
దీపావళి పండుగ కోసం దేశమంతా అందంగా ముస్తాబవుతోంది. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెలుగులు నింపే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో అపశ్రుతి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్‌ల దగ్గర గల కవర్‌లపై లేదా డ్రైనేజీ లైన్‌ల సమీపంలో క్రాకర్‌లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్‌ల దగ్గర క్రాకర్‌లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
చదవండి: దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!
ఆ వీడియో ప్రకారం.. కొందరు చిన్నారులు ఓ డ్రైనేజీ కవర్‌పై సరదాగా టపాసుని వెలిగించారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ డ్రైనేజీ కవర్ రంధ్రాల్లోంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. చిన్నారులు అప్రమత్తమై ఆ కవర్ నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈప్రమాదంలో కొందరు చిన్నారుల తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే, డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఆ క్రమంలోనే పిల్లలు క్రాకర్స్ వెలిగించడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పండగ వేళ పిల్లలు క్రాకర్స్ కాల్చే విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్తత్తలు తీసుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉండొద్దు!
చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!!
డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్‌ల దగ్గర గల కవర్‌లపై లేదా డ్రైనేజీ లైన్‌ల సమీపంలో క్రాకర్‌లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్‌ల దగ్గర క్రాకర్‌లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ
— Sushil Rao (@sushilrTOI) November 3, 2021
Comments
Please login to add a commentAdd a comment