ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: కరోనా విపత్తు వల్ల రెండేళ్ల నుంచి ఆన్‌లైన్ క్లాసులకే విద్యార్థులు పరిమితమ య్యారు. అయితే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో చాలా మంది లాక్‌డౌన్ వేళ ఇంటర్‌నెట్‌లో అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూడడం అలవాటు చేసుకు న్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాదిలో పిల్లలు, టీనేజర్లు ఎక్కువ సంఖ్యలో అశ్లీల వీడియో లు చూసినట్లు సైబర్ క్రైం అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా పిల్లల పోర్న్ (అశ్లీల) వీడియో వీక్షణ లాక్‌డౌన్‌లో ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
అశ్లీల వీడియోలను చూస్తున్నట్లు నిర్ధారణ అయితే సమాచార సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. పిల్లల అశ్లీల వీడియోలు, దృశ్యాలు చూస్తే గరిష్టంగా ఐదేళ్లు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అలాగే పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పెద్దల అశ్లీల వీడియోలు చూసే వారికి మూడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా, రెండో సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ఎవరు చూసినా శిక్షే
లాక్‌డౌన్ సమయంలో కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని నెలల్లో పోర్న్ వీడియోలను చూసిన వారిని సీఐడీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మందిని ఇటీవల అధికారులు విచారించారు. ఏ మొబైల్ నుంచి వీడియోలు చూశారు, ఆ మొబైల్ యజమానిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. 18 ఏళ్ల లోపు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తే తల్లిదండ్రులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తే తల్లిదండ్రులను అరెస్టు చేసే అవకాశం ఉంది. అశ్లీల వీడియోల చూడడాన్ని నియంత్రించేందుకు సైబర్ అధికారుల సాంకేతిక బృందం సిద్ధమవుతోంది. కేవలం అశ్లీల వీడియోలు చూసే వారిని ఈ బృందం లక్ష్యంగా చేసుకుని గుర్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment