
దాచేపల్లి(గురజాల): లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళుతున్న పాల వాహనంలో ముగ్గురు విద్యార్థులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ప్రకాశం జిల్లా వెళ్లేందుకు ఎక్కారు.
ముందుగానే డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి ఖాళీ పాల ట్యాంకర్‌లో కూర్చున్నారు. పొందుగుల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ట్యాంకర్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించి తిరిగి తెలంగాణ వైపు పంపించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనం సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment