watching porn
-
పోర్న్ పరేషాన్: అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తున్న విద్యార్థులు!
సాక్షి, బెంగళూరు: కరోనా విపత్తు వల్ల రెండేళ్ల నుంచి ఆన్లైన్ క్లాసులకే విద్యార్థులు పరిమితమ య్యారు. అయితే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో చాలా మంది లాక్డౌన్ వేళ ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూడడం అలవాటు చేసుకు న్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాదిలో పిల్లలు, టీనేజర్లు ఎక్కువ సంఖ్యలో అశ్లీల వీడియో లు చూసినట్లు సైబర్ క్రైం అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా పిల్లల పోర్న్ (అశ్లీల) వీడియో వీక్షణ లాక్డౌన్లో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అశ్లీల వీడియోలను చూస్తున్నట్లు నిర్ధారణ అయితే సమాచార సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. పిల్లల అశ్లీల వీడియోలు, దృశ్యాలు చూస్తే గరిష్టంగా ఐదేళ్లు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అలాగే పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పెద్దల అశ్లీల వీడియోలు చూసే వారికి మూడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా, రెండో సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఎవరు చూసినా శిక్షే లాక్డౌన్ సమయంలో కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని నెలల్లో పోర్న్ వీడియోలను చూసిన వారిని సీఐడీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మందిని ఇటీవల అధికారులు విచారించారు. ఏ మొబైల్ నుంచి వీడియోలు చూశారు, ఆ మొబైల్ యజమానిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. 18 ఏళ్ల లోపు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తే తల్లిదండ్రులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తే తల్లిదండ్రులను అరెస్టు చేసే అవకాశం ఉంది. అశ్లీల వీడియోల చూడడాన్ని నియంత్రించేందుకు సైబర్ అధికారుల సాంకేతిక బృందం సిద్ధమవుతోంది. కేవలం అశ్లీల వీడియోలు చూసే వారిని ఈ బృందం లక్ష్యంగా చేసుకుని గుర్తిస్తోంది. -
మంత్రి చూసిన ఫొటోలు ఎవరివో తెలుసా?
బెంగళూరు: తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారిక కార్యక్రమంలో ఉండగా మొబైల్ ఫోన్ లో బూతుబొమ్మలు చూస్తూ మంత్రి మీడియాకు చిక్కారు. అయితే ఆయన అంత ఆసక్తిగా వీక్షించిన ఫొటోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాకు చెందినవని వెల్లడైంది. మెలానియా మోడలింగ్ చేసినప్పటి ఫొటోలను చూస్తూ తన్వీర్ సేఠ్ కెమెరా కంటపడడంతో ఆయనపై విమర్శలు చెలరేగాయి. ట్రంప్ విజయం సాధించడంతో మెలానియా పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా పోస్ట్ అవుతున్నాయి. ట్రంప్ ను పెళ్లాడకముందు మెలానియా మోడలింగ్ చేశారు. తన్వీర్ సేఠ్ తన మొబైల్ ఫోన్ లో మెలానియా ఫొటోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారని ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్‌తో పాటు కెమెరామెన్‌పై మంత్రి తన్వీర్ సేఠ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన్వీర్ సేఠ్ ను కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వివరణ అడిగారు. -
‘అశ్లీల చిత్రాల’ వ్యవహారంలో మరో ట్విస్ట్
బెంగళూరు: మొబైల్లో అశ్లీల చిత్రాలను చూస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోయిన కర్ణాటక ప్రాథమిక శాఖమంత్రి తన్వీర్ సేఠ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్‌తో పాటు కెమెరామెన్‌పై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 504 కింద టీవీ రిపోర్టర్, కెమెరామెన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మొదట నివేదికను పరిశీలించాక దీనిపై విచారణ జరిపించి అనంతరం చర్య తీసుకుంటామన్నారు. అశ్లీల దృశ్యాల వీక్షణపై మంత్రితో మాట్లాడానని, తాను ఏ తప్పు చేయలేదని తన్వీర్ సేఠ్ తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పు జరిగితే అది ఎవరు చేసినా తప్పు తప్పేనని సిద్ధరామయ్య అన్నారు. కాగా రాయ్‌చూర్ జిల్లాలో నిర్వహించిన టిప్పుసుల్తాన్ జయంతి సందర్భంగా గురువారం మంత్రి తన్వీర్ సేఠ్ సెల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ మీడియాకు దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన్వీర్ మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.... బీజేపీతో పాటు జేడీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏముంటుందని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తన్వీర్ తేల్చిచెప్పారు. అలాగే ఈ ఘటనపై మాజీ ప్రధాని దేవగౌడ స్పందిస్తూ... తన్వీర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మొబైల్ లో అభ్యంతరకర ఫోటోలు చూస్తు దొరికిపోయిన మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని, దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. -
నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్ సేఠ్ తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. మొబైల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడ్డారు. టిప్పు జయంతి సందర్భంగా గురువారం రాయచూరలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ఘనకార్యం చేశారు. ఈ విషయం అన్ని వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో సిద్ధరామయ్య సర్కారు ఇరకాటంలో పడింది. తన చర్యను తన్వీర్ సేఠ్ సమర్థించుకున్నారు. ‘తను ఇల్లు విడిచి మూడు నెలలు అయింద’ని నిసిగ్గుగా సమాధానం ఇచ్చారు. తర్వాత మాట మార్చారు. మైసూరుకు చెందిన తాను అక్కడ జరిగిన టిప్పు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చూసినట్టు బుకాయించారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తన్వీర్ సేఠ్ వ్యవహారంపై సిద్ధరామయ్యను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నివేదిక అడినట్టు సమాచారం. కాగా, రాయచూర నుంచి కలబుర్గి జిల్లా చించోళి వద్ద జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళుతున్న తన్వీర్ సేఠ్ ను బీజేపీ కార్యకర్తలు ఘోరావ్ చేశారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అసెంబ్లీలో పోర్న్ వీడియో.. ఎమ్మెల్యే సస్పెన్షన్
భువనేశ్వర్: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే చేసిన నిర్వాకం బయటపడింది. ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ కిశోర్ దాస్ తన మొబైల్ ఫోన్లో నీలిచిత్రాలు చూశారు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డయింది. దీంతో అసెంబ్లీ నుంచి దాస్‌ను ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో ఇంటర్నెట్ వాడిన మాట వాస్తమేనని, అయితే పోర్న్ వీడియోలను చూడలేదని దాస్ చెప్పారు. వెబ్ పేజీ ఓపెన్ చేస్తుండగా అకస్మాత్తుగా యూ ట్యూబ్‌లో పోర్న్ వీడియో ప్లే అయిందని తెలిపారు. ఇలాంటి వీడియోలను తాను ఎప్పుడూ చూడనని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని దాస్ చెప్పారు. కాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, దాస్‌పై చర్యలు తీసుకోవాలని అధికార బిజూ జనతాదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం దాస్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు.