Kidney stone
-
కిడ్నీ మొత్తం ఆవరించిన దుప్పికొమ్ము రాయి!
విశాఖపట్నం, సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. కానీ, దాదాపు కిడ్నీ మొత్తం ఆవరించి, బయట కటివలయంలోకి కూడా వచ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండడం చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 80 మి.మీ. కంటే పొడవున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెరగడంతో మూత్రనాళానికి అడ్డం పడదు, దాంతో నొప్పి తెలియదు, వాపు కూడా అంతగా ఉండదు. అందువల్ల రోగులకు ఇది ఉందనే విషయమే తెలియదు. ఇలాంటి తీవ్రమైన సమస్యను అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తొలగించారు విశాఖపట్నంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ అమిత్ సాప్లే తెలిపారు.“62 ఏళ్ల వ్యక్తి నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు స్కాన్ చేస్తే.. కిడ్నీలో స్టాగ్ హార్న్ స్టోన్ (దుప్పి కొమ్ము తరహా రాయి) ఉన్నట్లు తేలింది. దాని వల్ల ఆయన కిడ్నీ పనితీరు కేవలం 18% మాత్రమే ఉంది. ఇది మామూలు రాళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పరిమాణం పెద్దది ఉన్నా, మూత్రపిండం ఆకారంలోనే పెరగడం వల్ల ఇది మూత్రనాళానికి అడ్డం పడదు. అందువల్ల వాపు, నొప్పి లాంటివి మరీ ఎక్కువగా ఉండవు. అలాగే మూత్రంలో రక్తచారికలు కూడా అంతగా కనిపించవు.కానీ దీనివల్ల సమస్య ఎక్కువగానే ఉంటుంది. ఈ కేసులో ఇది కిడ్నీని దాటి కటివలయంలోకి కూడా వచ్చింది. మామూలు రాళ్లయితే సంప్రదాయ పద్ధతుల్లో వాటిని లోపల పగలగొట్టి బయటకు తీస్తారు. కానీ, ఇది పెద్దది కావడంతో కిడ్నీ వైపు నుంచి కాకుండా ముందు పొట్ట వైపు నుంచి తీసేందుకు పైలోలిథోటమీ అనే పద్ధతిని అవలంబించాం. ఇది కూడా లాపరోస్కొపిక్ పద్ధతిలో పెద్ద కోత లేకుండా చేశాం. ఇంతకుముందు ఇదే చికిత్సను ఓపెన్ సర్జరీ విధానంలో చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక నైపుణ్యాలు పెరగడంతో దీన్ని లాపరోస్కొపిక్ పద్ధతిలో చేయగలుగుతున్నాం. ఈ విధానంలోనే మొత్తం రాయిని పగలగొట్టకుండా, దాని కొమ్ములతో సహా బయటకు తీసేశాము. ఒక స్టెంట్ వేసి, శస్త్రచికిత్స ముగించాము. నెల రోజుల తర్వాత ఆ స్టెంట్ తీసేస్తాము. శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పేషెంటును రెండోరోజే డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ అమిత్ సాప్లే వివరించారు.ఈ శస్త్రచికిత్సలో విశాఖ ఏఐఎన్‌యూ ఆస్పత్రికి చెందిన యూరాలజిస్టులు డాక్టర్ రవీంద్ర వర్మ, డాక్టర్ శ్రీధర్, ఎనెస్థటిస్టు డాక్టర్ శ్యాం కూడా కీలకపాత్ర పోషించారు. ఇలాంటి అత్యంత అరుదైన, సమస్యాత్మకమైన కేసులకు చికిత్స చేయడంలో అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలను వారు ప్రదర్శించారు. -
ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీలో రాయి ఇదే.!
ఈమధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. వీటివల్ల వచ్చే నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? వాటి లక్షణాలేంటి? ఈ సమస్య దరిచేరకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి వంటివి ఇప్పుడు చూద్దాం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. ప్రపంచంలోనే పెద్ద కిడ్నీ స్టోన్ ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ను శ్రీలంకలోని ఒక రోగి నుంచి వైద్యులు తొలగించారు. ఈ రాయి 5.26 అంగుళాల పొడవు, 801 గ్రాముల బరువు కలిగి ఉంది . ఈనెల ప్రారంభంలో శ్రీలంక ఆర్మీ వైద్యులు దీన్ని తొలగించారు. ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని శ్రీలంక మిలిటరీ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కూడా శ్రీలంకలోనే ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువైన కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. what a week at GWR HQ: - Chef Hilda Baci achieves longest cooking marathon at 93 hours - Max Park completes the fastest 3x3x3 cube solve, smashing record by 0.3 seconds - A kidney stone removed from a man in Sri Lanka is heaviest and largest ever seen we're off for a lie down😴 pic.twitter.com/6p4twlFuFK — Guinness World Records (@GWR) June 16, 2023 కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఏం చేయాలి? ముందుగా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి..అందులో ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది. రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. బరువు అధికంగా పెరగకుండా ఉండాలి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి. తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది. మంచి ఆహారం, తగు వ్యాయామాలు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్
కొలంబో: ఈ నెల ఒకటో తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో సైనిక ఆసుపత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని డాక్టర్లు విజయవంతంగా బయటకుతీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా బయటపడ్డ కిడ్నీ స్టోన్స్లో ఇదే పెద్ద రాయిగా రికార్డుకెక్కింది. ఈ రాయి బరువు 801 గ్రాములు, పొడవు 13.37 సెంటీమీటరు. ఇది రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడం గమనార్హం. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న కిడ్నీ స్టోన్‌ను, 2008లో పాకిస్తాన్లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. శ్రీలంకలో వెలికితీసిన రాయి ఆ రెండింటినీ అధిగమించింది. -
కిడ్నీలో రాళ్లని వెళ్తే.. బిడ్డను చేతిలో పెట్టారు!
-
జార్జియా ఆస్పత్రిలో మిరాకిల్
జార్జియా: జార్జియాలో అద్భుతం చోటుచేసుకుంది. మూత్ర పిండాల సమస్యను చూపించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లిన మహిళ పండంటి బిడ్డను ప్రసవించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే అసలు ఆమె గర్భవతి అనే విషయం, అది కూడా నెలలు పూర్తయ్యాయనే సంగతి ఆ మహిళకు అస్సలు తెలియదంట. అంతేకాదు.. తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా పరీక్షించిన వైద్యులు గర్భందాల్చి ఎన్నాళ్లయిందని ప్రశ్నించగా తాను గర్భవతి ఏంటని కోపంతో లాగిపెట్టి కొట్టిందట. ఎట్టకేలకు ఆమెకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయగా నిజంగానే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాలోని లోకస్ట్ గ్రోవ్కు చెందిన స్టెపనీ జాగర్స్ అనే మహిళ అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లి. ఆమె భర్త మైఖెల్ జాగర్స్ ఓ టీవీ చానెల్లో పనిచేస్తాడు. వారికి ఇప్పటికే జాకబ్(16), డిలాన్(11) అనే కుమారులతోపాటు శాడీ అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. వాస్తవానికి ఆమె గర్భం రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందట. పీరియడ్స్ కూడా సక్రమంగానే వస్తుండటంతో తాను అసలు గర్భం దాల్చినట్లు గుర్తించలేకపోయింది. ఆ క్రమంలోనే తనకు కడుపులో, వెన్నులో నొప్పి రావడంతో కిడ్నీ నొప్పి అయ్యి ఉంటుందని తనకు తానే నిర్ధారించుకొని ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం తెలిసిందే. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, తొమ్మిది నెలల తన బిడ్డ ఆరోగ్యమంతంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి తీసుకోలేకపోయానని ఆమె దిగులుపడుతోందట. ఆమె భర్త మైఖెల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మొన్నటి వరకు ఐదుగురం ఉండేవారిమని ఇప్పుడు ఆరుగురం అయ్యామని, సాధారణంగా తమకు బిడ్డపుడుతున్నాడనే ఫీలింగ్ తొమ్మిది నెలలుగా ఉంటే మాకు ఆ ఫీలింగ్ కేవలం అరగంట మాత్రమే దొరికిందని చెప్పాడు. వైద్యులు మాత్రం ఇలా జరగడం అత్యంత అరుదు అని అంటున్నారు. -
కిడ్నీలో రాయి తొలగించినప్పటినుంచీ ఆ టైమ్‌లో నొప్పి...?
నాకు కిడ్నీలో రాళ్లు ఉన్నందున లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్) అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించారు. అప్నట్నుంచి మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడూ, సెక్స్ చేసేప్పుడూ మంట విపరీతంగా వస్తోంది. చికిత్స తర్వాత కూడా రాళ్లు పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి నా సమస్యలకు తగిన పరిష్కారం సూచించండి. - వి.ఎస్.ఆర్., నాయుడుపేట మూత్ర విసర్జన సమయంలో మంట మాత్రమే కాకుండా... సెక్స్ చేసినప్పుడు కూడా ఇలా మంట రావడం అనే సాధారణ లక్షణాలు మూత్రంలో ఇన్ఫెక్షన్ను సూచిస్తున్నాయి. కాబట్టి మీరు మొదట యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించండి. వాటి ఆధారంగా మీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్‌ను పూర్తి కోర్సు వాడండి. దాంతో మీరు చెబుతున్న లక్షణాలు తగ్గిపోతాయి. ఇక మిగిలిపోయిన స్టోన్స్ విషయానికి వస్తే వాటిని లేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. నాకు 38 ఏళ్లు. ఇటీవలే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పట్నుంచి ఏమాత్రం పనిచేసినా చాలా ఎక్కువగా అలసట వస్తోంది. సెక్స్‌లో కూడా మునుపటిలా కాకుండా కాస్త వీక్‌గా అనిపిస్తోంది. ఇవన్నీ వ్యాసెక్టమీ వల్లనేమో అని అనుమానంగా ఉంది. నా సందేహాలకు సమాధానం చెప్పండి. - ఎస్.వి.కె.ఎమ్., ఒంగోలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. దానివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలూ రావు. వ్యాసెక్టమీ అంటే... వీర్యకణాలు వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం మాత్రమే. అంతేతప్ప... ఇక శరీరంలోని ఏ భాగాన్నీ ముట్టుకోరు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు చెప్పిన సమస్యలన్నీ మీ వయసు వారిలో దాదాపు అందరిలోనూ కనిపించేవే. కాకపోతే చాలామంది వాటిని వ్యాసెక్టమీకి ఆపాదిస్తూ, అవన్నీ దానివల్లనే అని అపోహ పడుతుంటారు. నిజానికి వ్యాసెక్టమీకి మీ బలహీనతలకూ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను లేదా మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకుని నిర్భయంగా ఉండండి. నాకు 29 ఏళ్లు. రెండు నెలల కిందట వివాహమయ్యింది. నా మొదటిరాత్రి పురుషాంగం బాగానే గట్టిపడింది. అయితే అంగప్రవేశం చేస్తున్న సమయంలో టెన్షన్ వల్ల అంగస్తంభన తగ్గింది. దాంతో సెక్స్ చేయాలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ చేయాలంటేనే భయం వేస్తోంది. మళ్లీ నెల రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనాలని ప్రయత్నించినా జంకుతో సెక్స్ చేయలేకపోతున్నాను. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. దాని వల్ల ఇలా జరుగుతోందా? ఇప్పుడు నా భార్య కూడా నాతో సహకరించడం లేదు. నేను సంసారానికి పనికిరానివాడినంటూ ఈసడిస్తోంది. దాంతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాను. నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి. - ఎస్.కె.ఎమ్., ఖమ్మం మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవారికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం, దాంతో ఆశాభంగం చెందడం చాలా సాధారణంగా జరిగేదే. సెక్స్ అనేది మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు చాలా స్వాభావికంగా జరిగిపోయే ప్రక్రియ. మీలాంటి స్థితి మీ ఒక్కరికేనని ఆందోళన చెందకండి. జంకు వల్ల మీలా బాధపడేవారెందరో ఉంటారు. ఆ పరిస్థితిని భార్య సహాకారంతో అధిగమిస్తే మీరూ అందరిలా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. పరిస్థితిని అధిగమించడానికి ప్రస్తుతం మీ భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ చాలా ముఖ్యం. మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. మీ భార్యతో సెక్స్ చేయబోయినప్పుడు... పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల ఇలా జరిగింది. మీరూ, మీ భార్య డాక్టర్‌ను కలిసి సెక్సువల్ కౌన్సెలింగ్ చేయించుకోండి. మీకు తాత్కాలికంగా కలిగిన అంగస్తంభన లోపాన్ని అధిగమించడానికి యూరాలజిస్ట్‌ను సంప్రదించి మందులు తీసుకోండి. ఈలోపే మీలో ఆత్మవిశ్వాసం పెరిగితే ఎలాంటి మందులూ అవసరం లేకుండానే మీ అంతట మీరే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు. నాకు 42 ఏళ్లు. పెళ్లరుు పద్దెనిమిదేళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. నాకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. అయితే నా భార్య సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదు. బలవంతంగా సెక్స్ చేస్తే యూంత్రికంగా పాల్గొంటోంది. దాంతో నాకు వూనసికంగా సంతృప్తి కలగడం లేదు. ఎప్పుడూ చికాకుగా ఉంటున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు తగిన సలహా చెప్పండి. - సి.వి.ఆర్., చెన్నై సాధారణంగా పెళ్లయిన పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత జీవిత భాగస్వావుుల్లో ఒకరికి సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోరుు ఇలా యాంత్రికంగా పాల్గొనడం సాధారణంగా జరిగేదే. దీనికి ప్రధాన కారణం వూనసిక, శారీరక ఒత్తిళ్లు కావచ్చు. ఆమె ఇంట్లో ఏ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారో, ఎందుకు అలసిపోతున్నారో గుర్తించండి. ఆ కండిషన్‌ను చక్కదిద్దితే అంతా సర్దుకుపోవచ్చు. ఇక మీరు కూడా మీ వైపు నుంచి కాస్తంత రొమాంటిక్‌గా ఉంటూ ఆమెకు కూడా సెక్స్‌లో ఆసక్తి కలిగేలా ప్రయత్నించవచ్చు. అయితే ఆమెకు ఆసక్తిగా లేనప్పుడు మాత్రం మీరు సెక్స్ కావాల్సిందే అంటూ పట్టుబట్టకండి. మీరే సర్దుకుపోండి. ఇక మీకు వీలైతే ఒకసారి ఇద్దరూ కలిసి దగ్గర్లోని యాండ్రాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్ యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్