
'భక్తులపై దాదాగిరి చెల్లదు'
నాసిక్: భక్తులపై దాదాగిరి చేయడాన్ని ఒప్పుకోబోమని ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ అన్నారు. నాసిక్ లోని కపలేశ్వర్ ఆలయంలో పూజలు చేసేందుకు తమను అనుమతించలేదని ఆమె తెలిపారు. పలువురు మహిళలతో కలిసి ఆలయ గర్భగుడిలోకివెళ్లేందుకు రెండోసారి ప్రయత్నించిన ఆమెను పూజారులు అడ్డుకున్నారు.
భక్తుల పట్ల కులవివక్ష చూపుతున్నారని తృప్తి దేశాయ్ ఆరోపించారు. గతంలో ఆలయప్రవేశానికి ప్రయత్నించినప్పుడు తాము నిమ్న కులాలకు చెందిన వారిమని చెప్పగా, పూజారులు తమను బయటకు గెంటేశారని వెల్లడించారు. ఆలయ ధర్మకర్తలు తమను గర్భగుడిలోకి అనుమతించాలని చెప్పినప్పటికీ పూజారులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు.