Drainage system
-
సరదా డీఎన్ఏ పరీక్ష... మర్డర్ మిస్టరీని ఛేదించింది!
అది 1997. అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో మాకినాక్ కౌంటీ. ఓ డ్రైనేజ్ కాలువలో నవజాత శిశువు మృతదేహం దొరికింది. పోలీసులు ఎంత విచారించినా ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో కనిపెట్టలేకపోయారు. తనకు ‘బేబీ గార్నెట్’గా నామకరణం చేసి స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పుణ్యమా అని ఏకంగా పాతికేళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. ఓ యువతి సరదాగా చేసుకున్న డీఎన్ఏ టెస్ట్ ఈ కేసులో ఆమె అమ్మమ్మను జైలుపాలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా డీఎన్ఏ కిట్లు కానుకగా ఇవ్వడం అమెరికాలో ఆనవాయితీ. అలా మిషిగాన్‌లోని న్యూబెర్రీలో పూల దుకాణంలో పనిచేసే జెన్నా గెర్వాటోవ్స్కీకి డీఎన్ఏ కిట్ అందింది. ఆమె సరదాకు టెస్ట్ చేసుకుని అక్కడితో మరిచిపోయింది. అయితే, ‘బేబీ గార్నెట్’ కేసు గురించి విన్నారా?’ అంటూ 2022లో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవునని చెప్పింది జెన్నా. తన డీఎన్ఏ బేబీ గార్నెట్ డీఎన్ఏతో సరిపోయిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. 1997లో చనిపోయిన శిశువుకు, తనకు సంబంధమేమిటో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాక తల్లి కారాకు చెబితే స్పామ్ కాల్ అయి ఉంటుందని కొట్టిపారేసింది. కానీ వారం తరువాత షాప్‌లో ఉండగా అర్జెంటుగా ఇంటికి రమ్మంటూ తల్లి ఫోన్ చేసింది. వెళ్లి చూస్తే ఇంట్లో పోలీసులున్నారు. బేబీ గార్నెట్ తనకు పిన్ని అవుతుందని వారు చెప్పడంతో జెన్నా ఆశ్చర్యపోయింది. పోలీసులు తల్లితో మాట్లాడి ఆమెనూ డీఎన్ఏనూ పరీక్షలకు ఒప్పించారు. కారాకు బేబీ గార్నెట్ స్వయానా సోదరి అని తేలింది. కారాను లోతుగా ప్రశ్నించగా తన తర్వాత తల్లి నాన్సీకి ఓ పాప పుట్టిందని, ఊపిరాడక మరణించిందని చెప్పింది. కానీ ఆ పాపను పుట్టగానే సంచిలో పెట్టి పడేశారన్నది పోలీసుల వాదన. నాన్సీపై నవజాత శిశువు హత్యాభియోగం మోపారు. రుజువైతే ఆమెకు జీవిత ఖైదు పడవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పూర్’.. పాలికలు!
పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లుస్మార్ట్ రోడ్డు పనులూ సగం వరకే!⇒ వరంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి మునిసిపల్ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్‌లతో పాటు పలు పెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కరీంనగర్ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో.. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్సోర్సింగ్ బిల్లులతో పాటు ఈఈఎస్ఎల్ (విద్యుత్ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్ బోర్డు ట్రాన్స్ఫర్ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్కూ నిధుల షార్టేజీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అధ్వానంగా ఉంది గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. – వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ కౌన్సిల్స్ చైర్మన్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. – భూక్యా రాము నాయక్, మునిసిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్లో అకస్మాత్తుగా కాంట్రాకర్ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. రూ.100 కోట్లు మంజూరుతోనే సరి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది. -
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
"డ్రైనేజ్ టు డైమండ్.." పవన్ కొత్త ప్రాజెక్ట్
-
సంక్షేమం కోసం CM జగన్ ప్రభుత్వం పని చేస్తోంది: MLA
-
అపర బాహుబలి మా కల్వకుంట్ల కేసీఆరయ్య!!
‘‘అప్పుడెప్పుడో కాటన్దొర అని ఓ ఆసామి ఉండేవాడు. ఆయన నూరూ, నూటాయాభై ఏళ్ల కిందట కట్టిన బ్యారేజ్‌లు చెక్కుచెదర...’’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో విమర్శించబోతుంటే..రాబోతున్న గుగ్లీ బంతేమిటో తెలిసి, మధ్యలోనే దాన్ని కట్ చేస్తూ... ‘‘ఏయ్... ఎవల్లో ఎప్పుడో ఆంధ్రోల్ల కోసం, ఆంధ్ర ఏరియాల కట్టిన ప్రాజెక్టులతోని పోల్చి..తెలంగాణను తక్కువ చేస్తూ మాట్లాడతరెందుకురా?’’ అంటూ దాన్ని కవర్‌డ్రైవ్ వైపు నెట్టేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ‘‘అయితే తెలంగాణ గురించే మాట్లాడదాం. ఈడ హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు ప్లానిచ్చిండు. ఇక్కడి డ్రైనేజీ సిస్టమ్‌ను చక్కబెట్టడానికి అలనాడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వర...’’ మళ్లీ మధ్యలోనే మాట కట్ చేసి, మళ్లీ ఇలా చెప్పారు. ‘‘అసలు తెలంగాణ అపరభగీరథుడు కేసీఆర్ పవరేమిటో తెల్సా? అసలాయన ఉనికేందో, ఎల్లవేళలా నీళ్లల పుట్టి నీళ్లల పెరిగిన ఆ సంగతులు తెల్సా మీకు?’’ ‘‘ఏందీ... నీల్లల్ల బుట్టి నీల్లల్ల పెరిగిండా? అదెట్ల?’’ చెప్పడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ వారు. అదేదో సిన్మాల బాహుబలి అనేటాయన ఒక పే...ద్ద జలపాతం.. దాని ఎమ్మట్నే పారే పే...ద్ద నది ఉండే..ఆ ఊళ్ల పెరిగిండు కదా. కానీ కేసీఆర్ సార్ నిజంగనే నాలుగు మూలలల్ల నాలుగు అద్భుత తటాకాలున్న పల్లెల పుట్టి, పెరిగిండు. చింతమడక అనే ఆ ఊళ్లె... ఊరికి ఉత్తరాన పెద్ద చెరువు ఉంటె, దక్షిణాన దమ్మచెరువుంది. కొద్దిగ పెడమర్ల పడమర్ల కోమటి చెరువు! తూర్పున సింగచెరువు!! కొద్దిగ దూరంల అంకపేటల ఈశాన్యాన పెద్ద చెర్వు!! కోమటిచెరువుల ఈదిండు. పెద్ద చెరువుల తొక్కునీల్ల కాడ దునికి కాకరాల్ల దాక పొయ్యి... అక్కడ మత్తడి దాంక ఈతగొట్టిండు. చింతచెర్వు మొత్తం ఈదిండు. దమ్మచెర్వుకింద ఒక బాయి ఉండె. దాంట్లెకు మోటచిమ్ములెక్కి దునికేది. ఎత్తు సరిపోక మర్రిచెట్టుకొమ్మలెక్కి కూడ దునికేది. అసలు వాళ్ల ఊళ్లె వాళ్లింటి పాటకు ముందునుంచే మూణ్ణెల్లు జాలు నీళ్లు జాలుబారుతుంటే, ఆ నీళ్లల కాయితప్పడవలేసి, ఆడిండు. ఇగ రాజకీయాలల్లకు వచ్చినంక గూడ.. కార్ల పొయ్యేటప్పుడు ఏడ్నన్న బిడ్జి కనబడితే సాలు... ఆగి దాంట్లెకు ఓ రూపాయో, రెండో, ఐదురూపాల బిళ్లను ఇసిరేటోడు. అది బుడుంగన మునిగేదాంక ఆగి చూసి, అప్పుడు కదలేటోడు. నీళ్లతోని ఇంత అనుభవం, ఇంత నైపుణ్యం ఉండి, జాలునీళ్లల్ల కాయితప్పడవలతోటి ఫ్లోటాలజీ, నీళ్లు పారే తీరు తెలిసిన ‘ఫ్లోవాలజీ’, మునిగే కాయిన్లతోని తెలుసుకున్న ‘బుడుంగాలజీ’, వాటర్ల నీటిశాతం, బురదల జిగటశాతం, ఉస్కెతోని రేణుశాస్త్రం.. ఇయన్నీ తెలుసుగాబట్టే.. తెల్లారితె బాహుబలి జలపాతాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టే... కేసీఆర్ సారు గూడ పొద్దుందాక నీళ్లతత్వం అధ్యయనం చేసి, తెలుసుకునేది. ఆ అనుభవంతోని వచ్చినయే ఈ మేడిగడ్డలూ, అన్నారాలు... ఈ ప్రాజెక్టులన్నీ. ఆ సిన్మాల బాహుబలి వాళ్ల అమ్మగారు బాధపడ్డట్టే... తెలంగాణ తల్లి కూడ బుగులుబడతాంది. కానీ..బక్కపానమైనా మాసారు బాహుబలికంటె ఎక్కువ బలమూ, సంకల్ప బలమూ ఉన్నోడు. ‘జటాకటాహ సంభ్రమ భ్రమ్మన్నిలింప నిరఝరీ, విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ.. ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే..కిశోర ‘‘చంద్రశేఖరే’’..అని మాసారు పేరు తోని బ్యాక్గ్రౌండ్ల పాట వినిపిస్తుండంగా... ఎవ్వరంట ఎవ్వరంటా పిల్లరెత్తుకుందీ? తెలంగాణ తల్లికీ ముద్దులకొడుకీ నందీ. ఉస్కెలో డస్కిందీ..బురదలో కుంగిందీ పిల్లరెత్తుకున్నాక భుజమ్మీద పెట్కోనీ పైకెత్తేనండీ... ఇట్లా మునపటి లెవల్‌కు తెల్చి... తల్లితో ‘‘అమ్మా ఒప్పేనా?’’ అంటూ అడిగాడు. అప్పుడామె ‘‘నాకేమి తెలుసు? ఓటరు దేవరనడుగు?’’ అనగానే ఇటు తిరిగి... ఆయన ఓటరు దేవరనడిగాడు. అప్పుడు... ‘‘ఏమో శివుడి మనసులో ఏముందో... శివుడేటనుకుంటున్నాడో మనకేమి తెల్సు’’ అంటూ అప్పటికి గడుసుగా బదులిచ్చాడు ఓటరు దేవర. -
చినుకుతో వణుకు
యమునా నది ఢిల్లీ పరిధిలో 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా. ఢిల్లీలో చిత్తడి నేలలు, బావులు, సరస్సులు వంటి జల వనరులు 1,040కి పైగా ఉన్నాయి. వీటికి అధికారిక గుర్తింపు లేదు. ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అవి సులభంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నిజానికి దేశంలోని అన్ని చిన్నా పెద్దా నగరాలదీ ఇదే సమస్య... ♦ ఢిల్లీలో మురుగునీటి పారుదల వ్యవస్థ 1970ల నాటిది. నాటితో పోలిస్తే నగర జనాభా కనీవినీ ఎరగనంతగా పెరిగిపోయింది. ♦ దాంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఇక అడ్డగోలు నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థ కుదించుకుపోయి సమస్య మరీ పెద్దదవుతోంది. ♦ ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతం దాదాపుగా 97 చదరపు కిలోమీటర్లుంటుంది. నగర భూభాగంలో ఇది 7%. ఇందులో అత్యధిక భూభాగాన్ని ఆక్రమణలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు కట్టడానికి కేటాయించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతాలు 600కు పైగా ఉన్నాయి. వీటిలో 60% వరకు నీరు లేక ఎండిపోయాయి. ఒక్క రోజులోనే అతి భారీ వర్షం కురవడంతో అవన్నీ ఇప్పుడు నీట మునిగాయి. ♦ పైగా వీటిలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. మరెన్నో భూముల్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించారు. 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం నిర్మించిన గ్రామం, అక్షరధామ్ ఆలయం వంటివెన్నో వరద ప్రాంతాల్లోని ఆక్రమిత భూములపై నిర్మించినవే. ♦ చిత్తడి నేలలు సహజసిద్ధంగా నీటిని పీల్చుకొని భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. కానీ ఢిల్లీలోని చిత్తడి నేలల్లో 200కు పైగా ఎండిపోయి ఆక్రమణలకు గురయ్యాయి. హతినికుండ్ వివాదం హరియాణాలో 1996లో కట్టిన ఈ ఆనకట్ట ద్వారా నీళ్లు యమున నది తూర్పు, పశ్చిమ కాలువల్లోకి ప్రవహిస్తాయి. హరియాణా ప్రభుత్వం ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేయడంతో నేరుగా యమున నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా మారుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తూ లక్ష క్యూసెక్కులు దాటితేనే నీటిని వదులుతున్నామని హరియాణా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నెల 10వ తేదీన హతినికుండ్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 3.59 లక్షల క్యూసెక్కుల నీరు యమునలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ నీట మునిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2010 వర్షాకాలంలో 7 లక్షల క్యూసెక్కుల నీరు హతినికుండ్ నుంచి విడదల చేసినప్పటికీ అప్పట్లో నగరానికి పెద్దగా ముప్పు రాలేదు. ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్కులకే ముప్పు రావడానికి ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలే కారణమని సౌత్ ఆసియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ అభిప్రాయపడ్డారు. చిత్తడి నేలల పునరుద్ధరణ.. వరద ప్రభావాన్ని తగ్గించాలంటే ఆక్రమణలను తొలగించి నదీ తీర ప్రాంతాలను పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుందుకు ప్రభుత్వం కృషి చేయాలి. యమునా నది పొంగి పొర్లకుండా ఢిల్లీకి రక్షణ కవచంలా ఉండే చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల వంటివి తగ్గిపోతున్నాయి. అవి లేకుండా యమున ప్రవాహం సవ్యంగా సాగదన్న అభిప్రాయాలున్నాయి. ఈ సరస్సులు, చెరువులు, బావుల వంటివి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్రైనేజీలోకి వెళ్లే నీటి ప్రవాహం తగ్గుతుంది. ‘‘నదుల వరదను శాపంగా చూడకూడదు. పరివాహక ప్రాంతంలో గడ్డివాములు, చెట్లు పెంచడం వంటివి చేస్తే వరద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ అని సీనియర్ సైంటిస్ట్ ఫయాద్ ఖుద్సర్ చెప్పారు. ఢిల్లీ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్‌గా మారింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత లేదు. అందుకే నగరం ఇలా వరద ముప్పుకు లోనవుతోంది. – రితేశ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్, సౌత్ ఏషియా – సాక్షి , నేషనల్ డెస్క్ -
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్‌గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్‌ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్‌గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
గోళ్లపాడు తరహాలో మరో ప్రాజెక్టు!
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో ఏళ్లుగా మురికికూపంలా ఉన్న గోళ్లపాడు చానల్‌ను ఆ జాడలు లేకుండా పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లతో తీర్చిదిద్దిన విషయం విదితమే. అచ్చం అదే మాదిరి నగరంలో మరో ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరవై డివిజన్ల నుంచి వెలువడే మురుగు నీరు నాలాల ద్వారా వెళ్లే క్రమంలో బయటకు కనిపించకుండా, చెరువుల్లోకి చేరుతుండడంతో అక్కడి నీరు కలుషితం కాకుండా నేరుగా మున్నేరులోకి తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. తద్వారా వర్షాకాలంలో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యకు పరిష్కారం లభించనుంది. పైపులైన్ ఏర్పాటు, ఇతర పనులను సుమారు రూ.180కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలో ఖమ్మం రానున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావనతో ఉన్నట్లు సమాచారం. ఏం చేస్తారు? నగరంలోని సుమారు 20 డివిజన్ల పరిధిలో నివాసాల్లో వాడుకునే మురుగు నీరు చెరువుల్లోకి చేరుతోంది. ఈ సమయంలో దుర్వాసన వెదజల్లడమే కాక వర్షాకాలంలో నీరు సాఫీగా సాగక జనావాసాలను ముంచెత్తుతోంది. దీనిని అధిగమించేందుకు ఇళ్ల నుంచి వెలువడే నీరు చెరువుల్లో చేరకుండా, డ్రెయిన్లకు లింక్‌గా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుచేసి మున్నేరుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం సుమారు 20 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపులైన్ వేయనున్నట్లు తెలిసింది. ఈ మొత్తం 20 కిలోమీటర్ల నిడివిలో రెండు మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. అంతేకాక పైపులైన్ పైభాగంలో పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లు నిర్మించిన శుద్ధీకరణ ప్లాంట్లలో శుభ్రం చేసే నీటిని మొక్కల పెంపకానికి విని యోగించాలనే ప్రతిపాదనను అంచనాల్లో పొందు పర్చినట్లు తెలిసింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు కార్పొరేషన్ నిధులు కూడా వెచ్చించనున్నారు. ఇప్పటికే పనులకు ఆమోదం లభించినప్పటికీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రకటన చేసి శంకుస్థాపన చేయించాలనే యోచనలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టెండర్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వాడవాడకు పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మురుగుబాధ తొలగించాలని పలు డివిజన్ల ప్రజల నుండి వెల్లువెత్తుతున్న వినతులతో మంత్రి గోళ్లపాడు చానల్ తరహాలోనే మరో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.180కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
నిధుల్లేవు.. పనుల్లో జాప్యం
మంచిర్యాలటౌన్: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో శాఖకు సంబంధించిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. శుక్రవారం మున్సిపాలిటీల్లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహణకు ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రగతి నివేదిక రూపంలో వివరించి, ఉత్తమ సేవలను అందిస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందించి, సన్మానించేలా ఏర్పాట్లు చేశారు. బల్దియాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా 2020 ఫిబ్రవరి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రతీ నెల మున్సిపాలిటీ జనాభా, వార్డుల ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. మొదటి రెండేళ్లపాటు ప్రతీ నెల నిధులు విడుదల చేసినా ఆ తర్వాత జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నిధులతో పట్టణంలోని రోడ్లు, డ్రెయినేజీలు, అత్యవసరంగా చేపట్టే పనులతోపాటు సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 15 రోజులపాటు వార్డుల్లో నిర్వహించి, చెత్తాచెదారాన్ని తొలగించడం, డ్రెయినేజీల్లోని పూడికతీత పనులు చేసి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు మూడేళ్లుగా చేపడుతున్నారు. ఈ ఏడాది పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టకుండానే వర్షాకాలంలోకి అడుగు పెడుతుండగా, దశాబ్ది ఉత్సవాల పేరిట పట్టణ ప్రగతి వేడుకలను నిర్వహించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏడాదిగా... జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ కొంత మేర సమస్యలు లేకుండా చేస్తున్నారు. గత ఏడాది నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నెల వరకే నిధులు విడుదల చేయగా ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు నిధులు విడుదల కాలేదు. కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నా నిధులు రాక చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కాంట్రాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్న పనులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రగతి నిధుల్లో కేంద్ర ప్రభుత్వానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కలిపి ప్రతీ నెల ఆయా మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. ఏడాదిన్నరపాటు సక్రమంగా నిధులు ఇవ్వగా.. 2021 ఆగస్టులో 25 శాతం కోత విధించింది. మిగతా 75 శాతం నిధులు ప్రతి నెలా అందించడంలోనూ జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో మంచిర్యాలకు అత్యధికంగా రూ. 23.36 కోట్లు విడుదల కాగా, అందులో పెద్ద మొత్తంలో రూ.4.5 కోట్లు పార్కుల అభివృద్ధికి, రూ.4.5 కోట్లతో రోడ్లు, రూ.4 కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జంక్షన్ల నిర్మాణం కోసం కేటాయించారు. నిధుల జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలు, వార్డులు, పట్టణ ప్రగతి నిధుల వివరాలు మున్సిపాలిటీ వార్డులు ఇప్పటికి విడుదలైన ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రగతి నిధులు(రూ.కోట్లలో) విడుదలైన నిధులు(రూ.లక్షల్లో) మంచిర్యాల 36 23.36 57 బెల్లంపల్లి 34 14.53 36 మందమర్రి 24 14.72 36 క్యాతన్‌పల్లి 22 10.42 25 లక్సెట్టిపేట 15 6.47 17 నస్పూర్ 25 20.58 51 చెన్నూరు 18 6.94 17 -
నిత్యం మురుగు పరుగు
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో డ్రైనేజీల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. సగం వరకు పగిలి, సరిగ్గా మూతల్లేని, చెత్తాతో నిండిన మ్యాన్‌హోళ్ల నుంచి నిత్యం మురుగు నీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే కాదు... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది. జలమండలి యంత్రాంగం, డ్రైనేజీ పైప్లైన్ల, మ్యాన్‌హోల్స్ మరమ్మతులు, నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్నా... మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డా డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి ముగురు నీరు ఇళ్లలోకి వస్తుండగా, కొన్నిచోట్ల తాగునీటి పైప్‌లోకి మురుగు వస్తోంది. నిత్యం సమస్యలే.. మహానగరంలో మ్యాన్‌హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. చిన్న వర్షం పడితే ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరుగడం సాధారణంగా తయారైంది. ఎక్కడ చూసినా.. ఇవే సమస్యలు. నగరంతోపా టు శివార్లలో సైతం మ్యాన్‌హోళ్ల పరిస్ధితి అధ్వానంగా తయారైంది. ప్రతిచోట మ్యాన్‌హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్ట సాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కానీ, స్పందించని పరిస్థితి ఉంది. 12 వేల చదరపు కిలో మీటర్ల మురుగు నీటి వ్యవస్థ... మహానగరంలో సుమారు 12 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మురుగు నీటి వ్యవస్థ విస్తరించి ఉంది. వీటిపై సుమారు నాలుగు లక్షల వరకు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో లక్ష వరకు మ్యాన్‌హోళ్లు ఉంటాయన్నది అంచనా. వీటిలో సుమారు 20 వేలకు పైగా లోతైనవి ఉంటాయి. నగరంలోని సుమారు 450 ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్న వర్షానికే పొంగిపర్లుతుంటాయి. మరోవైపు వ్యర్థాలు, చెత్తా పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మ్యాన్‌హోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది. నిజాం కాలం నుంచే.. నిజాం కాలం నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ కొనసాగుతోంది. అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైపులైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్‌తో నిర్మాణాలు చేపట్టారు. అయితే అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా 25 రెట్లు పెరిగినా పాత కాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పైప్లైన్లను కొన్ని ప్రాంతాల్లో రీస్టోర్ చేసినా.. క్లీనింగ్ యంత్రాలతో మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండటంలేదు. తాగునీటి పైపుల్లోకి.. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీలు దెబ్బతిని లీకవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. పాతబస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుçవడంతో మంచినీరు కలుషితమవుతోంది. సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులిపేసుకుంటున్నారు. -
మురికిపోయి.. ముద్దుగా మారి
అదో కాలువ.. దానికి అనుబంధంగా డ్రైనేజీలు, వానాకాలం వచ్చిందంటే ఉప్పొంగడం, రోడ్లన్నీ మురికినీటితో నిండిపోవడం, విషజ్వరాలు, తాగునీటి కాలుష్యం, దుర్వాసన.. ఇదంతా గతం.. ఇప్పుడు అదంతా అందాల హరివిల్లు. పచ్చదనం నిండిన పార్కులు, ఫౌంటెయిన్లు, ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలతో ఆహ్లాదం పంచే ప్రదేశం.. ఖమ్మం పట్టణంలోని గోళ్లపాడు చానెల్,దాని వెంట ఉన్న ప్రాంతాల్లో వచ్చిన అద్భుతమైన మార్పు ఇది. సీఎం కేసీఆర్ హామీ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ కలిసి రూ.100 కోట్ల ఖర్చుతో గోళ్లపాడు చానెల్ ప్రాజెక్టు అపూర్వంగా రూపుదిద్దుకుంది. సీఎం కేసీఆర్ ఈ అభివృద్ధి పనులకు కితాబివ్వగా.. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.100 కోట్లతో 10.6 కి.మీ.పొడవునాఅభివృద్ధి గోళ్లపాడు చానల్ పునరుద్ధరణతో ఖమ్మం పట్టణానికి వన్నె ఆక్రమణలకు పాల్పడిన 862 మందికి పునరావాసం మంత్రి పువ్వాడ చొరవతో పనులు.. త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం గోళ్లపాడు చానల్ ఖమ్మం నగరం మీదుగా వెళ్తూ.. శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరందించేది. త్రీటౌన్ ప్రాంతంలో 10.6 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ కాల్వ కాలక్రమేణా నగరాభివృద్ధితో డ్రైనేజీగా మారింది. పంపింగ్ వెల్ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో కాల్వకు ఇరువైపులా బస్తీలు వెలిశాయి. ఖమ్మం నగరంలోని 28 డివిజన్ల మురికినీరంతా ఈ కాల్వ నుంచే వెళ్లి మున్నేరులో కలుస్తుండటం, ఆక్రమణలు, సిల్ట్ తీయకపోవడంతో నాలుగు దశాబ్దాలుగా కాల్వ, పరిసర ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. వానాకాలంలో ఈ డ్రైనేజీ పొంగి సమీప డివిజన్లలో మురికినీరు చేరడం, ఆ నీరు పైపులైన్లలో కలిసి తాగునీరు కలుíÙతం కావడం నిత్యకృత్యమైంది. దోమల స్వైర విహారంతో విషజ్వరాలు, వ్యాధుల విజృంభణ సాధారణమైంది. రూ.100 కోట్లతో మారిన ముఖచిత్రం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లతోపాటు ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి 2018లో ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగా రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 30ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాన నీరు వెళ్లేందుకు ఓపెన్ కాల్వ నిర్మించడంతోపాటు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైభాగంలో ఆహ్లాదం పంచేలా పార్కులను ఏర్పాటు చేశారు. అధునాతన సౌకర్యాలతో.. పది డివిజన్ల పరిధిలోని 50 వేల మంది ప్రజలకు ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్‌ను అభివృద్ధి చేశారు. పిల్లలకు చెస్‌పై అవగాహన కలి్పంచేలా రష్యాలోని మాస్కో తరహాలో మెగా చెస్‌బోర్డులు, అధునాతనంగా స్కేటింగ్ రింక్లు, వాటర్ ఫౌంటెయిన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, బస్తీ దవాఖానా, యోగా వేదికలు, పంచతత్వ పార్కులు, 10 వేల ఔషధ, ఇతర మొక్కలతో మినీ పార్కులను ఏర్పాటు చేశారు. మొత్తం 32 ఎకరాల స్థలం ప్రజా అవసరాల దృష్ట్యా వినియోగంలోకి వచ్చింది. గోళ్లపాడు చానల్ ప్రాజెక్టు వ్యయం రూ.100 కోట్లు అయితే.. వినియోగంలోకి వచ్చిన భూమి విలువ రూ.300 కోట్లకు పైమాటేనని అంచనా వేశారు. సీఎం సూచనల మేరకు ఇటీవల నిజామాబాద్ కలెక్టర్, ఆ జిల్లా అధికారులు ఈ అభివృద్ధి పనులను సందర్శించారు కూడా. గోళ్లపాడు చానల్‌పై నిర్మించిన పార్కులకు ప్రొఫెసర్ జయశంకర్, మంచికంటి రామకిషన్రావు, పుచ్చలపల్లి సుందరయ్య, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, రజబ్ అలీ, వనజీవి రామయ్య తదితరప్రముఖుల పేర్లను పెట్టారు. గోళ్లపాడు చానల్ వెంట గతంలో గుడిసెలు, ఇతర తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న 862 మంది పేదలకు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్ని వసతులతో కాలనీ ఏర్పాటు చేశారు. మురికి పోయి.. వన్నె వచ్చింది సీఎం కేసీఆర్ రూ.100 కోట్లను గోళ్లపాడు చానల్‌కు కేటాయించడంతో నాలుగు దశాబ్దాల మురికి కూపం నుంచి విముక్తి కలిగింది. వన్నె వచ్చింది. ప్రత్యేకంగా త్రీటౌన్ ప్రాంతానికి ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్ ముస్తాబైంది. విషజ్వరాలు, దుర్వాసనతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నేడు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. సీఎం దార్శనికతకు ఇది నిదర్శనం.- పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి అందరి కృషితో ఆహ్లాదం సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులు, స్థానికుల సహకారంతో గోళ్లపాడు చానల్ సొబగులు అద్దుకుంది. ఆహ్లాదకరమైన పార్కులు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వీటిని సదినియోగం చేసుకోవాలి. మొత్తం పది వేల కుటుంబాలు ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా తీర్చిదిద్దాం. గోళ్లపాడు చానల్ పార్కుల్లో ఇంకా కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. -వీపీ గౌతమ్, కలెక్టర్, ఖమ్మం -
హైదరాబాద్ లో ఎక్కడ చూసిన మురికి కుప్పలే: రేవంత్ రెడ్డి
-
Viral Video: డ్రైవింగ్ చేస్తూ ఉన్నపళంగా డ్రైనేజీ కాలువలోకి పడిపోయింది
-
గ్రేటర్ సిటీకి తీరని ముప్పు! హైదరాబాద్ వరదల చరిత్ర చూస్తే బేజారే!
సాక్షి, హైదరాబాద్: పట్టుమని పది సెంటీమీటర్ల వాన కురిసిన ప్రతిసారి విశ్వనగరం మునకేస్తోంది. హైదరాబాద్ ప్రధాన నగరం సహా శివార్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. బండారీ లేఅవుట్, నాచారం తదితర ప్రాంతాల్లోని వారం, పదిరోజులపాటు ముంపులోనే మగ్గాల్సిన దుస్థితి నెలకొంది. చరిత్ర పుటలను తిరగేసినా ఎన్నోమార్లు నగరం వరద విలయంలో చిక్కి విలవిల్లాడినట్టు స్పష్టమవుతోంది. ఈ దురవస్థకు చరమగీతం పాడుతూ విశ్వనగర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. వందేళ్ల కిందట మూసీ వరదలు, నగర తాగునీటి అవసరాలు, హుస్సేన్‌సాగర్ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం అహరహం శ్రమించిన ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమగ్ర మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మరో మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసి హైదరాబాద్ నగరానికి వరదలు, విపత్తుల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెరుగుతున్న వరద, ముంపు సమస్యలు ►ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటిన్నరకు చేరువైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహా నగరంలో 185 చెరువులు, 1,500 కిలోమీటర్ల పొడవైన నాలా వ్యవస్థ ఉన్నాయి. ఇందులో ముఖ్య ప్రాంతాల్లో 900 కిలోమీటర్ల మేర, శివార్లలో 600 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. ►నాలాలపై అనధికారికంగా పదివేలకుపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు బల్దియా అంచనా. వాటిని తొలగించడంలో తొలి నుంచీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నాలాల ప్రక్షాళనకు సుమారు రూ.పదివేల కోట్ల అంచనా వ్యయంతో బల్దియా సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక అటకెక్కింది. దీనితో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సాఫీగా వెళ్లేదారిలేక జనావాసాలు నిండా మునుగుతున్నాయి. ►రోజువారీగా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1,400 మిలియన్ లీటర్ల మురుగు నీరు వెలువడుతోంది. ఇందులో జలమండలి 700 మిలియన్ లీటర్ల మేర శుద్ధిచేసి మూసీలోకి వదులుతోంది. ►గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వెలువడుతున్న మురుగునీరు ఓపెన్ డ్రెయిన్లు, నాలాల్లో యథేచ్ఛగా కలిసి మూసీలోకి ప్రవేశిస్తోంది. వర్షం కురిసినపుడు ప్రధాన రహదారులపై మురుగు పోటెత్తుతోంది. ►శివారు ప్రాంతాల్లోని డ్రైనేజీలు సరిగా లేక నివాస సముదాయాల్లో మురుగు ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లో మగ్గుతోంది. ►రోజువారీగా గ్రేటర్లో వెలువడుతున్న మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రస్తుతమున్న డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. ►ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మాస్టర్‌ప్లాన్ అమలు కోసం సుమారు రూ.5 వేల కోట్లు అవసరం. దీనిని ప్రభుత్వం విస్మరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 14 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సాధారణం కంటే 40శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో అక్టోబర్‌లో కురిసిన వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే.. 2020 అక్టోబర్ 14న అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. వరదల చరిత్ర ఇదీ ►1591 నుంచి 1908 వరకు 14సార్లు హైదరాబాద్ నగరం వరద ప్రవాహంలో చిక్కుకుంది. 1631, 1831, 1903 వరదలతో హైదరాబాద్‌లో భారీగా ధన, ప్రాణనష్టం సంభవించింది. ►1908 నాటి వరదల్లో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి. 15వేల మంది మృతి చెందారు, 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల వరకు జనజీవనం స్తంభించింది. ►1631లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో సంభవించిన వరదలకు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు «ధ్వంసమయ్యాయి. మూసీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి వరద బాధితులను ఆదుకున్నారు. ►200ఏళ్ల అనంతరం 1831లో మీర్ ఫర్కుందా అలీఖాన్ నాసరుద్దౌలా పాలనా కాలంలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. వేలాది గుడిసెలు, మట్టి ఇళ్లు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అప్పట్లో పురానా హవేలీలోని నాలుగో నిజాం నివాసం దాకా వరద నీరు చేరింది. నాసరుద్దౌలా వరద బాధితులకు సాయం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డుకు దూరంగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ►మళ్లీ ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ పాలనా కాలమైన 1903 సెప్టెంబర్‌లో భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి అతలాకుతలమైంది. మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసీ ప్రమాద స్థాయిలో ప్రహహించి, భారీ నష్టం సంభవించింది. ►తర్వాత 1968, 1984, 2007, 2016, 2019 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలతో మూసీ పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. -
విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ బాగు చేసేందుకు లోపలికి వెళ్లిన వీరు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు. మరొకరు బిల్డింగ్ యజమాని కొండలరావు. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం! -
Hyderabad: చినుకు రాలితే.. వాన వరదైతే.. వెళ్లే దారేది? ‘డంపెత్తిన కంపు ’
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా మారిన గ్రేటర్ సిటీ.. విశ్వనగరం బాటలో దూసుకెళుతున్నా.. మురుగు, వరదనీరు సాఫీగా వెళ్లే దారి లేక కంపుకొడుతోంది. గత వారం రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సుమారు 200కు పైగా బస్తీలను మురుగు, వరదనీరు ముంచెత్తింది. దీంతో ఆయా బస్తీలవాసులు రోగాల బారినపడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారం లభించడంలేదు. ఏళ్లుగా నాలాలు విస్తరించకపోవడం, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఏటా పరిస్థితి విషమిస్తోంది. మురుగుకు మోక్షం కల్పించాలిలా.. గ్రేటర్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు.. జనాభా కోటి దాటింది. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో 700 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే సమీప చెరువులు, మూసీలో కలుస్తోంది. 2007లో జీహెచ్ఎంసీలో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ ఔట్లెట్ సదుపాయం లేకపోవడంతో మురుగు నీరు సెప్టిక్ ట్యాంకులు, బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ నాలాలు, చెరువులు, కుంటలను ముంచెత్తుతోంది. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3723 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2 వేల కిలోమీటర్ల మార్గంలో డ్రైనేజి పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఈ పైపులైన్ల ద్వారా మురుగు నీటిని నూతనంగా రూ.1046 కోట్లతో నిర్మించనున్న 17 ఎస్టీపీల్లోకి మళ్లించి శుద్ధి చేసిన అనంతరమే మూసీ, నాలాల్లోకి వదిలిపెట్టాలి. మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్, పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలు, కార్‌వాషింగ్, ఫ్లోర్ క్లీనింగ్ తదితర అవసరాలకు వినియోగించాలి. వరద కష్టాలు లేకుండా.. గ్రేటర్ మొత్తానికీ సమగ్ర మాస్టర్‌ప్లాన్.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్.. మేజర్, మైనర్ వరద కాల్వల ఆధునికీకరణకు గతంలో ఓయంట్స్ సొల్యూషన్ సంస్థ సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు చేపట్టాలి. నగరంలో 1500 కి.మీ మేర విస్తరించిన నాలాలపై ఉన్న 10 వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలి. నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విస్తరించాలి. నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. వరద నీటి కాల్వల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. స్టార్మ్ వాటర్ డ్రైనేజి (వరదనీటి కాల్వల) మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి. దీంతో వర్షపు నీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి. చదవండి: రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ -
వర్షం వస్తే.. నగరం నరకం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వరద అనుభవాలతో లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసింది. పనులు చేపట్టడంలో జరిగిన ఆలస్యంతో ఎక్కడా పనులు పూర్తికాలేదు. దీంతో.. తాత్కాలిక ఉపశమనంగా ఎక్కడికక్కడ వాననీరు నిల్వకుండా వెంటనే తొలగించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. అన్ని జోన్లలోని నాలాల వెంబడి క్షేత్రస్థాయి సర్వేలతో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ కింద దాదాపు రూ.747 కోట్ల విలువైన 37 వరద కాల్వల పనులు చేపట్టారు. బాటిల్ నెక్స్‌గా ఉన్న నాలాలు వెడల్పు చేయడం, బాక్స్డ్రెయిన్ల నిర్మాణం, రీమోడలింగ్, వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. పనులైతే మొదలైనప్పటికీ, ఇవి ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఆమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా పూర్తికాని పనులు.. ఇవి కాక 2000 సంవత్సరంలో జరిగిన ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని వెడల్పు తక్కువగా ఉన్న నాలాలకు పైకప్పుల ఏర్పాటు, అన్ని నాలాలకు అవసరమైన మరమ్మతులు, పైప్లైన్లు, డ్రెయిన్ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.298.34 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 468 పనులకు రూ.139.78 కోట్లతో 98 పనులు పూర్తిచేశారు. రూ. 94.11కోట్ల విలువైన 98 పనులు కొనసాగుతున్నాయి. కోర్టు వివాదాలు తదితరమైన వాటితో రూ.5.82 కోట్ల విలువైన 19 పనులు పనులు రద్దు చేశారు. మిగతా పనులు ఆయా దశల్లో ఉన్నాయి తప్ప పూర్తి కాలేదు. ఎమర్జెన్సీ టీమ్స్.. వర్షాకాల ఫిర్యాదులపై వెంటనే రంగంలోకి దిగి వాన నీటినిల్వలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందితో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 160 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఏర్పాటు చేశారు. స్టాటిక్టీమ్స్ నీరు నిలిచే ప్రాంతాలకు దగ్గరలో ఉండి వెంటనే నీటిని తోడిపోస్తాయి. అందుకు 237 పంప్సెట్లను సమకూర్చుకున్నారు. అక్టోబర్ వరకు పనిచేసే ఈటీమ్స్ కోసం రూ. 36.98కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇవి కాక ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు తమ మార్గాల్లో పనుల కోసం 29 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి జీహెచ్ఎంసీ నుంచి కాగా, వాటర్‌బోర్డు, విద్యుత్ విభాగాల అధికారులు సైతం జీహెచ్ఎంసీ కాల్సెంటర్కందే ఫిర్యాదులు పరిష్కరించేలా జీహెచ్ఎంసీ కాల్సెంటర్లో 040– 21 11 11 11 ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ►ఎక్కడైనా రోడ్లపై నీరు, మురుగు నిలిచినా, విద్యుత్ సమస్యలు తలెత్తినా ఇవి వెంటనే రంగంలో దిగుతాయని మేయర్ పేర్కొన్నారు. ప్రాణాపాయం జరగకుండా పటిష్ట చర్యలు.. ►900కుపైగా ప్రాంతాలకు ఇన్చార్జి అధికారులు ►వర్షాల కారణంగా ఎక్కడా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటంతోపాటు ►సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పనులు చేపట్టేందుకు వీలుగా అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. ►ఎల్బీనగర్ జోన్లో 74 సమస్యాత్మక ప్రాంతాలకు 76 మంది అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. చార్మినార్ జోన్లో 52 సమస్యాత్మక ప్రాంతాలకు 32 మంది అధికారులను, ఖైరతబాద్జోన్లోని 711 ప్రాంతాలకు 81 మంది అధికారులను, శేరిలింగంపల్లి జోన్‌లోని 52 సమస్యాత్మక ప్రాంతాలకు 52 మంది అధికారులను, కూకట్పల్లి జోన్‌లోని 48 సమస్యాత్మక ప్రాంతాలకు 49 మంది అధికారులను,సికింద్రాబాద్ జోన్‌లోని 55 సమస్యాత్మ కప్రాంతాలకు 79 మంది అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించారు. వారి నేతృత్వంతో దిగువస్థాయి సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాన సమస్యల్ని పరిష్కరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు. అత్యాధునిక నీటి పారుదల విధానాలను ఈ సమావేశాల్లో ప్రదర్శిస్తారు. వాటిని అందిపుచ్చుకుని.. నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకుని.. అత్యధిక విస్తీర్ణంలో ఆయకట్టుకు నీరందించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు. 