అసెంబ్లీలో పోర్న్ వీడియో.. ఎమ్మెల్యే సస్పెన్షన్ | Congress MLA caught watching porn in Odisha Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో పోర్న్ వీడియో.. ఎమ్మెల్యే సస్పెన్షన్

Published Tue, Dec 15 2015 11:58 AM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

అసెంబ్లీలో పోర్న్ వీడియో.. ఎమ్మెల్యే సస్పెన్షన్ - Sakshi

అసెంబ్లీలో పోర్న్ వీడియో.. ఎమ్మెల్యే సస్పెన్షన్

భువనేశ్వర్: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే చేసిన నిర్వాకం బయటపడింది. ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ కిశోర్ దాస్ తన మొబైల్ ఫోన్లో నీలిచిత్రాలు చూశారు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డయింది. దీంతో అసెంబ్లీ నుంచి దాస్ను ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు.  

అసెంబ్లీలో ఇంటర్నెట్ వాడిన మాట వాస్తమేనని, అయితే పోర్న్ వీడియోలను చూడలేదని దాస్ చెప్పారు. వెబ్ పేజీ ఓపెన్ చేస్తుండగా అకస్మాత్తుగా యూ ట్యూబ్లో పోర్న్ వీడియో ప్లే అయిందని తెలిపారు. ఇలాంటి వీడియోలను తాను ఎప్పుడూ చూడనని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని దాస్ చెప్పారు.  కాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, దాస్పై చర్యలు తీసుకోవాలని అధికార బిజూ జనతాదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం దాస్ను సభ నుంచి సస్పెండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement