adjournment
-
పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. లోక్‌సభ వాయిదా
ఢిల్లీ : లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే క్రమంలో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దాంతో లోక్‌సభ మార్చి 10 వరకూ వాయిదా పడింది. ఈ ఆదాయపు పన్ను కొత్త బిల్లు సెలక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపనున్నారు.కొత్త బిల్లు పన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని తీసుకొచ్చారు. టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం పరిగణించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ గతంలోలాగే ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాలతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర ధరలపై వైఎస్సార్సీపీ శాసనమండలిలో వాయిదా తీర్మానం కోరింది. శుక్రవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభమవగానే ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, మంగమ్మ, కల్పలతలు నిత్యావసర ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్ద నిలబడి ఈ అంశంపై చర్చ జరపాలని మండలి చైర్మన్‌ను కోరగా, ప్రస్తుతం ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఇదే అంశంపై చర్చను కోరితే అనుమతి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మలు ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల ఏర్పాటు కోరుతూ మరో వాయిదా తీర్మానం కోరగా, చైర్మన్ తిరస్కరించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.అసలు ఈ అప్పీల్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.చదవండి: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు -
వైవాహిక అత్యాచారం కేసుల విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది. కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది. మైనర్కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్‌గా పరిగణించబోరు. అలాగే బీఎన్ఎస్లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు. మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.చదవండి: బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే -
7 రోజులు 34 గంటలు.. ముందుగానే వాయిదా!
ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదాతో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన రెండు రోజుల చర్చకు మంగళవారం ప్రధాని మోదీ బదులిచ్చాక సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.The First Session of the 18th Lok Sabha, which commenced on 24 June, 2024, concluded on July 2. Speaker Om Birla informed that the First Session comprised 7 sittings and lasted for about 34 hours. He informed that Lok Sabha recorded 103% productivity during the Session: Lok Sabha…— ANI (@ANI) July 3, 2024 ఈ సమావేశాలు మొత్తం 7 రోజుల్లో 34 గంటల పాటు చర్చలు జరిగాయి. 103 శాతం ఉత్పాదకత(productivity) నమోదైనట్లు స్పీకర్ ఓ బిర్లా తెలిపారు. జూన్ 24న మొదలైన పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం బుధవారం దాకా జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు.Speaker Om Birla informed the House that the discussion on the Motion of Thanks to the President's Address on 27 June lasted for more than 18 hours and 68 Members participated in the discussion. In addition, 50 Members laid their speeches. The discussion concluded with the reply…— ANI (@ANI) July 3, 2024‘రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జూన్ 27న 18 గంటలపాటు చర్చ జరిగింది. ఈ చర్చలో 68 మంది పాల్గొన్నారు. 50 మంది సభ్యులు మాట్లాడారు. మంగళవారం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పటంతో చర్చ ముగిసింది’ అని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. -
స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్‌సభలో దుమారం
ఢిల్లీ: స్పీకర్ ఎన్నిక జరిగిన కాసేపటికే లోక్‌సభలో ఇవాళ గందరగోళం నెలకొంది. స్పీకర్‌గా తిరిగి ఎన్నికైన ఓం బిర్లా సభలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో దుమారం రేగింది.బుధవారం ఉదయం మూజువాణీ ఓటింగ్ ద్వారా ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గెలిచి.. స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు అధికార, విపక్ష కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా తొలి ప్రసంగం చేస్తూ.. ఎమర్జెన్సీ పాలనను ప్రస్తావించారు. ఎమర్జెన్సీ పాలన చీకటీ రోజలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో అధికార పక్ష సభ్యులు సైతం పోటీగా నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. తిరిగి రేపు( జూన్ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రేపు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తెలిపారు. తమ కౌంటర్ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు. -
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడా నికి వీలుగా శనివారం ప్రభుత్వం నిర్వహించతల పెట్టిన మంత్రివర్గ సమావేశం అనివార్య పరిస్థి తుల్లో వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వేయిదా వేసినట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాలనపై దృష్టి పెడతామన్న సీఎంరాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియగా, వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో రెండు నెలలుగా పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. సీఎం, మంత్రుల రోజువారీ అధికారిక సమీక్షలు, సమావేశాలు బంద్ అయ్యా యి. ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఒడిశా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముంబై నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయ్‌బరేలి నుంచి సీతక్క నగరానికి చేరుకున్నారు. ఏక్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచిచూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. ఒకపక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఎజెండాలో కీలక అంశాలుజూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తికా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉండి పోయిన విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొను గోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి గాను మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మ తులు, ఈ విషయమై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది. అవసరమైతే ఈసీని కలుస్తాం: సీఎం రేవంత్ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రానిపక్షంలో, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు. అప్పటికీ ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం పేర్కొన్నారు. -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
సింగరేణి ఎన్నికల వాయిదాకు నో
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గురింపు సంఘం ఎన్నికల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గతంలో చెప్పిన విధంగా డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించాలని స్పష్టంచేసింది. ఎన్నికల వాయిదా కోరుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్ర స్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావా లంటూ యాజమాన్యం సెపె్టంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని చెప్పింది. వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికల సంఘం పలు భేటీలు నిర్వహించనుందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ఎన్నికల వాయిదాకు నిరాకరిస్తూ అక్టోబర్ 28న నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్సీసీఎల్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై నాడు విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. వాయిదాకు అంగీకరిస్తూ, డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున నాడు విచారణకు హాజరైన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) కూడా ఎన్నికలు డిసెంబర్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ప్రభుత్వం అక్టోబర్‌లో సమ్మతించింది.. డిసెంబర్ 27న కూడా ఎన్నికలు నిర్వహించలేమని, మార్చి వరకు వాయిదా వేయాలని కోరుతూ గత వారం ప్రభుత్వం ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొద్ది రోజుల క్రితమే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పోలీస్ అధికారుల బదిలీలు చేపడుతోందన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తు అత్యంత కీలకమని, ఈ క్రమంలో ఇప్పటికిప్పుడే కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమంటూ వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. అక్టోబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు నిరాకరించింది. అక్టోబర్‌లో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమ్మతిస్తూ తమకు హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ హామీ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. -
Parliament security breach: పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు తేలి్చచెప్పారు. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగంతకులకు విజిటర్ పాసులు ఇచి్చన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్చలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతించాలంటూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదేపదే కోరినా వినిపించుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడకపోవడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. గురువారం సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ అలా... లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. భద్రతా లోపాన్ని లేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకీ ప్రకటించారు. రాజ్యసభ ఇలా... ఎగువ సభలోనూ విపక్షాలు అలజడి సృష్టించాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నుంచి నినాదాల హోరు మొదలైంది. హోంమంత్రి అమిత్ షా సభకు వచి్చ, సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. సభలో స్టాండింగ్ కమిటీ నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రతా లోపంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అంగీకరించలేదు. భద్రతా లోపంపై రాజ్యసభలో చర్చ కోసం పట్టుబడుతూ విపక్షాలు ఇచి్చన 23 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్ చర్చను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా ప్రయతి్నంచగా, చైర్మన్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు. విపక్ష ఎంపీలు నినాదాలు జోరు పెంచడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో అలజడి తగ్గలేదు. సభా కార్యకలపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్కచేయలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. అది మా బాధ్యత: ఖర్గే దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై గళం వినిపించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత, పార్లమెంటరీ విధి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. విపక్ష ఎంపీలను చట్టవ్యతిరేకంగా నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన 14 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. గురువారం రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై మాత్రం చర్యల్లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్లాన్ బీ కూడా ఉంది..! పార్లమెంట్లో అలజడికి కుట్ర పన్నిన లలిత్ ఝా బృందం, ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుంది. విచారణలో లలిత్ ఈ మేరకు వెల్లడించాడు. నీలమ్, అమోల్ పార్లమెంట్ వద్దకు చేరుకోలేకుంటే ముకేశ్, కైలాశ్ మరో మార్గంలో చేరుకుని మీడియా కెమెరాల ఎదుట నినాదాలిస్తూ పొగ గొట్టాలను పేల్చాలనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విక్కీ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్, నీలమ్ మాత్రమే వచ్చారు. మహేశ్, కైలాశ్ రాలేకపోయారు. బూట్లలో పొగ గొట్టాలు లోక్‌సభలో ప్రయోగించిన పొగ గొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకొని సభలోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వారినుంచి స్వా«దీనం చేసుకున్న కరపత్రాల్లో కరపత్రాల్లో మణిపూర్ హింసాకాండపై నినాదాలున్నట్లు తెలిపారు. -
Fiber Case: బహిరంగ ప్రకటనలు చేయొద్దు: బాబుకు సుప్రీం హెచ్చరిక!
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్ కేసులో సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన న్యాయస్థానం.. చంద్రబాబు గనుక అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని కోరింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారం సుప్రీం కోర్టు వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో 17ఏ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన అనంతరమే ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అధికారంలో ఉండగా.. ఫైబర్‌నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
‘ఇండియా’ భేటీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున బుధవారం జరగాల్సిన భేటీకి రాలేకపో తున్నట్లు కూటమిలోని కొన్ని పార్టీల నేతలు అశక్తత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో బుధవారం సాయంత్రం తలపెట్టిన సమావేశం మాత్రం కొనసాగనుంది. కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారంలో అందరికీ అనుకూలమైన తేదీలో జరగనుందని ‘ఇండియా’ ప్రచార కమిటీ సభ్యుడు గుర్దీప్ సప్పాల్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. బుధవారం జరగాల్సిన భేటీకి తాము రాలేకపోతున్నట్లు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బిహార్ సీఎం, జేడీయూ నితీశ్ కుమార్ అనారోగ్య కారణాలతో, తమిళనాడు సీఎం స్టాలిన్ తమ రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారని సప్పాల్ వివరించారు. -
‘ఉమ్మడి ఆస్తుల’పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పలు అంశాల నేపథ్యంలో పిటిషన్‌ను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
అభిషేక్ బోయినపల్లి బెయిల్ కేసు డిసెంబర్ 4కు వాయిదా
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు బోయినపల్లి అభిషేక్ బెయిల్ కేసును సుప్రీం కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది. అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కన్నా , జస్టిస్ ఎస్ ఎన్ వి భట్టి ధర్మాసనం.. ఈ కేసులో సెక్షన్ 19 పై లోతుగా విచారణ చేస్తామని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని అభిషేక్ పిటిషన్ దాఖలు చేశాడు. లిక్కర్ కుంభకోణంలో ఇండో స్పిరిట్ నుంచి 3.85 కోట్ల రూపాయల ముడుపులు అభిషేక్ బోయినపల్లికి ముట్టినట్లు సాక్షాలు ఉన్నాయని ఈడి తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 19 పై లోతుగా విచారణ చేస్తామని తెలిపిన ధర్మాసనం.. ఈలోగా ఇరుపక్షాలు తమ ప్లీడింగ్స్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం
సాక్షి, న్యూఢిల్లీ: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా ట్రిబ్యునల్–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాల (టీవోఆర్)ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ అక్టోబర్ 6న కృష్ణా ట్రిబ్యునల్–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాలపై తదుపరి చర్యలు లేకుండా నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. జల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం జల వివాదాల ట్రిబ్యునల్‌కే ఉందని, ఏపీ ప్రభుత్వం పిటిషన్లో లేవనెత్తిన అంశాలు ఆర్టికల్ 262 పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్టికల్ 32 కింద కాకుండా ఆర్టికల్ 131 ప్రకారం పిటిషన్ దాఖలు చేయాల్సిందని వైద్యనాథన్ పేర్కొన్నారు. పిటిషన్‌కు మెయింటైన్‌బిలిటీ లేదంటూ అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాథమిక అభ్యంతరాలను కౌంటర్ అఫిడవిట్లో పేర్కొనాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ న్యాయవాది మెరిట్స్‌లోకి వెళ్తున్నారని, ఆ అవసరం లేదని, ట్రిబ్యునల్ టీవోఆర్‌పై స్టే విధించాలని కోరారు. ఈ సమయంలో కేంద్రం తరఫు న్యాయవాది వారం రోజులు గడువు ఇస్తే అభిప్రాయం చెబుతామని ధర్మాసనాన్ని కోరారు. మెరిట్స్‌పై వాదించడానికి సిద్ధంగా ఉన్నామని, స్టే విధించొద్దని వైద్యనాథన్ కోరగా.. అయితే తాము కూడా మెరిట్స్‌పై వాదనకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ, కేంద్రం కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ కార్యకలాపాలు కొనసాగడం అనేది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ట్రిబ్యునల్ ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ నెల 29న చేపడతామని ధర్మాసనం పేర్కొంది. -
కోర్టుల్లో కేసుల వాయిదాలు.. సీజేఐ అసహనం
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసులు పదేపదే వాయిదా పడటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కేసుల్ని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్ధేశాన్ని దెబ్బతిస్తుందని అన్నారు. అవసరమైతే తప్ప కేసులను వాయిదా కోరవద్దని న్యాయవాదులకు సూచించారు. సుప్రీంకోర్టు 'తారిఖ్ పే తారిఖ్ కోర్టు'గా మారడం తమకు ఇష్టం లేదని అన్నారు. సుప్రీంకోర్టులో వాయిదా కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ శుక్రవారం సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకు 3,688 కేసుల్లో న్యాయవాదులు విచారణ వాయిదా కోరారని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఒక్క రోజే(నవంబర్3) 178 కేసుల్లో వాయిదాలు వచ్చాయని తెలిపారు కోర్టులు వాయిదాల మీద వాయిదాలు(తారీఖ్-పే-తారీఖ్ కోర్టు) వేసే వాటిగా ఉండాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు. ఇది పౌరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుందని తెలిపారు. రెండు నెలల్లోనే 3.688 కేసుల్లో వాయిదా పడటం వల్ల ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ‘తారిఖ్ పర్ తారిఖ్ కోర్టు’ ఏంటిది? ఇక తారిఖ్ పర్ తారిఖ్ కోర్టు అనేది బాలీవుడ్ సినిమా ‘దామిని’ లోని డైలాగ్. ఈ చిత్రంలో న్యాయవాదిగా నటించిన సన్నీ డియోల్.. అత్యాచార బాధితురాలి తరఫున కేసు వాదిస్తారు. నిందితుడి తరఫు న్యాయవాది తన క్లైంట్‌ను కేసు నుంచే తప్పించే ఉద్దేశంతో పదే పదే వాయిదాలు కోరగా.. "tareek peh tareek" అనే పదాన్ని సన్నీ ఉపయోగిస్తాడు. ఈ డైలాగ్‌నే సీజేఐ ప్రస్తావించారు. చదవండి: ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్: విస్తారా రియాక్షన్ -
చంద్రబాబుకు సుప్రీంలో నో రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 9వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వద్దకు రాగా చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు కాగా ఒకటి తీర్పు రిజర్వు అయిందని నివేదించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు వెలువడే వరకు ఈ కేసులో వేచి చూద్దామా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా, ఆ విషయాన్ని ధర్మాసనానికే వదిలేస్తున్నట్లు లూథ్రా బదులిచ్చారు. అయితే, చంద్రబాబుకు మధ్యంతర రక్షణ కొనసాగించాలని లేదంటే ఈ పిటిషన్‌కు కాలపరిమితి ముగిసిపోతుందన్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ఒక వ్యక్తి ఒకసారి కస్టడీలో ఉన్నప్పుడు మరోసారి అరెస్టు ఉత్పన్నం కాదని, జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని తెలిపారు. ఇదే అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు చెప్పారు. స్కిల్ కేసులో తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నందున ప్రశ్నించుకోవచ్చని జస్టిస్ బోస్ పేర్కొనగా, ఇంటరాగేషన్ చేయాలంటే కోర్టు అనుమతి అవసరమని, సెక్షన్ 267 కింద వారెంటు జారీ చేశామని రంజిత్ కుమార్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాతే పోలీసు కస్టడీని కోరగలమన్నారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇదంతా అబద్ధమని, చట్టాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. సెప్టెంబరు 9న కస్టడీలో తీసుకున్న నాటి నుంచి చంద్రబాబును ఏ ప్రశ్నా అడగలేదన్నారు. ఈ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ ముందస్తు బెయిలుపై నవంబరు 8న విచారిస్తామని తొలుత ప్రకటించారు. అయితే విచారణను నవంబరు 9కి వాయిదా వేయాలని సిద్ధార్థ లూథ్రా అభ్యర్థిచడంతో న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై తొలుత తీర్పు వెలువరిస్తామని, తర్వాత ఈ అంశాన్ని పరిగణిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు చంద్రబాబు అరెస్టు ఉండదని తెలిపింది. కాగా, ఈ నెల 29వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తీర్పు ఆ తర్వాతే వెలువడే అవకాశం ఉంది. -
టీఆర్టీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ను ప్రభుత్వం వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,089 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా గత నెల టీఆర్టీ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ 80 వేల మంది టీఆర్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పరీక్ష నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. ఇందుకోసం వారు ముందే సమాయత్తం కావాల్సి ఉంటుంది. మరోవైపు పరీక్ష రాసే అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్తారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పరీక్ష వాయిదాకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించడంతో విద్యాశాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. నిరుద్యోగులను మోసగించడమే : ఏఐఎస్ఎఫ్ ఎన్నికలు వస్తున్నాయని తెలిసీ నియామక ప్రక్రియను అందుకు అనుగుణంగా చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శాఖ విమర్శించింది. ఎన్నికలను బూచిగా చూపించి టీఆర్టీ వాయిదా వేయడం నిరుద్యోగులను మోసగించడమేనని పేర్కొంది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. టీచర్ల నియామకంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వారు ఆరోపించారు. మొదట్నుంచీ కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ఏబీవీపీ విమర్శించింది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. -
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. శుక్రవారానికి(13వ తేదీ) మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘17A.. అవినీతి పరులను కాపాడుకోవడం కోసం కాదు. నిజాయితీ పరులను కాపాడుకోవడం కోసమే. చంద్రబాబుకు 17ఏ వర్తించదని’’ ముకుల్ రోహత్గీ వాదించారు. యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావన.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. చంద్రబాబుకి వర్తించదు: రోహత్గీ 2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ‘‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు. 2014-15 మధ్య ఈ స్కాం జరిగింది. 2018 లో 17A రాకముందే నేరం జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు. 2021లోనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా, 2023లో బాబు అరెస్ట్ జరిగింది. జిఎస్టీ పుణె ఫిర్యాదు ఆధారంగా కేసు ప్రారంభమైంది. దీని రిఫరెన్స్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. 17-A తెచ్చింది నిందితుల రక్షణ కోసం కాదు, నిజాయితీ కల అధికారుల రక్షణ కోసమే. 17-A గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకోలేరు, నిజాయితీ పరులకు ఇది సహాయపడుతుంది. ప్రభుత్వ విధుల్లో దుర్వినియోగం చేశారా ? లేదా అన్నది విచారణలోనే తేలుతుంది ’’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వాదనలు సుదీర్ఘంగా కొనసాగగా.. సమయం సరిపోదని, మిగతా వాదనలు వచ్చే విచారణలో వింటామని తెలిపింది. ఇక.. తదుపరి విచారణకు హరీష్ సాల్వే వర్చువల్‌గా హాజరు కానున్నట్లు తెలిపారు. సాక్షి వాట్సాప్ ఛానెల్‌తో ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్‌లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్‌లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ, అక్టోబర్ 3కు వాయిదా
-
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 26కి వాయిదా
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ 2022 లో నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సురేష్‌రెడ్డి విచారణ జరిపారు. చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈరోజే (గురువారం) విచారణ జరపనుందని, అందువల్ల ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోర్టును కోరారు. సీఐడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యడవల్లి నాగ వివేకానంద స్పందిస్తూ.. పీటీ వారెంట్‌తో పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ కూడా పిటిషన్ వేశామని చెప్పారు. ఏసీబీ కోర్టులో ఉన్న వ్యాజ్యాల విచారణకు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ అడ్డంకి కాదని ఉత్తర్వుల్లో నమోదు చేయాలని కోర్టును కోరారు. విచారణను వాయిదా వేయడానికి అభ్యంతరం లేదన్నారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. సోమవారం తాను ఇతర కేసుల్లో వాదనలు వినిపించాల్సి ఉన్నందువల్ల విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యే మార్గంగా విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆరోజు మద్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతానని చెప్పారు. ఈ బెయిల్ పిటిషన్ ప్రభావానికి లోను కాకుండా ఏసీబీ కోర్టు తన ముందు వ్యాజ్యాల్లో విచారణను కొనసాగించవచ్చునని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తేల్చి చెప్పారు. -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
Manipur violence: మోదీ నోరు విప్పాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు తమ డిమాండ్‌పై మెట్టు దిగడం లేదు. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభలో ఆందోళనలు, నినాదాలు, నిరసనలు, వాయిదాలు నిత్యకృత్యంగా మారాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తొమ్మిదో రోజు బుధవారం సైతం ఉభయ సభలను స్తంభింపజేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండడంతోపాటు విపక్ష, అధికారపక్ష సభ్యుల తీరుతో కలత చెందిన స్పీకర్ ఓం బిర్లా బుధవారం లోక్‌సభకు రాలేదు. సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ ఆరాటపడుతున్నారని, సభ్యుల నుంచి సహకారం లభించక కలతతో సభకు హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సమాధానం చెబుతా: అమిత్ షా లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ ఓం బిర్లా రాకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డి సభాపతి స్థానంలో కూర్చొని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే విపక్ష ఎంపీలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ప్యానల్ స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై చర్చ ప్రారంభిద్దామని, తాము సమాధానం చెబుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించగా, విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానమంత్రి రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈసారి సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకీ సభకు సహకరించాలంటూ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు కిరీట్ సోలంకీ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సులే స్పీకర్‌తో సమావేశమైనట్లు తెలిసింది. మోదీని ఆదేశించలేను: ధన్‌ఖఢ్ మణిపూర్ హింసపై రూల్ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. వాటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో కనీవినీ ఎరుగని హింస జరుగుతోందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ౖవిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం చెప్పారు. ఈ దీనిపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేలి్చచెప్పారు. మణిపూర్ వ్యవహారంపై రూల్ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. సభనుంచి వాకౌట్ చేశారు. ఖర్గే, శరద్ పవార్‌తో ధన్‌ఖడ్ భేటీ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పార్లమెంట్‌లోని తన చాంబర్లో సమావేశమయ్యారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో జరుగుతున్న విపక్షాల రగడపై చర్చించారు. సభా సజావుగా సాగేలా సహకారం అందించాలని కోరారు. ‘మణిపూర్’పై ప్రకటన చేసేలా మోదీని ఆదేశించండి 31 మంది ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు బుధవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. మణిపూర్ హింసపై పార్లమెంట్లో ప్రకటన చేసేలా ప్రధాని మోదీని ఆదేశింంచాలని కోరుతూ వినతి పత్రం సమరి్పంచారు. హింసకు స్వస్తి పలికి, సోదరభావాన్ని పెంచుకోవాలని ప్రధానే స్వయంగా ప్రజలకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. హరియాణా ఘర్షణలను కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. మణిపూర్‌పై చర్చ విపక్షాలకు ఇష్టం లేదని, అందుకే సభ జరగకుండా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. -
పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్‌లో అమాయకులు బలైపోతున్నా ప్రధానమంత్రి ఎందుకు నోరువిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం సైతం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో తక్షణమే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. కార్యకలాపాలేవీ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో 3 బిల్లులకు ఆమోదం లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. 1978 మే 10న కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చ చేపట్టవచ్చని తేలి్చచెప్పారు. సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది. ఇదేమన్నా స్టేజీయా: చైర్మన్ ఆగ్రహం మణిపూర్ తదితర అంశాలపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. 47 మంది ఎంపీలు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల ప్రాధాన్యతను వివరిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకున్నారు. అది తమకు తెలుసని, మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది నాటక రంగం కాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓబ్రెయిన్ బల్లపై చేతితో గట్టిగా కొడుతూ అరిచారు. ఆయన తీరును తప్పుబడుతూ సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. -
సుప్రీంలో అమరావతి కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: అమరావతి రాజధాని కేసు విచారణను దేశసర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్‌కు వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనం కేసులన్న నేపథ్యంలో.. ఈ కేసుకు త్వరగా సమయం కేటాయించలేమని పేర్కొంది. ఈలోపు ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఏపీ హైకోర్ట్ ఆదేశాలపై గత విచారణలో సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం, ప్రతివాదులకూ నోటీసులు ఇచ్చిన సుప్రీం. ఇక గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసఫ్ రిటైర్ కావడంతో నూతన ధర్మసనానికి కేసు బదిలీ అయ్యింది. అయితే రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇప్పడు ఈ కేసుల విచారణను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని.. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని.. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమని.. అన్నింటికీ మించి తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది. అలాగే.. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు కొందరు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలన్నీ సూచించాయి కూడా. ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఏమంటే.. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ. 2000 కోట్లు పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది. -
వైఎస్ సునీత పిటిషన్ పై విచారణ జులై 3కు వాయిదా
-
అదే తేదీల్లో మహా కుంభాభిషేకానికి ఆదేశాలివ్వలేం
సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో, తిరిగి అదే తేదీల్లో నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమయం తక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిపింది. భక్తులు ఎక్కువగా వచ్చే కార్తీక మాసంలో మహా కుంభాభిషేకం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యంలో కొన్ని అంశాలపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. మహా కుంభాభిషేకాన్ని కొనసాగించేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎవరిని సంప్రదించి వాయిదా వేశారు తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖను, దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలు జరిపేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీరశైవ ధర్మాక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ కృష్ణమోహన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ పండితులను సంప్రదించకుండానే మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వాయిదా వేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పూజాదికాల్లో జోక్యం చేసుకునే అధికారం కమిషనర్‌కు లేదన్నారు. దేవదాయ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేశామన్నారు. విజయవాడలో నిర్వహించిన యజ్ఞానికి ఎండ తీవ్రత కారణంగా భక్తులు అనుకున్న స్థాయిలో రాలేదని, ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే దేవస్థానం అధికారులతో మాట్లాడి, కంచి పీఠాధిపతి అనుమతి తీసుకున్న తరువాతే కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహా కుంభాభిషేకానికి ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే జరిగాయని దేవస్థానం తరఫు న్యాయవాది రమణరావు కోర్టుకు నివేదించారు. వాయిదా వల్ల ఆ ర్థిక నష్టం ఏమీ జరగదన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేశామే తప్ప, రద్దు చేయలేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో కొన్ని ఆదేశాలిస్తామంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
సీబీఐ కోర్టులో వివేకా కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణను జూన్ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణను జూన్‌కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇక వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయొచ్చని సీబీఐకి తెలిపింది. అయితే.. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు గంగిరెడ్డి బెయిల్ రద్దు అమలులో ఉంటుందని, కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం. ఇదీ చదవండి: ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అత్యుత్సాహం -
ఏపీ భవన్ విభజన సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందించింది హోంశాఖ. అయితే సమావేశం వాయిదాకి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఇదివరకే హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఇదీ చదవండి; ‘లింక్’ కోసం డబ్బులా? -
విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్ చౌక్ దాకా ‘తిరంగా మార్చ్’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో సోనియాగాంధీతో పాటు ఎంపీలంతా త్రివర్ణ పతాకం చేబూని నినాదాలు చేస్తూ సాగారు. తమ ఐక్యతను పటిష్టపరుచుకుంటూ మోదీ సర్కారుపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని వారంతా ప్రకటించడం విశేషం! విపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడమే గాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోరాడతామని ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. అదానీ ఉదంతం, కులగణన ఎన్నికల్లో విపక్షాలకు ప్రధానాంశాలుగా మారతాయా అని ప్రశ్నించగా అన్ని పార్టీల అధ్యక్షులూ చర్చించుకుని వాటిపై నిర్ణయానికి వస్తారని బదులిచ్చారు. కులగణన తమ ఎజెండాలో అతి ముఖ్యమైన అంశమన్నారు. లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన మర్యాదపూర్వక విందును విపక్ష నేతలు సంయుక్తంగా బహిష్కరించారు. తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో 19 పార్టీల నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు! మోదీ సర్కారుది అహంభావపూరిత వైఖరి అంటూ దుయ్యబట్టారు. అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్, బీఆర్ఎస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, మీడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. మాటల్లోనే ప్రజాస్వామ్యం: ఖర్గే రాజ్యాంగం, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా పోరాడుతున్నామని ఖర్గే ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ‘‘అదానీ అవినీతిపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవాలని బీజేపీ ఆశించింది. అందుకు విపక్షాలను బాధ్యులను చేయజూడటం దారుణం. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల చర్చతో ఆమోదించడమా? సభల్లో ఎన్నిసార్లు నోటీసులిచ్చినా విపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇలా జరగడం నా 52 ఏళ్ల ప్రజా జీవితంలో తొలిసారి. 19 విపక్షాల్లో 18 పార్టీలు అదానీ అంశంపై కేంద్రాన్ని నిలదీశాయి. ఆయన సంపద కేవలం రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని పట్టుబట్టాయి. సభలో బీజేపీదే పూర్తి మెజారిటీ. జేపీసీ వేసినా ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. అయినా విచారణకు వెనకాడుతున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై’’ అన్నారు. అదానీతో మోదీకి, బీజేపీకి అక్రమ బంధం ఉందని ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడగానే వాయువేగంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ బీజేపీ అమ్రేలీ ఎంపీకి మూడేళ్ల జైలు శిక్ష పడి 16 రోజులైనా ఆయనపై వేటు వేయలేదు’’ అని మండిపడ్డారు. విపక్షాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మా ఐక్యతను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మేం నానాటికీ బలపడుతున్నాం. మ మ్మల్ని విడదీసేందుకు బీజేపీ చేసిన ప్ర యత్నాలు విఫలమయ్యాయి. దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలో అంతా కలిసి నిర్ణయించుకుంటాం. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది ప్రశ్న కాదు – కె.కేశవరావు, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఊరుకుంటామేమో గానీ అదానీపై నిలదీస్తే మాత్రం సహించబోమని బీజేపీ తన ప్రవర్తనతో రుజువు చేసింది. – సంజయ్‌సింగ్, ఆప్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. అధికార పక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడాన్ని తొలిసారిగా చూశాం – టి.ఆర్.బాలు, డీఎంకే -
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
20 సెకన్లకే.. లోక్‌సభ వాయిదా
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇవాళ(మంగళవారం) మొదలైన కాసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి. ప్రారంభమైన 20 సెకండ్లకే లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడడం విశేషం. అదానీ వ్యవహారంపై జాయింట్‌పార్లమెంటీ కమిటీని పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డిపై పేపర్లు చించివేశారు విపక్షాల సభ్యులు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారాయన. మరోవైపు పెద్దల సభ(రాజ్యసభ)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. #BudgetSession: #LokSabha adjourned till 2:00 PM pic.twitter.com/qZksUIX54s — SansadTV (@sansad_tv) March 28, 2023 -
అట్టుడికిన పార్లమెంటు
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు మొదలుకుని పలు అంశాలపై పార్లమెంటు సోమవారం అట్టుడికిపోయింది. విపక్ష సభ్యుల ఆందోళనలు, డిమాండ్లు, నినాదాలతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. పెద్దగా ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండానే మరోసారి వాయిదాపడ్డాయి. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ ఉదయం సమావేశమవుతూనే కాంగ్రెస్, విపక్ష సభ్యులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని నినాదాలతో హోరెత్తించారు. అదానీ అవకతవకలపై జేపీసీ దర్యాప్తు కోరుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కుర్చీపైకి కాగితాలు విసిరారు! సభాధ్యక్షులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో ఉభయ సభలూ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌పై వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్ష సభ్యులంతా నల్ల దుస్తులు ధరించి సభలకు హాజరయ్యారు. అంతకుముందు ఈ అంశంపై వ్యూహరచనకు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ సమావేశమై చర్చించాయి. ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఎలాంటి చర్చలూ చేపట్టకుండానే ఆర్థిక బిల్లు–2023ను, జమ్మూ కశ్మీర్ బడ్జెట్, పలు ఇతర బిల్లులను రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించి లోక్‌సభకు తిప్పి పంపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిపై చర్చకు 10 గంటల సమయాన్ని సభ్యులు వినియోగించుకోలేదంటూ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వెలిబుచ్చారు. గత వారం లోక్‌సభ కూడా ఈ బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించడం తెలిసిందే. మోదీకి ఎందుకంత భయం? ‘‘ప్రధాని మోదీ జీ! ప్రజల రిటైర్మెంట్ నిధులను అదానీ గ్రూప్‌లో ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందన్న విపక్షాల ప్రశ్నలకు మీ నుంచి సమాధానం లేదు. అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ లేదు. మీకెందుకంత భయం?’’ అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ‘‘మోదీ–అదానీ బంధం బయటపడ్డాక కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ, ఈపీఎఫ్ఓ పెట్టుబడులన్నింటినీ అదానీ సంస్థల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది?’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు తృణమూల్ బాసట కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో ఉప్పూనిప్పుగా ఉంటున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆ పార్టీకి సంఘీభావం ప్రకటించింది. లోక్‌సభ నుంచి రాహుల్‌ను అనర్హునిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వ్యూహరచన భేటీలోనూ, అదానీ ఉదంతంపై జరిగిన నిరసనల్లోనూ పాల్గొంది. తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన (యూబీటీ)తో సహా మొత్తం 16 విపక్షాలు వీటిలో పాల్గొన్నాయి. తమ మద్దతు కేవలం రాహుల్ అంశానికే పరిమితమని అనంతరం తృణమూల్ స్పష్టత ఇచ్చింది. ‘‘పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జరిపే ఆందోళనల్లో కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలతోనూ మేం కలిసి సాగుతాం. అదే సమయంలో పలు అంశాలపై కాంగ్రెస్‌తో తమ అభిప్రాయ భేదాల్లో ఏ మార్పూ లేదు’’ అని పేర్కొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి తృణమూల్ కొంతకాలంగా దూరంగా ఉంటుండటం తెలిసిందే. బంగ్లా ఖాళీ చేయండి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాహుల్‌గాంధీకి తాఖీదులందాయి. ఎంపీ హోదాలో 12, తుగ్లక్ లేన్‌లో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22కల్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ పేర్కొంది. అనర్హత వేటు పడ్డ ఎంపీలు నెలలోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. బంగ్లాలో మరింతకాలం ఉండాలనుకుంటే కమిటీకి రాహుల్ లేఖ రాయవచ్చన్నారు. -
పార్టీల ఎజెండాలదే పైచేయి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అధికార, ప్రతిపక్షాలు మెట్టు దిగకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమైనప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం అరుపులు కేకలతో ఉభయసభలు దద్దరిల్లాయి. భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై కించపర్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ సభ్యులు, అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ చేశారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో అర్థవంతమైన చర్చలకు తావు లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాల అజెండాలదే పైచేయిగా మారింది. దాంతో మరో దారిలేక ఉభయ సభలను సభాపతులు సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఐదురోజులుగా లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలేవీ సాగలేదు. స్పీకర్ విజ్ఞప్తి బేఖాతర్ లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ బిగ్గరగా నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. అధికార బీజేపీ సభ్యులు తమ సీట్ల వద్దే లేచి నిల్చున్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. దాంతో దాదాపు 20 నిమిషాలపాటు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు సహకరించాలంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే కోరినప్పటికీ ఎవరూ శాంతించలేదు. అలజడి సృష్టించడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపించలేదు, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తా, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలి అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సభ్యులెవరూ వినిపించుకోకపోవడంతో సభను ఈ నెల 20వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పునరావృతం ఎగువ సభలోనూ గందరగోళం కొనసాగింది. కార్యకలాపాలేవీ సాగకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు కోరగా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇరుపక్షాల ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. రూల్ 267 కింద 11 వాయిదా తీర్మానాల నోటీసులు వచ్చాయని, వాటిని అనుమతించడం లేదని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సభలో తాను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా, చైర్మన్ నిరాకరించారు. అధికార, విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అంతకంటే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సభలో ఒక ప్రకటన చేశారు. ఈ నెల 20 నుంచి రాజ్యసభలో వివిధ కీలక శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. అదొక కొత్త టెక్నిక్: థరూర్ సంసద్ టీవీలో సౌండ్‌ను మ్యూట్ చేయడం ఒక కొత్త టెక్నిక్ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎద్దేవా చేశారు. సభలో ఇకపై ఒక్కో సభ్యుడి మైక్రోఫోన్‌ను ఆపేయాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష ప్రసారంలో శబ్దాలను మ్యూట్ చేస్తే సరిపోతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. లోక్‌సభలో తమ పార్టీ సభ్యుల గొంతు నొక్కేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. సభలో వారు చేసిన నినాదాలు ప్రత్యక్ష ప్రసారంలో వినిపించకుండా చేశారని విమర్శించారు. అయితే, సాంకేతిక సమస్యల వల్లే సభ్యుల నినాదాలు వినిపించలేదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. మోదీ, అదానీ బంధమేంటి?: ప్రియాంక ప్రధాని మోదీకి, అదానీకి మధ్య సంబంధం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా నిలదీశారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. మోదీ, అదానీ బంధంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ మౌనం పాటిస్తోందని తప్పుపట్టారు. గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ధర్నా అదానీ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద ఉమ్మడిగా ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ అంశంపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన తర్వాత జరిగిన ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), జేఎంఎం, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ధర్నా కంటే ముందు ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. ప్రభుత్వంపై ఉమ్మడిగా నిరసన తెలపాలని నిర్ణయించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఖర్గే ట్విట్టర్లో కోరారు. -
BJP: ముందు క్షమాపణ చెబితేనే..
న్యూఢిల్లీ: తీవ్ర ఆందోళనల నడుమ పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధాన పార్టీల సభ్యుల ఆందోళనలతో వరుసగా రెండోరోజూ కూడా ఉభయ సభల నిర్వాహణ కష్టతరంగా మారింది. భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రసంగించేందుకు అనుమతిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది. ఒకవైపు రాహుల్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంపై బీజేపీ క్షమాపణలు కోరుతోంది. మరోవైపు అదానీ-హిడెన్‌బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతపతిక్షాలు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) కూడా బీజేపీ-కాంగ్రెస్ నినాదాల నడుమ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కిందటి రోజు మైకులను ఆఫ్ చేశారు. ఇవాళ ఏమో ఏకంగా సభలనే నడవకుండా చేశారు. ప్రధాని మోదీ స్నేహితుడి(అదానీని ఉద్దేశిస్తూ..) పార్లమెంట్‌నే మూగబోయేలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ పేజీలో ట్వీట్ చేసింది. తనను మాట్లాడనిస్తే తన లండన్ ప్రసంగంపై వివరణ ఇస్తానంటూ రాహుల్ గాంధీ చెప్తుండగా.. మరోవైపు ముందు జాతికి క్షమాపణ చెబితే రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతిస్తామని చెబుతోంది. ఈ తరుణంలో పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. బ్రిటన్ లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు. -
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. అనంతరం బీఆర్ఎస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు. విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. -
కోరమ్ లేక వాయిదా
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్‌సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన తర్వాత సభలో కోరమ్ లేదన్న విషయాన్ని అదే పార్టీ ఎంపీ దయానిధి మారన్ లేవనెత్తారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. కోరమ్ బెల్లు మోగించాలని సిబ్బందికి సూచించారు. తగిన సంఖ్యలో సభ్యులను సమీకరించడంలో ప్రభుత్వ ఫ్లోర్ మేనేజర్లు విఫలమయ్యారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కోరమ్ అంటే? లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు సభలో ఉండాలి. దీన్నే కోరమ్ అంటారు. -
ఢిల్లీ చరిత్రలోనే తొలిసారి.. ముచ్చటగా మూడోసా‘రీ’!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి భంగపాటు తప్పడం లేదు. ఎన్నికల్లో గెలిచినా మేయర్ పదవి ఊరిస్తూనే వస్తోంది. తాజాగా.. మేయర్ ఎన్నిక జరగకుండానే ఎంసీడీ హౌజ్‌ను సోమవారం వాయిదా వేస్తునట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) ప్రకటించారు . దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్నిక వాయిదా పడినట్లయ్యింది. ఢిల్లీ చరిత్రలోనే మేయర్ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్ ఓటింగ్‌కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ అనుమతించారు. దీంతో సోమవారం హౌజ్ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం చెలరేగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. నామినేట్ సభ్యులుగానీ, పెద్దల కోటాలో ఎన్నికైన సభ్యులు గానీ మేయర్ ఎన్నికలో ఓటేయడానికి వీల్లేదు. కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ మాత్రం ఎల్జీ నామినేట్ చేసిన పది మందిని ఓటింగ్‌కు అనుమతించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఈ తరుణంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను వాయిదా(తదుపరి తేదీ చెప్పకుండానే) వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. #WATCH | MCD mayor election called off for the third time after ruckus in the Delhi Civic Centre. pic.twitter.com/irCfHIoycP — ANI (@ANI) February 6, 2023 ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రెండుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ మూడోసారి కూడా వాయిదా పడింది. పదిహేనేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోగా.. విజయం సాధించిన ఆప్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై గంపెడాశలు పెట్టుకుంది. ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్ పీఠం కట్టబెడుతారు.ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. -
Adani Group issue: ‘అదానీ’పై అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల పతనం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఏకతాటిపైకి వచ్చిన విపక్ష సభ్యుల ఆందోళనతో శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ స్తంభించాయి. మిగతా సభా కార్యకలాపాలను పక్కనపెట్టి హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టడంతో వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సమావేశాలకు ముందే తీసుకున్న సంయుక్త నిర్ణయం 15 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభ ఆరంభమై ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్ష ఎంపీలు హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. విచారణ జరిపించాల్సిందే... అదానీ గ్రూప్ పట్ల వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేదా సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌తో విచారణ జరిపించాలని విపక్షాలు పునరుద్ఘాటించాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చకు అంగీకరించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చర్చించే దాకా పట్టు! పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆప్, బీఆర్ఎస్, శివసేన, ఆర్జేడీ, జేడీ(యూ), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), కేరళ కాంగ్రెస్ (థామస్), ఆరెస్పీ ఇందులో ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై సభలో చర్చ జరిగేదాకా పట్టుబట్టాల్సిందేనని పార్టీలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దాంతోపాటు అదానీ గ్రూప్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తుకు కేంద్రం అంగీకరించేదాకా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అదానీ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడు మాత్రమే వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులకు భద్రత’’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో అన్నారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని మోదీయే వాటిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆర్థిక, అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడిందంటూ న్యూయార్క్‌కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల దెబ్బకు గ్రూప్ విలువ చూస్తుండగానే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. -
పార్లమెంట్లో ‘హిండెన్‌బర్గ్’ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక గురువారం పార్లమెంట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మార్కెట్ విలువను భారీగా కోల్పోతున్న అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడుల అంశంపై తక్షణమే చర్చించాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు స్తంభించాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా 9 విపక్షాల ఎంపీలు వెల్‌లోకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 9 పార్టీల వాయిదా తీర్మానాలు సభా కార్యకలాపాల ఆరంభానికి ముందే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదానీ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చేదాకా సభా కార్యక్రమాలు అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఉభయ సభల్లో 9 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున మాణిక్యం ఠాగూర్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ప్రశ్నోత్తరాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, అదానీ అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ స్పీకర్ పదేపదే కోరినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుంటూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. జేపీసీ లేక సీజేఐ నేతృత్వంలో కమిటీ అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇందుకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉదయం ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని విపక్ష ఎంపీలు విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మార్కెట్ విలువ కోల్పోతున్న సంస్థల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారు. దీనిపై చర్చించడానికి మేమిచ్చిన తీర్మానాన్ని సస్పెండ్ చేశారు. అదానీ అంశంపై పార్లమెంట్లో లోతుగా చర్చించాలి. అదానీపై విచారణ వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణతోనే..: నామా, కేకే అదానీ వ్యవహారంపై జేపీసీ లేక సీజేఐ కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కె.కేశవరావు పేర్కొన్నారు. ఎల్ఐసీ సహా బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. జనం సొమ్మును లూటీ చేశారు ఎల్ఐసీ, ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ సంస్థలతో అదానీ గ్రూప్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. తాజా సంక్షోభం వల్ల ఆయా సంస్థలు భారీగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు పొదుపు చేసుకున్న సొమ్ము ప్రమాదంలో చిక్కుకుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అదానీ అంశంపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వారంతా భయాందోళనకు గురవుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ చెప్పారు. జనం సొమ్మును అదానీ లూటీ చేశారని సీపీఎం నేత ఎలమారమ్ ధ్వజమెత్తారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భారీ కుంభకోణం జరిగితే ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిలదీశారు. -
పార్లమెంట్ సమావేశాలకు తెర
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షె డ్యూల్ కంటే ఆరు రోజుల ముందే శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7న సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ముగియాల్సి ఉంది. సరిహద్దులో భారత్–చైనా ఘర్షణపై పార్లమెంట్ చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభలను కొద్దిరోజులుగా స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభలను తరచూ వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే ముందే ముగించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ దృష్ట్యా ఇందుకు అన్ని పార్టీల సభాపక్ష నేతలు అంగీకరించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. శుక్రవారం చివరి రోజు పార్లమెంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. వరుసగా ఎనిమిదోసారి.. పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగియడం ఇది వరుసగా ఎనిమిదోసారి! 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ కాలం జరిగిన భేటీల్లో ఇది కూడా ఒకటని సమాచారం. -
ఎన్డీటీవీ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
సభకు నమస్కారం.. రెండువారాలు రచ్చ రచ్చే!
ఢిల్లీ: వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని.. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారమే ప్రకటించారు స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. డ్యూ డేట్ కంటే ఐదురోజులు ముందుగానే ఇలా ఉభయ సభలు వాయిదా పడడం ఇదే ఏడోసారి. మిగిలిన ఐదురోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగష్టు 12వ తేదీవరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలి. ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. లోక్‌సభ పదహారు రోజులు మాత్రమే సమావేశం అయ్యిందని, ఏడు చట్టాలకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటలకంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. మేజర్ హైలెట్స్ ► ధరల పెంపుపై విపక్షాల నిరసనలు.. నిత్యం నిరసన గళాలతో నినాదాలు ► సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ఆవరణలో ఉంటూ నిరసన ► రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. వాటి ఫలితాలు ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ సభల్లో బీజేపీ ఆందోళనతో హోరెత్తించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ► పలు కీలక బిల్లులపై ఆమోదం ► టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను.. ధరల చర్చ జరుగుతున్న టైంలో టేబుల్ కింద దాయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య పట్ల పార్లమెంట్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది. -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్‌సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్‌పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
పార్లమెంట్ సమావేశాలు: ఉభయ సభలు గురువారానికి వాయిదా
Monsoon Session 2022 Day 3 Updates: ►జీఎస్టీ, ధరల పెరుగుదలపై ప్రతిపక్ష నాయకులు వరుసగా మూడో రోజు తమ నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ సైతం గురువారానికి వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిరసన పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై విపక్షాల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది. ► ధరల పెరుగుదలపై ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలనుగురువారానికి వాయిదా పడింది. జులై 18 నుండి ఐదు శాతం జిఎస్టి పన్ను అమలులోకి వచ్చిన క్రమంలో పాలు, పెరుగు ప్యాకెట్లను పట్టుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీల నిరసన ► ధరల పెంపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటును నిరసిస్తూ.. నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. ► రాజ్యసభలో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ►ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. #WATCH Opposition MPs protest in Parliament against the Central government over inflation and recent GST hike on some essential items pic.twitter.com/rgpYrHjlZo — ANI (@ANI) July 20, 2022 రాజ్యసభలోనూ అదే తీరు ► విపక్షాల నినాదాలతో.. రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. లోక్‌సభ వాయిదా ► ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌కు అంతరాయం కలిగించారు కాంగ్రెస్ సహా మిగిలిన విపక్ష ఎంపీలు. దిగజారుతున్న రూపాయి విలువ, ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు స్పీకర్. క్వశ్చన్ అవర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. పార్లమెంట్ చర్చల కోసమని.. నిరసనల కోసం కాదని స్పష్టంచేశారు. లోక్‌సభను మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభం. ► వర్షాకాల సమావేశాల మూడో రోజు దరిమిలా.. ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరి నిరసనల్లో పాల్గొన్నారు. Delhi | Congress MPs Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury join the Joint Opposition protest in front of the Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation, on the third day of the Monsoon session pic.twitter.com/z2OcRAILEv — ANI (@ANI) July 20, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాల ఆందోళన ఆటంకంగా మారింది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఈ తరుణంలో.. ► ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు. ► పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ. Rahul Gandhi never posed a question,always disrespected Parliamentary proceedings...He's the one to have less than 40% attendance in Parliament...Today, the person who's been politically unproductive is dedicating himself to ensure there's no debate in Parliament:Smriti Irani,BJP pic.twitter.com/FpA5pnL1zs — ANI (@ANI) July 20, 2022 ► ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో రోజూ ఆందోళనకు విపక్షాలు సిద్ధం అయ్యాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు తదితర అంశాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాయి. ► మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సభలో వ్యవహరించాల్సిన తీరు.. విపక్షాల విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మంత్రులకు సూచించనున్నట్లు తెలుస్తోంది. -
పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
-
Monsoon session of Parliament: పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు LIVE అప్డేట్స్ 2.00PM ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల, ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ్య రెండూ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. 11.48AM ► టీఆర్ఎస్ ఎంపీల ధర్నా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. Delhi | TRS MPs hold protest in front of Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation pic.twitter.com/agdkAOXVaN — ANI (@ANI) July 19, 2022 11.29AM ► ఆప్ ఎంపీల నిరసన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు అనుమతి మంజూరు ఆలస్యాన్ని.. కేంద్రానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆప్ ఎంపీలు నిరసన చేపట్టారు. Delhi | Aam Aadmi Party MPs protest against the Centre in front of Gandhi statue in Parliament against the delay in nod for Singapore visit to Arvind Kejriwal pic.twitter.com/gSpKUYSidX — ANI (@ANI) July 19, 2022 11.17AM ►లోక్‌సభ సైతం వాయిదా విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకు ముందు రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది. 11.05AM ► రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. #SansadUpdate#RajyaSabha adjourned till 2 PM #MonsoonSession2022 pic.twitter.com/55AhC4yv6b — SansadTV (@sansad_tv) July 19, 2022 11.03AM ► లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. గందరగోళం నడుమే లోక్ సభ కార్యాకలాపాలు నడుస్తున్నాయి. Opposition MPs raise slogans against price hike and inflation in Lok Sabha as house proceedings begin on the second day of Parliament pic.twitter.com/c3HTjMRsGj — ANI (@ANI) July 19, 2022 ► సోమవారం మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకూ కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా తొలి రోజు ఉభయసభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. ► ఇక రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందే.. గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలు,అగ్నిపథ్ సహా ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, at Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/KqMp3rrLSM — ANI (@ANI) July 19, 2022 ► ప్రధాని మోదీ.. మంత్రులతో సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చలు జరిపారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు సెషన్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు గందరగోళం నడుమే ఉభయ సభలు వాయిదా పడటంతో రెండో రోజు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
Parliament Monsoon Session: తొలి రోజే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకు కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు ఓటు వేయడానికి గాను సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఎన్నికలంటే ఒక పండగ లాంటిదేనని అన్నారు. ఈ పండగలో పాలుపంచుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత వామపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. ద్రవ్యోల్బణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు అధిర్‌రంజన్ చౌదరి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానాల(సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఉదయం కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు సభ్యులు వచ్చినట్లు కనిపిస్తోందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్లాలని సూచిస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలను చిరస్మరణీయ సమావేశాలుగా మార్చుకోవాలని సూచించారు. చక్కటి పనితీరు ప్రదర్శించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల మాదిరిగా కాకుండా ఈసారి వైవిధ్యంగా వ్యవహరించాలన్నారు. జపాన్ దివంగత ప్రధాని షింజో అబె, యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబూదాబీ నాయకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కెన్యా మూడో అధ్యక్షుడు మావై కిబాకీకి, ఇటీవల మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించాయి. కొత్త సభ్యుల ప్రమాణం ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్, ప్రఫుల్ పటేల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, వైఎస్సార్సీపీ నేతలు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నామినేటెడ్ సభ్యుడు, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ లోక్‌సభలో శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రమాణం చేశారు. ఓపెన్ మైండ్‌తో చర్చిద్దాం ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు లోతైన, వివరణాత్మక చర్చలతో వ్రర్షాకాల సమావేశాలను ఫలవంతం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతా కలిసి ఓపెన్ మైండ్‌తో చర్చిద్దామని సూచించారు. సునిశిత విమర్శ, చక్కటి విశ్లేషణల ద్వారా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని విన్నవించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి. అందరి కృషితోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందరి సహకారంతోనే సభ సజావుగా నడుస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటుంది. సభ గౌరవాన్ని పెంపొందించేలా మన విధులను నిర్వర్తించాలి. పంద్రాగస్టు సమీపిస్తున్న వేళ... దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను దేశానికి అంకితం చేసి, జైళ్లలో గడిపినవారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మర్చిపోవద్దు’ అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్‌ను పవిత్ర స్థలంగా భావించాలన్నారు. దేశానికి కొత్త శక్తినివ్వాలి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ, మరో పాతికేళ్ల తర్వాత దేశ ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత వేగంగా ముందుకు సాగే తీర్మానాలతో జాతికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఎంపీలంతా దేశానికి కొత్త శక్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. -
ఒక రోజు ముందే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్‌తో సమావేశమయ్యారు. అంశాలపై విబేధాలను చర్చల్లో చూపాలి కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్, శీతోష్ణస్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్‌సభ సమావేశాల్లో ఉత్పాదకత 82 శాతమన్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆరు బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు. రాజ్యసభ పనితీరుపై వెంకయ్య ఆవేదన బుధవారం రాజ్యసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సభలో ఆందోళనలు అధికమై పనితీరు బాగా తగ్గడంపై సభాపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరకు సమావేశాలు జరగాల్సిఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సామర్ధ్యం కన్నా తక్కువ పనితీరును సభ కనబరిచిందని బుధవారం సభారంభం కాగానే వెంకయ్య సభ్యులకు వివరించారు. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే మరింత మెరుగ్గా సమావేశాలు జరిగి ఉండేవన్నారు. అందరూ సభా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన తప్పులను గుర్తించి ఇకపై జరగకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. రాబోయే పండుగలకు సంబంధించి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ జరిగింది. విపక్షాల ఆందోళన నడుమ కీలక బిల్లులకు సభ ఆమోద తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. విపక్షాలు 2019 ప్రజాతీర్పును తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. వీరి కారణంగా రాజ్యసభ ఉత్పాదకత 48 శాతానికి క్షీణించిందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నా ప్రభుత్వం 12మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా కృత్తిమ మెజారిటీ సంపాదించి బిల్లులు పాస్ చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరవధిక వాయిదా తర్వాత బయటికొస్తున్న సభ్యులు -
పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందే ముగిసిపోయాయి. ఉభయ సభలు బుధవారం రవధికంగా వాయిదా పడ్డాయి. జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను (ఓబీసీ) గుర్తించి జాబితాను తయారు చేసే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. పెగసస్ స్పైవేర్ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరలు పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు ఈసారి వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకున్నారు. జూలై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియాల్సి ఉంది. అయితే సభా కార్యకలాపాలు జరగకుండా విపక్షాలు నిరంతరాయంగా అడ్డుకోవడంతో సభలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య లోక్‌సభలో 19 బిల్లులు పాసయ్యాయి. విపక్షాలు కలిసి రావడంతో ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయసభల్లో పూర్తిస్థాయి చర్చ జరిగింది. లోక్‌సభ సమావేశాలు మొత్తం కేవలం 21 గంటలు మాత్రమే జరిగాయి. సభ ఉత్పాదకత 22 శాతం మాత్రంగానే ఉంది. ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు పెగసస్‌పై చర్చకు పట్టుబట్టడం వంటి దృశ్యాలే ప్రతీరోజూ కనిపించాయి. బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఓబీసీ బిల్లుని ఆమోదించిన రాజ్యసభ ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 187 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఈ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వం కుల జనాభా గణన చేపట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. మార్షల్స్ మోహరింపు ఓబీసీ బిల్లుకు సభ ఆమోద ముద్ర వేసిన తర్వాత రాజ్యసభలో గందరగోళం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులు మళ్లీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటుపరం చేయడానికి వీలు కల్పించే ఈ బిల్లును విపక్షసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగితాలు చింపి విసిరేశారు. మార్షల్స్‌తో ఎంపీలకు తోపులాట జరిగింది. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. రెండుసార్లు వాయిదాపడ్డాక రాత్రి ఏడు తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా... టీఎంసీ, డీఎంకేలు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం తోసిపు చ్చింది. కాగా మంగళవారం సభ్యులు టేబుల్స్ పైకి ఎక్కి రభస చేయడంతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెల్లోనికి ఎవరూ రాకుండా 50 మంది మార్షల్స్‌ని మోహరించారు. ఇన్సూరెన్స్ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులు ఆమోదించాక సభ నిరవధికంగా వాయిదా పడింది. కఠిన చర్యలు తీసుకోవాలి: జోషి ప్రతిపక్ష సభ్యులే మార్షల్‌ను తోసివేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. మార్షల్ ఎంపీలను తాకే సాహసం చేయరని, సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలిసిపోతుందని అన్నారు. -
పెగాసస్‌పై సుప్రీం విచారణ వాయిదా
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటులో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కోర్టులో కేసు వాదనలు జరుగుతుండగానే, పిటీషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. ఏదైనా చెప్పాలనుకుంటే, కోర్టులోనే చెప్పాలని సీజే పేర్కొన్నారు. ఒకసారి కోర్టులను ఆశ్రయించిన తరువాత కోర్టులపై విశ్వాసముంచాలని ఆయన సూచించారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు విచారణలో ఉన్న విషయాన్ని బయట చర్చించకూడని తామూ అంగీకరిస్తున్నామన్నారు. పిటిషన్లు అందాయని కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా ప్రభుత్వం నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచనలు, సలహాల నిమిత్తం శుక్రవారం వరకు సమయం కావాలని కోరారు. దీనిని వ్యతిరేకించిన పిటిషనర్ల తరపు న్యాయవాది కబిల్ సిబల్ తక్షణమే కేంద్రానికి నోటీసులు జారీ చేయాలని కోరారు. కానీ సోమవారం వరకు సీజేకు గడువు ఇచ్చిన సుప్రీం, తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆరోపణలు నిజమైతే ఇవిచాలా తీవ్రమైనవని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజకీయ, న్యాయ, రక్షణ రంగ ప్రముఖులు, జర్నలిస్టులు సహా 300మందికి పైగా ప్రముఖుల ఫోన్ నంబర్ల హ్యాంకింగ్ వ్యవహారం దుమారాన్ని రాజేసింది. అయితే భారత్‌లో నిఘా లేదంటూ కేంద్రం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించింది. -
ఆందోళన ఆగలేదు.. సభ సాగలేదు
న్యూఢిల్లీ: పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు దిగిరాకపోవడంతో శుక్రవారం కూడా పార్లమెంట్ ఎలాంటి చర్చలు జరగకుండా సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ఆరంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులు యథాత«థంగా నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభాపతి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రతిపక్షాల ఆందోళనపై సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అసహనం వ్యక్తం చేశారు. పెగసస్‌పై వివాదం అనవసర రగడని, ప్రజా సంబంధ విషయాలపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. కానీ విపక్షాలు తమకు మరింత వివరణ కావాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ప్రవర్తన దురదృష్టకరమని జోషి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు బిల్లులు చర్చలేకుండా ఆమోదం పొందాయని, ఇకనైనా విపక్షాలు కీలక అంశాలపై చర్చకు రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్షాలు వినకపోవడంతో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ఆరంభమవగానే ప్రభుత్వం రెండు బిల్లుల(కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఎన్సీఆర్ బిల్ 2021, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్)ను సభలో ప్రవేశపెట్టింది. వీటిపై చర్చించాలని ప్రభుత్వం, సభాపతి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కానీ స్లోగన్లతో సభ సాగకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో సేమ్ సీన్ శుక్రవారం రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో చర్చలు సాగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సభారంభం కాగానే విపక్షాల నిరసనతో మధ్యాహ్నంలోపు రెండు మార్లు వాయిదా పడింది. పార్లమెంట్ మర్యాద, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని విపక్షాల తీరుపై సభాపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న మంత్రుల ముందు విజిళ్లు వేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం మర్యాదకాదన్నారు. ప్రతిఒక్కరూ సభా మార్యాద పాటించాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్ష సభ్యులు వినలేదు. అనంతరం ఆయన జీరో అవర్ ఆరంభించారు. కానీ విపక్షాలు సభను సాగనివ్వలేదు. తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ తిరిగి ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి స్లోగన్లతో సభను అడ్డుకున్నారు. దీంతో తిరిగి సభ మరలా వాయిదా పడింది. లంచ్ తర్వా త సభలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వీటిలో ఒక బిల్లును ప్రతిపక్ష ఆందోళన మధ్యనే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. తదనంతరం సభ సోమావారానికి వాయిదా పడింది. -
సభాపతి పైకి పేపర్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బుధవారం ఎలాంటి చర్చలు లేకుండా గురువారానికి వాయిదా పడింది. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు సభాకార్యక్రమాలు జరగకుండా ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్స్థానంపైకి విసరడం కలకలం సృష్టించింది. రెండు సభలు పలుమార్లు వాయిదా పడినా విపక్షాల నిరసన ఆగకపోవడంతో సభాధిపతులు మరుసటిరోజుకు సభలను వాయిదా వేశారు. పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుపడుతూ విపక్ష సభ్యులు సమావేశాలు జరగకుండా ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే! బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. కానీ వెంటనే విపక్షాలు తమ ఆందోళనను ఆరంభించాయి. పలువురు సభ్యులు సభ వెల్‌లోకి చేరుకొని నినాదాలతో సభను అడ్డుకున్నారు. కానీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన హౌస్ప్రొసీజర్స్ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ కనిపించారు. ఎట్టకేలకు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన తర్వాత తొలిసారి లోక్‌సభలో క్వశ్చన్ అవర్ జరిగినట్లయింది. అనంతరం స్పీకర్ సభను వదిలివెళ్లగా డిçప్యూటీ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభా నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు, ప్లకార్డులు చింపి లోక్‌సభ స్పీకర్స్థానం పైకి విసిరేశారు. కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్ ఔజాలా, ప్రతాపన్, హిబి ఈడెన్ తదితరులు పేపర్లు చింపి స్పీకర్ స్థానం మీదకు, ట్రెజరీ బెంచ్‌ల మీదకు విసిరారు. సాయంకాలానికీ సభలో నిరసనలు ఆగకపోవడంతో గురువారానికి సభను వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యసభలో కొనసాగిన నిరసనలు పెగసస్, రైతు చట్టాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన రాజ్యసభలో బుధవారం కొనసాగింది. అయితే ఆందోళనల నడుమ సభ జువెనైల్ జస్టిస్ సవరణ చట్టం 2021కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాజ్యసభ సభాధిపతి వెంకయ్య జీరోఅవర్‌ను ఆరంభించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష సభ్యులు నినదిస్తూ సభను అడ్డుకున్నారు. కొందరు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా వెంకయ్య అడ్డుకున్నారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే వెంకయ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. కానీ విపక్ష సభ్యులు స్లోగన్లు ఉధృతం చేసి సభను అడ్డుకున్నారు. ఈ సమయంలో సభ్యులు ముందే అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. అనంతరం తిరిగి సభ వాయిదా పడింది. అదనపు వ్యయానికి సభామోదం ప్రభుత్వం అదనంగా రూ.23వేల కోట్ల వ్యయం చేసుకునేందుకు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 17వేల కోట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖకు కేటాయించారు. దీన్ని కోవిడ్ సంబంధిత వ్యయాలకు ఉపయోగిస్తారు. రూ. 2050 కోట్లు పౌరవిమానయాన శాఖకు వెళ్తాయి. -
పెగాసస్ ప్రకంపనలు: టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడవ రోజు కూడా సెగలు పుట్టించింది. పెగాసస్ స్పైవేర్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పెద్దల సభ రాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్‌పై వేటు వేయడం ఆందోళనకు దారి తీసింది. ఈ వర్షాకాల సమావేశాల కాలానికి రాజ్యసభ నుంచి శంతనును సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వీ మురళీధరన్ సస్పెన్షన్ కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ, సేన్‌ను సస్పెండ్ చేశారు. సభలో పత్రాలను చించివేసిన అంశంపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ ప్రకటన సందర్భంగా దుమారం రేగింది. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయివా దేశారు. అటు ఇదే అంశంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని దేశన్యాయవ్యవస్థ, ప్రతిపక్షనేతలపై ఎక్కు పెట్టడం, జర్నలిస్టులపై నిఘా పెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తన ఫోన్లన్నింటిని కూడా ట్యాప్ చేసిన ఉంటారనిఆరోపించారు. దీనిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాగా పెగాసస్ వ్యవహారంపై గురువారం రాజ్యసభలో ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇస్తుండగా, ఆ పత్రాలను లాక్కొని చించి వేశారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. Santanu Sen, please withdraw from House. Allow the House to function: says RS Chairman & adjourns House till 12 PM following an uproar that started during TMC MP Derek O'Brien's statement over y'day's incident TMC's Santanu Sen y'day snatched paper from hands of IT Min & tore it pic.twitter.com/rbOeR0vvZD — ANI (@ANI) July 23, 2021 -
అమెజాన్-ఫ్యూచర్-రిలయన్స్ కేసు! విచారణ వాయిదా ఎందుకంటే..
Amazon-Future-Reliance Case ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారించనుంది. న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్-అమెజాన్ కేసు విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారీమన్, కేఎం జోసెఫ్, బీఆర్ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు గురువారం ఈ వివాదం విచారణకు వచ్చింది. అయితే ఇదే కేసుపై జూలై 12న నుంచీ సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ జరపనుందని, ఈ పరిస్థితుల్లో వారం పాటు కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి ఫ్యూచర్స్ తరఫు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయంలో తనకూ అభ్యంతరం ఏదీ లేదని అమెరికా ఈ కామర్స్ దిగ్గజం– అమెజాన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియన్ కూడా పేర్కొనడంతో కేసు తదుపరి విచారణను 20కి వాయిదావేస్తూ బెంచ్ నిర్ణయం తీసుకుంది. వివాదంలో రూ.24,713 కోట్ల డీల్.. రిలయన్స్‌కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ నుంచి అమెజాన్‌కు వ్యతిరేక రూలింగ్స్ వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టును అమెజాన్ ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఇదే కేసు సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) కూడా విచారించనుంది. -
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఈ సమావేశాల్లో భాగంగా బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ సమావేశాల సమయాన్ని కుదించారు. ఏప్రిల్ 8వరకు జరగాల్సి ఉన్న పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండు నెలలపాటు కొనసాగిన ఈ సమావేశాలు జనవరి29న ప్రారంభమయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఖరారైన శరద్ పవార్ బెంగాల్ పర్యటన -
సివిల్స్ వాయిదా కుదరదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు చేపట్టిన రవాణా ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం యూపీఎస్సీని ఆదేశించింది. దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉండటంతోపాటు అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదల సమయంలో అక్టోబర్ 4వ తేదీన జరగబోయే సివిల్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఏ.ఎం. ఖాన్విల్కర్, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు పక్షాల వాదనలు వింది. పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం చేపట్టిన రవాణా ఏర్పాట్లపై మంగళవారంకల్లా వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని యూపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. బుధవారం మళ్లీ విచారణ చేపడతామని తెలిపింది. అంతకుముందు..మే 31వ తేదీనే ఈ పరీక్షల తేదీలు ఖరారు చేశామనీ, వాయిదా వేయడం కుదరదని ధర్మాసనానికి యూపీఎస్సీ తెలిపింది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఈ–అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొంది. పిటిషనర్లు వాసిరెడ్డి గోవర్దన సాయి ప్రకాశ్ తదితర 19 మంది తరఫున అలోక్ శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి, వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టే వరకు సివిల్స్ పరీక్షలను కనీసం మూడు నెలలపాటు వాయిదా వేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 72 నగరాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు 7 గంటలపాటు ఈ పరీక్షలను రాయాల్సి ఉంటుందనీ, చాలా మంది అభ్యర్థులు కనీసం 300–400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్, వరదల కారణంగా అభ్యర్థుల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. -
ముగిసిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ఈ సమావేశాలు ముగిశాయి. మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభను బుధవారం సాయంత్రం స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. చివరిరోజైన బుధవారం కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు సహా పలు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 14న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మరోవైపు, ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల మౌన నిరసన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘సేవ్ ఫార్మర్స్’, ‘సేవ్ వర్కర్స్’, ‘సేవ్ డెమొక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ.. తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు. కార్మిక బిల్లుల ఆమోదంపై ప్రధాని హర్షం కార్మిక రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బుధవారం పార్లమెంటు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు కార్మికుల సంక్షేమానికి, ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాయన్నారు. కనీస వేతనాలు, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలకు ఈ బిల్లులు హామీ ఇస్తున్నాయన్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనకు ఈ బిల్లులు ఉదాహరణ అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు. ‘ఇవి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లులు. వీటితో అనవసర జాప్యం, అధిక ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతాయి’ అన్నారు. కంపెనీల మూసివేతలో అడ్డంకులను తొలగించడం, 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే తొలగించే వెసులుబాటు.. తదితర ప్రతిపాదనలు ఆ బిల్లుల్లో ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు. -
నాలుగుసార్లు లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్‌సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్‌ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. హర్సిమ్రత్ రాజీనామా ఆమోదం కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేడు ముగియనున్న పార్లమెంటు!
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా భయంతో చాలారాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు చాలా పార్టీలు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత సమావేశాలను ముగించే అవకాశముందన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, సోమవారమే నిరవధిక వాయిదా పడే అవకాశముంది. దీంతో 12 రోజులు ముందుగానే సమావేశాలు ముగిసినట్లవుతుంది.(కరోనాకు మరో ముగ్గురి బలి) -
విప్‌లతో సభకు నిండుదనం
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాల్లో చివరి రోజున సాధారణంగా సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉంటున్నందున రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయడం మంచిదేనని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా రాజకీయ పక్షాలు ఇలాగే విప్‌లు జారీ చేస్తే సభ సభ్యులతో కళకళలాడుతుందన్నారు. అధికార బీజేపీ సహా, ఇతర పార్టీలు తమ సభ్యులకు మంగళవారం విప్‌లు జారీ చేయడంపై సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చ జరిగే సమయంలో సభలో సభ్యులు తక్కువగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఎంతో కీలకమైన బడ్జెట్‌పై పార్లమెంట్ సభ్యులకు ఆసక్తి లేదని భావించే ప్రమాదముందన్నారు. ఆఖరి రోజున రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. జనవరి 31వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో మొదటి విడత ముగిశాయి. తిరిగి మార్చి 2వ తేదీన మొదలై ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలంటూ అధికార బీజేపీ విప్ జారీ చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. -
ఉరి వాయిదాపై హైకోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరి అమలును నిరవధిక వాయిదా వేస్తూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు చెప్పిన తీర్పును కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అత్యవసరంగా విచారించాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఈ పిటిషన్‌ను ఆదివారం విచారిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి నలుగురు దోషులకు, జైళ్ల శాఖ డీజీ, తీహార్జైలు అధికారులకు కూడా నోటీసులు పంపించారు. ఉరిని వాయిదా వేస్తున్నట్లు ట్రయల్‌కోర్టు శుక్రవారం తీర్పునివ్వగా, శనివారమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టును చేరింది. ట్రయల్ కోర్టు తమ పరిధిని మించి తీర్పునిచ్చిందని పిటిషన్లో పేర్కొంది. కేంద్రం తరఫునవాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకొనేందుకు తగిన సమయం ఇచ్చామని, అయితే వారు ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యమయ్యేలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ఇది న్యాయ వ్యవస్థను అవమానపర్చడమేనని పేర్కొన్నారు. దోషులకు ఉరి వాయిదా పడడంపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందిస్తూ.. దోషులకు మరణశిక్ష పడేవరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. తిరస్కరించిన రాష్ట్రపతి ‘నిర్భయ’కేసులో దోషి వినయ్‌కుమార్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే వినయ్ కుమార్ శర్మ, అక్షయ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీకోర్టు కొట్టేసింది. -
‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయరాదంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉన్నందున శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నిర్భయ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉండగా, మిగతా ఇద్దరు చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ దోషులు పవన్, వినయ్, అక్షయ్‌ల తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జడ్జి ధర్మేందర్ రాణా విచారణ చేపట్టారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. పవన్ పిటిషన్ కొట్టివేత మరోవైపు, నిర్భయ కేసులో మరో దోషి పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ అయినందున తనకు విధించిన ఉరిశిక్షపై సమీక్ష జరపాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆఖరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా, న్యాయం దక్కే దాకా పోరాటం కొనసాగిస్తామని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు. ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరగాల్సి ఉందని హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు, హేయమైన నేరాలకు విధించిన ఉరిశిక్ష అమలుపై బాధితుల కోణంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
కోరం లేక లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం కోరం లేక కార్యక్రమాలు నిలిచిపోయాయి. పదిహేను రోజులుగా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం సభలో చాలినంత సంఖ్యా బలం లేకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సాయంత్రం 5.45 గంటల సమయంలో సభలో కెన్–బెట్వా అనుసంధానం, నీటి ఎద్దడి సమస్యలపై చర్చ జరుగుతుండగా ఆప్ సభ్యుడు భగ్వంత్ మాన్ కోరం లేని విషయాన్ని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షంతోపాటు అధికార పార్టీల సభ్యులు చాలామంది సభలో లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అగర్వాల్ సభా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు కోరం బెల్ మోగించారు. మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం, అంటే కనీసం 55 మంది సభ్యులుంటే కోరం ఉన్నట్లు లెక్క. -
ముగిసిన 16వ లోక్‌సభ సమావేశాలు
-
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా వాయిదా పడింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తమ సమస్యల గురించి తక్షణమే చర్చించాలని నోటీసులు ఇచ్చిన ఎంపీల పేర్లను చైర్మన్ వెంకయ్యనాయుడు చదువుతుండగానే అస్సాంకు చెందిన ఎంపీలంతా ఆందోళన మొదలుపెట్టారు. వీరికి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు జతకలిశారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమయ్యాక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజూజు రాజ్యాంగ (125వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం విపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి కాంగ్రెస్ సభ్యులు కూడా జతకలిశారు. పౌరసత్వ సవరణ బిల్లు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం ఇస్తామని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ హామీ ఇవ్వడంతో ఎస్పీ నేతలు ఆందోళన విరమించారు. మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. రోస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. విపక్ష సభ్యులు వెనక్కుతగ్గకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ ప్రకటించారు. ఎంపీ మృతితో లోక్‌సభ వాయిదా.. బిజు జనతా దళ్ (బీజేడీ) ఎంపీ కిషోర్ స్వాయిన్ (71) మృతితో లోక్‌సభ వాయిదా పడింది. ఒడిశాకు చెందిన కిషోర్ బుధవారం ఉదయం భువనేశ్వర్‌లో మృతిచెందారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ కిషోర్ మృతి విషయాన్ని సభ్యులకు తెలిపారు. అనంతరం సభ్యులు ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఆ తర్వాత సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. -
విపక్షాల ఆందోళన.. పార్లమెంట్ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాయిదా తీర్మానాలను చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా విపక్షాల నిరసనలు కొనసాగడంతో మధ్యాహానికి వాయిదా వేశారు. కాగా బెంగాల్ సీబీఐ వివాదం కారణంగా గత రెండు రోజులుగా సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన విషయం తెలిసిందే. -
పార్లమెంట్లో సీబీఐ ప్రకంపనలు.. సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. దీంతో సభా సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రాజకీయ కక్షసారింపు చర్యలు సరికావని కేంద్రానికి వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు నినాదాలు చేశారు. తృణమూల్‌కు మద్దతుగా విపక్షాలు కూడా ఆందోళన బాటపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. కాగా బెంగాల్లో సీబీఐ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వార్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. -
రాజ్యసభకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ ఎగువ సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో సునాయాసంగా ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. బిల్లును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కీలకమైన బిల్లుపై చర్చించేందుకు తగిన సమయం లేదని, ఇంత హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును తీసుకువచ్చిందని విపక్ష సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించిన డీఎంకే సభ్యురాలు కనిమొళి పలు సవరణలు కోరారు. ఈబీసీ బిల్లుపై గెహ్లట్ మాట్లాడుతూ.. సామాజిక సమనత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. సభ్యుల ఆందోళనతో సభను రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. సభ ప్రారంభమైన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిల్లుపై ప్రసంగించనున్నారు. కాగా 124వ రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజ్యసభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. -
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చర్చకు సిద్ధమే.. మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. -
అవగాహన లేమితోనే చంద్రబాబు వదిలేశారు!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనలతో గురువారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే పలు అంశాలపై విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో ఆందోళనలు కొనసాగడంతో సభ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో కూడా ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయసాయిరెడ్డి గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లోపల ఎందుకు ఆందోళన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేమితోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వదిలేశారని విమర్శించారు. ప్యాకేజ్‌కు కూడా కేంద్రం మోచేతి చూపిందని.. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీగా మారిందని ఆరోపించారు. -
రాఫేల్‌పై కాంగ్రెస్ వాయిదాతీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో నూతనోత్సాహం నింపుకున్న కాంగ్రెస్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాలక బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ గురువారం లోక్‌సభ, రాజ్యసభలో రాఫేల్ ఒప్పందంపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది. ఆప్ సైతం రాఫేల్ ఒప్పందంపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. మరోవైపు పార్లమెంట్లో విపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. ఈ భేటీకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ఈ భేటీలో ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 46 బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ యోచిస్తుండటంతో ఈ దిశగా కసరత్తును బీజేపీ ముమ్మరం చేసింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వైఖరిపై ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ సభ్యులకు మార్గనిర్ధేశం చేశారు. -
జనవరి 29కి ఓటుకు కోట్లు కేసు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్ధాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు నోటు కేసును సర్వోన్నత న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించుకోవాలని గతంలో కోర్టు జెరూసలెం మత్తయ్యకు సూచించగా, కోర్టే న్యాయవాదిని కేటాయించాలని మత్తయ్త కోరారు. కాగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కేసులో కుమ్మక్కయ్యాయని సుప్రీం కోర్టుకు మత్తయ్య నివేదించారు. డీజీపీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తనకు ప్రాణహాని లేదని ఆయన నివేదిక ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మత్తయ్యకు అమికస్ క్యురిగా సిద్ధార్ధ్ ధవేను నియమించిన సుప్రీం కోర్టు మత్తయ్యకు తెలంగాణ డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది. కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని ఉదయ్ సింహ పిటిషన్ దాఖలు చేశారు. కేసును జాప్యం చేసేందుకే పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ఏసీపీ తరపు న్యాయవాది హరీన్ రావల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయ సింహ తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా, హరీన్‌ల మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఇక ఉదయ్ సింహ ఇంప్లీడ్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోని సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల్లో మత్తయ్య ఒకరు. -
డిస్కౌంటే దెబ్బతీసింది
వాళ్లు 20 అడిగారు వీళ్లు 10 పోగు చేశారు వాళ్లు అడ్జస్ట్ అయిపోయారు కిడ్నాప్ ఫుల్‌గా చేశారు విడుదలకు 50% డిస్కౌంట్ ఇచ్చారు ఈ డిస్కౌంటే దెబ్బతీసింది ఆశ మనిషిని అందలం ఎక్కిస్తుంది.అత్యాశ అగాధానికి తోసేస్తుంది.2005, అక్టోబరు 12. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంసాయంత్రం 5 గంటల సమయంస్టీల్ ప్లాంట్ గేటులోంచి హోండాసిటీ కారు బయల్దేరింది. మెయిన్ రోడ్డు ఎక్కి అనంతపురం వెళ్లే రోడ్డు మీదుగా రయ్‌మంటూ దూసుకుపోతోంది కారు. ఉదయం నుంచి పని ఒత్తిడితో ఉన్న ఇంజనీర్ అనిరు««ద్(పేరు మార్చడమైనది) వెనుక సీట్లో చేరగిలబడ్డాడు.కార్ డ్రైవర్ రఘు మ్యూజిక్ ఆన్‌చేశాడు. స్పీకర్స్ నుంచి వస్తున్న పాటలు పని ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తున్నట్టుగా అనిపించింది అనిరు«ద్‌కి. ‘ర ఘూ..వాల్యూమ్ పెంచు’ అన్నాడు అనిరు«ద్. వాల్యూమ్‌తో పాటు కారు స్పీడ్ కూడా పెంచాడు రఘు. హైవే కావడంతో ప్రయాణంలో కుదుపులు లేవు. సీట్‌కి తల ఆన్చి, కళ్లు మూసుకుని పాటలను ఆస్వాదిస్తున్నాడు అనిరు«ద్. ఇంకో అరగంటలో అనంతపురం వస్తుందనగా కార్ స్లో అయ్యింది. కారు అద్దాలు ధడేల్ ధడేల్మని కొడుతున్నారెవరో.. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు అనిరు«ద్. కారు ఆగిపోయింది. కారు అద్దాలు కిందకు దించాడు రఘు. నలుగురు ఆగంతుకులు కారును చుట్టుముట్టి ఉన్నారు. వాళ్ల ముఖాలకు మంకీ క్యాప్స్ వేసున్నాయి. ఎవరన్నది తెలియడం లేదు. మొదటివాడు రఘు కణతికి రివాల్వర్ ఎక్కుపెట్టాడు కారు డోర్ తెరవమన్నట్టు. రఘు భయంగా కారు డోర్ తెరిచాడు. రఘు ముఖం మీద, వీపు మీద బలంగా కొట్టాడతను. అనిరు«ద్ వణికిపోయాడు.‘ఏయ్..! ఎవరు మీరు, ఏం కావాలి..’ అరుస్తుండగా మిగతా డోర్లు తెరుచుకున్నాయి. అనిరుద్ నోరు నొక్కేశారు వాళ్లు. అనిరు«ద్ని ఊపిరి తీసుకోనివ్వంతగా కొడుతూనే ఉన్నారు. డ్రైవర్‌కి పిస్టల్ ఎక్కుపెట్టిన అతను ‘చెప్పిన ప్లేస్‌కు పోనివ్వు. లేదంటే ఇద్దరూ ఛస్తారు’ అన్నాడు. వాళ్లు చెప్పినట్టు వినాల్సిన తప్పనిస్థితి. కారును ఎటు తిప్పమంటే అటు డ్రైవ్ చేస్తున్నాడు రఘు.మెయిన్ రోడ్ వదిలి ఓ సన్నని మట్టి రోడ్డు మీదుగా కారు బయల్దేరుతోంది. రెండు రోజులు గడిచాయి. పావని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అనిరు«ద్ ఫోన్ ‘నాట్ రీచబుల్’ అనే వస్తోంది. వెంటనే ఈ విషయం ఫోన్ చేసి తన తమ్ముడికి చెప్పింది. ‘నాకు భయంగా ఉందిరా! మీ బావగారు ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు’ ఏడుస్తూ చెబుతున్న అక్కకు ధైర్యం చెబుతూ ఊరి నుంచి బయల్దేరాడు పావని తమ్ముడు వివేక్. అతను చండీగడ్‌లో ఉంటాడు. రావడానికి ఎంత లేదన్నా రోజుకు పైగా పడుతుంది. ‘అమ్మా..! నాన్న ఎప్పుడొస్తాడు’ అని అడుగుతున్న పిల్లలకు నచ్చచెబుతూ బిక్కు బిక్కుమంటూ క్షణాలను యుగాలుగా గడుపుతోంది పావని.మూడవ రోజు పావని ఇంట్లో ఫోన్ మోగింది. ‘నీ మొగుడు నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు నువ్వు వినాలి’ అన్నది అవతలి కంఠం.వణుకుతున్న గొంతుతోనే ‘ఏమిటో చెప్పండి’ అంది పావని.‘నీ మొగుడు మా దగ్గరే ఉన్నాడు. ఇరవై లక్షలు ఇస్తే సరే, లేదంటే చంపేస్తాం..’ ఆ మాటలకు పావని గొంతు తడారిపోయింది. ‘ఈ విషయం పోలీసులకు చెప్పావో.. నీ మొగుడ్ని ఇప్పుడే చంపేస్తాం’ అన్నాడతను.‘ఏర్పాటు చేస్తా! ఎవరికీ చెప్పను. ఆయన్నేం చేయద్దు ప్లీజ్..’ ఫోన్లోనే వేడుకుంది పావని. ‘డబ్బు సిద్ధం చేసి ఉంచు. మళ్లీ ఫోన్ చేస్తాం. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో చెబుతాం’ అన్నాడు అతను.‘సరే!’ అనగానే ఫోన్ కట్ అయ్యింది.పావనికి ఏం చేయాలో అర్ధం కాలేదు. కాసేపు అలాగే స్తబ్దుగా కూర్చుండిపోయింది. పోలీసులకు చెబితే.. అమ్మో! అనిరు«ద్‌కి ఏమైనా జరిగితే... ఆ ఊహే భరించలేకపోయింది. తమ్ముడితో చెబుదామనుకుంది. ‘వాడు.. ఊరుకోడు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు, వద్దు’ అనుకుంది.ఇంట్లో ఉన్న క్యాష్ లెక్కించింది.. బ్యాంకులోని అమౌంట్ తీసుకొచ్చింది., మార్వాడీ కొట్టులో బంగారం తాకట్టు పెట్టింది. తెలిసినవారిని అడిగి డబ్బు తీసుకుంది. అంతా కలిపితే పది లక్షలు అయ్యాయి. 20 లక్షలు అంటే మాటలు కాదు. ఎలా? ఆ కిడ్నాపర్స్ ఈయన్ని చంపేస్తారేమో! వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోన్‌నే చూస్తూ కూర్చుంది. కిడ్నాపర్ చెప్పిన టైమ్‌కి ఫోన్ మోగింది. పావని కంగారుగా ఫోన్ ఎత్తింది. ‘డబ్బు సిద్ధం అయ్యిందా!’ కరుకుగా వినపడింది అవతలి గొంతు.‘అంత ఇచ్చుకోలేను. ఉన్నదంతా ఊడ్చి, తెలిసినవారిని అడిగితే అంతా కలిపి పది లక్షలు జమ అయ్యింది’ ఏడుస్తూనే చెప్పింది పావని. కాసేపు అటు నుంచి మౌనం.. ‘సరే, ఆ డబ్బు మాకు అందజేయి. నీ మొగుడ్ని వదిలేస్తాం’ అన్నారు అవతలివాళ్లు. ‘ఎలా ఇవ్వాలి?’ వెక్కుతూనే అంది పావని.‘మీ కారు డ్రైవర్‌నే పంపిస్తాం, అతనికివ్వు. ఎవరికీ అనుమానం రాదు’ ‘అలాగే’ అంది పావని. మరో గంట తర్వాత డ్రైవర్ రఘు వచ్చాడు. అతన్ని చూసిన పావని భయపడింది. రఘు ముఖం వాచిపోయి ఉంది. ఒక చేయికి కట్టు వేసి ఉంది. కుంటుతూ నడుస్తున్నాడు. పావని ఇచ్చిన సూట్‌కేస్ తీసుకొని రఘు వెళ్లిపోయాడు. పావని తమ్ముడు వివేక్ తాడిపత్రి చేరుకున్నాడు. తమ్ముడిని చూస్తూనే వెక్కుతూ జరిగిందంతా చెప్పింది పావని. అక్క చెప్పినా వినకుండా పోలీస్‌స్టేషన్‌కి దారి తీసాడు వివేక్. పోలీస్ స్టేషన్లో తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని తమ్ముడి బలవంతమ్మీద చెప్పింది పావని. కిడ్నాపర్స్ గురించి చెప్పకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు. పావని ఇంటికి చేరేసరికి ఫోన్ అదేపనిగా మోగుతోంది. ‘పావనీ.. నేను అనిరు«ద్ని. అనంతపురం రైల్వేస్టేషన్లో ఉన్నాను. ఇంటికి వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు చెబుతాను’ అన్నాడు. అతని గొంతు నీరసంగా ఉంది. భర్త కోసం పావని కళ్లలో ప్రాణాలు పెట్టుకొని ఎదురుచూస్తోంది. అనిరుద్ ఇల్లు చేరేసరికి పోలీసులు వచ్చి ఉన్నారు. ‘ఏమైంది?!’ అడిగారు పోలీసులు అనిరు«ద్ని.‘సార్, ఈవెనింగ్ ఆఫీస్ నుంచి అనంతపురం బయల్దేరాను. దారిలో ఎవరో నలుగురు దుండగులు మంకీ క్యాపులు వేసుకొని ఉన్నారు. డ్రైవర్ని, నన్ను కొట్టి, ఏదో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు వాళ్ల ఆధీనంలోనే ఉన్నాను. ఈ రోజు వదిలిపెట్టారు’ అన్నాడు అనిరు«ద్ ఇంకా వదలని భయంతో.‘పది లక్షలు ఇస్తే వదిలేశారు. లేకపోతే చంపేసేవారే’ ఏడుస్తూ అప్పుడు నిజం చెప్పింది పావని. ఆ మాట వినడంతోనే పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ‘మాకు ముందు ఎందుకు చెప్పలేదు.ఎప్పుడెప్పుడు ఫోన్లు వచ్చాయి. ఎవరు డబ్బు తీసుకెళ్లారు?’ విచారించడం మొదలుపెట్టారు పోలీసులు.‘వాళ్లు నిజానికి 20 లక్షలు అడిగారు. కానీ, పది లక్షలే పోగయ్యాయి అంటే, సరే అన్నారు.కిడ్నాపర్లు మా కారు డ్రైవర్‌నే పంపించారు. అతనికే ఇచ్చి పంపించాను’ అంది పావని. ‘కారు డ్రైవర్‌కి డబ్బులిచ్చారా?! కిడ్నాపర్లు అడిగినంత డబ్బు ఇచ్చినా మరో పది లక్షలు డిమాండ్ చేస్తారు. అలాంటిది పది లక్షలు తగ్గించారా! సగం రేటుకి రిలీజ్ చేయడానికి ఇదేమైనా డిస్కౌంట్ ఆఫ్రా! తెలిసినవారి పనే అయ్యుండాలి. ఇదే అసలైన క్లూ. అయితే, అది ఎవరో నిర్ధారించాలి?’ పోలీసులు ఆలోచనలో పడ్డారు. అంతలో డ్రైవర్ రఘు అనిరు«ద్ ఇంటికి వచ్చాడు. రఘును, అనిరు«ద్ని అన్నిరకాల ప్రశ్నించారు పోలీసులు. రఘు, అనిరు«ద్లు ఇద్దరూ ఒకే మాట.. ‘ఆ కిడ్నాపర్లు ఎవరో తెలియదు’ అని. కేసులో ఏ విధమైన పురోగతి కనిపించడం లేదు. ఆ కిడ్నాపర్లను పట్టుకోవడం ఎలా?! ‘రఘూ, కిడ్నాప్ జరిగిన ప్రదేశాన్ని గుర్తించగలవా?’ అన్నారు పోలీసులు. ‘గుర్తించగలను సార్’ అనడంతో పోలీసులు అతన్ని తీసుకొని బయల్దేరారు. ‘రఘూ.. నువ్వే డ్రైవ్ చేయ్’ అన్నారు పోలీసులు. వాళ్లు చెప్పింది చెప్పినట్టు ఆచరించాడు రఘు. కారు హైవే వీదుగా స్పీడ్‌గా వెళుతూ ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గరకు రాగానే కారు స్లో చేశాడు. అప్పుడే నలుగురు ఆగంతుకులు కారు మీదకు రావడంతో కారును ఆపకుండా స్పీడ్‌గా పోనిచ్చాడు రఘు. ఆ ఆగంతుకులు కారును అందుకోలేకపోయారు. ‘సార్! ఎవరో వాళ్లు మీరుండగానే ఇలా జరిగింది... నేను స్పీడ్‌గా డ్రైవ్ చేయబట్టి సరిపోయింది. లేకపోతే...’ అంటూ ఆగిపోయాడు రఘు. పోలీసులు ఏదో అర్ధమైనట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘ఇక్కడే సార్! ఈ స్పీడ్ బ్రేక్స్ దగ్గరకు రాగానే కారుని స్లో చేశాను. వీళ్లలాగే ఆ కిడ్నాపర్లూ వచ్చారు. పిస్టల్ నా తలకు పెట్టి కారును ఆపమన్నారు. నన్ను బాగా కొట్టి చెప్పిన చోటుకి కారు డ్రైవ్ చేయమన్నారు. మా సార్‌ని కూడా కొట్టారు సార్. అసలు వాళ్లు మమ్మల్ని చంపకుండా వదిలేస్తారని అనుకోలేదు. ఇప్పుడు ఇలా వచ్చిన వీళ్లెవరో..’ రఘు ఒకదాని వెంట ఒకటి చెబుతూ ఉన్నాడు. ఎస్సై తన సిబ్బంది వైపు చూశారు. తమ బాస్ కనుసైగ వారికి అర్ధమైంది. బేడీలు తీసి రఘు చేతికి తగిలించారు. రఘు షాక్ తగిలినట్టుగా పోలీసుల వైపు చూశాడు.‘నిజం చెప్పు.. జరిగిందేమిటో మాకర్ధమైంది. నువ్వుగా చెబితే శిక్ష తగ్గుతుంది. లేదంటే.. తెలుసు కదా!’ లాఠీ ఊపుతూ అన్నాడు. ‘నిజం .. సార్! స్పీడ్ బ్రేక్స్ దగ్గర బండి స్లో చేశాను.. వాళ్లు మా మీద దాడి చేశారు’ మొరపెట్టుకున్నాడు రఘు. ‘మరి ఇప్పుడూ వాళ్లలాగే నలుగురు ఆగంతుకులు (మఫ్టీలో ఉన్న పోలీసులు వారు) అడ్డు వచ్చినా నువ్వు వారిని క్రాస్ చేస్తూ స్పీడ్‌గా డ్రైవ్ చేశావు కదా! మరి అప్పుడు ఎందుకు చేయలేదు? స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసినా కారు మూవ్ అవుతూనే ఉంటుందిగా. కిడ్నాపర్లు నీ తలకు పిస్టల్ ఎంత స్పీడ్‌లో వచ్చి పెట్టి ఉంటారు?! నువ్వే కారు ఆపావని తేలిపోయిందిగా!’ ఎస్సై ఆ మాట అనడంతో రఘుకి తను దొరికిపోయానని అర్ధమైంది. విషయమంతా చెప్పడం మొదలుపెట్టాడు. ‘అనిరుద్ ఇంజనీర్. వేరే రాష్ట్రం నుంచి వచ్చి మూడేళ్లుగా ఇదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద జీతగాడు. డబ్బు ఉన్నవాడు. అతని దగ్గర ఏడాది నుంచి కారు డ్రైవర్‌గా చేస్తున్నాను. డబ్బున్నవారిని కిడ్నాప్ చేస్తే సొమ్ము చేసుకోవచ్చు అని నా స్నేహితులు అంటుంటే ఈ ఇంజనీర్ విషయం చెప్పాను. వాళ్లు అతన్ని కిడ్నాప్ చేసి, డబ్బు చేసుకుందామన్నారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను ఈజీగా డబ్బు వస్తుంది కదా అని. ఆ రోజు కారులో మేం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళతున్నది నా స్నేహితులకు ముందే చెప్పాను. అనుకున్న చోటుకి నా స్నేహితులు వచ్చి ఉన్నారు. స్పీడ్ బ్రేక్స్ దగ్గర నేనే కారు ఆపాను. వెనుక సీట్లో కూర్చున్న సార్ ఇది గమనించలేదు. అక్కడే వున్న నా స్నేహితులు మా మీద విరుచుకుపడ్డారు. ఇరవై లక్షలు వస్తాయని అనుకున్నాం. కానీ, పదిలక్షలే పోగయ్యాయి అనడంతో దాంతోనే సరిపెట్టుకుందామనుకున్నాం. అనుమానం రాకుండా ఉండేందుకు నా మీద కూడా దాడి జరిగినట్టు నమ్మించాను’ విషయం చెప్పాడు రఘు. రఘు ద్వారా మిగతా నలుగురు నిందితులు ఎక్కడ ఉంటారో తెలుసుకొని, వారినీ పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. ఎవరికీ తెలియకుండా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నాం అనుకునే నేరస్తులు ఎన్ని నైపుణ్యాలను ప్రదర్శించినా ఏదో ఓ చిన్న క్లూ ద్వారా అయినా పోలీసులకు దొరికిపోతారు. శిక్ష అనుభవిస్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ద్రోహి రఘు. తన యజమాని ముందు తలదించుకున్నాడు. జైలు గోడల మధ్య శిక్షను అనుభవిస్తున్నాడు. – నిర్మలారెడ్డి