
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనే బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టును ప్రకటించారు. కరుణ్ నాయర్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్, ఇటీవలే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన హనుమ విహారికి స్థానం లభించింది. ఈ వార్మప్ మ్యాచ్ తర్వాత భారత్‌తో విండీస్ రెండు టెస్టులు ఆడుతుంది. తొలి టెస్టు అక్టోబరు 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో... రెండో టెస్టు అక్టోబరు 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరుగుతాయి.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: కరుణ్ నాయర్ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్, విహారి, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, ఇషాన్ కిషన్, జలజ్ సక్సేనా, సౌరభ్, బాసిల్ థంపి, అవేశ్ ఖాన్, విఘ్నేశ్, ఇషాన్ పోరెల్.
Comments
Please login to add a commentAdd a comment