం: వరుసగా రెండో రోజు ఒడిషా బౌలర్లపై ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చలాయించారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 584 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ హనుమ విహారి (456 బంతుల్లో 302 నాటౌట్; 29 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ట్రిపుల్ సెంచరీ చేశాడు. రికీ భుయ్ (100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వరుసగా రెండో శతకం సాధిం చాడు. విహారి, రికీ భుయ్ మూడో వికెట్‌కు 208 పరు గులు జోడించారు. భుయ్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్ సహæకారంతో విహారి తన జోరు కొన సాగించాడు. 312 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న విహారి, 453 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. విహారి త్రిశతకం పూర్తి కాగానే ఆంధ్ర జట్టు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన 37వ బ్యాట్స్‌మన్‌గా, ఆంధ్ర తరఫున రెండో బ్యాట్స్‌మన్‌గా విహారి గుర్తింపు పొందాడు. రెండేళ్ల క్రితం ఒంగోలులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేఎస్ భరత్ (308 నాటౌట్) ఆంధ్ర తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒడిషా తమ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. -
విహారి, ప్రశాంత్ శతకాలు
సాక్షి, విజయనగరం: ఆంధ్ర బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో ఒడిషాతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ హనుమ విహారి (248 బంతుల్లో 143 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), డీబీ ప్రశాంత్ (270 బంతుల్లో 127; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు బాదడంతో మంగళవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (3) అవుటైన తర్వాత విహారి, ప్రశాంత్ రెండో వికెట్‌కు 270 పరుగులు జోడించడం విశేషం. బయటి వేదికపై తొలి రెండు మ్యాచ్ లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆంధ్రకు ఈ సీజన్లో సొంతగడ్డపై ఇదే తొలి మ్యాచ్. -
ఆంధ్రకు భారీ ఆధిక్యం
వడోదర: కెప్టెన్ హనుమ విహారి (284 బంతుల్లో 150; 20 ఫోర్లు), రికీ భుయ్ (283 బంతుల్లో 145; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగడంతో బరోడాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 9 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేసింది. విహారి, భుయ్ మూడో వికెట్‌కు ఏకంగా 308 పరుగులు జోడించడం విశేషం. బోడపాటి సుమంత్ (45 బ్యాటింగ్), విజయ్ కుమార్ (0 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. బరోడా బౌలర్లలో అతీత్ సేఠ్‌కు 5 వికెట్లు దక్కగా... పఠాన్ బ్రదర్స్ యూసుఫ్, ఇర్ఫాన్ ఇద్దరూ కలిసి 32 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మంగళవారం ఆఖరి రోజు కావడంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగాల్సిన హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మ్యాచ్ వరుసగా మూడో రోజు కూడా వర్షం బారిన పడింది. మైదానం తడిగా ఉండటంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. -
ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా విహారి
విజయవాడ : 2016-17 క్రికెట్ సీజన్లో పాల్గొనే ఆంధ్ర రంజీ జట్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. గతేడాది హైదరాబాద్‌కు ఆడి ఈసారి ఆంధ్రకు వచ్చిన హనుమ విహారిని జట్టు కెప్టెన్‌గా నియమించారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన రవితేజతో పాటు గుజరాత్‌కు చెందిన భార్గవ్ భట్‌కు కూడా చోటు కల్పించారు. సొంత జట్టు ఆంధ్రకు ఆడతానంటూ ఏసీఏ చుట్టూ తిరిగిన వేణు గోపాలరావును సెలక్షన్ కమిటీ పట్టించుకోలేదు. సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌ల కోసం ఈ జట్టును ప్రకటించారు. ఆంధ్ర రంజీ జట్టు: విహారి (కెప్టెన్), కేఎస్ భరత్ (వైస్ కెప్టెన్), డీబీ ప్రశాంత్‌కుమార్, ఎంయూబీ శ్రీరామ్, కె.శ్రీకాంత్, ఏజీ ప్రదీప్, డీబీ రవితేజ, కె.అశ్విన్ హెబర్, సీహెచ్.స్టీఫెన్, డి.శివకుమార్, ఐ.కార్తీక్రామన్, బి.అయ్యప్ప, పి.విజయకుమార్, టి.వంశీకష్ణ, సిద్ధార్థ్, భార్గవ్ భట్. అక్టోబర్ 3నుంచి చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ అండర్-19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. తెలంగాణ చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఖమ్మంలోని సీక్వెల్ రిసార్‌ట్సలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పద్మారావు సోమవారం టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, మీడియా ఇన్చార్జి పి. రమేశ్ పాల్గొన్నారు. -
విహారి 200 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్ కౌంటీల్లో మైనర్ లీగ్‌లు ఆడుతున్న హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి శనివారం జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. తన సహజ శైలికి విరుద్ధంగా దూకుడు ప్రదర్శించిన అతను వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. హటన్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్న విహారి, ఆర్డిలెగ్ గ్రీన్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 138 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విహారి జోరుతో హటన్ జట్టు 44 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు చేసింది. ప్రత్యర్థిని 182 పరుగులకే ఆలౌట్ చేసి 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. విహారి 2 వికెట్లు కూడా పడగొట్టాడు. -
ఆంధ్ర చేతిలో హైదరాబాద్ చిత్తు
బెంగళూరు: సౌత్ జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరులో ఆంధ్రదే పైచేయి అయింది. సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 47.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. హబీబ్ అహ్మద్ (49 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), హనుమ విహారి (70 బంతుల్లో 43; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. లెగ్‌స్పిన్నర్ దాసరి స్వరూప్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కేఎస్ భరత్ (87 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు సాయికృష్ణ (55 బంతుల్లో 36; 5 ఫోర్లు) రాణించడంతో ఆంధ్ర 40.1 ఓవర్లలో 4 వికెట్ల కు 167 పరుగులు చేసింది. అయితే ఈ రెండు జట్లూ దేశవాళీ నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయాయి. -
నాకౌట్ ఆశలు గల్లంతు
బెంగళూరు: రంజీ ట్రోఫీలో ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఇప్పుడు దేశవాళీ వన్డేల్లోనూ అదే బాట పట్టింది. గత మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో చిత్తుగా ఓడిన జట్టు...ఇప్పుడు ఆంధ్ర చేతిలోనూ పరాజయం పాలైంది. సౌత్‌జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో భాగంగా సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి ముందుగా హైదరాబాద్ 47.5 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలగా, ఆంధ్ర 40.1 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తాజా ఓటమితో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. సౌత్‌జోన్ నుంచి తమిళనాడు, కర్ణాటక జట్లు అర్హత సాధించాయి. ఆదుకున్న విహారి, హబీబ్... టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 7 పరుగులకే ఓపెనర్లు సుమన్ (5), అక్షత్ (1) పెవిలియన్ చేరారు. అయితే ఈ దశలో హనుమ విహారి (70 బంతుల్లో 43; 5 ఫోర్లు) ఆదుకున్నాడు. రవితేజ (11)తో కలిసి అతను మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. అయితే రవితేజతో పాటు సందీప్ రాజన్ (7), విహారి వెంటవెంటనే వెనుదిరిగారు. ఫామ్‌లో ఉన్న ఆశిష్ రెడ్డి (9)తో పాటు షిండే (15), కనిష్క్ (0) కూడా ఏడు పరుగుల వ్యవధిలోనే నిష్ర్కమించారు. అయితే వికెట్ కీపర్ హబీబ్ అహ్మద్ (49 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఆటగాళ్లు ఓజా (11), రవికిరణ్ (11)ల అండతో అతను స్కోరును 150 పరుగులు దాటించాడు. ఆంధ్ర బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, విజయ్‌కుమార్‌కు 2 వికెట్లు దక్కాయి. గెలిపించిన భరత్... సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 9 పరుగుల వద్ద ఓపెనర్ ప్రశాంత్ (6) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ శ్రీకర్ భరత్ (87 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో వికెట్‌కు జ్యోతి కృష్ణ (55 బంతుల్లో 36; 5 ఫోర్లు) తో 60 పరుగులు జోడించిన భరత్, మూడో వికెట్‌కు బోడ సుమంత్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)తో 56 పరుగులు జత చేశాడు. భరత్ వెనుదిరిగినా...రికీ భుయ్ (28 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) మ్యాచ్‌ను ముగించాడు. -
విహారి ‘తీన్మార్’
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ సీజన్లో హనుమ విహారి సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటికే 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించిన అతను తాజాగా మరో శతకంతో చెలరేగాడు. రంజీ ట్రోఫీలో అతను వరుసగా మూడో సెంచరీ సాధించడం విశేషం. విహారి రాణించడంతో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు బుధవారం ఆట ముగిసే సరికి హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. విహారి (296 బంతుల్లో 145; 16 ఫోర్లు) శతకానికి తోడు అహ్మద్ ఖాద్రీ (131 బంతుల్లో 74; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ 266 పరుగులు ముందంజలో ఉంది. అమోల్ షిండే (79 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), ఆశిష్ రెడ్డి (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్ చివరి రోజు గురువారం మరి కొద్ది సేపు ఆడి కేరళకు లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. తొలి రోజు తరహాలో వికెట్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తే హైదరాబాద్‌కు విజయావకాశాలుంటాయి లేదా మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఉన్నాయి. కీలక భాగస్వామ్యం.... ఓవర్‌నైట్ స్కోరు 46/1తో హైదరాబాద్ మూడో రోజు ఆట ప్రారంభించింది. కొద్ది సేపటికే నియాస్ బౌలింగ్‌లో సందీప్ (102 బంతుల్లో 30; 5 ఫోర్లు) వెనుదిరగ్గా...ఆ వెంటనే రవితేజ (2) కూడా అదే బౌలర్ చేతిలో అవుటయ్యాడు. ఈ దశలో విహారి, ఖాద్రీ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో విహారి 87 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి సెషన్ ముగిసే సరికి హైదరాబాద్ 3 వికెట్లకు 136 పరుగులు చేసింది. లంచ్ అనంతరం కొద్ది సేపటికే 101 బంతుల్లో ఖాద్రీ సెంచరీ పూర్తయింది. కొద్ది సేపటికే పద్మనాభన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి ఖాద్రీ బౌల్డయ్యాడు. మరో వైపు ఎంతో ఏకాగ్రత ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడిన విహారి 216 బంతుల్లో ఫస్ట్ క్లాస్ కెరీర్లో నాలుగో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టీ విరామం వరకు జట్టు స్కోరు 239/4కు చేరింది. షిండే అండతో స్కోరు పెంచే ప్రయత్నం చేసిన విహారి చివరకు నియాస్ బౌలింగ్‌లో కీపర్ సురేంద్రన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. ఆ తర్వాత షిండే, ఆశిష్ జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించారు. ఎనిమిదో ఆటగాడు... రంజీ ట్రోఫీలో వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీ సాధించిన ఎనిమిదో హైదరాబాద్ క్రికెటర్‌గా విహారి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికంటే ముందు సహచరుడు అక్షత్ రెడ్డి (2011-12 సీజన్) కూడా ఈ ఘనత సాధించాడు. సీనియర్ తరంలో ఎంఎల్ జైసింహా (64-65), విజయ్ మోహన్ రాజ్ (85-86, 86-87), ఎంవీ శ్రీధర్ (95-96), వీవీఎస్ లక్ష్మణ్ (95-96)లో వరుసగా మూడు రంజీ మ్యాచుల్లో శతకాలు చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ 1999-2000 సీజన్లో వరుసగా 5 మ్యాచ్‌లలో సెంచరీలు చేయగా...ఎంవీ శ్రీధర్ 1990-91, 91-92 సీజన్లలో వరుసగా 4 సెంచరీలు చేయడం విశేషం. -
విహారి వీర విహారం!
పోర్వోరిమ్: హైదరాబాద్ బ్యాట్స్‌మన్ గాదె హనుమ విహారి ఈ సీజన్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఈ ఏడాది నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన విహారి కీలకమైన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా గోవాతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. విహారి (378 బంతుల్లో 201 నాటౌట్; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ద్విశతకంతో పాటు కీపర్ హబీబ్ అహ్మద్ (94 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో హైదరాబాద్ 171 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 514 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 33.3 ఓవర్లలోనే 172 పరుగులు జోడించడం విశేషం. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. భారీ భాగస్వామ్యం... 234/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజుకంటే వేగంగా ఆడింది. విహారి, సందీప్ కలసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో సందీప్ కెరీర్లో ఎనిమిదో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నిలకడగా ఆడిన విహారి కూడా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విహారి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇది రెండో సెంచరీ. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం గడేకర్ బౌలింగ్‌లో బందేకర్కు క్యాచ్ ఇచ్చి సందీప్ నిష్ర్కమించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అహ్మద్ ఖాద్రీ (0) వెనుదిరగ్గా... షిండే (7) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఈ దశలో విహారితో హబీబ్ అహ్మద్ జత కలిశాడు. వీరిద్దరు అనూహ్య వేగంతో ధాటిగా ఆడి పరుగులు పిండుకున్నారు. 5.13 పరుగుల రన్‌రేట్‌తో ఈ భాగస్వామ్యం సాగింది. 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల కెరీర్లో ఒకే ఒక సిక్స్ కొట్టిన విహారి... ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు బాదడం విశేషం! ఇదే జోరులో హబీబ్ తన కెరీర్లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. మరి కొద్ది సేపటికే తన అత్యధిక స్కోరు (191)ను అధిగమించిన విహారి... తొలి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాంతో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఐదేళ్ల తర్వాత... హైదరాబాద్ తరఫున ఒక బ్యాట్స్‌మన్ రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత డబుల్ సెంచరీ సాధించడం విశేషం. 2008-09 సీజన్లో భాగంగా రాజస్థాన్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 224 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఉన్న జట్టు సభ్యులలో కూడా విహారి ఒక్కడి ఖాతాలోనే ద్విశతకం ఉంది.