Nashik
-
ఢిల్లీ చేరుకున్న 1,341 టన్నుల ఉల్లి: ఎందుకంటే..
దేశ రాజధానిలో ఉల్లి ధరలకు చెక్ పెట్టే లక్ష్యంతో.. ఉల్లి గడ్డలతో నిండిన ఒక ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరుకుంది. నాసిక్ నుంచి ప్రత్యేక గూడ్స్ రైలులో సుమారు 1,341 టన్నుల ఉల్లి ఢిల్లీకి చేరుకున్నట్లు.. నార్త్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.పొలాల నుంచే నేరుగా ఉల్లి కొనుగోలు చేస్తే.. రవాణా సమయం, ఖర్చులు వంటివి కూడా తగ్గుతాయి. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా కొంత తక్కువ ధరకే ఉల్లిని విక్రయించవచ్చు. పలు నగరాల్లోని మార్కెట్లలో ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టన్నుల ఉల్లి.. ఢిల్లీకి చేరుకోవడంతో వారందరూ అధిక ధరల నుంచి ఉపశమనం పొందవచ్చు.గతంలో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున ఉల్లి సరఫరా చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రజల మీద ధరల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతోనే సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేదించింది. ఏప్రిల్-జూన్‌లో పండించిన ఉల్లి మరి కొన్ని రోజుల వరకు వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
ఏక్ హై తో సేఫ్ హై: ప్రధాని మోదీ
ధూలే/నాసిక్: మనమంతా ఒక్కటిగా కలిసికట్టుగా ఉంటేనే ఎప్పటికీ సురక్షితంగా ఉంటామని(ఏక్ హై తో సేఫ్ హై) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని ధూలే, నాసిక్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)పై విమర్శలు గుప్పించారు. చక్రాలు, బ్రేకులు లేని ఎంవీఏ వాహనంలో డ్రైవర్ సీటును ఆక్రమించుకోవడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ కూటమికి ఒక దశ దిశ లేదన్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకొచి్చన మహాయుతి కూటమిని మరోసారి గెలిపించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచార సభల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బంటేంగే తో కటేంగే(విడిపోతే నష్టపోతాం) అని నినదించగా, మోదీ బదులిస్తూ ‘ఏక్ హై తో సేఫ్ హై’ అని పిలుపునిచ్చారు. వినాయక్ దామోదర్ సావర్కర్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే దేశానికి ఎన్నో సేవలు చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని మహారాష్ట్రకు రప్పించి, సావర్కార్, థాకరే గురించి 15 నిమిషాలు ప్రశంసిస్తూ మాట్లాడించగల సత్తా మీకుందా? అని ఎంవీఏ కూట మి నేతలకు సవాలు విసిరా రు. విభజన రాజకీయాలకు మారు పేరు కాంగ్రెస్ అని మండిపడ్డారు. స్వార్థం కోసం కులాల మ« ద్య చిచ్చు పెట్టడం ఆ పార్టీకి అలవాటేనని ధ్వజమెత్తారు. జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఇప్పుడు నాలుగో తరం యువరాజు(రాహుల్ గాం«దీ) కూడా కులాల పేరిట సమాజాన్ని విడదీస్తున్నారని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజలు కలిసి ఉంటే కాంగ్రెస్ ఆటలు సాగవు ఒక కులంపై మరో కులం పోరాడేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండా. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చెందడం, తగిన గుర్తింపు పొందడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనమంతా కలిసి ఉంటేనే భద్రంగా ఉంటామని అందరూ గుర్తుంచుకోవాలి. ఐక్యంగా ఉండాలి. కాంగ్రెస్ విసురుతున్న వలలో చిక్కుకోవద్దు. అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటే కాంగ్రెస్ ఆటలు సాగవు.జమ్మూకశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని వర్తింపజేయకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి కుట్ర పన్నుతోంది. అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. అందులో మరో మాటలేదు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాకిస్తాన్ అజెండాను ప్రోత్సహిస్తున్నాయి. విభజనవాదుల భాష మాట్లాడుతున్నాయి. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు వెళ్లగొట్టారు. కాంగ్రెస్ కుతంత్రాలను దేశం అర్థం చేసుకుంటోంది’’ అని నరేంద్ర మోదీ చెప్పారు. -
Maharashtra: లోయలో పడిన పాల ట్యాంకర్.. ఐదుగురు మృతి
నాసిక్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నాసిక్ హైవేపై న్యూ కసర ఘాట్ సమీపంలో ఒక పాల ట్యాంకర్ 300 అడుగుల దిగువకు ఒక లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ బృందం, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే వర్షం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీసింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
Maharashtra: నీట మునిగిన పురాతన ఆలయాలు
మహారాష్ట్రలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని ముంబైలోని పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పూణే, నాసిక్, సాంగ్లీ, కొల్హాపూర్‌లలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. థానే, లోనావాలా, మహాబలేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ బృందాలను సమాయత్తమయ్యాయి.నాసిక్‌లో కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు గంగాపూర్ డ్యామ్ పొంగిపొర్లుతోంది. గోదావరి నది ఉప్పొంగడంతో గోదా ఘాట్ వద్దనున్న పలు చారిత్రక ఆలయాలు నీట మునిగాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా గోదా ఘాట్‌లోని దుకాణాలను మూసివేశారు. #WATCH | Maharashtra: Various temples were inundated under the Godavari river in Nashik, following incessant rainfall in the region. pic.twitter.com/oHjGYbTvDs— ANI (@ANI) August 5, 2024 -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. మహారాష్ట్ర నాసిక్‌లో దుర్ఘటన
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయ పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు కాగా.. వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సత్పురా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేశాడు. ఆ ప్రయత్నంలో ముందు మలుపు ఉండడంతో వేగంగా వెళ్తున్న బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.బస్సులోని ఓ ప్రయాణికుడు.. ఆ జర్నీని లైవ్ టెలికాస్ట్ కోసం చిత్రీకరించాడు. బస్సు ప్రమాదం తర్వాత కూడా ఆ వీడియో రికార్డయ్యింది. ప్రయాణికుల ఆర్తనాదాలు ఆ వీడియోలో వినిపించాయి. ఆపై ప్రమాద ఘటన తాలుకా వీడియో నెట్టింటకు చేరింది.Nashik: A bus fell into a valley in Nashik, LIVE video of the accident has surfaced#BusAccident #Nashik #Satpura #ViralVideo pic.twitter.com/bSidD45caK— Siraj Noorani (@sirajnoorani) July 9, 2024 -
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నగల దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అప్రకటిత లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జ్యువెలర్స్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులు లభించడం చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యాపారి సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ఇటీవల నాందేడ్ లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది. తరువాత తాజాగా నాసిక్‌లో ఈ దాడులు నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ చర్య మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ నోట్లను లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖకు చాలా గంటల సమయం పట్టింది. దీని కోసం పలు బృందాలను పిలిపించగా ఆ తర్వాత బయటకు వచ్చిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. Income Tax Department launched a raid on Surana Jewellers in Nashik, in response to alleged undisclosed transactions by the proprietor. About Rs 26 crore in cash and documents of unaccounted wealth worth Rs 90 crore have been seized in raids carried out by the Income Tax… pic.twitter.com/XJ0wyuI8HQ— ANI (@ANI) May 26, 2024 -
నాసిక్‌లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
66 ఏళ్ల వామన్ మహదేవ్ సంగలే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అంతగా తెలియని ధర్మరాజ్య పక్ష అనే పార్టీలో కార్యకర్తగా మారాడు. రోజువారీ ప్రయాణికుల కోసం ముంబై-నాసిక్, ముంబై-పూణే లోకల్ రైళ్లను ప్రారంభించాలనే ఏకైక కల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వాటి సాధన కోసమే నాసిక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు.రైల్వేలో చీఫ్ లోకో ఇన్స్పెస్టర్గా పనిచేసిన సంగలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా రైలు ప్రయాణికులకు సేవలను మెరుగుపరచడం కోసం పరితపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు హేమంత్ గాడ్సే ద్వారా లోకల్ ట్రైన్ తెప్పించి ట్రయల్స్ నిర్వహించాలని రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కొంత సఫలమయ్యారు.అయితే సొరంగాల పరిమితులు, నిటారు ఎత్తుపల్లాల కారణంగా ట్రయల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కానీ పట్టువదలని సంగలే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగారు. "అవును. ధర్మరాజ్య పక్ష తరఫున 'టేబుల్'ను నా గుర్తుగా చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా వద్ద మేనిఫెస్టో కూడా ఉంది. ప్రజల కోసం నా ప్రాధాన్యతలను జాబితా చేశాను" అని వామన్ మహదేవ్ సంగలే చెబుతున్నారు.'కసారా నుంచి నాసిక్, కర్జాత్ నుంచి పుణె వరకు లోకల్ ట్రైన్‌ను ముంబైకి అనుసంధానం చేయడం నేను చేసిన సూచనల్లో ఒకటి. దీని కోసం నేను చాలా ఏళ్లుగా పోరాడుతున్నాను. రైల్వేలను మెరుగుపరచడానికి నేను సూచించిన 15 సూచనలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు ఎంఎంఆర్ పరిధిలోని నాసిక్, పుణె, ముంబై ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రైల్ శిబిరాన్ని నిర్వహించారని, అందులో తాను చేసిన 15 సూచనల్లో మూడింటిని ఎంపిక చేశారని సంగలే పేర్కొన్నారు.సంగలే మేనిఫెస్టో ఇదే..కల్యాణ్‌ను నాసిక్, పుణెలకు లోకల్ రైళ్ల ద్వారా అనుసంధానించడమే తన మొదటి ప్రాధాన్యత అని సంగలే పేర్కొన్నారు. భుసావల్ డివిజన్ లో మెయిన్ లైన్ ఈఎంయూ రైళ్లు నడపడం, నాసిక్‌కు పెద్ద ఈఎంయూ కార్ షెడ్ నిర్మాణం, నాసిక్ నుంచి గుజరాత్ రైల్వే లైన్ వంటివి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయని సంగలే వివరించారు.అలాగే నిఫాద్ నుంచి మన్మాడ్ వరకు తీవ్రమైన తాగునీటి కొరత సమస్యను పరిష్కరించడం, ప్రతిపాదిత నాసిక్ మెట్రో రైలు పురోగతి, కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, పంచవటిలోని రాంకుండ్, సీతాకుండ్ వంటి పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయడం, గోదావరి నదిని పరిశుభ్రం చేయడం వంటివి తన ప్రాధాన్యతలు అని వామన్ మహదేవ్ సంగలే నాసిక్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కాగా నాసిక్ లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న పోలింగ్ జరగనుంది. -
PM Modi Nashik Visit : ప్రధాని మోదీ కాలారాం ఆలయ సందర్శన.. ఫోటోలు వైరల్
-
Nashik: కాలారామ్ ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన మోదీ
ముంబై: అయోధ్యలో రామ మందిన ప్రాణప్రతిష్ట వేళ మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. నాసిక్‌లో మెగా రోడ్డు షో నిర్వహించారు. అనంతరం రాంఘాట్‌కు చేరుకుని గోదావరి నదీమాతకు పూజలు చేశారు. ఇక చారిత్రక కాలారామ్ కాలారామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి రామ భజన చేశారు. Prayed at the Shree Kalaram Temple in Nashik. Feeling incredibly blessed by the divine atmosphere. A truly humbling and spiritual experience. I prayed for the peace and well-being of my fellow Indians. pic.twitter.com/cyNagP0nPd — Narendra Modi Satire (@NarendraMoJi) January 12, 2024 స్వచ్ఛత అభియాన్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కాలారామ్ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్‌ను మొదలు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. At the Shree Kalaram Temple, I had the profound experience of hearing verses from the Bhavarth Ramayana written in Marathi by Sant Eknath Ji, eloquently narrating Prabhu Shri Ram's triumphant return to Ayodhya. This recitation, resonating with devotion and history, was a very… pic.twitter.com/rYqf5YR5qu — Narendra Modi (@narendramodi) January 12, 2024 PM Modi took part in 'Swachhata Abhiyan' today at the Kalaram temple in Maharashtra's Nashik The PM had also appealed to everyone to carry out Swachhata activities at temples across the country.#SwachhBharat Nasik #KalaramTemple #NarendraModi #Ponmudi #PranaPratishta #Nasik… pic.twitter.com/gTmkHRB9r7 — Neha Bisht (@neha_bisht12) January 12, 2024 ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇవాళ నాసిక్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. పంచవటి ప్రాంతంలో సీతారాములు గడిపారన్న నమ్మకం ఉందని చెప్పారు. రాముడు చాలాకాలంపాటు పంచవటిలో ఉన్నారని అన్నారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తపోవన్ గ్రౌండ్లో నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను మోదీ ప్రారంభించారు. #WATCH | Nashik, Maharashtra: Addressing the Rashtriya Yuva Mahotsav at Tapovan Ground, Prime Minister Narendra Modi says, "India is among the top 5 economies of the world. Youth power is behind this. India is among the top 3 start-up systems in the world, India is making new… pic.twitter.com/QiVrWnpBVO — ANI (@ANI) January 12, 2024 దేశంలో యువశక్తి అత్యంత ముఖ్యమైనదని.. దేశ లక్ష్యాలను చేరుకోవడంలో యువత బలమైన మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. టెక్నాలజీ రంగంలో భారత్ వృద్ధి చెందుతోందన్నారు. ప్రధాని వెంట మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. #WATCH | Nashik, Maharashtra: Addressing the Rashtriya Yuva Mahotsav at Tapovan Ground, Prime Minister Narendra Modi says, "I urge that on the occasion of pranpratishtha in the Ram Temple, a cleanliness campaign is carried out in all temples and shrines of the country... Our… pic.twitter.com/h0upcKWw0B— ANI (@ANI) January 12, 2024 -
నేను కాలారామ్ దేవాలయంలో హారతి ఇస్తా: ఉద్ధవ్
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం అందలేదు. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే కూడా ఒకరు. తనకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఠాక్రే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్దవ్ తన తల్లి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిర ఆలయం ప్రారంభోత్సవం రోజే తనతోపాటు తన పార్టీ నేతలు నాసిక్‌లోని కాలారామ్ ఆలయానికి వెళ్లి అక్కడ గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహించనున్నట్లు చెప్పారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన గర్వించదగ్గ విషయమని, ఆత్మగౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సానే గురూజీ నిరసనలు చేసిన కాలారామ్ సదర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తాం’’ అని ఠాక్రే చెప్పారు. కాగా రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని గతవారం ఉద్ధవ్ తెలిపిన విషయం తెలిసిందే. రాముడు కొలువై ఉన్న కాలారామ్ ఆలయం నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో ఉంది. నల్లరాతితో చెక్కిన రాముడి విగ్రహం ద్వారా ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. రాముడు వనవాస సమయంలో భార్య సీత, సోదరుడులక్ష్మణుడితో పంచవటిలో ఉండేవారని భక్తులు విశ్వసిస్తారు. 1930లో దళితులను ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కాలారామ్ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. . -
కబడ్డీ.. కబడ్డీ... గెలిచింది
40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ‘‘నా చిన్నతనం అంతా నాగపూర్‌లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు. హాఫ్ ప్యాంట్ ‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్‌గా నిలిచారు. కబడ్డీ క్లబ్లో చేరడంతో నా జీవితమే మారిపోయింది. మొదటి మార్పు నాగపూర్‌లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్‌కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్‌కి వెళ్లి, కోచ్‌తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్‌కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని. చీకటి దారుల గుండా.. ఇంటికి గ్రౌండ్‌కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్‌పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్‌కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్‌పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని. చిన్న చిన్న అవార్డులైనా... యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్‌ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్‌కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్‌ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది. పాఠశాల స్థాయి నుంచి... కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్‌ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్‌లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్‌ను వదలలేదు. డిప్రెషన్‌ను అధిగమించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్‌లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అంతర్జాతీయంగా అవకాశాలు... రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్‌గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్‌పోర్ట్‌పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్‌గా ఉంటూ నాన్‌వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్‌తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను. జకార్తా నుంచి భారత్‌కు జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్‌కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది. స్వదేశానికి... ‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్. -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
మహారాష్ట్రలో 9 ఏళ్ల బాలుడు నరబలి
నాసిక్: నిధులు దొరుకుతాయనే కొందరి మూఢ విశ్వాసం తొమ్మిదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఘోరం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా పొహనె షివార్ గ్రామంలో ఈ నెల 16న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఒక బాలుడిని నిర్బంధించి తాంత్రిక పూజల్లో భాగంగా గొంతుకోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గుంతలో సగం వరకు పూడ్చిపెట్టారు. ఈ నెల 18న ఈ దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిధి దొరుకుతుందనే మూఢ నమ్మకంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు
నాసిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పలవురు కార్మికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు మహారాష్ట్రలో నాసిక్‌లోని ముండేగావ్ గ్రామంలోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ బాయిలర్ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయని చెప్పారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 11 మంది కార్మికులను రక్షించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Massive Fire After Explosion In Nashik Factory, Workers Feared Trapped https://t.co/QxhVRO0G1l pic.twitter.com/pJN6pDX6iC — Breaking News (@feeds24x7) January 1, 2023 (చదవండి: న్యూయర్ వేడుకల్లో రగడ..సెల్ఫీల కోసం వేరేవాళ్ల భార్యలతో బలవంతంగా..) -
వాహనాలపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మంటల్లో ఇద్దరు మృతి!
ముంబై: అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్ఆర్టీసీ)కి చెందిన ఓ బస్సు ముందున్న వాహనలను ఢీకొట్టింది. ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నాశిక్-పుణె రహదారిపై పాల్సే గ్రామం వద్ద గురువారం జరిగింది. ఈ ప్రమాదం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. పుణె జిల్లాలోని రాజ్‌గురునగర్ నుంచి నాశిక్‌కు వెళుతోంది. ఈ క్రమంలో పాల్సే గ్రామం సమీపంలో బ్రేకులు ఫెయిల్ అవగా.. నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎస్యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ‘రెండు బస్సుల మధ్య రెండు బైకులు చిక్కుకుని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌గురునగర్ నుంచి వచ్చిన బస్సుకు సైతం మంటలు అంటుకున్నాయి. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి 43 మందిని రక్షించారు. నాశిక్ అగ్నిమాపక విభాగం హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసింది.’ అని అధికారులు తెలిపారు. బ్రేకులు పని చేయక ప్రమాదానికి కారణమైన బస్సులోని కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని నాశిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం కారణంగా కొంత సమయం ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు చెప్పారు. CCTV footage of ST bus accident at Palase on Nashik-Pune highway#Accident #CCTV #Nashik_pune_Highway#Nashik #Sinnar #Palse pic.twitter.com/9BaKJ0JMUo — पाटील 🤗 (@PareshPatil11) December 8, 2022 पळसे ता.जि नाशिक येथे बस दुर्घटने मध्ये मृत्यु झालेल्या सर्वांना भावपुर्ण श्रद्धांजली. शासना तर्फे तात्काळ मदत मिळावी हि विनंती. #Palse #Accidents @CMOMaharashtra @Dev_Fadnavis जी @TV9Marathi @abpmajhatv @saamTVnews @zee24taasnews @ChivateMangesh जी pic.twitter.com/TeC2ovtyaW — Sameer kale (@SAMEER_G_KALE) December 8, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
వామ్మో ఇదేం ఫైటింగ్.. రోడ్డుపై తన్నుకున్న కాలేజీ అమ్మాయిలు
ఇటీవలి కాలంలో కాలేజీ విద్యార్థులు నడిరోడ్లపై తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. చిన్న చిన్న కారణాలు, లవ్ వ్యవహారాల్లో స్టూడెంట్స్ దెబ్బలాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీంతో, నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. నాసిక్‌లో ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాసుల అనంతరం క్యాంటీన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో క్యాంటీన్లో కూర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో, అక్కడే వాదనకు దిగి వ్యవహారం తిట్లు, తన్నుకునే వరకు వెళ్లింది. ఇంతలో క్యాంటీన్ సిబ్బంది వారిని వారించి అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. नाशिकच्या महाविद्यालयात तरुणींमध्ये तुफान हाणामारी. एकमेकींच्या झिंज्या उपटल्या#Nashik #Girl #Fight #CollegeStudent pic.twitter.com/m6NGKPoDup — India Darpan Live (@IndiaDarpanLive) November 18, 2022 అనంతరం, బయటకు వచ్చిన నలుగురు అమ్మాయిలు మరోసారి వాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన విద్యార్థినిలు తాము రోడ్డుపై ఉన్నామనే విషయం మరిచిపోయి దారుణంగా బూతులు తిట్టుకున్నారు. జట్టు పట్టుకుని భౌతిక దాడులు చేసుకున్నారు. తిట్టుకుంటూ ఒకరినొకరు తన్నుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వారిని వారించినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దాడులు చేసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను, ఆపై కార్గో వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి. మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు. -
Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 11 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాసిక్ ఔరంగబాద్ హైవేపై ఈ ఘటన జరిగింది. యావత్మాల్ నుంచి ముంబై వెళ్లే బస్సు, పుణె నుంచి నాసిక్ వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టుకోవడం వల్ల బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్ని పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తాము చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది తప్ప సాయం చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలు అదుపు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బస్సు యావత్మాల్ నుంచి బయలుదేరినప్పుడు 30 మంది ఉన్నారని, ఆ తర్వాత మధ్యలో మరో 19 మంది ఎక్కారని నాసిక్ పోలీస్ కమిషనర్ జయంత్ నాయక్‌నవారే తెలిపారు. వీరందరినీ గుర్తిస్తున్నట్లు చెప్పారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల సాయం ప్రకటించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం తెలిపింది. సీఎం రూ.5లక్షలు పరిహారం ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. Maharashtra | A luxury bus & a trailer truck collided with each other. A fire broke out due to the impact. 11 casualties so far. 30 people had started from Yavatmal & 19 people boarded the bus in the middle. They are being identified: Nashik Police Commissioner Jayant Naiknavare pic.twitter.com/xjljXPdM1K — ANI (@ANI) October 8, 2022 చదవండి: చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ -
వైరల్ వీడియో.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలుసా!
ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు మహిళలు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. నాసిక్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. మాటమాట పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. టోల్ సిబ్బంది, కారులోని మహిళ రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. టోల్ ఫీజు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా కారులోని మహిళ బయటకు దిగి టోల్గేట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగి చేతులను మెలితిప్పి దాడి చేసింది. దీంతో సిబ్బంది కూడా మహిళపై ఘర్షణకు దిగింది. ఇద్దరూ మరాఠీలో తిట్టుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. నడిరోడ్డుపై ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని చెంపలు వాయించుకున్నారు. ఇంత జరుగుతుంటే అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారే గానీ ఆపేందుకు ప్రత్నించలేదు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. नासिक में कल शाम एक टोलबूथ पर हुआ हंगामा। टोल भरने को लेकर हुए विवाद पर 2 महिला आपस में भिड़ गई। @iamvinodjagdale #maharastra #WATCH pic.twitter.com/mAEHARg33l — News24 (@news24tvchannel) September 15, 2022 -
స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్‌జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
అరె ఏంట్రా ఇది! వచ్చాడు నీటిలో దూకాడు.. ‘ మాయం’ అయ్యాడు
ముంబై: మహారాష్ట్ర మాలేగావ్‌లో ఓ 23 ఏళ్ల యువకుడి బిత్తిరి చర్య వైరల్‌గా మారింది. భారీ వర్షాలతో గిర్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పదుల సంఖ్యలో జనం బ్రిడ్జిపై నిలుచుని వరద ప్రవాహాన్ని చూస్తున్నారు. అంతలోనే ఓ యువకుడు నదీ ప్రవాహంలోకి హీరోలా డైవ్ చేశాడు. ఒక్క క్షణం అక్కడున్నవారికి ఏం జరుగుతుందో అంతుబట్టలేదు. ప్రవాహం ధాటికి ఆ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. అతడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెండు రోజుల పాటు వెతికాయి. కానీ యువకుడి జాడ మాత్రం తెలియలేదు. దీంతో అతడు ప్రాణాలతోనే ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. मालेगाव, नाशिक : स्टंटबाजी करत तरुणाने गिरणा पुलावरुन नदीत मारली उडी; बेपत्ता तरुणाचा शोध सुरु...#Nashik #Malegaon #HeavyRain #Stunt #ViralVideo Video Credit: Abhijeet Sonawane pic.twitter.com/zB3HgUIQEW — Akshay Baisane (अक्षय बैसाणे) (@Baisaneakshay) July 14, 2022 అయితే ఆ యువకుడు బ్రిడ్జిపై నుంచి ఎందుకు నదిలోకి దూకాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. నదిలోని ఉన్నవారిని కాపాడేందుకు డైవ్ చేశాడా? అనుకుంటే.. అప్పుడు నీటిలో చిక్కుకుని ఎవరూ లేరు. గురువారం రాత్రి వరకు గాలించిన సహాయక సిబ్బంది.. యువకుడి ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. అతని పేరు నయూం ఆమిన్ అని వెల్లడించారు. మహారాష్ట్రలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ధాటికి పలువురు కొట్టుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పుణె, నాశిక్తో పాటు మరో మూడు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. చదవండి: ప్రాణాలు కాపాడుకునే యత్నం.. కాపాడమని కేకలు! నిస్సహాయంగా అంతా చూస్తుండగానే.. -
నాసిక్‌లో ముస్లిం మత గురువు దారుణ హత్య
ముంబై: ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. అఫ్గనిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ గత కొన్నేళ్లుగా నాశిక్‌లో నివసిస్తున్నారు. స్థానికంగా సూఫీ బాబాగా పేరొందారు. యోలా పట్టణంలోని ఎమ్ఐడీసీ ఓపెన్ ప్లాట్‌లో సూఫీ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్చి చంపారు. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిందితులు మత గురువు నుదుటిపై పిస్టోల్‌తో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాబాను హత్య చేసిన అనంతరం నిందితులు అతనికి చెందిన ఎస్యూవీ కార్లోనే పరారయ్యారు. విషయం తెలుసుకున్న యోలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆధ్యాత్మిక గురువు కారు డ్రైవర్‌నే ప్రధాని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాబా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ వ్యాఖ్యల ప్రకంపనలు.. ఆమె తల తెస్తే ఇల్లు రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్ -
ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబై: అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ నెల 5వ తేదీన నాసిక్‌లోని ముంగ్సారే గ్రామంలో నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‌చల్‌చేసింది. అర్దరాత్రి ఉంటి ముందు చిన్న గోడపై పెంపుడు కుక్క కూర్చొని ఉండగా.. దూరం నుంచి చిరుతపులి అటు వైపుగా వచ్చింది. చిరుతను గమనించిన శునకం అలెర్ట్ అయి పారిపోయేందుకు ప్రయత్నించింది. చిరుత దగ్గరకు రావడంతో గోడ వైపు నుంచి అటు ఇటు దూకుతూ చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసింది. #WATCH | Leopard entered a residential area in Mungsare village of Nashik, attacked a pet dog yesterday (Source: CCTV) pic.twitter.com/OznDoeQvHR — ANI (@ANI) June 6, 2022 అయితే చిరుతపులి పట్టు వదలకుండా కుక్క వెనకాలే పరుగెత్తింది. అలా కొద్దిసేపటి తరువాత చివరకు ఆ శునకం చిరుతకు ఆహారంగా దొరికిపోయింది. చిరుతపులి తన దవడలతో కుక్కను కరచుకొని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కాగా జనావాసాల్లో చిరుతపులి సంచారంపై నాసిక్ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి వస్తుండటంతో ముంగ్సారే గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రిపూట ఇళ్లలోనే నిద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరుత సంచరిస్తుందని తెలిసి పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారని మండిపడుతున్నారు. చదవండి: అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్.. Maharashtra | We appeal to the people of Mungsare village to remain indoors at night as leopard activity has increased in this area. People must remain alert: Pankaj Garg, Deputy Conservator of Forest, Nashik pic.twitter.com/2nPNepXCQi — ANI (@ANI) June 6, 2022 -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్‌కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్‌లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్‌లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్‌గా ఉంచేందుకు... హోమ్‌లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్‌తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్‌లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్‌లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్‌లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
లత చితాభస్మ నిమజ్జనం
నాసిక్: పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్‌కుండ్‌లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చితాభస్మాన్ని గురువారం నిమజ్జనం చేశారు. లత సోదరి ఉష, మేనల్లుడు అదినాథ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు నాసిక్ వాసులు కూడా లతకు నివాళి అర్పించేందుకు వచ్చారు. గాయని లతా మంగేష్కర్(92) ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై
చిన్న వయసులో బడిలో చదువుకునే అవకాశం రాలేదు ఆమెకు. అయితేనేం, సమాజాన్ని చిన్న వయసులోనే లోతుగా చదివే అవకాశం వచ్చింది. అదే తన ఫిల్మ్‌మేకింగ్‌కు ముడిసరుకు, సృజనాత్మకశక్తి అయింది... నాసిక్(మహారాష్ట్ర)కు చెందిన మాయ ముక్తైకి పదమూడు సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. చుట్టుపక్కల వాళ్లు చెత్త ఏరుకోవడానికి వెళుతుంటే వారితో పాటు వెళ్లేది. రోజంతా కష్టపడితే ఇరవై రూపాయలు వచ్చేవి. నాసిక్‌లో ‘కాగడ్ కచ్ పాత్ర కష్టకారి పంచాయత్’ అనే శ్రమజీవుల యూనియన్ ఉంది. ఎవరో చెప్పడంతో ఈ యూనియన్‌లో చేరింది మాయ. ఇదే తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఎన్నో విషయాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. సంతకం చేయడం నేర్చుకున్న రోజు ఎంత సంతోషపడిందో! చైనాలో జరిగే యూఎన్ క్లైమెట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ కోసం ‘కష్టకారి పంచాయత్’ యూనియన్ నుంచి చెత్త ఏరుకొని బతికే ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో మాయ కూడా ఒకరు. చైనాలో తనను కెమెరాలు, వీడియోగ్రఫీ తెగ ఆకట్టుకున్నాయి. చైనా నుంచి తిరిగివచ్చిన తరువాత, తనకు వీడియోమేకింగ్లో మెలకువలు నేర్పించాల్సిందిగా యూనియన్ వారిని అడిగింది. ‘అభివ్యక్తి’ అనే ఎన్జీవో సహాయంతో మాయకు వీడియోమేకింగ్ నేర్పించారు. ‘చెత్త ఏరుకునే వారికి కూడా మనసు ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. వారి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా వారిలో ఒకరిని కాబట్టి’ అంటూ తమ జీవితాలపై డాక్యుమెంటరీ తీయడానికి అడుగులు వేసింది. తనతో పాటు చెత్త ఏరుకునే మిత్రులు బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించారు. డాక్యుమెంటరీ కోసం ఒక డంప్‌యార్డ్ దగ్గర షూటింగ్ చేస్తుంది మాయ. ఇంతలో ఒక పోలీసు పరుగెత్తుకు వచ్చి ‘ఈ కెమెరా ఎక్కడి నుంచి దొంగిలించావు?’ అని కొట్టడం మొదలుపెట్టాడు. ‘అయ్యా! ఇది నా కెమెరానే’ అని ఆ పోలీసును నమ్మించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అష్టకష్టాలు పడి చేసిన ఆ డాక్యుమెంటరీకి మంచి పేరు వచ్చింది. ఎన్నో అవార్డ్లు వచ్చాయి. ‘మాకంటూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నా కెమెరా ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది నా చేతిలో ఉన్న ఆయుధం. పెద్దల్లో కదలిక తేవడానికి అయిదు నిమిషాల చిత్రం చాలు’ అంటున్న మాయ ఎన్నో సమస్యలు పరిష్కారం కావడానికి కారణం అయింది. నీటి ఎద్దడి తీర్చడం, గృహవసతి కల్పించడం...మొదలైనవి మాయ సాధించిన విజయాలలో ఉన్నాయి. ‘మన సమస్యల పరిష్కారానికి ఎవరో వస్తారని ఎదురుచూడకుండా మనమే కదలాలి. మనం శక్తిహీనులం కాదు. మనకు మనమే శక్తి’ అంటున్న మాయ, సామాజిక కార్యకర్త ఆనంద్‌తో కలిసి ‘పుకార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ను ప్రారంభించింది. దీని ద్వారా శ్రమజీవుల కష్టాలు, సమస్యలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటుంది. త్వరలో యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ‘తాను నేర్చుకున్న వీడియోమేకింగ్ను డబ్బు సంపాదన కోసం ఉపయోగించి ఉంటే బోలెడు డబ్బు సంపాదించి ఉండేది. అయితే ఆమె తనలాంటి పేదల సమస్యల గురించి తప్ప డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అని మాయ ముక్తైని ప్రశంసిస్తున్నారు ‘కష్టకారి పంచాయత్’ పెద్దలు. -
పండుటాకుల పాదయాత్ర
బూర్గంపాడు: శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఇద్దరు వృద్ధులు సాహసానికి పూనుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 80 ఏళ్ల పాండురంగ విఠల్ భగవత్, 82 ఏళ్ల కార్బరి దేవ్రామ్ డుమ్రి పాదయాత్ర చేస్తున్నారు. శనివారం వీరి పాదయాత్ర తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ గతంలో రెండుసార్లు నాసిక్ నుంచి రాజమండ్రి వరకు గోదావరి అవతలి గట్టున పాదయాత్ర చేశామని, ప్రస్తుతం నాసిక్ నుంచి నరసాపురం వరకు రైలులో వచ్చామని, అక్కడి నుంచి తిరిగి నాసిక్‌కు గోదావరి ఇవతలి గట్టున పాదయాత్ర చేస్తున్నామని వివరించారు. 15 రోజుల కిందట నరసాపురంలో పాదయాత్ర ప్రారంభించామన్నారు. గోదావరి నది పుట్టుక స్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు రెండుసార్లు పాదయాత్ర చేశామని చెప్పారు. ఇప్పుడు సముద్రంలో కలిసిన స్థానం నుంచి గోదావరి పుట్టుక స్థానం వరకు పాదయాత్ర చేపట్టామని వెల్లడించారు. -
గోదావరి నదీ తీరాన ఇల్లు.. నాడు ఆ వ్యక్తి చేసిన పనితో వినూత్నంగా
Nashik Trupti Gaikwad After Puja Turns Idols Into Toys: జైజై గణేశా! జై కొట్టు గణేశా!! వరములిచ్చు ఓ బొజ్జ గణేశా!!! అని పాటలు పాడుకుని ఆటలు ఆడుకుని వేడుక చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. వేడుక పూర్తయిన తర్వాత ఆ బొజ్జ గణపయ్యను ఏం చేయాలనేదే పెద్ద ప్రశ్న. ఓ దశాబ్దం కిందటి వరకు దగ్గరలో ఉన్న చెరువు, సముద్రం, సరస్సు, కొలను... ఏదో ఒకచోట నీటిలో కలిపేసే వాళ్లం. సింథటిక్ రంగులు, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని పట్ల చైతన్యవంతం అవుతున్న కొద్దీ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనేక దారులు వెతుక్కుంటున్నాం. అందుకోసం మేధోమధనమే చేస్తున్నాం. మట్టి గణపతిని బకెట్లో నీటిలో వేసి కరిగించి మొక్కలకు పోయడం నుంచి గణపతిని విత్తనాలతో మలిచి, పూజ పూర్తయిన తరవాత పంటమడిగా మార్చడం వరకు ఎన్ని కొత్త ఆలోచనలో. మహారాష్ట్ర, నాసిక్‌కు చెందిన అడ్వొకేట్ తృప్తి గైక్వాడ్ కూడా వినూత్నంగా ఆలోచించారు. ఆమె గణపతి బొమ్మలను రీసైకిల్ చేసి బొమ్మలుగా మారుస్తున్నారు. రెండేళ్ల కిందట మొదలైంది ‘మా ఇల్లు గోదావరి నది తీరాన ఉంది. ఓ రోజు ఓ వ్యక్తి నదికి ఓ భారీ లగేజ్‌తో వచ్చాడు. అందులో ఉన్న వస్తువులన్నింటినీ నదిలో కలిపేయాలనేది అతడి ప్రయత్నం. వీటిని జలమయం చేయవద్దు, రీసైకిల్ చేసి ఉపయోగించుకోదగిన వస్తువులుగా మార్చుకోవచ్చని చెప్పాను. అతడు అంగీకరించాడు. అలా మొదలైన నా ప్రయత్నంలో ఆ తర్వాత గణేశ విగ్రహాల రీసైక్లింగ్ కూడా చేరింది. విగ్రహాల తయారీలో ఉపయోగించిన మెటీరియల్ మొత్తాన్ని వేరు చేసి కొత్త బొమ్మలను చేస్తున్నాం. ఆ బొమ్మలను అల్పాదాయ వర్గాల కాలనీల పిల్లలకు పంచుతున్నాం. ఒక్కోసారి ఒక్కోచోటకు వెళ్లి ఇస్తుంటాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వాళ్లు పండుగ తర్వాత వాళ్లంతట వాళ్లే బొమ్మలను తెచ్చి ఇస్తున్నారు. పూనా, నాగపూర్, ముంబయి నుంచి కూడా మాకు గణేశ బొమ్మలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇరవై వేలకు పైగా విగ్రహాలను కరిగించి పిల్లలు ఆడుకునే బొమ్మలను చేశాం’’ అని చెప్తున్నారు తృప్తి గైక్వాడ్. చదవండి: Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
దిండుతో ఊరిరాడకుండా చేసి కొడుకును చంపిన తల్లి.. ఆపై
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకు చదువుకోవడం లేదని దిండుతో ఊరిరాడకుండా చేసి చంపేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాసిక్‌లోని సాయి సిద్ధి అపార్ట్‌మెంట్‌కు చెందిన శిఖా సాగర్ పాఠక్ అనే మహిళ తన కొడుకు రిధాన్ సాగర్ పాఠక్‌ను చదువుకోమని చాలా సార్లు హెచ్చరించింది. అయితే అతడు ఆమెను మాటలు పట్టికోకుండా ఆన్లైన్లో చూస్తూ గడిపేవాడు. దీంతో విసుగుచెంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు కొడుకు నోటికి దిండు అడ్డు పెట్టి పట్టుకుంది. దీంతో పిల్లవాడు ఊపిరాడక.. నోట్టో నుంచి రక్తం కక్కుని చనిపోయాడు. ఈ ఘటన తర్వాత శిఖా పాఠక్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె, మనవడు చాలా సేపటి నుంచి బయటకు రాకపోవడంతో తలుపును తట్టారు. ఎంతకూ తీయకపోవడంతో డోర్‌ను పగులగొట్టి చూశారు. ఇద్దరు చనిపోయి ఉండటం చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఇందిరానగర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మైంకర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సోహైల్ షేక్ అక్కడికి చేరుకున్నారు. మృతదేహం దగ్గర వారికి సూసైడ్ నోట్ దొరికింది. అందులో మా మరణాకి ఎవరూ బాధ్యులు కాదని రాసిపెట్టి ఉంది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను శక పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపంచారు. -
పలు కార్లను రీకాల్ చేయనున్న మహీంద్రా కంపెనీ..!
ముంబై: ప్రముఖ భారత కార్ల తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. నాసిక్ ఫెసిలీటీ సెంటర్లో తయారుచేసిన సుమారు ఆరు వందల డీజిల్ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఫెసిలిటీ సెంటర్ నుంచి వచ్చిన ఒక బ్యాచ్‌లో కలుషితమైన ఫ్లుయెడ్స్‌ను ఇంజిన్ భాగాల్లో వాడినట్లు తెలుస్తోంది. జూన్ 21 నుంచి జూలై 2, 2021 మధ్య తయారు చేసిన వాహనాలు ప్రభావితమైనట్లు గుర్తించారు. అయితే కంపెనీ రీకాల్ చేయదల్చుకున్న వాహనాల పేర్లను మహీంద్రా ప్రకటించలేదు. తాజాగా పలు వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా బీఎస్ఈలో ఫైలింగ్ చేసింది. మహీంద్రా తన బీఎస్ఈ ఫైలింగ్‌లో..జూన్ 21 నుంచి 2021 జూలై 2 మధ్య తయారు చేయబడిన ఆరు వందల కంటే తక్కువ వాహనాల పరిమిత బ్యాచ్‌ను రీకాల్ చేయనున్నట్లు ఫైల్ చేసింది. వాహనాల్లో నెలకొన్న లోపాలను తనిఖీ చేసి, సరిద్దిదుతామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా సంస్థ తన నాసిక్ ఫెసిలీటీ సెంటర్లో థార్, స్కార్పియో, బొలెరో, మరాజ్జో, ఎక్స్యువి 300 లను తయారు చేస్తుంది. -
రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్
సాక్షి, ముంబై: నాసిక్‌లోని ఇగాత్‌పురిలోని విల్లాల్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు జరిపారు. వీరిలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌తో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల మేరకు...నాసిక్‌లోని స్కై తాజ్, స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్ల్లాల్లో రేవ్ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రైడ్‌లో 22మందిని అరెస్ట్ చేశారు. అప్పటికే యువతీ యువకులంతా మద్యం మత్తులో, ఒళ్లు మరిచిన అసభ్యకరమైన స్థితిలో ఉన్నారు. వారిలో 10మంది పురుషులు కాగా, 12 మంది ఆడవాళ్లు ఉన్నారు. వారి నుంచి పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి పక్కనే పెద్దమొత్తంలో విదేశీ మద్యం సీసాలు, హుక్కాలు పడి ఉన్నాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ అరెస్టు చేశారు. అయితే ఓ మహిళ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నలుగురు యువతులు దక్షిణాది పరిశ్రమతో సంబంధం ఉన్నవారిగా గుర్తించారు. వీరిలో మోడల్స్, నటులు సహా కొరియోగ్రాఫర్లుగా అని సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రేవ్ పార్టీకి వచ్చిన వాళ్లలో చాలామంది ఖరీదైన కార్లలో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. చదవండి : హీరో కార్తి కోసం ఆ పాత్ర చేయడానికి సిద్ధమైన సిమ్రాన్ 7 డేస్ 6 నైట్స్... షూటింగ్ మొదలైంది -
ఆ నిర్ణయమే సవితని విజేతగా నిలబెట్టింది
ఆది లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యా లక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి... మనకు తెలిసిన అష్ట లక్ష్ములు. వీరి జాబితాలో చేర్చాల్సిన మరో లక్ష్మి కథ ఇది. ఆ లక్ష్మి పేరు శ్రమలక్ష్మి. ఆమె నలభై ఏళ్ల గృహిణి. పేరు సవిత లబాడే. ఊరు నాసిక్. చదివింది ఎనిమిదో తరగతి. ఇద్దరు పిల్లలు. భర్త ఆత్మారామ్ చిన్న రైతు. వాళ్లకున్నది రెండున్నర ఎకరాల పొలం. వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యత మొత్తం భర్త స్వయంగా చూసుకునేవాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం తప్ప మరేమీ తెలియని ఇల్లాలామె. విధి వక్రించింది. భర్త గుండెపోటుతో మరణించాడు. అతడు చేసిన అప్పులన్నీ అతడు పోయిన తర్వాత బయటపడ్డాయి. భర్త పోయిన నెల రోజులకే కో ఆపరేటివ్ బ్యాంకుల వాళ్లు తలుపుకొట్టారు. అయోమయం నుంచి తేరుకునే లోపే ఇంటి గోడకు నోటీస్ అంటించారు. ఆ తర్వాత ఏడాది లోపు ఒక్కటొక్కటిగా అప్పుల లెక్కలన్నీ వరుస కట్టాయి. అంతా చూస్తే ఏడు లక్షల రూపాయలు. అప్పుకు వడ్డీ రోజురోజుకూ పెరిగిపోతోంది. భర్త పోయిన దుఃఖం ఒక కంట్లో నీరై కారుతోంది. అతడు చేసిన అప్పులు కన్నీళ్లుగా మరో కంట్లో ఉబికి వస్తున్నాయి. ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను నేడు విజేతగా నిలబెట్టింది. బలి తీసుకున్న ద్రాక్ష తీగ సవిత భర్త పొలంలో ద్రాక్షతోటను పెంచేవాడు. ద్రాక్ష సాగు ఎలాగో ఆమెకు ఏ మాత్రం తెలియదు. పైగా భర్తను బలి తీసుకున్న ద్రాక్ష తీగను జీవితంలో తాక కూడదనుకుంది. దాంతో పొలంలో కూరగాయల సాగు చేయడానికి సిద్ధమైంది. అది మంచి లాభాల్నే ఇచ్చింది. నెలకు పదివేలు... ఇద్దరు పిల్లలతో బతకడానికైతే సరిపోతాయి. అయితే అప్పులు తీర్చేదెలా? ఇంకా ఏదో చేయాలి. అప్పుల నుంచి బయటపడితే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకుంది. తాను ఇష్టంగా ధరించే బంగారు దండను అమ్మేసి పెద్ద అప్పులు తీర్చింది. కూరగాయలతోపాటు సోయాబీన్, గోధుమ పంటలు వేసి బతుకు బండిని లాగుతోంది. ఒక స్నేహితురాలి సలహాతో సవిత మసాలా దినుసుల తయారీకి సిద్ధమైంది. మెషీన్ కొనాలంటే డబ్బు కావాలి. పొలం మీద వచ్చిన డబ్బు కొంత చేతిలో ఉంది. మిగిలిన బంగారం కూడా అమ్మేసి 65 వేలకు మెషీన్ కొన్నది. నిజానికి అది ఒక సాహసమే. అయితే ఆ ప్రయత్నం ఆమెను పరీక్ష పెట్టలేదు. మసాలా పొడుల తయారీ విజయవంతంగా నడిచింది. ఆమె కుటీర పరిశ్రమ 2015 నాటికి నెలకు అరవై వేల సంపాదనకు చేరింది. ఈ లోపు పొలంలో మరో ప్రయోగం... చెరకు పంటకు పని తక్కువ, ఏడాది కి రెండుసార్లు పంట వస్తుంది. కష్టాల కడలిని ఈదుతున్న సవితను చెరకు పంట కూడా అర్థం చేసుకున్నట్లుంది. ఒక సీజన్‌కి యాభై వేల రాబడి తో తీపిని పంచింది. మసాలా పరిశ్రమ పని ఫిబ్రవరి నుంచి జూలై వరకే ఉంటుంది. పొలం మీద రాబడి కూడా సీజన్లోనే వస్తుంది. అలా కాకుండా ప్రతి నెలా డబ్బు కనిపిస్తే తప్ప జీవితం గాడిన పడదనుకుందామె. దాంతో జనరల్ స్టోర్ ప్రారంభించింది. ఇప్పుడు సవిత పంట మీద, మసాలా పొడుల పరిశ్రమ, జనరల్ స్టోర్ అన్నింటి మీద సరాసరిన నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని చూస్తోంది. ఉదయం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పడుతున్న శ్రమకు దక్కుతున్న ప్రతిఫలం అది. ఆమె కొడుకు ఎలక్ట్రానిక్స్‌లో కోర్సు చేస్తున్నాడు. కూతురు పోలీస్ సర్వీస్‌లో చేరడానికి శిక్షణ తీసుకుంటోంది. స్వశక్తితో జీవించాలి ‘‘మసాలా పొడి మెషీన్ నడిపేటప్పుడు కళ్లలో పడుతుంది, ఒంటి మీద పడి చర్మం మండుతుంది. ఆ మంటలకు భయపడి మెషీన్‌ని అమ్మేద్దాం అని కూడా అనిపించింది. నేను ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే ఇవి పెద్దవి కాదని మనసు గట్టి చేసుకున్నాను. జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఆడవాళ్లు సున్నితంగా, శ్రమ లేకుండా హాయిగా జీవించేయాలనుకోకూడదు. స్వశక్తితో జీవించాలి. కష్టాలెదురైనప్పుడు నిశ్శబ్దంగా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని కలిగి ఉండాలి’’ అంటోంది సవిత. -
వెక్కిరించిన వారే గెలిపించారు
ఆమెను చూసి నేషనల్ మీడియా కూడా మెచ్చుకుంటోంది. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు... ఊరినెలా చూసుకుంటావు’ అన్నారు ఆమె మొదటిసారి సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు ఊరి వాళ్లు. అయినా ప్రజా సేవకు తన శారీరక పరిమితులు అడ్డం కావు అనుకుంది నాసిక్‌కు చెందిన కవితా భోండ్వే. ఆమె పని చేయడం మొదలెట్టింది. మార్పును చూపించింది. వెక్కిరించిన నోళ్లు మెచ్చుకోళ్లు మెదలెట్టాయి. అంతేనా? రెండోసారి ఆమెను సర్పంచ్‌గా గెలిపించాయి. గత తొమ్మిదేళ్లుగా సర్పంచ్‌గా ఉన్న కవితా భోండ్వే స్ఫూర్తిగాధ ఇది. తండ్రి 15 ఏళ్ల పాటు పంచాయతీ మెంబర్‌గా ఉన్నాడు. ఉన్నాడు కాని మెల్లమెల్లగా తనకు చదువు రాకపోవడం పంచాయతీ వ్యవహారాల్లో అవరోధంగా మారుతోందని గ్రహించాడు. 2011 సంవత్సరం అది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దిందోరి తాలుకాలో రెండు గ్రామాలకు (దెహెగావ్, వాల్గాగ్) సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. తన కుమార్తె చదువుకుంది. ఆమెను సర్పంచ్‌గా నిలబెడితే? అనుకున్నాడు. కాని ఆ అమ్మాయికి కుడి కాలికి పోలియో ఉంది. ‘ఏమ్మా పోటీ చేస్తావా?’ అని అడిగాడు ఆ తండ్రి పుండలిక్ భోండ్వే. ‘పోటీ చేస్తాను నాన్నా’ అంది కూతురు కవితా భోండ్వే. ఆ సమయానికి కవిత వయసు 25. అంత చిన్న వయసులో ఆ ప్రాంతంలో ఎవరూ సర్పంచ్ కాలేదు. అందునా స్త్రీ కాలేదు. పైగా శారీరక పరిమితులు ఉన్నవారు అసలే కాలేదు. రెండు ఊళ్లలోనూ ఈ విషయం పెద్ద వేళాకోళంగా మారింది. మగవారు దీనిని సహించలేకపోయారు. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు. ఊళ్లను ఏం చూస్తావు?’ అని ప్రశ్నించారు. కవిత గంభీరంగా ఆ హేళనను భరించింది. తన ప్రచారం కొనసాగించింది. మెల్లమెల్లగా చాలామంది స్త్రీలు ఆమె పట్టుదలను గమనించారు. ఊరి మగవారు కూడా కొందరు మద్దతుగా నిలిచారు. సర్పంచ్‌గా ఆమె గెలిచింది. ‘వెక్కిరింతలను ఏమాత్రం మనసులోకి తీసుకోకపోవడం వల్లే నేను ముందుకు వెళ్లగలిగాను’ అని కవిత అంటోంది. కవిత పదవిలోకి వచ్చే సరికి ఊళ్లో ఆకతాయిల ఆట సాగుతోంది. కొన్ని సంఘ వ్యతిరేకమైన పనులు సాగుతున్నాయి. వాటిని మొదట నిలువరించింది ఆమె. ఆ తర్వాత రెండు ఊళ్లలోనూ బాలికల చదువు గురించి, రోడ్ల గురించి, మరుగుదొడ్ల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరయ్యే ఇళ్ల గురించి పని చేసింది. అవినీతి ఊసు లేకుండా సర్పంచ్ అనే దాష్టీకం లేకుండా హుందాగా పని చేస్తున్న కవితా అతి త్వరగా జనానికి దగ్గరయ్యింది. ‘చిన్న వయసులో సర్పంచ్ అయ్యానని అక్కసు పడ్డవాళ్లు కూడా మెల్లగా నన్ను గుర్తించడం మొదలెట్టారు’ అని కవితా అంది. పదవిలో ఉన్న ఐదేళ్లు కవితకు ఒకటే పని. ఉదయాన్నే సోదరుడు ఆమెను బైక్ మీద దింపితే పంచాయతీ ఆఫీస్‌కు వస్తుంది. పనులు చూసుకుంటుంది. వచ్చినవారి ఇబ్బందులు వింటుంది. జరిగే పనుల అజమాయిషీకి బయలుదేరుతుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లు జరగలేదు. ఎందుకంటే కవితనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 34 ఏళ్ల కవిత 9 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నడక మెల్లగా ఉండవచ్చు. కాని ఆమె సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితీ అత్యంత వేగవంతమైనవి. తన రెండు ఊళ్లలో ఆమె స్వయం ఉపాధి గ్రూపులను స్థాపించి స్త్రీల స్వావలంబన కోసం ప్రయత్నిస్తోంది. కవితకు చెట్లు నాటించడం ఇష్టం. గ్రామాల్లో పచ్చదనం కోసం కృషి చేస్తోంది. బహుశా మరికొన్నేళ్లు ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ రావొచ్చు. ఎందుకంటే ఆ పాలనలో నీడ ప్రజలకు అంత చల్లగా ఉంది. -
వలస కూలీలతో ఆ హైవే జామ్..
ముంబై : పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వచ్చిన కార్మికులకు కరోనా మహమ్మారి రూపంలో పెను విపత్తు ఎదురైంది. లాక్‌డౌన్‌తో పనులు లేక అటు పల్లెకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక వలస కూలీలు కాలినడకనే మైళ్లకు మైళ్లు నడిచి ఊళ్లు చేరేందుకు ఉద్యుక్తులయ్యారు. కనిపించిన వాహనంలో ఇంటిబాట పడుతుండగా, వాహన డ్రైవర్లు ఇదే అదునుగా అందినకాడికి దండుకుంటున్నారు. ముంబై-నాసిక్ హైవే వలస కూలీల బాధలకు అడ్డాగా మారింది. సాధారణ రోజుల కంటే అధికంగా వాహనాలు ఈ హైవేపై బారులుతీరాయి. భౌతిక దూరం నిబంధనలను పాటించడం అటుంచి ఇల్లు చేరాలనే తపనే వారిలో కనిపిస్తుండగా ఇదే అదనుగా సొమ్ము చేసుకోవాలని ట్రక్కులు, ఆటోరిక్షాలు ఇతర వాహనాల డ్రైవర్లు పాకులాడుతున్నారు. ముంబైలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే శత్రుఘ్న చౌహాన్ అనే కార్మికుడి కష్టాలు అక్కడి పరిస్థితికి అద్దం పడతాయి. కరోనా లాక్‌డౌన్‌తో ముంబైలో వ్యాపారాలన్నీ నిలిచిపోవడంతో పని కోల్పోయిన తాను యూపీలోని గోండా ప్రాంతానికి కుటుంబంతో సహా కలిసి వెళుతున్నామని చెప్పుకొచ్చాడు. రైలు కోసం ఆన్లైన్ దరఖాస్తు నింపినా ఫలితం లేదని, దీంతో చిన్న పిల్లలను తీసుకుని రెండు బైక్‌లపై బయలుదేరామని , ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుడే తమను గమ్యం చేర్చాలని చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. విదేశాల్లో చిక్కుకున్న ప్రయాణీకులను రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతుండగా దేశంలో వలస కూలీలను వారి స్వస్ధలాలలకు చేర్చడాన్ని మాత్రం గాలికొదిలేసిందని వారంతా వాపోయారు. చదవండి : ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా.. ఇక మనర్‌లో ఫ్యాక్టరీలో పనిచేసే రమేష్ కుమార్ వసోయి వెళ్లందుకు కాళ్లనే నమ్ముకున్నాడు. ఫ్యాక్టరీలో ఎలాంటి వారు వస్తారో తెలియదని, వారి వల్ల తనకూ వైరస్ సోకుతుందనే భయంతో తల్లితండ్రులు గ్రామానికి రావాలని కోరారని రమేష్ తెలిపాడు. తమ గ్రామానికి చెందిన నలుగురం ఊరి బాట పట్టామని, ఇప్పటికే 220 కిమీ నడిచామని చెప్పుకొచ్చాడు. యూపీలోని గోరఖ్‌పూర్‌కు వెళ్లే వాహనంలో లిఫ్ట్ కోసం వారు పడిగాపులు కాస్తున్నారు. ఇంతదూరం నడవడంతో తన కాళ్లు బొబ్బలెక్కాయని ఇక నడవడం తన వల్ల కాదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. వాహనంలో వెళదామన్నా రూ వేలు అడుగుతున్నారని, కాలి గాయానికి మందులకే తన వద్ద డబ్బు లేదని చెప్పుకొచ్చాడు. మహానగరాల్లో వలస కూలీలందరిది ఇదే పరిస్థితి కాగా మరికొందరు డబ్బులేక వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన సాగుతూ మధ్యలోనే పలువురు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక పగటి పూట భానుడి ప్రతాపం తాళలేక రాత్రివేళ స్వస్ధలాలకు పయనమవుతూ మార్గమధ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కొత్తజంటకు పోలీసుల రిసెప్షన్!
ముంబై: లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ తమ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఓ జంటకు నాసిక్ పోలీసులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. బాల్కనీలో నూతన వధూవరులు నిలబడి ఉండగా.. చప్పట్లతో వారిని అభినందిస్తూ.. బాలీవుడ్ పాటలు ప్లే చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎంఓ మహారాష్ట్ర ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేయగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. కాగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది నిరాడంబరంగా పెళ్లి తంతు పూర్తి చేసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల పోలీసులే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. పుణెలోని ఓ అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ దంపతులు.. వధువు తల్లిదండ్రులుగా వ్యవహరించి కన్యాదానం చేసిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రలో ఇప్పటి వరకు దాదాపు 13 వేల మంది కరోనా బారిన పడగా.. 548 కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 వేలు దాటగా... 1300 మంది మరణించారు.(లాక్డౌన్ : పోలీసులే కన్యాదానం చేశారు..) -
నోట్లతో ముక్కు తుడుచుకున్న వ్యక్తి అరెస్టు
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసి ప్రజలను అప్రతమత్తం చేస్తుంటే.. కొందరు ఆకతాయిలు పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మరికొందరు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో... ఓ వ్యక్తి ఏకంగా కరెన్సీ నోట్లతో ముక్కు చీదుకుంటూ వీడియో తీసుకున్నాడు. దానిని టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.(కరోనా పాజిటివ్.. 10 లక్షల డాలర్ల విరాళం!) వివరాలు.... నాసిక్‌కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు(38) ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం దేశంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన మాలేగావ్ పోలీసులు గురువారం సయ్యద్ బాబును అరెస్టు చేశారు. ఏప్రిల్ 7దాకా అతడిని కస్టడీలో ఉంచేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే తబ్లిగీ జమాత్ ప్రకంపనలతో ఓ వర్గంపై సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి తరుణంలో సయ్యద్ ఇలాంటి వీడియో రూపొందించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించవద్దంటూ హితవు పలుకుతున్నారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటి వరకు 423 కరోనా కేసులు నమోదు కాగా... 19 మంది కోవిడ్-19 బారిన పడి మరణించారు. (ప్రణాళిక లేకుండా లాక్డౌన్: మొయిలీ) -
ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం
నాసిక్ : మహారాష్ట్రలోని నాసిక్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆటో, బస్సు ఒకదానినొకటి ఢీకొని అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మందుగా ఆటో దాని మీద నుంచి బస్సు పడడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు నలిగిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక చాలా మంది చనిపోయారు. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బావి లోతు 70 అడుగులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
బావిలో పడ్డ బస్సు.. 7 గురు మృతి
-
మహరాష్ట్ర నాసిక్‌లో వరదలు
-
ప్రమాదకర స్థాయిలో గోదావరి..
మంబై : మహారాష్ట్రలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నాశిక్‌లో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి భారీగా వరద పోటెత్తింది. అంతేకాకుండా సోమవారం మహారాష్ట్ర జలవనరుల శాఖ గంగాపూర్ డ్యామ్ నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలింది. దీంతో నాశిక్ వద్ద గోదావరి ఉధృతి ప్రమాదకరస్థాయికి చేరింది. గంగాపూర్ నుంచి గోదావరిలోకి నీరు వదిలే సమయంలో నది ఒడ్డుకు సమీపంలోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, జూలై ప్రారంభం నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఇప్పటివరకు దాదాపు 1200 మి.మీ వర్షపాతం నమోదైంది. -
గోదావరి నది ఉగ్రరూపం
-
కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..
నాసిక్ : పిల్లల చిలిపి పనులు చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం కూతురి చిలిపి చేష్టలకు చిరాకు పడింది. అతిగా అల్లరి చేస్తోందని ఆగ్రహం చెందింది. నిన్ను భరించటం నా వల్ల కాదంటూ కన్నకూతురినే గొంతు కోసి చంపేసింది. ఈ అమానుష ఘటన నాసిక్‌లో చోటు చేసుకుంది. నాసిక్‌లో నివసిస్తున్న యోగిత ముఖేష్ పవార్ కూతురి చేష్టలకు విసుగు చెంది తనను దారుణంగా చంపేసింది. కాగా తాను చెత్త పడేసి ఇంట్లోకి వస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బుకాయించింది. అయితే ఘటనాస్థలంలో యోగితకు దుండగుడికి మధ్య ఘర్షణ జరిగిన దాఖలాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో ఇంటిని మొత్తం తనిఖీ చేయగా పదునైన బ్లేడును కనుగొన్నారు. దానిపై ఉన్న రక్తం యోగిత రక్తంతో సరిపోగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా తానే కూతురిని చంపినట్టుగా యోగిత నేరాన్ని అంగీకరించింది. పోలీసులు బుధవారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘నినాదాలు చేయడం కాదు.. సైన్యంలో చేరి పోరాడండి’
ముంబై: ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఎంఐ-17 విమానం కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వాయుసేన అధికారి నినాద్ ముందావ్‌గనే కూడా మృతిచెందారు. శుక్రవారం రోజున ఆయన మృతదేహానికి ప్రభుత్వ లాంఛానలతో నాసిక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నినాద్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో భారత్ మాతా కీ జై, వందేమాతరమ్, వీర జవాన్ అమర్ హై అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలపై నినాద్ భార్య విజేత ముందావ్‌గనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారికి కూడా ఆమె ఓ సూచన చేశారు. సోషల్ మీడియాలో జై భారత్, వందేమాతరమ్ వంటి నినాదాలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దేశభక్తి ఉండి.. దేశం ప్రజల కోసం ఎదైనా చేయాలని భావిస్తే త్రివిధ దళాలలో చేరాలని.. లేకపోతే మీ కుటుంబంలో ఎవరినో ఒకరినైనా చేర్చాలని అన్నారు. అది కూడా కుదరని పక్షంలో సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని.. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆమె సందేశం విస్తృతంగా ప్రచారంలో ఉంది. -
కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోన్న ఉల్లి..?
ముంబై : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతోన్న జనాల నడ్డి విరచడానికి ఉల్లిపాయ కూడా సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఉల్లి ధర భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కిలో 10 రూపాయలకు లభ్యమవుతోన్న ఉల్లిపాయలు, మరో వారం రోజుల్లోనే దాదాపు 50 రూపాయలకు చేరనున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఏపీఎమ్‌సీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) అధ్యక్షుడు వశి మాట్లాడుతూ.. ‘ఇన్ని రోజులు మార్కెట్‌కి ప్రతి రోజు దాదాపు 125 - 150 టన్నుల ఉల్లి వచ్చేది. ఇది కూడా ఎక్కువగా నాసిక్, పూణె ప్రాంతాల నుంచి వస్తుండేది. కానీ కొన్ని రోజులుగా ఉల్లి దిగుమతి భారీగా తగ్గింది. ప్రసుతం రోజుకు కేవలం 50 టన్నుల ఉల్లి మాత్రమే మార్కెట్‌కి వస్తుంది. కొత్త గడ్డ రావడానికి ఇంకా సమయం పడుతుంది. అందవల్ల మరో వారం రోజుల్లోపే ఉల్లి ధర కిలో 50కి చేరవచ్చు’ అని తెలిపారు. ప్రస్తుతం నాసిక్‌లో తీవ్ర కరువు పరిస్థితులు ఇందుకు కారణమని వశి వెల్లడించారు. ప్రస్తుతం నాసిక్‌లో తాగడానికే నీరు దొరకడం లేదు. పంటల సాగు తగ్గిపోయింది. దాంతో ఈ ఏడాది ఉల్లి సాగు కూడా బాగా పడిపోయింది. అందువల్లే ఈ అధిక రేటు అని వశి తెలిపారు. -
నాసిక్ వద్ద కుప్పకూలిన సుఖోయ్ యుద్ధవిమానం
-
మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారట!
ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారని వివాదస్పద హిందుత్వ నేత శాంబాజీ బిదే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంబాజీ మాట్లాడుతూ.. మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారన్నారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లితో మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలో ఈ రకమైన మామిడి చెట్లను పెంచాను. ఇప్పటి వరకు నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. శాంబాజీ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. శాంబాజీ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, అతని వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్ డిమాండ్ చేశారు. మాజీ ఆరెస్సెస్ కార్యకర్త అయిన శాంబాజీ బిదే జనవరిలో బీమా-కొరిగన్ కులాల మధ్య చేలరిగిన హింసలో నిందితుడు. -
ఐటీ దాడులు : దిగొచ్చిన ఉల్లి ధరలు
సాక్షి, నాసిక్: ఉల్లి ధరలు భారీగా కిందకి దిగొచ్చాయి. లాసల్గావ్ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) వద్దనున్న దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు సుమారు 35 శాతం వరకు తగ్గాయి. ఈ మేర ధరలు తగ్గడానికి ప్రధాన కారణం నాసిక్‌లో ఉల్లి ట్రేడర్లకు సంబంధించిన ఏడుగురిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వర్తించడమే. ఏడుగురు అగ్ర ఉల్లి ట్రేడర్లకు సంబంధించి లాసల్గావ్, నాసిక్ జిల్లాల సమీప ప్రాంతాల్లో 25 ప్రదేశాల్లో ఐటీ దాడులు నిర్వర్తించింది. నాసిక్ యూనిట్ డిపార్ట్మెంట్కు చెందిన 120 మంది అధికారులు ఈ సెర్చ్, సర్వే ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు ఓ సీనియర్ ఐటీ అధికారి చెప్పారు. లాసల్గావ్ ఉల్లి ట్రేడర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తాము సేకరించినట్టు చెప్పారు. భవిష్యత్తులో ధరలను పెంచడానికి ఉత్పత్తిని మార్కెట్లకు రానియకుండా ఆపుతున్నారు. వాటిని అక్రమంగా నిల్వ ఉంచుతున్నట్టు తెలిపారు. ధరలు పడిపోయినప్పటి నుంచి వ్యవసాయదారుల నుంచి ఉల్లిని ట్రేడర్లు కొని, తర్వాత వాటిని ఎక్కువ ధరలకు మార్కెట్లో అమ్ముతున్నట్టు అధికారి పేర్కొన్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని కూడా అధికారులు చెప్పారు. -
ఐటీ దెబ్బ-ఉల్లి అబ్బా..!
సాక్షి, నాసిక్ : ఇన్కమ్ టాక్స్ అంటే నల్లకుబేరులు, అక్రమార్కులేకాదు.. ఉల్లి వ్యాపారుల కూడా భయం పట్టుకుంది. ఐటీ దాడులు జరుగుతున్నాయనే సరికి.. ఉల్లి వ్యాపారులు ధరలను అమాంతం నేలకు దించేశారు. ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఉల్లిని అమ్మడం మొదలు పెట్టారు.. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా?? ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకేం చదవండి. మహరాష్ట్రలోని అతి పెద్ద ఉల్లి హోల్‌సేల్ వ్యాపారాన్ని నాసిక్‌లో నిర్వహిస్తారు. ఇక్కడున్న లాసల్గాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) ఉల్లిని టోకుగా చిరువ్యాపారులుకు అమ్ముతుంది. ఈ మార్కెట్ కమిటీపై ఎవరూ ఊహించని విధంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏపీఎంసీ కార్యాలయాలు, గోడౌన్లు, నాసిక్‌లోని అతిపెద్ద ఉల్లి వ్యాపారస్తులైన ఏడుమంది ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో నాసిక్‌లో ఒక్కసారిగా ఉల్లిధరలు 35 శాతం తగ్గిపోయాయి. ఐటీ దాడులు జరపడానికి మునుపు క్వింటాల్ ఉల్లి రూ.1400 ధర పలికేది. దాడులు తరువాత క్వింటాల్ రూ.900కు దిగింది. ఈ విషయంపై ఏపీఎంసీ ఛైర్మన్ జయదత్తా హోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల వల్ల టోకు ధరలు పతనమయ్యాయని చెప్పారు. మార్కెట్‌కు వచ్చే ఉల్లిని రోజువారీ ధరల ప్రకారమే అమ్మడం.. కొనడం చేస్తున్నామని చెప్పారు. ఐటీ దాడుల అనంతరం రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పారు. ఐటీ దాడుల వల్ల ఒక్కసారిగా ఉల్లిపాయల ధర నేలకు దిగిరావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండుమూడు నెలలుగా ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని.. వీటిని ఇలా అయినా నిరోధించడం మంచి పరిణామం అని కొనుగోలుదారులు అంటున్నారు. -
ఇలాంటోడు ఊరికి ఒక్కడుంటే చాలు!
నాసిక్: గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కట్టించాకే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడా గ్రామ సేవకుడు. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరడంతో శుక్రవారం నాడు తన సొంత గ్రామం లాతూర్ జిల్లాలోని సంగం గ్రామంలో పెళ్లి పీటలెక్కాడు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో హేవరి గ్రామానికి గ్రామ సేవకుడిగా పనిచేస్తున్న కిశోర్ విభూతే. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన కిశోర్ గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదని భావించాడు. 2014 నాటికి గ్రామంలో ఉన్న 351 ఇళ్లకుగానూ 174 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. మిగతా 177 ఇళ్లలో కూడా మరుగుదొడ్లు నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని నాసిక్‌లో జరిగిన ఓ సమావేశంలో శపథం చేశాడు. మరుగుదొడ్ల నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయినా నాసిక్ జిల్లా యంత్రాంగం గురువారం తనిఖీ చేసి అధికారికంగా గుర్తింపు ఇవ్వడంతో కిశోర్ లక్ష్యం పూర్తయ్యింది. -
అశ్లీల నృత్యాలు... పోలీసుల దాడి
నాసిక్: విలాసవంతమైన భవనంలో గుట్టుగా సాగుతున్న రేవ్ పార్టీని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు రట్టు చేశారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న పలువురిని నాసిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంబంధీకులు ఉన్నట్టు సమాచారం. లగత్ పురి ప్రాంతంలో మిస్టిక్ విల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధనగ్నంగా డాన్సులు చేస్తున్న యువతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనా స్థలం నుంచి మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు సేవించారన్న అనుమానంతో నిందితుల రక్త నమూనాలను సేకరించారు. భవనం ముందు పసుపురంగు లైటు కలిగిన పార్క్ చేసివుందని మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. నిర్వాహకులు ఆన్ లైన్ ద్వారా సంప్రదించి యువతులను పార్టీకి రప్పించినట్టు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
భారీమొత్తంలో పాత, కొత్త నోట్లు తరలిస్తూ....
నాసిక్ : పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కులు భారీ మొత్తంలో నగదును తరలిస్తూ ఒక్కొక్కరు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. నాసిక్-ఔరంగబాద్‌లో రెండు వేరువేరు కారుల్లో రూ.14 లక్షల లెక్కల్లో చూపని నగదు శుక్రవారం పట్టుబట్టింది. ఈ నగదును నాసిక్ పోలీసులు సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర పట్టుబడ్డ ఈ నగదులో ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో పాటు కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2000 నోట్లూ ఉండటం గమనార్హం. తరుచు తనిఖీలు మాదిరిగానే శుక్రవారం కూడా వాహనాలను చెక్ చేస్తున్నప్పుడు రూ.14,65,760 నగదు పట్టుబడినట్టు నిఫాడ్ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ రంజిత్ దేరె చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ కారులో కొత్త రూ.2000 నోట్లు 462 ఉన్నాయని, వాటిని డ్రైవర్ సీటు కింద దాచిపెట్టినట్టు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు 9.24 లక్షలని వెల్లడించారు. ఔరంగాబాద్‌కు చెందిన డ్రైవర్ ఇజాజ్ అలీల్ ఖాన్ వీటిని తరలిస్తున్నాడని, నగదు గురించి అతని అడుగగా.. సరియైన సమాధానాన్ని ఇవ్వలేదని దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అదేవిధంగా మరో కారులో 20 బండల్స్ ప్రభుత్వం రద్దుచేసిన పెద్దనోట్లు రూ.500, రూ.1000 నోట్లు సీజ్ చేశామని, వాటి విలువ రూ.5.5 లక్షలుంటాయని పేర్కొన్నారు. ఈ నగదుతో పాటు కారు డ్రైవర్ అబ్దుల్ మజీద్ ఖాజీని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని, ఇంతకముందు కూడా నాసిక్-ఔరంగాబాద్ రోడ్లో రూ.73 లక్షల ప్రభుత్వం రద్దు చేసిన నోట్లు పట్టుబడ్డట్టు తెలిపారు. -
రెండురోజులు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను, మెసేజ్ సర్వీసులను రద్దు చేశారు. వదంతులను నివారించి, శాంతిభద్రతలను కాపాడటం కోసం పోలీసులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గత శనివారం నాసిక్ జిల్లా తాలెగావ్ అనే గ్రామంలో 16 ఏళ్ల మైనర్ బాలుడు ఐదేళ్ల బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత నాసిక్ జిల్లాలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో సోమవారం నుంచి రెండు రోజులు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయాలని నాసిక్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ నెట్ వర్క్ ఆపరేటర్లను ఆదేశించారు. -
తృప్తి దేశాయ్ పై దాడి
పుణె: భూమాతా బ్రిగేడియర్ చీఫ్ తృప్తి దేశాయ్, ఆమె అనుచరులపై దాడి జరిగింది. ఇందులో ఒకరి తలకు తీవ్రంగా గాయమైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై కొందరు ఆందోళనకారులు నాశిక్ వద్ద నిన్న అర్ధరాత్రి దాడి చేశారు. తనను చంపడానికే దాడి జరిగిందని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన నాశిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాశిక్ లోని కపిలేశ్వర్ మందిర్ లోని గర్భ గృహలో పూజలు చేయడానికి ఆమె అనుచరులతో కలిసి నిన్నరాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లారు. తృప్తి రాకను వ్యతిరేకిస్తూ అక్కడ గుమిగూడిన జనం నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమె తన కారులో వేరే మార్గం ద్వారా తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై దాడి చేశారు. -
'భక్తులపై దాదాగిరి చెల్లదు'
నాసిక్: భక్తులపై దాదాగిరి చేయడాన్ని ఒప్పుకోబోమని ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ అన్నారు. నాసిక్ లోని కపలేశ్వర్ ఆలయంలో పూజలు చేసేందుకు తమను అనుమతించలేదని ఆమె తెలిపారు. పలువురు మహిళలతో కలిసి ఆలయ గర్భగుడిలోకివెళ్లేందుకు రెండోసారి ప్రయత్నించిన ఆమెను పూజారులు అడ్డుకున్నారు. భక్తుల పట్ల కులవివక్ష చూపుతున్నారని తృప్తి దేశాయ్ ఆరోపించారు. గతంలో ఆలయప్రవేశానికి ప్రయత్నించినప్పుడు తాము నిమ్న కులాలకు చెందిన వారిమని చెప్పగా, పూజారులు తమను బయటకు గెంటేశారని వెల్లడించారు. ఆలయ ధర్మకర్తలు తమను గర్భగుడిలోకి అనుమతించాలని చెప్పినప్పటికీ పూజారులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. -
స్నేహితుణ్ని కాపాడబోయి..
తానూ ప్రాణాలొదిలాడు సెల్ఫీ తీసుకుంటూ డ్యామ్‌లోకి పడిపోయిన విద్యార్థులు నాసిక్: సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి నీటిలోకి జారి పడిపోయాడు. వెంటనే అతని స్నేహితుడు సాహసోపేతంగా డ్యామ్‌లోకి దూకి మునిగిపోతున్న విద్యార్థిని కాపాడబోయి తానూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా ఉన్నాయి.. పది మంది కాలేజీ విద్యార్థులు విహార యాత్రల కోసం మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఘోటి సమీపంలో గల డ్యామ్ వద్దకు శనివారం వెళ్లారని వాదివ్హేర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ అధికారి మనోహర్ పాటిల్ తెలిపారు. సౌరభ్ జగన్నాథ్ చుభార్ (18).. డ్యామ్ వద్ద ఓ రాతిపై సెల్ఫీ తీసుకుంటుండగా అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితుడు అజింక్యా భౌసాహెబ్ జైకర్ (18).. నీటిలోకి దూకి సౌరభ్ జగన్నాథ్‌ను కాపాడేందుకు యత్నించగా ఇద్దరూ నీటిలో పడిపోయి మృతి చెందారు. మత్స్యకారుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నాసిక్ ఆస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. -
మద్యానికి రాజధాని ఏ నగరమో తెలుసా?
వేల ఏళ్ళ చరిత్రకలిగిన.. సంస్కృతికి సాక్షీభూతమైన ప్రాంతం.. భారత్ లోని నాసిక్ పట్టణం. హిందూ తీర్థ క్షేత్రాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఇప్పుడు వైన్ రాజధానిగానూ వెలుగొందుతోంది. మహరాష్ట్ర లోని జిల్లా కేంద్రమైన నాసిక్ లో సూలా ద్రాక్షతోటలు, వైన్ పరిశ్రమలతోపాటు మరికొన్ని ప్రధాన వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో అక్కడ కొత్త ఒరవడిని తెచ్చింది. దీంతో నాసిక్ వైన్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. లిక్కర్ అమ్మకాల నిషేధంలో గుజరాత్ మహరాష్ట్రలు ప్రత్యేక చట్టాలను కలిగి ఉన్నాయి. ఇటీవల కేరళ కూడ ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటిదాకా కుంభ మేళాకు ప్రసిద్ధి చెందిన మహరాష్ట్రలోని నాసిక్ ను తీర్థక్షేత్రంగానే భావించిన పర్యాటకులు.. క్రమంగా వైనరీ కేంద్రంగాను గుర్తిస్తున్నారు. దీంతో వైన్ టూరిజానికీ నాసిక్ ప్రధాన కేంద్రంగా మారిపోయింది. సుమారు 50 వైన్ ఉత్పత్తి కేంద్రాలు నాసిక్ చుట్టుపక్కల వెలిశాయి. వాటిలోని కొన్నికేంద్రాల్లో వైన్ టేస్టింగ్ రూమ్ లను కూడ ఏర్పాటు చేశారు. వారాంతాల్లోనూ, విరామ సమయాల్లోనూ వచ్చే విధేశీ పర్యాటకులకోసం ఈ కొత్త సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. ఇది స్థానికులను సైతం ఆకట్టుకుంటోంది. అంతేకాక స్థానిక చట్టాన్ని సడలించాల్సిన స్థాయికి కూడ చేరేట్టు కనిపిస్తోంది. నాసిక్ లో వైన్ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నా... ఇప్పటికే అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. 'సూలా' సావినన్ బ్లాంక్, 'వల్లోన్' మాల్బెక్ డికాంటర్లు ప్రపంచ వైన్ అవార్డులను, పురస్కారాలను పొందాయి. వైన్ పరిమితంగా తీసుకోవడవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్నది పూర్వకాలంనుంచీ తెలిసిన విషయమే. ద్రాక్షరసంతో తయారయ్యే వైన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది. గుండె, ఎముకలను ధృఢపరచడమే కాక మధుమేహం, రక్తపోటు, కాన్సర్ వంటి కొన్ని రకాల రోగాలను కూడ రాకుండా చేస్తుంది. అందుకే వైన్ పరిశ్రమలకు కేంద్రమైన నాసిక్ ఇప్పుడు భారత వైన్ రాజధానిగా మారిపోయింది. -
ప్రేమ మైకంలో పడి చివరకు..
నాసిక్: గురు శిశ్యులుగా ఉండాల్సిన ఆ ఇద్దరు మర్యాద మరిచారు. ప్రేమపేరుతో మైకంలో పడి చివరకు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో శిష్యురాలు చనిపోగా గురువు పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నాసిక్ లోని గలానే అనే గ్రామంలో చోటుచేసుకుంది. జల్ గావ్ జిల్లా చాలిస్ గావ్ తాలుకాలోని గలానే అనే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(17) అదే గ్రామానికి చెందిన సమధాన్ సుభాష్ పాటిల్ (27) అనే టీచర్ కు ఆకర్షణకు లోనైంది. అనంతరం వారిద్దరు చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. అయితే, గత రెండు రోజులుగా వారిద్దరు కనిపించలేదు. ఈ క్రమంలో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారు నాసిక్ జిల్లాలోని చందవాడ్ ప్రాంతంలోగల చండ్రేశ్వరి ఆలయం వద్ద విషం తాగి స్పృహకోల్పోయి కనిపించారు. దీంతో వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా విద్యార్థిని చనిపోయింది. ఉపాధ్యాయుడు సుభాష్ చికిత్స పొందుతున్నాడు. వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో అనుమతించరేమోనన్న అనుమానంతోనే వారు జీవితాన్ని చాలించాలని విషం తీసుకున్నట్లుగా పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
ఇంటికి చేరిన నాసిక్ ప్రమాద బాదితులు
మహారాష్ర్టలోని నాసిక్‌లో ప్రమాదానికి గురైన తెలుగు మహిళల బృందం తిరిగి సొంతగూటికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 18 మహిళల బృందం గత శుక్రవారం షిరిడీ సాయి నాధుని దర్శనం కోసం వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం ఉదయం అక్కడి నుంచి నాసిక్ వెళ్తుండగా.. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతుండగా.. తాజాగా ఈ రోజు అందుంలో నుంచి 13 మంది మహిళలు తిరిగి రాజమండ్రికి చేరుకున్నారు. మిగతా ఐదుగురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో.. నాసిక్‌లోనే చికిత్స పొందుతున్నారు. -
నాసిక్‌లో రోడ్డుప్రమాదం: తెలుగువాళ్లకు గాయాలు
గండేపల్లి (తూర్పు గోదావరి) : షిరిడీ యాత్రకు వెళ్లిన తెలుగు మహిళా బృందం రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన 18 మంది మహిళలు శుక్రవారం ఉదయం షిరిడీ సాయి బాబా దర్శనానికి వెళ్లారు. సాయిబాబా దర్శనం అనంతంర ఒక వాహనంలో నాసిక్ వెళ్తుండగా.. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
దిగంబర సాధువులకు చిర్రెత్తింది
నాసిక్: పుష్కర స్నానాలకు వచ్చిన జైన దిగంబర సాధువులకు చిర్రెత్తిపోయింది. ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉండే వారంతా ఆగ్రహంతో ఊగిపోతూ అధికారులపై చిందులేశారు. ఏమిటీ ఏర్పాట్లు, జాగ్రత్తలు అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్లుగానే మహారాష్ట్రలో సింహాష్ట కుంభమేళా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జైన దిగంబర సాధువులు తరలి వచ్చారు. అయితే, గోదావరిలో నీళ్లు సరిగా లేకపోవడం, రాత్రి పూట విద్యుత్ సమస్య తలెత్తడం, చుట్టుపక్కల కుప్పలుగా చెత్తపేరుకోవడంవంటి పలు ఏర్పాట్ల లోపం వారికి కాస్త ఇబ్బంది కలిగించినట్లుదశరధ్ దాస్ అనే సాధువు అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుంభమేళాకు వచ్చే తమకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కేటాయించాల్సి ఉంటుందని, ఆ విషయంలో అధికారులు విఫలమయ్యారని ముందు తమకు ఆ పనిచేసి పెట్టాలని కోరారు. కన్నంవార్ బ్రిడ్జి నుంచి లక్ష్మీనారాయణ ఘాట్ వరకు కిలో మీటర్ కుపైగా ఉంటుందని, దానిని ఇప్పటికీ ఓపెన్ చేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు. -
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి
-
కారుకింద పడినా.. ఆ మూడేళ్ల పాప సేఫ్
నాసిక్: తలరాత బాగుంటే ఎలాంటి ప్రమాదం జరిగిన బతుకుతారు.. అదే తలరాత బాగలేకుంటే ఏ ప్రమాదం లేకుండానే చనిపోతారు. ఇది సాధారణంగా అందరు అనుకుంటూ ఉండే మాట. అయితే, బహుషా ఇలాంటి మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇన్నోవా కారు మీద నుంచి పోయిన ఓ మూడేళ్లపాప ప్రాణాలతో బయటపడింది. నాసిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ రోడ్డుపక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాని ప్రకారం ఓ ఇన్నోవా కారు వెళుతుండగా వడివడి అడుగులు వేసుకుంటూ ఓ మూడేళ్లపాప రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అది చూసుకోని కారుడ్రైవర్ పాప మీద నుంచే పోనిచ్చాడు. కారు పూర్తిగా పాప మీద నుంచి వెళ్లగా కారుకు ఎదురుగా ఉన్ పాప తల్లి అది చూసి గట్టిగా కేకవేసి కారును అపేసింది. వెంటనే కారు వెనుక టైరువద్ద ఉన్న చేతుల్లోకి తీసుకుంది. పైకి ఎలాంటి గాయాలవకున్నా కొంత స్పృహతప్పినట్లు కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాప శరీర అంతర్భాగంలో కొంచెం బ్లీడింగ్ అవుతుందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
నిశ్చితార్థానికి వెళుతూ మహిళా జర్నలిస్టు దుర్మరణం
నాసిక్ : ముంబై- ఆగ్రా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా జర్నలిస్ట్ సహా ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబాద్ పోలీసు స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. నాసిక్ సమీపంలో అతి వేగంగా వెళ్తున్న క్యాబ్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ముంబైలోని మరాఠీ దినపత్రికకు చెందిన 26 ఏళ్ల మహిళా జర్నలిస్టు ప్రియాంక దాహ్లే, క్యాబ్ డ్రైవర్ భూపీందర్ సింగ్, మరో ప్రయాణికుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గతంలో స్థానిక పత్రికలో పనిచేసిన ప్రియాంక ఈ మధ్యనే ముంబైలోని మరో ప్రతికలో చేరినట్టు సమాచారం. ఈ మధ్య ఆమెకు ముంబైకి షిప్ట్ అయ్యారు. ముంబై నుంచి తన నిశ్చితార్థం కోసం వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిశ్చితార్థ వేడుకలో మునిగి తేలాల్సిన ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం ఉదయం ప్రియాంక మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
టెంకాయలు నిషిద్ధం..
సాక్షి, ముంబై: ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయంగా వినుతిగాంచిన నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూలు, హారాలు, స్వీట్లు, పూజా సాహిత్యాన్ని నిషేధించారు. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ఇప్పటికే అక్కడక్కడ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయంతో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి త్రయంబకేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కేవలం నమస్కారంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఈ కఠోర నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు, నాసిక్‌లో పంచవటికి, శిర్డీకి వచ్చిన సాయి భక్తులు, ఇతర పర్యాటకులు ఈ త్రయంబకేశ్వర్‌ను సందర్శించకుండా వెళ్లరు. ఇక్కడే గోదావరి నది పుట్టిన విషయం తెలిసిందే. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమి లేవు. ఇక్కడ అందరు సమానమే. అందుకు దేవుని దర్శనం కోసం ఎవరైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. ఇలా అనేక ప్రత్యేకతలు ఈ ఆలయానికి ఉన్నాయి. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల తాకిడి కూడా అధికమైంది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని తరుచూ కేంద్ర గుడాచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు, హారాలు, మిఠాయి బాక్స్‌లతో పాటు అర్చన సాహిత్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి నిషేధిస్తున్నారు. ఇదిలా ఉండగా, అర్చన సామాగ్రిని నిషేధించడంలో వీటిపై ఆధారపడిన అనేక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఆలయానికి సమీపంలో, వాహనాల పార్కింగ్ లాట్లో పూజా సామాగ్రి విక్రయించే వందలాది షాపులున్నాయి. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తాము ఉపాధి కోల్పోయి వీధిన పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దండంతో సరిపెట్టుకోవాల్సిందే..!
సాక్షి, ముంబై: ప్రముఖ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూల హారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రిని నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని కొత్త ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఎంతో భక్తిశ్రద్ధలతో శివున్ని దర్శించుకునేందుకు అంత దూరం వెళ్లిన భక్తులు కేవలం నమస్కారం వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో నిత్యం ఈ ఆలయాన్ని వేలాదిమంది సాధారణ భక్తులు, ప్రజలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు. నాసిక్ జిల్లాలో పంచవటి, త్రయంబకేశ్వర్ సమీపంలో ఉన్న కొండ వద్దే గోదావరి నది పుట్టింది. అదేవిధంగా నాసిక్ జిల్లాకు 90 కి.మీ. దూరంలో ప్రముఖ షిర్డీ పుణ్య క్షేత్రం కూడా ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు త్రయంబకేశ్వర్‌ను దర్శించుకోనేదే ఉండలేరు. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమీ లేవు. ఇక్కడ అందరూ సమానమే. అందువల్ల ఎవరైనా ఎవరైనా దేవుడిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్లాల్సిందే. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల సంఖ్య కూడా పెరగసాగింది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తరుచూ కేంద్ర గూఢచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు,హారాలు, మిఠాయి బాక్స్‌లు తదితర అర్చన సామగ్రిని నూతన సంవత్సరం నుంచి నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
కుంభమేళా ఏర్పాట్లకు నిధులివ్వండి
నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి నాసిక్‌లో ఏర్పాట్లకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) ప్రతినిధులు కోరారు. మేయర్ అశోక్ ముర్తాదక్, డిప్యూటీ మేయర్ గుర్మిత్ సింగ్ బగ్గా ఆధ్వర్యంలోని ఎమ్మెన్నెస్ సభ్యులు గురువారం మాజీ మంత్రి ఛగన్ బుజ్బల్ను కలిశారు. ఈ మేరకు శుక్రవారం మేయర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కుంభ మేళాకు ఇంకా ఎనిమిది నెలలు వ్యవధి మాత్రమే ఉందన్నారు. అయితే ఇంతవరకు నాసిక్ లో కుంభమేళా ఏర్పాట్లకు తగినన్ని నిధులు అందలేదని అన్నారు. నాసిక్‌లో కుంభమేళా ఏర్పాట్లకు రూ.2,505 కోట్ల అంచనావ్యయంతో తాము ప్రతిపాదనలు పంపితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,052 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొత్తం ఖర్చులో తాము కేవలం మూడోవంతు మాత్రమే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటం అన్యాయమన్నారు. ఇప్పటివరకు ఏర్పాట్ల కోసం రూ.350 కోట్ల ఖర్చు పెట్టగా ప్రభుత్వం రూ.222 కోట్లు మాత్రమే చెల్లించందన్నారు. కాగా, ఎనిమిది నెలల వ్యవధిలో మిగిలిన పనులు పూర్తికావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందేనన్నారు. ఈ విషయమై త్వరలోనే ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. -
నాసిక్‌ను బొగ్గుగా మార్చారు
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారాలు మరింత జోరందుకుంటున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరాహోరిగా ప్రచారాలు చేస్తున్నారు. లోణావాలలో సోమవారం మధ్యాహ్నం బీజేపీ, ఆర్పీఐ కూటమి బహిరంగా సభ జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించడానికి ముందు కొద్ది సేపు ఆర్పీఐ అధ్యక్షుడు ఆఠవలే మాట్లాడారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై ఘాటుగా విమర్శలు చేశారు. రెండు రోజుల కిందట రాజ్ తన ప్రసంగంలో ఆఠవలేపై మిమిక్రీ చేశారు. వ్యంగంగా మాట్లాడి అందరినీ నవ్వించారు. అందుకు ఆఠవలే కూడా అదే శైలిలో రాజ్‌పై మిమిక్రీ చేస్తూ ధీటుగా సమాధానమిచ్చారు. ఒక్కసారి తనకు అధికారమిస్తే రాష్ట్రాన్ని బంగారంగా మారుస్తానని చెప్పిన రాజ్ నాసిక్ కార్పొరేషన్‌ను బొగ్గుగా మార్చారని ధ్వజమెత్తారు. అమిత్ షా ప్రసంగం... అమిత్ షా మాట్లాడుతూ.. ‘మావల్ తాలూకా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పర్శవల్ల పావనమైంది. ఇక్కడి నుంచి శివాజీ యుద్ధం చేసి అనేక మంది శత్రువులను మట్టుబెట్టారు. ఇదే తరహాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలను మట్టుబెట్టాల’ని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై కాల్పులు జరిపించిందని, కాల్పులు జరపాలని ఆసక్తి ఉంటే పాకిస్థాన్ సరిహద్దులోకి వెళ్లి జరపాలని చురకలంటించారు. మీ పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అజీత్ పవార్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ నాయకుడు మిమిక్రీ చేయడంలో ఆరితేరినాడ ని రాజ్‌ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అఠవలే కప్పలాగా దూకుతారని రాజ్ విమర్శలకు సమాధానిమిస్తూ ఆయన పులిలాగా పంజా విసురుతారని అన్నారు. ఒకవేళ ఆ పంజా మీపై విసిరితే అప్పుడు పరిస్థితి ఏంటని రాజ్‌ను నిలదీశారు. అనవసరంగా ఒకరిపై మిమిక్రీ చేయవద్దని హితవు పలికారు. ఈ ఎన్నికల్లో రాజ్‌కు కేవలం నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇలాంటి వ్యక్తి చేతుల్లోకి మహారాష్ర్ట పగ్గాలు వెళ్తే రాష్ట్రాన్ని తగలబెడతారని దుయ్యబట్టారు. ఆ తరువాత మంటలను ఆర్పివేయలేక మనం ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
అభివద్ధికి ఓటు వేయండి: చవాన్
నాసిక్: మహారాష్ట్రలో అభివద్ధికి ఓటు వేయాలని ఓటర్లకు మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ పిలుపునిచ్చారు. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన కోరారు. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్రం ఆర్థిక స్థిరత్వం సాధించిందని అన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని చవాన్ తెలిపారు. -
నాసిక్ మేయర్ పదవి ఎమ్మెన్నెస్ పరం
నాసిక్: ప్రతిష్టాత్మకంగా మారిన నాసిక్ మేయర్ పదవిని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) కైవశం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అశోక్ దేవరామ్ ముర్తాదక్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) మేయర్ పదవికి జరిగిన పోలింగ్‌లో అశోక్‌కు 77 ఓట్లు పోలవ్వగా, శివసేనకు చెందిన సుధాకర్ భికా బద్గూజర్‌కు 44 ఓట్లు వచ్చాయని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి విలాస్ పాటిల్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి గురుమిత్ అర్జున్‌సింగ్ బగ్గాను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు. అతడికి 75 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి చెందిన ప్రత్యర్థి శంభాజీ శ్యామ్‌రావ్ మొరుస్కర్‌కు 43 ఓట్లు పోలయ్యాయని పాటిల్ చెప్పారు. ఇదిలా ఉండగా, 2012లో జరిగిన ఎన్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పార్టీ బీజేపీతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఎమ్మెన్నెస్ నుంచి న్యాయవాది అయిన యతిన్ వాఘ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు ఎమ్మెన్నెస్, తర్వాత విడత బీజేపీ అభ్యర్థి మేయర్ పదవి చేపట్టాలి.అయితే యతిన్ మేయర్‌గా ఉన్న సమయంలో బీజేపీని పూర్తి విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా, ఈ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం ఎమ్మెన్నెస్‌కు చివరి నిమిషంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మద్దతు ఇవ్వడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కాగా, ఎన్ఎంసీలో 122 మంది కార్పొరేటర్లు ఉండగా ఎంఎన్ఎస్-37, ఎన్సీపీ-20, కాంగ్రెస్-14, శివసేన-22, బీజేపీ-15, స్వతంత్రులు-6, జనస్వరాజ్య పార్టీ-2, ఆర్పీఐ-3, సీపీఎం-3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్నాయి. -
కొనసాగుతున్న కుండపోత
నాసిక్‌లో ఇద్దరు మృతి నాసిక్: పుణే, ఠాణేలతోపాటు నాసిక్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. పట్టణంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారమందింది. పథార్ది-ఫాటా ప్రాంతంలో కాంపౌండ్ గోడ కూలిన దుర్ఘటనలో రమేశ్ యాదవ్ అనే కూలీ మృతిచెందగా, త్రైంబకేశ్వర్ తాలూకాలోని తల్వాడే-అంజనేరి గ్రామంలో రోడ్డు దాటుతూ సునీతా చవాన్ అనే మహిళ నీళ్లలో కొట్టుకుపోయి మృతిచెందిందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 660.30 మిల్లీమీటర్ల వర్షం కురిసిట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఇగత్‌పురిలో 138 మిల్లీమీటర్ల, త్రైంబకేశ్వర్‌లో 128 మిల్లీమీటర్లు, పీంట్‌లో 100 మిల్లీమీటర్ల, నాసిక్ పట్టణంలో 70 మిట్లీమీటర్ల వర్షపాతం నమోదైట్లు చెప్పారు. ఇటు ముంబైలో కూడా వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఘాట్కోపర్, కుర్లా, చెంబూర్, హింద్మాతా తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. పుణేలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ యార్డు పూర్తిగా నీటమునిగింది. ముంబైలో కూడా కొండచరియలు విరిగి పడ్డాయి. -
అనకొండలు!
వరుణుడు మూడో కన్ను తెరిచాడు. కొండలను పిండి చేశాడు. భారీ వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించాడు. రహదారులను కోసేశాడు. వీధులను, ఇళ్లను జలమయం చేశాడు... బుధవారం కురిసిన వర్షం గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే అనిపించేలా విధ్వంసం సృష్టించాడు. సముద్ర తీరప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికాయి. మరో 48 గంటలపాటు భారీగానే వర్షం కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుండపోత వర్షానికి విరిగిపడిన సహ్యాద్రి పర్వతశ్రేణులు పుణే, నాసిక్, ఠాణే జిల్లాలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సాక్షి, ముంబై: వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడా? జలాశయాలు ఎప్పుడు నిండుతాయా? తాగునీరు, సాగునీరు ఇంకెప్పుడు అందిస్తాడంటూ వర్షం కోసం ఎదురుచూసిన ప్రజలకు బుధవారం పీడకలగా మారింది. ఉగ్రుడై వచ్చిన వరుణుడు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతాల్లో తీరని విషాదం మిగిల్చాడు. కుండపోతగా కురిసిన వర్షానికి రాష్ట్రంలోని పుణే, నాసిక్, ఠాణే జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రజారవాణాకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రహదారులు, వీధులు జలమయం కావడంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేక అవస్థలు పడ్డారు. పుణేలో నష్టం ఎక్కువగా జరిగింది. నాసిక్‌లో ైరె ళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాసిక్‌లోనూ జనం అనేక ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకెళ్తే...నాసిక్ జిల్లాలో నిలిచిపోయిన రైళ్లు... ముంబైకి సుమారు 132 కిలోమీటర్ల దూరంలో నాసిక్ జిల్లా ఇగత్‌పురీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ రైల్వే ఇగత్పురి-కసారా రైల్వేస్టేషన్ల మధ్య ఇగత్‌పురీ రైల్వేస్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ దుర ్ఘటన చోటుచేసుకుంది. దీంతో హౌరా-ముంబై దురంతో(12262) ఎక్స్‌ప్రెస్, పాట్నా-లోకమాన్యతిలక్ టెర్మినస్(13201) ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇగత్‌పురీ సమీపంలో ఆగిపోయాయి. పలు రైళ్లను దౌండ్, పుణే మార్గం మీదుగా దారి మళ్లించగా మరికొన్నింటిని మార్గమధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. దారి మళ్లించిన రైళ్లలో వారణాసి-ముంబై మహానగరి ఎక్స్‌ప్రెస్, పాట్నా-ముంబై సీఎస్టీ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్-ముంబై గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. నాగపూర్-ముంబై సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఇగత్‌పురీలో రద్దు చేసి అక్కడి నుంచి మళ్లీ తిరిగి నాగపూర్‌కు పంపారు. ఔరంగాబాద్-దాదర్ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను లహవిత్ రైల్వేస్టేషన్లో రద్దు చేసి మళ్లి అక్కడి నుంచి ఔరంగాబాద్‌కు నడిపారు. ముంబై - భుసవల్ల మధ్య నడిచే ప్యాసింజర్ రైలును కూడా కసారాలో రద్దు చేసి తిప్పి పంపారు. ఇక భుసవల్-ముంబైల మద్య నడిచే ప్యాసింజర్ రైలును మన్మాడ్‌లో రద్దు చేసి తిరిగి భుసవల్కు పంపించారు. యుద్ధప్రతిపాదికపై... రైల్వేట్రాక్‌లపై పడిన కొండచరియలు విరిగిపడిన చోట పునరుద్ధరణ చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. శిథిలాలను తొలగించే పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ఇగత్‌పురీ ఘటనను తెలుసుకున్న సెంట్రల్ రైల్వేఅధికారులు కూడా ముంబై నుంచి ఘటన స్థలానికి వచ్చి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ మార్గంలో రైళ్లన్నింటిని వీలైనంత త్వరగా పునరుద్ధరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సెంట్రల్ రైల్వేపేర్కొంది. పుణేలో భారీ వర్షం పుణేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మూడురోజులుగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్లచెట్లు నేల కూలాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇంట్లోనే కూర్చుంటున్నారు. పలుప్రాంతాల్లో రహదారులు సరస్సులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకెళ్తే... దాపోడిలోని అరుణ్ టాకీస్ వద్ద సుమారు వందకుపైగా ఇళ్లలో వర్షపు నీరు చేరి ఫర్నీచర్, వంట సామాగ్రి నీట మునిగింది. దీంతో కార్పొరేషన్ అత్యవసర విభాగం, అగ్ని మాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తేర్గావ్ ఫినిక్స్ ఆస్పత్రి వద్ద ఫ్లాట్లలోకి, అశోకా హౌజింగ్ సొసైటీ, బిర్లా మెమోరియల్ ఆస్పత్రి వద్ద, పింప్రి తపోవన్ మందిర పరిసరాలతోపాటు నవీ సాంగ్వీలోని సహ్యాద్రి కాలనీ, పింపలే గురవ్‌లోని జవలకర్నగర్, కాలేవాడిలోని నడేనగర్, ప్రీతంనగర్, బోసిరిలోని లాండేవాడి పరిసరాలు, హింజ్వాడీ, వాకడ్, చించ్వాడ్, ఆకృడి, దేహురోడ్డు, ఆదర్శ్‌నగర్, నిగిడి, పింప్రి నది తీర ప్రాంతాలు, నిగిడి రూపీనగర్, మావల్, లోనవాలా, ఘోర్వాడి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘోర్వాడి రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం సగానికిపైగా కూలింది. దీంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటలలో లోనవాలా పరిసరాల్లో 340 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, గత మూడు రోజులుగా 650 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటలు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పుణే వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఠాణేలోనూ కొనసాగిన వర్షం జోరు... జిల్లాలోని 50 గ్రామాలు వర్షం తాకిడికి విలవిల్లాడాయి. మిగతా గ్రామాలతో వీటికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ముర్బాద్, పాల్ఘర్ తాలూకాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తుల నిర్వహణ అధికారి జైదీప్ విసావే తెలిపారు. వసయి, డహణు, విక్రమ్‌గఢ్, మానోర్లోని లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైతర్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో మరో రెండ్రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్వాన్ వంతెన మీదుగా నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వరద నీటిలో కొట్టుకుపోయి ఓ పిల్లాడు మరణించినట్లు జైదీప్ తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని, వర్షం జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో తీవ్ర ఆటంకం కలుగుతోందని, భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. భివండీలో... భివండీ, న్యూస్‌లైన్ : భివండీలో నాలుగు రోజులుగా నిలకడ లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి భివండీ అతలాకుతమైంది. పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. రంజాన్ పండుగ జరుపుకోవడానికి ముస్లింలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి. ఇళ్లలో రెండు, మూడు అడుగులు ఎత్తు వరకు నీరు రావడంతో విలువైన వస్తువులు నీటి పాలయ్యాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టించుకోని కార్పొరేషన్ ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ అత్యవసర విభాగ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ రెండు నెలల క్రితం మురికి కాలువలు శుభ్రం చేయడానికై ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో శుభ్రం చేయలేదు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించినప్పటికీ సంబంధిత అధికారులు చూచి చూడనట్లు వ్యవహరించారు. ఈ విషయంపై కొందరు కార్పొరేటర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. మునిగిన వంతెనలు భివండీలో ఉన్న పెద్ద మురికి కాలువలతో పాటు కామ్‌వారి నదిని కార్పొరేషన్ శుభ్రం చేయలేక పోవడంతో వర్షం నీరు నిండి కాడిపార్, కోనిగావ్ ప్రాంతాలలోని వంతెనలను ముంచెత్తింది. శనివారం నుంచి బుధవారం వరకు రాకపోకలు పూర్తిగా నిల్చిపోయాయి. పట్టణంలోని లోతట్టు ఈదగా రోడ్, కారోళి రోడ్, అంబికా నగర్, శివాజీ నగర్, నజరాణ కంపౌండ్, అజయ్ నగర్, ఠాంగేఆలి-భాజీ మండాయి, శివాజీ చౌక్, మాడా కాలనీ, నదినాక, శేలార్ తదితర ప్రాంతాలలోని మురికి వాడలు, రోడ్లపై ఐదు అడుగుల వరకు వర్షం నీరు నిలిచింది. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడంలో అధికారులు విఫలమాయ్యారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొంత వరకు వర్ణుడు కరునించినప్పటికీ కొన్ని పాంతాలలో వర్షం నీరు అలాగే నిల్వ ఉన్నది. స్థానిక సేవా సంఘాలు, స్థానిక కార్పొరేటర్లు కొన్ని ప్రాంతాల ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేశారు. పోలీస్‌స్టేషన్‌లోకి నీరు.. బజార్‌పేట్ ప్రాంతంలోని నిజాంపూర్ పోలీస్ స్టేషన్లోకి వర్షం నీరు వెళ్లడంతో విలువైన కాగితాలు, అస్త్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి సంవత్సరం ఈ పోలీస్ స్టేషన్లో నీరు చేరుతున్నప్పటికీ కార్పొరేషన్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అదే దుస్థితి పునరావృతమవుతోంది. అదే విధంగా కామత్‌ఘర్ ప్రాంతంలోని వరాలదేవి చెరువులో ఉన్న మురికిని తీయకపోవడంతో చెరువు నిండి పొర్లుతోంది. చెరువును శుభ్ర పరచడానికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కుంభమేళా పనులకు నిధుల కొరత
నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి జిల్లాలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ఎంసీకి కేటాయించిన నిధులు తగిన రీతిలో అందకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కుం భమేళా నిమిత్తం జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్రం నిర్ణయించింది. జిల్లాకు రూ.2,378.71 కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత కమిటీ నిర్ణయించింది. వీటిలో ఎంఎంసీకీ రూ.1,052.61 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్ఎంసీకి కేవలం రూ.222.17 కోట్లు అందజేసింది. కేంద్రం నుంచి ఎన్ఎంసీకి ఇంతవరకు నిధులు ఏమాత్రం అందలేదు. ఇదే సమయంలో, పనుల్లో తన వంతు నిధులను సకాలంలో విడుదల చేయాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు డివిజనల్ రెవెన్యూ కమిషనర్(నాసిక్ డివిజన్) ఏక్నాథ్ దావ్లే లేఖ రాశారు. ‘అత్యున్నత కమిటీ, హై-పవర్ కమిటీ సమావేశాల సమయంలో కుంభమేళాకు సంబంధించిన పనులకు కేటాయించిన నిధుల్లో 33 శాతం అంటే రూ.350 కోట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మిగిలిన సొమ్ము (సుమారు రూ.700 కోట్లు)ను నాసిక్ మున్సిపల్ కార్పొరేషనే సమకూర్చుకోవాలని చెప్పింది. అయితే ఈ నెల మొదటి వారంలో జరిగిన కుంభమేళా సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రూ.350 కోట్లు, లోన్ల ద్వారా రూ.350 కోట్ల పైనే నివేదిక సమర్పించింది. మిగిలిన రూ. 352.61 కోట్ల నిధుల గురించి ఎటువంటి ప్రణాళిక రూపొం దించలేదు. కుంభమేళాకు ఇంకా ఎంతో సమయం లేదు. సాధుగ్రాం, తాత్కాలిక నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, తాత్కాలిక పార్కింగ్ స్థలాల ఏర్పా టు వంటి పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధులు చూస్తే సకాలంలో అందడంలేదు.. ఇలా అయితే కుంభమేళా సమయానికి నిర్దేశించిన పనులు పూర్తిచేయడం కష్టమే..’ అని ఆ లేఖలో ఏక్నాథ్ స్పష్టం చేశారు. కాగా నగర మేయర్ యతిన్ వాఘ్‌ను ఈ విషయమై సంప్రదించగా..‘కుంభమేళా పనుల పూర్తిలో ఎన్ఎంసీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సమాన బాధ్యత ఉంది. అలహాబాద్, ఇతర నగరాలకు కేంద్ర నిధులు అందాయి. మాకు కూడా కేంద్ర నిధులు విడుదల కావాల్సి ఉంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తాం. ప్రస్తు తం మేము ఎన్ఎంసీ తరఫున నిధుల సమీకరణలో తలమునకలై ఉన్నాం..’ అని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో కుంభమేళా జరగనుంది. ఎన్ఎంసీ కి కేటాయించిన 96 పనుల్లో రూ.529.55 కోట్ల విలువ చేసే 29 పనులను ఇప్పటికే ప్రారంభించా రు. వీటిలో రూ.432.49 కోట్ల ఖర్చు ప్రతిపాదనతో 17 రోడ్డు పనులు, గోదావరిపై రూ.16.97 కోట్ల అంచనాతో మూడు వంతెనలు, రూ.65.01 కోట్ల అంచనా ఖర్చుతో ఐదు నీటి సరఫరా పనులు, అలాగే రూ.15.08 కోట్ల అంచనా ఖర్చుతో నాలుగు మురికినీటి ప్రక్షాళన పనులు ఉన్నాయి. -
సేంద్రియ సాగుపై సర్కారు దృష్టి
నాసిక్: రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించింది. నాసిక్ డివిజన్లోని ధులే సమీపంలో త్వరలో సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ధులే సమీపంలోని వదానేలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2013 అక్టోబర్‌లో సేంద్రియ వ్యవసాయంపై కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం డివిజన్ల వారీగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సేంద్రియ వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోనే వీటిని నెలకొల్పనున్నారన్నారు. ‘ధులే సమీపంలో వదానేలోని దిలీప్ పాటిల్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో డివిజన్లోని మొట్టమొదటి శిక్షణా కేంద్రం ఏర్పాటవనుంది. ఇందుకోసం రాగష్ట్రం రూ. ఐదు లక్షల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఒకేసారి 50 మంది రైతులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టీవీ, ఎల్సీడీ ప్రొజెక్టర్, ఇతర పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పాఠాలే కాకుండా ఈ క్షేత్రంలో వాస్తవికమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఈ కేంద్రంలో నాసిక్‌తోపాటు జల్గావ్, నందూర్బార్ జిల్లాకు చెందిన రైతులకు కూడా శిక్షణ ఇస్తారు’ అని అధికారి తెలిపారు. ఆగస్టు చివరికల్లా ఈ శిక్షణా కేంద్రం సిద్ధమయ్యే అవకాశం ఉందని రైతు దిలీప్ పాటిల్ తెలిపారు. మూడు శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం అనుమతించిందని, అందులో ఒకటి నాసిక్ డివిజన్లో, మరో రెండు ఔరంగాబాద్‌లోనూ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రసాయన ఎరువుల వల్ల పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గుతోందని, అంతేకాక అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల పంట దిగుబడితోపాటు నాణ్యత కూడా పెరుగుతుందని పాటిల్ చెప్పారు. రసాయన ఎరువుల కలుగుతున్న దుష్ర్పయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది. మొత్తం సాగులో పది శాతాన్ని సేంద్రియ వ్యవసాయంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
సర్వీసు ఓటు వృథానే..!
ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న సర్వీసు ఓటర్లు తప్పుల తడకగా ఓటర్ల జాబితా మృతి చెందిన ఆర్మీ ఉద్యోగులకూ ఓటు రిటైర్డ్ అయినవారికీ పోస్టల్ బ్యాలెట్టే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటూ నమోదు కాలేదు చిరునామాలు తప్పని తిరుగు టపా ఓటు వేయలేని పరిస్థితిలో జిల్లాలోని 7039 మంది సర్వీస్ ఓటర్లు బేస్తవారిపేట, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సర్వీస్ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో 7039 మంది సర్వీస్ ఓటర్లున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపాల్సి ఉంది. అస్సాం, జమ్ము కాశ్మీర్, నీలగిరి,బెంగళూరు, నాసిక్ వంటి సుదూర ప్రాంతాల్లో సైనిక ఓటర్లున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒంగోలులో బ్యాలెట్లు ముద్రించి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల అధికారులు ఎంపీటీసీల సెగ్మెంట్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను తయారు చేయాలి. పోస్ట్‌ద్వారా పంపడానికి కనీసం మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. బేస్తవారిపేట మండలంలో 602 మంది సర్వీస్ ఓటర్లందరూ సైనికులే. ఓటర్ల జాబితాలో రెజిమెంట్ మాత్రమే నమోదు చేసి ఉండటంతో అక్కడి నుంచి పనిచేసే స్థానానికి పంపడానికి మరికొన్ని రోజులు పడుతుంది. వచ్చే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్‌ను పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో మండల అధికారులకు నిధులు విడుదల చేయకపోవడం ఓ కారణం. జమ్ము, కాశ్మీర్ వంటి దూర ప్రాంతాలకు బ్యాలెట్లను స్పీడ్ పోస్ట్‌లో పంపాలంటే ఒక్కో దానికి * 50 ఖర్చవుతుంది. బేస్తవారిపేట మండలంలోని 602 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి * 30 వేలు ఖర్చవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చును నేటికీ అధికారులకు అందజేయలేదు. మళ్లీ పోస్టల్ ఖర్చు తడిసిమోపడవుతుందని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సక్రమంగా లేని జాబితా: ఏడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంపిన సర్వీస్ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పంపారు. చనిపోయిన, విశ్రాంత ఉద్యోగులకు ఓట్లు వచ్చాయి. రిటైర్డ్ అయినవారికి బ్యాలెట్లను గతంలో పనిచేసిన ప్రాంతాలకు పంపుతుండటంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వ స్తోంది. ఆర్మీ ఉద్యోగులకు మొదట పనిచేసిన చిరునామాలను నెట్లో ఉంచడంతో వారుకూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోనే అత్యధికంగా సర్వీస్ ఓట్లున్న గిద్దలూరు నియోజకర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పంపిన బ్యాలెట్లు ఓటు వేయకుండానే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుప్పలుగా అడ్రస్‌లు తప్పుగా ఉన్నాయని వెనక్కువచ్చాయి. ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్లు అందేలా, మారిన చిరునామాలను సవరించేలా చర్యలు తీసుకోవాలని సర్వీస్ ఓటర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణరాజును వివరణ కోరగా సర్వీస్ ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితం అందజేశారని, మండలంలోని 19 పంచాయతీల్లో ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పంపిన 602 పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ముగిసిన పది రోజుల తరువాత వెనక్కువచ్చాయని, ఒక్క ఓటుకూడా నమోదు కాలేదని చెప్పారు. -
పట్టుకోసం పాకులాట
సాక్షి, ముంబై: ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే వివిధ రాజకీయ పార్టీలు బలాబలాలను అధ్యయనం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభించాయి. రాబోయే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం ప్రముఖ నగరాల పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాలుగు, అయిదు జిల్లాల్లో పట్టు సాధిస్తే సునాయాసంగా అధికారంలోకి రావచ్చని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా గత ఎన్నికల నుంచి నియోజకవర్గాలు మారిన సంగతి తెలిసిందే. దీంతో గత ఎన్నికల నుంచి నగరాలు, పట్టణాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ముఖ్యంగా ముంబై, ఠాణే, పుణే, నాసిక్ ప్రాంతాల్లో పట్టున్నవారు అధికారంలోకి వచ్చేందుకు అధిక అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నాలుగు జిల్లాల్లో 96 అసెంబ్లీ, 16 లోక్‌సభ నియోజకవర్గాలు రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ, 48 లోక్‌సభ నియోజకవర్గాలున్న విషయం విదితమే. గత ఎన్నికల సమయంలో జరిగిన పునర్విభజన అనంతరం ముంబై, ముంబై ఉపనగరం, ఠాణే, పుణే, నాసిక్ మొదలగు జిల్లాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క ముంబై నగరంలోనే (ముంబై, ముంబై ఉపనగరం) మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ముంబై అనంతరం ఠాణే, పుణే, నాసిక్ జిల్లాలు ఉన్నాయి. ఠాణే జిల్లాలో 4 లోక్‌సభ, 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరోవైపు పుణే జిల్లాలో 21 అసెంబ్లీ, 4 లోక్‌సభ, నాసిక్ జిల్లా లో 15 అసెంబ్లీ 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నా యి. దీంతో ముంబై, ఠాణే, పుణే, నాసిక్ జిల్లాలు కీలకంగా మారాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మొత్తం 35 జిల్లాల్లో 288 అసెంబ్లీ, 48 లోక్‌సభ నియోజకవర్గాలుండగా వీటిలో 96 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 లోక్‌సభ నియోజకవర్గాలు కేవలం ముంబై, ముంబై ఉపనగరం, ఠాణే, పుణే, నాసిక్ మొదలగు జిల్లాల్లోనే ఉండడం విశేషం. దీంతో ఈ ప్రాంతాలపై రాజకీయ నాయకులు అత్యధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం కూడా ఇస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పట్టు న్న రాజకీయ పార్టీలు సునాయాసంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీ య నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాలు రాష్ట్రంతోపాటు కేంద్రంలో సమీకరణా లు మార్చేందుకు కీలకంగా మారాయి. వీటన్నిం టినీ దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. -
ముంచింది నిర్లక్ష్యమే!
సాక్షి, ముంబై: మాల్శేజ్ రోడ్డును విస్తరించకపోవడం, రైల్వేలైన్ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘాట్‌పై వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఠాణే-అహ్మద్‌నగర్ బస్సు గురువారం మాల్శేజ్‌ఘాట్ లోయలో పడి 27 మంది ప్రయాణికులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్శేజ్ ఘాట్‌రోడ్డు మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంపై మరోసారి చర్చ మొదలయింది. ప్రతి వర్షాకాలంలో మాల్శేజ్‌ఘాట్ రోడ్డు ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తొందర్లోనే ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా మారుస్తామని, ఠాణే-అహ్మద్‌నగర్ రైల్వేలైన్ కూడా వేస్తామని ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు పలుసార్లు హామీ ఇచ్చినా అవేవీ నెరవేరలేదు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతాలు ఇంకా చాలా వె నుకబడి ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కేవలం 130 కిలోమీటర్లు, ఠాణే నగరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో మాల్శేజ్‌ఘాట్ ఉంది. 222 నంబరు జాతీయ రహదారి ఘాట్ మార్గం మీదుగా కళ్యాణ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వరకు వెళ్తుంది. అయినప్పటికీ అనేక మంది ఈ రహదారిని వినియోగించుకోకుండా పుణే లేదా ఇతర మార్గాల మీదుగా వెళ్తుంటారు. దీనికి ప్రధాన కారణం మాల్శేజ్ ఘాట్ రోడ్డు ఎంతో ఇరుగ్గా, అనేక మలుపులతో ఉండడమే! కళ్యాణ్ నుంచి ముర్బాడ్ మీదుగా అహ్మద్‌నగర్ వెళ్లేవాటితోపాటు ఇతర బస్సులు మాత్రమే ఈ మార్గం మీదుగా వెళ్తుంటాయి. ప్రయాణ సమయం కాస్త ఆదా అవుతుందని తెలిసినా ఈ మార్గంలో ప్రయాణించడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించాలని వాహనదారులు, ముర్బాడ్ నుంచి మాల్శేజ్ ఘాట్ వరకు ఉన్న ప్రాంతాల ప్రజలు అనేక రోజులుగా కోరుతున్నారు. గుడ్డిలో మెల్లలా కళ్యాణ్-నిర్మల్ రోడ్డుకు మాత్రం జాతీయ రహదారిగా హోదా కల్పించారు. కాగితాలకే పరిమితమైన రైల్వేలైన్ ...! కళ్యాణ్-అహ్మద్‌నగర్ వయా మాల్శేజ్ ఘాట్‌రోడ్డుకు ప్రత్యామ్నయంగా రైల్వేమార్గం నిర్మించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా మారింది. ముంబైకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో రైల్వేమార్గం ఏర్పాటైతే స్థానిక గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వేలైన్ ప్రతిపాదన గత 39 ఏళ్లుగా కాగితాలకే పరిమిత మయింది. మాల్శేజ్‌ఘాట్ రైల్వే ప్రాజెక్టును 1974లో కేవలం రూ.108 కోట్ల బడ్జెట్‌తో చేపట్టాలనుకున్నారు. అయితే ప్రస్తుతం దీని అంచనావ్యయం ఏకంగా రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఇంకా సర్వే పనులే పూర్తి చేయలేదు. కళ్యాణ్-అహ్మద్‌నగర్ వయా మాల్శేజ్ ఘాట్‌రోడ్డు విదర్భ, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాలను కలుపుతుంది. దీనిని నాలుగులేన్లుగా విస్తరిస్తే మాల్శేజ్ ఘాట్ చుట్టుపక్కల ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. మాల్శేజ్ రైల్వేలైన్ సర్వే పనులు చేపట్టనున్నట్టు రామ్‌విలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. నిధులు లేకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ మార్గం చాలా లాభసాటిగా ఉంటుందని రైల్వే 2006లో చేపట్టిన సర్వేలో వెల్లడయింది. 204 కిలోమీటర్ల రైల్వేమార్గం నిర్మాణానికి రూ.772 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అయితే భూసేకరణ, ఇతర పనులు కొనసాగించేందుకు నిధులు లేకపోవడంతో పనులు ముందుకుసాగడం లేదు. మూడేళ్లలో 189 ప్రమాదాలు... మాల్శేజ్ ఘాట్‌పై గత మూడేళ్లలో 189 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 59 మంది ప్రాణాలను కోల్పోయారు. గత సంవత్సర కూడా 42 ప్రమాదాలు సంభవించగా, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మందికి గాయాలయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎంఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై లోయలో పడడంతో 27 మంది మరణించారు. ఈ మార్గంపై పదేళ్ల కిందట జరిగిన వాటితో పోలిస్తే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇందులో ప్రభుత్వ కృషి ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళలు, వర్షాకాలంలో వాహనదారులు ఈ మార్గం మీదుగా వెళ్లకపోవడం వల్లే ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. -
లోయలో ఘోరకలి
సాక్షి, ముంబై: కన్ను మూసి తెరిచేలోపు 27 మంది ప్రాణాలు గాలిలోకి కలసి పోయాయి. నిత్యం పచ్చగా కనిపించే మాల్శేజ్లోయ ఎరుపురంగులోకి మారింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎంఎస్ఆర్టీసీ) బస్సు గురువారం ఘోరప్రమాదానికి గురికావడంతో 27 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మద్‌నగర్ బయలుదేరిన బయల్దేరిన ఈ బస్సు ఠాణే-నాసిక్ జిల్లా సరిహద్దులో ఉన్న మాల్శేజ్‌ఘాట్ లోయలో పడింది. సుమారు 300 అడుగులకుపైగా లోతున్న లోయలో పడడంతో బస్సు మూడు ముక్కలుగా మారి నుజ్జునుజ్జయింది. ఈ సందర్భంగా గాయపడ్డ 11 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ కండక్టర్లతోపాటు ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు. విఠల్వాడి డిపోకు చెందిన ఈ బస్సు ఉదయం సుమారు 5.45 గంటలకు ఠాణేలోని లోకమాన్యనగర్ నుంచి నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మద్‌నగర్‌కు బయలుదేరింది. కండక్టర్, డ్రైవర్ సహా ఇందులో మొత్తం 38 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు జున్నర్ తీర్థయాత్రకు బయలుదేరారు. వీరి ప్రయాణం మాల్శేజ్ ఘాట్ వరకు బాగానే సాగింది. టోకావడే పోలీసు స్టేషన్‌కు సుమారు 38 కిలోమీటర్ల దూరంలోని శంకర్ మందిరం సమీపంలో ఒక లారీ ఎదురు వచ్చింది. కలపతో నిండి ఉన్న లారీ, ఆర్టీసీ బస్సు కుడివైపు స్వల్పంగా ఢీకొంది. దీన్ని తప్పించాలనే తాపత్రయంతో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తిప్పాడు. దీంతో అది ఒక్కసారిగా సుమారు 300 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా భీతిల్లి ఆర్తనాదాలు మొదలుపెట్టారు. బస్సు కుదుపులతోపాటు మెల్లమెల్లగా భారీ శబ్దంతో కిందికి జారిపోవడంతో ముక్కలైంది. అందులోని ప్రయాణికులు కూడా చెల్లాచెదురయ్యారు. లోయలోని చెట్లు, బండరాళ్లపై పడిపోయారు. ఎటు చూసిన ఆర్తనాదాలు, రోదనలతో పరిసరాలు మార్మోగాయి. అనేక మంది అప్పటికే విగత జీవులయ్యారు. మరికొందరు కొనఊపిరితో రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలపాలైన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించి శవాలను వెలికితీశారు. ఈ లోయలో సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో సమాచారం అందడం జాప్యమయింది. లోయ కింది భాగానికి వెళ్లడానికి ఇబ్బందులు రావడంతో కొనఊపిరితో ఉన్న కొందరిని కాపాడలేకపోయారు. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్టు టోకవాడే పోలీసు స్టేషన్ అధికారి పాటిల్ ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు.. మాల్శేజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులకు రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎంస్ఆర్టీసీ ప్రకటించింది. గాయపడినవారి వైద్యఖర్చులు భరిస్తామని తెలిపింది. మృతుల వివరాలు... పూనం ఆహేర్, కిషన్ చౌదరి, కారభారి కురకుంటే, బాలు ఆహేర్, తుకారాం భవారీ, పరశురాం సోనవణే, విజయ్ కులకర్ణి, పోపట్ దాతే, మేఘాహాండే, బబన్ ఆహేర్, సరస్వతి ఆహేర్, ముకుంద్ పాలేకర్, విమల్ పాలేకర్, సాయిబాయి ఆహేర్, ప్రశాంత్ ఆమ్టే, కళ్యాణ్ జాధవ్, వైశాలీ ఆహేర్, కె.ఎన్.చౌదరి (డ్రైవర్), డి.బి.గోండకే (కండక్టర్)గా గుర్తించారు. మిగతా ఎనిమిది మంది పేర్లు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి నాసిక్ -వణీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న క్వాలిస్, గూడ్స్ వాహనాలు గుద్దుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు నాసిక్ జిల్లా ఉణందానగర్ గ్రామ సమీపంలో గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులతోపాటు గాయపడిన వారందరూ నాసిక్ కు చెందినవారేనని తెలిసింది. మృతుల్లో గుల్షన్ఖాన్ పఠాన్ (38), ఆయన భార్య రుబీనా పఠాన్ (35), కుమారుడు సోను అలియాస్ ఆసీఫ్ పఠాన్(14)లున్నారు. గాయాలపాలైనవారిలో సాది క్ షేక్(35), గుడ్డి అలియాస్ సిమ్రాన్ పఠాన్ (18)లతోపాటు క్వాలిస్ డ్రైవర్ కూడా ఉన్నారు. పోలీ సులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు. -
ఆప్ పనితీరు చూద్దాం: పవార్
నాసిక్: ఉల్లిగడ్డలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలను తగ్గిస్తామన్న ఎన్నికల హామీని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎలా నెరవేరుస్తుందో చూద్దామని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌పవార్ అన్నా రు. ఇంతకుముందు ఉల్లితో పాటు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల వల్ల సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని బీజేపీ, షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు మట్టికరిచాయని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఏఏపీ వాటి ధరలను ఎలా నియంత్రిస్తుందో చూద్దామన్నారు. నంద్గావ్లో ఎన్సీపీ కార్యాలయాన్ని, పంచాయతీ సమితి కార్యాలయాన్ని పవార్ మంగళవారం ప్రారంభించారు. -
భుజ్‌బల్‌పై పోటీకి సిద్ధం: పాండరే
సాక్షి, ముంబై: పార్టీ ఆదేశిస్తే నాసిక్ నుంచి ఎన్సీపీ నాయకుడైన ఛగన్ భుజ్‌బల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆప్ నాయకుడు విజయ్ పాండరే తెలిపారు. ఢిల్లీ విజయంతో దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) రాష్ట్రంలోకూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న విషయం విదితమే. ముఖ్యంగా జలవనరుల శాఖ, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేసిన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసిన పాండరే ఇటీవలే ఆప్‌లో చేరిన సంగతి తెలిసిందే. ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గౌరవముంది. ముఖ్యంగా అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికే కాక, ఇతర పదవులకు కూడా రాజీనామా చేయాల్సి వచ్చేలా చేసిన విజయ్ పాండరే నాసిక్‌లో ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్సీపీకి వ్యతిరేకంగా పోటీకి దిగనున్నట్టు పేర్కొనడంతో ఎన్సీపీ కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మరోవైపు అవినీతి పరులకు ప్రజలు బుద్ధిచెబుతారన్న నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొంటున్నారు. ధైర్యముంటే కొల్హాపూర్ నుంచి పోటీ చేయాలి టోల్ విషయంపై కొల్హాపూర్ ప్రజలను ఉద్దేశించి ఛగన్ భుజ్‌బల్ చేసిన వ్యాఖ్యలపై కొల్హాపూర్ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా టోల్‌ను వ్యతిరేకించేందుకు ఏర్పాటైన ‘టోల్ విరోధి కృతి సమితి’ పదాధికారి నివాస్ సాలోంకే, ఛగన్ భుజ్‌బల్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టోల్ విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రారంభం సమయంలో కొల్హాపూర్ ప్రజలు పడుకున్నారా అని భుజ్‌బల్ వ్యాఖ్యానించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. భుజ్‌బల్‌కు ధైర్యం ఉంటే నాసిక్‌కు బదులు కొల్హాపూర్ నుంచి పోటీ చేసి గెలవాలని సాలోంకే సవాల్ విసిరారు.