నాలుగు రోజులు ముందుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడంపట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను తీవ్రంగా విమర్శించాయి.
ఒడిశా: నాలుగు రోజులు ముందుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడంపట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను తీవ్రంగా విమర్శించాయి. సభలో ఆయనొక సున్నా అని ఆరోపించాయి.
హీరోలను బయటకు పంపించి సున్నాగా సభలో ఉండిపోయి ముఖ్యమైన అంశాలపై చర్చ లేకుండానే తప్పించుకున్నారని మండిపడ్డాయి. చిట్ ఫండ్ కుంభకోణం వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు సభలో చర్చించేందుకు ఉన్నాయని, సభను నిర్వహించాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేసుకున్నా ఆ మాట పెడచెవిన ముఖ్యమంత్రి సభను వాయిదా వేయించారని ఆరోపించారు.