
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిరకాల స్నేహితురాలు యెరువ ప్రీతిరాజ్‌తో విహారి వివాహ నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త యెరువ రాజానందరెడ్డి కుమార్తె అయిన ప్రీతిరాజ్ స్వీడన్‌లో మాస్టర్స్ చేశారు.
ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్టు జట్టు తరఫున అరంగేట్రం చేసిన 25 ఏళ్ల విహారి గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు భారత క్రికెటర్లతో పాటు హైదరాబాద్, ఆంధ్ర రంజీ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశముంది.