precaution
-
ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీలో రాయి ఇదే.!
ఈమధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. వీటివల్ల వచ్చే నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? వాటి లక్షణాలేంటి? ఈ సమస్య దరిచేరకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి వంటివి ఇప్పుడు చూద్దాం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. ప్రపంచంలోనే పెద్ద కిడ్నీ స్టోన్ ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ను శ్రీలంకలోని ఒక రోగి నుంచి వైద్యులు తొలగించారు. ఈ రాయి 5.26 అంగుళాల పొడవు, 801 గ్రాముల బరువు కలిగి ఉంది . ఈనెల ప్రారంభంలో శ్రీలంక ఆర్మీ వైద్యులు దీన్ని తొలగించారు. ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని శ్రీలంక మిలిటరీ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కూడా శ్రీలంకలోనే ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువైన కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. what a week at GWR HQ: - Chef Hilda Baci achieves longest cooking marathon at 93 hours - Max Park completes the fastest 3x3x3 cube solve, smashing record by 0.3 seconds - A kidney stone removed from a man in Sri Lanka is heaviest and largest ever seen we're off for a lie down😴 pic.twitter.com/6p4twlFuFK — Guinness World Records (@GWR) June 16, 2023 కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఏం చేయాలి? ముందుగా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి..అందులో ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది. రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. బరువు అధికంగా పెరగకుండా ఉండాలి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి. తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది. మంచి ఆహారం, తగు వ్యాయామాలు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
18–59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్ డోస్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా ప్రికాషన్ టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వారికి ప్రికాషన్ డోస్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉచితంగా ప్రభుత్వం ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల వారు డబ్బు చెల్లించి ప్రైవేటు టీకా కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ వర్గాల వారు ఇప్పటి వరకూ 20 మంది వరకూ మాత్రమే రాష్ట్రంలో ప్రికాషన్ డోస్ వేయించుకున్నారు. 75 రోజుల పాటు.. 18 నుంచి 59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్ టీకా పంపిణీకి శుక్రవారం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వైద్య శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు డ్రైవ్ నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వాస్పత్రులు, గ్రామ/వార్డు సచివాలయాల్లో, టీకా కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ టీకా వేస్తారు. రెండో డోసు టీకా తీసుకుని 6 నెలలు దాటిన వారందరూ ప్రికాషన్ డోస్‌కు అర్హులు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న 3,50,94,882 మందికి రెండు డోసుల టీకాను వైద్య శాఖ వేసింది. వీరిలో సెప్టెంబర్ నెలాఖరుకు 3.41లక్షల మంది ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. వీరందరికీ గడువులోగా టీకా పంపిణీకి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. -
ప్రికాషన్ డోసు గడువు తగ్గింపు
సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గడువును తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల మేరకు సవరించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేశామని చెప్పారు. ఇకపై 18 ఏళ్లు పైబడిన వారందరూ రెండో డోసు టీకా తీసుకున్న 6 నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు టీకా వేసుకోవచ్చన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రికాషన్ డోసు వేస్తోందని తెలిపారు. 18–59 ఏళ్ల వయసున్న వారు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు తీసుకోవాలని సూచించారు. సవరించిన టీకా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకునేలా చూడాలని సూచించారు. -
Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్రం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్నవాళ్లకు బుధవారం(మార్చి 16వ తేదీ) నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 12-14 ఏళ్ల మధ్య పిల్లలతోపాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. बच्चे सुरक्षित तो देश सुरक्षित! मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है। साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे। मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ। — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022 కొత్త కేసులు.. 27 మరణాలే! మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. భారత్‌లో Corona Deaths ఇప్పటి వరకు 5,15,877గా నమోదు అయ్యింది. -
ఏమరపాటు వద్దు.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది
దీపావళి పండుగ కోసం దేశమంతా అందంగా ముస్తాబవుతోంది. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెలుగులు నింపే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో అపశ్రుతి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!! ఆ వీడియో ప్రకారం.. కొందరు చిన్నారులు ఓ డ్రైనేజీ కవర్‌పై సరదాగా టపాసుని వెలిగించారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ డ్రైనేజీ కవర్ రంధ్రాల్లోంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. చిన్నారులు అప్రమత్తమై ఆ కవర్ నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈప్రమాదంలో కొందరు చిన్నారుల తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే, డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఆ క్రమంలోనే పిల్లలు క్రాకర్స్ వెలిగించడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పండగ వేళ పిల్లలు క్రాకర్స్ కాల్చే విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్తత్తలు తీసుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉండొద్దు! చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ — Sushil Rao (@sushilrTOI) November 3, 2021 -
పండుగ వేళ జర భద్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్‌కు ఆస్కారం ఉండదు..రాదు...అనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక, శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి ఆదివారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుదలు ఈ శిబిరాలు విజయవంతం అయ్యాయి. నాలుగున్నర కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. మరో కోటి మంది తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అయితే, ఆదివారం శిబిరాల ఏర్పాటు కారణంగా మందుబాబులు, మాంసం ప్రియులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. దీంతో ఈసారి మెగా శిబిరం శనివారానికి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రపథమంగా 50 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశారు 60 లక్షల మేరకు డోస్‌ల టీకాను సిద్ధంగా ఉంచారు. అయితే, ఆశించిన మేరకు ఈసారి ఈ డ్రైవ్‌కు స్పందన రాలేదు. 15 లక్షల మంది మేరకు టీకా వేయించుకున్నారు. సీఎం పరిశీలన, సమీక్ష కన్నగి నగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడా రు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే, అక్కడ వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సుల్లో ఆకస్మికంగా ఎక్కి.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సేవల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు కొన్ని సమస్యలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సీఎం స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. పండుగ సీజన్ వేళ కరోనా ఆంక్షల సడలింపు, ఈనెల 31తో ముగియనున్న ఆంక్షలు, కొనసాగింపు గురించి సమీక్షించారు. అంగన్వాడీలు, నర్సరీ పాఠశాలలు నవంబర్ 1వ తేదీ నుంచి తెరవాలనే విషయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. షిఫ్ట్‌ల వారీగా తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ నుంచి షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా ఆంక్షలను నవంబర్ 15వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. క్రీడల, స్విమ్మింగ్ తదితర పోటీల నిర్వహణకు, థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు, ఆలయ ఉత్సావలకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక చెన్నైలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించినానంతరం ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, పండుగ సీజన్లో జనం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు దేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్ ఆందోళన కల్గిస్తోందని, టీకా వేసుకోని వాళ్లు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఇంకా కోటి మందికి తొలి డోస్ వేసుకోవాల్సి ఉందని, మరో 57 లక్షల మంది రెండో డోస్ వేసుకోవాల్సి ఉందని వివరించారు. వీరంతా టీకా వేయించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరియలూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులు కుంటు పడకుండా ఉండేందుకే.. పాఠశాలల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత దాని ధర డబుల్ .. -
మలబద్ధకం తొలగించుకోండి
మలబద్దకం చాలా ఇబ్బంది కలిగించే సమస్య. పైగా ఇటీవలి కరోనా కాలంలో చాలామంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాతిపదికన పనిచేస్తున్నందున ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలూ ఎక్కువ. గతంలో ఆఫీసు వరకు ప్రయాణం చేసేందుకు అవసరమైన కదలికలు కూడా ఇటీవల లేకపోవడంతో ఈ సమస్య మరింతగా కనిపిస్తున్నట్లు ఇటీవల హాస్పిటల్స్‌కు వచ్చే కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మలబద్ధకం సమస్యకు కారణాలూ, నివారణ సూచనలను తెలుసుకుందాం. పిల్లల్లోనైనా, పెద్దల్లోనైనా విరేచనం సాఫీగా కాకపోవడమో లేదా ముక్కి ముక్కి అతి కష్టమ్మీద వెళ్లాల్సిరావడమో జరుగుతుంటే అది మలబద్ధకంగా పరిగణించవచ్చు. కొంతవుంది తమకు రోజూ విరేచనం కావడం లేదు కాబట్టి ఈ సమస్య ఉందని అనుకుంటారు. అయితే విసర్జన ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. అందరిలోనూ తప్పనిసరిగా రోజూ విరేచనం అయి తీరాలన్న నియమం లేదు. కనీసం వారంలో మూడుసార్లు మలవిసర్జన చేయడంలో సమస్య ఎదురుకావడంతో పాటు ఆ ప్రక్రియ చాలా కష్టంగా జరుగుతుంటే దాన్ని మలబద్ధకం అనుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఇది అంత తీవ్రమైన సమస్య కాదు. అయితే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నివారణ ఇలా... కొన్ని జీవనశైలి మార్పులతో మలబద్ధకాన్ని సమర్థంగా నివారించుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని సూచనలివి... జామ పండును గింజలతోనే తినేయండి. ఆ గింజలు మోషన్ ఫ్రీగా అయ్యేలా సహాయపడతాయి. ప్రతిరోజూ వెజిటబుల్ సలాడ్స్ (క్యారట్, బీట్రూట్, టొమాటో, కీర దోసకాయ, ఉల్లిని ముక్కలుగా చేసి పచ్చిగా) తినండి. మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు (జావు, ఆరెంజ్, బొప్పాయి. ఆపిల్ వంటివి) ఎక్కువగా తీసుకోండి. నీటిపాళ్లు ఎక్కువగా ఉంటే పండ్లు తినండి. మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. పొట్టుతో ఉన్న ధాన్యాలు (జొన్న, రాగి), పొట్టుతో ఉండే గోధువులు, వుుడిబియ్యం, పొట్టుతోనే ఉండే పప్పుధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు. చివరగా.. రోజూ క్రవుం తప్పకుండా వ్యాయామం చేయండి. అయితే సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను కలిసి దానికి కారణాలు కనుగొని, దానికి అనుగుణంగా తగిన మందులు వాడాల్సి ఉంటుంది. మలబద్ధకానికి కారణాలు... ఆహారపరమైనవి: మనం తీసుకునే ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు లేకపోవడంతో పాటు... ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం (అంటే... వెన్న, నెయ్యి, మాంసం అందునా రెడ్‌మీట్ వంటివి) ఎక్కువగా తీసుకోవడం. ద్రవాహారం తక్కువగా తీసుకోవడం వల్ల: మనం తీసుకునే పదార్థాలలో నీళ్లు, పళ్లరసాలు వంటి ద్రవాహారం తక్కువగా ఉండటం. ద్రవాహారం ఎక్కువగా ఉంటే అది పేగుల కదలికలను ప్రేరేపించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. సాధారణానికి భిన్నమైన పరిస్థితుల్లో : కొందరు మహిళలకు గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావంతో మలబద్ధకం రావచ్చు. మరికొందరిలో ప్రయాణ సమయంలో తమ ఆహారపు అలవాట్లు మారినందువల్ల కూడ ఈ సమస్య రావచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): ఈ సమస్య ఉన్నవారిలో పేగుల కదలికలు ప్రభావితమై మలబద్ధకం ఉండవచ్చు. అయితే ఇది ఏరకంగానూ ప్రమాదకరమైన పరిస్థితి కాదు. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. మరికొన్ని రుగ్మతల్లోనూ : సాధారణంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, ఎండోక్రైన్ రుగ్మతలు వంటివి వచ్చినప్పుడు కూడా మలబద్ధకం రావచ్చు. మందులు: కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటాసిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మూర్ఛవ్యాధికోసం తీసుకునే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకునేవాళ్లలో పేగుల కదలికలు బాగా మందగించి మలబద్ధకం రావచ్చు. వ్యాయావుం లేకపోవడం: దేహానికి కదలికలు తగినంతగా లేకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల పేగుల కదలికలు మందకొడిగా ఉంటాయి. దాంతో ఎక్కువసేపు పడకపైనే ఉండేవారికి లేదా కూర్చునే ఉండేవారికి మలబద్ధకం వచ్చే అవకాశాలెక్కువ. కరోనా కత్తికి డెంగీ డాలు! ‘అంతా మన మంచికే’ అన్నది మనందరికీ తెలిసిన ఓ తెలుగు సామెత. ‘ఎవరికైనా డెంగీ వచ్చిందనుకోండి. అది మంచికెలా అవుతుం’దంటూ గతంలో ఎవరైనా వాదిస్తే... గద్దిస్తే అప్పట్లో మనం చెప్పగలిగేదేమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడా సామెతకు సైతం తార్కాణాలున్నాయి! అందునా కరోనా... డెంగీల ఉదాహరణలతో!! ఇదే విషయాన్ని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ గట్టిగా చెబుతున్నారు. పెద్దలు చెప్పే సామెతల్లో చాలా సందర్భాల్లో విశ్వజనీన వాస్తవాలు ఉంటాయని ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైగుల్ నికోలెలిస్ మాటల ఆధారంగా మరోమారు నిర్ద్వంద్వంగా రుజువైంది. బ్రెజిల్లో నిర్వహించిన అధ్యయనాల ఫలితంగా ఆయన చెబుతున్న వాస్తవం ఏమిటంటే... గతంలో ఓసారి డెంగీ వ్యాధి వచ్చి తగ్గిన వారిలో కరోనా వైరస్ పట్ల వ్యాధి నిరోధకత ఉంటుందట. చాలావరకు లేకపోయినా ఎంతో కొంత మాత్రం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు ప్రొఫెసర్ నికోలెలిస్. ఆయన పరిశీలన ప్రకారం... గతంలో డెంగీ వచ్చిన వారి శరీరాల్లో వృద్ధిచెందిన యాంటీబాడీస్ కారణంగా ఈసారి కరోనా సోకినప్పుడు వ్యాధి తీవ్రత పెద్దగా లేదనీ, చాలా మరణాలు కూడా నివారితమయ్యాయని కూడా ఖండితంగా చెబుతున్నారాయన. డెంగీ విస్తృతంగా వచ్చిన ప్రదేశాల్లో కరోనా తీవ్రత తక్కువగా ఉండటాన్ని కూడా ఆయన గుర్తించారు. డెంగీ కలగజేసే ఫ్లావీ వైరస్‌కీ... కరోనా వైరస్కూ కొంత సారూప్యం ఉండటం వల్ల ఇలా జరుగుతోందని ఆయన వివరించారు. గతంలో డెంగీ వచ్చి తగ్గినవారికి ఇది కొంతమేర శుభవార్తే కదా! -
వేసవి జాగ్రత్తలపై సీఎం సమీక్ష
- నీటి ఎద్దడి నివారణ, వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలకు ఆదేశం - అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచన కర్నూలు (అర్బన్): వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి, వడగాల్పుల నుంచి రక్షణకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లాం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు, తాగునీటి సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తెలుసుకున్నారు. ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారన్నారు. పశువులకు గ్రాసం, నీటి కొరత ఉందన్నారు. దీంతోపాటు వడగాడ్పుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుగ్రాసం, తాగునీటి పథకాల నిర్వహణకు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 56 సీపీడబ్ల్యూ స్కీముల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. 25 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను 80 శాతం మేర నీటితో నింపినట్లు తెలిపార. వచ్చే నెల 1వ తేదీ నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారని, ఈ నీటితో కాలువ పరివాహక ప్రాంతాల్లోని ఎస్ఎస్ ట్యాంకులను కూడా నింపుతామన్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరత లేదని తెలిపారు. తాగునీటి కోసం సీఆర్ఎఫ్ కింద రూ.10 కోట్లు, నాన్ సీఆర్ఎఫ్ కింద రూ.6 కోట్ల ప్రతిపాదనలు ఇది వరకే సమర్పించామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో నంద్యాల, ఆదోని, కర్నూలు ఆర్డీఓలు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఎస్ఈలు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జేడీలు, డ్వామా, డీఆర్డీఏ పీడీలు, డీఎంఅండ్‌హెచ్‌ఓ తదితరులు పాల్గొన్నారు.