Union Home Ministry
-
CISF: మరో అడుగు...
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్ఎఫ్లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.సీఐఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్‌ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్ఎఫ్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్ఎఫ్ హర్షం ప్రకటించింది. -
అడవిలో ఆఖరి పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరు గా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. యూపీఏ హయాంలో.. దేశంలోని ప్రధాన విప్లవ శక్తులైన పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు విలీనమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయా పార్టీల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో మావోయిస్టు పార్టీకి గెరిల్లా జోన్‌గా ఉన్న బస్తర్ అడవుల నుంచి యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌ను కేంద్రం ప్రారంభించింది. మావోయిస్టులకు ఎక్కువ మద్దతిచ్చే తెగకు.. ఎదురు నిలిచే మరో తెగ సభ్యులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది. వారి చేతికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేసింది. సల్వాజుడుం మొదటి అడుగు నుంచి 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. సల్వాజుడుంపై విమర్శలు ఎక్కువ రావడంతో 2009 సెప్టెంబర్‌లో పెద్దఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌గా పేర్కొంటున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ కారణంగా మావోయిస్టుల చేతిలో భద్రతా దళాలకు చెందిన జవాన్లు తీవ్రంగా నష్టపోయారు. బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కలేదు. నాగా కమాండోలు.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన గ్రీన్‌హంట్‌కు మరింత పదును పెట్టింది. అప్పటికే పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్‌ను బస్తర్ అడవులకు పంపాలని నిర్ణయించింది. వీరి చేతుల్లో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ ఫోన్లు పెట్టింది. అప్పటికే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాలు రంగంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆపరేషన్ సమాధాన్.. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమనే భావనకు కేంద్రం వచ్చి0ది. దీంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్íÙప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్‌బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్, ఎన్ – నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్)ను తెరపైకి తెచ్చి0ది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, మావోయిస్టుల్లోకి కొత్త నియామకాలు జరగకుండా జాగ్రత్త పడటం వంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచారు. గగనతల దాడులు ఆపరేషన్ సమాధాన్‌తో పరిస్థితులు అనుకూలంగా మారాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత 2021 జూన్ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై కేంద్ర బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం కావడం, నిరసనలు రావడంతో.. ఈ తరహా దాడులపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ 2021 జూన్ నుంచి 2022 చివరి వరకు నాలుగుసార్లు తమపై గగనతల దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. లోపాలను అధిగమిస్తూ.. మావోయిస్టుల ఏరివేతలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలను కేంద్రం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టుల (సాధారణంగా స్థానిక ఆదివాసీలకే అధికారం)తో డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ప్రత్యేక దళాలను తయారు చేసింది. నాగా కమాండోలు ఇక్కడి అడవులపై పట్టు సాధించలేకపోవడంతో.. వారికి బదులుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లను రంగంలోకి దించింది.సాయుధులైన పురుష కమాండోల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేకంగా విమెన్ కమాండో దళాలను తయారు చేసింది. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా ఏడాదంతా అడవుల్లో కూంబింగ్ చేపట్టేలా ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ జల్‌శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి0ది. దీంతో ఆఖరికి వానాకాలంలో కూడా మావోయిస్టులు నిర్భయంగా సంచరించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా భద్రతా దళాలపై మావోలు జరిపే వ్యూహాత్మక ఎదురుదాడులను గణనీయంగా తగ్గించగలిగారు. విస్తృతంగా పారా మిలిటరీ క్యాంపులు సంఖ్య, శిక్షణ, ఆధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సంసిద్ధమైన తర్వాత బస్తర్ అడవుల్లో ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలకు చెందిన క్యాంపులను ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులను కేంద్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బస్తర్‌లో 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులున్నాయి. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. చివరికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి. ఆపరేషన్ కగార్ సీఆర్పీఎఫ్, డీఆర్జీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్, కోబ్రా, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతూ ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా ఉన్న అబూజ్మడ్ (బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్) అడవులపై ప్రభుత్వం గురి పెట్టింది.ఈనెల 5న తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరో 400 మందికి పైగా లొంగిపోవడం లేదా అరెస్టయ్యారు. ప్రభుత్వ దళాల నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు అగ్రనేతలు చెల్లాచెదురయ్యారనే ప్రచారం జరుగుతోంది. -
పవన్, అనితలకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితలకు కేంద్రం షాకిచ్చింది. ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులపై వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధమని తేల్చింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నలతోనే ఆ బండారమంతా బయటపడింది. గతంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో పవన్ కల్యాణ్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాళ్లందరినీ గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రకటనలు చేశారు. అందరినీ రెచ్చగొట్టారు. కూటమి అధికారంకి వచ్చాక సైతం పవన్ వాళ్లను వెనక్కి రప్పిస్తానంటూ చెబుతూ వస్తున్నారు. మరోవైపు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే వంగలపూడి అనిత సైతం అలాంటి విమర్శలే చేస్తూ వచ్చారు. అయితే.. జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరి ఆరోపణలు అబద్ధమని కేంద్ర హోం శాఖ తేల్చింది. ఏపీలో పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్ సభలో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ, బీకే పార్థసారథిలు ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు స్పష్టం చేశారాయన. -
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
చట్టంలో ఈ మార్పులు ఎవరి కోసం?
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మూడు చట్టాలు బాధితులకు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అలా ఉన్నట్టుగా అనిపించటం లేదు. అందుకు ఉదాహరణగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను పేర్కొనవచ్చు. ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు నేర సమాచారం కాగ్నిజబుల్ అయితే ఎఫ్ఐఆర్ను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 154 ప్రకారం తప్పక నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిపై ఉంది. ఈ విషయంలో అతను తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం చట్టం అతనికి ఇవ్వలేదు. సమాచారంలో విశ్వసనీయత కనిపించటం లేదనే కారణం కానీ లేదా అవసరమైన వివరాలు లేవని కానీ ఎఫ్ఐఆర్ను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో సమాచారం అన్నదే నిర్ణయాత్మకమైన విషయం. అందులోని విశ్వసనీయత తీవ్రతను చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న విషయం తేలితే కేసును మూసివేసి, తుది నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు. అవసరమని భావించినప్పుడు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ను విడుదల చేయటానికి విశ్వసనీయ సమాచారం అవసరం లేదు. అందుకు కావలసిన అంశాలు రెండే రెండు. మొదటిది– అది సమాచారం అయ్యుండాలి. రెండవది– అది కాగ్నిజబల్ అయిన సమాచారం అయిఉండాలి. అయితే సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (ఏఐఆర్ 2014 సుప్రీం కోర్టు 187) కేసులో కొన్ని సందర్భాలలో ప్రాథమిక విచారణ చేసే వెసులుబాటును పోలీసులకు కల్పించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ప్రాథమిక విచారణ గురించి ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా ప్రాథమిక విచారణ జరుపకూడదని కూడా ఎక్కడా నిషేధం లేదు. నిషేధం లేనంత మాత్రాన ప్రాథమిక విచారణ చేయవచ్చని అనుకోడానికి వీలు లేదు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసులలో ప్రాథమిక విచారణ జరుపడానికి వెసులుబాటు కల్పించింది. ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడానికైనా ముందు ఎంక్వయిరీ జరిపే నిబంధన ఏదీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో లేదు. లలిత కుమారి కేసు ప్రకారం కాగ్నిజబల్ నేర సమాచారం ఉన్నప్పుడు పోలీసులు విధిగా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలి. ఎలాంటి విచారణనూ చేయడానికి వీలు లేదు. ఒకవేళ అందిన సమాచారంలో కాగ్నిజబల్ నేరం వెల్లడికానప్పుడు అది కాగ్నిజబల్ నేర సమాచారం ఔనా, కాదా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమిక విచారణ చేయవచ్చు. అంతే తప్ప మరే విషయంలో ప్రాథమిక విచారణ చేయడానికి వీలులేదు. ఎలాంటి కేసులలో ప్రాథమిక విచారణ జరుపాలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. 1. వివాహ వివాదాలు/ కుటుంబ వివాదాలు 2.వాణిజ్య నేరాలు 3. వైద్య నిర్లక్ష్య కేసులు 4. అవినీతికి సంబంధించిన కేసులు 5. సమాచారం అందచేయటంలో తీవ్రమైన జాప్యం ఉన్నప్పుడు. ఈ ప్రాథమిక విచారణను పోలీసులు జరుపవచ్చు. విచారణ సమయాన్ని 15 రోజులుగా సుప్రీంకోర్టు నిర్దేశించింది. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నపుడే కేసు నమోదు చేసుకోవడానికి బాధితులు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. అంతేకాదు కేసు నమోదు కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది. ఈ ప్రాథమిక విచారణను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ప్రముఖమైన ఉదాహరణ, పత్రికల్లో వచ్చిన ఉదాహరణ– ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి పది కోట్ల రుణం తీసుకున్నాడు. అది కట్టలేదు. చివరికి బ్యాంక్ వాళ్ళు ఆ రుణం వసూలు చేయడానికి ఏజంట్లను నియమించుకున్నారు. ఈ పరిస్థితిని అధిగమించటానికి ఆ రుణం తీసుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, ఒక ఫిర్యాదును బ్యాంక్ ఉన్నతాధికారుల మీద దాఖలు చేశాడు. ప్రాథమిక విచారణ పేరుతో పోలీసులు ఆ అధికారులను తరచూ పిలుస్తూ ఆరు మాసాలు గడిపారు. ఆ ఉన్నత అధికారులకు కేసు భయం పట్టుకునేలా చేశారు. చివరికి బ్యాంక్ అధికారులు తక్కువ మొత్తానికి ఒకేసారి పరిష్కారాన్ని చేసుకున్నారు. దాని వల్ల బ్యాంక్ నష్ట పోయింది. రుణం తీసుకున్న వ్యక్తి లాభపడ్డాడు. ఈ ప్రాథమిక విచారణ సమయంలో అనుమానితుడిని పిలిచే అధికారం పోలీసులకు లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీసులు చేయాల్సింది రహస్య విచారణ. దాని పరిధి కూడా చిన్నది. కాగ్నిజబల్ నేరం జరిగిందా, లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే పోలీసులు విచారణ జరపాలి కానీ పోలీసులు సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన దానిని మించి ప్రాథమిక విచారణ పేరుతో ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తికి లాభం జరిగే విధంగా ప్రవర్తించారు. బ్యాంక్‌కు కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 41 ప్రకారం లేదా 160 ప్రకారం మాత్రమే అనుమానితులను పిలవడానికి అవకాశం ఉంది. కానీ ఎలాంటి అధికారం లేకుండానే పోలీసు అధికారులు ఈ కేసులో బ్యాంక్ ఉన్నత అధికారులను పిలిచి, ఫిర్యాదు చేసిన వ్యక్తికి లాభం కలిగేలా చేశారు. ప్రాథమిక విచారణను పైవిధంగా జరుపడానికి అధికారం లేనప్పుడే పోలీసులు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ జరుపచ్చని చట్టం నిర్దేశిస్తే ఇంకా ఎంత దుర్వినియోగం అవుతుందోనని అనిపిస్తుంది. ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత 2024’ లోని 173 ప్రకారం పోలీసు అధికారులు 3 సంవత్సరాలు కానీ, అంతకు మించి కానీ, 7 సంవత్సరాల లోపు కానీ ఉన్న నేరాలలో పోలీసులు ప్రాథమిక విచారణ జరుపవచ్చు. అది కాగ్నిజబల్ నేర సమాచారం ఐనప్పటికి కూడా ఈ విచారణను పోలీసు అధికారి జరపటానికి అవకాశం ఉంది. ఈ ప్రాథమిక విచారణ చేయడానికి పోలీస్ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అతను ఈ అనుమతిని ఎంతకాలంలో ఇవ్వాలి అన్న విషయం గురించి చట్టంలో ఏమీ చెప్పలేదు. ఆ అనుమతి కోసం కూడా బాధితులు ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక విచారణను చేయడానికి అనుమతిస్తే... పోలీస్ అధికారి విచారణను 14 రోజుల్లో పూర్తి చేయాలి. ఈ విచారణ లలిత కుమారి కేసులో సుప్రీం కోర్టు చెప్పిన విధంగా కాదు. కేసులో ప్రాథమికంగా చూసినప్పుడు బలం ఉందా, లేదా అని అనిపించినప్పుడు విచారణ జరుపవచ్చు. కేసులోని స్వభావాన్ని బట్టి, తీవ్రతను బట్టి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక విచారణ జరుపడానికి అనుమతిని ఇస్తారు. ఈ విచారణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేసు నమోదు కావడానికే బాధితులు తీవ్రమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. 7 ఏళ్ల లోపు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాలు 98 వరకు ఉన్నాయి. వాటిలో చాలా నేరాలు తీవ్రమైన నేరాలే. ప్రాథమిక విచారణ పేరుతో నెలల తరబడి విచారణ జరిపితే సాక్ష్యాలు మాయమయ్యే పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రథమ సమాచార నివేదిక ఉద్దేశ్యం కూడా దెబ్బ తినే అవకాశం మరింత ఉంది. బాధితులకు లాభం చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పాటు చేశారని ప్రభుత్వం చెప్పినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఈ నిబంధన దుర్వినియోగం కానుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విమర్శను గమనించి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని బీపీఆర్డీఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఈ ప్రాథమిక విచారణ గురించి విడుదల చేసింది. దాని ప్రకారం ప్రాథమిక విచారణ కోసం ఆఫీసర్ ఇన్‌ఛార్జి ఆఫ్ పోలీస్ స్టేషన్ అనుమతి కోరిన 24 గంటలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవ్వాలని చెప్పారు. ఒకవేళ 24 గంటల్లో అనుమతి ఇవ్వకపోయినా, అనుమతిని తిరస్కరించినా, ఏ విషయాన్ని తెలియచేయకపోయినా... ఆ పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టవచ్చు. ఈ ప్రా«థమిక విచారణ సమయం లో పోలీసు అధికారి సాక్ష్యాలు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా సాక్షులను విచారిస్తారు. వీటి వల్ల సాక్ష్యాలలో వైరుద్ధ్యాలు పెరిగి కేసు బలహీనపడే అవకాశం ఉంది. దానివల్ల బాధితులకి న్యాయం జరుగదు. మరి ఎవరి కోసం ఈ మార్పులు? ఈ కొత్త చట్టాలు? దీనికి సమాధానం కాలమే చెప్తుంది. డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001 -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్‌కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్‌కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్‌లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
అమల్లోకి సీఏఏ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం తాలూకు నియమ నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కలి్పస్తున్న తొలి చట్టమిది! పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కలి్పంచడం దీని ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు ఆ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ (సవరణ) నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘సీఏఏ చట్టం–2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచాం’’అని ఆయన వెల్లడించారు. బీజేపీ హర్షం, విపక్షాల ధ్వజం సీఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వెలిబుచ్చారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చి చూపారంటూ అభినందించారు. పాక్, బంగ్లా, అఫ్గాన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనారిటీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై మండిపడ్డాయి. ఇది దేశ సమగ్రతకు సీఏఏ విఘాతమంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఆప్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, మజ్లిస్ తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. దీన్ని కేవలం బీజేపీ ఎన్నికల లబ్ధి ఎత్తుగడగా అభివరి్ణంచాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అసోంలలో మతపరమైన విభజన తెచ్చి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ చర్యకు దిగిందని ఆరోపించాయి. ఆమ్నెస్టీ ఇండియా కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. సీఏఏను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఇది సమాజంలో మతపరంగా విభజనకు దారి తీస్తుందదన్నారు. ప్రజల హక్కులను హరించే ఎలాంటి మత, కుల, సామాజికపరమైన వివక్షనైనా తుదికంటా వ్యతిరేకించి తీరతామని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అసోంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. పాక్ తదితర దేశాల నుంచి వచి్చన ముస్లిమేతర శరణార్థులు మాత్రం దీన్ని స్వాగతించారు. ముస్లింల పట్ల సీఏఏ పూర్తిగా వివక్షపూరితమంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019లోనే దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఏఏ అమలు నిర్ణయం వెలువడ్డ నిమిషాల్లోనే సంబంధిత ఇ–గెజిట్ వెబ్సైట్ క్రాషైంది. దాన్ని కాసేపటికి పునరుద్ధరించారు. సీఏఏలో ఏముంది...! ► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. ► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కలి్పస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు. ► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది. ► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(ఎంఏ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(మసరత్ ఆలం)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సాయపడుతూ దేశ వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ‘‘ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచే ఎలాంటి సంస్థలు, శక్తులనైనా కేంద్రం ఊరికే వదిలిపెట్టదు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద ఈ సంస్థపై చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్లో భారత వ్యతిరేక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, జనాన్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత అతివాద హురియత్ కాన్ఫెరెన్స్‌కు మసరత్ చైర్మన్‌గా ఉన్నారు. 2010లో కశ్మీర్ అల్లర్లకు బాధ్యుల్లో భట్ కూడా ఒకరు. దీంతో అదే ఏడాది భట్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భట్‌ను విడిపించారు. బీజేపీ ఒత్తిడితో అరెస్ట్‌చేసి జైలులో పడేశారు. -
విభజనతో ఏపీకి తీవ్ర నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. పోలవరం, ప్రత్యేక హోదా ప్రస్తావించండి అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారు. కానీ రెవెన్యూ పరంగా 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయి. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలూ రాలేదు. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరముంది. అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలిచ్చారు. హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం. దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం హామీలిచ్చింది. విభజన చట్టంలో ఉన్న స్ఫూర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సిన అవసర ముంది. ఇవి నెరవేరితే ఏపీలో వసతులు సమకూరి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం పురోగమిస్తేనే దేశం కూడా పురోగమిస్తుంది. కడప స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలి కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని కోరుతున్నాం. కచ్చితంగా ఇది వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దుగరాజç³ట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్ ప్లాంటుకు సమీపంలోని ఎన్ఎండీసీ నుంచి గనులు కేటాయించాలి. దీంతో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్గం సులభమవుతుంది. వీటకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. భోగాపురం ఎయిర్‌పోర్టు రోడ్డును ప్రస్తావించండి విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామన్నారు. విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. దీనికి కనెక్టివిటీ చాలా ముఖ్యం. మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాలి. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. విశాఖ మెట్రో రైలుపై ఒత్తిడి తెండి విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కి తీసుకురావాలి. ప్రైవేట్ డెవలపర్ 60% భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40% కేంద్రం భరించేలా ఒత్తిడి తీసుకురావాలి. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పెండింగ్‌లో ఉంది. దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి. విశాఖ నుంచి రాయలసీమకు హైస్పీడ్ రైల్ కారిడార్ కావాలి విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. విశాఖ–వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల 3 ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయి. విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా దృష్టిపెట్టాలి. మూడు ప్రాంతాల అభివృద్ధికి సాయాన్ని కోరాలి అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి. -
ఫేక్ లోన్ యాప్‌లతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్ లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆన్లైన్ రుణ యాప్‌లు ప్రముఖ కంపెనీల పేర్లను సైతం వాడుకొని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూపీ ప్రో అనే ఆన్లైన్ రుణ యాప్ బజాజ్ ఫైనాన్స్ పేరును వినియోగించినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గుర్తించింది. ఫేక్ యాప్‌ల వివరాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తోంది. చైనా సహా శత్రుదేశాల నుంచి కొన్ని సంస్థలు ఆన్లైన్ రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటి సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటున్నందున బాధితులు మోసపోయినప్పుడు కేసుల దర్యాప్తు సైతం కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో రుణం తీసుకొనే ముందు యాప్‌ల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఫేక్ రుణ యాప్‌ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి... ♦ వెరిఫై చేయని ఆన్లైన్ రుణ యాప్లనుప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు. ♦ ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అఫిలియేషన్ లేకపోయినా అది మోసపూరిత ఆన్లైన్ లోన్ యాప్‌గా గుర్తించాలి. ♦ తక్కువ మంది యూజర్లు, ప్రతికూల రేటింగ్స్ ఉన్న యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ♦ రుణం ఇచ్చేందుకు నిబంధనలేమీ లేకుండా వెంటనే సొమ్ము ఖాతాలో జమ చేస్తామని పేర్కొనే యాప్‌లు నకిలీవేనని తెలుసుకోవాలి. ♦ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలి. కేంద్ర హోంశాఖ గుర్తించిన నకిలీ రుణ యాప్‌లు - ఐవొరి లెండ్స్, క్యాష్ పార్క్, ఆన్లైన్ రూపీ ప్రో, మొబాబా కాయిన్స్, ఫిన్కాష్, లోన్బడ్డీ. -
29 మంది ఏపీ అధికారులకు పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ దేశంలో మొత్తం 954 మంది అధికారులకు సోమవారం పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఒకరిని రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, 229 మందిని పోలీస్ శౌర్య పతకాలు, 82 మందిని రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందిని ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 1 రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం, 10 ప్రతిభా పోలీస్ పతకాలు, 18 పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) శంఖబ్రత బాగ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపికైనవారు.. 1. దాడిరెడ్డి మురళీధర్‌రెడ్డి, సీఐ, కర్నూల్ టౌన్ 2. సింగులూరి వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 3. కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం సిటీ 4. సుంకర మునిస్వామి, ఆర్ఐ, మంగళగిరి 5. బెండి కాశీపతి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం 6. జమ్మలమడుగు నిసార్ అహ్మద్ బాషా, ఏఎస్ఐ 7. బెహార నాగభూషణరావు, ఏఎస్ఐ 8. కన్నూజు వాసు, ఇన్స్పెక్టర్, గుంటూరు 9. మంద సత్యనారాయణ, ఏఎస్ఐ 10. తోట బ్రహ్మయ్య, డీఎస్పీ రాష్ట్రం నుంచి పోలీస్ శౌర్య పతకాలకు ఎంపికైనవారు.. 1. కనపాకల హేమసుందరరావు (ఏఏసీ) 2. మార్పు సుదర్శనరావు (ఎస్సీ) 3. జక్కు దేముడు (జేసీ) 4. పొన్నాడ లవకుమార్ (ఏఏసీ) 5. చిక్కంగౌరి వెంకట రామచంద్రరావు (ఎస్సీ) 6. ముర సత్యనారాయణరావు (జేసీ) 7. మట్టపర్తి సుబ్రహ్మణ్యం (జేసీ) 8. శంఖబతుల వీరవెంకట సత్యనారాయణ (జేసీ) 9. ప్రగడ పోశయ్య (జేసీ) 10. ఏడిగగండ్లూరు అశోక్ కుమార్ (అడిషనల్ ఎస్పీ) 11. పైల పార్వతీశం (ఎస్సీ) 12. గొర్లి రమణబాబు (జేసీ) 13. షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్) 14. గుల్లిపల్లి నాగేంద్ర (జేసీ) 15. కోమట్ల రామచంద్రారెడ్డి (జేసీ) 16. దాసరి సురేష్ బాబు (జేసీ) 17. ఏపూరి మధుసూదన్‌రావు (జేసీ) 18. పాళ్యం మహేశ్వరరెడ్డి (ఏఏసీ) -
954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్‌గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్‌పామ్ ఇబోంచా సింగ్‌కు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. తెలంగాణ నుంచి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన ఇద్దరు వీరే ►అదనపు డీజీ విజయ్ కుమార్, ►ఎస్పీ మదాడి రమణ కుమార్ తెలంగాణకు చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు ►ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్. తెలంగాణ నుంచి పోలీస్ సేవా పతకాలు లభించిన పది మంది పోలీస్‌ల వివరాలు : ►బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ,ఖైరతాబాద్. ►మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ. ►ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ. ►ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ. ►కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ. ►మహంకాళి మధు, ఆర్ఎస్ఐ. ►అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ. ►రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో. ►అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్,హైదరాబాద్. ►సాయన వెంకట్వార్లు, ఏఎస్ఐ. -
మణిపూర్ వీడియోపై నేడు సుమోటో విచారణ
మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రం సీరియస్‌గానే ఉంది. మరీ ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోం. కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఇక విచారణనే మణిపూర్ వెలుపలా.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా ఆదేశించండి: కేంద్రం హోం శాఖ ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోsuo motoగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన కేంద్రం హోం శాఖ.. మరోవైపు ఈ కేసు ట్రయల్ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్లో సుప్రీంను కోరింది. సీబీఐకి దర్యాప్తు బదిలీ అయ్యింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సదరు అఫిడవిట్లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో.. మీడియా ద్వారా మణిపూర్ వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. ‘‘యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. జులై 28(నేటికి) విచారణ వాయిదా వేసింది. -
ఏపీలోనే మహిళా పోలీసులు అత్యధికం
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా పోలీసులు అత్య«దికంగా ఉన్న రాష్ట్రాల్లో అంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో అత్యధికంగా 21.76 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ఉన్నారు. కాగా అఖిల భారత స్థాయిలో మహిళా పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. జాతీయ స్థాయిలో 11.75 శాతమే ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పోలీసుల అంశం రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీతోపాటు మహిళా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి అదనపు పోస్టులను సృష్టించాలని సూచించింది. ప్రతి పోలీసు స్టేషన్లో కనీసం ముగ్గురు మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు పేర్కొంది. తద్వారా పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్‌డెస్క్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపింది. -
ఏపీ భవన్.. ఆంధ్రప్రదేశ్‌కు 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్‌కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీ భవన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్–డీలో భాగంగా పటౌడీ హౌస్ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని కేంద్రం తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్రం ఆప్షన్–ఈ కింద పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ కలిపి 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అని ప్రతిపాదించింది. కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్‌కుమార్ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆప్షన్లు ఇవే.. ఏపీ ఆప్షన్–ఏ: తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్‌లో సగభాగం.. ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ బ్లాకు, పటౌడీ హౌస్‌లో సగభాగం ఏపీ ఆప్షన్–బీ: ఏపీకి పటౌడీ హౌస్ మొత్తం, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ తెలంగాణ ఆప్షన్–సీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ తెలంగాణ ఆప్షన్–డీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు, ఏపీకి పటౌడీ హౌస్ కేంద్రం ఆప్షన్–ఈ: ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ సహా 12.09 ఎకరాలు.. తెలంగాణకు పటౌడీ హౌస్ 7.64 ఎకరాలు . చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా తొమ్మిదేళ్లుగా ఒకే బిల్డింగ్‌లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్‌ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. అయితే ఢిల్లీ ఇండియా గేట్ పక్కన 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్.. ఏడు వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించట్లేదు. అయితే నేటీ సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక -
ఏపీ భవన్ విభజన సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందించింది హోంశాఖ. అయితే సమావేశం వాయిదాకి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఇదివరకే హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఇదీ చదవండి; ‘లింక్’ కోసం డబ్బులా? -
పేద ఖైదీలకు ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది. -
‘ఆక్స్‌ఫాం’పై దర్యాప్తుకు కేంద్రం సిఫార్సు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్‌ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే. పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్‌ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది. -
కొలిక్కిరాని ‘విభజన’ సమస్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు మరోసారి కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మంగళవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం పెద్దగా ఫలితమివ్వకుండానే ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలపాటు ఈ భేటీలో చర్చించగా రెండు రాష్ట్రాలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. కేంద్ర హోంశాఖ జోక్యం వద్దు.. షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికార పరిధి లేదని పాడిపరిశ్రమల సంస్థ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిందని సమావేశంలో తెలంగాణ గుర్తు చేసింది. షెడ్యూల్–9లో 91 సంస్థలుండగా 90 సంస్థల విభజనపై షీలా బిడే కమి టీ చేసిన సిఫారసులన్నింటినీ అంగీకరించాలని ఏపీ కోరింది. అయితే కేసులు తేలే వరకు నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (దిల్) ఆస్తుల విభజనకు షీలా బిడే కమిటీ సిఫారసులు చేసిందని తెలంగాణ తప్పుబట్టింది. ‘దిల్’భూములను తెలంగాణ స్వాదీనం చేసుకోవడాన్ని ఏపీ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించిందని గుర్తుచేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కేసు తేలాకే ఆ సంస్థను విభజించాలని తెలంగాణ స్పష్టం చేసింది. కోర్టు కేసులపై పరిశీలన జరపాలని కేంద్ర హోంశాఖను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. నగదు నిల్వల పంపకాలపై తెలంగాణ ఓకే.. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా షెడ్యూల్–10లోని సంస్థల నగదు నిల్వల పంపకాలను జనాభా దామాషా ప్రకారం జరపాలని కేంద్రం ఉత్తర్వులకు తెలంగాణ మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టులో ఏపీ వేసిన కేసు పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థను విభజించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51% వాటాను తమకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపర్చిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆప్మెల్’నే విభజించాల్సి ఉందని స్పష్టం చేసింది. బియ్యం సబ్సిడీల్లో తెలంగాణ వాటా బకాయిలను ఏపీ చెల్లిస్తే ఏపీ పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ తీసుకున్న రూ. 354 కోట్ల రుణాలను చెల్లించడానికి తెలంగాణ అంగీకరించింది. విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. నగదు, బ్యాంకుల్లో నిల్వల విభజన విషయంలో ‘కాగ్’సహకారం తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. పన్నుల్లో తేడాల నిర్మూలనకు విభజన చట్ట సవరణ జరపాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. గిరిజన వర్సిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలించండి... తెలంగాణ విజ్ఞప్తులకు స్పందిస్తూ విభజన హామీలైన గిరిజన వర్సిటీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉన్నత విద్య, రైల్వే శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వెనుబడిన జిల్లాల అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. దాదాపురెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. 14 అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో భేటీ జరిగింది. సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు కరికాల వలవన్, కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు గౌరవ ఉప్పల్ పాల్గొన్నారు. చదవండి: (50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్‌లో చేరేలోపే గుండెపోటుతో మృతి) -
సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: సహకార రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్రాలు కలసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు. రాష్ట్రాల సహకార శాఖల మంత్రుల రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ సహకార ఉద్యమం ఒకే వేగంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార రంగం కార్యకలాపాలు నిదానించిన చోట, తగ్గుముఖం పట్టిన చోట వెంటనే వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే మనకు జాతీయ సహకార విధానం కావాలన్నారు. నూతన విధానం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోపరేటివ్ రంగం సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా, కొత్త విభాగాలను గుర్తించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. సహకార ఉద్యమం దక్షిణ భారత్, పశ్చిమ భారత్‌లో బలంగా ఉందన్నారు. ఉత్తర, మధ్య భారత్‌లో అభివృద్ధి దశలో ఉంటే, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువ అభివృద్ధికి నోచుకున్నట్టు చెప్పారు. 100 ఏళ్ల లక్ష్యం.. : కోపరేటివ్ రంగం అభివృద్ధికి రాష్ట్రాలన్నీ ఒకే మార్గాన్ని, ఏకీకృత విధానాలను అనుసరించాలని అమిత్‌షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వారమే 47 మంది సభ్యులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అధ్యక్షతన గల ఈ ప్యానెల్ సహకార రంగానికి సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయలని అమిత్‌షా కోరారు. ‘‘మన లక్ష్యం 100 ఏళ్లుగా ఉండాలి. కోపరేటివ్‌లు దేశ ఆర్థిక రంగానికి మూలస్తంభంగా మారాలి’’అని అమిత్‌షా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కోపరేటివ్ రంగం వృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ల సంఖ్యను ఐదేళ్లలో మూడు లక్షలకు పెంచడంతోపాటు, డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. -
భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2021లో 1.6 లక్షల మంది పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపింది. గతేడాది 78,284 మంది ఇండియన్స్ అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశీ పౌరసత్వం వదులుకున్న వారిలో అమెరికా ఎన్నారైలే అత్యధికంగా ఉండటం విశేషం. ద్వంద్వ పౌరసత్వాన్ని మనదేశం అనుమతించదు. దీంతో విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ఒక దేశ పౌరసత్వం మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. కాగా, చైనాలో నివసిస్తున్న 362 మంది భారతీయులు కూడా స్వదేశీ సిటిజన్‌షిప్‌ను వదులుకుని చైనా పౌరసత్వం ఉంచుకున్నారు. వ్యక్తిగ కారణాల వల్లే స్వదేశీ పౌరసత్వాన్ని ప్రవాసులు వదులుకున్నారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. లోక్‌సభలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం శాఖ 2018లో పౌరసత్వ నిబంధనలను సవరించింది. విదేశీ పౌరసత్వాన్ని పొందడం, భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సంబంధించిన కాలమ్‌ను దరఖాస్తులో పొందుపరిచింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల్లో 23,533 మంది, కెనడా నుంచి 21,597 మంది స్వదేశీ పౌరసత్వం వదులుకున్నారు. బ్రిటన్(14,637), ఇటలీ(5,986), నెదర్లాండ్స్ (2187), న్యూజిలాండ్( 2643), , సింగపూర్(2516), పాకిస్తాన్(41) నేపాల్(10) తదితర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాలను స్వీకరించారు. భారత పౌరసత్వం వదులుకున్న వారిలో 103 దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఉన్నారని కేంద్ర హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. (క్లిక్: రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్) -
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–8
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదే శాల ప్రకారం ఏటా రెండు విడతల్లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–8ని వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్నట్టు మహి ళలు, చిన్నారుల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. జూలై 1 నుంచి నెల పాటు జరిగే ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. అలాగే తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నారు. ఈ ఆపరేషన్‌పై మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్ విభాగాలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించినట్టు స్వాతిలక్రా తెలిపారు. ఈ సమా వేశంలో మహిళాభివృద్ధి, చిన్నారుల సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక క్యార్యదర్శి డి.దివ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ, శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు. (క్లిక్: 38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్) -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం.