ఈమధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. వీటివల్ల వచ్చే నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? వాటి లక్షణాలేంటి? ఈ సమస్య దరిచేరకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి వంటివి ఇప్పుడు చూద్దాం.
కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు
- కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి.
- వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి.
- ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి.
ప్రపంచంలోనే పెద్ద కిడ్నీ స్టోన్
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ను శ్రీలంకలోని ఒక రోగి నుంచి వైద్యులు తొలగించారు. ఈ రాయి 5.26 అంగుళాల పొడవు, 801 గ్రాముల బరువు కలిగి ఉంది . ఈనెల ప్రారంభంలో శ్రీలంక ఆర్మీ వైద్యులు దీన్ని తొలగించారు. ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని శ్రీలంక మిలిటరీ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కూడా శ్రీలంకలోనే ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువైన కిడ్నీ స్టోన్‌ను తొలగించారు.
what a week at GWR HQ:
— Guinness World Records (@GWR) June 16, 2023
- Chef Hilda Baci achieves longest cooking marathon at 93 hours
- Max Park completes the fastest 3x3x3 cube solve, smashing record by 0.3 seconds
- A kidney stone removed from a man in Sri Lanka is heaviest and largest ever seen
we're off for a lie down😴 pic.twitter.com/6p4twlFuFK
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఏం చేయాలి?
- ముందుగా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి..అందులో ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది.
- రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది.
- ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి.
- బరువు అధికంగా పెరగకుండా ఉండాలి.
- కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి.
- తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది.
మంచి ఆహారం, తగు వ్యాయామాలు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment