సాక్షి, ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందించింది హోంశాఖ. అయితే సమావేశం వాయిదాకి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, ఈ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఇదివరకే హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది.
ఇదీ చదవండి; ‘లింక్’ కోసం డబ్బులా?
Comments
Please login to add a commentAdd a comment