ఆదేశించిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది.
ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు
మరో ఐదుగురి అరెస్ట్
ఈ ఘటనలో బేస్‌మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్‌చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.
20 బేస్‌మెంట్లకు సీలు
కోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్‌మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్‌లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment