milk tanker
-
Maharashtra: లోయలో పడిన పాల ట్యాంకర్.. ఐదుగురు మృతి
నాసిక్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నాసిక్ హైవేపై న్యూ కసర ఘాట్ సమీపంలో ఒక పాల ట్యాంకర్ 300 అడుగుల దిగువకు ఒక లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ బృందం, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే వర్షం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీసింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
జనంపైకి పాల ట్యాంకర్ .. ముగ్గురు మృతి, 150 మందికి గాయాలు!
సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపైనున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. వీరిలో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సిక్కింలోని రాణిపూల్‌లోని తాంబ్లా గేమ్ ఫెయిర్‌లో ఆదివారం రాత్రి 7.13 గంటలకు జరిగింది. ఆ సమయంలో రాణిపూర్ టాటా మైదానం జనంతో కిటకిటలాడింది. ఈ సమయంలో హఠాత్తుగా సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీకొని నేరుగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 150 మంది గాయపడ్డారు. సిక్కిం పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జనం హాహాకారాలు మిన్నంటాయి. CCTV footage of Sikkim Milk Union truck accident at Ranipool Mela, Sikkim pic.twitter.com/wStmjBfilp — Jyoti Mukhia (@jytmkh) February 10, 2024 -
నదిలో పొంగి పొర్లిన పాలు, కారణం తెలియక షాకైన ప్రజలు
లండన్: నదుల్లో నీరు ప్రవహించడం సర్వ సాధారణం. మరి పాలు ప్రవహిస్తే? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ .. ఓ నదిలో పాలు ప్రవహించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చూసిన వారు ఏంటీ వింత అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... దులైస్ నదిలో ఎప్పటిలానే నీరు ప్రవహిస్తూ ఉంది. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ 14వ తేదీన పాలు నదిలో ప్రవహించడం మొదలుపెట్టాయి. కారణం ఏంటంటే.. నదికి సమీపంలో ప్రమాదం జరిగి ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. సుమారు 28,000 లీటర్ల పాలు వరదలా పోటెత్తి నదిలోకి ప్రవహించాయి. దీంతో దులైస్ నది క్షీర ప్రవాహాన్ని తలపించింది. నదిలో పాల ప్రవాహాన్ని చూసిన జనాలు ఇదెక్కడి ఆశ్చర్యం అంటు షాక్‌కు తిన్నారు. ఏదో మాయలా ఉందే అని ఆ ప్రాంతంలోని కొందరు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద విషయం తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. ) -
లాక్డౌన్: సరిహద్దు దాటేందుకు పాల ట్యాంకర్
దాచేపల్లి(గురజాల): లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళుతున్న పాల వాహనంలో ముగ్గురు విద్యార్థులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ప్రకాశం జిల్లా వెళ్లేందుకు ఎక్కారు. ముందుగానే డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి ఖాళీ పాల ట్యాంకర్లో కూర్చున్నారు. పొందుగుల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ట్యాంకర్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించి తిరిగి తెలంగాణ వైపు పంపించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనం సీజ్ చేశారు. -
ట్యాంకర్ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకటేశ్వర రావు(40) గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్లో పాలు నిండుగా ఉండటంతో పాలన్నీ వృధాగా పోయాయి. సుమారు పదిహేను వేల లీటర్ల పాలు వృధాగా పోయి ఉంటాయని అంచనా. బోల్తా పడిన ట్యాంకర్ గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి ట్రేడర్స్‌కు చెందిన పాల ట్యాంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి నుంచి హైదరాబాద్‌లోని హెరిటేజ్ సంస్థకు పాలను తెస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. -
పాల ట్యాంకర్, కారు ఢీ.. ఇద్దరు మృతి
బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కాటప్పగారిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పాలట్యాంకర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తితోపాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలించారు. వీరంతా ఎస్ఆర్ పురం మండలానికి చెందిన వారు కాగా బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.