
నాసిక్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నాసిక్ హైవేపై న్యూ కసర ఘాట్ సమీపంలో ఒక పాల ట్యాంకర్ 300 అడుగుల దిగువకు ఒక లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ బృందం, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే వర్షం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీసింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.