
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబోయే భార్య వేధింపులకు తాళలేక పెళ్లి రోజే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసిక్‌కు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారి హరేరామ్(36)కి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మోహినికి నిశ్చితార్థం జరిగింది.
మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసిన హరేరామ్.. నిలదీశాడు. ఈ సంఘటన ఆమె ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఈ విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది.
నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మానసిక ఒత్తిడికి గురై విసిగిపోయిన హరేరామ్.. నాసిక్‌లోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతితో పాటు ఆమె లవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.