1953, జూన్‌లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు. ఆ సంస్థ 23వ కాంగ్రెస్‌ను మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీలో 2017, అక్టోబర్ 8 నుంచి 14 వరకూ నిర్వహించారు. ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌ను నిర్వహించే బాధ్యతను ఆస్ట్రేలియా దక్కించుకోగా, 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను భారత్ చేజిక్కించుకుంది. ఆ సదస్సును విశాఖలో నిర్వహించాలని ఐసీఐడీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ కె.యల్లారెడ్డి చేసిన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. రాష్ట్రాన్ని మరింత సస్యశ్యామలం చేసే దిశగా.. ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌కు విశాఖపట్నాన్ని వేదికగా చేసుకోవడం నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యతకు దక్కిన గౌరవంగా సాగు నీటిరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సదస్సు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో శతాబ్దాల కిందట నిర్మించిన చెరువులను సంరక్షించుకుని, ఆయకట్టుకు నీళ్లందించడం దగ్గర్నుంచి.. చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించడం, సూక్ష్మ నీటిపారుదల విధానాలను అందిపుచ్చుకుని.. తక్కువ నీటితో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తుండటాన్ని ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ప్రతిపాదించే అత్యా«ధునిక నీటి పారుదల విధానాలను పరిశీలించి.. వాటిని అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘మురుగు’.. తప్పితేనే మెరుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి తాగునీరిచ్చే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట)లను మురుగు ముప్పు వెంటాడుతోంది. సమీపంలోని 11 గ్రామాల నుంచి, చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వస్తున్న మురుగునీటితో రిజర్వాయర్లు కలుషితం అవుతున్నాయి. నిత్యం గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్‌సాగర్‌లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్టు జల మండలి పరిశీలనలోనే వెల్లడైంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడ శుద్ధి చేయాలని, అందుకోసం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఏర్పాటు చేసుకోవాలని.. గతంలోనే గ్రామ పంచాయతీలు, కాలేజీలకు జలమండలి, కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చాయి. ఎస్టీపీలను నిర్మించుకోవాలని, జలాశయాలు కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు కూడా కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. అయినా ఫలితం లేదు. పంచాయతీల నిర్లక్ష్యానికితోడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగునీటి చేరికను ఆపడం, శుద్ధి చేయడం ద్వారా జంట జలాశయాల్లో నీటి నాణ్యతను మెరుగుపర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఐదేళ్లుగా పైసా లేదు.. సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామా లు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న మురుగు నీరంతా జలాశయాల్లోకి చేరుతుండటంతో.. మురుగుశుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మిం చాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి. అందులో రూ.27.50 కోట్లను పంచాయతీ రాజ్ శాఖ, మరో రూ.13 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేయాలని సూచించింది. ఇది జరిగి ఐదేళ్లయినా ఆయా విభాగాల నుంచి పైసా నిధులు విడుదల కాలేదు. మురుగు నీరు నేరుగా జలాశయాల్లో కలుస్తూ.. ఆర్గానిక్ కాలుష్యం పెరిగిపోతోంది. తాఖీదులు ఇచ్చినా.. జంట జలాశయాల చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టీపీలు నిర్మించుకోవాలంటూ గతంలోనే తాఖీదులిచ్చామని పీసీబీ వర్గాలు తెలిపాయి. పీసీబీ తరఫున రూ.13 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ పంచాయతీరాజ్ విభాగం నుంచి రావాల్సిన రూ.27.50 కోట్లను విడుదల చేయడం లేదని ఓ అధికారి చెప్పారు. అయితే దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. ఈ అంశంపై దృష్టి సారించి, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తక్షణం ఎస్టీపీలు నిర్మిస్తేనే.. ►జంట జలాశయాల్లో కాలుష్యం చేరకుండా తీసు కోవాల్సిన చర్యలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ►సమీప గ్రామాల మురుగునీరు చేరకుండా తక్షణం ఎస్టీపీలు నిర్మించాలి. వాటిలో శుద్ధిచేసిన నీటిని కూడా జలాశయాల్లోకి వదలకుండా గార్డెనింగ్, పంటలకు వినియోగించాలి. రిజర్వాయర్లలోని నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ►వరదనీరు చేరే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. జలాశయాల ఎగువన, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్‌లు, ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించాలి. ఇసుక మాఫియాను కట్టడిచేయాలి. ►ఈచర్యల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. మురుగు కాలుష్యం ప్రమాదకరం మురుగు చేరిక వల్ల మంచినీటి జలాశయాల్లోకి పురుగు మందుల అవశేషాలు, షాంపూలు, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, ఇతర రసాయనాలు చేరుతున్నాయి. గృహ, వాణిజ్య వ్యర్థ జలా ల్లో ఉండే హానికర మూలకాలతోనూ ప్రమాదం ఉంటుంది. మానవ, జంతు వ్యర్థాలతో కూడిన మురుగులో కొలిఫాం, షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈకొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. మురుగునీటితో యుట్రిఫికేషన్ చర్య జరిగి గుర్రపు డెక్క ఉద్ధృతి పెరుగుతుంది. జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గినపుడు దోమల లార్వాలు ఉద్ధృతంగా వృద్ధి చెందుతాయి. సమీప ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు, అవసరమైన సామర్థ్యం ఇదీ.. ఉస్మాన్‌సాగర్ పరిధిలో.. వట్టినాగులపల్లి - 8 లక్షల లీటర్లు చిలుకూరు - 7 లక్షల లీటర్లు ఖానాపూర్ - 6 లక్షల లీటర్లు జన్వాడ - 6 లక్షల లీటర్లు హిమాయత్‌నగర్ - 3 లక్షల లీటర్లు అప్పోజిగూడ - లక్ష లీటర్లు బాలాజీ ఆలయం - లక్ష లీటర్లు హిమాయత్‌సాగర్ పరిధిలో.. ఫిరంగినాలా - 29 లక్షల లీటర్లు అజీజ్‌నగర్ - 9 లక్షల లీటర్లు కొత్వాల్‌గూడ - 3 లక్షల లీటర్లు హిమాయత్‌సాగర్ - 2.5 లక్షల లీటర్లు -
వార్నీ ఇదేం కక్కుర్తి.. డ్రైనేజీనీ కూడా వదలరా?
సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్):ఇటీవల భూముల విలువ పెరగడంతో డ్రైనేజీలను సైతం వదలడం లేదు. జనవరి 5, 2021న పట్టణంలోని ఎదులాబాద్ రోడ్డులో రూ.21లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేసిన భూగర్భ డ్రైనేజీ స్థలామే కబ్జాకు గురైంది. మున్సిపల్ కమిషనర్ కార్యలయానికి నిత్యం వెళ్లే దారిలోని డ్రైనేజీ స్థలం కబ్జాకు గురికావడం, కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టిపట్టనట్లు వ్యవహరించడం, పక్షం రోజులుగా పనులు జరగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ స్థలంపై గేటు నిర్మించడంలో పాటు, సర్వేనంబర్ 481, 482లో చేసిన వెంచర్ రోడ్డును కూడా కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డు, డ్రైనేజీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
నరకం చూస్తున్న సామాన్యుడు.. సచ్చినా.. మారరా..?
గోల్కొండ: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కల సాకారం కావాలంటే మాత్రం నరకం చూడాల్సిందే.. ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు.. నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులకు లంచాలు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అడుగడుగునా ఇబ్బందులు తప్పవు.. అడిగినంతా ఇచ్చుకుంటే ఇక ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది అన్ని శాఖల అధికారుల తీరు. దీంతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఏ అధికారికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన బిల్డర్లు లంచాలు వారికి అందించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. ♦ అక్రమ నిర్మాణానికి డ్రైనేజీ లైన్ వేయాలన్నా.. తాగునీటి పైప్‌లైన్ అయినా.. ట్రాన్స్ఫార్మర్, మీటర్లు ఇలా ఏది కావాలన్నా బిల్డర్లు అధికారుల జేబుల్లో డబ్బులు కుక్కి.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ లైన్ నుంచి ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు ఇస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ♦ నిర్మాణాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉండే వాటిని ప్రైవేటు వ్యక్తులు పక్కకు తరలించే అవకాశం కల్పిస్తున్నారు. డబ్బులిచ్చుకో.. పనులు చేసుకో.. అంటూ బిల్డర్లకు, భవన యజమానులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ♦ 10 రోజుల క్రితం తేజ కాలనీలో ఓ బిల్డర్లు తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రదేశానికి తరలిస్తుండగా విద్యుదాఘాతానికి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నిర్లక్ష్యంలో విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ♦ పెద్దపెద్ద ప్రమాదకరమైన పనులను దినసరి కూలీలతో చేయిస్తున్నా.. అధికారులు మొద్దు నిద్ర వదలకపోవడంపై స్థానిక కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ముడితే చాలు ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? అని ప్రశి్నస్తున్నారు. ♦ నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచాలు ఇవ్వకపోతే ఒక్క అధికారి కూడా పని చేయడం లేదు. డబ్బులు ఇచ్చే వరకు ఫైల్ పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇంకా కొందరు అధికారులు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారు. ♦ అయ్యా.. సారూ.. అంటూ వారి చుట్టూ తిరుగుతున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. మీటింగులు, విజిట్ అంటూ సొంత పనుల కోసం తిరుగుతున్నారు. కొంత మంది బిల్డర్లు, గుత్తేదారులు ఫోన్లోనే మాట్లాడుకొని ముడుపులు వారి వద్దకే పంపడంతో పనులు చకచకా సాగిపోతున్నాయి. ♦ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయి చాలామంది బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ♦ అన్ని శాఖల్లో ఇదే విధానం కొనసాగుతోంది. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ లైన్ కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సిందే.. విద్యుత్ మీటర్ కోసం క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇస్తే ఎలాంటి అక్రమాలైనా.. సక్రమాలవుతున్నాయి. ♦ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు మార్చడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాలనీల్లో బిల్డర్లు వీటిని పాటించడం లేదు. దీని వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ♦ పలుమార్లు విద్యుత్ స్తంభాలు వేయడానికి, మార్చడానికి బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా దినసరి కూలీలను పెట్టుకుని పనులు కానిస్తున్నారు. తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మార్చడానికి ఓ వ్యక్తి పది రోజుల క్రితం ఓ కూలీలను నియమించుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు కొనసాగించాడు. దీంతో ఆ కూలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
‘తవ్వి’పోదురుగాక!
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. రహదారులు వేయడానికి ముందే అవసరమైన వరద కాల్వలు, క్యాచ్పిట్లు, డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు, కేబుళ్ల కోసం డక్ట్ వంటివి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. దాంతో ఆయా అవసరాల కోసం రోడ్డు వేసిన కొన్ని నెలలకే తిరిగి తవ్వుతున్నారు. దాంతో ప్రజాధనం పెద్దయెత్తున దుబారా అవుతోంది. అందుకు మచ్చుతునక ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం. దోమలగూడలో రోడ్డు వేసిన కొద్దినెలలకే ఇలా.. తవ్విపోస్తున్నారు. ముందస్తుగానే ఆయా విభాగాలు తాము చేయాల్సిన పనులు తెలియజేయడంతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని సిటీ కన్జర్వెన్స్ సమావేశాల్లో చెబుతున్నప్పటికీ, అమలులో లోపం కళ్లకు కడుతోంది.. ఇలా.. (క్లిక్: ట్యాంక్‌బండ్‌పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు) -
హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం
-
ఏమరపాటు వద్దు.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది
దీపావళి పండుగ కోసం దేశమంతా అందంగా ముస్తాబవుతోంది. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెలుగులు నింపే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో అపశ్రుతి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!! ఆ వీడియో ప్రకారం.. కొందరు చిన్నారులు ఓ డ్రైనేజీ కవర్‌పై సరదాగా టపాసుని వెలిగించారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ డ్రైనేజీ కవర్ రంధ్రాల్లోంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. చిన్నారులు అప్రమత్తమై ఆ కవర్ నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈప్రమాదంలో కొందరు చిన్నారుల తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే, డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఆ క్రమంలోనే పిల్లలు క్రాకర్స్ వెలిగించడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పండగ వేళ పిల్లలు క్రాకర్స్ కాల్చే విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్తత్తలు తీసుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉండొద్దు! చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ — Sushil Rao (@sushilrTOI) November 3, 2021